తిమ్మాపూర్: ఎన్నికల్లో గెలవడం కోస మే నాయకులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో పర్యటించారు. సర్పంచ్ మేడి అంజ య్యతో కలిసి గ్రామంలో పేదల జీవన శైలి గురించి తెలుసుకున్నారు. అనంత రం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూ రంలో ఉన్న మన్నెంపల్లి ప్రజలు ఇంకా పేదరికంలో మగ్గడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
కుల వృత్తులకు లక్షల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న పాలకులు వాటిని క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని కోరారు. వెనుకబడిన, బడుగు, బలహీ న వర్గాల అభివృద్ధి, రాజ్యాధికారమే ల క్ష్యంగా తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. అందరి బతుకులు మార్చాలనే లక్ష్యం తో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అందుకే మ న్నెంపల్లిని సందర్శించానన్నారు. ఉప ఎన్నికలో ఓట్ల కోసం వందల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద, బడుగు, బలహీన వర్గాల విద్య, ఉపాధికోసం ఖర్చు చేస్తే వారి జీవితా లు బాగుపడతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment