![Some Important Changes Can Be Made In Agnipath Scheme - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/9/Agnipath.jpg.webp?itok=EWS0hDXr)
ఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోని త్రివిధ దళాల్లో అగ్నిపథ్ స్కీమ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ పథకం కింద త్రివిధ దళాల్లో ఎంపికైన వారిని అగ్నివీర్లు అని పిలుస్తున్నారు. అయితే, అగ్నిపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అగ్నివీర్లకు శుభవార్త అందించింది.
వివరాల ప్రకారం.. అగ్నిపథ్ పథకంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అగ్నివీర్ల కాల పరిమతి, వయస్సును పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఈ పథకం కింద ఎంపిక చేసిన యువతలో 25 శాతం మందినే నాలుగేళ్ల తర్వాత ఆర్మీలో రెగ్యూలర్ క్యాడర్ తీసుకోనున్నారు. అయితే దీనిని 25 నుంచి 50 శాతంకు పెంచాలనే కేంద్రం తీసుకున్నట్టు సమాచారం. అలాగే, సాంకేతిక నేపథ్యం ఉన్న యువకులను చేర్చుకోవడం, గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. జూన్ 2022లో ప్రారంభించబడిన అగ్నిపథ్ స్కీమ్ కింద 17.5-21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులను అగ్నివీర్ పోస్టుల కోసం పరిశీలిస్తున్నారు. అయితే, సాంకేతిక నేపథ్యం ఉన్న అభ్యర్థుల విషయంలో గరిష్ట రిక్రూట్‌మెంట్ వయస్సు 21 ఏళ్లలోపు పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని బలగాలు అభిప్రాయపడుతున్నాయి. గరిష్ట వయోపరిమితిని సవరించడం.. దానిని 23 సంవత్సరాలకు పెంచడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు.. 2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులు అగ్నిపథ్ పథకం కింద చేరనున్నారనే అంచనాలు ఉన్నాయి. కాగా, ప్రతీ ఏడాది దాదాపు 60వేల మంది సైనికులు పదవీ విరమణ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే మూడు సర్వీసుల్లో సైనికుల కొరత తీవ్రంగా ఉంది. కేవలం ఇండియన్ ఆర్మీలోనే 1.18 లక్షల మంది కావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో ఆయనకు సీటు ఫైనల్
Comments
Please login to add a commentAdd a comment