thimmapur
-
పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం!
ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా అవసరమైనది జీవామృతం. దేశీ ఆవుల పేడ, మూత్రం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసే జీవామృతం ప్రభావశీలంగా పనిచేస్తుందన్న భావన ఉంది. అయితే, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో రాజస్థాన్‌కు చెందిన మహిళా రైతు ‘జయ దగ’ అందుకు భిన్నంగా.. గుర్రాల పేడ, మూత్రంతో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. గిర్ ఆవుల విసర్జితాలతోనే కాకుండా.. గుర్రాల విసర్జితాలతో కూడా ఆమె వేర్వేరుగా ద్రవ జీవామృతం తయారు చేసి తమ పొలాల్లో వివిధ పంటల సేంద్రియ సాగులో ఆమె వాడుతున్నారు.అహ్మదాబాద్‌కు చెందిన మహేశ్ మహేశ్వరి అభివృద్ధి చేసిన ట్యూబ్ పద్ధతిలో అధిక కర్బనంతో కూడిన అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతాన్ని ఈ రెండు రకాలుగా జయ గత 8 నెలలుగా తయారు చేసి వినియోగిస్తున్నారు. ఈ జీవామృతంతో తమ వ్యవసాయ క్షేత్రాల్లో నేపియర్ గడ్డి, మునగ, మామిడి తదితర పంటలను సేంద్రియంగా సాగు చేస్తున్నారు.ఆవుల జీవామృతంతో పోల్చితే గుర్రాల విసర్జితాలతో తయారైన జీవామృతం పంటల సాగులో మరింత ప్రభావశీలంగా పనిచేస్తోందని జయ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అయితే, గుర్రాల జీవామృతాన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న వేసవి కాలంలో పంటలకు వాడకూడదని, ఇతర కాలాల్లో ఏ పంటలకైనా వాడొచ్చని ఆమె సూచిస్తున్నారు.గుర్రాల పెంపక క్షేత్రాలు..రాజస్థాన్‌కు చెందిన జయ దగ కుటుంబీకుల ప్రధాన వ్యాపారం గుర్రాల ద్వారా ఔషధాల ఉత్పత్తి. ఇందుకోసం సుమారు 2 వేల వరకు గుర్రాలను రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని ముత్పూర్, రాజాపూర్ గ్రామాల్లో గల తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆమె పెంచుతున్నారు. పాములు, తేళ్లు కాటు వేసినప్పుడు విరుగుడుగా వాడే ఇంజక్షన్లతో పాటు.. కుక్క కాటు వేసినప్పుడు రేబిస్ సోకకుండా వేసే ఇంజక్షన్లను సైతం పోనిల ద్వారా దాదాపు మూడు దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఇంజక్షన్లను భారత ప్రభుత్వానికి విక్రయించటంతో పాటు.. అనేక ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తమ విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు జయ దగ వివరించారు.అహ్మదాబాద్‌కు చెందిన ఆవిష్కర్త మహేశ్ మహేశ్వరి వద్ద నుంచి పొందిన టెక్నాలజీ ద్వారా జయ ట్యూబ్ పద్ధతిలో అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తమ క్షేత్రంలో గత 8 నెలలుగా తయారు చేస్తున్నారు. ట్యూబ్ ద్వారా ప్రత్యేక పద్ధతిలో తయారవుతున్న ఈ అడ్వాన్స్డ్ జీవామృతం తమ పొలాల్లో మంచి ఫలితాలనిచ్చిందని ఆమె సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆమె క్షేత్రంలో పెరుగుతున్న నేపియర్ గడ్డి, మునగ తోటలు చాలా ఆరోగ్యంగా, ఆకుపచ్చగా ఆకర్షణీయంగా ఉండటం విశేషం. నేపియర్ గడ్డి, మునగ ఆకు ముక్కలతో పాటు బార్లీ, సోయా, మొక్కజొన్నల మొలకలు, గోధుమ తవుడుతో కూడిన దాణాను కూడా ఆవులు, గుర్రాలకు ఆమె మేపుతున్నారు.50 వేల లీటర్ల ట్యూబ్‌లు రెండు..గుర్రాలు, పోనిలతో పాటు వందలాది గిర్ ఆవుల పోషణ కోసం గత 8 నెలల నుంచి తిమ్మాపూర్ వ్యవసాయ క్షేత్రంలో అనేక ఎకరాల్లో నేపియర్ గడ్డిని, మునుగ ఆకును జయ దగ సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు. ఇందుకోసం 50,000 లీటర్ల సామర్థ్యం గల ట్యూబ్‌లు రెండిటిని ఆమె ఏర్పాటు చేసుకున్నారు. ఒక దాని ద్వారా గిర్ ఆవుల పేడ, మూత్రంతో.. రెండో దానిలో గుర్రాల పేడ, మూత్రంతో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ట్యూబ్ రోజుకు వెయ్యి లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు.అడ్వాన్స్డ్ జీవామృతం 30 రోజుల్లో తయారవుతుంది!సాధారణ జీవామృతం తయారీ ప్రక్రియకు.. ట్యూబ్ ద్వారా అడ్వాన్స్డ్ జీవామృతం తయారీ ప్రక్రియకు చాలా వ్యత్యాసం ఉంది. ట్యాంకు లేదా డ్రమ్ములో వేసి నీటిలో నాటు ఆవు పేడ, మూత్రం, పప్పులపిండి, బెల్లం, పిడికెడు మంచి మట్టిని కలిపితే.. సాధారణ జీవామృతం 48 గంటల్లో వాడకానికి సిద్ధమవుతుంది. ఇందులో పిప్పి, పీచు, నలకలు అలాగే ఉంటాయి.అయితే, ట్యూబ్‌లో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు కావటానికి 30 రోజులు పడుతుంది. ట్యూబ్‌ను ఏర్పాటు చేసుకొని, ఆ ట్యూబ్ పరిమాణాన్ని బట్టి నిర్ణీత పరిమాణంలో పేడ, మూత్రం, కూరగాయలు, పండ్ల వ్యర్థాలు తదితరాలను ద్రవ రూపంలోకి మార్చి ట్యూబ్‌లోకి వేస్తూ ఉంటారు. దీనికి తోడు మహేశ్ మహేశ్వరి రూపొందించిన ప్రత్యేక మైక్రోబియల్ కల్చర్‌ను కూడా తగిన మోతాదులో కలిపి వేస్తూ ఉంటారు. ఇలా ప్రతి రోజూ ట్యూబ్ లోపలికి వేస్తూనే ఉండాలి.30 రోజులు వేసిన తర్వాత నుంచి ప్రతి రోజూ ఎటువంటి పిప్పి, పీచు, నలకలు లేని శుద్ధమైన అడ్వాన్స్డ్ జీవామృతం ట్యూబ్ నుంచి వెలికివస్తుంది. ప్రతి రోజూ ఎంత పరిమాణంలో పేడ తదితరాలను ట్యూబ్‌లో ఒక వైపు నుంచి వేస్తూ ఉంటామో.. ట్యూబ్ వేరే వైపు నుంచి అంతే మోతాదులో అడ్వాన్స్డ్ జీవామృతం బయటకు వస్తుంది. సాధారణ ద్రవ జీవామృతాన్ని 15 రోజుల్లో వాడేయాలి. అయితే, ఈ అడ్వాన్స్డ్ జీవామృతం ఏడాదిన్నర వరకు నిల్వ ఉంటుందని.. అధిక కర్బనం, సూక్ష్మజీవుల జీవవైవిధ్యంతో కూడినదైనందు వల్ల ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం తయారుచేసే ట్యూబ్లుఆర్గానిక్ పురుగుల మందు కూడా..ఆర్గానిక్ పురుగుల మందును కూడా 200 లీటర్ల ట్యూబ్ ద్వారా మహిళా రైతు జయ దగ తయారు చేస్తున్నారు. మహేశ్ మహేశ్వరి నుంచి తెచ్చిన మైక్రోబియల్ కల్చర్ 2 లీటర్లు, 2 కిలోల దేశీ ఆవు పేడ, 10 కిలోల పెరుగుతో చేసిన మజ్జిగ, 40 లీటర్లు దేశీ ఆవు మూత్రం కలిపి ట్యూబ్‌లో పోస్తారు. 30 రోజులు ఇలా పోస్తూనే ఉండాలి. 30 రోజుల తర్వాత ట్యూబ్ నుంచి ఆర్గానిక్ పురుగుమందును తీసుకొని వాడుకోవచ్చు. ఈ పురుగు మందును నేరుగా పంటలపై చల్లకూడదు. 1 లీ. పురుగుమందును 1 లీ. నాటు ఆవు మూత్రం, 1 లీ. పుల్ల మజ్జిగ, 17 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఈ ఆర్గానిక్ పురుగుమందును పిచికారీ చేసిన రోజు జీవామృతం పిచికారీ చేయకూడదని జయ తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం అరెకరానికి ఉచితం!రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తమ క్షేత్రానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న రైతులు ఎవరైనా సేంద్రియ వ్యవసాయం చెయ్యాలనుకుంటే.. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఉచితంగా ఇస్తాను. వరి లేదా పత్తి వంటి పంటలకు ఎకరానికి 400 లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతం అవసరం ఉంటుంది. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపడా 200 లీటర్లను రెండు దఫాలుగా ఇస్తాను. గిర్ ఆవుల జీవామృతం లీటరు రూ. 10, గుర్రాల జీవామృతం లీటరు రూ. 15, ఆర్గానిక్ పురుగుల మందు లీటరు రూ. 20కి విక్రయిస్తున్నాం. వీటితో సాగు చేసిన నేపియర్ గడ్డి మేపిన తర్వాత గిర్ ఆవు పాలలో కొవ్వు శాతం 3.4 నుంచి 4.7కు పెరిగింది. ఇతర వివరాలకు డాక్టర్ వెంకటేశ్ (98482 09696)ను సంప్రదించవచ్చు. – జయ దగ, మహిళా రైతు, తిమ్మాపూర్, రంగారెడ్డి జిల్లా, jsd@vinsbio.inరోజూ వెయ్యి లీటర్లు..50 వేల లీటర్లు పట్టే ట్యూబ్ నుంచి మహిళా రైతు జయ దగ వెయ్యి లీటర్ల జీవామృతం పొందుతున్నారు. అంతే మొత్తంలో లోపలికి పోస్తున్నారు. ప్రతి బ్యాచ్‌లో 30 కేజీల ఆవులు లేదా గుర్రాల పేడ, 40 లీ. మూత్రం, 20 కిలోల బెల్లం, 10 కిలోల పండ్లు, 20 కిలోల కూరగాయలు, 10 కిలోల కలబంద జ్యూస్, 300 లీటర్ల జీవామృతంతో పాటు మిగతా 430 లీటర్ల నీటిని కలిపి ట్యూబ్‌లో పోస్తున్నారు. ఈ రోజు పోసింది నెలరోజుల తర్వాత అడ్వాన్స్డ్ జీవామృతంగా మారి బయటకు వస్తుంది. ఏడాదిన్నర నిల్వ ఉంటుంది..సాధారణ జీవామృతంలో నలకలు పిప్పి ఉంటుంది. అయితే, ట్యూబ్‌లో గాలి తగలకుండా 30 రోజులు మగ్గిన తర్వాత అసలు ఏ నలకలూ, చెత్త లేని జీవామృతం వెలువడుతుంది. ఇందులో కర్బనం 15% వరకు ఉంటుందని, అందువల్ల ఇది సాధారణ జీవామృతం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి చెబుతున్నారు.సాధారణ జీవామృతం 15 రోజుల తర్వాత పనికిరాదు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కలియతిప్పాలి. అయితే, ట్యూబ్ జీవామృతం కనీసం ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకు నిల్వ ఉంటుంది. ప్రతి రోజూ కలియతిప్పాల్సిన అవసరం లేదు. బ్యారెల్స్‌లో నింపుకొని నిల్వ చేసుకుంటే చాలు. మరో విషయం ఏమిటంటే.. ట్యూబ్‌ని కానీ, దానిలో తయారైన జీవామృతాన్ని గానీ నీడలోనే ఉంచాలన్న నియమం లేకపోవటం మరో విశేషం అని జయ దగ చెబుతున్నారు. ఈ ప్రత్యేకతల వల్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఒక చోట తయారు చేసి, దూర ప్రాంతాలకు కూడా రవాణా చేసుకొని అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ట్యూబ్ టెక్నాలజీ వల్ల తమకు గడ్డి సమస్య శాశ్వతంగా తీరిపోయిందని ఆమె సంతోషిస్తున్నారు. – పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్ -
బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు: సీఎం కేసీఆర్
సాక్షి, కామారెడ్డి: తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 7కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. బాన్సువాడ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఈ నిధులు దుర్వినియోగం చెందకుండా పనులు చేయించుకోవాలని సూచించారు. ‘సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాగునీటి కోస రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం’ అని అనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అంతకుముందు బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సీఎం సతీమణి శోభ.. దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. అనంతరం సీఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. -
గూడు చెదిరి.. గుండె పగిలె.. ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన
సాక్షి, యాదాద్రి: బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న భూములు, ఇళ్లకు పూర్తి పరిహారం ఇవ్వకుండానే అధికార యంత్రాంగం అక్కడి ప్రజలను ఖాళీ చేయిస్తోంది. దీంతో ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన కారణంగా మనస్తాపం చెందిన నిర్వాసితుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఎన్ తిమ్మాపూర్ గ్రామంలో నెలకొన్న దయనీయపరిస్థితి ఇది. వ్యవసాయ భూములు, ఇళ్లు పోయి.. పరిహారం రాక భవిష్యత్తుపై భయంతో పాటు రకరకాల కారణాలతో దాదాపు ఐదేళ్లలో గ్రామంలో 50 మందికి పైగా చనిపోయారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు.., తమకు పిల్లను ఇవ్వడంలేదని మనోవేదనతో కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు అనారోగ్యంతో మంచంపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత 57 రోజులుగా బస్వాపూర్ ప్రాజెక్టు కట్టపై నిర్వాసితులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. బుధవారం కూడా ఓ నిర్వాసితుడు బెంగతో చనిపోయాడు. ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు.. కాళేశ్వరం ప్రాజెక్టులో చివరిదైన నృసింహసాగర్ రిజర్వాయర్ (బస్వాపూర్ రిజర్వాయర్)ను 11.39 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు 1,724 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో 700 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బీఎన్ తిమ్మాపూర్, లక్ష్మీనాయకుని తండా, చోకల్నాయకుని తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ముంపు గ్రామాల వాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో జాప్యం అవుతోంది. బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తుల వ్యవసాయ భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు అందరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న గ్రామంలోని 655 నివాస గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ముంపు భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులను మరింత పెంచి ఇవ్వాలని గ్రామస్తులు తీర్మానం చేసి నోటీసులు తీసుకోకుండా అధికారులను తిప్పిపంపారు. 655 మందికే పరిహారం.. బీఎన్ తిమ్మాపూర్‌లో గ్రామకంఠంతోపాటు పరిసరాల్లోని 36.11 ఎకరాల భూమి మునుగుతోంది. ఇంతవరకు ఈ భూమికి సంబంధించి అవార్డు ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఎంత పరిహారం వస్తుందో తెలియని పరిస్థితి. అలాగే భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 90 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గ్రామంలో 1,086 మంది నిర్వాసితులు తేలారు. వీరిలో 655 మందికి పరిహారం చెల్లించారు. ఒక్కొక్కరికి రూ.7.61 లక్షల చొప్పున రూ.50 కోట్లు పంపిణీ చేశారు. మిగతా వారికి రూ.34 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఒకేసారి ఇవ్వకపోవడంతో విడతలుగా వచ్చిన డబ్బులు వృథాగా ఖర్చవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. డబ్బులు చేతికి వచ్చిన వారిలో సగం మందికిపైగా చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా ఖర్చు అయ్యాయని చెపుతున్నారు. పరిహారం రాని వారు ఎప్పుడిస్తారో.. అని ఎదురుచూస్తున్నారు. గ్రామస్తుల ప్రధాన డిమాండ్లు.. ►2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ►2019లో ప్రకటించిన అవార్డును రద్దు చేసి కొత్తగా భూసేకరణ అవార్డును ప్రకటించాలి. ►ప్రాజెక్టు ముంపులో కోల్పోతున్న వ్యవసాయ భూములు, ఇళ్లకు పరిహారం ఒకేసారి చెల్లించాలి. ►గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ప్రకటించాలి ►భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని హుస్నాబాద్ వద్ద 107 సర్వే నంబర్లో చేపట్టిన లేఅవుట్ ప్లాట్లను వెంటనే బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు కేటాయించాలి. ఒక్కో ఇంటినిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలి. పరిహారం డబ్బులన్నీ పప్పు పుట్నాలకే.. ప్రభుత్వం తీసుకున్న భూములకు పరిహారం డబ్బులన్నీ ఒకేసారి ఇవ్వకపోవడంతో నిర్వాసితులకు ఇంతవరకు ఇచ్చిన డబ్బులన్నీ ఇతర అవసరాలకే ఖర్చయ్యాయి. అప్పుడప్పుడు ఇచ్చిన పరిహారం డబ్బులు ఇలా ఖర్చు కావడంతో రైతుల చేతులు ఖాళీ అయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు తొలుత ఎకరానికి రూ.6 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆ తర్వాత రిజర్వాయర్ సామర్థ్యాన్ని 0.87 టీఎంసీలనుంచి 11.39 టీఎంసీలకు పెంచిన ప్రభుత్వం.. నిర్వాసితులకు 123 జీవో ప్రకారం పరస్పర అంగీకారం ద్వారా ఎకరానికి రూ.15.60 లక్షల చొప్పున 400 ఎకరాలకు పరిహారం ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2019 డిసెంబర్ 11న జారీచేసిన అవార్డు ప్రకారం దానిని సవరించి ఎకరానికి రూ.15.30 లక్షలు నిర్ణయించింది. అయితే, పరిహారం మరింత ఎక్కువగా ఇవ్వాలని రైతులు కోరుతూ వస్తుండగా.. రూ.30 వేలు తగ్గడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎక్కువ పరిహారం వస్తుందని భావించిన రైతులకు పరిహారం ఇలా తక్కువగా రావడంతో తీవ్ర మనో వేదన చెందుతున్నారు. మా భూమికి డబ్బులు రాలేదు బస్వాపురం రిజర్వాయర్‌లో మా భూమి 12 ఎకరాలు పోయింది. ఇందులో 5 గుంటల భూమి పైసలు మాత్రమే పడ్డాయి. మిగతా డబ్బులు నేటికీ ఇవ్వలేదు. పునరావాసం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు కానీ నేటికీ లేదు. రెవెన్యూ అధికారులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా గ్రామంలో ఉన్న ఇళ్లకు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. ముంపు భూములు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు మొత్తం అందరికీ ఇస్తే తప్ప నోటీసులు తీసుకోబోమని చెప్పాం. – ఎండీ సాబేర్, బీఎన్ తిమ్మాపురం అనారోగ్యం పాలవుతున్నాం ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూస్తూ, ఎంత వస్తుందో.. ఎప్పుడు ఇస్తా రో అని ఆలోచిస్తూ అనారోగ్యం పాలు అవుతున్నాం. గ్రామంలో ఇలా ఆలోచించి కొందరు చనిపోగా, మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. నాకున్న అర ఎకరం వ్యవసాయ భూమి బస్వాపురం రిజర్వాయర్ కట్ట కోసం పోయింది. అప్పుడు ఎకరానికి రూ.6 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఆ డబ్బులతో ఎక్కడా భూమి కొనుగోలు చేయలేకపోయాం. ఇంటి కోసం ఇచ్చే ఆర్అండ్ఆర్ ప్యాకెజీ కోసం ఎదురు చూస్తున్నాం. – జంగిటి సుగుణ, బీఎన్ తిమ్మాపూర్ రూ. 46.35 కోట్లు విడుదల బస్వాపూర్ ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాల పరిహారం, లే అవుట్ అభివృద్ధికి ప్రభుత్వం బుధవారం రూ.46.35 కోట్లను విడుదల చేసింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి బా«ధితులకు పరిహారం ఇవ్వాలని కోరడంతో వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.33.45 కోట్లు, పునరావాస లేఅవుట్ అభివృద్ధికి రూ.12.90 కోట్లు ఉన్నాయి. రెండురోజుల్లో బాధితులకు పరిహారం అందుతుంది. – ఫైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
నితీష్, టీఆర్ఎస్తో మాట్లాడితే మాకు సంబంధం లేదు: రాహుల్ గాంధీ
సాక్షి, రంగారెడ్డి: విద్వేష రాజకీయాలు దేశానికి హానికరమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని తెలిపారు. దేశ సమగ్రతకు, సమైక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం తిమ్మాపూర్‌లో రాహుల్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కార్పోరేట్ వర్గాల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలకు అంత డబ్బు ఎలా వస్తోందని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పార్టీకి ఎలాంటి అవగాహన లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. .కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికల్లో పోరాడుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ‘నితీష్, టీఆర్ఎస్తో మాట్లాడితే మాట్లాడుకోవచ్చని, దాంతో తమకు సంబంధం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది. దళితులు, గిరిజనుల భూములను కబ్జా చేస్తోంది. విద్యను ప్రైవేటీకరణ చేసి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను ఖర్గే చూసుకుంటారు. భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదు. దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులపై పోరాట యాత్ర. దేశంలో బీజేపీ హింసను ప్రేరేపిస్తోంది. బీజేపీపై పోరాటం కోసమే నా భారత్ జోడో యాత్ర. ప్రజలు కాంగ్రెస్‌తో విడిపోలేదు. ప్రజలతో కనెక్ట్ కావడానికే యాత్ర. బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ. కశ్మీర్ వెళ్లిన తర్వాత నేనేం అనుకుంటున్నా అనేది చెప్తా.’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. చదవండి: ‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. వీడని చిక్కు.. ఎవరికి లక్కు! -
కిషన్‌రెడ్డి స్వగ్రామాన్ని దత్తత తీసుకున్న కార్తికేయ 2 నిర్మాత అభిషేక్
సాక్షి, హైదరాబాద్: పల్లెల అభివృద్ధికి కృషి చేయడం నిజమైన ధర్మం, దేశభక్తి అని కశ్మీర్ ఫైల్స్ చిత్రం దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి పేర్కొన్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామం కావడం విశేషం. ఆదివారం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన తన చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్‌లో భాగంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తిమ్మాపూర్ విలేజ్ మైల్ స్టోన్ ఆవిష్కరణ సభకు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, యూపీ మంత్రి మంత్రి నందగోపాల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, కావ్యరెడ్డి, నటి పల్లవి జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్ తన తండ్రి తేజ్ నారాయణ్ పుట్టిన రోజున గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ గ్రామ విద్యార్థులు వసతులను సరిగ్గా వినియోగించుకుని భవిష్యత్‌లో స్ఫూర్తినిచ్చే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. యూపీ మంత్రి నందగోపాల్ మాట్లాడుతూ.. తిమ్మాపూర్ ఆదర్శ గ్రామంగా మారేలా సేవా కార్యక్రమాలు ముందుకు సాగాలని కోరారు. తన అత్తగారి గ్రామమైన తిమ్మాపూర్‌ను దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి తెలిపారు. చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్‌లో భాగంగా తిమ్మాపూర్ గ్రామ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను వితరణ చేశారు. కార్యక్రమాన్ని చేపట్టిన అభిషేక్ అగర్వాల్‌ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు శ్రీశ్రీ రవిశంకర్ వర్చువల్‌గా అభినందించారు. -
తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్
-
గ్రామాన్ని దత్తత తీసుకున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత
ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాల దర్శకుడు అభిషేక్ అగర్వాల్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు. కోవిడ్ సమయంలో చాలా మంది పేదలకు సహాయం చేసిన ఆయన.. తాజాగా మరో అడుగు ముందుకేశాడు.గత రెండు బ్లాక్బస్టర్లతో మంచి లాభాలను ఆర్జించిన ఈ యువ నిర్మాత ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు. ఈ గ్రామం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన్మస్థలం కావడం గమనార్హం. అభిషేక్ అగర్వాల్- మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. వివిధ ఈవెంట్లు , ఫంక్షన్లలో చాలాసార్లు వీరు కలిసి కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. -
కరీంనగర్: పెళ్లైన 15 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ.. యువకుల ‘మత్తు’కు బలి
-
పెళ్లైన 15 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ.. యువకుల ‘మత్తు’కు బలి
ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ. పెళ్లయిన పదిహేనేళ్లకు పుట్టింది. ఆ బిడ్డకోసం మొక్కని దేవుడు, చేయని పూజలు లేవు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ చిన్నారే ఆ తల్లిదండ్రులకు లోకం. పాపే ప్రాణంగా బతుకుతున్న వారిపై దేవుడు చిన్నచూపు చూశాడు. ముగ్గురు యువకుల మద్యం మత్తు క్రీడకు అభం.. శుభం తెలియని చిన్నారి బలైంది. రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న బాలికను వెనకనుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో ఎగిరిపడింది. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలింది. తిమ్మాపూర్(మానకొండూర్):పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. లోకిని జంపయ్య– రాజేశ్వరీ దంపతులది సొంతూరు ఇందుర్తి. వీరికి కూతురు శివాని(10) ఉంది. పెళ్లయిన పదిహేనేళ్లకు పుట్టింది. బతుకుదెరువు కోసం తిమ్మాపూర్ వచ్చారు. స్టేజీవద్ద అద్దెకు ఉంటున్నారు. జంపయ్య కూలీపని, రాజేశ్వరి సమీపంలోని ఓ మొబైల్ క్యాంటీన్లో పనిచేస్తుంటుంది. శివాని శుక్రవారం మధ్యాహ్నం తల్లివద్దకు రోడ్డువెంట నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో అలుగునూరు నుంచి తిమ్మాపూర్‌కు వస్తున్న ఇదే గ్రామానికి చెందిన అట్ల సంతోశ్, శ్రీధర్, డేవిడ్ మద్యంమత్తులో కారుతో శివానిని వెనకనుంచి వేగంగా ఢీకొట్టారు. తర్వాత కారు సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం విరిగి పోయింది. బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా చని యింది. కారు నడిపిన సంతోశ్, డేవిడ్ పరారయ్యారు. శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యంమత్తు, ఓవర్‌స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. ప్రమాదం తరువాత కూడా నిందితులు సమీపంలోని మద్యం దుకాణంలో మద్యం తాగినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నడిపిన సంతోశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్‌రెడ్డి తెలిపారు. చదవండి: వర్కర్‌పై కర్కశత్వం.. రెండేళ్లుగా చిత్రహింసలు.. బెల్టుతో.. -
ఐదేళ్ల ప్రేమ.. గుట్టల్లో వరలక్ష్మి మృతదేహం.. మాకు దిక్కెవరు బిడ్డా!
వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇద్దరికీ సంతానం లేరు. తమకు జీవితాంతం తోడుగా ఉంటుందని పదిరోజుల పసిగుడ్డును దత్తత తెచ్చుకున్నారు. పెంచి పెద్దచేశారు. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది. ఇంటర్ వరకు చదివించారు. ఎదిగిన కూతురుకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ.. ప్రేమికుడి చేతిలో హతమవడంతో తమకు దిక్కెవరని ఇద్దరు తల్లులు గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సాక్షి, కరీంనగర్: పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన ఆరెల్లి పోశవ్వ, బోయిని రాజవ్వ అక్కాచెల్లెళ్లు. పది రోజుల వయసప్పుడే వరలక్ష్మి(19)ని దత్తత తీసుకొని ఇంటర్ వరకు చదివించారు. ఈనేపథ్యంలో అదే మండలం పొరండ్లకు చెందిన ట్రాక్టర్ మెకానిక్ అఖిల్, వరలక్ష్మి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు అభ్యంతరం తెలిపినా వీరి తీరు మారలేదు. ఈనెల 2న ఇంటి నుంచి వెళ్లిన కూతురు కోసం 5వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మానకొండూర్ మండలం చెంజర్ల దేవునిగుట్ట వద్ద వరలక్ష్మిని అఖిల్ హత్య చేశాడని తెలియడంతో తల్లులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహం కుళ్లి, ఎడమ చేయి, తల భాగాలను జంతువులు పీక్కుతినడం చూసి గుండెలు బాదుకున్నారు. అడిషనల్ డీసీపీ (ఎల్ అండ్‌వో) శ్రీనివాస్, తిమ్మాపూర్, మానకొండూర్ సీఐలు శశిధర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, ఎస్సై ప్రమోద్‌రెడ్డిలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి ఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. చదవండి: కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి అఖిల్ తల్లీ నిందితురాలే..! ►ఈ నెల2న హత్య జరిగిన అనంతరం అఖిల్ నేరుగా వైన్‌షాపునకు వెళ్లాడు. ►వరలక్ష్మిని చంపిన తరువాత అతడిలో భయం మొదలైంది. ►ఆ భయాన్ని మర్చిపోవాలని వైన్‌షాపు వద్ద ఫుల్ బాటిల్ కొని ఒక్కడే తాగాడు. అయినా, అతడిలో భయం పోలేదు. ►వెంటనే తల్లికి జరిగిందంతా చెప్పేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అఖిల్‌పై చేయిచేసుకున్నారు. ►ఆపై అఖిల్ కూడా వింతవింతగా ప్రవర్తించసాగాడు. ►బయటికి వచ్చి కంటికి కనిపించిన ప్లెక్సీలు చించడం, తోరణాలు తెంపేయడం, చేతికి దొరికిన వస్తువులు విసిరికొట్టడం చేశాడు. ►కుటుంబ సభ్యులు ఎంత వారించినా వినలేదు. దీంతో కొందరు ఇరుగుపొరుగువారు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ►వెంటనే తిమ్మాపూర్‌కు చెందిన ఇద్దరు బ్లూకోల్ట్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ►ఇంతలో కుటుంబ సభ్యులు వారికి సర్దిచెప్పి పంపారే తప్ప.. హత్య విషయం వారికి చెప్పలేదు. ►ఈ విషయంలో నిజాన్ని దాచినందుకు పోలీసులు ఆమెను కూడా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. పోలీసుల ముందే నిలదీసి ఉంటే..? ఈ గొడవ జరుగుతుండగానే.. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వరలక్ష్మి అమ్మమ్మ అఖిల్ ఇంటికి చేరుకుంది. ఆమె అక్కడ పోలీసులను చూసింది. కానీ, నేరుగా అఖిల్ తల్లి వద్దకు వెళ్లి వరలక్ష్మి ఏది? అని నిలదీసింది. ‘తన కొడుకు అసలు ఉదయం నుంచి గడప దాటలేదు నీ మనవరాలు ఎక్కడుందో వెదుక్కో పో’ అని అఖిల్ తల్లి ఆమెను కసిరింది. ఆ మాటలు నమ్మిన వరలక్ష్మి అమ్మమ్మ తిరిగి ఇంటిముఖం పట్టింది. అక్కడే ఉన్న పోలీసులకు విషయం చెప్పి ఉంటే.. హత్య విషయం అదే రోజు వెలుగుచూసి ఉండేది. రెండ్రోజుల తర్వాత మృతదేహం వద్దకు.. రెండురోజులు గడిచినా అఖిల్‌లో భయం పోలేదు. వరలక్ష్మి బతికే ఉందా? చనిపోయిందా? అన్న విషయం నిర్ధారించుకునేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం మరోసారి చెంజర్ల గుట్ట వద్దకు వెళ్లి చూస్తే అక్కడే వరలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో ఊరి వదిలి పారిపోతే అనుమానం వస్తుందని, ఫోన్‌కాల్స్ పోలీసులు తీస్తే తాను దొరికిపోతానని అక్కడే తన సెల్‌ఫోన్ పగులగొట్టాడు. తర్వాత తల్లి సెల్‌ఫోన్ వాడుతున్నాడు. పోలీసులను కూడా పక్కదారి పటిద్దామనుకున్నా.. వరలక్ష్మికి అఖిల్ చేసిన సీడీఆర్ (కాల్ రికార్డ్స్ డేటా) ముందుంచి ప్రశ్నించడంతో అఖిల్ నోరువిప్పక తప్పలేదు. -
ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు
తిమ్మాపూర్: ఎన్నికల్లో గెలవడం కోస మే నాయకులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో పర్యటించారు. సర్పంచ్ మేడి అంజ య్యతో కలిసి గ్రామంలో పేదల జీవన శైలి గురించి తెలుసుకున్నారు. అనంత రం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూ రంలో ఉన్న మన్నెంపల్లి ప్రజలు ఇంకా పేదరికంలో మగ్గడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తులకు లక్షల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న పాలకులు వాటిని క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని కోరారు. వెనుకబడిన, బడుగు, బలహీ న వర్గాల అభివృద్ధి, రాజ్యాధికారమే ల క్ష్యంగా తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. అందరి బతుకులు మార్చాలనే లక్ష్యం తో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అందుకే మ న్నెంపల్లిని సందర్శించానన్నారు. ఉప ఎన్నికలో ఓట్ల కోసం వందల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద, బడుగు, బలహీన వర్గాల విద్య, ఉపాధికోసం ఖర్చు చేస్తే వారి జీవితా లు బాగుపడతాయని పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కుటుంబంలో విషాదం
కందుకూరు: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి పెద్ద సోదరుడు యాదగిరిరెడ్డి (85) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మం డలం తిమ్మాపూర్‌లోని తన నివాసంలో బుధవారం రాత్రి కన్నుమూశారు. అంత్యక్రియలు గురువారం స్వగ్రామంలో జరగనున్నాయి. సోదరుడి మృతి వార్త తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని పలువురు బీజేపీ నాయకులు పరామర్శించారు. -
డేంజర్ కీటకాలు.. వాహనాలపై ముప్పేట దాడి
కరీంనగర్: రాత్రిపూట కీటకాలు ప్రమాదకరంగా మారాయి. ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని కాకతీయ కాలువ వంతెనపై ప్రమాదంగా మారింది. రోజు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఆ వంతెనపై వాహనదారులు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ఈ సమయంలో కీటకాలు వేలాదిగా వచ్చి చేరుతుంటాయి. దీంతో మూడు గంటల పాటు బీభత్సం సృష్టించాయి. రాజీవ్ రహదారిపై కీటకాలు ముసురుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కీటకాలు ఏ రకం కీటకాలో తెలుసుకునేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కీటకాల నమూనాలను సేకరించి అధికారులు ల్యాబ్‌కి పంపారు. -
మ్యారేజ్ బ్యూరో: ఇక్కడ పెళ్లి సంబంధాలు రైతులకు మాత్రమే
►సూర్యాపేటకు చెందిన 35 ఏళ్ల రైతుకు పది ఎకరాల సాగు భూమి ఉంది. కాలాలకు అనుగుణంగా పంట దిగుబడి వస్తుంటుంది. ఆయనకు వివాహం కాలేదు.. పెళ్లి కాలేదనే కంటే.. పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే.. అతను వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి.. ►మంథనిలో ఐదు ఎకరాలున్న మరో యువకుడు ఉన్నత చదువులున్నా వ్యవసాయం మీద మక్కువతో రైతుగా మారాడు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. సేద్యం చేస్తున్నాడనే సాకుతో అతడికి పిల్లనివ్వడానికి ఎవరూ రావట్లేదు. సాక్షి, కరీంనగర్: రైతును పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు అంతగా ఆసక్తి చూపడం లేదు.. ఎకరాల కొద్దీ భూములున్నా, లక్షల కొద్దీ ఆదాయమున్నా వివాహం అనే విషయం వచ్చేసరికి వ్యవసాయదారులు వెనకబడిపోతున్నారు. ఏదిఏమైనా రైతులకు పెళ్లి సంబం ధాలు దొరకడం చాలా కష్టంగా మారుతోంది.. ఈ పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన రైతు కేతిరెడ్డి అంజిరెడ్డి (40) ‘రైతు మ్యారేజ్ బ్యూరో’ ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకున్నారు.. దేశంలో రైతులకు మాత్రమే పెళ్లి సంబంధాలు కుది ర్చే తొలి బ్యూరో తనదేనని అంజిరెడ్డి అంటున్నారు.. ‘15 ఎకరాలున్న నా మిత్రుడికి పెళ్లి విషయంలో ఎదురైన అనుభవం తో రైతు కోసమే ప్రత్యేకంగా మ్యారేజీ బ్యూరో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా.. అందుకోసం రైతును పెళ్లి చేసుకో వాలనుకునే వారు సంప్రదించాలని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో హైదరాబాద్ రోడ్డులో తిమ్మాపూర్ వద్ద రైతు మ్యారేజ్ బ్యూరో తెరిచా’ అని అంజిరెడ్డి చెప్పుకొచ్చారు. ఫీజు ఐదొందల రూపాయలు.. గత అక్టోబర్‌లో ఈ బ్యూరో ఏర్పాటు చేసిన అంజిరెడ్డి.. సోషల్ మీడియాను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ఫేస్బుక్లో వ్యవసాయంతో లింక్ అయిన అన్ని గ్రూపుల్లో తన ఆలోచనను పంచుకున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారా విస్తృత ప్రచారం చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి చాలా దరఖాస్తులు వచ్చాయి. అందులో వ్యవసాయం మాత్రమే చేసే వ్యక్తుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే వ్యవసాయదారుడు భర్తగా కావాలనుకుంటున్న యువతులు, వారి తల్లిదండ్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు అంజిరెడ్డి చెప్పారు. సంబంధాలు కుదిర్చేందుకు రూ.500 ఫీజుగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగినులు వస్తున్నారు.. కులం, మతంతో సంబంధం లేకుండా పెళ్లి విషయంలో రైతు పట్ల వివక్ష అత్యంత దయనీయంగా ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో రైతు కుటుంబానికి పెద్ద కష్టమేమీ లేదు. సాధారణ ఉద్యోగి సంపాదిస్తున్న దాని కన్నా ఐదెకరాల రైతు ఆదాయం ఎక్కువే.. ఈ విషయాలను ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఎంటెక్, ఎంసీఏ చదివిన వారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వారు కూడా పల్లెల్లో వ్యవసాయం చేసే చదువుకున్న భర్త కావాలని కోరుకుంటున్నారు. మా దగ్గరికి వచ్చిన బయోడేటాలను బట్టి ఈ విషయం తెలుస్తోంది. కొన్ని సంబంధాలు కూడా కుదిరాయి. మంచి రోజులు రాగానే పెళ్లిళ్లు జరుగుతాయి. – కేతిరెడ్డి అంజిరెడ్డి, రైతు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు -
పరువు పోయిందని.. ప్రాణం తీసుకుంది
సూర్యాపేట : ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ, అతని విధానాలు ఆమెకు నచ్చలేదు. దీంతో మరో యువకుడితో పెద్దలు కుదిర్చిన వివాహానికి ఒప్పుకుంది. నిశ్చితార్థం కూడా అయ్యింది. మాజీ ప్రేమికుడు.. తనతో ఆ అమ్మాయి చనువుగా ఉన్న ఫొటోలను నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి, వారి కుటుంబ సభ్యులకు పంపాడు. దీంతో పెళ్లి ఆగింది. పెళ్లి ఆగడంతో పాటు కుటుంబం పరువు పోయిందని మనస్తాపానికి గురైన యువతి ప్రాణం తీసుకుంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో మంగళవారం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన కునుకుంట్ల వెంకన్న పెద్ద కూతురు పావని (21) ఈ నెల 6న సూర్యాపేటలోని చింతలచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లింది. 9న బయటకు వెళ్లివస్తానని చెప్పి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి సూర్యాపేట టూటౌన్‌కు బదిలీ చేశారు. పెళ్లి ఆగిపోవడంతో.. పావని.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జీఎన్ఎంగా పనిచేస్తోంది. సొంత ఊరుకు చెందిన బొడ్డుపల్లి వంశీ, పావని కొంతకాలం ప్రేమించుకున్నారు. తర్వాత వంశీ విధానాలు నచ్చక.. అతన్ని దూరం పెట్టింది. ఇటీవల ఆమెకు జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి కుది రింది. నిశ్చితార్థం కూడా అయ్యింది. విషయం తెలిసిన వంశీ గతంలో తాను పావనితో దిగిన ఫొటోలను నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి, అతని బావకు పంపాడు. ఈ ఫొటోలను చూసి వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న పావనిని తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి మందలించారు. కొద్దిరోజులు సూర్యాపేటలో ఉండమని బంధువుల ఇంటికి పంపారు. దీంతో పరువుపోయిందని మనస్తాపానికి గురైన పావని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పత్తిచేనులో శవమై.. తిమ్మాపురం శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద పత్తిచేనులో యువతి మృతదేహం ఉందని సమచారం అం దుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పావనిదిగా గుర్తించి సూర్యాపేట టూటౌన్ పోలీ సులకు సమాచారమిచ్చారు. అక్కడి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాని కి పోస్టుమార్టం జరిపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పావని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి. ముగ్గురిపై కేసు నమోదు.. పావని ఆత్మహత్యకు కారకుడైన బొడ్డుపల్లి వంశీతోపాటు పెళ్లి ఆగిపోవడానికి వంశీకి సహకరించిన నూకల శ్రీకాంత్, శ్యాంరెడ్డిలపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు, ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. -
అతి వేగం: ఇద్దరు యువకుల మృతి
సాక్షి, కరీంనగర్: అతి వేగం.. మద్యం మత్తు పాతికేళ్లు కూడా నిండని ఇద్దరిని బలిగొనగా.. మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ శివారులో గురువారం వేకువజామున ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంగా వెనుకనుంచి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమినగర్‌కు చెందిన వివేక్‌చంద్ర(20), నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్కాలనీకి చెందిన వేముల ప్రణయ్‌కుమార్(25), మంచిర్యాలకు చెందిన అంకరి స్వరాజ్, బియ్యాల శివకేశవ మిత్రులు. హైదరాబాద్‌లో ఉంటున్న మరో మిత్రుడి పుట్టిన రోజు గురువారం ఉండటంతో వేడుకలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి వీరు గౌతమినగర్‌లోని వివేక్‌చంద్ర ఇంట్లో కలుసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ బయల్దేరాలనుకున్నారు. చాలారోజుల తర్వాత కలవడంతో వివేక్‌చంద్ర ఇంట్లోనే అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం సేవించారు. అనంతరం కారులో బయల్దేరి ఉదయం వరకు హైదరాబాద్ చేరాలనుకున్నారు. మద్యం మత్తులో ఉండటంతో స్వరాజ్ వేగంగా డ్రైవ్ చేశాడు. వివేక్‌చంద్ర, ప్రణయ్‌కుమార్, శివకేశవ నిద్రలోకి జారుకున్నారు. వేకువజామున 3:30 గంటలకు కరీంనగర్ చేరుకున్నారు. మిత్రులంతా నిద్రలోకి జారుకోవడంతో స్వరాజ్ కూడా మద్యం మత్తు కారణంగా నిద్రను ఆపుకుంటూ కారు నడిపాడు. కరీంనగర్ నుంచి 20 నిమిషాల్లో తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీకి చేరుకున్నారు. రెప్పపాటులో.. కారు రామకృష్ణకాలనీ దాటుతుండగా డ్రైవ్ చేస్తున్న స్వరాజ్‌కు ఒక్కసారిగా లారీ కనిపించడంతో దానిని తప్పించబోయాడు. అప్పటికే 90 కిలోమీటర్ల వేగంతో ఉన్న కారు.. రెప్పపాటులో ఎడమవైపు భాగం లారీని వేగంగా ఢీకొంటూ దూసుకెళ్లి డివైడర్‌ను తాకి ఆగింది. ఈ ప్రమాదంలో కారు ఎడమవైపు ముందుసీట్లో కూర్చున్న వివేక్‌చంద్ర, వెనుక సీట్లో కూర్చున్న ప్రయణ్‌కుమార్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. స్వరాజ్, కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. కారు అతివేగంగా లారీని ఢీకొట్టడంతో లారీ కిందభాగంలో ఉన్న స్టెప్నీ టైర్ విరిగిపోయి సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. ఇరుక్కుపోయిన మృతదేహాలు.. ప్రమాద సమాచారం అందుకున్న ఎల్ఎండీ పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ మహేశ్‌గౌడ్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారులో ఇద్దరు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి వెంటనే 108కు సమాచారం అందించారు. ఇంతలో çకరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్ రావడంతో పోలీసులు దానిని ఆపి స్థానికుల సాయంతో అతికష్టంగా క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీశారు. ఇద్దరినీ అంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు డ్రంకన్ డ్రైవ్.. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వరాజ్, శివకేశవ పరిస్థితి మెరుగ్గా ఉందని సీపీ తెలిపారు. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు వారికి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా ఆల్కాహాల్ శాతం 87 వచ్చిందని తెలిపారు. ప్రమాదం గురించి క్షతగాత్రులను అడిగితే పొంతన లేని సమాధానం చెప్పారని, మద్యం మత్తు, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. ఎల్ఎండీ పోలీసులు పూర్తి విచారణ జరిపి నివేదిక ఇస్తారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం ఇరు కుటుంబాల్లో తీరని దుఖాన్ని మిగిల్చింది. సినిమాకు వెళ్లాస్తా నాన్న అని చెప్పి వెళ్లిన కొడుకు వివేక్‌చంద్ర మృతి చెందాడనే వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలారు. ఊరికి వెళ్తున్న అని చెప్పి వెళ్లిన భర్త ప్రణయ్‌కుమార్ తిరిగిరాడని తెలిసి గుండెలు అవిసేలా రోదించింది. మంచిర్యాల పట్టణంలోని గౌతమినగర్‌కు చెందిన కాసారపు రమేష్‌రావు, అనిత దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు వివేక్‌చంద్ర (20). హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజిలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి సినిమాకు వెళ్తున్నానని చెప్పి రాత్రి 8గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి శవవయ్యాడు. ఊరెళ్లొస్తానని చెప్పి... శ్రీరాంపూర్ కాలనీకి చెందిన వేముల సారేందర్, లక్ష్మీ దంపతుల పెద్దకుమారుడు ప్రణయ్‌కుమార్. తండ్రి ఎస్సార్పీ 3 గనిలో హెడ్ ఓవర్‌మెన్‌గా పనిచేసి కారుణ్య ఉద్యోగాల కింద ఆన్ఫిట్ కావడంతో ఆయన స్థానంలో ప్రణయ్‌కుమార్ మే, 2019లో ఉద్యోగంలో చేరాడు. జూలై 2019న పావనితో వివాహమైంది. భార్యతో కలిసి సింగరేణి క్వార్టర్స్‌లో నివాసముంటున్నాడు. బుధవారం రెండో షిఫ్ట్‌కు వెళ్లిన ప్రణయ్‌కుమార్ విధులు ముగిసిన అనంతరం రాత్రి 10:40లకు భార్యకు ఫోన్ చేసి తాను ఇంటికి రావడం లేదని, ఊరెళ్తున్నాని చెప్పాడు. డ్యూటీ డ్రెస్ మీదనే మంచిర్యాలకు వెళ్లి అక్కడ నుంచి స్నేహితులు వివేక్ చంద్ర, స్వరాజ్, శివకేశవ్లతో కలిసి కారులో బయలుదేరాడు. మరణ వార్త వినగానే కుటుంబ సభ్యులు బోరునవిలవిుంచారు. పరామర్శ... ప్రణణ్కుమార్ మృతిచెందిన విషయం తెలుసుకున్న గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, నాయకులు ముస్కె సమ్మయ్య, బాజీసైదా, కిషన్‌రావులు మృతునికి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రణయ్ స్నేహితులు భరత్‌రెడ్డి, అన్వేశ్రెడ్డిలు వారికుటుంబ సభ్యులను ఓదార్చారు. సినిమాకెళ్లి వస్తాడనుకున్నా నా కొడుకు ఎవరితోను పెద్దగా స్నేహం చేయడు. ఈ స్నేహితులు నాకు తెలియదు. సినిమాకు వెళ్లస్తానాని చెప్పి వెళ్లిండు. ఉదయం కరీంనగర్ నుంచి ఫోన్ అచ్చింది. రోడ్డు ప్రమాదంలో నీ కుమారుడు వివేక్‌చంద్ర ఉన్నాడని చెప్పడంతో నమ్మలేకపోయాను. ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదు. సినిమాకు అని వెళ్లిన కొడుకు ఇలా తిరిగివస్తాడనుకోలేదని బోరున విలపించాడు. – వివేక్ చంద్ర తండ్రి రమేష్‌రావు, మంచిర్యాల -
కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం
-
కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని తిమ్మాపూర్ మండలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నుస్తులాపూర్‌లో రోడ్డు దాటుతున్న బైక్‌ను, కారు ఢీ కొట్టింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు చాలా దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతున్ని నుస్తులాపూర్‌కు చెందిన ఆవుల రవిగా గుర్తించారు. గాయపడ్డ సమ్మయ్యను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో చూస్తే ప్రమాదం ఎంత భయనకంగా జరిగిందో అర్థమవుతుంది. -
కరీంనగర్లో కాల్పులు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని బుడగ జంగాల కాలనీకి చెందిన తూర్పాటి స్వప్న(35)ను ఆమె భర్త కనకయ్య తుపాకీతో కాల్చి పరారయ్యాడు. ఈ ఘటనలో బుల్లెట్ ఆమె తొడభాగం నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు స్పందించి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు కనకయ్య పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తిమ్మాపూర్ సీఐ కరుణాకర్ తెలిపారు. బుడగ జంగాలకు చెందిన కనకయ్య ఇటీవలే నేపాల్ నుంచి వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఈ తుపాకీని కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్వప్న ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. భార్యపై అనుమానం పెంచుకోవడంతో పాటు వరకట్నం కోసం వేధించినట్లు తెలిసిందని, ఆ నేపథ్యంలోనే తుపాకీతో కాల్చినట్లు భావిస్తున్నారు. -
వృద్ధురాలికి గూడు కట్టించిన ఎస్సై
అల్గునూర్(కరీంనగర్): ఖాకీ అంటే కర్కషత్వం అనుకుంటారు. పోలీసులకు దయ, జాలి ఉండవని అంటారు. ఆడ్రెస్ వేసుకుంటే తన, మన ఉండదంటారు, వాళ్లకు హృదయం లేదంటుంటారు. కానీ పోలీసులందు ఈపోలీసు వేరయా అన్నట్లు ఓ పోలీసు అధికారి తన ఔన్నత్యం, దయాగుణాన్ని చాటుకున్నాడు. అయిన వాళ్లందరూ ఉండి, ఒంటరిగా ఉన్న అవ్వకు గూడు కట్టించాడు ఓ సబ్ఇన్సెపెక్టర్. వివరాల్లోకి వెళ్తే తిమ్మాపూర్ మండలంలోని మాల్లాపూర్ గ్రామానికి చెందిన కండె ఎల్లవ్వ(65)కు ఇద్దరు కూతుళ్లు, కొడుకు సంతానం. భర్త, కొడుకు మృతిచెందడంతో ఎల్లవ్వే కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. కూలినాలి చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. చిన్న పూరి గుడిసెలో ఉంటోంది. సిమెంటు ఇటుకలు, ఇతర సామగ్రి తెప్పించుకున్నా నిర్మించుకునే స్థోమత లేక ఇటుకలు పేర్చి దానిపై ఫ్లెక్సీని కప్పుగా వేసుకుని ఉంటోంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మల్లాపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు వృద్ధురాలు తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె దీనస్థితిని చూసి ఆయన చలించి అక్కడే ఉన్న ఎస్సైని పిలిచి అవ్వకు వెంటనే ఇల్లు కట్టించి నీడ కల్పించాలని సూచించారు. ఈ మేరకు ఎస్సై కృష్ణారెడ్డి రూ.50 వేలు తన సొంత ఖర్చుతో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. వారం రోజుల్లో నిర్మాణం పూర్తి చేయించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి కూడా నిర్మించారు. దీంతో ఒంటరి అవ్వకు గూడు దొరికింది. ఎల్లవ్వ ఇంటి ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానిస్తామని ఎస్సై తెలిపారు. నిర్మాణం పూర్తవడంతో వృద్ధురాలి మోములో ఆనందం వెల్లివిరిసింది. ఆమె కళ్లలో ఆనందభాష్పాలు చూసి తన మనసు ఉప్పొంగిందని, వృద్ధురాలికి ఇల్లు కట్టించడంతో ఆత్మసంతృప్తి కలిగిందని ఎస్సై అన్నారు. కాగా, ఒంటి దాన్ని అయిన తన గోడు విన్న ఎమ్మెల్యే, తనకు గూడు కట్టి నీడ కల్పించిన ఎస్సై కృష్ణారెడ్డిల మేలును ఎన్నటికీ మరువ అని ఎల్లవ్వ అన్నది. తన సొంత ఇంటి కల ఇన్నేళ్లకు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. -
మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం
ఖననం చేసిన తరువాత మృతిపై అనుమానం పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి భార్య పోరండ్లలో తహసీల్దార్ సమక్షంలో విచారణ తిమ్మాపూర్ : మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన పార్నంది చంద్రయ్య(55) మృతిపై అతడి భార్య అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని ఆదివారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడం చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార ం.. చంద్రయ్య బ్రాస్‌బ్యాండ్ కూలీగా పనిచేసేవాడు. ఈనెల 15న ఉదయం చంద్రయ్యను పోరండ్లకు చెందిన కిన్నెర రాజయ్య బ్యాండ్ పని కోసం తీసుకెళ్లాడు. రాత్రి వరకు చంద్రయ్య ఇంటికి రాలేదు. అదే రోజు సాయంత్రం సుభాష్‌నగర్ సమీపంలోని శివాజీనగర్ వద్ద పడిపోయి ఉండగా స్థానికులు 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చే చూసేసరికి చంద్రయ్య చనిపోవడంతో పోలీసులు శవాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మరునాడు మృతుడిని పోరండ్లకు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు భావిస్తూ ఎలాంటి అనుమానాలు లేవని భార్య పార్నంది లక్ష్మీ పోలీసులకు లిఖితపూర్వంగా రాసిచ్చింది. శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అదే రోజు రాత్రి ఖననం చేశారు. అయితే చంద్రయ్యతోపాటు మరో ఇద్దరు వాహనంపై వెళ్లినట్లు, ఆ తరువాత కొద్ది సేపటికే అతను పడిపోయినట్లు స్థానికులు మృతుడి కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో చంద్రయ్యను ఇంటి నుంచి తీసుకెళ్లిన కిన్నెర రాజయ్యపై, వాహనంపై తీసుకెళ్లిన వ్యక్తులపై అనుమానం ఉందని ఈనెల 20న లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం కరీంనగర్ ట్రాఫిక్ ఎస్సై ఎం.రమేష్, తిమ్మాపూర్ తహసీల్దార్ కోమల్‌రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు అర్చన, ట్రాఫిక్ ఏఎస్సై ఇషాక్, ఎల్ఎండీ హెడ్‌కానిస్టేబుల్ హన్మంతరావు పోరండ్లకు చేరుకుని ఖననం చేసిన మృతదేహాన్ని కుటుంబసభ్యుల సమక్షంలో బయటకు తీయించి, పోస్టుమార్టం నిర్వహించారు. చంద్రయ్యను తీసుకెళ్లిన వ్యక్తులు అతడు పడిపోయిన విషయాన్ని తమకు తెలుపకపోవడంపై అనుమానం ఉందని తహసీల్దార్‌కు లక్ష్మి ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడుతామని ఎస్సై రమేష్ తెలిపారు. పోస్టుమార్టం స్థలానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బోయిని అశోక్, ఒగులాపూర్ సర్పంచ్ జయపాల్‌రెడ్డి తదితరులు వచ్చి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు
కరీంనగర్: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 23 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మెట్పల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇందిరానగర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా.. కొట్టింది. దీంతో బస్సులోని 23 మంది ప్రయాణికులకు తీవ్ర గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... రహదారిపై నుంచి బస్సును పక్కకు తొలగించి... ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ సారయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. -
భార్యాభర్తల ఆత్మహత్య
తిమ్మాపూర్ (కరీంనగర్) : పురుగులమందు తాగి భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపుర్ మండలానికి చెందిన ప్రభాకర్(37), తేజస్వి(34) దంపతులు కరీంనగర్‌లోని మారుతీనగర్‌లో నివాసముంటూ.. బంగారం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో గురువారం తిమ్మాపూర్‌కు వెళ్లిన దంపతులు ఆలయ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
కరీంనగర్ లో వ్యక్తి ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్ శివారులోని ఓ రియల్ వెంచర్లో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంచర్లో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం చెట్టుకు వేలాడుతూ ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.