బెర్లిన్: జర్మనీలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ జర్మనీని హడలెత్తిస్తోంది. రోజుకు 76 వేలకు పైనే కోవిడ్ కేసులు నమోదు కావడం అక్కడ వణుకుపుట్టిస్తోంది. ఇప్పటివరకూ లక్షకు పైగా మరణాలు సంభవించినట్లు జర్మనీ ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాదు ఆ కేసుల ఉధృతి ఎంతలా ఉందంటే ఆస్పత్రులన్ని కరోనా రోగులతో కిటకిటలాడిపోవడంతో ఆ రోగులను వేరే ఆస్పత్రలకు తరలించే నిమిత్తం ఆఖరికి వైమానికి దళాన్ని కూడా రంగంలోకి దింపింది. అంతేకాదు జర్మనీలోని దక్షిణ నగరం అయిన మెమ్మింగెన్ ఆసుపత్రుల్లో ఎక్కువగా ఉన్న కరోనా రోగులను ఉత్తర ఓస్నాబుక్ సమీపంలోని ముయెన్‌స్టర్‌కు తరలించేందుకు జర్మనీ విమానంలో "ఫ్లయింగ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు" గా పిలిచే ఆరు పడకల ఐసీయూని ఏర్పాటు చేసింది.
(చదవండి: 13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్ టాటా ఆవేదన)
అయితే ఈ విధంగా జర్మనీ విమానాలను వినియోగించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో బెర్లిన్ ఈ కొత్త కరోనా వేరియంట్‌ని గుర్తించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాను కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రాంతంగా ప్రకటించనుందని జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పైగా జర్మనీ దేశం దక్షిణాఫ్రికా నుండి జర్మనులు జర్మనీకి రావడానికి మాత్రమే విమానాలు అనుమతిస్తామని, పైగా వ్యాక్సిన్‌లు తీసుకున్నవారితో సహా అందరూ 14 రోజులు క్యారంటైన్‌లో ఉండాలని సూచించింది.
అంతేకాదు ఈ కొత్త వైరంట్‌ని బి.1.1.529 పిలుస్తారని, ఇది యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగల సామర్థ్యం గలదని దక్షిణాఫ్రికా శాస్రవేత్తలు ప్రకటించని సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్తగా గుర్తించిన ఈ వేరియంట్ మరిన్ని సమస్యలను సృష్టింస్తుందన్న ఆందోళనతోనే తాము ముందుగానే తగు చర్యలు తీసుకుంటున్నామని జర్మనీ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ చెప్పారు.
(చదవండి: ఒక్క యాక్సిడెంట్!...ఆరు కార్లు ధ్వంసం !: షాకింగ్ వైరల్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment