సాక్షి,హైదరాబాద్: ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై జరుగుతున్న ఇండియన్ ఎయిర్‌పోర్స్ ఎయిర్ షో అదరహో అనిపిస్తుంది.
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్స్ ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పై జరుగుతున్న ఎయిర్ షో చూపరులను కనువిందు చేస్తుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 9 సూర్యకిరణ్ విమానాలతో ప్రదర్శన జరుగుతుంది. వాయిసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో జరుగుతున్న ఎయిర్‌షోలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు,వీఐపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ షోతో పాటు సాయంత్రం మ్యూజికల్ కాన్సర్ట్ ప్రారంభం కానుంది. ఎయిర్‌షో, మ్యూజికల్ కన్సర్ట్ నేపథ్యంలో నెక్లెస్ రోడ్ , పీవీ మార్గ్‌లలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వీరి సౌకర్యార్థం నిర్వాహకులు ఫుడ్ స్టాల్స్‌తో పాటు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటలపాటు ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
కాగా, ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు రోజు డిసెంబర్ 9న సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment