కరోనా నిరోధకానికి హోమియో మందులు! | Homeo Medicines To Prevent Corona New Variant JN1 | Sakshi
Sakshi News home page

కరోనా నిరోధకానికి హోమియో మందులు!

Published Fri, Dec 22 2023 9:51 AM | Last Updated on Fri, Dec 22 2023 9:51 AM

Homeo Medicines To Prevent Corona New Variant JN1 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా జెఎన్‌1 వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి బారిన పడకుండా రెండు హోమియో ఔషధాలు వాడి ఎవరికి వారు రక్షించుకోవచ్చని ప్రముఖ హోమియో వైద్యులు డా. అంబటి సురేంద్ర రాజు ‘సాక్షి’కి తెలిపారు. అర్సెనిక్‌ ఆల్బం 30 (Arsenic Album 30)ను వరుసగా 3 రోజులు, ఇన్‌ఫ్లుయెంజినమ్‌ 30 (Influenzinum 30)ను వరుసగా 3 రోజులు వాడాలి. ఉదయం 7 గంటలకు పరగడుపున నాలుకపై ఒకటి లేదా రెండు చుక్కలు వేసుకుంటే చాలు.

ఇలా ఒకొక్క మందును వరుసగా 3 రోజులు, రోజుకు ఒకసారి మాత్రమే.. మొత్తం వరుసగా 6 రోజులు వాడాలి. ప్రామాణిక జర్మనీ కంపెనీ మదర్‌ టింక్చర్‌లు వాడితే ఫలితం బాగుంటుందని డా. సురేంద్ర రాజు వివరించారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఈ మందులు ఒక విడత వాడితే రోగనిరోధక శక్తి ఇనుమడించి సురక్షితంగా జీవించ వచ్చన్నారు.

(చదవండి: కరోనా కొత్త వేరియంట్‌ కేసుల ఉధృతి!..మరో బూస్టర్‌ షాట్‌ అవసరమా..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement