
సాక్షి ప్రతినిధి, చెన్నై: సార్వభౌమత్వ రక్షణకు భారత్ అన్ని శక్తులు ఉపయోగిం చుకుంటుందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా సులుర్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో సోమవారం అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని జవాన్లనుద్దేశించి ప్రసంగించారు. ‘భారత్ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. భారత వైమానిక దళాన్ని మరింత ఆధునీకరిస్తున్నాం. 1975 నుంచి హెలికాఫ్టర్‌లో మహిళా పైలట్లు తమ దక్షతను చాటుకుంటున్నారు. 2016 నుంచి యుద్ధ విమానాల్లో సైతం మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నపుడు వైమానిక దళాల సేవలు వెలకట్టలేనివి’ అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment