CM KCR announces Rs 50 crore for development of Banswada in Kamareddy - Sakshi
Sakshi News home page

బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు: సీఎం కేసీఆర్‌

Published Wed, Mar 1 2023 2:27 PM | Last Updated on Wed, Mar 1 2023 3:32 PM

CM KCR Comments At Thimmapur Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: తిమ్మాపూర్‌ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 7కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు.  బాన్సువాడ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఈ నిధులు దుర్వినియోగం చెందకుండా పనులు చేయించుకోవాలని సూచించారు.

‘సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాగునీటి కోస రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం’ అని అనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.

అంతకుముందు బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సీఎం సతీమణి శోభ.. దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. అనంతరం సీఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement