airforce
-
ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో అదరహో
సాక్షి,హైదరాబాద్: ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై జరుగుతున్న ఇండియన్ ఎయిర్‌పోర్స్ ఎయిర్ షో అదరహో అనిపిస్తుంది. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్స్ ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పై జరుగుతున్న ఎయిర్ షో చూపరులను కనువిందు చేస్తుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 9 సూర్యకిరణ్ విమానాలతో ప్రదర్శన జరుగుతుంది. వాయిసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో జరుగుతున్న ఎయిర్‌షోలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు,వీఐపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ షోతో పాటు సాయంత్రం మ్యూజికల్ కాన్సర్ట్ ప్రారంభం కానుంది. ఎయిర్‌షో, మ్యూజికల్ కన్సర్ట్ నేపథ్యంలో నెక్లెస్ రోడ్ , పీవీ మార్గ్‌లలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వీరి సౌకర్యార్థం నిర్వాహకులు ఫుడ్ స్టాల్స్‌తో పాటు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటలపాటు ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.కాగా, ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు రోజు డిసెంబర్ 9న సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.చదవండి👉🏾 కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్ -
రూ.1.44 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం
రక్షణశాఖలో మూలధన సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం నిర్వహించారు. ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99 శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.దేశీయ తయారీని ప్రోత్సహించేలా కేంద్రం చాలా నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశీ కంపెనీలు దేశంలో తయారీని ప్రారంభించేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది. దాంతో స్థానికంగా ఉత్పాదకత పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు హెచ్చవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దానివల్ల దేశ ఆదాయం ఊపందుకుంటుంది. ఫలితంగా జీడీపీ పెరుగుతుంది. రక్షణశాఖలోనూ దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుతోంది. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ సైతం ఈ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తోంది. డిఫెన్స్ విభాగానికి అవసరమయ్యే ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. ఆ రంగం అభివృద్ధికి కేంద్రం మూలధనం సేకరించాలని ప్రతిపాదించింది. అందుకోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ)తో కలిసి ఇటీవల రూ.1.44 లక్షల కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది.ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్డీఏసీ ఆమోదంతో సేకరించిన నిధులతో భారత సైన్యం తన యుద్ధ ట్యాంకులను ఆధునీకరించాలని నిర్ణయించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ (ఎఫ్‌ఆర్‌సీఈ) కొనుగోలు చేయనున్నారు. ఎఫ్‌ఆర్‌సీఈ అత్యాధునిక టెక్నాలజీ కలిగి రియల్‌టైమ్ పరిస్థితులను అంచనావేస్తూ శత్రువులపై పోరాడే యుద్ధ ట్యాంక్. ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లుఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్ల సేకరణకు కూడా ఆమోదం లభించింది. ఇది గగనతలంలో శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌లను గుర్తించి ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మంటలతో వాటిని నియంత్రిస్తుంది.ఇదీ చదవండి: ఈవీలకు రూ.10,000 కోట్ల ప్రోత్సాహంఇండియన్ కోస్ట్ గార్డ్ఇండియన్ కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి కొన్ని ప్రతిపాదనలు ఆమోదించారు. డోర్నియర్-228 ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు చేయనున్నారు. ఇది నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ వెస్సెల్. అధునాతన సాంకేతికత కలిగిన దీన్ని తీర ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించడానికి ఉపయోగించనున్నారు. ఏదైనా విపత్తుల సమయంలోనూ ఇది సహాయపడుతుంది. -
Vijay Devarakonda: మాది ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్
‘ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్’ నుంచి ఎయిర్ బస్ దాకా... ఆఫర్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న రోజుల నుంచి, ఫైవ్‌స్టార్ ఫుడ్ ఆర్డర్ చేసుకునే రోజుల దాకా... రెండు ఐదు రూ΄ాయల కాయిన్స్ కోసం వెతికిన రోజుల నుంచి కోట్లు లెక్క పెట్టుకునే రోజుల దాకా... ఇద్దరూ విజయప్రయాణాలు చేశారు. ఇండస్ట్రీలో నిలిచారు. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్... ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా వీరి స్నేహంలోని ముచ్చట్లను ‘సాక్షి’తో తరుణ్ భాస్కర్ ప్రత్యేకంగా పంచుకున్నారు.→ విజయ్‌తో మీ స్నేహం మొదలైన రోజులను షేర్ చేసుకుంటారా? తరుణ్ భాస్కర్: మహేశ్వరి చాంబర్స్‌లో నాకో ఆఫీస్ ఉండేది. వెడ్డింగ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్లం. 2011 అనుకుంటా. ఆ టైమ్‌లో థియేటర్ ఆర్టిస్ట్స్‌ని కలిసేవాడిని. అప్పుడే విజయ్‌ని కలిశా. పరిచయం బాగా పెరిగింది. ‘డబ్బులు ఉన్నా లేక΄ోయినా ఫర్వాలేదు... షార్ట్ ఫిల్మ్స్ చేసేద్దాంరా’ అని విజయ్ కాన్ఫిడెంట్‌గా అనేవాడు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్లీ ‘పెళ్ళి చూపులు’ సినిమా చేశాం. అప్పట్లో మాది ఎయిర్‌ఫోర్స్ బ్యాచ్ (ఖాళీగా తిరిగేవాళ్లను అలా అంటుంటారు). ఇక ‘పెళ్ళి చూపులు’ని ఒక ΄్యాషన్‌తో చేశాం. నా వల్ల విజయ్‌కి హిట్ వచ్చింది.. విజయ్ వల్ల నాకు అనే ఫీలింగ్ లేదు. సాధించాం అనే ΄÷గరు లేదు. మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాం. మా ΄్యాషన్కి దక్కిన సక్సెస్ అనుకుంటాను. → మీ జర్నీ ఇంతదాకా వచ్చిన విషయాన్ని అప్పుడప్పుడూ మాట్లాడుకుంటారా?కోవిడ్ టైమ్‌లో విజయ్ ఫోన్ చేసి, ‘అరేయ్... మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం... ఇంత దూరం వచ్చాం.. అస్సలు అనుకోలేదు కదరా... లైఫ్‌లో ఒక్కో ΄ాయింట్ ఎలా టర్న్ అయిందో కదా. దీన్నే డెస్టినీ అంటారు’ అని మాట్లాడుకున్నాం. → అప్పట్లో మీ ఇద్దరూ డబ్బులు లేక ఇబ్బంది పడేవారా? డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారా? డబ్బులంటే... ఒకరికొకరు ఇచ్చుకునే రేంజ్ ఎవరికీ ఉండేది కాదు. అయితే కలిసి బిజినెస్ చేద్దామని అనుకునేవాళ్లం. నాకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే... ఒకసారి ఏదో కొనడానికి విజయ్‌ని పది రూ΄ాయలు అడిగాను. అప్పుడు ‘పెళ్ళి చూపులు’ సినిమా ట్రైల్ జరుగుతోంది. కారులో రెండు ఐదు రూ΄ాయల బిళ్లల కోసం ఇద్దరం బాగా వెతికాం... దొరకలేదు (నవ్వుతూ). ఆ పరిస్థితి ఎప్పటికీ గుర్తుంటుంది. → మీ ఇద్దరి కుటుంబాల మధ్య అనుబంధం? మేమంతా ఒక ఫ్యామిలీ అని మా ఇద్దరి ఇంట్లోనూ అనుకుంటారు. విజయ్ నాన్న ఎలాంటి ఫిల్టర్ లేకుండా నాతో మాట్లాడతారు... టైమ్ వేస్ట్ చేస్తున్నావని తిడుతుంటారు. ఆ ప్రేమ నాకు నచ్చుతుంది. అలాగే మా అమ్మ చేసే బిర్యానీ విజయ్‌కి చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు డైట్ అంతా గడప దగ్గరే పెట్టి లోపలికి వస్తాడు. → మీరు, విజయ్ గొడవలు పడిన సందర్భాలు... ‘పెళ్ళి చూపులు’ అప్పుడు గొడవపడేవాళ్లం. నాకు ఎవరైనా సలహాలిస్తే నచ్చేది కాదు. ఇలా చేస్తే బాగుంటుందని క్రియేటివ్‌గా కొన్ని చెప్పేవాడు విజయ్. అక్కడ గొడవలు పడేవాళ్లం. ఫైనల్‌గా విజయ్ నాన్న సాల్వ్ చేశారు. రేయ్.. వాడు చెప్పిన మాట విను అని విజయ్‌తో వాళ్ల నాన్న అంటే, ఓకే డాడీ అన్నాడు. నీ డైరెక్షన్ నీది.. నా యాక్టింగ్ నాది అని ఫిక్స్ అయి, గొడవలు మానేశాం. ఇప్పుడు కూడా ఎలాంటి కథలతో సినిమాలు చేయాలి? కమర్షియల్‌గా ఎలా చేయాలి? అని చర్చించుకుంటాం. విజయ్ బాలీవుడ్ వరకూ వెళ్లాడు కాబట్టి తన ఫీడ్‌బ్యాక్ బాగుంటుంది. తనకు చాలా అవగాహన ఉంది. → ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం... బాధలో పెట్టుకున్నవి చాలా ఉన్నాయి. కానీ ‘పెళ్ళి చూపులు’ సక్సెస్‌కి ఎమోషనల్ అయ్యాం. అప్పుడు విజయ్‌ది, నాది బ్యాడ్ సిట్యువేషన్... నిరాశలో ఉన్నాం. మా ఇంట్లో పరిస్థితులు బాలేదు. మా నాన్న సంవత్సరీకం కూడా. ఆ టైమ్‌లో వచ్చినన్ని అప్స్ అండ్ డౌన్స్ మాకెప్పుడూ రాలేదు. ఆ పరిస్థితుల్లో చేసిన సినిమా హిట్ కావడంతో ఎమోషన్‌తో కన్నీళ్లు వచ్చాయి. → విజయ్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు? విజయ్ నా ట్రంప్ కార్డ్. గేమ్‌లో ఎప్పుడైనా కొంచెం అటూ ఇటూ అయితే ఆ ట్రంప్ కార్డ్ వాడుకుంటా. ఆ టైమ్ దగ్గరికొచ్చింది. నాక్కూడా ఎక్కువమంది ఆడియన్స్‌కి రీచ్ కావాలని ఉంది. మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. → విజయ్ లాంటి ఫ్రెండ్ ఉండటం గురించి? విజయ్ ప్రతి సక్సెస్‌లో నా విజయం ఒకటి కనబడుతుంటుంది. తను నా హోమ్ బాయ్... నా డార్లింగ్. విజయ్ అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీకి వచ్చి, ఆ స్టేటస్‌కి రావడమనేది చాలామందికి ఆదర్శంగా ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత కూడా ఆ అచీవ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. విజయ్ జర్నీలో నేనో చిన్న ΄ార్ట్ అవడం గర్వంగా ఉంటుంది.మీ ఫస్ట్ సినిమాలో విజయ్‌ని ‘పెళ్ళి చూపులు’కి పంపించారు. మరి రియల్ లైఫ్‌లో విజయ్‌ని పెళ్లి కొడుకుగా చూడాలని లేదా? కచ్చితంగా ఉంది. మా మధ్య ఆ విషయం గురించి చర్చకు వస్తుంటుంది. కానీ అవి వ్యక్తిగతం కాబట్టి బయటకు చెప్పలేను. అయితే నాకు హండ్రెడ్ పర్సంట్ విజయ్‌ని ఫ్యామిలీ మేన్‌గా చూడాలని ఉంది. ఎందుకంటే తనలో మంచి ఫ్యామిలీ మేన్ ఉన్నాడు. మంచి భర్త, తండ్రి కాగలుగుతాడు. విజయ్ ఆ లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నా ఫ్రెండ్ పక్కా ‘జెంటిల్‌మేన్’.మీ బాయ్స్‌కి ‘అడ్డా’ ఉంటుంది కదా...అప్పట్లో మీ అడ్డా ఎక్కడ? నెక్లెస్ రోడ్, మహేశ్వరి చాంబర్స్ దగ్గర చాయ్ బండి, ఆ పక్కన చైనీస్ ఫుడ్ సెంటర్. అక్కడే ఏదొకటి తింటూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ మధ్య అటువైపు వెళ్లినప్పుడు ఆ చాయ్ కేఫ్ దగ్గర థమ్సప్ లోగోలో విజయ్ థమ్సప్ తాగే ఫొటో కనిపించింది. అది ఫొటో తీసి, విజయ్‌కి పంపిస్తే ఎక్కడరా ఇది అని అడిగాడు. మనం ఒకప్పుడు కూర్చున్న కేఫ్ దగ్గర అన్నాను. మాకు అదో ఎమోషనల్ మూమెంట్. ఇక అప్పట్లో ఎక్కడ ఆఫర్లో ఫుడ్ ఉంటే అక్కడ తినేవాళ్లం (నవ్వుతూ). ఇప్పుడు ఆ ప్లేసెస్‌కి అంత ఫ్రీగా వెళ్లలేం. అందుకే ఇప్పుడు మాస్క్ లేకుండా సూపర్ మార్కెట్‌కి వెళ్లి ఓ ΄ాల ΄్యాకెట్ కొనుక్కురా దమ్ముంటే అని విజయ్‌తో అంటుంటాను. అది మాత్రం నా వల్ల కాదురా అంటాడు.మా కల ఒకటే– విజయ్ దేవరకొండమేం ఇద్దరం చిన్నప్పట్నుంచి కలిసి పెరిగినవాళ్లం కాదు... ఒకే స్కూల్లో చదువుకున్నవాళ్లమూ కాదు. నేను పుట్టపర్తిలో, తరుణ్ హైదరాబాద్‌లో చదువుకున్నాడు. ఎక్కడెక్కడో పెరిగినప్పటికీ మా ఇద్దరి కల (సినిమా) ఒకటే. నా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చూసి, తరుణ్ నాతో ‘పెళ్ళి చూపులు’ సినిమా చేద్దాం అనుకున్నాడు. అప్పుడప్పుడే మా పరిచయం బలపడుతోంది. జేబులో రూ΄ాయి లేక΄ోయినా చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్లం. ఎంతో నమ్మకంగా ‘పెళ్ళి చూపులు’ చేసి, సక్సెస్ అయ్యాం. ఆ సినిమా తర్వాత తరుణ్‌కి చాలా అవకాశాలు వచ్చినా, మళ్లీ కొత్తవాళ్లతోనే చేద్దాం అనుకున్నాడు. తన మీద, తన స్క్రిప్ట్ మీద తనకు చాలా నమ్మకం. తరుణ్‌లో ఆ విషయం నాకు చాలా నచ్చుతుంది. ఏదైనా స్క్రిప్ట్‌తో నా దగ్గరకు రారా అంటుంటాను... వస్తా అంటాడు. ఎక్కడో స్టార్ట్ అయి, చాలా దూరం వచ్చిన మా ఈ జర్నీలో ఎన్నో కష్టాలు చూశాం... ధైర్యంగా ఎదుర్కొన్నాం. గొప్పగా ఏదో చేస్తాం అనే నమ్మకంతో ఉండేవాళ్లం. మాతో ΄ాటు మా ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతూ వచ్చింది. లైఫ్‌లో ఒక మంచి ఫ్రెండ్ ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.– డి.జి. భవాని -
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
ఢిల్లీ,సాక్షి: కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్ గాలిస్తున్నారు.దాడి జరిగిన ప్రదేశానికి పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులు చేరుకుని పరి స్థితిని సమీక్షిస్తున్నారు. దాడి ఎలా జరిగిందనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు. -
తండ్రి చికిత్స కోసం.. నకిలీ ఐడీ కార్డుతో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లోకి
న్యూఢిల్లీ: నకిలీ ఐడీ కార్డుతో ఓ వ్యక్తి ఢిల్లీ కంటోన్మెంట్‌లోని పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లోకి ప్రవేశించాడు. ఈవిషయాన్ని గుర్తించి అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. వినాయక్ చద్దా అనే వ్యక్తి తన తండ్రికి ఎయిర్ ఫోర్స్ డెంటల్ హాస్పిటల్లో చికిత్స చేయించేందుకు వింగ్ కమాండర్‌గా నటిస్తూ లోపలికి ప్రవేశించాడు. నకిలీ గుర్తింపు కార్డుతో నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది అతడిని పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. అతని వద్ద పలువురు రక్షణ సిబ్బంది పేర్లతో నకిలీ గుర్తింపుకార్డులు, లిక్కర్ క్యాంటిన్ కార్డులు ఉన్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాల్లో సబ్సిడీ ధరలకు మద్యం కొనుగోలు చేసేందుకు రక్షణ సిబ్బందికి ఈ కార్డులు ఇస్తారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నకిలీ కార్డులతో సంబంధమున్న సుల్తాన్‌పురికి చెందిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోంది. ఇదీ చదవండి.. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు -
మిస్ అమెరికాగా ఎయిర్‌ఫోర్స్ అధికారిణి!
కొలరాడోకు చెందిన 22 ఏళ్ల మాడిసన్ మార్ష్ మిస్ అమెరికా 2024 అందాల పోటీల్లో విజేతగ నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది. ఆమెఎయిర్ఫోర్స్ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మిస్ అమెరికా టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కొలరాడోకు ప్రాతినిధ్యం వహిస్తున్న మార్ష్ ఓ పక్కన అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ఘనత సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో పంచుకుంది. "మీకు ఆకాశమే హద్దు!. మిమ్మల్ని ఆపగలిగే వారే లేరు. రెండు పడవల మీద కాలు వేయలేం అనే వాళ్లకు నా విజయమే ఓ సమాధానం. మీ అభిరుచి ఎంతటి కష్టమైనా తట్టుకుని సాధించేలా చేయగలదు." అని ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చింది మార్ష్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక మార్ష్ మే 2023లో మిస్ కొలరాడో కిరీటం కూడా గెలుచుకుంది. ఆమె ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి ఫిజిక్స్ పట్టా పొందే కొద్ది రోజుల ముందే ఈ విజయం సాధించింది. Congratulations to our very own #Airman, 2nd Lt. Madison Marsh, aka Miss Colorado — who was just crowned @MissAmerica 2024! Marsh is the first active duty servicemember to ever win the title.#AimHigh pic.twitter.com/3RuDu5CulW — U.S. Air Force (@usairforce) January 15, 2024 మార్ష్ ఒక పక్క ఎయర్‌ఫోర్స్‌లో రెండవ లెఫ్టినెంట్‌గా కఠినతరమైన బాధ్యతలు చేపట్టడమేగాక మిస్ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని కూడా చేస్తూ..ఈ మిస్ అమెరికా అందాల పోటీకి ప్రీపేర్ అయ్యింది. నాకు ఇష్టమైన రెండు విభిన్న రంగాలను చేపట్టి సాధించడం చాలా అద్భుతంగా ఉందని అంటోంది మార్ష్. "మీపై మీకు నమ్మకం ఉంటే మిమ్మలని మీరు ఒక్కచోటకే పరిమితం చేయాల్సిన పనిలేదు. ధైర్యంగా అడగు వేయండి". అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది మార్ష్. ఈ అందాల పోటీకి తాను ఎయిర్‌ఫోర్స్‌లో జాయిన్ అయ్యేందుకు తీసుకున్న శారీరక శిక్షణ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. కాగా ఈ మిస్ అమెరికా అందాల పోటీల్లో మార్స్ మిస్ అమెరికాగా కిరీటాన్ని దక్కించుకోగా, టెక్సాస్‌కు చెందిన ఎల్లీ బ్రూక్స్ రన్నరప్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Miss America (@missamerica) (చదవండి: మిసెస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ! గెలుపుకి ఏజ్‌తో పనలేదని ప్రూవ్ చేసింది!) -
పాక్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ) సంస్థతో పాక్ ప్రభుత్వం చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం కిందటి ఏడాది ముగిసింది. అప్పటి నుంచి దేశంలో ఉగ్రవాదం మళ్లీ ఊపందుకుంది. తాజాగా శనివారం పంజాబ్ ప్రావిన్స్‌లోని మియన్వాలిలో గల వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే సైన్యం అప్రమత్తం కావడంతో పెను విధ్వంసం తప్పింది. శనివారం ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి ఐదు నుంచి ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు తెల్లవారుజామున చొరబాటుకు యత్నించారని పాక్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) ధ్రువీకరించింది. తాము అప్రమత్తమై ఆ దాడిని భగ్నం చేశామని పేర్కొంది. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఒక పాక్ సైనికుడు వీరమరణం పొందారని.. పలువురికి గాయాలయ్యాయని ప్రకటించుకుంది. ఈ ఘటనలో ఎయిర్‌బేస్‌లోని మూడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. దాడికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది. అయితే.. ఇది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) పనేనని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. బీఎల్ఏ.. పాక్ నుంచి స్వాతంత్రం కోరుతూ 2004 నుంచి పోరాడుతోంది. సాధారణ పౌరులనే కాకుండా.. ఈ ఏడాది జూన్‌లోనూ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని తొలిసారిగా దాడికి పాల్పడింది. ఇదిలా ఉంటే.. శుక్రవారం కూడా పాక్‌లో ఉగ్రదాడి జరిగింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పోలీసు గస్తీ బృందాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా వీరిలో ఇద్దరు పోలీసులు. మరో 24 మంది గాయాలపాలయ్యారని ఓ అధికారి తెలిపారు. ఇదిలాఉంటే.. గత ఆరునెలలుగా పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాలు తీవ్ర ఉగ్రవాద దాడులను చవిచూస్తున్నాయి. అయితే ఈ దాడులు పాక్ భద్రతకు ముప్పుగా మారడమే కాదు.. పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బ తీస్తున్నాయి. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లను ప్రోత్సహిస్తూ పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కానీ, ఆ విమర్శలను తోసిపుచ్చుతున్న పాక్.. తాము ఉగ్ర పీడిత దేశమేనని చెప్పుకుంటోంది. మరోవైపు అంతర్జాతీయ సమాజం, ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యలు చేపట్టాలంటూ పాక్‌ను కోరుతున్నాయి. -
అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పులు.. అగ్నివీర్లకు గుడ్‌న్యూస్!
ఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోని త్రివిధ దళాల్లో అగ్నిపథ్ స్కీమ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ పథకం కింద త్రివిధ దళాల్లో ఎంపికైన వారిని అగ్నివీర్లు అని పిలుస్తున్నారు. అయితే, అగ్నిపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అగ్నివీర్లకు శుభవార్త అందించింది. వివరాల ప్రకారం.. అగ్నిపథ్ పథకంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అగ్నివీర్ల కాల పరిమతి, వయస్సును పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఈ పథకం కింద ఎంపిక చేసిన యువతలో 25 శాతం మందినే నాలుగేళ్ల తర్వాత ఆర్మీలో రెగ్యూలర్ క్యాడర్ తీసుకోనున్నారు. అయితే దీనిని 25 నుంచి 50 శాతంకు పెంచాలనే కేంద్రం తీసుకున్నట్టు సమాచారం. అలాగే, సాంకేతిక నేపథ్యం ఉన్న యువకులను చేర్చుకోవడం, గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జూన్ 2022లో ప్రారంభించబడిన అగ్నిపథ్ స్కీమ్ కింద 17.5-21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులను అగ్నివీర్ పోస్టుల కోసం పరిశీలిస్తున్నారు. అయితే, సాంకేతిక నేపథ్యం ఉన్న అభ్యర్థుల విషయంలో గరిష్ట రిక్రూట్మెంట్ వయస్సు 21 ఏళ్లలోపు పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని బలగాలు అభిప్రాయపడుతున్నాయి. గరిష్ట వయోపరిమితిని సవరించడం.. దానిని 23 సంవత్సరాలకు పెంచడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు.. 2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులు అగ్నిపథ్ పథకం కింద చేరనున్నారనే అంచనాలు ఉన్నాయి. కాగా, ప్రతీ ఏడాది దాదాపు 60వేల మంది సైనికులు పదవీ విరమణ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే మూడు సర్వీసుల్లో సైనికుల కొరత తీవ్రంగా ఉంది. కేవలం ఇండియన్ ఆర్మీలోనే 1.18 లక్షల మంది కావాల్సి ఉంది. ఇది కూడా చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో ఆయనకు సీటు ఫైనల్ -
పెళ్లికి పది రోజులు ఉండగా.. ఉన్నటుండి వరుడు..
సాక్షి, ద్వారకాతిరుమల: ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ.. తన పెళ్లికి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉందనగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పంగిడిగూడెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంటి పుష్పవతి నాల్గో కుమారుడు హరీష్‌బాబు (33) ఢిల్లీలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అతడికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్‌బాబు అప్పటినుంచి ఇక్కడే ఉంటూ పెళ్లి పనులు చూసుకుంటున్నారు. ఈనెల 16న వివాహం జరగాల్సి ఉండగా శనివారం పెళ్లి బట్టలు కొనేందుకు తల్లితో కలిసి ఏలూరు వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఉదయం అతడు ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటికి తల్లి వచ్చి తలుపు తట్టగా హరీష్‌బాబు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టగా హరీష్‌బాబు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కిందకు దింపి చూడగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ చెప్పారు. (చదవండి: పెళ్లీడు వచ్చినా పెళ్లి చేయటం లేదన్న కోపంతో అన్నని..) -
భారత సంతతి రాజా చారికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి!
న్యూయార్క్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి రాజా చారి అరుదైన ఘనత సాధించనున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ ఈయనను ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి నామినేట్ చేశారు. సెనేట్ దీన్ని ఆమోదిస్తే అగ్రరాజ్యం వాయుసేనలో రాజా చారి కీలక బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారు. అమెరికా వైమానిక దళంలో సైన్యంలాగే బ్రిగేడియర్లను వన్-స్టార్ జనరల్స్‌గా పరిగణిస్తారు ర్యాంకులుంటాయి. చంద్రునిపైకి తిరిగివెళ్లేందుకు సిద్ధమవుతున్న అమెరికా మిషన్ అర్టెమిస్ బృందలో చారి సభ్యుడు. ఈయన సారథ్యంలోనే 2021లో నాసా సిబ్భంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. అక్కడ 177 రోజులు ఉన్న చారి.. స్పేస్ వాక్ కూడా నిర్వహించారు. రాజా చారి నాసాలో చేరకముందు అమెరికా ఎయిర్‌ఫోర్సులో టెస్ట్ పైలట్‌గా ఉన్నారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదవండి: మిలటరీ సామర్థ్యంలో స్థిరంగా భారత్ -
తైవాన్ టెన్షన్ల నడుమ భారత్‌తో చర్చలు జరిపేందుకు వచ్చిన చైనా
న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతంలోని భారత వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు చైనాతో సైనిక చర్చల్లో పాల్గొన్నారు. భారత్ గగనతలంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండేందుకై అధికారులు చైనాతో చర్చలు సాగిస్తోంది. ఐతే గత కొన్ని కొన్ని రోజుల్లో ఎలాంటి ఘటన జరగలేదు గానీ ఇటీవల ఒక చైనా మిలటరీ విమానం నియంత్రరేఖకు సమీపంలో సుమారు 10 కి.మీ దూరంలో ఎగిరినట్లు అధికారుల గుర్తించారు. దీంతో భారత వైమానికదళ అధికారులు ఈ విషయమైన స్పందించాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు భారత్ చైనాతో చర్చల సాగిస్తోంది. అదీగాక టిబెట్ ప్రాంతంలో చైనా సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. వాటిలో అతి ముఖ్యమైన వైమానిక దళ విభాగం ఉంది. అంతేకాదు టిబెట్ సమీపంలోనే ఎయిర్‌బేస్‌కి సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా చైనా నిర్మిస్తోంది. నియంత్రణ రేఖకు సంబంధించి ఇరు దేశాల మధ్య భిన్నమైన వాదన కూడా ఉంది. వాస్తవానికి నియంత్రణ రేఖకు సంబంధించిన నిబంధనలు ప్రకారం ఏ మిలటరీ విమానం వాస్తవ నియంత్రణ రేఖకు 10 కి.మీ లోపు ప్రయాణించ కూడదు. ఈ మేరకు జూన్25న చైనాకు సంబంధించిన జే11 విమానం తూర్పు లడఖ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖకు సమీపంగా వచ్చినట్లు భారత్ గుర్తించింది. దీంతో భారత వైమానిక దళ అధికారులు అప్రమత్తమవ్వడమే కాకుండా ఇరు దేశాల సైనికలు వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. చైనా గత కొంతకాలంగా వాస్తవ నియంత్రణరేఖకు సమీపంలో విమానాలను ఎగరవేస్తూ గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. చైనా ఒక వైపు తైవాన్ విషయమై తీవ్ర సంఘర్షణకు లోనవుతూ కూడా భారత్‌తో చర్చలు సాగించడానికి ముందుకు రావడం గమనార్హం. (చదవండి: తప్పులు సరిదిద్దకోండి!... కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైన) -
ఎయిర్‌ఫోర్స్‌కు 100వ లాంచర్..అందించిన టీఏఎస్ఎల్, ఎల్అండ్టీ!
బెంగళూరు: టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), ఎల్అండ్టీ ఉమ్మడిగా 100వ ఆకాశ్ ఎయిర్‌ఫోర్స్ లాంచర్‌ను భారత వాయుసేనకు విజయవంతంగా అందించినట్టు ప్రకటించాయి. ఈ లాంచర్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. 100వ ఎయిర్‌ఫోర్స్ లాంచర్‌ను విజయవంతంగా అందించడం తమకు, భారత రక్షణ తయారీ రంగానికి ఓ మైలురాయిగా టీఏఎస్ఎల్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్ తెలిపారు. ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరెక్టర్ జయంత్ పాటి ల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
నాటి పరిస్థితుల దృష్ట్య అది సరైనదే! కార్గో విమాన సిబ్బందికి క్లీన్చిట్
US forces from Afghanistan has been cleared of wrongdoing: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని ఆక్రమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్లు ఆక్రమించుకున్న సమయంలో చాలామంది అఫ్గాన్ వాసులు భయంతో పారిపోయేందకు ప్రయత్నించారు. ఈ మేరకు పెద్ద గుంపులుగా జనసందోహం కాబోలు విమానాశ్రయంలో రన్‌వే పై పరుగులు తీసి యూఎస్ వైమానిక దళానికి చెందిన కార్గో విమానాలను చుట్టుముట్టారు. గత్యంతరం లేని నాటి భయానక పరిస్థితుల్లో యూఎస్దళాలు జనసముహం విమానాల వద్దకు వెళ్లకుండా నిరోధించేందుకు గాల్లో కాల్పులు జరిపారు. అయినప్పటికీ జనం విమానం రెక్కలను పట్టుకుని ఎక్కడం వంటివి చేశారు. తప్పనసరి పరిస్థితుల్లో అమెరికన్ సైనికులు, ఫైలెట్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. దీంతో పైలెట్లు గాల్లో విమానాలను ప్రయాణించేందుకు రెడీ చేశారు. అంతే ఒక్కసారిగా విమానాలను గాల్లోకి దూసుకెళ్లిన వెంటనే విమాన రెక్కలను పట్టుకుని ఎక్కిన జనం పిట్టల్లా కిందకి రాలిపోయారు. దీంతో వేలాదిమంది అఫ్గాన్ పౌరులు మృతిచెందరు. ఐతే నాటి ఘటనలో ఎంతమంది చనిపోయారనేది స్పష్టత లేదు. నాటి దురదృష్ట ఘటనకు కారణమైన విమానాల్లో సీ17 కార్గో విమానం ఒకటి. ఐతే ఆగస్టు16, 2021న జరిగిన ఈ విషాదకర ఘటనపై యునైటెకడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ దర్యాప్తు నిర్వహించింది. ఈ మేరకు యూఎస్ వైమానిక దళ ప్రతినిధి ఆన్ స్టెఫానెక్ విచారణలో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ...కార్గో ఎయిర్‌లైన్ సిబ్బంది క్షీణిస్తున్న భద్రతల నడుమ గాల్లో ప్రయాణించాలని తీసుకున్న నిర్ణయం సరైనదే. నాటి ఘటనలో కార్గో విమానా అంచనాకు మించి సుమారు 650 మంది ప్యాసింజర్లతో బయలుదేరినట్లు కూడా వివరించారు. ఆ సమయంలో తగిన విధంగానే వ్యవహరించారంటూ కార్గో విమాన సిబ్బందికి క్లీన్చిట్ ఇచ్చింది. (చదవండి: అసాధారణం: భారత్‌లో బయటపడ్డ అరుదైన డైనోసార్ల గుడ్లు! పక్షుల్లాగా..) -
రక్షణ శాఖ సంచలన నిర్ణయం.. ఆర్మీలో చేరే వారు తప్పక తెలుసుకోండి
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్ష్యంగా తెచ్చిన ఈ పథకానికి మంగళవారం ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది. అనంతరం వివరాలను త్రివిధ దళాధిపతులతో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. దేశభక్తి, స్ఫూర్తి కలిగిన యువతకు జాతిసేవకు వీలు కల్పించే అద్భుత పథకంగా దీన్ని అభివర్ణించారు. తద్వారా దేశ రక్షణ కూడా మరింత బలోపేతమవుతుందన్నారు. ‘‘నాలుగేళ్ల సర్వీసు అనంతరం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యాలున్న యువత సమాజంలోకి తిరిగొస్తుంది. దేశానికి వెల కట్టలేని ఆస్తిగా మారుతుంది. ఇలా రెండు రకాలుగా ప్రయోజనం’’ అని వివరించారు. సైన్యంలో ప్రస్తుతం పదేళ్ల షార్ట్ సర్వీస్ కమిషన్ నియామకాలు అమల్లో ఉన్నాయి. టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడీ)గా కూడా పిలిచే అగ్నిపథ్‌కు వచ్చే ఆదరణను బట్టి వీటితో పాటు ప్రస్తుత నియామక పద్ధతులన్నింటినీ నిలిపేస్తారని సమాచారం. కొత్త శకానికి నాంది: త్రివిధ దళాధిపతులు త్రివిధ దళాల్లో మానవ వనరుల విధానంలో కొత్త శకానికి అగ్నిపథ్ నాంది పలుకుతుందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పథకం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పింది. దీనిపై త్రివిధ దళాధిపతులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సైనిక నియామక ప్రక్రియలో సమూల మార్పులకు అగ్నిపథ్ శ్రీకారం చుట్టనుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. ‘‘భవిష్యత్తు సవాళ్లకు సైన్యాన్ని సర్వ సన్నద్ధంగా ఉంచడంలో, సైన్యం సగటు వయసును ప్రస్తుత 32 ఏళ్ల నుంచి 26 ఏళ్లకు తగ్గించడంలో అగ్నిపథ్ ప్రధాన పాత్ర పోషించనుంది’’ అన్నారు. కొత్త నియామకాల్లో అర్హత ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని చెప్పారు. సైన్యం పనితీరు, సామర్థ్యం, సరిహద్దుల వెంబడి సన్నద్ధత తదితరాలను యథాతథంగా కొనసాగిస్తామని వివరించారు. ఈ పథకం కింద మహిళలను కూడా తీసుకుంటామని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వివరించారు. యువ ప్రతిభను వాయుసేన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధురి అన్నారు. అగ్నిపథ్‌ను దేశ యువతకు గొప్ప అవకాశంగా యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ అభివర్ణించారు. వారి సర్వీసు నైపుణ్యాలకు యూజీసీ గుర్తింపు కల్పించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. విపక్షాల పెదవి విరుపు అగ్నిపథ్ పథకాన్ని విప్లవాత్మక నిర్ణయంగా బీజేపీ అభివర్ణించగా విపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఇది, ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల ప్రకటన కార్యరూపమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బంగారు భవిత కోసం యువతకు ఇదో అద్భుత అవకాశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, పార్టీ అగ్ర నేతలు అన్నారు. రక్షణ రంగంలో పెన్షన్ల భారం తదితరాలను తగ్గించుకోవడానికి దేశ భద్రతను కేంద్రం పణంగా పెడుతున్నట్టు కన్పిస్తోందని కాంగ్రెస్, ఇతర విపక్షాలు విమర్శించాయి. మాజీల మిశ్రమ స్పందన కొత్త పథకంపై మాజీ సైనికాధికారులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఇది త్రివిధ దళాలకు మరణ శాసనంతో సమానమని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా విమర్శించారు. సైన్యంలో తరాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాలు, నైతిక విలువలు, చిత్తశుద్ధి తదితరాలు ఇకపై లోపిస్తాయని మేజర్ జనరల్ (రిటైర్డ్) సత్బీర్సింగ్ అన్నారు. సైన్యం సామర్థ్యాన్ని కూడా ఈ పథకం దెబ్బ తీస్తుందన్నారు. రక్షణ రంగంలో దీర్ఘకాలిక సంస్కరణలకు ఇది తొలి అడుగని మేజర్ జనరల్ (రిటైర్డ్) బీఎస్ ధనోవా అభిప్రాయపడ్డారు. పథకం స్వరూపం... ► ఇది ఆఫీసర్ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్) నియామక ప్రక్రియ. ► త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు. ► ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి. 90 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. ► వయో పరిమితి 17.7–21 ఏళ్లు. ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి. ► త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. ► సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ‘ఆలిండియా–ఆల్ క్లాస్’ విధానంలో రిక్రూట్మెంట్ ఉంటుంది. దీంతో రాజ్‌పుత్, మరాఠా, సిక్కు, జాట్ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి. ► విధుల్లో చేరేవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకు లు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు. ► వేతనం తొలి ఏడాది నెలకు రూ.30,000. రూ.21 వేలు చేతికిస్తారు. రూ.9,000 కార్పస్ నిధికి వెళ్తుంది. కేంద్రమూ అంతే మొత్తం జమ చేస్తుంది. నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందుతుంది. ► నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనిపై ఆదాయ పన్నుండదు. ► సర్వీసు కాలావధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఉంటుంది. ► గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ► ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు. ► మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం. रक्षा क्षेत्र को मजबूत करने के लिए क्रांतिकारी पहल - #Agnipath योजना, योजना के माध्यम से #BharatKeAgniveer को मिलेगा राष्ट्र सेवा का अवसर!!@DefenceMinIndia @adgpi@indiannavy @IAF_MCC @SpokespersonMoD pic.twitter.com/lIBWzQFNzv— PIB in Bihar 🇮🇳 (@PIB_Patna) June 14, 2022 #Agnipath model is based on the All India merit-based selection process we are looking at the best to serve the armed forces between the age of 17.5 to 21 years. After the selection. pic.twitter.com/LB4zWFR7Pd— Krishana_Rajput# (@RajputKrishana) June 14, 2022 -
ఆస్ట్రేలియాలో కొత్త రికార్డు నమోదు చేసిన భారతీయ తల్లీకూతురు
ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ కుటుంబం రికార్డు సృష్టించింది. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్‌లో స్థానం సాధించారు. ఒకే కుటుంబం నుంచి ఆస్ట్రేలియా రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో స్థానం సాధించిన తల్లీ కూతుళ్లుగా ఇద్దరు రికార్డు సృష్టించారు. భారత్‌కు చెందిన మంజీత్ కౌర్ తన భర్త రూప్‌సింగ్‌తో కలిసి 2009లో స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లారు. ఆ తర్వాత 2013లో ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నారు. అనంతరం రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో మెడికల్ వింగ్‌లో అధికారిగా 2017లో ఆమె చేరారు. ఆ తర్వాత ఐదేళ్లకు మంజీత్ కౌర్ కూతురు కుశ్రూప్‌కౌర్ సంధు 2022లో రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ వుమన్‌గా ఉద్యోగం సాధించారు. మంజీత్కౌర్ ఆస్ట్రేలియా ఎయిర్‌ఫోర్స్ మెడికల్ వింగ్‌లో పెట్టేప్పటికే కుశ్రుప్ 15 ఏళ్ల టీనేజర్‌గా ఉంది. అయితే దేశం కాని దేశంలో తన తల్లి సాధించిన ఘనతల నుంచి స్ఫూర్తి పొందిన కుశ్రుప్ పట్టుదలతో ఆస్ట్రేలియా ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా నియమితురాలైంది. మహిళలు ఏ రంగంలోనూ పురుషులకు తీసిపోరని ఈ తల్లీబిడ్డలు మరోసారి రుజువు చేశారు. చదవండి: నకిలీ ఎన్నారై.. పెళ్లి పేరుతో మోసం.. -
కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం
బెర్లిన్: జర్మనీలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ జర్మనీని హడలెత్తిస్తోంది. రోజుకు 76 వేలకు పైనే కోవిడ్ కేసులు నమోదు కావడం అక్కడ వణుకుపుట్టిస్తోంది. ఇప్పటివరకూ లక్షకు పైగా మరణాలు సంభవించినట్లు జర్మనీ ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాదు ఆ కేసుల ఉధృతి ఎంతలా ఉందంటే ఆస్పత్రులన్ని కరోనా రోగులతో కిటకిటలాడిపోవడంతో ఆ రోగులను వేరే ఆస్పత్రలకు తరలించే నిమిత్తం ఆఖరికి వైమానికి దళాన్ని కూడా రంగంలోకి దింపింది. అంతేకాదు జర్మనీలోని దక్షిణ నగరం అయిన మెమ్మింగెన్ ఆసుపత్రుల్లో ఎక్కువగా ఉన్న కరోనా రోగులను ఉత్తర ఓస్నాబుక్ సమీపంలోని ముయెన్స్టర్కు తరలించేందుకు జర్మనీ విమానంలో "ఫ్లయింగ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు" గా పిలిచే ఆరు పడకల ఐసీయూని ఏర్పాటు చేసింది. (చదవండి: 13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్ టాటా ఆవేదన) అయితే ఈ విధంగా జర్మనీ విమానాలను వినియోగించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో బెర్లిన్ ఈ కొత్త కరోనా వేరియంట్‌ని గుర్తించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాను కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రాంతంగా ప్రకటించనుందని జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పైగా జర్మనీ దేశం దక్షిణాఫ్రికా నుండి జర్మనులు జర్మనీకి రావడానికి మాత్రమే విమానాలు అనుమతిస్తామని, పైగా వ్యాక్సిన్లు తీసుకున్నవారితో సహా అందరూ 14 రోజులు క్యారంటైన్లో ఉండాలని సూచించింది. అంతేకాదు ఈ కొత్త వైరంట్ని బి.1.1.529 పిలుస్తారని, ఇది యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగల సామర్థ్యం గలదని దక్షిణాఫ్రికా శాస్రవేత్తలు ప్రకటించని సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్తగా గుర్తించిన ఈ వేరియంట్ మరిన్ని సమస్యలను సృష్టింస్తుందన్న ఆందోళనతోనే తాము ముందుగానే తగు చర్యలు తీసుకుంటున్నామని జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ చెప్పారు. (చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో) -
Jammu Airport: జంట పేలుళ్ల కలకలం.. ఉగ్రకోణంలో దర్యాప్తు!
న్యూఢిల్లీ: జమ్ము విమానాశ్రయం వద్ద ఎయిర్‌ఫోర్స్ కార్యాకలాపాలు నిర్వహించే చోట జంట పేలుళ్ల కలకలం నెలకొంది. శనివారం అర్ధరాత్రి దాటాక హై సెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. అయితే పేలుళ్లు స్వల్ప తీవ్రతతో జరగడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. కాగా, రాత్రి 1గం.35ని. నుంచి 1.గం.42 ని.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఒక దాడిలో పైకప్పు స్వల్పంగా దెబ్బతిందని, మరో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగిందని ప్రకటించింది. ఈ ఘటనలో రెండు బ్యారక్‌లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు గాయపడినట్లు తొలుత సమాచారం అందించింది. అయితే డిఫెన్స్ పీఆర్వో మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లదేని ప్రకటించడం విశేషం. Two low intensity explosions were reported early Sunday morning in the technical area of Jammu Air Force Station. One caused minor damage to the roof of a building while the other exploded in an open area. — Indian Air Force (@IAF_MCC) June 27, 2021 కాగా, టెక్నికల్ ఏరియాల్లో ఈ ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన విషయం తెలిసి ఎన్ఐఏ, ఎన్ఎస్జీ టీంలు రంగంలోకి దిగాయి. ఫోరెన్సిక్ టీంలు క్లూస్ కోసం గాలిస్తున్నాయి. డ్రోన్లలో ఐఈడీ బాంబులు అమర్చిన ఉగ్రవాదులు.. ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారేమోనని అనుమానిస్తున్నారు. చదవండి: అలాగైతేనే పోటీ చేస్తా: మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు -
దారుణం: ర్యాగింగ్ పేరుతో పైలట్‌పై గన్ ఫైరింగ్..!
పారిస్: ర్యాగింగ్ పేరుతో ఓ పైలట్‌పై గన్ ఫైరింగ్ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, ఈ సంఘటన ఫ్రాన్స్ దేశానికి చెందిన మధ్యధరా సముద్రంలోని కార్సికా ద్వీపంలో సోలెన్జారా వైమానిక స్థావరంలో చోటుచేసుకుంది. ర్యాగింగ్‌కు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కంప్లెయిట్ను బాధితుడు ఫైల్ చేశాడు. వైమానిక దళ శిక్షణ సమయంలో సహచర పైలట్లు అతడిని ఫైరింగ్ టార్గెట్‌కు కట్టేసి, అతడి మీదుగా ఫైటర్ విమానాలను పోనిస్తూ పైలట్‌పై కాల్పులను జరిపారని ఫిర్యాదులో తెలిపాడు. సహచరులు పాశవికంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను అతడి న్యాయవాది ఫ్రెడ్రిక్ బెర్నా ఫిర్యాదులో పొందుపర్చాడు. ఈ సంఘటన 2019 మార్చిలో చోటుచేసుకున్న బాధితుడు మిలటరీ అధికారులను సవాలు చేయడానికి భయపడి ర్యాగింగ్ పాల్పడిన వారిపై ఫిర్యాదును ఇవ్వలేదు. ఆ సమయంలో వారిపై ఫిర్యాదును ఇవ్వలేకపోయాడని బాధితుడి లాయర్ పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై ఫ్రెంచి వైమానిక దళ ప్రతినిధి కల్నల్ స్టీఫెన్ స్పెట్ స్పందించారు. శిక్షణ కేంద్రంలో ర్యాగింగ్ లాంటి చర్యలకు తావుండదని తెలిపారు. ర్యాగింగ్‌పై అంతర్గత విచారణ జరిగిందని తెలిపారు. అంతేకాకుండా వారికి శిక్షను కూడా విధించామని పేర్కొన్నారు. కాగా నిందితులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదని, అంతేకాకుండా నిందితులను ఈ కేసు నుంచి తప్పించేలా చర్యలు జరుగుతున్నాయనీ బాధితుడి లాయర్ ఆరోపించారు. చదవండి: అమెరికాలో కాల్పులు: వేర్వేరు చోట్ల 12 మంది మృతి -
వరదలో మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్
సాక్షి ముంబై: చిమ్మ చీకటి..చుట్టూ వరదనీరు.. విషకీటకాలు, పాముల భయం.. చిన్నారుల ఏడ్పులు.. మంచి నీరు కూడా అందని పరిస్థితి... ఇది ముంబై– కొల్హాపూర్ మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికుల దుస్థితి. శుక్రవారం రాత్రి ముంబై నుంచి బయలు దేరిన ఈ రైలు ముంబై శివారు ప్రాంతమైన వాంగణీ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపైకి వరద నీరు చేరడంతో నిలిచిపోయింది. సుమారు 17 గంటల అనంతరం రైలులో చిక్కుపోయిన 1,050 మంది ప్రయాణికులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, పోలీసులు, స్థానికుల సాయంతో సురక్షిత ప్రాంతాలకు చేర్చగలిగారు. ప్రయాణికులెవరికీ ఎటువంటి హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబైతోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉల్లాస్ నది ఉప్పొంగింది. సెంట్రల్ రైల్వే మార్గంపై బద్లాపూర్, వాంగణీ ప్రాంతాల్లోని రైల్వేట్రాక్‌లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజు టర్మినస్ నుంచి శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరిన సీఎస్ఎంటీ–కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలు వాంగణీ ప్రాంతంలో వరదలో చిక్కుకుంది. రాత్రంతా రైలులోనే... వరద నీటిలో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు ఒకేచోట రాత్రంతా రైల్లోనే గడపాల్సి వచ్చింది. ఓ వైపు చుట్టూ వరద నీరు, చిమ్మచీకటి.. నీరు బోగీలోకి వస్తే ఏమవుతుందోననే భయాం దోళన. మరోవైపు విష కీటకాలు, పాములు ఏమైనా లోనికి వస్తే ఎలా అనే భయం... ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రయాణికులు తమ సెల్ ఫోన్ల ద్వారా మిత్రులతోపాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఇలా ఎవరికి తెలిసిన వారికి వారు ఫోన్లు చేసి, వీడియోలు పంపి సాయం కోరారు. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలతోపాటు వయోవృద్ధులు, వికలాంగులు కూడా ఈ రైలులో ఉన్నారు. వీరందరూ రాత్రంతా రైలు బోగీలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరోవైపు వెంట తీసుకుచ్చిన నీరు, ఆహారం, పాలు అయిపోవడంతో పిల్లల ఏడ్పులతో అందరిదీ నిస్సహాయ స్థితి. ఊరట తెచ్చిన రైల్వే సిబ్బంది ప్రకటన.. రాత్రంతా తీవ్ర ఉత్కంఠ, భయాందోళనల మధ్య గడిపిన ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ప్రకటనతో కొంత ఊరట లభించింది. రైలు సిబ్బంది, పోలీసులు ఓ బ్లూ టూత్ మైక్ ద్వారా ప్రతి బోగీలోకి వెళ్లి ‘అందరం సురక్షితంగానే ఉన్నాం. ఎవరూ భయపడవద్దు. ఎవరూ కూడా తొందరపడి రైలు దిగవద్దు’అంటూ సూచనలు చేశారు. రెస్క్యూ టీమ్ వచ్చి అందరినీ రక్షిస్తుందని ప్రకటించారు. రెస్క్యూ టీమ్ రాక.. వరదల్లో చిక్కుకున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంతలోనే ఎన్డీఆర్ఎఫ్, నావిక దళం బృందాలు అక్కడికి చేరుకోవడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సహాయక బృందాలు ఎనిమిది రబ్బరు బోట్లు, ఇతర సామగ్రి తమ వెంట తెచ్చాయి. ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్ల సాయంతో ముందుగా పరిసరాలను పర్యవేక్షించారు. రబ్బరు బోట్లతో రైలు వద్దకు చేరుకునేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి, అక్కడి నుంచి రైలు వద్దకు చేరుకున్నారు. ఇందుకోసం స్థానికుల సాయం తీసుకున్నారు. రైలు వద్దకి చేరుకున్న అనంతరం బోట్ల ద్వారా ప్రయాణికులను బృందాలుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలా 17 గంటల అనంతరం రైలులోని వారందరినీ సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సహాయక చర్యలు 2.20 గంటలకు ముగిశాయి. అనంతరం 14 బస్సులు, మూడు టెంపోల ద్వారా వారందరినీ సురక్షిత స్థలాలకు తరలించారు. తర్వాత వారి కోసం కళ్యాణ్ నుంచి ప్రత్యేక 19 బోగీల ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. మన్మాడ్, దౌండ్ మార్గం మీదుగా ఈ రైలు కొల్హాపూర్‌కు చేరుకోనుంది. మరో 120 మందిని కాపాడిన బృందాలు ఆకస్మికంగా వరద చుట్టుముట్టడంతో బద్లాపూర్‌లోని ఓ పెట్రోల్ పంప్ భవనంపైకి చేరుకున్న 70 మందిని, షాహద్లోని ఓ రిసార్టులో ఉన్న మరో 46 మందిని ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కాపాడారని అధికారులు తెలిపారు. అలాగే, కల్యాణ్ జిల్లాలో 9 మందిని రక్షించినట్లు చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. థానేలో రికార్డు స్థాయిలో శనివారం ఉదయానికి 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఉల్హాస్ నగర్లో 200 మి.