sovereignty
-
Delhi liquor scam: అమెరికా జోక్యంపై అభ్యంతరం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది దేశ అంతర్గత, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని స్పష్టంచేసింది. బుధవారం ఢిల్లీలో అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన అసంతృప్తిని తెలియజేసింది. భారత్‌లో అమెరికా మహిళా దౌత్యవేత్త, యాక్టింగ్ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీచేసింది. దీంతో బుధవారం ఆమె ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. విదేశాంగ శాఖ అధికారులతో దాదాపు 30 నిమిషాలు సమావేశమయ్యారు. ‘స్వేచ్ఛగా, పారదర్శకంగా, వేగవంతంగా, చట్టపరంగా న్యాయం పొందే అర్హత సీఎం కేజ్రీవాల్‌కు ఉంది’ అని మంగళవారం అమెరికా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. భారత న్యాయప్రక్రియపై అమెరికా వ్యాఖ్యలను తప్పుబడుతూ భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘దౌత్య సంబంధాలకు సంబంధించి దేశాలు తోటి దేశాల సార్వభౌమత్వం, అంతర్గత వ్యవహారాలకు గౌరవం ఇవ్వాలి. తోటి ప్రజాస్వామ్య దేశాల పట్ల ఇదే బాధ్యతతో మెలగాలి. బాధ్యత విస్మరిస్తే బాగుండదు. భారత్‌లో న్యాయవ్యవస్థ స్వతంత్రమైంది. సత్వర న్యాయమే దాని అంతిమ లక్ష్యం. దానిపై ఇతరుల అభిప్రాయాలు అవాంఛనీయం’’ అని ఆ ప్రకటనలో భారత్ తన అసంతృప్తిని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై వ్యాఖ్యలు చేసిన జర్మనీ దౌత్యవేత్త, డెప్యూటీ చీఫ్ మిషన్‌కు ఇటీవల భారత్ సమన్లు జారీచేసిన నేపథ్యంలో మళ్లీ అలాంటి ఘటనే జరగడం గమనార్హం. -
Renaming Arunachal Areas: తీరు మార్చుకోని చైనా!
అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రదేశాల పేర్లు మార్చడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే చైనా తన తీరు మార్చుకోకపోగా ఆ ప్రాంతం మా సార్వభౌమాధికారం అని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగో మాట్లాడుతూ..జాంగ్నాన్(అరుణాచల్‌ప్రదేశ్) చైనా భూభాగంలో భాగం. ఆ భౌగోళిక పేర్లనను తమ స్టేట్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగానే చైనా అధికారులు ప్రమాణీకరించారని కరాఖండీగా చెప్పింది. ఇది చైనా సార్వభౌమ హక్కుల పరిధిలో ఉందని వాదిస్తోంది. కాగా. చైనా పౌరవ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేర్లను పెట్టి..జాగ్నాన్ పేరుతో టిబెట్‌లో భాగమని ప్రకటించింది. దీనికి భారత్ ఘాటుగా బుదలివ్వడమే గాక ఆ పేర్లన్నింటిని తిరస్కరించింది. ఈ మేరకు భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి కూడా అరుణాచల్‌ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని నొక్కి చెప్పారు. చైనా ఇలా చేయడం తొలిసారి కాదు, ఇలాంటి దుశ్చర్యలు ఎన్ని చేసినా వాస్తవాన్ని మార్చలేదని బాగ్చి అన్నారు. (చదవండి: పేర్లు మార్చేసి చైనా దుశ్చర్య.. భారత్ ఘాటు బదులు) -
Lidia Thorpe: పిడికిలి ఎత్తి.. రాణిగారి పరువు తీసింది!
వందేళ్ల బ్రిటిష్ వలసపాలనలో.. చాలా దేశాల వలే ఎన్నో ఘోరమైన గాయాలను ఓర్చుకుంది ఆ దేశం. విముక్తి కోసం వేల మంది వీరుల త్యాగాలతో రక్తపుటేరు ప్రవహించింది ఆ గడ్డపై. ఫలితంగా పేరుకు స్వాతంత్రం వచ్చినా.. గణతంత్రంగా మారే అవకాశం ఇంకా దక్కలేదు వాళ్లకు. అందుకే నిరసన గళాన్ని వినిపించేందుకు తన ప్రమాణ కార్యక్రమానికి వేదికగా చేసుకుంది ఆస్ట్రేలియా సెనేటర్ లిడియా థోర్ప్. విక్టోరియా ప్రావిన్స్ నుంచి ఆస్ట్రేలియన్ గ్రీన్స్ పార్టీ తరపున సెనేటర్‌గా ఎన్నికైంది లిడియా థోర్ప్(48). చట్ట సభకు ఎంపికైన అబ్ఒరిజినల్ ఆస్ట్రేలియన్‌గానూ ఆమె మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. సోమవారం చట్టసభ్యురాలిగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంది. వాస్తవానికి గత వారం నూతన సెనేటర్లు అందరూ ప్రమాణం చేయగా.. ఈమె మాత్రం కార్యక్రమానికి డుమ్మా కొట్టింది. దీంతో సోమవారం ఆమె ఒక్కరితోనే ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణ సమయంలో చదవాల్సిన ప్రింటెడ్ కార్డును ముందు ఉంచి లిడియా.. ‘సార్వభౌమాధికారం’ అని కాకుండా.. ‘వలసదారు’ అంటూ క్వీన్ ఎలిజబెత్ 2ను సంభోధించింది. దీంతో సభలో ఉన్న తోటి చట్టసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నది మాత్రమే చదవాలని, లేకుంటే ప్రమాణం చెల్లదని ఆమెకు సూచించారు. అయితే ఆమె మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ఓ చూపు చూసింది. ఈలోపు లేబర్ పార్టీ సభ్యురాలు, చాంబర్ ప్రెసిడెంట్ సూ లైన్స్ జోక్యం చేసుకుని.. ప్రమాణం మళ్లీ చేయాలని, ప్రింటెడ్ కార్డు మీద ఏం ఉంటే అదే చదవాలని కోరింది. దీంతో ఈసారి అన్యమనస్కంగా, కాస్త వెటకారం ప్రదర్శిస్తూ ప్రమాణం చేసిందామె. ఈ ఘటన వీడియో ద్వారా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. క్వీన్ ఎలిజబెత్-2ను సెనేటర్ లిడియా థోర్ప్ ఘోరంగా అవమానించిందన్నది పలువురి వాదన. అయితే ఆమె మాత్రం తన చేష్టలను సమర్థించుకుంటోంది. అంతేకాదు మిగతా చట్ట సభ్యులకు లేని దమ్ము ఆమెకు మాత్రమే ఉందంటూ పలువురు పౌరులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. Lidia Thorpe, a Djab Wurrung and Gunnai Gunditjmara senator with Australia's Green Party, called the country's symbolic head of state, Queen Elizabeth II, a colonizer while taking her oath of office pic.twitter.com/phS9lUcsDp— NowThis (@nowthisnews) August 2, 2022 క్వీన్ఎలిజబెత్-2 తమకు సార్వభౌమాధికారం ఎప్పుడూ ఇవ్వలేదని, అందుకే తాను ఆ పదం వాడలేదని స్పష్టం చేసింది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా రాజరికానికి కట్టుబడి ఉండడం ఆస్ట్రేలియా ప్రజలు చేసుకున్న ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని చెప్తోంది ఆమె. ► వందేళ్ల బ్రిటిష్ వలసపాలనలో.. వేల మంది అబ్ఒరిజినల్(అక్కడి తెగలు) ఆస్ట్రేలియన్లను దారుణంగా హతమార్చారు. చాలావరకు తెగలను వేరే చోటుకు బలవంతంగా వెల్లగొట్టారు. ► 1901లో ఆస్ట్రేలియాకు స్వాతంత్రం ప్రకటించారు. కానీ, పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోకపోవడంతో టెక్నికల్‌గా ఇంకా బ్రిటన్ రాజరికం కిందే ఉన్నట్లయ్యింది. ఆస్ట్రేలియాకు రాణిగా ఎలిజబెత్-2 కొనసాగుతున్నారు. ► 1999లో రాణి సర్వాధికారాలను తొలగించాలంటూ ఆస్ట్రేలియన్ పౌరులు ఓటేశారు. ఆ సమయంలో తొలగింపు హక్కు చట్ట సభ్యులకు ఉంటుందని, ప్రజలకు ఉండదనే చర్చ నడిచింది. ► ప్రజలంతా తమ దేశం రిపబ్లిక్‌గానే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, రాజ్యాధినేతను ఎలా ఎన్నుకోవడం అనే విషయంలోనే అసలు సమస్య తలెత్తుతోంది. ► మొన్నటి ఎన్నికల్లో ఆంటోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ‘మినిస్టర్ ఆఫ్ రిపబ్లిక్’గా ఆయన ప్రకటించుకున్నారు. ► అయితే రాజరికపు ఆస్ట్రేలియా.. పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యంగా మారేందుకు మరో రెఫరెండమ్ జరగాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. -
BRICS SUMMIT: సార్వభౌమత్వాన్ని గౌరవించుకుందాం
న్యూఢిల్లీ: అన్ని దేశాలు సార్వభౌమత్వాన్ని, సమగ్రతను గౌరవించుకోవాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) పిలుపునిచ్చాయి. ఉక్రెయిన్ సంక్షోభం, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు తదితర అంశాలను చర్చించిన బ్రిక్స్ దేశాల నేతలు ఆయా సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని నొక్కిచెప్పారు. చైనా అధ్యక్షతన జరిగిన ఐదు దేశాల వర్చువల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. యుద్ధం కారణంగా తలెత్తిన మానవీయ సంక్షోభానికి రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలే పరిష్కారమంది. ఈ విషయంలో ఐరాస, రెడ్ క్రాస్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది. సీమాంతర ఉగ్రవాదం సహా అన్ని రకాలైన ఉగ్రవాదంపై పోరాటానికి కట్టుబడి ఉంటామని తీర్మానించింది. అంతకుముందు ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఇంకా తొలిగిపోలేదని, దీని నుంచి బయటపడేందుకు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం సహాయకారిగా ఉంటుందని చెప్పారు. ‘‘కరోనా మహమ్మారి నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ వరుసగా మూడో ఏడాది మనం సమావేశమయ్యాం. ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ముప్పు తగ్గినప్పటికీ, దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక రంగంపై ఇప్పటికీ కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక రంగం విషయంలో బ్రిక్స్ సభ్య దేశాలు ఒకే రకమైన వైఖరి కలిగి ఉన్నాయి. ఆర్థికంగా తిరిగి పుంజుకునేందుకు మనం పరస్పరం సహకరించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది’’అని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. బ్రిక్స్‌ను కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రసంగించారు. ఏకపకంగా కొందరు విధించే ఆంక్షలను, చిన్న కూటముల ఏర్పాటుకు సాగే ప్రయత్నాలను వ్యతిరేంచాలని పిలుపునిచ్చారు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి విధానాలు, ఆధిపత్య ధోరణులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘కొన్ని దేశాలు సైనిక కూటములను విస్తరించుకునేందుకు, ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆధిపత్యం సాధించుకునే క్రమంలో ఇతర దేశాల హక్కులు, ప్రయోజనాలను కాలరాస్తున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిని ఉపేక్షిస్తే మరింత అస్థిర పరిస్థితులు ఏర్పడతాయి’’అని పరోక్షంగా ఆయన అమెరికా, ఈయూలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా, ఈయూల నాటో విస్తరణ కాంక్షే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మూల కారణమన్నారు. భేటీలో మోదీ, జిన్‌పింగ్‌లతోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో 41%, జీడీపీలో 24%, వాణిజ్యంలో 16% బ్రిక్స్‌లోని ఐదు దేశాలదే. -
Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్ గురించి తెలుసా?
