banswada
-
టికెట్ నో అన్న పార్టీ.. పురుగుల మందు తాగిన ఇంఛార్జ్
సాక్షి,బాన్సువాడ ః ఎన్నికల పక్రియ తొలి అంకం టికెట్ల పంపిణీలోనే కొందరికి నిరాశ ఎదురవడం సహజమే. అయితే పార్టీ కోసం పనిచేసిన తమకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెటివ్వడాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ రాలేదన్న బాధతో ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాసుల బాలరాజు బుధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో బాలరాజును నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాన్సువాడ కాంగగ్రెస్ టికెట్‌ను బీజేపీ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డికి అధిష్టానం ఇచ్చింది. పార్టీలో చేరీ చేరగానే ఏనుగుకు టికెట్ దక్కింది. ఇది తట్టుకోలేకపోయిన ఆ నియోజకవర్గ టికెట్ ఆశించిన బాలరాజు పురుగుల మందు తాగాడు. బాలరాజును బీఆర్ఎస్, బీజేపీ నేతలు పరామర్శించారు. నిజానికి ఏనుగు రవీందర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయి బీజేపీలో చేరి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. -
నిలోఫర్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతం
హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. తీవ్రంగా శ్రమించి ఈ కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. నిజామాబాద్‌లో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలుడ్ని సురక్షితంగా తీసుకొచ్చారు.సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మమతకు మమతకు ఇదివరకే ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. దీంతో ఓ బిడ్డను ఎత్తుకెళ్లైనా పెంచుకోవాలని మమత, ఆమె భర్త నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. తమ కుమారుడి ఆరోగ్యం బాలేదంటూ నిలోఫర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఎవరైనా బిడ్డను అదను చూసి ఎత్తుకెళ్లాలని పథకం వేశారు. ఆస్పత్రిలో చేరిన వాళ్లతో పరిచయం పెంచుకుంటూ.. ఫైసల్‌ఖాన్ అనే చిన్నారి మీద కన్నేశారు. నాలుగు రోజుల కిందట.. ఫైసల్ తల్లి భోజనం తేవడానికి వెళ్లిన సమయంలో బిడ్డను తీసుకుని పరారయ్యారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు ఈ జంటకు సహకరించారు. బిడ్డ కనిపించకపోయే సరికి తల్లి విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. ఆపై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో కిడ్నాపర్లను పట్టుకోవడం కష్టతరంగా మారింది పోలీసులకు. చివరకి.. ఆస్పత్రి సమీపంలోనే సీసీ ఫుటేజీల ద్వారా కేసు చేధించగలిగారు. జేబీఎస్ అక్కడి నుంచి నిజామాబాద్, కామారెడ్డి ఇలా సాగింది కిడ్నాపర్ల ప్రయాణం. చివరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ జంటను పట్టుకుని.. బాలుడ్ని సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. వింత వ్యాధి.. నవ్వాడనే ఉద్దేశంతోనే.. ! ఈ నెల 14తేదీన నిలోఫర్ లో కిడ్నాప్ గురైన ఆరు నెలల బాబు కిడ్నాప్ కేసును ఛేదించాం. చికిత్స కోసం ఫారీదా బేగం తన కొడుకు ఫైసల్‌ఖాన్‌ను తీసుకొని వచ్చింది. భోజనం కోసం బయటకి తల్లి వెళ్ళింది. బాలుడు తల్లి భోజనం కోసం వెళ్లగా, వెంటనే బాలుడి ని కిడ్నాప్ చేశారు. శ్రీను , మమత అనే ఇద్దరు కిడ్నాప్ చేశారు. గత కాలంగా వీళ్లిద్దరికీ పిల్లలు పుట్టి చనిపోతున్నారు. 15 రోజులు క్రితం కూడా దంపతులకు బాలుడు పుట్టారు. అనారోగ్యంతో నిలోఫర్లొనే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ జంట.. అధిక రక్త స్నిగ్థత వ్యాధితో బాధపడుతోందని తెలుస్తోంది. దీని ప్రకారం.. మగ పిల్లలు పుడితే వెంటనే చనిపోతారు. కేవలం ఆడ పిల్ల పుడితేనే బతుకుతారు. ఇప్పటికే ఇద్దరు మగ పిల్లలు మృతి చెందారు, మూడో పిల్లోడు కూడా చనిపోతాడని భావించారు. అందుకే నిలోఫర్‌లో ఓ పక్క కొడుకు చికిత్స తీసుకుంటుండగానే.. ప్లాన్ ప్రకారం ఫైసల్‌ను ఎత్తుకెళ్లారు. ఈ జంట బాన్సువాడ టౌన్లో కిరాయికి ఇల్లు తీసుకుని ఆ ఎత్తుకొచ్చిన బిడ్డతో ఉన్నారు. నిలోఫర్ ఆస్పత్రి నుండి జూబ్లీ బస్ స్టాండ్ వరకు పోలీసులు 100 కెమెరాలు జల్లెడ పట్టి కేసును చేధించారు. ఆ బిడ్డ నన్ను చూసి నవ్వాడు. అందుకే పెంచుకుందామని ఎత్తుకెళ్లాం అని ఫైసల్ కిడ్నాప్గురించి మమత చెబుతోంది. బాలుడుకి రెండు రోజులు నిందితురాలు మమతనే పాలు ఇచ్చింది అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
నా భర్త లాస్ట్‌స్టేజీలో ఉన్నారు.. హోంగార్డు నాగమణి వీడియో వైరల్
ఖలీల్‌వాడి: సీఎం సారూ.. హోంగార్డులను పర్మినెంట్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్‌స్టేషన్ హోంగార్డు నాగమణి చేసిన వీడియో వైరల్ అయ్యింది. గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. హైదరాబాద్‌లో హోంగార్డు రవీందర్ భార్య అనుభవిస్తున్న బాధను తాను కూడా అనుభవిస్తున్నట్లు చెప్పారు. ‘‘నా భర్త సాయికుమార్ లాస్ట్‌స్టేజీలో ఉన్నారని డాక్టర్లు చెప్పారు. పిల్లలను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాం.. చాలా ఇబ్బందులు పడుతున్నాం. నాలా చాలా మంది హోంగార్డులు తమ వ్యక్తిగత బాధలను చెప్పుకోలేక పోతున్నారు. చాలీచాలని జీతాలతో బతకలేకపోతున్నాం. హాస్పిటల్ ఖర్చులు, స్కూల్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం.. పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నామే గాని మావి విలువ లేని బతుకులు.. సీఎం సారు హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని గతంలో చెప్పారు అందుకే అడుగుతున్నాం..హోంగార్డు యూనియన్ నేతలైన ఏడుకొండలు, ప్రేమ్, రాజేందర్, ఇబ్రహీం, వెంకటేశ్, శివన్న సీఎం సార్‌కు ఈ వీడియోను చేరే వరకు పంపండి’’అని ఆ వీడియోలో కోరారు. తామూ తెలంగాణ బిడ్డలమేనని హోంగార్డులకు న్యాయం చేస్తే సీఎం కేసీఆర్ ఫొటో పెట్టుకొని బతుకుతామని ఆ వీడియోలో ఆమె వ్యాఖ్యానించారు. చదవండి: హోంగార్డులూ..ఆత్మహత్యలు చేసుకోకండి -
‘అంబులెన్స్‌లో డీజిల్ లేదు...రూ. 800 ఇస్తేనే తీసుకెళ్తా’.. రోగి మృతి
సాక్షి, నిజామాబాద్: మెరుగైన చికిత్స కోసం ఓ రోగిని బాన్సువాడ నుంచి నిజామాబాద్‌కు తరలించారు. అయితే డీజిల్‌కు డబ్బులు ఇవ్వలేదని అంబులెన్స్ డ్రైవర్ రోగిని తీసుకెళ్లలేదు. దీంతో పరిస్థితి విషమించి ఆ రోగి మృతి చెందిన ఘటన బాన్సువాడ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన సాయిలు (40) వాంతులు, విరోచనాలతో మూడురోజుల క్రితం బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చేరాడు. సోమవారం తెల్లవారుజామున సాయిలుకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. విధుల్లో ఉన్న వైద్యుడు పరిస్థితి గమనించి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించాలని సాయిలు కుమారుడికి సూచించారు. వైద్య సిబ్బంది ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి పిలిపించారు. అయితే డ్రైవర్ అంబులెన్స్‌లో డీజిల్ లేదని...రూ.800 ఇవ్వాలని సాయిలు కుమారుడికి చెప్పాడు. తన వద్ద రూ.50 ఉన్నాయని, ఎలాగైనా తన తండ్రిని నిజామాబాద్‌కు తీసుకెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్‌ను ప్రాధేయపడ్డాడు. డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పి అంబులెన్స్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగా, కొద్దిసేపటి తర్వాత సాయిలు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. సాయిలు మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై, అంబులెన్స్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి వచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోలో కొత్తకొండ భాస్కర్, కాసుల బాల్‌రాజ్, గుడుగుట్ల శ్రీనివాస్, ఖలేక్, హన్మాండ్లు, మంత్రి గణేశ్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే -
ఈసారికి మార్పులేదు.. పోచారంకు గట్టిగా చేప్పేసిన కేసీఆర్
-
పోచారంకు సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పారా? అందుకే నిర్ణయం మార్చుకున్నారా?
స్పీకర్ గా పని చేసిన వారు ఓడిపోతారనే సాంప్రదాయానికి ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా చెక్ పెట్టాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఇద్దరు తనయులలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇప్పుడు తన పంథాను మార్చుకున్నారా అంటే ఔననే చెప్పాలి. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. జోరుగా రిటైర్మెంట్పై చర్చ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరని రిటైర్మెంట్ ప్రకటిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఒకవేళ కచ్చితంగా పోటీ చేయాల్సి వస్తే జహీరాబాద్ పార్లమెంట్ కు పోటీ చేస్తారని, తనయులకు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తారని చర్చ జోరుగా సాగింది. ఆ ఊహాగానాలకు తెర దించుతూ రాబోయే ఎన్నికల్లో ఆరో సారి పోటీ చేయడం ఖాయమని తాజాగా ఆయన చేసిన ప్రకటన పుకార్లకు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లయింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో ఈ దఫా స్పీకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు అనుగుణంగా కామారెడ్డి జిల్లాలోని పాత రెండు మండలాల బాధ్యతలను ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డికి, నిజామాబాద్ జిల్లాలోని పాత రెండు మండలాలను తనయుడు సురేందర్ రెడ్డికి అప్పగించారు. రెండు జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గ బాధ్యతలను వారే చూసుకునేవారు. చదవండి:వరంగల్: చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు! ఈ నియోజక వర్గంలో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గిరిజన లంబాడా తండాలు కూడా బాగా ఉంటాయి. రెండు జిల్లాల పరిధిలో నియోజక వర్గం ఉంటుంది. అయితే సీనియర్ ఎమ్మెల్యే గా మంత్రిగా స్పీకర్ గా బాధ్యతలు చేపట్టి ఎదురులేని లీడర్ గా ఎదిగారు పోచారం. సభాపతిగా హైదరాబాద్ కు పరిమితమవడం, వయస్సు మీద పడడంతో కొంత ఇబ్బంది పడి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చర్చ జరిగింది. 2018లోనే తనకు టికెట్ వద్దని కోరినప్పటికీ కేసీఆర్ వినకుండా పోచారానికే టికెట్ ఇవ్వడంతో తప్పనిసరిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం ఆ తర్వాత ఆయనకు సభాపతి బాధ్యతలను అప్పగించారు. సభాపతి కావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నా.. పోచారం ఇటీవల కాలంలో మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో, ఆత్మీయ సమ్మేళనాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సర్వేల్లో ఏం తేలింది? సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో చేసిన సర్వేల్లో నాలుగు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్టులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే క్యాండేట్ మారితే ఓడిపోయే నియోజకవర్గాల్లో బాన్సువాడ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఈసారి కూడా పోచారంనే పోటీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనయుల భవిష్యత్తు గురించి బాధ్యత తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి పోటీకి సిద్దమయ్యారు. సై అనక తప్పలేదా? బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడెట్ గా ప్రకటించిన మల్యాద్రి రెడ్డికి సెటిలర్ల మద్దతు దొరికిందని తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ పోచారంతోనే పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసినా వారి పోటీ వల్ల బీఆర్ఎస్ కే బలం చేకూరుతుందనే వాదనలు లేకపోలేవు. బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం పోచారం కు ప్లస్ పాయింట్. పైగా సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరిస్తారని, నియోజకవర్గంలో పనులు కూడా చేస్తారని పోచారానికి మంచి పేరుంది. కానీ, ఈసారి కుమారులు పోటీ చేస్తే జనాల నుంచి మద్దతు పూర్తి స్థాయిలో దొరకదనే విషయం సర్వేలో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ దఫా గెలిచి తరవాత వారసత్వానికి బాధ్యతలు అప్పగించే ఆలోచనతో పోటీకి సై అనాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. చదవండి:కేసీఆర్ సర్కార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం -
బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు: సీఎం కేసీఆర్
సాక్షి, కామారెడ్డి: తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 7కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బాన్సువాడ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. బాన్సువాడ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఈ నిధులు దుర్వినియోగం చెందకుండా పనులు చేయించుకోవాలని సూచించారు. ‘సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాగునీటి కోస రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం’ అని అనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అంతకుముందు బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సీఎం సతీమణి శోభ.. దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. అనంతరం సీఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. -
బాన్సువాడ ఎంసీహెచ్‌కు జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) జాతీయ గుర్తింపు దక్కింది. ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఎఫ్‌హెచ్‌ఐ)‘అందించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రెడిటేషన్ (గ్రేడ్ –1)‘లభించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బాన్సువాడ ఎంసీహెచ్‌ను పలుమార్లు సందర్శించింది. అన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధా రించుకొని అక్రెడిటేషన్ మంజూరు చేసింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నాలుగు ఆసుపత్రులకే బీఎఫ్‌హెచ్‌ఐ అక్రెడిటేషన్ ఉంది. దీంతో భారత దేశ స్థాయిలో ఘనత సాధించిన ప్రభుత్వ దవాఖానగా బాన్సువాడ ఎంసీహెచ్ రికార్డ్ సాధించింది. ఈ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. సీఎం ఆదేశాలతో .. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బ్రెస్ట్ ఫీడింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య సిబ్బంది, ఆశాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సహకారంతో 35 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. ప్రత్యేకంగా దేశంలోనే మొదటిసారిగా ‘వాలంటరీ లాక్టేషన్ వర్కర్స్‘ను నియమించింది. వీరు హాస్పిటల్లో గర్భిణులకు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రసవమైన అరగంటలోనే పిల్లలకు ముర్రుపాలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ఎంసీహెచ్‌లో ముగ్గురు వాలంటీర్లు ఉన్నారు. వైద్య సిబ్బందికి అభినందనలు: హరీశ్‌రావు బాన్సువాడ ఎంసీహెచ్‌కు బీఎఫ్‌హెచ్‌ఐ అక్రెడిటే షన్ రావడం హర్షణీయమని హరీశ్‌రావు పేర్కొ న్నారు. హాస్పిటల్ వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. -
బాన్సువాడ బరిలో స్పీకర్ తనయుడు!.. పోచారం కీలక వ్యాఖ్యలు
సాక్షి, కామారెడ్డి: వచ్చే ఎన్నికలలో బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న ప్రచారానికి తెరపడింది. మళ్లీ తానే బరిలో నిలుస్తానని స్వయంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సీఎం ఆదేశం, పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు తానీ నిర్ణయం తీసుకున్నానన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్ హోదాలో ఉండడంతో పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన తనయుడు డీసీసీబీ చైర్మన్ అయిన పోచారం భాస్కర్‌రెడ్డి చూస్తున్నారు. నియోజకవర్గ నేతలు, అధికారులను సమన్వయం చేస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. స్పీకర్ వయసు పైబడుతుండడంతో ఆయనకు బదులు కొడుకులు పోటీ దిగుతారని పార్టీ శ్రేణుల్లోనూ చర్చ జరిగింది. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాలు, పార్టీ నేతల అభిప్రాయాల మేరకు తానే పోటీ చేస్తానని స్పీకర్ ప్రకటించడంతో ప్రచారానికి తెరపడినట్టయ్యింది. జనం మధ్యలో.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సమయం గడుపుతు న్నారు. కొత్త పింఛన్ కార్డులు, సీఎం సహాయ నిధి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తూ జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఊరిలో గంటల కొద్దీ సమయం కేటాయిస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారం¿ోత్సవాల్లో పాల్గొంటున్నారు. వీధులన్నీ తిరుగుతున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పనిలోపనిగా ఎవరైనా అనారోగ్యానికి గురైనా, మరణించినా వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా.... ఇటీవలి కాలంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేస్తున్న హడావుడిని చూస్తుంటే ఎన్నికలు వచ్చాయా అనిపిస్తోంది. ఓ రకంగా ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా అందరినీ కలుస్తున్నారు. ప్రజలు తమ గల్లీకి రావాలని కోరగానే అటు పరుగులు తీస్తున్నారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయా అన్న రీతిలో వారి పర్యటనలు సాగుతున్నాయి. జనంతో మమేకమవుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి మళ్లీ తానే ఎన్నికల బరి ఉంటానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బాన్సువాడ సరస్వతి ఆలయ కల్యాణ మండపంలో బీర్కూర్ మండలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎల్లప్పుడు సమీక్ష అవసరమన్నారు. అప్పుడే లోటుపాట్లు బయటకి వస్తాయన్నారు. ఎవరు తప్పు చేసినా అది ప్రజలలో వ్యతిరేకతకు దారి తీస్తుందన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని, తప్పులు చేస్తే తరిమికొడతారని పేర్కొన్నారు. ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో మంచి పేరుందని, దానిని నిలబెట్టుకుందామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ రఘు, పార్టీ మండల అధ్యక్షుడు వీరేశం, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, నాయకులు శశికాంత్, నారాయణ, గంగారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్‌లకే టికెట్లన్న సీఎం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తామని, ఎవరి నియోజకవర్గంలో వారు కష్టపడాలని ఆదేశించారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీ చేస్తారని భావిస్తున్నారు. బాన్సువాడనుంచి వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవ ర్గం నుంచి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్, జుక్కల్‌లో హన్మంత్సింధేలకే అవకాశాలు దక్కనున్నాయి. -
నిజామాబాద్: గత ఎన్నికల్లో సీట్లు గెలిచినప్పటికీ.. సిట్టింగ్‌లలో టెన్షన్
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు అనుగుణంగా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ బృందంతో జిల్లాలో నెలల తరబడి అన్ని అంశాలపై ఎమ్మెల్యేల గురించి సమగ్రంగా సర్వే చేయించారు. ఇందుకు సంబంధించిన నివేదికపై కేసీఆర్ పోస్ట్‌మార్టం చేస్తున్నారు. సాక్షి, నిజామాబాద్: ఆది నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో గత శాసనసభ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచినప్పటికీ, కేవలం మూడు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కల్వకుంట్ల కవిత ఓటమి నేపథ్యంలో జిల్లాపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడి సర్వే నివేదికలపై, కొందరు ఎమ్మెల్యేల గు ట్టుమట్లపై ప్రత్యేక పరిశీలన చేయనున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఆశావహుల బలాలు, బలహీనతలను కూడా బేరీజు వేసుకుంటూ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలి, నడవడిక, అక్రమాలు, పర్సంటేజీలు, కేడర్‌కు అందుబాటులో లేని పరిస్థితి, భూదందాలు, దాడులు చేయించడం తదితర అంశాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఒ క ఎమ్మెల్యే అయితే ఏకంగా పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులనే విచ్చలవిడిగా బెదిరింపులకు గురిచేసిన అంశాలను సైతం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లా నుంచి కొందరు సిట్టింగ్‌లను మార్చాల నే నేపథ్యంలో అన్ని రకాల అంశాలను క్రో డీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సమీకరణాలివి.. బాన్సువాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ నేత, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడైన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఈసారి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆదినుంచి క్షేత్రస్థాయిలో తిరుగులేని పట్టు కలిగి ఉన్న భాస్కర్‌రెడ్డి కి ఈ స్థానం కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయమై కూడా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మూ ర్ నియోజకవర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే పలుసార్లు స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై కూడా సర్వేలో పూర్తివివరాలు సేకరించినట్లు సమాచారం. ఈసారి ఆర్మూర్ శాసనసభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అర్వింద్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో సిట్టింగ్‌ను కొనసాగించాలా లేక అర్వింద్ సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలితకు టిక్కెట్టు కేటాయించాలా అనే విషయమై కూడా లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కవితను బరిలోకి దింపుతారనే చర్చ పార్టీ వర్గాల్లో, స్థాని క ప్రజాప్రతినిధుల్లో జరుగుతోంది. ఇక నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం విషయానికి వస్తే గణేష్ గుప్తా పనితీరు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రత్యర్థులు ఎవరెవరుంటారు.. గెలుపోటముల పరిస్థితి ఏమిటనే విషయమై లెక్క లు వేసి సర్వే నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బలాబలాల బేరీజు.. ఈ సర్వే నేపథ్యంలో జిల్లాలో ఎవరెవరికి టిక్కెట్ల కోత పెట్టాలనే విషయమై నిర్ణయించనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరెవరు పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో పోటీ ఎలా ఉంటుందనే విషయమై కూడా వివరాలు సేకరించారు. టీఆర్ఎస్ కార్యకర్తల్లో, ఉద్యమకారుల్లో పార్టీ నాయకులపై ఉన్న అభిప్రాయాలను కూడా సేకరించినట్లు తెలిసింది. ఇక ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్న నేపథ్యంలో సదరు అంశంపైనా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ పోటీ చేస్తే ఆ ప్రభావం జిల్లాలో ఎలా ఉంటుందనే విషయమై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద ఐప్యాక్ సర్వేపై కేసీఆర్ మదింపు చేస్తున్న నేపథ్యంలో సిట్టింగ్‌ల్లో టెన్షన్ నెలకొంది. -
నిజామాబాద్‌లో దారుణం.. మద్యం తాగాక ఫోన్.. రూ.వెయ్యి తక్కువ ఇచ్చాడని..
నిజామాబాద్ అర్బన్: నగరంలోని దుబ్బ ప్రాంతంలో గత రెండు రోజుల కిందట జరిగిన హత్య వివరాలను ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నగరంలోని తన ఛాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం వెయ్యిరూపాయల కోసం జరిగిన గొడవలో యువకుడు హత్యకు గురైనట్లు తెలిపారు. బాన్సువాడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ వసీమోద్దీన్, షేక్‌సమీయోద్దీన్ ఇద్దరూ అన్నదమ్ముళ్ల పిల్లలు. వీరు నిజామాబాద్‌లోని ముస్తాఫా ఫ్లవర్ మర్చంట్‌లో పనికోసం చేరారు. ముస్తఫా వద్ద వసీయోద్దీన్ రెండు సంవత్సరాల క్రితం సమీయోద్దీన్ సమక్షంలో రూ.45వేలు అప్పుగా తీసుకున్నారు. వసీయోద్దీన్ పనిమానివేయడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ముస్తఫా డిమాండ్ చేశారు. దీంతో ఈనెల 24న వజీయోద్దీన్ ఒక్కడే ముస్తాఫా వద్దకు వెళ్లి రూ.44వేలు కట్టాడు. అనంతరం వసీయోద్దీన్, సమీయోద్దిన్ కాలూరు చౌరస్తాకు వెళ్లి అక్కడ మద్యం కొనుగోలు చేసి తాగారు. (చదవండి: ‘నుడా’ మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం.. ప్లాన్‌లోకి వచ్చిన గ్రామాల జాబితా ఇదే!) అంతలోనే మజాస్ అనే వ్యక్తి సమీయోద్దీన్‌కు ఫోన్‌చేసి రూ.45వేలకుగాను రూ.44వేలు మాత్రమే చెల్లించాడని, రూ.వెయ్యి తక్కువగా ఇచ్చాడని తెలిపాడు. దీంతో డబ్బులు ఎందుకు తక్కువ ఇచ్చావంటూ వసీయోద్దీన్, సమీయోద్దీన్‌ల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో వసీయోద్దీన్ తన వద్ద ఉన్న కత్తితో సమీయోద్దీన్‌ను ఇష్టంవచ్చినట్లు పోడిచాడు. గొడవను అలీం ఆపేందుకు ప్రయత్నంచేయగా అతన్ని కూడా చంపుతానని బెదిరించాడు. వెంటనే అలీం పారిపోయాడు. సమీయోద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. వసీయోద్దీన్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వసీయోద్దీన్‌ను నిజాంసాగర్ బస్టాండ్‌లో పట్టుకొని విచారించారు. హత్యచేసినట్లు అతడు ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్సై భాస్కరచారి, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్ మరి!) -
ప్రేమించి పెళ్ళి చేసుకుని కొడుకు పుట్టిన తర్వాత.. మరో అమ్మాయితో..
సాక్షి, బాన్సువాడ : ప్రేమించి పెళ్ళి చేసుకుని కొడుకు పుట్టిన తర్వాత కాపురానికి తీసుకెళ్ళడం లేదని ఆరోపిస్తూ నాగారం గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళ బుధవారం దేశాయిపేట్‌లో భర్త ఆకుల శివకృష్ణ ఇంటిముందు ఆందోళనకు దిగారు. సీపీఎం, దళిత సంఘాల నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. స్వాతీ మాట్లాడుతూ.. డిగ్రీ చదువుతున్న సమయంలో తాను శివకృష్ణ ప్రేమించుకొని నిజామబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తమకు బాబు పుట్టిన తర్వాత తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించి వివాహానికి సిద్దమయ్యాడని పేర్కొన్నారు. చదవండి: ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్! తాను దళిత సామాజిక వర్గం కావడంతో తన అత్త మామలు, ఆడపడుచులు కాపురానికి తీసుకెళ్ళకుండా తన భర్తకు వేరే పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తన భర్త కాపురానికి అనుమతించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా స్వాతి భర్త శివకృష్ణ అక్కడకు చేరుకుని గురువారం పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పడంతో బాధితురాలు ఆందోళన విరమించారు. సీపీఎం నాయకులు రవీందర్, ఖలీల్, ఎస్సీ, బీసీ సంఘం నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. చదవండి: పెళ్లైన ఆర్నెళ్లకే.. భార్యను వదిలేసి ప్రియురాలితో.. -
Telangana: అక్కడ 3 భాషలు వస్తేనే ఎన్నికల్లో గెలుపు
బాన్సువాడ: ఆధునిక యుగంలో స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ రాకతో ప్రపంచంలో సాంకేతిక విప్లవం వచ్చింది. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న సాంకేతిక విప్లవం ప్రజల జీవన విధానాలను పూర్తిగా మార్చేసింది. పట్టణాల్లో ప్రజలు ఆనాదిగా వస్తున్న కట్టుబాట్లను ఛేదించి, కొత్త రకం ఫ్యాషన్లు, విహాంగ వీక్షణం చేస్తున్నారు. పల్లెపల్లెలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు విస్తరిస్తున్నాయి. భాష, వేషాధారణ మారుతోంది. అయితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం తరతరాలుగా వస్తున్న కట్టుబాట్లనే అనుసరిస్తున్నారు అక్కడి ప్రజలు. వారి జీవన విధానంలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ తరం యువతీ, యువకులు ఆధునిక పోకడలకు వెళ్తుండగా, వారి తల్లిదండ్రులు, తాత, నానమ్మలు మాత్రం పాత కాలం నాటి సంస్కృతి, వేషాధారణే అనుకరిస్తున్నారు. ఆ కాలం నాటి రవాణా సౌకర్యాలనే నేటికీ వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దులో ఉన్న మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, కోటగిరి, బీర్కూర్ ప్రాంతాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తారు. ఇక్కడ మరాఠి, కన్నడ, తెలుగు భాషలకు మాట్లాడే వారు కనిపిస్తారు. మూడు భాషలు మాట్లాడుతున్నందున ఈ ప్రాంతాన్ని త్రిభాషా సంగమంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటైన జుక్కల్, బాన్సువాడ సెగ్మెంట్లు విభిన్న సంస్కృతులకు సమ్మేళనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణకు ముందు నిజామాబాద్, నాందేడ్, బీదర్ జిల్లాలు నిజాం సర్కార్ పాలిత రాష్ట్రమైన దక్కన్లో ఉండేవి. తర్వాత విడిపోయి నిజామాబాద్ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో, నాందేడ్ జిల్లా మహారాష్ట్రలో, బీదర్ జిల్లా కర్ణాటకలో కలిసాయి. ఈ మూడు జిల్లాలు కలిసి ఉండడం వల్ల మూడు భాషలను మాట్లాడే వారు ఇక్కడ ఉన్నారు. 70 శాతం ప్రజలకు ఫ్రిజ్‌లంటే తెలియదు జుక్కల్ సెగ్మెంట్లో నివసించే ప్రజల ఆచార, వ్యవహారాలు, మిగితా ప్రాంతాలతో పోల్చితే భిన్నంగా ఉంటాయి. ఇక్కడ నేటికీ జొన్న రొట్టె అంటేనే వారికి ప్రీతి. జొన్న రొట్టే, మినప్పప్పు, కంది పప్పుతో భుజిస్తేనే వారికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. గ్రామాల్లో పెద్ద పెద్ద ఇండ్లు ఉండడం, ఆ ఇండ్ల ఎదుట ఉండే వాకిలిపై సాన్పు వేయడం, ఒక గదిని పూర్తిగా ధాన్యాగారంగా ఉంచడం, ఇండ్లలో నెలల తరబడి ఫ్యాన్లు వినియోగించకపోవడం చూడవచ్చు. సుమారు 70 శాతం ప్రజలకు ఫ్రిజ్‌లంటే తెలియదు. గుర్రాలు, ఒంటెలు వారికి రవాణా సాధనాలు ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ ఇంకా మెరుగు పడకపోవడంతో గాడిదలు, ఒంటెలు, గుర్రాలను ప్రయాణ సాధనాలుగా ఉపయోగిస్తారు. మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లోని మారు మూల గ్రామాల్లో రవాణా ఇప్పటికీ గుర్రాలు, ఒంటెలపై సాగడం జరుగుతోంది. కాలినడకన ఊర్లు దాటుతారు. ఆనాటి నుంచి వస్తున్న ఈ సాంప్రదాయం మారుమూల ప్రాంత గ్రామాల్లో కనిపిస్తుంది. మద్నూర్‌లో పత్తి వ్యాపారం కొనసాగుతుంది. పత్తిని జిన్నింగ్ మిల్లులకు తరలించడానికి, మారుమూల గ్రామాల ప్రజలతో పాటు మహారాష్ట్ర ప్రాంత వాసులు ఒంటెలపై తీసుకురావడం ఇప్పటికీ కనిపిస్తోంది. వృద్ధులను ఆసుపత్రులకు చికిత్సల కోసం గుర్రాలు, గాడిదలు, దున్నపోతులపై గ్రామాల ప్రజలు తీసుకువచ్చే దృశ్యాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ధాన్యం తరలింపునకు నేటికి గాడిదలను వినియోగిస్తారు. బాన్సువాడ, బీర్కూర్, జుక్కల్, మద్నూర్ తదితర ప్రాంతాల్లో వానాకాలం, యాసంగి సీజన్లలో వందల సంఖ్యలో గాడిదలు మహారాష్ట్ర నుంచి తీసుకువస్తారు. ధాన్యం మోసినందుకు వారికి డబ్బులు ఇవ్వకుండా కొంత ధాన్యం ఇస్తారు. మూడు భాషలు వస్తేనే ఎన్నికల్లో గెలుపు అలాగే జుక్కల్ సెగ్మెంట్లో ఎమ్మెల్యేగాను, ఎంపిపి, జడ్పీటిసిలుగా పోటీ చేసే వారికి మూడు భాషలు వస్తేనే ఎన్నికల్లో గెలుపొందుతారని తెలుస్తోంది. ఇక్కడ తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, కన్నడి భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ భాషలను అనర్గళంగా మాట్లాడే నేతలను ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు. మాజీ ఎమ్మెల్యే గంగారాం, ప్రస్తుత ఎమ్మెల్యే హన్మంత్ షిండేలకు ఈ మూడు భాషలు రావడం వల్లే వారు ప్రజల్లో దూసుకెళ్తున్నారు. గత 1999లో కాంగ్రెస్ తరపున ఎమ్మె ల్యేగా పోటీ చేసిన డి.రాజేశ్వర్‌కు తెలుగు తప్పా మిగితా భాషలు రానందువల్లే ఆయన ఎన్నికల్లో గెలుపొందలేకపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ నాలుగు భాషలను మాట్లాడేవారు మాత్రమే గెలుస్తారని వారు పేర్కొంటున్నారు. వేషాధారణలోనూ ప్రత్యేకతే అలాగే ఈ ప్రాంత ప్రజలు, ధోతీలు, కుర్తాలను అధికంగా ధరిస్తారు. నేడు జీన్స్, టీషర్ట్స్ వచ్చినా, వాటిని ధరించకుండా పాత కాలం నాటి దుస్తులను మాత్రమే ధరించడం విశేషం. మహిళలు ఖాదీ చీరలను, జాకెట్లను ధరిస్తారు. మగవారు తలపై పాగ ధరించడం, భుజంపై టవల్ వేసుకొని చేతిలో రేడియో తీసుకొని గ్రామంలో తిరుగుతుంటారు. ఇప్పటికీ ఇక్కడ పటేల్, పట్వారీలుగా ఒకరినొకరు సంబోధించుకొంటారు. గ్రామానికి పెద్ద మనిషి ఉండి, అతను ఇచ్చే ఆదేశాలను పాటించడం నేటికీ కనిపిస్తుంది. గిరిజనులు తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్వాడీలు ప్రత్యేక పండగలను నిర్వహిస్తారు. చారిత్రాత్మక ప్రాంతం ఇది కౌలాస్ రాజులు పాలించిన ప్రాంతం జుక్కల్, బాన్సువాడ సెగ్మెంట్లు. అందుకే ఇక్కడి అనేక గ్రామాల్లో బురుజులు, చిన్న చిన్న పురాతన కట్టడాలు కనిపిస్తాయి. ఆ నాడు పటేళ్ళుగా ఉన్న వారిని నేటికీ ఎంతో ఆదరిస్తారు. జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి మండల కేంద్రాల్లో పురాతన బురుజులు ఉన్నాయి. మద్నూర్ మండల కేంద్రంలో ఎల్లమ్మగల్లి ప్రాంతంలో ఇప్పటికీ అప్పటి కాలం నాటి బురుజులు పెద్ద ఎత్తున ఉండడం చరిత్రకు నిదర్శనంగా చెప్పవచ్చు. మద్నూర్ మండల కేంద్రంలో అప్పట్లో పెద్ద జైళ్ళు ఉండేవని పెద్దలు చెబుతూ ఉంటారు. రాజు పరిపాలనలో తప్పు చేసిన వారిని జైలుకు తరలించే వారని, పెద్ద గోడలు చుట్టుపక్కల ఉండేవని వారు తెలిపారు. రానురాను ఈ బురుజులు కూలిపోతున్నాయి. బాన్సువాడ, మద్నూర్‌లు పాత తాలూకా కేంద్రాలుగా ఉండడంతో ఇప్పటికీ ఇక్కడి తహసిల్దార్ కార్యాలయాలు చరిత్రకు సాక్షిగా నిలిచాయి. బాన్సువాడ సమీపంలో ఉన్న సోమలింగేశ్వర ఆలయం ఎంతో చారిత్రాత్మకమైన ఆలయం. మరాఠీ మీడియంలో విద్యాబోధనలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లే ని విధంగా మద్నూర్ మండలంలో మరాఠీ మీడియం పాఠశాలలు ఉండడం విశేషంగా చెప్పవచ్చు. మద్నూర్ మండలంలో అప్పట్లో మహారాష్ట్రలో ఉండేది. మరాఠీ భాషలో మాట్లాడే వారు ఇక్కడ అధికంగా ఉండడంతో ప్రభుత్వం ఇక్కడ మరాఠీ మీడియం పాఠశాలలను కొనసాగిస్తోంది. మిర్జాపూర్, చిన్నశక్కర్గ, కేలూర్, తడిహిప్పర్గ గ్రామాల్లోనూ మరాఠి మీడియం పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడి సంస్కృతి విభిన్నం: అనీత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, మద్నూర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ మండలాల్లో ఆచార, వ్యవహారాలు, సంస్కృతి విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ వివాహాది శుభ కార్యాలు మరాఠా సంస్కృతిలో చేస్తారు. ఇక్కడి ప్రజలు అందరితో కలుపుగోలుగా ఉంటారు. గ్రామాల్లో ఎంతో ఉత్సాహంగా బంధువులను ఆహ్వానిస్తారు. ప్రతీ ఒక్కరితో కలుపుగోలుగా ఉంటారు. మత సామరస్యానికి ప్రతీక ఈ ప్రాంతం: తుకారాం మరాఠా, ఆవల్‌గావ్, మద్నూర్ ఇక్కడ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, మరాఠాలు, మార్వాడీలు అనే భేదం ఉండదు. అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటారు. బంధు వరసలతో మాట్లాడుకుంటారు. మరాఠాలు, తెలుగు వాళ్ళనే భేదం ఉండదు. అందరం కలిసి ఉంటాం. మరాఠీ మీడియంలో చదువుతారు: శివ శంకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మద్నూర్ ఇక్కడ తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, కన్నడ భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మరాఠీ మీడియం స్కూళ్ళు కూడా ఉన్నాయి. హిందీ భాష ప్రతీ ఒక్కరికి వస్తుంది. తెలుగు మాట్లాడడం కంటే మరాఠీయే ఎక్కువగా మాట్లాడుతారు. దగ్గర్లోనే దెగ్లూర్ పట్టణం ఉన్నందున అక్కడికే వెళ్ళి షాపింగ్ చేస్తారు. పల్లెల్లో మార్పు వస్తోంది: దశరథ్, మద్నూర్ గ్రామాల్లో ఇప్పుడిప్పుడే యువతలో మార్పు వస్తోంది. మా తరం వారు మాత్రం మారడం లేదు. అవే పాత ఆచార వ్యవహారాలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్లంటే చాలా మందికి తెలియదు. చిన్న చిన్న ఫోన్లే వాడుతున్నాం. టీవీలు, రేడియోలు గ్రామాల్లో ఉన్నాయి. ఇక్కడ ఇంకా రవాణా వ్యవస్థ మెరుగుపడాల్సి ఉంది. -
మళ్లీ వికటించిన భోజనం.. 70 మంది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, బాన్సువాడ: మధ్యాహ్న భోజనం మళ్లీ వికటించింది. బీర్కూర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం కుళ్లిన గుడ్లు వడ్డించడంతో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని బాన్సువాడ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేటలో గత గురువారం మధ్యా హ్న భోజనం వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జరిగి వారం రోజులు కూడా తిరక్కుండానే మళ్లీ మధ్యాహ్న భోజనం వికటించిన ఘటన చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య పాఠశాలలో 321 మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం 264 మంది బడికి వచ్చారు. రోజులాగే బుధవారం కూడా మధ్యాహ్న భోజనం పెట్టారు. పిల్లలకు అన్నం, పప్పుతో పాటు గుడ్డు వడ్డించారు. చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు కూడా భోజనం చేశారు. అయితే, అన్నం తిన్న తర్వాత కొద్ది సేపటికి విద్యార్థులు కడుపు నొప్పితో అల్లాడి పోయారు. ఒక్కొక్కరు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ఇది గమనించిన ఉపాధ్యాయులు విద్యా శాఖ అధికారులకు, అలాగే, స్థానిక ప్రజాప్రతినిధులకు, ఆరోగ్య సిబ్బందికి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బీర్కూర్, బాన్సువాడ, వర్ని, కోటగిరి అంబులెన్సులతో పాటు రెండు ప్రైవేటు వాహనాల్లో 70 మందిని చిన్నారులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముందుగానే బాన్సువాడ ఆస్పత్రికి సమాచారం అందించడంతో విద్యార్థులకు సరిపడా పడకలు అందుబాటులో ఉంచారు. చదవండి: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు కుళ్లిన గుడ్లు..! మధ్యాహ్న భోజనంలో వడ్డించిన గుడ్ల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని గుర్తించారు. ఉడికించిన గుడ్డు కుళ్లిపోయిన వాసన వచ్చినట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ రాజు, ఎంఈవో నాగేశ్వర్రావు వంటశాలను, సామగ్రిని పరిశీలించిన వివరాలు నమోదు చేసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ తెలిపారు. అయితే, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు: స్పీకర్ బాన్సువాడ టౌన్: విద్యార్థుల అస్వస్థతకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన బుధవారం పరామర్శించారు. ఒక్కో విద్యార్థితో మాట్లాడి వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం అనంతరం గుడ్డు తినడంతోనే కడుపులో నొప్పి, వాంతులు అయ్యాయని చిన్నారులు వివరించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. గుడ్డు తినడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. -
కాళ్లు కడిగి.. కన్యాదానం చేసి.. ఆదర్శంగా నిలిచిన ముస్లిం దంపతులు
సాక్షి, బాన్సువాడ: గంగాజమునా తెహజీబ్ తెలంగాణది. పాలునీళ్లలా కలిసిపోయే సంస్కృతి ఈ ప్రాంతం సొంతం. అది మరోసారి రుజువయ్యిందీ పెళ్లితో. దత్తత తీసుకున్న హిందూ యువతికి.. హిందూ సంప్రదాయం ప్రకారం కాళ్లు కడిగి కన్యాదానం చేశారీ ముస్లిం దంపతులు. బాన్సువాడలో ఆదివారం జరిగిన ఈ వివాహంలో మరో విశేషం కూడా ఉంది. అది కులాంతరం కావడం. చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో వివరాల్లోకి వెళ్తే... ప్రస్తుతం బాన్సువాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఇర్ఫానా బాను, పదేళ్లకిందట జిల్లాలోని తాడ్వాయి గురుకుల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఓ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చందన అనే బాలికను ఆమె బంధువులు గురుకులంలో చేర్పించారు. అమ్మాయికి తల్లిదండ్రులు లేరని తెలుసుకున్న ఇర్ఫానాబాను, అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుళ్లున్నా.. చందనను దత్తత తీసుకున్నారు. గురుకులంలో చదువుతున్న చందనను సెలవుల్లో తన ఇంటికే తీసుకెళ్లేవారు. ఆమె ఇంటర్మీడియెట్ పూర్తి చేశాక, హైదరాబాద్‌లో డీఎంఎల్టీ (ల్యాబ్ టెక్నీషియన్) కోర్సు చేయించారు. అది కూడా పూర్తి కావడంతో.. పెళ్లి విషయాన్ని ఇతర టీచర్లతో పంచుకున్నారు. చదవండి: ఠాణా.. తందానా..అవినీతి మకిలీలో హైదరాబాద్ పోలీసులు అలా ఓ టీచర్ నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసే వెంకట్రాంరెడ్డితో సంబంధం కుదిర్చారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతున్న పెళ్లి కాబట్టి.. ఇర్ఫానాబాను భర్త షేక్ అహ్మద్‌తో కలిసి వరుడి కాళ్లు కడిగారు. అన్ని లాంఛనాలతో ఘనంగా పెండ్లి చేశారు. కట్నం, ఇతర పెట్టిపోతలకు ఇర్ఫానా బానుతో పాటు గురుకులంలోని కొందరు టీచర్లు సహకారం అందించారు. అలాగే వివాహం, భోజన ఖర్చులకు పట్టణానికి చెందిన సాయిబాబా గుప్త స్వచ్ఛంద సాయం చేశారు. ఇర్ఫానాబాను ఇద్దరు కూతుర్లు, అల్లుళ్లు, బంధువులు విచ్చేసి ఆశీర్వదించారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాతబాలకృష్ణ, కౌన్సిలర్ నార్ల నందకిషోర్, మహ్మద్ ఎజాస్తో ఇతరులు తరలి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. నాకు మూడో బిడ్డ చందన చందనను ఆమె 6వ తరగతిలో ఉన్నప్పుడు దత్తత తీసుకున్నాను. డీఎంఎల్‌టి వరకు చదివించి పెళ్ళి చేస్తున్నాను. మా సిబ్బంది, ఇతర పెద్దల సహకారంతోనే నేడు పెళ్ళి జరుగుతోంది. మానవత్వానికి మతం అడ్డుకాదు. నాకు ఇద్దరు కూతుర్లు. చందన నా మూడో కూతురు. – ఇర్ఫానాబాను, ప్రిన్సిపాల్, గురుకులం, బోర్లం -
బాన్సువాడలో నకిలీ నోట్ల కలకలం
సాక్షి, బాన్సువాడ: నకిలీ నోట్ల కేసులో బాన్సువాడ యువకుడ్ని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం జిల్లాలో కలకలం సృష్టించింది. చత్తీస్‌గఢ్‌లో నకిలీ నోట్లను ముద్రించగా, సుమారు రూ.8 లక్షల విలువైన నోట్లను బాన్సువాడ యువకుడు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇవే నకిలీ నోట్లు మధ్యప్రదేశ్‌లోనూ చెలామణి కాగా, అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఫేక్ కరెన్సీ విషయం వెలుగులోకి వచ్చింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాయ్ జిల్లా కేంద్రంలో నరేశ్పవార్ అనే వ్యక్తి నకిలీ నోట్లు ముద్రించగా, అతని నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు నోట్లను కొనుగోలు చేసినట్లు తేలింది. విచారణలో అతను ఇచ్చిన సమాచారం మేరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌గఢ్ జిల్లా జీరాపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మంగళ్‌సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది. బాన్సువాడకు చెందిన యువకుడు నకిలీ విషయం యూట్యూబ్‌లో చూసి నరేశ్పవార్ను సంప్రదించినట్లు తేలింది. దీంతో మధ్యప్రదేశ్ పోలీసు లు శుక్రవారం రాత్రి బాన్సువాడకు వచ్చారు. స్థానిక పోలీసుల సహాయంతో సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు సుమారు రూ.8 లక్షల నకిలీ నోట్లను బాన్సువాడకు తీసుకొచ్చాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, నోట్ల చెలామణి చేశాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే పోలీసులకు ఎలాంటి నకిలీ నోట్లు లభించలేదు. నకిలీ నోట్లు ప్రింట్ చేసిన వ్యక్తిని ఏ–1గా చేర్చి, అతని వద్ద నోట్లు కొనుగోలు చేసిన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై దృష్టి సారించారు. వీరంతా కలిసి భారీగా నకిలీ నోట్లను ముద్రించేందుకు ప్లాన్ వేసిన ట్లు తెలిసింది. నకిలీ నోట్ల కేసులో బాన్సువాడకు చెందిన యువకుడిని మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని బాన్సువాడ టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి చెప్పారు. అతను ఎన్ని నోట్లు తీసుకువచ్చాడు? చెలామణి చేశాడా.. లేదా? అనే సమాచారం లేదని తెలిపారు. వర్నీలో రూ.2 వేల నకిలీ నోటు వర్నీలో రూ.2 వేల నకిలీ నోటు వెలుగు చూసింది. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామా నికి చెందిన ఓ మహిళ.. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో కూలీ పనికి వెళ్లగా, రైతు ఆమెకు రూ.2 వేల నోటు ఇచ్చాడు. అయితే, అది దొంగ నోటుగా గుర్తించిన మహిళ కుమారుడు రెండ్రోజుల క్రితం బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌లో అందజేసినట్లు సమాచారం. ఆ నోటును శుక్రవారం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఎస్సై మంగళ్‌సింగ్ రాథోడ్ పరిశీలించగా, అది చత్తీస్‌గఢ్ ముఠాది కాదని తేల్చినట్లు సమాచారం. ఈ నోటు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ప్రింట్ చేశారని, ఈ నకిలీ నోట్లను కర్ణాటక నుంచి చెలామణి చేశారని గుర్తించినట్లు సమాచారం. -
కల్లు కోసం ఆస్పత్రి నుంచి పరారీ
సాక్షి, బాన్సువాడ: కల్లు లేక ఓ కరోనా బాధితుడు ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. అయితే.. అతని కోసం రోజంతా గాలించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తాను కల్లు లేనిదే ఉండలేనని, చికిత్స కన్నా.. కల్లే ముఖ్యమని సదరు బాధితుడు తెగేసి చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో కల్లు తాగించి మళ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం చోటుచేసుకుంది. పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన కరోనా బాధితుడు (55) కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం ఉదయం ఆస్పత్రి నుంచి పారిపోయాడు. రె గ్యులర్ చెకప్ కోసం వచ్చే వైద్యుడు, సిబ్బంది ఆ రోగి లేకపోవడంతో అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు పట్టణంలో తనిఖీలు చేశారు. సంగమేశ్వర కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద ఓ మూలన అర్ధనగ్నంగా కూర్చొని కనిపించాడు. ఆస్పత్రి నుంచి ఎందుకు పారిపోయావని నిలదీయగా.. తనకు కల్లు దొరకడం లేదని, అందుకే పారిపోయి వచ్చానని చెప్పాడు. అంబులెన్స్‌లో ఎక్కించేందుకు యత్నించగా.. ఆస్పత్రికి రానంటూ మొండికేశాడు. దీంతో పోలీసులు రెండు లీటర్ల కల్లు తెప్పించి ఇచ్చారు. అది తాగిన తర్వాత అతడిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. చదవండి: బ్లాక్-వైట్-ఎల్లో... ఈ ఫంగస్‌లతో ప్రమాదమేంటి? -
తిండి కోసం కోతి తిప్పలు
సాక్షి, బాన్సువాడ: ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో మూగజీవులకు అటవీ ప్రాంతంలో ఆహారం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాగడానికి నీరు లేక, పండ్లు ఫలాలు లేక మూగజీవులు రోడ్లపైకి వస్తున్నాయి. బాన్సువాడ–గాంధారిల మధ్య దట్టమైన అడవులు ఉండగా, ప్రస్తుతం ఆకులన్నీ రాలిపోయి, చెట్లు నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో ఈ అడవిలో ఉన్న వానరాలన్నీ నిత్యం కామారెడ్డి–బాన్సువాడ రోడ్డుపైనే కనిపిస్తున్నాయి. రహదారి వెంబడి వెళ్లే వారెవరైనా ఆహార వస్తువులను, పండ్లు ఫలాలను పడేస్తేనే తింటాయి. అలాగే ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమవడంతో రైతులు రోడ్డుపై పంట నూర్పిళ్లను చేస్తున్నారు. నూర్పిళ్లు చేసిన పంటను రైతులు ఇంటికి తీసుకుపోతుండగా, రోడ్డు పక్క పడిన గింజలను తింటున్నాయి. అటవీ ప్రాంతాల్లో చెట్లు ఎండిపోవడంతో మూగజీవాలకు నిలువ నీడ లేకుండా పోయింది. బాన్సువాడ–నిజామాబాద్, బాన్సువాడ–కామారెడ్డి రోడ్లపై ఇరువైపులా ఉన్నమర్రి చెట్లపై వానరులు నివాసముంటూ, నిత్యం ఆహారం కోసం పడరాని పాట్లు పడడం గమనార్హం. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వానరాలకు ఆహారం ఇదిలాఉండగా, గత ఏడాది వానరాలు పడుతున్న పాట్లను చూసి చలించిన బాన్సువాడలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రతి ఆదివారం ప్రత్యేకంగా పండ్లు, ఫలాలను వానరాలకు అందజేశారు. ప్రత్యేక ఆటోల్లో వీరు పండ్లను తీసుకెళ్ళి వాటికి వేశారు. నీటి ప్యాకెట్లను సైతం అందజేశారు. వారాంతపు సంతలో కుళ్లిపోయిన కూరగాయలు, వృథాగా ఉన్న కూరగాయలను సైతం అడవులకు తరలించి వానరాలకు అందజేసే విధంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు రావాలి. చదవండి: ఉయ్యాలపై వృద్దుడి స్టంట్.. నెటిజన్లు ఫిదా! -
ఫామ్‌హౌజ్‌లలో ఉన్నా వదిలేది లేదు: బండి సంజయ్
సాక్షి, కామారెడ్డి : రైతులకు సన్న వడ్ల రకాలు వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో దొడ్డు రకాలు వేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బాన్సువాడలో బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో బండి సంజయ ప్రసంగించారు. ఈ మేరకు పీఎన్బీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ లాగా దొంగలు ఎక్కడున్న వదిలేది లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో ఫామ్‌హౌజ్‌లలో ఉన్నా వదిలేది లేదని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నాయకులు గ్రామల్లోకి వస్తే సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ఏదని నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ఇస్తున్న నిధులను టీఆర్ఎస్ సర్కార్ ఫొటోలూ పేర్లు మార్చి మోసం చేస్తోందని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీగా టీఆర్ఎస్ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఏ మతానికి వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 2023 లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. రామరాజ్యం రావాలంటే రామ భక్తులకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ కార్యకర్తలను బెదిరించి కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. బాన్సువాడ వెనుబడిన నియోజకవర్గంగా మిగిలిపోయిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణలో బాన్సువాడ ఉందో లేదో తెలియదన్నారు. బాన్సువాడను ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్కు అమ్మేశాడని విమర్శించారు. కారు రథసారథి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ చేతుల్లో ఉందని తెలిపారు. కేసీఆర్ స్టీరింగ్ ఎటు తిప్పుమంటే అటు తిప్పుతారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
పోస్ట్‌మ్యాన్ నిర్వాకం.. రెండేళ్లుగా
సాక్షి, బాన్సువాడ: సాధారణంగా పోస్టుమ్యాన్లు ఉత్తరాలు అందివ్వడం ఆనవాయితీ. అయితే, బట్వాడా చేయకుండా రెండేళ్లుగా 7 వేల ఉత్తరాలను మూలన పడేశాడో పోస్ట్‌మ్యాన్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్టాండ్ సమీపంలోని తన బంధువులకు చెందిన ఓ హోటల్ గదిలో 12 సంచుల్లో పోస్ట్‌మ్యాన్ బాలకృష్ణ ఉత్తరాలను పడేశాడు. తమకందిన సమాచారంతో ఈ బాగోతం బయటపడిందని, శనివారం ఆ ఉత్తరాలను స్వాధీ నం చేసుకున్నామని, ఇందుకు బాధ్యుడైన బాలకృష్ణను సస్పెండ్ చేసినట్లు ఏఎస్పీ రాజనర్సాగౌడ్ తెలిపారు. చదవండి: పెన్షన్‌తో పాటు కరోనాను పంచాడు.. -
ప్రాణం తీసిన ఫుల్ బాటిల్ పందెం
సాక్షి, బాన్సువాడ : మద్యం బాటిల్లో సోడా, నీరు కలపకుండా సేవించాలని ఇద్దరు మిత్రులు కాసిన పందెంలో ఒకరు మృతి చెందారు. బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గురువారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఎస్ సాయిలు (40) తన ఐదుగురు మిత్రులతో కలిసి పట్టణ శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు. చేనులో అందరు కలిసి మద్యం సేవిస్తుండగా, మాటల మధ్యలో సాయిలు, మరో మిత్రుడి మధ్య వాదన పెరిగి బెట్టింగ్‌కు దిగారు. ఇరువురు సోడా, నీరు కలపకుండా ఫుల్ బాటిల్ సేవించారు. ఇరువురు మత్తులోకి జారిపోగా తోటి మిత్రులు వీరిని ఇళ్లకు పంపించారు. అయితే సాయిలు ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు విరోచనాలు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించినప్పటికీ అతను అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మహేష్‌గౌడ్ తెలిపారు. -
బాన్సువాడ పోలీస్ స్టేషన్ మూసివేత
సాక్షి, కామారెడ్డి : బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీకి చెందిన ఒక మహిళ(62) కరోనా బారిన పడింది. కాగా కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కుమారుడు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు రావడంతో పోలీసులు ఆందోళన చెందారు. తనకు కరోనా వచ్చిందని, టెస్టులు చేయడం లేదని ఆమె కుమారుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి హంగామా సృష్టించాడు. దీనిపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక వైద్యులకు సమాచారం ఇచ్చి ఆమె కుమారుడిని పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా బాన్సువాడ పోలీస్‌స్టేషన్ ఎదుట బారీకేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్‌ను మూసివేశారు.అయితే దీనిపై మహేశ్ గౌడ్ మాట్లాడుతూ..అనుమానితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వస్తుండడంతో ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయించామన్నారు. పోలీస్‌స్టేషన్‌లో శానిటైజర్లను అందుబాటులో ఉంచామన్నారు. బాధితులు ఎవరు వచ్చినా మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకున్నాకే లోపలికి రావాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. (భారత్: ఒక్కరోజే 15968 పాజిటివ్ కేసులు) ఎలా వచ్చిందో.. కరోనా వచ్చిన మహిళ వారం క్రితం తన చిన్న కుమారుడికి వైద్యం నిమిత్తం హైదరాబాద్ సూరారంలోని ఓ ఆస్పత్రికి ఆర్టీసీ బస్సులో వెళ్లింది. అక్కడ ఆమెకు ఛాతీ నొప్పి రావడంతో వైద్యులు ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని చికిత్స అందించారు. కరోనా పరీక్షలు కూడా చేశారు. మంగళవారం ఉదయం ఆమె తన ఇద్దరు కుమారులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కారులో బాన్సువాడకు వచ్చింది. మధ్యాహ్నం సూరారంలోని ఆస్పత్రి నుంచి వైద్యు డు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వెంటనే పోలీస్ స్టేషన్లో, ఏరియా ఆస్పత్రిలో రిపోర్టు చేయాలని సూచించారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో ఆమె పెద్ద కుమారుడిని పట్టణంలోని పోలీ స్ స్టేషన్‌కు పిలిపించారు. స్థానిక వైద్యులకు సమాచారం ఇచ్చి, కుటుంబ సభ్యులను పరీక్ష నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా కరోనా వచ్చిన మహిళ బాన్సువాడలో ఎవరినీ కలవలేదని, కుటుంబ సభ్యులు మాత్రమే ప్రథమ కాంటాక్ట్‌లో ఉన్నారని అధికారులు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన మహిళతో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్లో ఉంచారు. (కరోనా లేదని నిరూపించలేక 965 కి.మీ..) 18 మందికి నెగెటివ్.. కాగా జిల్లాపై కరోనా పంజా విసిరింది. ఒకే రోజు పది మంది పాజిటివ్ వచ్చింది. దీంతో కోవిడ్ కేసుల సంఖ్య 34కు చేరింది. ఇందులో 12 మంది రెండు నెలల క్రితమే కోలుకుని ఇంటికి చేరారు. 22 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాకేంద్రం నుంచి ఆదివారం 24 మంది రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వాటి ఫలితాలు మంగళవారం వచ్చాయి. ఆరు పాజిటివ్ రాగా.. 18 నెగెటివ్ వచ్చాయి. కామారెడ్డి పట్టణంలోని అశోక్నగర్కాలనీలో నివసించే 72 ఏళ్ల వ్యక్తికి, వాసవినగర్‌లో నివసించే 37 ఏళ్ల వ్యక్తికి, ఆజంపురాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి, బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తికి, సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తితోపాటు 48 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. వీరందరూ శనివారంనాటి పాజిటివ్ కేసుల ప్రైమరీ కాంటాక్ట్‌లని పేర్కొన్నారు. జనగామ కేసును హైదరాబాద్‌కు రిఫర్ చేయగా మిగతా వారిని హోం క్వారంటైన్లో ఉంచామన్నారు. కరోనా బాధితుల ప్రైమరీ కాంటాక్ట్‌ల వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఆశోక్నగర్కాలనీలో మరొకరికి.. పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో నివసించే ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా రు. ఆయన అక్కడే ఉంటూ వారానికోసారి కామా రెడ్డి వచ్చి వెళ్తుంటారు. అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఆదివారం హైదరాబాద్‌లో కరోనా పరీక్ష చేయించుకోగా.. మంగళవారం పాజిటివ్ వచ్చింది. ఆయన భార్య జిలాలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్లో ఉంచారు. -
డబుల్ బెడ్రూం పేరిట నకిలీ పట్టాల బాగోతం
సాక్షి, కామారెడ్డి : జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట దళారులు కొనసాగిస్తున్న దందాపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నియోజకవర్గమైన బాన్సువాడలో దందా జరుగుతుండడంతో ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. వివరాలు.. గత కొంతకాలంగా బాన్సువాడ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పేరుతో డబుల్ బెడ్రూం ఇండ్లపై నకిలీ పట్టాలు తయారీ చేస్తున్నట్లు సమాచారం అందింది. బాన్సువాడ ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ పట్టాల బాగోతం బయటపడింది. పేదల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ పట్టాలను అంటగట్టి వారిని నిలువునా మోసం చేస్తున్నట్లు తేలింది. దీనిపై వెంటనే సమగ్ర విచారణ విచారణ జరిపి అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. -
దున్నపోతుకు వినతి పత్రం.. వినూత్న నిరసన
సాక్షి, బాన్సువాడ : బాన్సువాడలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 14వ రోజుకు చేరింది. సమ్మె శిబిరం వద్ద కార్మికులు కోలాటం ఆడి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల నాయమైన డిమాండ్లను పరిష్కారించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 14 రోజులు కావస్తున్న సీఎం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అందుకే దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశామన్నారు, ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఖలీల్, సుదీర్, సంగమేశ్వర్, హన్మండ్లు, రాజాసింగ్, అశ్వీన్, సోను, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ గిరిధర్, కో కన్వీనర్లు మల్లయ్య, బసంత్, శంకర్, లక్ష్మణ్, నాగరాజ్, జీఎస్. గౌడ్, యాదుల్లా, మూర్తి, కౌ సర్, సాయిలు, చంద్రకాంత్, ప్రశాంత్‌రెడ్డి, రా ధ, సవిత, విమల, లక్ష్మీ, శ్యామల ఉన్నారు. శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ప్రజలు సహకరించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ గిరిధర్ అన్నారు. శుక్రవారం బాన్సువాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యాపారస్తులకు బంద్‌కు సహకరించాలని విన్నవించారు. బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయని ఆయన అన్నారు. -
బాన్సువాడ ఆర్టీసీ డిపో ముందు నిరుద్యోగుల పడిగాపులు
-
గుంతలవుతున్న గుట్టలు!
బాన్సువాడ టౌన్: పుడమి తల్లి గుండెలపై ఆధునిక యంత్రాలు చిల్లులు వేస్తున్నాయి. తద్వారా ప్రకృతి వనరులు అక్రమార్కుల చేతుల్లో కరిగిపోతున్నాయి. విలువైన గుట్టలు, మట్టి కుప్ప లు మాయమవుతున్నాయి. ఏకంగా ప్రభుత్వ స్థలంలోనే మొరం తవ్వేస్తున్నారు. బాన్సువాడ పట్టణానికి కూత వేటు దూరంలో వాసుదేవ్పల్లి శివారు, బోర్లం, బుడ్మి తదితర గ్రామాల్లో ఈ దందా కొనసాగుతోన్న పట్టించుకునేనాథుడే కరువయ్యారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తుంటే రెవెన్యూ అధికారులు మామూలుగా వ్యవరిస్తున్నారు. గ్రానైట్, కంకర క్వారీలకు మాదిరిగానే మొరం తవ్వకాలకు కూడా గనులశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మంజూరు చేస్తారు. ప్రభుత్వ భూములైనా పట్టా భూములోనైనా నిబంధనలకు అనుగుణంగా అనుమతులుంటాయి. అభివృద్ధి పనుల పేరిట... రహదారులు, ఇళ్ల నిర్మాణాలు, చెరువుల కట్టలకు, మట్టి పనులు చేపట్టడానికి మొరం అవసరం. వీటి పేరు మీద ఇష్టారీతిన తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను తవ్వేస్తున్నారు. ఇలా తవ్విన గుంతో ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారాయి. ప్రమాదకరంగా గుంతలు... మొరం తవ్వడంతో ఏర్పడిన గుంతలు లోతుగా ఉన్నాయి. ప్రమాదవశత్తు అందులో పడితే ప్రాణాలు పోయే ప్రమాదముంది. నిత్యం 150 ట్రిప్పుల మొరం తరలిస్తున్నారు. ఒక్క టిప్పర్ మొరం రూ. 1200 ఉంది. ఈ లెక్కన రోజుకు రూ. లక్షా 80 వేల వ్యాపారం జరుగుతోంది. అధికారుల కనుసన్నల్లోనే... మొరం విక్రయాలకు అలవాటు పడిన పలువురు చోటామోటా కాంట్రాక్టర్లే కాకుండా నాయకులు ఇదే పనిలో కొనసాగుతున్నారు. వాస్తవానికి ఆయా గ్రామాల పరిధిలో ఉన్న ఖనిజ సంపద కాపాడాల్సిన వీరి కనుసన్నల్లోనే మొరం అక్రమార్కుల పరమవుతోంది. డిమాండ్ పెరగడంతో... బాన్సువాడ పట్టణం నుంచి వెళ్లే జాతీయ రహదారి విస్తరణతోపాటు ఇతర పనులు కూడా ఇటీవలే ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయి. వాటి నిర్మాణాలకు తగ్గట్టు కాంట్రాక్టర్లు అనుమతులు తీసుకోకుండానే ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి... ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఎక్కడ తవ్వకాలు జరిపినా హెక్టారుకు(2.20ఎకరాలు) రూ. 50 వేలు, గనుల శాఖకు మరో రూ.50 వేలు తపాలశాఖలో రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాలి. విక్రయాలపై అదనంగా 2.25 శాతం పన్ను చెల్లించాలి. ఇలా చెల్లించకపోవడంతో రూ. లక్షల్లో ప్రజాధనం అక్రమార్కుల పరమవుతోంది. బహిరంగా మార్కెట్లో టిప్పర్‌కు రూ. 1200 నుంచి రూ. 1500 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అనుమతులు తీసుకోవాలిలా.. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మొరం తవ్వకాలు చేపట్టినా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. తవ్వకాలు చేపట్టేందుకు ముందుగా గనులు, భూగర్భశాఖ జిల్లా ఆఫీస్‌లో అను మతిపొందాలి.ఇవిరెండురకాలుగాఉన్నాయి. స్థానికంగా ఇళ్ల నిర్మాణాలకు తక్కువ మొత్తంలో అవరమున్న తవ్వకాలను తహసీల్దార్ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) తీసుకోవాలి. అనంతరం మీ సేవా కేంద్రాల ద్వారా గనులు, భూగర్భశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో లేదా నెల రోజులకంటే ఎక్కువగా కానీ మొరం తవ్వకాలు జరపాలంటే జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి పొందాలి. అంతకు ముందు భూగర్భశాఖ, కాలుష్య, నియంత్రణ, డీఎఫ్‌వో, సంబంధిత ఆర్డీవో, తహసీల్దార్ అనుమతులు కూడా కోరాలి. వారు స్థలానికి వెళ్లి పరిశీలించిన అనంతరం వారి ఆమోదంతోనే కలెక్టర్‌కు నివేదిక అందజేస్తారు. ప్రైవేటు భూముల్లో అయితే సంబంధిత పట్టాదారు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. ఏ అనుమతులు ఇవ్వలేదు బాన్సువాడ శివారులో బోర్లం శివారు రోడ్డులో కొనసాగుతున్న తవ్వకాలకు ఎలాంటి ఇనుమతులు ఇవ్వలేదు. మొరం తవ్వకాలకు తప్పనిసరిగా అనుమతుల తీసుకోవాలి. తవ్వకాలపై నిఘా పెడతాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. – సుదర్శన్, తహసీల్దార్, బాన్సువాడ. -
వీకెండ్ వ్యవసాయంలో విద్యార్ధులు
-
అడవి నుంచి తప్పించుకొని క్యాంపులో ప్రత్యక్షమైంది
సాక్షి, బాన్సువాడ : మండలంలోని కోటయ్య క్యాంపులో భయాందోళనకు గురి చేస్తున్న మర్నాగి(అడవి జంతువు)ని గురువారం బంధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయిన నాలుగు మర్నాగిలు క్యాంపులో గత వారం రోజులుగా తిరుగుతున్నాయి. ఇళ్లలో చొరబడి పండ్లు, కూరగాయాలు ఎత్తుకెళుతున్నాయి. బంధించేందుకు యత్నించిన స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గురువారం ఓ ఇంటిపైకి ఎక్కి దిగుతుండగా వాన కురువకుండా కప్పిన పట్టాలో చిక్కుకున్నాయి. దీన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది ఇద్దరు వచ్చి మర్నాగిని బంధించే క్రమంలో ఒకరికి గాయాలయ్యాయి. ఎట్టకేలకు మర్నాగిని బంధించి మల్లారం అటవీప్రాంతంలో విడిచి పెట్టారు. మిగిలిన వాటిని కూడా బంధించి తీసుకెళ్లాలని స్థానికులు కోరుతున్నారు. -
జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారు?
సాక్షి, బాన్సువాడ: పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్ నాయకులు కోరారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు మంగళవారం స్పీకర్‌ను బాన్సువాడలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తాజాగా పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని.. ఇది రాజ్యాంగ విరుద్దమని వారు స్పీకర్‌కు వివరించారు. అనంతరం స్పీకర్ నివాసంలో భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..ఇంతకు ముందు కూడా పార్టీ ఫిరాయించిన 6 గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా పార్టీ ఫిరాయించిన హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, జూలాల సురేందర్, చిరుమర్తి లింగయ్యలను డిస్ క్వాలిఫై చేయాలని నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని అన్నారు. అనేక ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల బాన్సువాడకు వచ్చి కలిసినట్టు పేర్కొన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఒక ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను టీఆర్ఎస్లో విలీనం చేస్తామంటూ.. ఇటీవల అధికార పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ప్రకటన చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ విలీనం అనేది చాలా పెద్ద వ్యవహారం అని పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడూ.. గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకు అందరి తీర్మానాలను ఎన్నికల సంఘానికి పంపడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేసామని గుర్తుచేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు. డిస్ క్వాలిఫై నోటీసు ఇస్తున్న సమయంలో స్పీకర్ ఫొటో తీసుకోవడానికి కూడా అనుమతించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. జాతీయ పార్టీలో ఓ ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. -
పనిచేయని బ్రీత్ అనలైజర్లతో వేధిస్తున్నారు
-
అభివృద్ధి బాటలో.. బాన్సువాడ
సాక్ష, బాన్సువాడ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి చాలా వేగం పుంజుకుంది. స్థానిక శాసనసభ్యుడు మంత్రివర్గంలో ఉండడంతో ఈ ప్రాంతానికి బాగా కలిసొచ్చింది. ఉమ్మడి జిల్లాలో కీలకమైన నేతల్లో ఒకరైన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల్లో పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన ఆయనకు కీలకమైన వ్యవసాయ శాఖ దక్కింది. మంత్రిగా ఆయన నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.వెయ్యి కోట్ల మేర మంజూరు చేయించారు. ముఖ్యంగా వ్యవసాయాధారితంగా జీవనం సా గించే నియోజవర్గ రైతాంగానికి కరెంట్ కష్టాలు తొలగిపోయేలా రూ.16 కోట్లు వెచ్చించి విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించారు. సుమారు రూ.540 కోట్ల వ్యయంతో ఆర్అండ్బీ, పంచాయతీరోడ్ల కోసం మంజూరు చేయించారు. నియోజకవర్గంలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించారు. మిషన్ కాకతీయ కింద రూ. 93 కోట్లతో నియోజకవర్గంలోని వందల చెరువులలో పునరుద్ధరణ పనులు చేయించారు. దీంతోపాటు బాన్సువాడలో వంద పడకల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు చేయించారు. నియోజవర్గంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయించారు. దీంతోపాటు నిజాంసాగర్ కాలువల ఆధునికీకరణ కోసం రూ.30 కోట్లు కేటాయించారు. నియోజవర్గంలోని కొల్లూర్ వంతెన నిర్మాణం కోసం రూ.2కోట్లతో పాటు పాల శీతలీకరణ కేంద్రం కోసం రూ.2 కోట్లు మంజూరు చేయించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 3 వేల డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చి రూ.25 కోట్లు అభివృద్ధి పనుల కోసం కేటాయించారు. అమలవుతున్న పథకాలు డబుల్ బెడ్రూం ఇళ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, ఆసరా పింఛన్లు, రైతు బీమా, కేసీఆర్ కిట్, సబ్సిడీ గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు పనిముట్లు, వాహనాల పంపిణీ, యంత్రలక్ష్మి కింద ట్రాక్టర్ల పంపిణీ ప్రధాన సమస్యలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. స్థానికంగా భారీ పరిశ్రమలు లేవు. వర్ని నుంచి బడాపహాడ్ రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డును నిర్మించాల్సి ఉంది. రూ.10 కోట్లతో నిర్మించిన చందూర్ డీ–ఫ్లోరైడ్ పథకం పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి. మేజర్ పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కోటగిరి, బీర్కూర్ మండల కేంద్రాల్లో బస్టాండ్ల నిర్మాణం చేపట్టలేదు. కొల్లూరు, హెగ్డోలి, సుంకినీ గ్రామాల్లో రూ.6 కోట్లతో నిర్మించి ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ చేయాల్సి ఉంది. గ్రామాల్లో శ్మాశాన వాటికల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. బీర్కూర్‌లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయలేదు. చేపట్టిన అభివృద్ధి పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇళ్లు బాన్సువాడ నియోజకవర్గంలో వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 3 వేల ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే భైరాపూర్‌లో ఇళ్ల నిర్మాణం పూర్తయి, లబ్ధిదారులకు కేటాయించారు. ఇక ఇంటింటికీ నీరు ఇచ్చే మిషన్ భగీరథ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. సుమారు రూ.230 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఇక, రూ.266 కోట్లతో ఆర్అండ్బీ, రూ.273 కోట్ల వ్యయంతో పంచాయతీరోడ్లు నిర్మించారు. రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, నియోజకవర్గంలో వివిధ పనులు చేపట్టారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.11 కోట్లు కేటాయించారు. అలాగే, నిజాంసాగర్కాలువల ఆధునికీకరణ కోసం రూ.30కోట్లు మంజూరు చేయించారు. రూ.25 కోట్ల వ్యయంతో ఫుడ్‌టెక్నాలజీతో పాటు వివిధ కళాశాలలు ఏర్పాటు చేయించారు. లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.14.5 కోట్లు, ఆర్డబ్ల్యూ ఎస్ పనుల కోసం రూ.99.66 కోట్లు, వైద్యారోగ్య శాఖ ఆస్పత్రుల నిర్మాణంకోసం రూ.30 కోట్లు కేటాయించారు. మొత్తం ఓటర్లు 1,73,230 పురుషులు 83,578 మహిళలు 89,638 ఇతరులు 14 ప్రస్తుత పోలింగ్ కేంద్రాలు 223 సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫైల్ మూడు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించింది. 2011లో టీఆర్ఎస్లో చేరిన పోచారం ఆ తర్వాత జరిగిన 2011, 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1994 నుంచి 2014 వరకు ఆరు సార్లు ఎన్నికలు జరుగగా, 2009 మినహా ఐదుసార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఎంతో రాజకీయ అనుభవమున్న శ్రీనివాస్‌రెడ్డికి ఉమ్మడి జిల్లాలో మంచి పట్టుంది. ప్రస్తుతం ఏడోసారి ఎన్నికల బరిలోకి దిగిన పోచారం టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2014 పోల్గ్రాఫ్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 65,868 కాసుల బాల్‌రాజ్ 41,938 మెజారిటీ 23,930 పోలైన ఓట్లు 1,38,854 మొత్తం ఓట్లు 1,79,416 -
‘మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు’
సాక్షి, నిజామాబాద్: కరెంట్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. నాలుగేళ్లలో తెలంగాణను చాలా అభివృద్ధి చేశామని తెలిపారు. అన్ని ఆలోచించి ఓట్లేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లుగా నిరంతరం కరెంట్ ఇస్తున్నామని గుర్తుచేశారు. నిజామాబాద్‌లో జరిగిన సభలో మోదీ చిల్లర మాటల మాట్లాడారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మవద్దని తెలంగాణ ప్రజలను కోరారు. తెలంగాణ నిధులను గత పాలకులు హైదరాబాద్‌లోని పంచుకుని తిన్నారని విమర్శించారు. తెలంగాణ సంపద పెరిగితే ప్రజలకే ఇస్తున్నామని తెలిపారు. తాము చేసే పనులు ఆలస్యమైనా ప్రజలకు కచ్చితంగా చేరుతాయని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి మేలు జరిగిందో వారికే తెలుసని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పెన్షన్లను రెండింతలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. -
బతుకమ్మ ఎత్తుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి
-
ముందస్తు అంటే..భయమేస్తోంది: పోచారం
బాన్సువాడ: తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటే కొన్ని పార్టీలకు భయమేస్తోందని తాజా, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ టీఆర్ఎస్ కార్యాలయంలో శ్రీనివాస రెడ్డి విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 శాతం పూర్తి చేసి, ఇవ్వని హామీలను కూడా పూర్తి చేస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 105, 106 సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ప్రజలకు తమపై విశ్వాసంపై ఉందని, మాకు కూడా ప్రజలపై విశ్వాసం ఉందని వెల్లడించారు. -
భార్య నోట్లో గుడ్డ పెట్టి.. తలను గోడకు బాది
బాన్సువాడ టౌన్ : పట్టణానికి చెందిన ఈరబోయిన సావిత్రి అలియాస్ అనురాధ(34) అనే వివాహితను ఆమె భర్త ఈరబోయిన రాజు హత్య చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. పట్టణంలోని గూడేంగల్లికి చెందిన రాజుకు పదేళ్ల కిత్రం బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన సావిత్రితో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాగుడుకు బానిసైన రాజు నిత్యం భార్య సావిత్రిని వేధిస్తూ కొట్టేవాడు. గురువారం బాన్సువాడలో సంత కావడంతో భార్యభర్తలు ఇద్దరు కలిసి సంతకు వెళ్లి కురగాయలు కొనుక్కొని కల్లు తాగి ఇంటికి వచ్చారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సావిత్రి నోట్లో గుడ్డ పెట్టి తలను గోడకు బాదాడు. తీవ్రంగా గాయాలైన సావిత్రి మెడను నొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం ఎప్పటి లాగానే లేచి తన భార్య రాత్రి పడుకుని లేవడం లేదని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. మామూలుగానే చనిపోయిందని బావించిన కుటుంబికులు సావిత్రి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి బంధువులు వచ్చి చూడగా మెడపై, తలపై. వీపుపై గాయాలు కనబడడంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ వచ్చి సావిత్రి భర్త రాజును అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. శవాన్ని పోస్టుమాస్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సావిత్రి మేనమామ లస్మయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
బాన్సువాడలో గాలివాన బీభత్సం
సాక్షి, నిజామాబాద్ : బాన్సువాడ సబ్ డివిజన్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. బలంగా వీచిన ఈదురు గాలులకు పలు ఇంటి రేకుల షెడ్లు ఎగిసి పడ్డాయి. గాలివానకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు, ఇళ్లపై ఉన్న వాటర్ ట్యాంక్‌లు, మామిడి చెట్లు, విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. కరెంట్ స్తంభాలతో పాటు వైర్లు కూడా తెగిపడడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేయడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
‘గురుకులం’లో వైరల్ ఫీవర్
నిజాంసాగర్(జుక్కల్): ఇంటర్ విద్యార్థిని కృప మరణం మరవకముందే పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు వైరల్ ఫీవర్‌తో అస్వస్థతకు గురయ్యారు. వారం నుంచి పలువురికి జ్వరాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం గురుకుల పాఠశాలకు చెందిన 8 మందికి ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో పీహెచ్సీలో వైద్య చికిత్సలు చేయించారు. వీరిలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న జ్యోతి అనే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మిగతావారికి ఏఎన్ఎం సవిత ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నారు. గురుకులంలో తరుచూ విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నా, పాఠశాల నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తనిఖీలతో వెలుగులోకి.. పెద్దకొడప్‌గల్‌లోని బాలికల గురుకులాన్ని గురువారం గ్రామ సర్పంచ్ మౌనికసాయిరెడ్డి, తహసీల్దార్ గణేశ్ తనిఖీలు చేశారు. పాఠశాలలోని డార్మెట్ రూమ్‌ల్లోని మంచాలపై విద్యార్థినులు పడుకొని ఉండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారం నుంచి జ్వరాలు వస్తున్నాయని విద్యార్థినులు చెప్పడంతో వారు అవాక్కయారు. వెంటనే పీహెచ్సీ వైద్యుడు శ్రీనివాస్ గుప్తను గురుకులానికి రప్పించారు. వైరల్ ఫీవర్‌తో బాధతున్న విద్యార్థినులకు పరీక్షలు చేయించారు. ఎనిమిది మంది విద్యార్థులను ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం సర్పంచ్, తహసీల్దార్ గురుకులంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినుల డార్మెట్ రూమ్‌ల్లో దోమల బెడదతోపాటు నీటిసదుపాయం లేక విద్యార్థినులు తరచూ అస్వస్థతకు గురువుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. విద్యార్థినులకు అందిస్తున్న పండ్లు కుళ్లడంతో సిబ్బందిపై తహసీల్దార్ మండిపడ్డారు. ఆయన ఈ విషయాన్ని బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ దృష్టికి తీసుకు వెళ్లి ఇక్కడి పరిస్థితులను వివరించారు. -
దాహంతో వచ్చి.. కాలువలో పడి..
