సాక్షి, హైదరాబాద్: రేవంత్ పాలనలో అన్నీ తిట్లు, ఒట్లేనని.. ప్రశ్నించే గొంతుకలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరిట ఆయన ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, పోలీసుల చేత పోలీస్ కుటుంబాలను కొట్టించారన్నారు.
‘‘రేవంత్‌రెడ్డికి పరిపాలనలో స్థిరత్వం లేదు. రేవంత్ విధానాలతో తెలంగాణ తిరోగమనంలో వెళ్లింది. గ్యారెంటీలు, హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావడం లేదు. రేవంత్ అడుగులు కూల్చివేతలతో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగం అయ్యింది. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది.’’ అని హరీష్‌రావు ధ్వజమెత్తారు.
‘‘శాంతి భదత్రల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ హయాంలో తొమ్మిది చోట్ల మత కలహాలు జరిగాయి. మద్యం విక్రయాలు పెంచాలని మెమోలు ఇచ్చారు. గాంధీభవన్‌లో ఇచ్చే సూచనల ఆధారంగా చట్టాలు చేస్తున్నారు’’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఇదీ చదవండి: ఇది గారడీ సర్కార్
Comments
Please login to add a commentAdd a comment