పంజ్‌షీర్.. కొద్ది రోజులుగా ఈ పేరు అంతర్జాతీయంగా మారు మోగుతోంది. చుట్టూ పర్వతాలే కోట గోడలా రక్షణనిస్తున్న ఆ లోయవైపు ఇన్నాళ్లూ ఎవరూ కన్నెత్తి కూడా చూడలేకపోయారు. ఇప్పుడు తాలిబన్లు ఆ లోయపై పట్టు బిగించాలని చూస్తూ ఉంటే మరోవైపు తాలిబన్ వ్యతిరేక శక్తులు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఎందుకీ లోయపై తాలిబన్లకు అంత మక్కువ? అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌కు ఈశాన్యంగా 150 కి.మీ. దూరంలో హిందుకుష్ పర్వత సానువుల్లో పంజ్‌షీర్ లోయ ఉంది. దీనిని అయిదు సింహాల లోయ అని కూడా పిలుస్తారు. ఈ లోయకి ఆ పర్వతాలే రక్షణ కవచాల్లా నిలుస్తాయి. ఈ లోయలోకి వెళ్లాలంటే పంజ్‌షీర్ నది వల్ల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక ఇరుకైన రహదారి మాత్రమే మార్గం. అందుకే అక్కడి స్థానికులకు ఈ లోయను కాపాడుకోవడం అత్యంత సులభంగా మారింది. భౌగోళికంగా చూస్తే అఫ్గాన్‌తో సంబంధం లేనట్టుగానే ఉంటుంది కానీ దేశంలో ఉన్న 34 ప్రావిన్స్‌లలో పంజ్‌షీర్ కూడా ఒకటి. చారిత్రకంగా చూస్తే పలుమార్లు నిర్ణయాత్మక పాత్రని పోషించింది. మొదట్నుంచి ఎవరికీ తలవంచకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈ లోయపై ఆధిపత్యం సాధించడానికి తాలిబన్లు ఈసారి తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. పోరాటాల గడ్డ పంజ్‌షీర్ అంటే అహ్మద్ షా మసూద్ గురించి చెప్పుకోవాలి. 1953 సంవత్సరంలో ఈ లోయలో జన్మించిన మసూద్ తనకంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇస్లాం మత శక్తులతో తనలో చివరి ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూ వచ్చారు. పంజ్‌షీర్ లోయ స్వతంత్రతని కాపాడారు. 1980 దశకంలో అఫ్గాన్‌ను సోవియెట్ యూనియన్ దురాక్రమణ చేసినప్పుడు, 1990 నాటి అంతర్యుద్ధం సమయంలో, తాలిబన్లు దేశాన్ని పాలించిన 1996–2001 మధ్య కాలంలో కానీ ఈ లోయ ఎప్పుడూ ఎవరి వశం కాలేదంటే మసూద్ పోరాట పటిమే కారణం. ఆ లోయలో లక్షా 50 వేల మంది వరకు నివసిస్తారు. వారంతా తాజిక్ తెగకు చెందిన వారు. మరోవైపు పాస్తూన్ తెగ వారు ఎక్కువగా తాలిబన్ ముఠాలో చేరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మçసూద్ శక్తియుక్తులతో వారు ఆ లోయవైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. పంజ్‌షీర్ లోయతో పాటు చైనా, తజికిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య పాకిస్తాన్ వరకు ఆయన ప్రభావమే ఉండేది. మసూద్‌కి సంప్రదాయ ఇస్లామ్ భావాలు ఉన్నప్పటికీ సమాజంలో మహిళలకు సమాన స్థానం ఇవ్వాలని ఆరాటపడేవారు. అయితే మసూద్ గ్రూప్ సభ్యులే ఎక్కువగా మానహక్కుల్ని హరించారన్న విమర్శలు ఉన్నాయి. 2001లో మసూద్‌ని అల్‌ఖాయిదా ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ లోయను నడిపిస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా మొహమ్మద్‌లు కూడా ఆయనకు సహకరిస్తూ లోయను కాపాడుతున్నారు. పచ్చల లోయ ఈ లోయలో ఎక్కువగా ఎమరాల్డ్ (పచ్చలు) లభిస్తాయి. ఇప్పటివరకు ఇంకా తవ్వకం చేపట్టని ఎన్నో పచ్చల గనులు ఉన్నాయి. అవే ఈ ప్రాంతానికి ప్రధాన ఆదాయ వనరు. అమెరికా నాటో దళాలు స్వాదీనంలో అఫ్గాన్ ఉన్నప్పుడు ఈ లోయలో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. అఫ్గాన్‌లో ఇంధనానికి ఒక హబ్‌గా మారింది. ఎన్నో జలవిద్యుత్ ఆనకట్టల్ని ఈ లోయలో నిర్మించారు. విద్యుత్‌లో స్వయంసమృద్ధిని సాధించిన ప్రాంతం ఇదొక్కటే. పచ్చల గనులతో ఆర్థికంగా పటిష్టంగా ఉండడంతో తాలిబన్లు ఈ లోయని ఆక్రమించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. పంజ్‌షీర్‌కు ఎదురయ్యే సవాళ్లేంటి ? పంజ్‌షీర్‌లో పచ్చలు, వెండి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆహారం, వైద్యం అవసరాల కోసం అఫ్గాన్‌లో ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పదు. ప్రస్తుతం ఈ లోయ చుట్టూ తాలిబన్లు తమ కమాండర్లను మోహరించారు. ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల సరఫరా నిలిపివేశారు. అయితే ఆ లోయలో వచ్చే చలికాలం వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరించే ఆ లోయ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా కనిపిస్తోంది. పంజ్‌షీర్‌పై పూటకొక రకమైన వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు
తిమ్మాపూర్: ఎన్నికల్లో గెలవడం కోస మే నాయకులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో పర్యటించారు. సర్పంచ్ మేడి అంజ య్యతో కలిసి గ్రామంలో పేదల జీవన శైలి గురించి తెలుసుకున్నారు. అనంత రం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూ రంలో ఉన్న మన్నెంపల్లి ప్రజలు ఇంకా పేదరికంలో మగ్గడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తులకు లక్షల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న పాలకులు వాటిని క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని కోరారు. వెనుకబడిన, బడుగు, బలహీ న వర్గాల అభివృద్ధి, రాజ్యాధికారమే ల క్ష్యంగా తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. అందరి బతుకులు మార్చాలనే లక్ష్యం తో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అందుకే మ న్నెంపల్లిని సందర్శించానన్నారు. ఉప ఎన్నికలో ఓట్ల కోసం వందల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద, బడుగు, బలహీన వర్గాల విద్య, ఉపాధికోసం ఖర్చు చేస్తే వారి జీవితా లు బాగుపడతాయని పేర్కొన్నారు. -
సార్వభౌమత్వ రక్షణకు సత్తా చాటుతాం
సాక్షి ప్రతినిధి, చెన్నై: సార్వభౌమత్వ రక్షణకు భారత్ అన్ని శక్తులు ఉపయోగిం చుకుంటుందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా సులుర్లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో సోమవారం అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని జవాన్లనుద్దేశించి ప్రసంగించారు. ‘భారత్ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. భారత వైమానిక దళాన్ని మరింత ఆధునీకరిస్తున్నాం. 1975 నుంచి హెలికాఫ్టర్‌లో మహిళా పైలట్లు తమ దక్షతను చాటుకుంటున్నారు. 2016 నుంచి యుద్ధ విమానాల్లో సైతం మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నపుడు వైమానిక దళాల సేవలు వెలకట్టలేనివి’ అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. -
భారత్ శాంతికాముక దేశమే కానీ..
జలంధర్: భారత్ శాంతికాముక దేశమని, అయితే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో మాత్రం వెనకడుగు వేయబోదని, సత్తా చూపిస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. వైమానిక దళాలు పరిస్థితులకు అనుగుణంగా జాగరూకతతో వ్యవహరిస్తున్నా యని కొనియాడారు. పంజాబ్‌లోని అదమ్‌పూర్‌లో భారత వైమానిక దళానికి చెందిన 223 స్వాడ్రన్, 117 హెలికాప్టర్ యూనిట్‌కు ప్రెసిడెంట్స్ స్టాండర్డ్స్ ప్రదానం చేసే కార్యక్ర మంలో రాష్ట్రపతి మాట్లాడారు. అంతర్జాతీయంగా అనేక రంగాల్లో దూసుకెళ్తున్న భారత్.. సాయుధ దళాల శక్తి, సామర్థ్యాల విషయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. సాయుధ దళాలు దేశ రక్షణలో నిమగ్నమై ఉన్నాయన్న ధైర్యంతోనే ప్రజలు నిశ్చింతగా నిదురిస్తున్నారని పేర్కొన్నారు. తర్వాత అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని రాష్ట్రపతి సందర్శించారు. -
పాకిస్తాన్‌ను వెనుకేసుకొచ్చిన చైనా!
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గౌరవించాలని చైనా పేర్కొంది. ఇటీవల పాకిస్తాన్ భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో తాలిబాన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ మృతి చెందిన విషయం తెలిసిందే. తమ భూభాగంలో అమెరికా డ్రోన్ దాడులకు పాల్పడటాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ విషయమై శుక్రవారం చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి హోంగ్ లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాద నిర్మూలనకు ఎంతగానో కృషి చేస్తున్న పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ప్రపంచదేశాలు గౌరవించాలని పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, యూఎస్‌లతో కూడిన క్వాడ్రీలేటరల్ కొ ఆర్డినేషన్ గ్రూప్(క్యూసీజీ).. ఆప్ఘనిస్తాన్ పునరుద్దరణ లక్ష్యంతో పనిచేస్తుందని, ఈ విషయంలో ఉమ్మడి ప్రయత్నాలు జరగాలని ఆయన పేర్కొన్నారు. డ్రోన్ దాడిలో మృతి చెందింది ఓ పాకిస్తాన్ డ్రైవర్‌గా పేర్కొంన్న హోంగ్ లీ.. అమెరికా డ్రోన్ దాడిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు.