spending money
-
జనరేషన్ జెడ్.. ఖర్చులో జెట్ స్పీడు
సాక్షి, అమరావతి: తరాలు మారుతున్నకొద్దీ అలవాట్లు, అభిరుచులు, అవసరాలు మారిపోతుంటాయి. కొత్త తరం కొంగొత్త ఆశలతో ముందుకు సాగిపోతుంటుంది. సమాజంలో వేగంగా వస్తున్న మార్పులు, అవకాశాలను అంతే వేగంతో అందిపుచ్చుకుంటుంది. ఆదాయమూ పెరుగుతోంది. చేతిలో డబ్బు ఆడుతున్నకొద్దీ పెట్టే ఖర్చూ పెరుగుతుంది. ఇప్పుడు ‘జనరేషన్ –జెడ్’ చేస్తున్న పని కూడా ఇదే. ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్.. ఇలా అన్ని రంగాల్లోనూ వీరు పెడుతున్న ఖర్చు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఖర్చు పెట్టడంలో ‘జెడ్’ తరాన్ని మించిన వారు లేరని అంతర్జాతీయ సంస్థలైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ), స్నాప్‌చాట్ షోస్ చెబుతున్నాయి. ఖర్చు చేయడంలో మిలీనియల్స్ జనరేషన్ (1981–96 మధ్య పుట్టిన వారు)ను దాటుకొని జెనరేషన్–జెడ్ (1997–2012 మధ్య పుట్టిన వారు) దూసుకుపోతున్నట్లు ఈ సంస్థల సంయుక్త అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం భారత దేశ ప్రజలు ఏటా పెడుతున్న ఖర్చులో 43 శాతం జనరేషన్–జెడ్‌దే అని, వచ్చే పదేళ్లల్లో వీరు ఖర్చు 50 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జనరేషన్–జెడ్ ఏటా చేస్తున్న ఖర్చు అక్షరాలా రూ.74,70,000 కోట్లు. ఇది 2035 నాటికి రూ.1,66,00,000 కోట్లకు చేరుతుందని ఆ సర్వే అంచనా వేసింది. స్నాక్స్ నుంచి సెడాన్ కార్ల వరకు దేశ ప్రజలు పెడుతున్న ఖర్చులో ప్రతి రెండో రూపాయి జనరేషన్–జెడ్ నుంచే వస్తోంది. ప్రస్తుతం దేశ జనాభాలో 1997–2012 మధ్య పుట్టిన ‘జెడ్’ తరం జనాభా 37.7 కోట్లు. అమెరికా మొత్తం జనాభా కంటే మన దేశంలో వీరి సంఖ్యే ఎక్కువ. ప్రస్తుతం జనరేషన్ ‘జెడ్’లో 25 శాతం మంది (ప్రతి నలుగురిలో ఒకరు) మాత్రమే సంపాదించడం మొదలు పెట్టారని, ఇది 2035 నాటికి 47 శాతానికి (దాదాపు సగం మంది) చేరుతుందని సర్వే అంచనా వేసింది.విహారయాత్రలకే పెద్దపీట జెడ్–జనరేషన్ ప్రయాణాలు, విహారయాత్రలకే అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లు సర్వే తెలిపింది. ఈ ఏడాది (2024 సంవత్సరం)లో విహార యాత్రల కోసం వీరు చేసే ఖర్చు రూ.6,62,500 కోట్ల నుంచి రూ.6,64,000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ట్రావెల్స్ సంస్థలు వీరికి ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా ఫ్యాషన్ –లైఫ్‌స్టైల్ వస్తువుల కొనుగోలుకు ఖర్చు పెడుతున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ పానియాలతో పాటు రెస్టారెంట్లకూ వీరు భారీగానే ఆదాయాన్ని అందిస్తున్నట్లు సర్వేలో తేలింది. స్పష్టంగా చెప్పాలంటే.. ‘జెడ్’ తరానికి వంట చేయడమంటే మహా చిరాకు.సింపుల్‌గా ప్యాకేజ్డ్ ఫుడ్ లేదా బయట నుంచి తెప్పించుకొని ఆరగించడమే ఇష్టం. ఇలా వీరు ప్యాకేజ్డ్∙ఫుడ్ కోసం రూ.2,90,500 కోట్లు, ఆహారం కోసం రెస్టారెంట్లకు మరో రూ.2,90,500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు బీసీజీ సర్వే పేర్కొంది. ఏమిటీ జనరేషన్లు..అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఒక జనరేషన్ అంటే 16 సంవత్సరాల కాలం. దీని ప్రకారం 1981–96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌గా పేర్కొన్నారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ –జెడ్‌గా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి జన్మింస్తున్న వారు ఆల్ఫా జనరేషన్గా పరిగణిస్తున్నారు. ఈ తరాల మధ్య అంతరాలను అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు అంచనా వేస్తుంటాయి. అందులో భాగంగానే బీసీజీ, స్నాప్ చాట్ షో సంస్థలు జనరేషన్–జెడ్ పై అధ్యయనం చేసి, వారి ఖర్చులపై నివేదిక ఇచ్చాయి. -
‘జెన్-జీ’తో రూ.1,500 లక్షల కోట్ల వ్యాపార అవకాశం!
భారత్‌లో జెన్-జీ((1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) తరం 2035 నాటికి సుమారు 1.8 ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు) కొనుగోలు శక్తిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 37.7 కోట్ల వరకు జెన్-జీ యువత ఉంది. భవిష్యత్తులో భారత ఎకానమీకి వీరు ఎంతో సహకారం అందిస్తారు. ఈ తరం ఆసక్తులు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, విక్రయ సరళి..వంటి అంశాలను విశ్లేషిస్తూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ), స్నాప్ ఇంక్ సంస్థలు సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి.నివేదికలో వివరాల ప్రకారం..జెన్-జీ తరం మార్కెట్‌ను ప్రభావితం చేయడమే కాదు, కొత్త ట్రెండ్‌ను నిర్మిస్తుంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం వినియోగంలో దాదాపు 43 శాతం జెన్-జీదే కావడం విశేషం. ఇది దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)కు చేరుకుంది.విభిన్న రంగాల్లో జెన్‌జీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పాదరక్షల పరిశ్రమలో 50 శాతం, డైనింగ్-48 శాతం, ఎంటర్టైన్మెంట్ 48 శాతం, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్‌పై 47 శాతం కొనుగోళ్లను ఈ తరం ప్రభావితం చేస్తోంది.2035 నాటికి వీరి వినిమయశక్తి సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల(రూ.1,500 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా.ఇప్పటికే ఈ తరం దాదాపు 860 బిలియన్ డాలర్ల(రూ.72 లక్షల కోట్లు)ను ఖర్చు చేస్తోంది. అందులో తాము నేరుగా ఎంచుకున్న వస్తువుల కోసం 200 బిలియన్ డాలర్లు(రూ.17 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వివిధ మాధ్యమాలు, ఇతర వ్యక్తుల ప్రభావం వల్ల మరో 600 బిలియన్ డాలర్ల(రూ.50 లక్షల కోట్లు) వెచ్చిస్తున్నారు.దాదాపు 70 శాతం జెన్-జీ యువత తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు..వంటి వారితో ఆర్థిక పరమైన వివరాలు పంచుకుంటూ తమ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఏం కొనాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏ కంటెంట్‌ని చూడాలి, ఎలాంటి వస్తువులు ఎంపిక చేసుకోవాలి వంటి వివరాల కోసం ఇతరుల సలహా కోరుతున్నారు.దాదాపు 80 శాతం మంది తమ భావాలు ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా సామాజిక మధ్యమాల్లో చిత్రాలు, జిఫ్‌లను, ఇమోజీలు వినియోగిస్తున్నారు.77 శాతం మంది తమ ముందు తరం కంటే మరింత సమర్థంగా షాపింగ్ చేసేందుకు వీలుగా ‘షాప్షియలైజింగ్(సామాజిక మధ్యమాల ప్రభావంతో షాపింగ్ చేయడం)’ ట్రెండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ(వస్తువులు కొనడానికి ముందే వర్చువల్‌గా దాని గురించి తెలుసుకోవడం), వీడియో ఇంటరాక్షన్స్‌ను ఉపయోగిస్తున్నారు.బ్రాండ్ల విషయానికి వస్తే ఈ యువ తరం ట్రెండ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. షాపింగ్ చేసేటప్పుడు వారు ట్రెండింగ్ స్టైల్‌లను ఎంచుకునే అవకాశం 1.7 రెట్లు ఎక్కువగా ఉంది. 72 శాతం మంది షాపింగ్ ప్రమోషన్లు చేస్తున్న క్రియేటర్ల సోషల్ ఛానెల్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే 45 శాతం విభిన్న రంగాల్లోని వ్యాపార సంస్థలు జెన్-జీ అవసరాలు గుర్తించాయి. కానీ అందులో 15 శాతం మాత్రమే వారికి సేవలందిస్తున్నాయి. రానున్న రోజుల్లో కచ్చితంగా ఈ అంతరం భారీగా తగ్గనుంది.ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!ఈ నివేదిక విడుదల సందర్భంగా స్నాప్ ఇంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పుల్కిత్ త్రివేది మాట్లాడుతూ..2035 నాటికి 1.8 ట్రిలియన్ల విలువైన ప్రత్యక్ష వ్యయంతో భారతదేశ ఎకానమీకి జెన్‌జీ పెద్ద ఆర్థిక వనరుగా మారుతుందన్నారు. బీసీజీ ఇండియా ఎండీ నిమిషా జైన్ మాట్లాడుతూ..ఈ తరం ఫ్యాషన్, డైనింగ్, ఆటోమొబైల్స్, ఎంటర్టైన్మెంట్, కన్జూమర్ డ్యూరబుల్స్ వంటి విభిన్న విభాగాల్లో ఖర్చు చేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. -
ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు
తిమ్మాపూర్: ఎన్నికల్లో గెలవడం కోస మే నాయకులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో పర్యటించారు. సర్పంచ్ మేడి అంజ య్యతో కలిసి గ్రామంలో పేదల జీవన శైలి గురించి తెలుసుకున్నారు. అనంత రం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూ రంలో ఉన్న మన్నెంపల్లి ప్రజలు ఇంకా పేదరికంలో మగ్గడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తులకు లక్షల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న పాలకులు వాటిని క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని కోరారు. వెనుకబడిన, బడుగు, బలహీ న వర్గాల అభివృద్ధి, రాజ్యాధికారమే ల క్ష్యంగా తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. అందరి బతుకులు మార్చాలనే లక్ష్యం తో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అందుకే మ న్నెంపల్లిని సందర్శించానన్నారు. ఉప ఎన్నికలో ఓట్ల కోసం వందల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద, బడుగు, బలహీన వర్గాల విద్య, ఉపాధికోసం ఖర్చు చేస్తే వారి జీవితా లు బాగుపడతాయని పేర్కొన్నారు. -
ఇవి చాలా కాస్ట్లీ!
సాక్షి, హైదరాబాద్: ‘నార్సింగి మున్సిపాలిటీలోని ఓ వార్డులో 1,414 ఓట్లున్నాయి. ఈ వార్డులో మాజీ ప్రజాప్రతినిధులుగా పనిచేసిన ఇరువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల నుం చి బరిలో ఉన్నారు. ఒక ఓటు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పలు కుతోంది. ఈ వార్డులో గెలవాలంటే కనీసం 500 ఓట్లు తెచ్చుకోవాలి. ఈ ఓట్ల కోసం సగటున ఓటుకు రూ.7 వేలు అనుకున్నా... 500 ఓట్లకు గాను రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే..’ కోటిన్నర అయినా తగ్గేది లేదు.. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని 1, 5, 20, 23 వార్డులు జనరల్‌కు రిజర్వయ్యాయి. ఇక్కడ తీవ్ర పోటీ ఉండటంతో రూ.1.25 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఎంత ఖర్చయినా సరే వెనుకాడేది లేదని పదవులు ఆకాంక్షిస్తున్న వారి శిబిరాలు తేల్చి చెప్పేస్తున్నాయి. పండుగ ఖర్చు మాదే.. నగర శివార్లలోని ఓ ‘పట్టణ’సంస్థలో ఓ వార్డు ఏకగ్రీవమైంది. అక్కడ ఎన్నికైన అభ్యర్థి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ వార్డు పరిధి లోని ఓటర్లు నారాజ్ కాకుండా ఏం చేశాడో తెలుసా.. సంక్రాంతి పండుగ పిండివంటలకు సరుకులు పంపాడు. 5 లీటర్ల నూనె, 5 కిలోల గోధుమపిండి, వీటికి అదనంగా మందు బాటిల్ పంపిణీ చేశాడు. ఇటు ఐటీ హబ్‌కు సమీపంలోని పురపాలికలోని ఓ వార్డులో మాజీ సర్పంచ్ భర్త పోటీ చేస్తున్నారు. ఈయ నే టీఆర్ఎస్ నుంచి చైర్మన్ రేసులో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ రేసులో ఉన్న నేత.. తన అన్న కుమారుడిని బరిలో దించా డు. బీజేపీ చైర్మన్ అభ్యర్థి.. తన సోదరుడిని నిలబెట్టారు. చైర్మన్ పదవి దక్కించుకోవ డంలో కీలకం కానున్న సంఖ్యాబలాన్ని దక్కించుకునేందుకు.. ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు.. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు నేతలు వెనుకాడటం లేదు. జూనియర్ ఆర్టిస్టులుండే చిత్రపురి కాలనీలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఇద్దరు సినీ పరిశ్రమకు సంబంధించిన వారే పోటీ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజధాని శివార్లలో ఓటు కోసం రూ.2 వేల నోటు, 100 పైపర్స్ ఫుల్ బాటిల్ కావాల్సిందే అనే డిమాం డ్ అప్పుడే వినిపిస్తోంది. గత ఆదివారం నుంచే కాలనీ సంక్షేమ సంఘాలకు మంచి దావత్‌లు కూడా మొదల య్యాయి. సమయానికి సంక్రాంతి పండుగ కూడా రావడంతో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, చైర్పర్సన్లు కావాలనుకుంటున్న వారు కాసులు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కనీసం డివిజన్‌కు రూ.కోటి, కౌన్సిలర్ గిరీకి రూ.50 లక్షలు తగ్గకుండా ఖర్చు పెడతామంటూ చేస్తున్న హడావుడితో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంక్రాంతి పండుగ సందడి ఈ నెల 22 వరకు కనిపించనుంది. డబ్బు.. డబ్బు! స్థానికంగా మంచి పరువు ప్రతిష్టలు తీసుకొచ్చే ‘హాట్ సీట్ల’లో గెలుపు కోసం నగర శివార్లలో హార్డ్ క్యాష్ పోగవుతోంది. శివార్లలో ఉన్న బండ్లగూడ, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట, మీర్‌పేట, బడంగ్‌పేట, బోడుప్పల్ నగరపాలక సంస్థలతో పాటు పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, శంకర్పల్లి, మణికొండ, శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పోచారం, ఘట్కేసర్, తూంకుంట, గుండ్ల పోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో డబ్బు విపరీతంగా ఖర్చయ్యే అవకాశాలు, అనివార్యత కనిపిస్తున్నాయి. ఐటీ, రియల్ రంగాలకు పట్టుగొమ్మల్లాంటి ఈ పురపాలికల్లో పెత్తనం కోసం డబ్బున్న నేతలు తహతహలాడుతుండటం, ఆర్థికంగా మంచి బలమైన వారు రంగంలో ఉండటంతో కోనసీమ పందెపు కోడి బరి అప్పుడే రాజధాని శివారు మున్సిపాలిటీల్లో కనిపిస్తోంది. టికెట్లు తెచ్చుకునేందుకే లక్షలు ఖర్చు పెట్టేందుకు వెనుకాడని నేతలు, ఎన్నికల్లో గెలిచేందుకు కాసులు కురిపించడానికి, ఖరీదైన గిఫ్టులు, తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రూ.50 లక్షలకు తగ్గకుండా రూ.4 కోట్ల వరకు ఒక్కో డివిజన్, వార్డుకు ఖర్చు పెట్టాలని, ఇక మేయర్లు, చైర్పర్సన్ పదవులు ఇస్తామంటే ఎన్ని కోట్లయినా తగ్గేదే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. దావత్‌లు షురూ.. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో జనరల్‌కు రిజర్వయిన ఓ వార్డులో ఇప్పటికే కాసు ల వర్షం కురుస్తోంది. ఎన్నికలకు 10 రోజుల సమయముండగానే దావత్‌లు మొదలయ్యా యి. ఈ వార్డులో ఒక్కో అభ్యర్థికి కనీసం రూ.2.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచ నా. ఇంజాపూర్ మున్సిపాలిటీలోని ఓ వార్డుకు ఇద్దరు బిగ్షాట్స్ పోటీ చేస్తున్నారు. ఒక అభ్యర్థి చిట్‌ఫండ్ వ్యవస్థతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బడాబాబు కాగా, మరో అభ్యర్థి పౌల్ట్రీ వ్యాపా ర దిగ్గజం. గతంలోనూ ఈ రెండు కు టుంబాల మధ్య హోరాహోరీగా స్థానిక పోరు జరగ్గా.. ఈసారీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఓటర్లపై ‘ఇక కనకవర్షమేనని ప్రచారం జోరుగా సాగుతోంది. నగదు ‘హవా...లా’ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న ఎన్నికల కోలాహలం ‘హవాలా’దారులు కూడా చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నగదు అవసరం కావడంతో లిక్విడ్ క్యాష్ దొరకడం గగనమైపోయింది. మనీ డిజిటలైజేషన్ కావడం, రూ.2 వేల నోట్లు మార్కెట్లో తగ్గడం, ఖర్చు బ్యాంకు అకౌంట్ ద్వారానే చేయాల్సి ఉండటంతో నగదు ఎక్కడి నుంచి తేవాలి.. ఎలా ఖర్చుపెట్టాలన్నది అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా నగర శివార్లలో అయితే అప్పుడే హవాలా మార్గాలను వెతకడం కూడా ప్రారంభించేశారు. కార్పొరేటర్ నుంచి మేయర్లు, చైర్పర్సన్లు కావాలంటే నగదు కోట్లలో కావాల్సి రావడంతో హవాలా మార్గాలను ఎంచుకునే పనిలో పడిపోయారు కొందరు అభ్యర్థులు. -
డబ్బులు కాలి బూడిదవుతున్నాయి!
దీపావళి అంటే దీపాల పండుగ అని అర్ధం. చెడు పై మంచి గెలిచినందుకు చిహ్నంగా ఆరోజు ఆనందంతో దీపాలు వెలిగించి మిఠాయిలు పంచుతూ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం భారతీయ సంసృ్కతి. అయితే ఆనందాన్ని పంచుకోవల్సిన దీపావళి నాడు టపాసుల పేరుతో వాతావరణంలో కాలుష్యాన్ని పెంచేస్తూ అనేక తప్పిదాలకు పాల్పడుతున్నాం. దీపావళినాడు టపాసులు పేల్చడానికి సైంటిఫిక్ కారణము ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం శరదృతువులో దీపావళి పండుగ వస్తుంది. ఆ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. వర్షాకాలం నుంచి చలి కాలానికి మారే ఈ సమయంలో తేమ వాతావరణం, చలి కారణంగా అనేక అంటువ్యాధులను రోగాలను కలిగించే క్రిములు, దోమలు అభివృద్ధి చెందుతాయి. దీపావళి నాడు నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం, టపాసులు కాల్చడం వలన వచ్చే పొగతో వీటిని నివారించవచ్చు. అందుకే భారతీయ సంస్కృతిలో దీపావళినాడు టపాసులు కాల్చే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు.కానీ ఇప్పుడు మతాబులు, కాకరపువ్వొత్తులు లాంటి చిన్న చిన్న టపాసులుకాల్చే అలవాటు పోయు పెద్ద పెద్ద శబ్దాలు చేసే లక్ష్మీ బాంబులు, థౌజెండ్‌వాలాలు పేల్చే పనిలో పడ్డారు. వీటి వల్ల కేవలం వాతావరణ కాలుష్యం, శబ్ధకాలుష్యం లాంటివి పెరగడమే కాకుండా వేల కోట్ల రూపాయలు కాలిబూడిద అవుతున్నాయి. భారతదేశంలో మత, కుల, ప్రాంతీయ బేధాలు లేకుండా చిన్న పెద్ద అందరూ కలసి చేసుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. అయితే ఆరోజు భారతదేశం మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయలను ఒక్కరోజు సరదా కోసం భారతీయులు ఖర్చుచేస్తున్నారు. ఈ దుబారా ఖర్చు ప్రతి యేడాది పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.కొన్ని సర్వేల ప్రకారం భారతదేశంలో 120 బిలియన్ల టపాసుల వ్యాపారం జరుగుతుంది. జనాభా గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారతదేశ జనాభా 120కోట్లు (ఇప్పుడు 130 కోట్లు పైన పెరిగే అవకాశం ఉంది). అయితే వీరిలో ఒక్కొక్క కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు అనుకున్న మొత్తంగా 30 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు లెక్క. వీరిలో హిందువులు కానీ వారు 30శాతం మంది ఉన్నారు. మిగిలిన 70శాతంగా ఉన్న హిందువుల కుటుంబాలు దీపావళి నాడు ఎంతో కొంత టపాసులపై ఖర్చు చేస్తున్నాయి. సరాసరి ఒక కుటుంబం వచ్చి 500వందల నుంచి వేయి రూపాయల వరకు ఖర్చుచేసిన రూ. 21000 వేల కోట్లు ఒక్కదీపావళి నాడే కాల్చి బూడిద చేస్తున్నాం. భారతదేశంలో 1923వ సంవత్సరం నుంచి బాణసంచా కాలుస్తున్నాము. అప్పటిలో పశ్చిమ బెంగాల్లో ఉండే టపాసుల పరిశ్రమ చెన్నైలోని శివకాశీలో ఎక్కువగా వ్యాప్తి చెందింది. ప్రస్తుతం భారతదేశంలో బాణసంచా తయారు చేసే సంస్థలు 8000లకు పైనే ఉన్నాయి. ఇక్కడ 2000వేల కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంటే బయట మార్కెట్లో వీటిని రూ.20,000వేల కోట్ల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే నాలుగు ఐదు రెట్లు ఎక్కవగా బయట మార్కెట్లో అమ్ముతూ పండుగ రోజు జనాలను దోచుకుంటున్నారు. భారతదేశంలో నేటికి అనేక మంది మూడుపూట్ల తిండి దొరక ఆకలితో అలమటిస్తున్నారు. తాజాగా విడుదలయిన ఆకలి సూచిలో భారతదేశం 102 వ స్థానంలో ఉంది. దీపావళినాడు మన సంతోషం కోసం చేసే ఖర్చుతో ఎంతో మంది ఆకలి తీర్చొచ్చు. 2019-20 సంవత్సరానికి గాను మధ్యాహ్న భోజన పథకం కోసం కేంద్రప్రభుత్వం రూ.12,054కోట్లు కేటాయించింది. దీని ద్వారా దాదాపు 12కోట్ల మంది పిల్లలకు సంవత్సరం పాటు భోజనాన్ని అందించగలుగుతున్నాం. కానీ అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బాణాసంచా పేరుతో ఒక్కరోజులో తగులబెడుతున్నాం. మనం ఒక్కరోజు ఖర్చు చేసే ఈ మొత్తం సిక్కిం(రూ. 8,665.36కోట్లు, మణిపూర్(రూ.14,636కోట్లు) లాంటి ఎన్నో రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే రెట్టింపు అంటే ఆశ్చర్యపడకతప్పదేమో! కాబట్టి మనందరం ఒక్కసారి ఆలోచిద్దాం. దీపావళినాడు కేవలం టపాసుల రూపంలో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులను కాల్చేస్తేనే ఆనందం వస్తుందా? అదే ఆ డబ్బుతో ఎవరో ఒక్కరికైనా సహాయం చేస్తే ఆనందం వస్తుందా అని. కాలుష్యాన్ని తగ్గించండి అంటూ ఏ కోర్టోలో, పర్యావరణవేత్తలో చెబితే మారే బదులు స్వయంగా మారుదాం.దీపావళినాడు ఆనందాన్ని టపాసులతో కాకుండా మిఠాయిలతో పంచుకుందాం. -
మోదీ సర్కార్ ప్రచార ఖర్చు ఎంతంటే..
సాక్షి, ముంబయి : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివిధ మీడియాల్లో ప్రచారం, ప్రకటనలనపై ఇప్పటివరకూ రూ 4343 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ప్రభుత్వం కొలువుతీరిన అనంతరం ప్రచారంపై వెచ్చించిన మొత్తం నిధుల గురించి ముంబయికి చెందిన సామాజిక కార్యకర్త అనిల్ గల్గాలి ఆర్టీఐ కింద సమాచారం రాబట్టారు. జూన్ 2014 నుంచి ప్రభుత్వం ప్రచారంపై విపరీతంగా వెచ్చించిందని, దీనికి సంబంధించి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 2017లో కొద్దిమొత్తంలో రూ 308 కోట్ల మేర ప్రకటనల బడ్జెట్లో కోత విధించిందని గల్గాలి చెప్పారు. 2014 జూన్ నుంచి మార్చి 2015 వరకూ ప్రభుత్వం ప్రింట్ మీడియాలో రూ 424.85 కోట్లు వెచ్చించగా, ఎలక్ర్టానిక్ మీడియాలో రూ 448.97 కోట్లు ప్రకటనలపై ఖర్చు చేసిందని వెల్లడైంది. ఇక అవుట్డోర్ పబ్లిసిటీకి రూ 79.72 కోట్లు వెచ్చించిందని బ్యూరో ఆఫ్ అవుట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్ (బీఓసీ) ఆర్థిక సలహాదారు తపన్ సూత్రధార్ బదులిచ్చారు. ఇక 2015-16లో ప్రింట్ మీడియలో రూ510 కోట్లు , ఎలక్ర్టానిక్ మీడియాలో రూ 541.99 కోట్లు, అవుట్డోర్ పబ్లిసిటీపై రూ 118 కోట్లు వెచ్చించింది. 2016-17లో ప్రింట్ మీడియాలో ప్రకటనల వ్యయం రూ 463.38 కోట్లకు తగ్గగా, ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రకటనలపై రూ 613 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. అవుట్డోర్ పబ్లిసిటీపై 185.99 కోట్లు వెచ్చించింది. మరోవైపు 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకూ ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రచార వ్యయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ 475.13 కోట్లకు తగ్గింది. అవుట్డోర్ ప్రచార వ్యయం కూడా రూ 147 కోట్లకు తగ్గింది. -
జన్‌థన్ ఖాతాలతో వాటికి దూరం
సాక్షి,న్యూఢిల్లీ: జన్‌ధన్ బ్యాంక్ ఖాతాలు గ్రామీణ భారతంలో పెను ప్రభావం చూపినట్టు ఎస్బీఐకి చెందిన ఆర్థిక పరిశోధన విభాగం వెల్లడించింది. ఈ ఖాతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు పొగాకు, మద్యం సేవించడానికి స్వస్తిపలికి పొదుపుకు అలవాటు పడినట్టు తెలిపింది. జన్‌థన్ ఖాతాలు 50 శాతంపైగా ఉన్న గ్రామాల్లో ధరల పెరుగుదల ఆశాజనకంగా తగ్గినట్టు వెల్లడైంది. ఈ ఖాతాలు అధికంగా ఉన్న రాష్ర్టాల్లో ఆల్కహాల్, పొగాకు, ఇతర మత్తుపదార్ధాల వాడకం గణనీయంగా తగ్గినట్టు అథ్యయనంలో తేలిందని ఎస్బీఐ గ్రూప్ ఎకనమిక్ చీఫ్ అడ్వయిజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. నోట్ల రద్దు అనంతరం తక్కువ ఖర్చు చేసే ధోరణి అలవడటంతో కూడా ఇలా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. జన్‌థన్ ఖాతాలతో పొదుపు సంస్కృతి పెరగడం, ఆల్కహాల్ వంటి పదార్ధాలపై వెచ్చించే ఖర్చు తగ్గడం స్వాగతించదగ్గ పరిణామమని ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ ఎన్ఆర్ భానుమూర్తి పేర్కొన్నారు.ఇక దేశవ్యాప్తంగా ఉన్న 30 కోట్ల జన్‌థన్ ఖాతాల్లో ఎక్కువ శాతం నోట్ల రద్దు తర్వాత తెరిచినవి కావడం గమనార్హం. కేవలం పదిరాష్ర్టాల్లోనే 23 కోట్ల జన్‌థన్ ఖాతాలున్నాయి. జన్‌థన్ ఖాతాలు గ్రామీణ, పట్టణ వినియోగదారుల ధరల సూచీపై ఎలాంటి ప్రభావం చూపాయనే దానిపై ఎస్బీఐ రాష్ర్టాల వారీగా విశ్లేషించింది.జన్‌ధన్ ఖాతాలతో ఆర్థిక సమ్మిళిత వృద్ధి ద్వారా ద్రవ్యోల్బణం దిగివచ్చిందని ఈ విశ్లేషణలో వెల్లడైంది. -
ఈ ఖాతాల నిర్వహణ ఖర్చు ఎంతంటే.?
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఏటా కోట్లు కుమ్మరిస్తున్నాయి. సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణను పలు మంత్రిత్వ శాఖలు ప్రయివేట్ సంస్థలు, కన్సల్టింగ్ కంపెనీలకు అప్పగిస్తూ రూ కోట్లు చెల్లిస్తున్నాయి. నరేంద్ర మోదీ సర్కార్ అన్ని మంత్రిత్వ శాఖలు నిరంతరం ప్రజలతో టచ్‌లో ఉండాలని చెబుతుండటంతో ఆయా మంత్రిత్వ శాఖలు విధిగా ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలను నిర్వహిస్తున్నాయి. ఒక్కో మంత్రిత్వ శాఖ ఈ ఖాతాల నిర్వహణకు ఏటా కోటి నుంచి 3 కోట్ల వరకూ వెచ్చిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం కింద వెలుగు చూసిన వివరాల ప్రకారం 56 కేంద్ర మంత్రిత్వ శాఖలు సోషల్ మీడియా ఖాతాలను కలిగిఉన్నాయి. పట్టణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ... క్వాంటమ్ అనే సంస్థకు రూ 7 కోట్లతో మూడేళ్లకు కాంట్రాక్ట్‌ను అప్పగించింది. సమాచార ప్రసార శాఖ ప్రభుత్వ రంగ బీఈసీఐఎల్తో రూ 2.92 కోట్లకు సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సంహిత మీడియా నెట్‌వర్క్‌కు కాంట్రాక్ట్ అప్పగించింది. ఎంత మొత్తానికి ఒప్పందం చేసుకున్నారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. పర్యాటక మంత్రిత్వ శాఖ రూ 1.04 కోట్లతో స్టార్క్ కమ్యూనికేషన్స్‌ను నియమించింది. నీతి ఆయోగ్ యాప్ డిజిటల్‌కు రూ 96 లక్షలకు సోషల్ మీడియా నిర్వహణ కాంట్రాక్టును అప్పగించింది. మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అయిదుగురు ప్రయివేట్ కన్సల్టెంట్లను నియమించుకుంది.