రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రజలను మాములుగా హడలెత్తించలేదు. అది పెట్టిన భయం అంత ఇంత కాదు. అప్పటికే ఆల్ఫా, డెల్టా అంటూ పలు రకాల వేరియంట్లుగా కరోనా వైరస్ మార్పు చెందుతూ ప్రభావం చూపించింది. తగ్గుముఖం పడుతుందనే లోపు మరో వేరియంట్ ఓమిక్రాన్ రూపంలో సెకండ్ కరోనా వేవ్‌తో ఎంతలా భయబ్రాంతులకు గురించేసిందో తెలిసిందే. ఎటూ చూసిన ఆస్పత్రులన్నీ మరణ మృదంగంతో మారు మ్రోగిపోయాయి. క్రమేణ ప్రజలు ఈ మహమ్మారికి అలవాటు పడిపోయి పట్టించుకోవడం వదిలేశారు. ఆ తర్వాత ఆ మహమ్మారి కూడా కనిపించనంత స్థాయిలో మాయం అయ్యింది కూడా. హమ్మాయా! అనుకునేలోపే మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 హడలెత్తిస్తోంది. ఒకటో రెండో కేసులే కదా అనకుంటే పెరుగుతున్న కేసుల ఉధృతి మళ్లీ ఇది వరకటి పరిస్థితికే చేరుకుంటామా? అని గుబులు తెప్పించేస్తుంది. ఇప్పటికే నిపుణుల భయపడొద్దని సూచిస్తూ మరోవూపు మాస్క్‌లు సామాజిక దూరం అని చెబుతుంటే మళ్లీ టెన్షన్.. టెన్షనే..అని భయాందోళనకు గురవ్వుతున్నారు. దీని గురించి మరో బూస్టర్ తీసుకోవాలా అని ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే వైద్యులు ఏమంటున్నారంటే..
ఈ కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పర్యాటక రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే గత నాలుగు రోజుల నుంచి అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో విజయవంతంగా వ్యాక్సినేషన్‌లు వేశారు. 95% మంది తొలి రెండు షాట్‌ల వ్యాక్సిన్ తీసుకోగా, సుమారు 25% మంది బూస్టర్ డోస్‌లను కూడా వేయించుకున్నారు. మరీ ఇప్పుడూ ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మళ్లీ బూస్టర్ డోస్‌లాంటిది ఏదైనా వేయించుకుంటే మంచిదా? అని పలువురిని వేధిస్తున్న సందేహం.
అయితే నిపుణులు 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి ఉన్నవారు వైద్యులను సంప్రదించి గానీ మరో బూస్టర్ తీసుకోవద్దదని సూచిస్తున్నారు. అంటువ్యాధులు ఉన్న ప్రాంత్లాల్లో ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తలు పాటించమని చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్‌లో ఉండటం వంటివి చేయాలని సూచించారు.
మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనా..?
ఐతే గతంలో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వచ్చిన వారుఉన్నారని అన్నారు నిపుణులు. అలాగే రెండు సార్లు కరోనాని ఫేస్ చేసిన వారకు కూడా ఉన్నారు. అయితే వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు కాబట్టి ప్రమాదం అంత తీవ్రంగా లేదు, పైగా సులభంగా బయటపడగలిగారు. ఈ కొత్త వేరియంట్ జేఎన్.1 దగ్గరకొచ్చేటప్పటికీ.. రోగుల్లో న్యూమోనియా వంటి లక్షణాలతో కొద్దిపాటి శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అవికూడా తేలికపాటి లక్షణాలే అని ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు నిపుణులు. జస్ట్ నాలుగైదు రోజుల్లో నయం అయిపోతుంది.
అలా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. అప్రమత్తంగా ఉండండి, లక్షణాలు కనిపిస్తే ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి, వ్యాప్తి చెందకుండా చూసుకోండి అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది కాస్త ప్రమాదకారి కావొచ్చు కాబట్టి వ్యాధినిరోధకతను పెంచుకునేలా మంచి ఆహారం తీసుకుని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించండి. ఇప్పటి వరకు సరిగా వ్యాక్సిన్ వేసుకోకపోయినా లేదా ఒక్కటే వ్యాక్సిన్ తీసుకున్నా..అలాంటి వారు మాత్రమే వీలైతే బూస్టర్‌డోస్ లేదు రెండు వ్యాక్సిన్ షాట్‌లను తీసుకోమని సూచిస్తున్నారు వైద్యులు. ఐతే కొద్దిమంది ఆరోగ నిపుణులు మాత్రం ఈ దశలో అదనపు వ్యాక్సిన్ డోస్‌లను సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయ పడుతున్నారు.
మళ్లీ వేయించుకుంటే మంచిదేనా..?
అసలు మళ్లీ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదా కాదా అనే దిశగా పరిశోధన చేయడం కూడా మంచిదేనని అభిప్రాయపడ్డారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్‌లు వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆ కొత్త వేరియంట్‌ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలం. కొత్త వేరియంట్‌లకు తగ్గట్టుగా ఏదైనా బూస్టర్ డోస్ ఇవ్వడం మంచిదా? కాదనే దానిపై పరిశోధన చేయడం అవసరమని అంగీకరించారు పరిశోధకులు. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న రోగులకు ఈ పరిశోధన బాగా ఉపయోగపడే అవకాశం ఉందన్నారు.
(చదవండి: ఢిల్లీ సీఎం ప్రతి ఏడాది చేసే విపాసన ధ్యానం అంటే ఏంటీ..? ఎందుకు చేస్తారు?)
Comments
Please login to add a commentAdd a comment