మీ. వాన కురిసింది. తక్షణం స్పందించిన కేంద్రం రైలు వరదలో చిక్కుకుందనే విషయం తెలిసిన వెంటనే కేంద్రం అప్రమత్తమయింది. ప్రయాణికులను రక్షించేందుకు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన తెలుసుకున్న హోంమంత్రి అమిత్ షా వెంటనే ముంబై లోని రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అవసరమైన సామగ్రితో సంఘటన స్థలానికి తరలివెళ్లాలని ఆదేశించారు. దీంతో సహాయక బృందాలు అక్కడికి ఉదయం 9.40 గంటలకు చేరుకున్నాయి. అమిత్ షా విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ కూడా స్పందించి రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు, సుశిక్షితులైన 130 మంది సిబ్బంది కలిసి ఆహారం, మంచినీరు, సహాయక సామగ్రిని వెంట తీసుకుని వెళ్లారని ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖ అధికారులు వైద్య బృందాలను అక్కడికి పంపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తీసుకువచ్చిన బృందాలను అమిత్‌షా అభినందించారు. పరిమళించిన మానవత్వం.. మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులందరు సురక్షితంగా బయటికి వచ్చిన అనంతరం స్థానిక గ్రామస్తులు వారికి అవసరమైనవి సమకూర్చారు. ముఖ్యంగా పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. బద్లాపూర్‌లోని సహ్యాద్రి మంగళ కార్యాలయంలో వారందరికీ భోజనం, మంచి నీరు అందించి మానవత్వం చాటుకున్నారు. గర్భవతులు సురక్షిత స్థలాలకు: మహాలక్ష్మి రైలులోని సుమారు వెయ్యి మందిలో తొమ్మిది మంది గర్భవతులు. వీరిలో రేష్మా కాంబ్లే తొమ్మిది నెలల నిండు గర్భిణీ కావడంతో ఆమెను ముందుగా తీసుకు వచ్చారు. రైలులో ఉన్న 9 నెలల చిన్నారితోపాటు ఆమె తల్లిని కూడా ఒడ్డుకు తీసుకువచ్చారు. ముఖ్యంగా 37 మందితో కూడిన డాక్టర్ల బృందం సాయంతో గర్భవతులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
యుద్ధవిమానాలతో సెల్ఫీ
మాంటే-డీ-మార్సన్: భారత్‌కు చెందిన యుద్ధవిమానం సుఖోయ్‌ని ఫ్రాన్స్ పైలట్ నడపగా, ఫ్రాన్స్ యుద్ధవిమానం రఫేల్‌ను భారత పైలట్ నడిపారు. అంతేనా ఈ ఇద్దరు పైలట్లు యుద్ధవిమానాలని నడుపుతూ దిగిన సెల్ఫీలను ఇరుదేశాల వైమానిక విభాగాలు ట్వీట్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నాయి. ఈ అరుదైన సంఘటన ఫ్రాన్స్‌లోని మాంటే-డీ-మార్సన్ ఎయిర్‌బేస్‌లో చోటుచేసుకుంది. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య జులై 1 నుంచి 14 వరకు గరుడ-6 పేరిట ఇరుదేశాలకు చెందిన యుద్ధ విమానాల సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ అత్యున్నత యుద్ధవిమానం సుఖోయ్‌ని ఫ్రాన్స్ ఫైలట్ నడపగా, భారత్ కొనుగోలు చేస్తున్న రఫేల్‌ను భారత ఫైలట్ నడిపారు. ఈ విన్యాసాలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ విన్యాసాలలో భాగంగా ఇరుదేశాల మధ్య మంచి అవగాహన కుదిరిందని, తమ సామర్థ్యాలను మరింత మెరుగపర్చుకోవడానికి అవకాశం కలిగిందని పేర్కొంది. అంతేగాక రెండు దేశాల సైనికుల మధ్య కూడా వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపింది. భారత్, ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలుచేసిన విషయం తెలిసిందే. అయితే రఫేల్ కొనుగోలులో అవినీతి జరిగిందంటూ భారత్‌లో తీవ్ర రాజకీయదుమారం రేగినా ప్రభుత్వం రఫేల్‌ను కొనడానికే సిద్దపడింది. ఇప్పటికే భారత్ దగ్గర నాలుగు సుఖోయ్-30లను కలుపుకొని మొత్తం 124 యుద్దవిమానాలు ఉన్నాయి. ఇప్పుడు రఫేల్ వచ్చి చేరితే భారత వాయుసేన మరింత శక్తివంతం కానుంది. సెప్టెంబర్19 నాటికి తొలి రఫేల్‌ను భారత్‌కు ప్రాన్స్ ఇవ్వనుంది. మిగతా వాటిని రెండు సంవత్సరాలలోపు ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఈ విన్యాసాలు భారత్ ఫైటర్లకు రఫేల్‌పై అవగాహన కల్పిస్తాయని, అలాగే భారత ఫైటర్లకు అంతర్జాతీయ వాతావరణంపై అవగాహన కలగడమేగాక రష్యా తయారీ భారత సుఖోయ్‌ని యుద్ధ క్షేత్రంలో రఫేల్‌తో అనుసంధానించడంపై వీరికి నైపుణ్యం వస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రష్యా తయారీ అత్యున్నత యుద్ధ విమానం సుఖోయ్ భారత్ తరపున ఫ్రాన్స్ గగనతలంపై చక్కర్లు కొట్టడమేగాక, ఒక ఫ్రెంచ్ ఫైటర్ ఆ విమానాన్ని నడపడం ఆసక్తికరవిషయమని అంటున్నారు. -
సార్వభౌమత్వ రక్షణకు సత్తా చాటుతాం
సాక్షి ప్రతినిధి, చెన్నై: సార్వభౌమత్వ రక్షణకు భారత్ అన్ని శక్తులు ఉపయోగిం చుకుంటుందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా సులుర్లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో సోమవారం అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని జవాన్లనుద్దేశించి ప్రసంగించారు. ‘భారత్ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. భారత వైమానిక దళాన్ని మరింత ఆధునీకరిస్తున్నాం. 1975 నుంచి హెలికాఫ్టర్‌లో మహిళా పైలట్లు తమ దక్షతను చాటుకుంటున్నారు. 2016 నుంచి యుద్ధ విమానాల్లో సైతం మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నపుడు వైమానిక దళాల సేవలు వెలకట్టలేనివి’ అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. -
సోషల్ మీడియా వైరల్..
రెండు సంవత్సరాల క్రితం ప్రచురితమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు వెబ్సైట్లలో పొందుపరచడంతో అందులోని అంశాలు వాస్తవమేనని భ్రమపడిన పలువురు ఎయిర్‌ఫోర్స్ ఆశావాహ అభ్యర్థులు తీరా కడపకు వచ్చిన తర్వాత అది పాత సమాచారం అని తెలుసుకుని భంగపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు విచారించుకున్న తర్వాతనే అభ్యర్థులు ఎంపికలకు హాజరుకావాలని సదరు అధికారులు పేర్కొంటున్నారు. కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్ఏ క్రీడామైదా నంలో సెప్టెంబర్ 16 నుంచి ఎయిర్‌ఫోర్స్ ఎంపికలు నిర్వహిస్తున్నారన్న తప్పుడు సమాచారం వైరల్ కావడంతో ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు అభ్యర్థులు శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కడప నగరానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే... 2016 సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు కడప నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానంలో ఎయిర్‌ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెం ట్, సెక్యూరిటీ వైట్రేడ్ ఉద్యోగాలకు ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించారు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో కడప, అనంతపురం, కర్నూలు, చి త్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు పాల్గొన్నారు. సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఇదే వార్త గత కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది.. ఇందుకు ఆధారంగా 2016 సెప్టెంబర్‌లో అప్పటి కలెక్టర్ కె.వి. సత్యనారాయణ ఇచ్చిన ప్రెస్‌మీట్‌కు సంబంధించిన వార్తా క్లిప్పింగ్‌ను సైతం జతపరిచారు. క్లిప్పింగ్‌ను జతజేసిన వారు అది ఏ సంవత్సరానికి చెందినదో తెలుపకుండా సెప్టెంబర్ 16 నుంచి ఎయిర్‌ఫోర్స్ ఎంపికలు అని సోషల్ మీడియాలో పెట్టడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆత్రుతతో కడపకు చేరుకున్నారు. కంగుతిన్న అభ్యర్థులు.. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు ఎంపికలు జరుగుతాయన్న ఉద్దేశ్యంతో ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు చెందిన పలువురు నిరుద్యోగ అభ్యర్థులు ఎంపికల కోసం శనివారం రాత్రికి కడపకు చేరుకున్నారు. రాత్రి నగరంలోని డీఎస్ఏ స్టేడియం వద్దకు చేరుకుని అక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో కంగుతిన్నారు. అదే సమయంలో అటుగా బీట్‌కు వచ్చిన పోలీసులు అభ్యర్థులను ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారని పోలీసులు ప్రశ్నించడంతో రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం వచ్చామని పేర్కొనగా.. ఇక్కడ ఎటువంటి రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించడం లేదని.. ఉంటే కనీసం మాకైనా సమాచారం ఉండేదని పోలీసులు వారికి తెలియజేశారు. దీంతో డీఎస్ఏ కిందిస్థాయి సిబ్బందిని అడుగగా ఇక్కడ ఎటువంటి ఎంపికలు నిర్వహించడం లేదని పేర్కొనడంతో పాటు రెండు సంవత్సరాల క్రితమే ఇక్కడ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించారని.. ఇప్పుడేమీ జరగలేదని వారు పేర్కొనడంతో అభ్యర్థులకు ఏమి చేయాలో పాలుపోలేదు. దీంతో అభ్యర్థులు తిరుగుముఖం పట్టారు. మళ్లీ ఆదివారం ఉదయానికి మరికొంత మంది అభ్యర్థులు రావడంతో సిబ్బంది ఇక్కడ ఎంపికలు నిర్వహించడం లేదని చెప్పి పంపించారు. ఈ విషయమై స్టెప్/డీఎస్ఏ అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా.. అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చిన అంశాల ఆధారంగా ఎంపికలకు హాజరుకావడం సరికాదన్నారు. ఏవైనా ఎంపికలు ఉంటే ఆయా జిల్లాల స్టెప్ కార్యాలయాల్లో ఖచ్చితమైన సమాచారం లభిస్తుందని.. అభ్యర్థులు తెలుసుకుని వస్తే ఇటువంటి తిప్పలు తప్పుతాయని వారు పేర్కొన్నారు. -
అమ్మా నాన్న తమ్ముడు... ఓ కన్నడ అమ్మాయి!
మేఘన ఆలోచనలు భూమ్మీద లేవెప్పుడూ! ఇప్పుడైతే పూర్తిగా గగనంలోనే ఆమె డ్యూటీ. పట్టుపట్టి ఫైటర్ జెట్ పైలెట్ అయిన మేఘన.. కొత్త జనరేషన్‌కి.. ఓ కొత్త ఇన్స్పిరేషన్! అమ్మా నాన్న తమ్ముడు... ఓ కన్నడ అమ్మాయి. ‘అందంగా అల్లుకున్న హరివిల్లు మాది’ అని పాడుకోదగినంత చక్కని కుటుంబం. ‘నాన్నా! ఇంత చిన్న స్కూల్లో కాదు పెద్ద స్కూల్లో చదువుకుంటాను’ అన్నది మేఘన నాలుగో తరగతిలో. అంత పెద్ద స్కూలు మనూర్లో లేదంటే ‘పెద్ద స్కూలుకి హాస్టల్ కూడా ఉంటుంది కదా నాన్నా’.. ఇదీ పదేళ్ల వయసులో మేఘన అన్న మాట. తన కూతురు మామూలు అమ్మాయిగా మిగలదు, అడ్వెంచరస్ పర్సనాలిటీ అవుతుందని తండ్రికి ఎక్కడో ఓ నమ్మకం. కూతురి మీద తండ్రి పెంచుకున్న ఆ నమ్మకమే... కన్నడ రాష్ట్రానికి ఓ రికార్డును సాధించి పెట్టింది, ఉత్తర భారతం ముందు తలెత్తుకోవడానికి దక్షిణ భారతానికి ఓ భరోసానిచ్చింది. మేఘనా శాన్‌బాగ్ ఆలోచనలు ఎప్పుడూ వినువీధిలోనే విహరిస్తూ, మేఘాలను తాకుతుండేవి. చదువుకే పరిమితమయ్యేది కాదు. ఆటపాటల్లో కూడా చురుగ్గా ఉండేది. ఒక విషయం చర్చకు వస్తే తన వాదనతో ఎదుటి వారిని సమాధాన పరిచి తాను అనుకున్నట్లే చేసేది. అమ్మానాన్నలిద్దరూ చట్టాన్ని ఔపోశన పట్టారు, వాళ్ల కూతురు వారితో గెలవడంలో మెళకువలు నేర్చుకుంది. తండ్రి న్యాయవాది, తల్లి జడ్జి. ఇంటి కోర్టులో తన వాదనను తానే వినిపించుకుంది మేఘన, ‘‘చిన్నపిల్ల ఏదో చెబుతుంటే అన్నింటికీ ఒప్పుకోవడమేనా’’ అంటూ తల్లి డిఫెన్స్ వాదనను లేవనెత్తింది. ఈ ఫ్యామిలీ కోర్టులో తండ్రి న్యాయమూర్తి పాత్ర పోషించాల్సి వచ్చింది. వాది ప్రతివాది ఇద్దరూ సమర్థంగానే ఉన్నారు. ఎటొచ్చీ న్యాయమూర్తిలో దాగిన తండ్రి మనసు కూతురి వైపే మొగ్గింది. ఆ తీర్పుతో మేఘన చిక్మగుళూరు (కర్ణాటక రాష్ట్రం) దగ్గర మార్లె నుంచి ఉడిపిలోని లిటిల్ రాక్ ఇండియన్ స్కూల్లో చేరింది. ఐదవ తరగతి నుంచి ట్వల్త్ క్లాస్ వరకు అదే స్కూల్. ఇంజనీరింగ్ మైసూర్‌లోని శ్రీ జయచామరాజేంద్ర కాలేజ్‌లో చేసింది. ఎప్పుడూ సాహసాలే మేఘన ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు కాలేజ్ అడ్వెంచర్ క్లబ్ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేది. సెమిస్టర్ బ్రేక్‌లో ట్రెకింగ్, రివర్ రాఫ్టింగ్, మౌంటనియరింగ్ వంటి సాహసయాత్రలను మేఘన స్వయంగా నిర్వహించేది. ఆమె మనాలిలో మౌంటనియరింగ్ కోర్సు చేసింది. పారాగ్లైడింగ్‌లో పూర్తిస్థాయి శిక్షణ కూడా తీసుకుంది. గోవా, క్వారీ బీచ్‌లో సోలో పారాగ్లైడింగ్ ఈవెంట్లో జంప్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మధ్యలో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. ఇలా ఆడుతూ పాడుతూ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఫైనలియర్లో ఉన్నప్పుడు మొదలైంది ‘వాట్ నెక్ట్స్’ అనే ఆలోచన. అందరిలా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడానికి మనస్సంగీకరించలేదు. అందరికంటే భిన్నంగా ఏదైనా చేయాలనే ఉత్సుకత చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఉత్సుకతే ఆమె చేత అన్నేసి సాహసాలను చేయించింది. వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టడం కాదు జీవితమంటే అనే సంఘర్షణ కూడా మొదలైంది. పారాగ్లైడింగ్‌లో శిక్షణనిచ్చిన సీనియర్లు చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చాయి. వాళ్లు ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసి రిటైర్ అయిన అధికారులు. పారా గ్లైడింగ్ ట్రైనింగ్‌తోపాటు వాళ్ల ఉద్యోగ అనుభవాలను కూడా పంచుకునేవారు. సాహసానికి పరాకాష్ట అయిన ఉద్యోగం అంటే అదేనేమో అనిపించేది మేఘనకు. తన కెరీర్ కూడా అంతటి సాహసోపేతంగానే ఉండాలని ముచ్చటపడింది. ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలని మనసు పడింది. (తమ్ముడు నిర్ణయ్, తల్లి శోభ, తండ్రి రమేశ్‌తో మేఘన) దేశంలో ఆరో అమ్మాయి మేఘనాశాన్బాగ్ ఫైటర్ పైలట్ కావడం దక్షిణ భారతదేశానికి రికార్డు. మనదేశంలో యుద్ధవిమానాలు నడపడానికి అర్హత సాధించిన ఆరో అమ్మాయి మేఘన. మొదటి ఐదు స్థానాల్లో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారున్నారు. మేఘన విజయం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలకు కూడా రికార్డే. దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ తొలి ఫైటర్ పైలట్ మేఘననే. రఫెల్ యుద్ధ విమానాన్ని నడపడం తన కల అంటోంది మేఘన. చక్కటి కాఫీలా ఉండాలి మేఘనది కన్నడ కాఫీ తోటల్లో పుట్టిన కుటుంబం. ఆమె తల్లి శోభ ఆడపిల్లకు మరీ గిరిగీసే చాదస్తపు తల్లి కాదు. న్యాయమూర్తిగా జీవితాలను ప్రభావితం చేస్తున్న మహిళ. జీవితాన్ని చక్కగా అమర్చుకోవాలనే సంప్రదాయవాది మాత్రమే. కూతురు జీవితం... ఉదయాన్నే ఘుమఘుమలాడే కాఫీలాగ ఆస్వాదభరితంగా ఉంటే బావుణ్ననుకునే తల్లి. సాహసాల జోలికి పోకుండా ఒళ్లు హూనం చేసుకోకుండా కూతురు లక్షణంగా ఉండాలని కోరుకునే తల్లి మనసు ఆమెది. మేఘన యుద్ధవిమానాలను నడిపే అధికారి అయినప్పుడు సంతోషంతోపాటు ఎక్కడో మనసులో భయపడుతూనే ఉన్నారామె. ‘ఇంత గొప్ప స్థాయికి చేరడం ఆనందమే కానీ...’ అంటూ అర్ధోక్తిలో ఆగిపోతుంటారిప్పటికీ. ఆమె ఇలా అంటుంటే మేఘన మాత్రం ‘‘అది నా జీవితంలో గొప్ప పర్వదినం అనే చెప్పాలి. కాక్‌పిట్‌లో నేనొక్కదాన్నే. ఒక్కదాన్నే విమానాన్ని టేకాఫ్ చేయాలి. ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ కి నా పేరు చెప్పుకుని విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లడంలో ఉన్న ఆనందాన్ని చెప్పడానికి మాటలుండవు. అనుభవంలో తెలియాల్సిందే. ఆ ఫ్లయింగ్లో నేను విమానాన్ని నడిపింది కేవలం ఇరవై నిమిషాల సేపే. కానీ అవి నాకు అమూల్యమైన క్షణాలు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’’ అని తన తొలి ఫ్లయింగ్ అనుభవాన్ని పంచుకుంది. ‘‘నేను ఫైటింగ్ విభాగాన్ని ఎన్నుకున్నాను. శిక్షణలో రోమాలు నిక్కబొడుచుకునే విన్యాసాలను ఎన్నో చేస్తుంటాం. ఫైటర్ పైలట్ శిక్షణలో బాంబులతో దాడి చేయడం, కాల్పులు, పోరాట నైపుణ్యాలను నేర్పిస్తారు. తర్వాత అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఒక్కో విన్యాసాన్నీ పూసగుచ్చినట్లు చెబుతుంటే అమ్మానాన్న, తమ్ముడు భయంగా చూశారు నన్ను. అప్పుడు నాకేదయినా అయి ఉంటే... అనేదే వాళ్ల భయం. తమ్ముడు నిర్ణయ్ పుణేలోని సింబయాసిస్‌లో లా కోర్సు చేస్తున్నాడు అచ్చం అమ్మ కోరుకున్నట్లే’’ అని నవ్వింది మేఘన. కలిసొచ్చిన నిర్ణయం మేఘన 2015లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆమెకి ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో చేరాలనే లక్ష్యం ఏర్పడింది కూడా అప్పుడే. సరిగ్గా అదే సమయానికి మనదేశ విమానయాన రంగం... యుద్ధవిమానాల కాక్‌పిట్‌లోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఎయిర్‌ఫోర్స్ నిర్ణయంతో 2016 జూన్‌లో మోహనా సింగ్, భావనా కాంత్, అవనీ చతుర్వేదిలు దేశంలో యుద్ధవిమానాలు నడపడానికి ఎంపికైన తొలి మహిళలుగా రికార్డు్డ సృష్టించారు. అప్పటి వరకు పైలట్‌గా విమానాలను నడపాలనేదే మేఘన ఆశయం. ఎయిర్‌ఫోర్స్ నిర్ణయంతో మేఘన లక్ష్యం యుద్ధవిమానాలయ్యాయి. ఆ ముగ్గురు మహిళల రికార్డు మేఘనలో పట్టుదలను మరింతగా పెంచింది. ఏకకాలంలో ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, సర్వీస్ సెలక్షన్ బోర్డు రెండు పరీక్షలను రాసింది. రెండింటిలోనూ తొలి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయింది. కానీ తన కల విమానాల్లోనే విహరిస్తుండడంతో ఎయిర్‌ఫోర్స్‌లోకి వచ్చింది. 2017 జనవరిలో హైదరాబాద్, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. యుద్ధవిమానాలు నడపడంలో నైపుణ్యం సాధించింది. ఏఎఫ్ఏలో జాయిన్ అయ్యి, డిసెంబర్లో కోర్సు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫ్లయింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ అందుకుంది. ప్రయత్నమూ గొప్పే మనదేశంలో యుద్ధవిమానాలను నడిపించిన తొలి మహిళలుగా మోహనా సింగ్, భావనాకాంత్, అవనీచతుర్వేదిల విజయగాథ చదవడం నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఆ కథనం నన్ను ప్రభావితం చేసింది. నాలాగే మరెందరో స్ఫూర్తి పొంది ఉండవచ్చు. నన్ను చూసి స్ఫూర్తి పొందేవాళ్లు కూడా ఉండాలి. అదే నాకు సంతోషం. ఫైటర్ పైలట్ కావడం గొప్ప అవకాశం. ప్రతి ఒక్క అమ్మాయికి, అబ్బాయికి ఫైటర్ పైలట్ కావాలనేదే కల కావాలి. ఆ కలను సాధించుకోవడంలో విజయం మాత్రమే కాదు ప్రయత్నించడం కూడా గొప్ప అనుభూతిగానే మిగులుతుంది. – మేఘనా శాన్‌బాగ్, ఫైటర్ పైలట్ – వాకా మంజులారెడ్డి -
‘వీర’....నారికి జోహార్
సైన్యం అంటేనే పురుషులు.....అనాదిగా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. తొలుత మన దేశ సైన్యంలో మహిళలను కేవలం వైద్య సేవలు అందించడానికి మాత్రమే నియమించేవారు. 1992నుంచి ఈ పరిస్థితి మారింది. మహిళలను వైద్య సేవల నిమిత్తమే కాకుండ సైనిక సేవలను అందించేందుకు నియమించడం ప్రారంభించారు. తొలుత కేవలం జూనియర్ రేంజ్లో మాత్రమే తీసుకునేవారు. 2016, ఫిబ్రవరిలో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ప్రకటన మేరకు ప్రస్తుతం సైనిక బలగాల్లో మహిళలను ఆర్మి, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఆఫీసర్ కేడర్‌లో నియమిస్తున్నారు. త్రివిధ దళాల్లో సేవలు అందించిన, అందిస్తున్న ధీర వనితల గురించి తెలుసుకుందాం. పునిత అరోరా సైన్యంలో రెండో అత్యుత్తమ స్థాయి అయిన లెఫ్టినెంట్ జనరల్ ర్యాంకు, నేవీలో వైస్ అడ్మిరల్ స్థాయికి ఎదిగిన తొలి మహిళ పునిత. పంజాబీ కుటుంబంలో జన్మించిన పునిత 2004వరకూ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ బాధ్యతలు చూసుకున్నారు. ఈ బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళ కూడా పునిత అరోరా కావడం విశేషం. పద్మావతి బంధోపాధ్యాయ ఆమె ప్రస్థానం అడుగడుగునా ప్రత్యేకం. భారత వాయుసేనలో చేరిన తొలి మహిళ.ఇంతేనా ఉత్తర ధృవంలో పరిశోధనలు చేసిన తొలి మహిళే కాక వాయుసేనలో ఎయిర్ వైస్ మార్షల్ ర్యాంకుకు ఎదిగిన తొలి మహిళ కూడా పద్మావతి బంధోపాధ్యాయే. 1971 లో భారత్-పాక్ యుద్ధం సందర్భంగా ఆమె చేసిన సేవలకు గాను ‘‘విశిష్ట సేవా పురస్కారాన్ని’’ అందుకున్నారు. మిథాలి మధుమిత సైన్యంలో ప్రధానం చేసే ‘‘సేన’’ పతకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పతకాన్ని స్ధాయితో సంబంధం లేకుండా శత్రుసేనలు దాడి చేసినప్పుడు వ్యక్తిగత ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారికి ప్రధానం చేస్తారు. ఇలాంటి అరుదైన పురస్కారాన్ని అందుకున్న తొలి సైనికురాలు లెఫ్టినెంట్ కల్నల్ మిథాలి మధుమిత. 2010, ఫిబ్రవరిలో కాబూల్‌లో భారత రాయబార కార్యాలయం వద్ద ఆత్మహుతి దాడి సమయంలో ఆమె ఒంటరిగాసంఘటన స్థలికి చేరుకుని దాదాపు 19మంది ఆధికారులను కాపాడినందుకు గాను 2011లో ప్రభుత్వం ఆమెను ‘‘సేన’’ అవార్డుతో సత్కరించింది. దివ్య అజిత్ కుమార్ సైనిక శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. అందులోను సైన్యంలో ఆఫిసర్‌గా శిక్షణ పొందే సమయంలో పలు ప్రత్యేక అంశాల్లో ప్రతిభను పరీక్షిస్తారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి శిక్షణానంతరం ఇచ్చే విశిష్ట పురస్కారం ‘‘స్వార్డ్ ఆఫ్ హనర్’’. ఇంతటి గౌరవాన్ని అతి పిన్న వయసులోనే (21ఏళ్లకే) పొందారు దివ్య అజిత్ కుమార్. అంతేకాదు భారత సైనిక చరిత్రలో ఓ మహిళ ఈ అవార్డు పొందడం ఇదే ప్రధమం. అంజనా భదురియా మైక్రోబయాలజీలో పీజీ చేసినప్పటికి ఆమె కోరిక మాత్రం సైన్యంలో చేరి దేశ సేవ చేయడం. అందుకు తగ్గట్టుగానే 1992లో భారత ప్రభుత్వం సైన్యంలో మహిళను చేర్చుకునేందుకు ‘‘మహిళల ప్రత్యేక ఎంట్రీ స్కీమ్’’ను ప్రవేశపెట్టింది. మహిళ క్యాడెట్ల తొలి బ్యాచ్ అదే. ఈ బ్యాచ్‌లో చేరి శిక్షణ కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ అందుకున్న తొలి మహిళ అంజనా భదురియా. ప్రియ సేంవాల్ సైన్యంలో చేరతామంటే వద్దు అనే కుటుంబాలు నేటికి కోకొల్లలు. అలాంటిది తన భర్త సైన్యంలో వీరమరణం పొందినప్పటికి భర్త జ్ఞాపాకర్థం తాను తన నాల్గు సంవత్సారల కూతురిని సైతం వదిలి సైన్యంలో చేరిన మొదటి ఆర్మీ జవాన్ భార్యగా దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకుని చరిత్ర సృష్టించారు ప్రియ సేంవాల్. గనేవి లాల్జి గనేవి లాల్జి తన కుటుంబంలో సైన్యంలో చేరిన మూడో తరం వ్యక్తి. సాహసాలు అంటే ఎంతో ఇష్టపడే లాల్జి మనాలిలోని వెస్ట్రన్ హిమాలయన్ మౌంటేయినరింగ్ ఇనిస్టిట్యూట్‌లో మౌంటేయినరింగ్, స్కియింగ్లలో శిక్షణ తీసుకున్నారు.2011లో ఆమె సైన్యంలో చేరారు. అనతికాలంలోనే ఆర్మి కమాండర్‌కు కీలక సహాయకురాలిగా నియమితులైన తొలి మహిళగా కీర్తి గడించారు. గుంజన్ సక్సేనా 1994నుంచి భారత వాయుసేనలో మహిళలను తీసుకుంటున్నారు. 25ఏళ్ల గుంజన్ సక్సేనా నాటి తొలి బ్యాచ్‌లో ఒకరు. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళా ఐఏఎఫ్ ఆఫీసర్ గుంజన్ సక్సేనా. కార్గిల్ యుద్ధ సమయంలో శత్రు స్థావరాల్లో గాయపడిన సైనికులను తీసుకురావడం, యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి సైనిక దళాలను చేరవేయడం వంటి బాధ్యతలు నిర్వహించారు. విధినిర్వహణలోనే వీరమరణం పొందారు. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చి ప్రభుత్వం ‘‘శౌర్య వీర అవార్డు’’ను ప్రధానం చేసింది. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ కూడా ఈమెనే. శాంతి తగ్గ మూడు పదులు దాటిన వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి...ఏ స్త్రీ అయినా ఇంటిపట్టునే ఉండాలనుకుంటుంది. కానీ శాంతి తగ్గ మాత్రం సైన్యంలో జవానుగా చేరారు. శరీర దృఢత్వ పరిక్షల్లో పురుషులకు ధీటుగా రాణించి బ్యాచ్‌లో మొదటి స్థానంలో నిలిచారు. శిక్షణ పూర్తయ్యాక 969 రైల్వె ఇంజనీర్ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందారు. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. - పిల్లి ధరణి -
పాక్‌కు గూఢచర్యం.. భారత సైన్యంలో పెను కలకలం