నిజాంసాగర్(జుక్కల్): వేసవి కాలం ఆరంబానికి ముందే వన్యప్రాణులకు తాగునీటి తిప్పలు ప్రారంభమయ్యాయి. నీటికోసం వచ్చిన మూడు నీల్గాయ్లు గురువారం నిజాంసాగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్ కాలువలో పడిపోయాయి. రిజర్వాయర్ కాలువలో నుంచి బయటకు రాలేక ఇబ్బందిపడ్డాయి. దీనిని గమనించిన స్థానికులు బాన్సువాడ అటవీశాఖ సెక్షన్ అధికారి సిద్ధార్థకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాన్సువాడ డివిజనల్ అటవీశాఖ అధికారి గోపాల్రావ్, సెక్షన్ ఆఫీసర్ సిద్ధార్థ సంఘటన స్థలానికి చేరుకుని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి వాటిని బయటికి తీశారు. ఒక నీల్గాయ్ రహదారి వెంట పరుగులు పెట్టడంతో ఊర కుక్కలు వెంబడించాయి. దీంతో అది నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి దూకింది. ప్రధాన కాలువలో నీటి ప్రవాహం 1,600 క్యూసెక్కులు ఉండడంతో నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు సిరాజుద్దీన్, హన్మాండ్లు కాలువలోకి దూకి, తాళ్లతో బంధించి సురక్షితంగా బయటకు తీశారు. ఆ నీల్గాయ్కి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలారు. -
తప్పిన పెను ప్రమాదం
కొల్చారం(నర్సాపూర్): మెదక్ వైపు నుంచి వచ్చిన ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రయాణికులను దించడానికి గేటు వద్ద ఆగింది. బస్సులో ఎక్కేవారు ఎక్కుతున్నారు... దిగేవారు దిగుతున్నారు... ఈ క్రమంలో బస్సు ఇంజన్ ముందు భాగంలో చిన్నపాటి మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టుపక్కలవారు డ్రైవర్‌ను, బస్సులోని ప్రయాణికులను అప్రమత్తం చేశారు. మంటలు మరింతగా చెలరేగడంతో ప్రయాణికులు ఎలాగోలా బస్సులో నుంచి దిగి ప్రాణాలను కాపాడుకునకున్న సంఘటన కొల్చారంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... బాన్సువాడ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు బోదన్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. కొల్చారంలోని బస్టాండ్ సమీపంలోకి వచ్చి ప్రయాణికులను దించేందుకు డ్రైవర్ బస్సును నిలిపాడు. ఇంజన్ ముందు భాగంలో చిన్నపాటి మంటలు చెలరేగడంతో అటువైపుగా హోటళ్లలో వారు అదిగమనించి కేకలు వేశారు. దీంతో డ్రైవర్, ప్రయాణికులు లగేజీని బస్సులోనే వదిలి ఉరుకులు, పరుగులు పెట్టారు. మంటలు పెద్దగా మారి బస్సు ఇంజన్ భాగంలో పూర్తిగా కాలిపోయింది. బస్సులో దట్టమైన నల్లటిపొగ కమ్ముకోవడం గమనించిన చుట్టుపక్కల యువకులు, హోటళ్లకు చెందిన వారు మంటలను ఆర్పేందుకు ఇసుక చల్లారు. నీళ్లను కూడా ఉపయోగించడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు ముందు భాగంమాత్రం పూర్తిగా దెబ్బతింది. బస్సు నడుస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ప్రాణనష్టం వాటిల్లే అవకాశాలు ఉండేవని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి బస్సు మరింత కాలిపోకుండా సహాయక చర్యలు చేపట్టారు. -
గ్రేడ్–3 మున్సిపాలిటీగా బాన్సువాడ
బాన్సువాడ టౌన్(బాన్సువాడ): బాన్సువాడ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. పట్టణాన్ని గ్రేడ్–3 మున్సిపాలిటీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 15 వేలకు జనాభా ఉన్న పట్టణాలను మున్సిపాలిటీలుగా మార్చాలని సర్కారు నిర్ణయించిన సంగ తి తెలిసిందే. బాన్సువాడ గ్రేడ్–3 మున్సిపాలిటీగా మారనున్న నేపథ్యం లో పట్టణ రూపురేఖలు మారనున్నాయి. మౌలిక వసతులు మెరుగుపడడంతో ప్రణాళిక బద్దమైన అభివృద్ధి జరగనుంది. పట్టణ ప్రణాళిక ప్రకా రం రోడ్లు, భవనాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే, ఆదాయం పెరగడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు రానున్నాయి.బాన్సువాడలో 20 వార్డులు, 31వేల జనాభా ఉంది. తొలుత నగర పంచాయతీగా.. వాస్తవానికి బాన్సువాడను తొలుత నగర పంచాయతీగా మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు జీవో కూడా సిద్ధమైంది. అయితే, మంత్రి పోచారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. దీంతో ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడి గ్రేడ్–3 మున్సిపాలిటీగా ప్రకటించాలని ఆదేశించారు. మంత్రికి ఘన స్వాగతం.. బాన్సువాడను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుక్రవారం బాన్సువాడలో ఘన స్వాగతం లభించింది. బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వచ్చిన మంత్రికి కొయ్యగుట్ట వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చిరకాల స్వప్నం ఫలించింది: మంత్రి పోచారం బాన్సువాడ పట్టణాన్ని గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో బాన్సువాడ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. బాన్సువాడలో రూ.17కోట్లతో వంద పడకల మెటర్నిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో కల్కి చెరువును మినీ ట్యాంకుబండ్‌గా, ఎల్లయ్య చెరువును వారంతపు సంతగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. మినీస్టేడియం, పట్టణంలో సీసీ రోడ్డు నిర్మాణం కొనసాగుతుందన్నారు. మత్య్సకారులు చేపలు విక్రయించేందుకు భవనంను నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. సహకార సంఘాల ఎన్నికలపై సీఎంతో చర్చించామని, త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. రైతు సమన్వయ కమిటీలపై నివేదికలు అందించామన్నారు. ఆర్డీవో రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు, వ్యాపారులు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
వర్ని(బాన్సువాడ): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం పలు పథకాలు తెస్తుంటే వ్యవసాయ సిబ్బంది సరిగా పని చేయడం లేదని మండిపడ్డారు. వర్నిలో మంగళవారం రాత్రి నిర్వహించిన వర్ని, కోటగిరి, రుద్రూర్ మండలాల రైతుల సమన్వయ సమితి సభ్యుల సదస్సులో ఆయన మాట్లాడారు. అసంఘటిత రైతు శక్తిని సంఘటితం చేయడానికే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. రబీ ప్రణాళిక సిద్ధం చేసి మంచి దిగుబడులు ఇచ్చే విత్తనాలు తెప్పించి రైతులకు అందజేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయానికి విద్యుత్ సమస్య లేదని, రైతులు కోరితే 24 గంటలు సరాఫరా చేస్తామని, వచ్చే ఏడాది నుంచి రెండు పంటలకు సాగు నీరందిస్తామన్నారు. ఈ రబీలో వరి నారు మళ్లు డిసెంబర్ 15 లోపు పూర్తి చేసుకుని నాట్లు వేయాలని సూచించారు. సకాలంలో నాట్లు వేస్తే వడగళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్, ఏఎంసీ చైర్మన్ గంగారాం, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి , సమితి మండల కన్వీనర్లు ఇందూర్ సాయులు, పిట్ల శ్రీరాములు పాల్గొన్నారు. ఇష్టం లేకుంటే వెళ్లిపోండి.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుంటే సిబ్బంది పనితీరు అధ్వానంగా ఉందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందుబాటులో ఉండి సలహాలివ్వాలని ఐదు వేల ఎకరాలకు ఒక అధికారిని నియమిస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాగైతే లాభం లేదని, సక్రమంగా పని చేయడం చేతకాని వాళ్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలని, వారి స్థానంలో కొత్త వాళ్లను నియమించుకుంటామని స్పష్టం చేశారు. సమితి సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, ఇష్టం లేకపోతే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని మందలించారు. కొందరు సభ్యులు గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అంగట్లో సాగుతోన్న పేకాట !
యథేచ్ఛగా విస్తరిస్తోన్న మట్కా కరువైన పోలీసుల నిఘా బాన్సువాడ: మూడు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో పేకాట బహిరంగంగా కొనసాగుతోంది. కొందరు దళారులు ప్రత్యేకం దృష్టిపెట్టి, పేకాడేందుకు రైతులు, వ్యాపారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. నెల రోజులుగా బాన్సువాడలోని వారాంతపు సంతలో కొందరు వ్యక్తులు వినూత్న రీతిలో పేకాటను సాగిస్తున్నారు. హీరో, హీరోయిన్ల ఫొటోలను ప్రదర్శించి, హీరోకు సింగిల్, హీరోయిన్‌కు డబుల్ డబ్బులు ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. హీరోయిన్ ఫొటోపై రూ.100 పెడితే రూ.300 ఇస్తామని, హీరో ఫొటోపై రూ.100 పెడితే రూ.200 ఇస్తామని చెబుతూ పేకాడిస్తున్నారు. హీరోయిన్ ఫొటోపై డబ్బులు పెడితే, పత్తాలను తీస్తారు. ఆ పత్తాల్లో సదరు హీరోయిన్ ఫోటో ఉంటే, పెట్టిన వ్యక్తికి రెండింతలు డబ్బులు ఇస్తారు. ఇలా వందలాది మంది ఈ పేకాట ఆడుతూ తమ డబ్బులను కోల్పోతున్నారు. ప్రతీ సంతలో ఈ ఆటపై రూ.2 నుంచి రూ.5లక్షల వరకు కోల్పోతున్నారని తెలిసింది. బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ వారాంతపు సంతల్లో ఈ పేకాట కొనసాగుతోంది. బహిరంగంగా పేకాడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాన్సువాడ, బిచ్కుంద సర్కిళ్లలో.. కొన్ని రోజులుగా బాన్సువాడ ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోంది. పేకాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరించినా, బాన్సువాడ, బిచ్కుంద సర్కిళ్లలో జోరుగా పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో పేకాడుతున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ దాడులు చేయకుండా వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే పేకాట యథేచ్ఛగా కొసాగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల పోలీసుల దాడులు.. గతంలో బాన్సువాడ పట్టణంలో ఓ మహిళ నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. అలాగే తాడ్కోల్ రోడ్డుపైన పేకాట స్థావరంపై దాడి చేసి సుమారు రూ.3 లక్షల వరకు స్వాధీనం చేసుకున్నారు. అయినా పేకాటరాయుళ్లలో మార్పు రావడం లేదు. వర్ని, బీర్కూర్, కోటగిరి, బాన్సువాడ ప్రాంతాల్లో కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు పేకాట ఆడిస్తున్నట్లు ప్రచారం ఉంది. బాన్సువాడ శివారులోని తాడ్కోల్, బోర్లం, ఇస్లాంపుర, రాజారాం దుబ్బ ప్రాంతాల్లో నిరంతరం పేకాట ఆడుతున్నారు. వీరు ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసుకొని పేకాడుతుండగా, పోలీసులు రాకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. గతేడాది క్రితం పేకాట జోరుగా సాగగా, లక్షలాది రూపాయలు చేతులు మారాయి. రాజకీయ పలుకుబడితో.. గతంలో బీర్కూర్ మండలంలో పేకాట ఆడుతున్నవారిపై ఎస్పీ ప్రత్యేకంగా దాడులు నిర్వహించి పేకాటకు పూర్తిగా అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ పేకాట ఆడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాజకీయ పలుకుబడితో పేకాటను కొనసాగిస్తున్నారు. మరోవైపు బిచ్కుంద సర్కిల్ పరిధిలోనూ పేకాట ఆడుతున్న వారు అధికంగా ఉన్నారని తెలిసింది. వీరు ఎక్కువగా పొలాల్లో ఆడుతున్నట్లు సమాచారం. దెగ్లూర్ నుంచి వచ్చి.. మట్కా నంబర్లు తెచ్చి.. సరిహద్దు మండలాల్లో మట్కా కూడా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ నుంచి పలువురు ఏజెంట్లు వచ్చి మట్కా నంబర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా నిర్వాహకులు కొందరు ఏజెంట్లను నియమించి బాన్సువాడ ప్రాంతానికి పంపుతున్నారు. వీరు మట్కా నంబర్లను విక్రయించి, సెల్ఫోన్లపై నంబర్లును వెల్లడిస్తూ మట్కాను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులకు డబ్బులు రావడంతో వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు మట్కాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. సమాచారం అందిస్తే చర్యలు పేకాట, మట్కా నిర్వాహకుల పై చర్యలు తప్పవు. ఎవరికైనా సమాచారం లభిస్తే వెంటనే పోలీసులకు చేరవేయాలి. దాడులు చేసి పట్టుకుంటాం. పేకాట, మట్కాపై ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. – నర్సింహారావు, డీఎస్పీ, బాన్సువాడ -
ఏటీఎంలో నకిలీ నోట్లు వస్తున్నాయని..
బాన్సువాడ(కామారెడ్డి జిల్లా): బాన్సువాడ సిండికేట్ బ్యాంకు ఏటీఎం వద్ద ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తి వద్ద చాకచక్యంగా డబ్బులు దోచేశారు. స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం వద్దకు వచ్చాడు. ఆ వ్యక్తి డబ్బు రూ.60 వేలు డ్రా చేసిన వెంటనే అక్కడున్న ముగ్గురు వ్యక్తులు ఇటీవల ఏటీఎంలో నకిలీ నోట్లు వస్తున్నాయి ఒకసారి ఇవ్వండి చెక్చేద్దాం అన్నారు. చేతికి ఇవ్వగానే ముగ్గురూ 60 వేల రూపాయల్లో 30 వేల రూపాయలు కాజేశారు. ఈ దృశ్యం ఏటీఎంలో ఉన్న సీసీకెమెరాలో రికార్డైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల గల్లంతు
బాన్సువాడ: ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి గల్లంతైన సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం పోతంగల్ చెరువులో గురువారం వెలుగు చూసింది. జల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు సాయికుమార్, అఫ్సర్ ఈ రోజు ఉదయం చెరువులో ఈతకు వెళ్లారు. ఈతకు దిగిన ఇద్దరు ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
పేకాటాడుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు
-
పేకాటాడుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు
బాన్సువాడ: పేకాట ఆడుతూ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. తాడ్కోల్ రోడ్డులోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు. వీరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే కె. గంగాధర్, ఉప సర్పంచ్ తో సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.06 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు, 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్టు స్థానిక సీఐ శ్రీనివాస రెడ్డి తెలిపారు. -
కొనసాగుతున్న ‘భగీరథ’ యత్నం
70 శాతం పూర్తయిన ప్రధాన పైప్‌లైన్ పనులు బాన్సువాడ : మిషన్ భగీరథ పనులు సాగుతున్నాయి. మెదక్ జిల్లాలోని సింగూరు నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు తాగునీరు అందించే పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రధాన పైప్‌లైన్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో పైప్లైన్ల విస్తరింపు పనులు ఊపందుకున్నాయి. గ్రామాల్లో పైప్లైన్ల ఏర్పాటుకు పొలాలను తవ్వి పైపులు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి వంద లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్లో 150 లీటర్ల నీరు సరఫరా చేయాలన్నది మిషన్ భగీరథ ఉద్దేశం. సింగూరు ప్రాజెక్టు వద్దే నీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేసి, అక్కడి నుంచి నేరుగా పైప్లైన్ల ద్వారా నీరు సరఫరా చేయనున్నారు. మిషన్ భగీరథ కోసం సింగూరు నుంచి 1.8 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల ప్రజలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా నీరందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల ప్రజలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరందించనున్నారు. సింగూరు పథకానికి రూ. 1,350 కోట్లు, ఎస్సారెస్పీ పథకానికి రూ. 1,400 కోట్లు కేటాయించారు. సింగూరు నుంచి బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లోని మండలాలకు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోని మండలాలకు నీరందిస్తారు. సింగూరు ప్రాజెక్టు వద్ద ఫిల్టర్‌బెడ్ పనులు పూర్తయ్యాయి. పైప్‌లైన్, ఇంటెక్వెల్ పనులు జరుగుతున్నాయి. వాస్తవానికి నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దే హసన్‌పల్లిలో ఫిల్టర్ బెడ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నిజాంసాగర్‌లో నీటి లభ్యత విషయంలో సందేహం ఉండడంతో రూ. 500 కోట్లు అదనంగా వెచ్చించి సింగూరు నుంచి పైప్‌లైన్ వేయిస్తున్నారు. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ ద్వారా నిజాంసాగర్‌కు నీటి మళ్లింపు జరుగనున్నందున.. నిజంసాగర్‌లోకి నీరు పుష్కలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ పనులకు ఇంకా సమయం పడుతుందని భావించిన అధికారులు.. సింగూరు నుంచి పైప్‌లైన్ వేయాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు సమీపంలో డెడ్‌స్టోరేజీ వాటర్ అందేవిధంగా కాలువను తవ్వి, పుల్కల్ వద్ద నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పైప్లైన్ల ద్వారా అక్కడి నుంచి తడ్‌మనూరు వద్ద సముద్ర మట్టానికి సుమారు 590 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశంలో సుమారు వందమీటర్ల ఎత్తులో ట్యాంకులను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి విడుదల చేసే నీరు జిల్లాలోని నర్సింగ్‌రావుపల్లికి చేరుకుంటుం ది. నర్సింగ్‌రావుపల్లి నుంచి నీరు నాలు గు ప్రాంతాలకు వెళ్తుంది. జుక్కల్, బా న్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల వరకు ప్రత్యేక పైప్లైన్ల ద్వారా నీరు వెళ్లనుంది. వచ్చే ఏడాది జూన్‌లోపు 235 గ్రామాలకు, అదే ఏడాది డిసెంబర్ చివరి నాటికి 572 గ్రామాలకు నీరందించనున్నారు. సింగూరు వద్ద వాల్వ్ ఓపెన్ చేస్తే నిజామాబాద్ జిల్లాలోని ఇంటింటికీ నీరు చేరేవిధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సాగుతున్న పైప్‌లైన్ పనులు ప్రధాన పైప్లైన్ల పనులు పూర్తి కావస్తుండడంతో, ఇక గ్రామాల్లో పైప్లైన్ల పనులు జోరందుకున్నాయి. బాన్సువాడ సమీపంలోని దుర్కి ప్రాంతంలో పైప్‌లను డంప్ చేశారు. అక్కడి నుంచే అన్ని గ్రామాలకు పైప్లైన్లు వేస్తున్నారు. అయితే రైతుల అనుమతి తీసుకోకుండానే కాంట్రాక్టర్లు పంట పొలాల్లో తవ్వుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
బాన్సువాడ జిల్లా కోసం నిరాహార దీక్షలు
బాన్సువాడ: తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల రగడ కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ అఖిల పక్ష నాయకులు ఆదివారం రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జిల్లా ఏర్పాటుచేయాలంటూ నినాదాలు చేశారు. అలాగే వర్ని మండలంలోని మోస్రా గ్రామాన్ని మండలంగా చేయాలంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. -
బాన్సువాడలో మూడిళ్లలో చోరీ
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలకేంద్రం పాత బాన్సువాడ ప్రాంతంలోని మూడిళ్లలో చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న బసవరాజు, నాగరాజు, మరో వ్యక్తి ఇళ్లలో ఒకేసారి దొంగలు పడి రూ.15 వేల నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. నిజామాబాద్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఈ విషయం బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'ఫిదా' బాన్సువాడ షెడ్యూల్ పూర్తి
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'ఫిదా' మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'ప్రేమమ్' ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్గా మెరవనున్నారు. ఎన్నారై కుర్రాడికి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిజామాబాద్ బాన్సువాడలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు వరుణ్ తేజ్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. శేఖర్ కమ్ముల మార్క్ స్వీట్ లవ్ స్టోరీగా 'ఫిదా' అలరించనుంది. Wrapped a super fun schedule of #Fidaa in banswada! Hyd it is! With @Sai_Pallavi92 and Shekar See you two soon!😊😊😊 pic.twitter.com/fFZcD5xD4u — Varun Tej (@IAmVarunTej) 8 September 2016 -
తెల్లవారేసరికి చెరువుకట్ట వద్ద శవమై...
బాన్స్వాడ: నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ పట్టణం సమీపంలోని ఎల్లయ్యచెరువు కట్ట వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పట్టణానికి చెందిన భాస్కర్ (33)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన భాస్కర్ ఉదయమైనా తిరిగి రాలేదు. కంగారుతో కుటుంబ సభ్యులు గాలించగా ఎల్లయ్య చెరువుకట్ట వద్ద శవమై కనపించాడు. మృతదేహం బాగా కాలిపోయిన స్థితిలో ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. -
డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
బాన్సువాడ : ఆర్టీసీ బస్సు డివైడర్ ను ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి డిపో బస్సు బాన్సువాడ నుంచి కామారెడ్డి వైపు వెళుతున్న క్రమంలో టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అది గంజాయి గ్రామం..!
బాన్సువాడ (ఆదిలాబాద్) : అదో మారుమూల గ్రామం. గ్రామంలో మొత్తం పది గడపలకు మించి ఉండవు. ఆ గ్రామం గురించి సమీప గ్రామాల ప్రజలకు కూడా అంతగా తెలియదు... కానీ మెట్రో నగరాల్లో మాదకద్రవ్యాలను సరఫరా చేసే ముఠాల్లో మాత్రం ఆ గ్రామం పేరు మారుమోగుతోంది. ఈ గ్రామం నుంచి ఎండు గంజాయిని ఆయా నగరాలకు సరఫరా చేయడమే దీనికి ప్రధాన కారణం. బాన్సువాడ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని నిజాంసాగర్ మండలంలో గల ఓ కుగ్రామంలో యథేచ్ఛగా గంజాయిని సాగు చేస్తున్నారు. గిరిజనులు ఉంటున్న ఈ తండాలో అంతర పంటగా గంజాయిని పండిస్తున్నారు. గంజాయిని సాగుచేసిన తర్వాత దాన్ని ఎండబెట్టి, ప్యాకెట్ల రూపంలో తయారుచేసి మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల సహాయంతో హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. ఓ మహిళ గంజాయి రవాణాలో దిట్టగా మారి, ఎండిన గంజాయిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, విశాఖపట్నం, బెంగళూరు నగరాలకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వారం రోజుల కిందట ఎక్సైజ్ పోలీసులు నామమాత్రపు తనిఖీలు చేసి, కొంత గంజాయిని మాత్రమే స్వాధీనం చేసుకొన్నారని, విస్తృతస్థాయిలో దాడులు చేస్తే గంజాయి పంట, సరఫరా చేస్తున్న ముఠా ఆగడాలు బయటపడతాయని స్థానికులు అంటున్నారు. మా దృష్టికి రాలేదు : పురుషోత్తం, ఎక్సైజ్ ఎస్సై 'గంజాయి సాగు చేసి, రవాణా చేస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. వారం రోజుల క్రితం ఈ గ్రామంలోనే తనిఖీలు చేయగా, అంతర పంటగా గంజాయి మొక్కలు పెంచడాన్ని గుర్తించాం. వాటిని తొలగించి కేసు నమోదు చేశాం. ఇంకా ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారో తెలియదు'. -
రాఖీ వేడుకల్లో మంత్రి పోచారం
బాన్సువాడ: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు శనివారం బాన్సువాడలోని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయన అక్క సత్యవతి రాఖీ కట్టారు. అనంతరం ఇద్దరూ కలిసి స్థానిక వెంకటేశ్వర మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
'పెండింగ్ స్కాలర్షిప్లు చెల్లించండి'
బాన్సువాడ: పెండింగ్‌లో ఉన్న ఇంటర్మీడియట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ బీసీ సంఘం విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 2014-15 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వం స్కాలర్షిప్లను ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో, కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్‌షిప్‌లకు విడుదల చేసి సమస్యలను పరిష్కరించాలని బీసీ సంఘం విద్యార్థి నాయకులు కోరారు. -
బడా పహాడ్‌లో సమస్యలు
బాన్సువాడ : తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల పవిత్ర దర్గాల్లో ప్రముఖమైన దర్గా బడా పహాడ్ దర్గా. ఈ దర్గా ద్వారా వక్ఫ్‌బోర్డుకు ఏటా రూ. 2 నుంచి 3 కోట్ల ఆదాయం వస్తోంది. సుమారు లక్ష నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వీరితో పాటు మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. ఈ దర్గాకు వచ్చే భక్తులు, మనస్ఫూర్తితో న్యాయమైన కోరికలు కోరితే అవి నెరవేరుతాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన దర్గాలో సమస్యలు తిష్టవేశాయి. రాబడి గురించి పట్టించుకుంటున్న దర్గా అభివృద్ధి కమిటీ సభ్యులు సమస్యల పరిష్కారంలో చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముజావర్లు (దర్గా పర్యవేక్షకులు) దోపిడీయే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు బడాపహాడ్ నిర్వహణకు ఏటా వేలం నిర్వహిం చిన కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. ఏడాదికి సగటు న రూ.2 నుంచి 3 కోట్ల వరకు వేలం పాడి కాంట్రాక్ట్ దక్కించుకుంటారు. తర్వాత వక్ఫ్‌బోర్డు అధికారులు, కాంట్రాక్టర్లు దీనిని పట్టించుకోకపోవడంతో సమస్యలు ఎక్కడివక్కడే తిష్ట వేస్తున్నాయి. అంతేకాకుండా కోట్లు పెట్టి పాట పాడిన కాంట్రాక్టర్లు వాటిని సంపాదించుకునేందుకు బలవంతంగా భక్తుల నుంచి డబ్బు లు దండుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకుంటే దర్గాహ్ లోపలికి కూడా రానివ్వడం లేదు. ‘ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి. మాకేం కాదు’ అని మొహం మీదే చెబుతున్నారు. వక్ఫ్‌బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కనీస సౌకర్యాలు కరువు యేటా కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నా దర్గాలో భక్తుల కోసం వసతులు కరువయ్యూయి. భక్తులకు విడిది కోసం విశ్రాంతి గృహాలు లేవు. స్నానం చేయడానికి, తాగడానికి నీరు లేదు. మూత్ర శాలలు లేవు. రోప్‌వే నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసినా అవి కనుమరుగయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. నేటి నుంచి బడాపహాడ్ ఉర్సు వర్ని : జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన బడాపహాడ్ దర్గా ఉర్సు గురువారం ప్రారంభం కానుంది. 30న జలాల్పూర్ నుంచి జొహర్ తర్వాత మధ్యాహ్నం ముజావర్ ఇంటి నుంచి సంధల్ (గంధం)తో ర్యాలీగా బయలు దేరుతారు. మే 1న దీపారాధన, చిరాగ్ ఖవ్వాలి, 2న ఫజర్ తర్వాత తిలావత్ ఖురాన్-ఏ-పాక్, తబర్రుక్ పంచడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతిపాదనలు పంపించాం బడాపహాడ్ తెలంగాణలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం. దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయా లి. బడాపహాడ్‌లో కొందరు భక్తులను దోచుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకే డబ్బులు తీసుకోవాలి. బడాపహాడ్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపించాం. - జావీద్ అక్రం, వక్ఫ్‌బోర్డు జిల్లా అధ్యక్షుడు -
పోలీసుల వైఖరికి నిరసనగా బాన్స్వాడలో బంద్
నిజామాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్‌రెడ్డిపై పోలీసుల దాడిని నిరసిస్తూ అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం బాన్స్వాడలో బంద్ కొనసాగుతోంది. బాన్స్వాడ గ్రామ పంచాయతీ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం రాత్రి రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేశాడు. అంతేకాకుంగా ఆయనను కొట్టడంతో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అక్రమ నిర్మాణానికి సంబంధించిన వివరాలు కావాలంటూ బాన్స్ వాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో రవీందర్‌రెడ్డి గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారికి, రవీందర్‌రెడ్డి మధ్య శుక్రవారం వాదన జరిగింది. దీంతో గ్రామ పంచాయతీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల దురుసు వైఖరిని ఖండిస్తూ అఖిలపక్షం నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. (బాన్స్వాడ) -
కోళ్ల రైతు కుదేలు
బాన్సువాడ: కోళ్ల పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. భారీగా పెరిగిన మేతల ధరలతో కోడిని పెంచాలంటేనే కష్టంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బాన్సువాడ, ఆర్మూర్, మోర్తాడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలతో పాటు, జిల్లాలోని పలు చోట్ల పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు లక్షకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఏటా పౌల్ట్రీ పరిశ్రమ విస్తరిస్తూనే ఉంది. కాగా. గతేడాది మూడు రూపాయలు ఉన్న గుడ్డు ధర ప్రసు ్తతం నాలుగు రూపాయలకు పెరిగింది. అయినా రైతులకు మాత్రం లాభం చేకూరడం లేదు. గతంలో కంటే ప్రస్తుతం మేత ధరలలో భారీగా వ్యత్యాసం రావడమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. పౌల్ట్రీలో మేతకు ఉపయోగించే సోయా కిలోకు 45 రూపాయలకు పలుకుతోంది. వేరుశనగ కిలోకు 36 రూపాయలు, పొద్దు తిరుగుడు పిండి 29 రూపాయలు, డీఓబీ పది రూపా యలు ఉంది. మేతలో మొక్కజొన్న, నూకలు, సోయా, ఎండు చేప, మీట్ మిల్, డీఓబీవంటి ధాన్యాలు ఎక్కువగా వాడుతారు. కోళ్లకు అవసరమైన విటమన్ బి కాంప్లె క్స్ వంటివి మేతలోనే కలిపి ఇస్తారు. గుడ్లు పెట్టే కోడి రోజుకు 120 నుంచి 130 గ్రాములు వరకు మేత తింటుంది. కోళ్ల అనారోగ్య స్థితిని బట్టి నీటిలో మందులు వాడతారు. ప్రభుత్వం సోయా, మొక్కజొన్నవంటి ధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో వీటి కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని రైతులు ఆరోపి స్తున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి సోయాతోపాటు మొక్కజొన్న వంటి ధాన్యాలు అందుబాటులోకి రావని అంటున్నారు. పౌల్ట్రీ ఫారంలో వెయ్యి కోళ్ళు ఉంటే ఉం టే 800 గుడ్లు ఉత్పత్తి అవుతాయి. హోల్ సెల్ ధరలో గుడ్డు మూడు రూపాయల చొప్పున రూ. 2,400 ఆదాయం వస్తుంది. మేత కోసం వెయ్యి కోళ్లకు 2,200 వెచ్చిస్తే మిగిలేది రూ. 200 మాత్రమే. గుడ్డు పెట్టే కోళ్ల తయారీకి అవసరమైన పిల్లలను పెంచడానికి అవసరమైన పెట్టుబడిని రైతులు అదనంగా భరించాల్సిన పరిస్థితి ఉంది. ఐదు వేల మంది కార్మికుల జీవనాధారం జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమపై సుమారుగా ఐదు వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ధరల పెరుగుదలతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ప్రస్తుత ధరలను బట్టి కూలీల ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు ఇతరేతర ఖర్చులు అదనంగా భరించే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు బ్యాంకు రుణాలు సైతం భరించా ల్సిందే. కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితుల్లో మేతలు ఆడడానికి కూలీలకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. దీని వల్ల ఇద్దరు కూలీలకు 500 రూపాయలు ఇచ్చే పరస్థితి ఏర్పడింది. ఒక పక్క విద్యుత్తు కోత, మరో పక్క మేత ధరలతో పౌల్ట్రీ రంగం కోటుకోలేని నష్టాలను భరించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పౌల్ట్రీ రైతులకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
ఫింఛన్... టెన్షన్
బాన్సువాడ: ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఫించన్ల పంపిణీ ఎట్టకేలకు ప్రారంభమైంది. గతంలో వివిధ రకాల సామాజిక ఫించన్లు పొందుతున్నవారితో పాటు, కొత్తవారికి ఫిం చన్లు పంపిణీ చేసేందకు ప్రభుత్వం ‘ఆసరా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, తమకు ఫించన్లు వస్తాయో రావోననే ఆందోళన కొందరు లబ్ధిదారులను వెంటాడుతోంది. వయోభారంలో ఉన్న పండుటాకులు, భర్తను కోల్పోయిన అభాగ్యులు, వికలాంగులు, వృద్ధాప్యంలో ఉన్న వివిధ వృత్తిదారులు ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నా రు. ఇటీవల ఫించను మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచడంతో పోటీ పెరిగింది. కొత్త జాబితాతో కలవరం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో శని వారం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభిం చారు. కొత్త జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో చాలా చోట్ల లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఫించన్ల కోసం ప్రతీ గ్రామం నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. నేటికీ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదు. గత నెల 20 నుంచే ఆయా గ్రామాలలో దరఖాస్తుల విచారణ ప్రారంభించారు. మున్సిపాలిటీలలో విచారణ ఆలస్యంగా ప్రారంభమైంది. రెవెన్యూ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అధికారుల రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు వృద్ధులు వారు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తహ శీలు కార్యాలయాలకు త ండోపతండాలుగా తరలి వచ్చి వాకబు చేస్తున్నారు. కొందరు లబ్ధిదారులు ఉదయం ఎనిమిది గంటలకే పరగడుపున అధికారుల వద్దకు చేరుకుని తమ గురించి విచారణ జరపాలని వేడుకొంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుందో అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. విచారణ నత్తనడకన సాగుతోంది. ఎక్కువ మందిని విచారించాల్సి రావడంతో బృందాలుగా వెళ్తున్న రెవెన్యూ సిబ్బంది, దరఖాస్తుదారుల చిరునామా లభిం చక ఇబ్బందుల పాలవుతున్నారు. అధికారులకు తలనొప్పి అనేక గ్రామాలలో నిర్ణీత లక్ష్యం కన్నా అధికంగా అర్హులు ఉండడంతో ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది. సీలింగ్ మించి ఎంపిక చేయరాదని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రతి గ్రామంలో ఐదు శాతం వృద్ధులు, ఐదు శాతం వితంతువులు, మూడు శాతం వికలాంగులను మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది. గ్రామ జనాభా ఆధారంగా ఎస్సీలు 80 శాతం, ఎస్టీలు 75 శాతం, బీసీలు 50 శాతం, ఓసీలు 20 శాతం మేర ఫించన్లు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. కొన్ని గ్రామాలలో ఓసీలు 20 శాతానికి మించి అర్హులున్నప్పటికీ వారు ఎంపికయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం మండలానికి వెయ్యి ఫించన్లను అందించేందుకు రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. జిల్లాలో గతంలో ఫించన్లు పొందుతున్నవారిలో సుమారు 50 వేల మంది తమ ఫించన్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎందరు లబ్ధిదారులను ఎంపిక చేశారనే విషయం అధికారికంగా వెల్లడించలేదు. -
గుట్టుగా బలవుతున్నారు
తరుచూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగే కౌలాస్ ఖిల్లా చారిత్రాత్మక ప్రదేశాల్లో గుప్త నిధులు ఉన్నాయనే నమ్మకంతో గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జగుతున్నాయి. కౌలాస్ ఖిల్లా, జుక్కల్ బురుజుల్లో తవ్వకాల మూలంగా ఏర్పడిన బిలలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గుప్త నిధులపై ఆశతో కొందరు తవ్వకాలకు ఖర్చుచేస్తూ ఆస్తులు కరిగించేసుకుంటున్నారు.గుప్త నిధుల వేటలో మరికొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నిధుల కోసం.. * బాన్సువాడ ప్రాంతంలో తవ్వకాలు * అమావాస్య, పౌర్ణమి రోజుల్లో జోరు * ప్రాణాలు పణంగా పెడుతున్న అమాయకులు * శాంతాపూర్ గండిలో ఇదే రీతిలో ఒకరి మరణం * కౌలాస్ ఖిల్లాలో నిధులున్నాయని నమ్మకం బాన్సువాడ : చారిత్రక కట్టడాలు గల బాన్సువాడ ప్రాంతంలో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి తవ్వకాలు జరుపుతున్న ముఠాలు, అమాయకుల ప్రాణాలకు హాని కూడ కలిగిస్తున్నారు. కౌలాస్ రాజులు పాలించిన ఈ ప్రాంతంలోని కౌలాస్ ఖిల్లా, జుక్కల్ బురుజు, బి చ్కుంద, పుల్కల్, శాంతాపూర్ గండి, వాజిద్నగర్, పి ట్లం, బీర్కూర్, సోమేశ్వర్ ప్రాంతాల్లో తరచుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజుల కాలంలో ఆయా ప్రాంతాల్లో బంగారు నగలు, నాణేలు భూమిలో పాతిపెట్టారనే ప్రచారం ఉంది. దీంతో తవ్వకాలకు పాల్పడుతూ కొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం ప్రతి అమావాస్య, పౌర్ణమి నాడు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూనే ఉంటారు. ఇందుకు నిదర్శనంగా రెండు నెలల క్రితం బిచ్కుంద మండలం శాంతాపూర్ గండిలో గుప్త నిధుల కోసం తవ్వుతూ ఒకరు మరణించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ ఏకంగా 25 మంది ముఠాగా ఏర్పడి తవ్వకాలు జరపడం గమనార్హం. పాత బాన్సువాడలోనూ గుప్త నిధుల కోసం వారం రోజుల క్రితం తవ్వకాలు జరిపారు. అలాగే మూడేళ్ల క్రితం బీర్కూర్‌లోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం ఓ వ్యక్తి మేక పిల్లను బలి ఇచ్చేందుకు పూనుకోగా, గ్రామస్తులు విషయాన్ని తెలుసుకుని పోలీసులకు పట్టించారు. రాజుల కాలంలో దాచి ఉంచిన నిధులు ఇక్కడ తవ్వకాల్లో లభిస్తున్నాయనే ప్రచా రం దశాబ్దాలుగా ఉంది. ఎనిమిదేళ్ల క్రితం బీర్కూర్‌లోని ఒక పాత థియేటర్లో గుప్త నిధులు లభించగా, రెవెన్యూ అధికారులు, పోలీసులు విచారణ జరిపి కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కౌలాస్ ఖిల్లాలో అప్పటి రాజులు భారీగా నిధులను దాచి ఉంచారనే ప్రచారం జరుగుతుండడంతో కొన్నేళ్లుగా గుర్తు తెలి యని వ్యక్తులు అప్పుడప్పుడు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. బిచ్కుంద మండలం తక్కడపల్లి వద్ద చారిత్రాత్మక మందిరాన్ని గుప్త నిధుల కోసం కూల్చివేశారు. మరో ఘటనలో ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే మూడేళ్ల క్రితం కౌలాస్ ఖిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా, గ్రామస్తులు అడ్డుకొన్న ఘటన తెలిసిందే. గుప్త నిధుల కోసం రాత్రి వేళల్లో కొందరు బృందాలుగా ఏర్పడి తవ్వకాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. బీర్కూర్ మండలంలోని సంగెం, బొమ్మన్‌దేవ్‌పల్లి, దుర్కి తదితర గ్రామాల్లో ఆమావాస్య, పౌర్ణమి రోజులతో పాటు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో గుప్త నిధుల కోసం జోరుగా తవ్వకాలు సాగిస్తున్నారు. మూడేళ్ల క్రితం సంగెం గ్రామంలో కొందరు గుప్తనిధి కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలుసుకున్న గ్రామస్తులు వారిని పట్టుకుని భారీగా జరిమానా విధించారు. గుప్త నిధుల కోసం లక్షలాధి రూపాయలు వెచ్చిస్తూ ఇల్లును గుల్ల చేసుకుంటున్నవారు సైతం ఉన్నారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ నిధుల వేట ముమ్మరంగా సాగుతోంది. మంత్రగాళ్లుగా చెప్పుకునే వారిని మూఢ విశ్వాసంతో ఇతర ప్రాంతాల నుంచి పిలిపించి పూజలు చేయిస్తూ నిధుల కోసం తవ్వకాలు జరిపిస్తున్నారు. ఈ తంతు వ్యవహారాలు తరుచూగా జరుగుతున్నాయి.పోలీసుల నిఘా కూడా తక్కువగా ఉండటంతో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులు స్పందించి ఈ నిధుల వేటకు అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
పాడితో ఆర్థిక స్వావలంబన సాధించాలి
బాన్సువాడరూరల్ : అతివృష్టి, అనావృష్టిలతో సాగు భారమవుతున్న ప్రస్తుత తరుణంలో మహిళలు, రైతు కుటుంబాలు పాడిపరిశ్రమ వైపు దృష్టి సారించి ఆర్థిక స్వావలంబన సాధించాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మండలంలోని పోచారం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి స్త్రీనిధి రుణంతో డ్వాక్రా మహిళలకు గేదెలు కొనుగోలు చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సాగుఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులు నాబార్డు, ఐకేపీలు సంయుక్తంగా అందిస్తున్న రుణాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకుని పాడితో అధిక లాభాలు గడించాలన్నారు. ఒక గేదెను పెంచడం ద్వారా అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ. 8వేల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. తొలివిడతగా గ్రామంలోని డ్వాక్రా మహిళలకు ఒక గేదె ఇప్పిస్తున్నామని, రుణాల కిస్తులను ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లించినట్లయితే మరో గేదె ఇప్పించడం జరుగుతుందన్నారు. రూ. 40 వేల గేదెకు రూ. 10వేలు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. గతంలో ఉన్న ఇతర రాష్ట్రాల గేదెలు కొనుగోలు చేయాలనే నిబంధన తొలగించామన్నారు. పోచారం గ్రామంలో కార్యక్రమం విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. అలాగే గొర్లపెంపకందారులకు రూ. లక్ష రుణంతో 20 గొర్రెలు ఒక పొటేలు అందజేస్తున్నామన్నారు. దీంట్లో రూ. 20 వేలు లబ్ధిదారు, రూ. 20 వేలు సబ్సిడీ, రూ. 60 వేలు ఎన్సీడీసీ ద్వారా రుణం ఇప్పిస్తామన్నారు. రూ. 50 కోట్లతో ఇప్పటికే మహబూబ్ నగర్, వరంగల్ తదితర జిల్లాల్లో ఈకార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. చేపల పెంపకం దారులకు సబ్సిడీపై చేపవిత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వ స్థలం ఉంటే ప్రతి మండల కేంద్రంలో రూ. 15 లక్షలతో చేపల విక్రయకేంద్రాలు నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీఏ కిరణ్‌కుమార్, సర్పంచ్ బైరి అంజవ్వ, నాయకులు ఎర్వాలకృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాస్, జంగం గంగాధర్, దుద్దాల అంజిరెడ్డి, సాయిరెడ్డి, విజయ్‌గౌడ్, లతీఫ్, నరేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగనిరతిని చాటిచెప్పే బక్రీద్
బాన్సువాడ/బిచ్కుంద/నిజామాబాద్ కల్చరల్ : త్యాగనిరతిని చాటి చెప్పే బక్రీద్(ఈద్-ఉల్-జుహా) పండుగను జిల్లావ్యాప్తంగా సోమవారం ముస్లింలు ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలతో పాటు జిల్లావ్యాప్తంగా ఈద్గా్హ లలో ప్రార్థనలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండుగ నేపథ్యం ప్రవక్త హజ్రత్ ఇబ్రాహిం అలై సలాంకు మూడురోజుల పాటు అల్లాహ్ కలలో ప్రత్యక్షమై ‘నా కోసం నీకు ఇష్టమైన వస్తువును త్యాగం (ఖుర్బాన్)’ చేయాలని ఆజ్ఞాపిస్తారు. తనకు ఇష్టమైనది తన కుమారుడైన ఇస్మాయిలేనని, అల్లాహ్ కోసం దేనికైనా సిద్ధమని ఇబ్రాహిం(స) చెబుతారు. ఇస్మాయిల్‌ను తీసుకుని మక్కా షరీఫ్ నుంచి మదీనాకు ఒంటెపై తీసుకెళ్తుంటారు. అప్పుడు మార్గమధ్యలో వారి మనసును మార్చేందుకు మూడు సార్లు షైతాన్ అడ్డుపడుతుంది. హజ్రత్ ఇబ్రాహిం(స) తన మనసును మార్చకుండా షైతాన్ను రాళ్లతో కొట్టి తరిమివేస్తారు. అనంతరం మదీనాలోని మీనా వద్ద దైవనామ స్మరణ చేస్తూ ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్ (కోయడం) చేయడానికి సిద్ధమవుతారు. అప్పుడే అల్లాహ్ దూత అయిన హజ్రత్ జిబ్రాయిల్ అలైసలాం, స్వర్గం నుంచి తెచ్చిన పొట్టెలును ఇస్మాయిల్ స్థానంలో ఉంచుతారు. ప్రవక్త చేయదల్చిన త్యాగంతో అల్లాహ్ ప్రసన్నడవుతారు. ‘కేవలం కలలో చూసిన దాన్ని నిజం చేసి చూపించావు. ఈ పరీక్షలో నువ్వు గెలిచావు. ఇక భౌతిక చర్యగా మిగిలిపోయిన బలితో నాకు నిమిత్తమేమి లేదు. ఈ శుభసమయంలో మీ త్యాగనిరతికి గుర్తింపుగా ఈ పొట్టెలును పంపించాను’ అని ప్రసన్నులవుతారు. అప్పటి నుంచి ముస్లింలు ప్రతీ ఏడాది అదే బక్రీద్ రోజు పొట్టేలు, మేకలను అల్లాహ్ కోసం ఖుర్బాన్ (త్యాగం) చేస్తారు. ఈద్గాహ్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు సోమవారం ఈద్గాహ్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. జిల్లాకేంద్రంలోని ఖిల్లా, గాంధీచౌక్, ధర్మపురిహీల్స్ వద్ద గల ఈద్గాహ్ల్లో ఇప్పటికే ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. వీటిని ఆదివారం నగర మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఫయిమ్, కార్పొరేటర్ అజీజ్, మున్సిపల్ అధికారులు స్థానిక ఖిల్లా ఈద్గాహ్ను సందర్శించారు. -
బాన్సువాడను జిల్లా చేయాల్సిందే !
బాన్సువాడ : నాలుగు మండలాలకు కూడలి కేంద్రంగా ఉ న్న బాన్సువాడను జిల్లాగా మార్చాలని అఖిల పక్ష స మావేశంలో పలువురు డిమాండ్ చేశారు. మంగళవా రం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన అఖిల ప క్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో పాటు న్యాయవాదులు, పాత్రికేయులు, వ్యా పారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడు తూ రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతాలైన జుక్కల్, ఎ ల్లారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా చేస్తే తెలంగాణ పునర్ని ర్మాణంలో భాగంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని పే ర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గం జిల్లా కేంద్రం నుంచి 100 కిలో మీటర్ల దూరంలో ఉందని, ఎల్లారెడ్డి నియోజకవర్గం 80 కిలో మీటర్ల దూరంలో ఉందని, బాన్సువాడను జిల్లా చేస్తే కేవలం 20 నుంచి 30 కిలో మీటర్ల దూరంలో జిల్లా కేంద్రం కావడంతో పాటు ప్రజలకు జిల్లా స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. బాన్సువాడను జిల్లాగా మార్చే వరకు ఉద్యమం చేయాలని తీర్మానించారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన కృషి చేస్తే సాధ్యం కానిది లేదని, టీఆర్ఎస్ నాయకు లు సైతం జిల్లా కేంద్రం కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారన్నారు. అధికార పార్టీ నాయకత్వం వ హించి ఉద్యమాన్ని కొనసాగిస్తే తమకేమీ అభ్యంత రం లేదని, జిల్లాగా చేయడం వల్ల ఈ ప్రాంతంలో ని రుద్యోగ సమస్య కూడా దూరమవుతుందని పేర్కొన్నారు. దీని కోసం అందరం ఐక్యంగా కృషి చేద్దామని తీర్మానించారు. సమావేశంలో కాంగ్రెస్ సెగ్మెంట్ ఇం చార్జి కాసుల బాల్‌రాజ్, కాంగ్రెస్ నాయకులు అలీబిన్ అబ్దుల్లా, సాయిలు, అబ్దుల్ ఖాలిక్, భాస్కర్, నాగుల గామ వెంకన్న, టీడీపీ మండల అధ్యక్షుడు కొర్ల పోతురెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు అర్శపల్లి సాయిరెడ్డి, సీపీఐ నేత దుబాస్రాములు, చాంబర్‌ఆఫ్ కామర్స్ అ ధ్యక్షుడు నాగులగామ శ్రీనివాస్‌గుప్త, న్యాయవాదులు మూర్తి, మాణిక్‌రెడ్డి, రమాకాంత్, ఖలీల్ పాల్గొన్నారు. నేడు జిల్లా సాధన సమితి ఆవిర్భావం అఖిల పక్ష సమావేశాన్ని బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్థానిక ఆర్అండ్బీ సమావేశంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశ ంలో బాన్సువాడ జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసి, కార్యవర్గాన్ని ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలతోపాటు, వ్యాపార, వాణిజ్య, కుల సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్‌క్లబ్ తదితర సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రెస్‌క్లబ్ కార్యదర్శి సయ్యద్ అహ్మద్ కోరారు. -
బాన్సువాడను జిల్లా చేయాలి
బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న బాన్సువాడకు ఎల్లారెడ్డి, జుక్కల్, మెదక్ జిల్లాలోని నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాలు ఎంతో దగ్గరగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలను కలిపి జిల్లా కేంద్రంగా మార్చాలంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నాయకులు కోరుతున్నాయి. రాష్ట్రంలోనే జుక్కల్, ఎల్లారెడ్డి, నారాయణ్‌ఖేడ్ లు వెనుక బడిన నియోజ కవర్గాలు. బాన్సువాడ జిల్లా అయితే ఈ నియోజక వర్గాలు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కేంద్రం ఏర్పాటు విషయమై పరిశీలిస్తే తాము మద్దతు ఇస్తామంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రానికి 28 కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డి, 25 కిలో మీటర్ల దూరంలో బిచ్కుంద (జుక్కల్ నియోజకవర్గానికి ముఖ్య పట్టణం), 55 కిలో మీటర్ల దూరంలో నారాయణఖేడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. జుక్కల్ నియోజకవ ర్గంలో ఐదు మండలాలు, ఎల్లారెడ్డిలో 6 మండలా లు ఉన్నందున ఈ రెండు సెగ్మెంట్లలోని రెండేసి మండలాలను కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు. దీం తో ఐదు నియోజకవర్గాలను కలిపి బాన్సువాడను జిల్లా కేంద్రంగా మార్చడం బౌగోళికంగాను కలిసివస్తుంది. మెరుగైన రవాణా సౌకర్యాలు బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డి-మెదక్-మీదుగా హైదరాబాద్‌కు ఇప్పటికే రాష్ట్ర రహదారి అయిన (హెచ్ఎంబీ) రోడ్డు ఉంది. దీన్ని జాతీయ రహదారిగా మార్చే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి తోడు బోధన్ నుంచి బీదర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు సర్వేను పూర్తి చేశారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, బిచ్కుంద, దెగ్లూర్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాలకు బాన్సువాడ నుంచే వెళ్లాల్సి వస్తుంది. బాన్సువాడలో ఏరియా ఆసుపత్రి ఉన్నందున మూడు నియోజకవర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖ, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ డివిజనల్ కార్యాల యాలు ఉన్నా యి. ఇక్కడ ఉన్న బస్సు డిపో ద్వారా ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు బస్సులను నడుపుతున్నారు. ఇలా బాన్సువాడ ప్రాంతం అన్ని నియోజకవర్గాలకు అందుబాటులో ఉంది.బాన్సువాడలో సుమారు 50వేల జనాభా ఉంది. పట్టణాని కి ఆనుకొని ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ,బీజేపీలు బాన్సువాడను జిల్లా కేం ద్రం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసి ఆం దోళనలకు సిద్ధమవుతోంది. వీరికి అండగా న్యాయవాదులు నిలిచారు. వారు విధులను బహిష్కరించి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం చేయాల్సిందే బీర్కూర్ : బాన్సువాడను కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేయాల్సిందేనని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దివిటి శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. బీర్కూర్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు పంట రుణాలను మాఫీ చేయకపోతే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పోగునారాయణ, రాచప్ప, రాములు యాదవ్, నర్ర సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
బకాయి చెల్లించకుంటే కరెంట్ కట్
బాన్సువాడ : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు కోట్ల రూపాయల్లో విద్యుత్ బకాయిలు పడడంతో వాటి వసూలుకు ట్రాన్స్‌కో కార్యాచరణను రూపొందించింది. ఇటీవల ట్రాన్స్‌కో సీఎండీతో జరిగిన సమీక్షలో ప్రభుత్వ కార్యాల యాల బకాయిలపైనే చర్చించినట్లు సమాచారం. ఈ మేర కు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించారు. మొండి బకాయిలను ఎలాగైనా వసూలు చేయాల్సిందేనని సీఎండీ ఆదేశించడంతో జిల్లాలోని ట్రాన్స్‌కో అధికారులు ప్రభుత్వ కార్యాలయాల కు విద్యుత్తు సరఫరా నిలిపివేతే మార్గమని భావిస్తున్నారు. ఇప్పటికే గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్న వినియోగ దారులు ఒక నెల బిల్లు చెల్లించకున్నా విద్యుత్తు కనెక్షన్‌ను తొలగిస్తున్న అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ముక్కుపిండి మరీ బకాయిలను వసూలు చేయాలని భావిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ బాన్సువాడ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్)కు చెందిన ఎత్తిపోతల పథకాలు, మంచినీటి నిర్వహణ పథకాలకు సంబంధించి సుమారు రూ. 2 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల వసూలు కోసం పలుమార్లు ఎన్పీడీసీఎల్ బాన్సువాడ డివిజన్లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేసింది. ఆరు నెలల్లో మూడు సార్లు నెల రోజుల పాటు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో కార్యాలయంలో పని చేయాల్సిన సిబ్బంది ఇబ్బందుల పాలవుతున్నారు. వాస్తవానికి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి సంబంధించిన విద్యుత్తు బిల్లు నెలనెలా చెల్లిస్తున్నారు. కానీ వివిధ పథకాలకు సంబంధించి విద్యుత్తు బిల్లును చెల్లించకపోవడంతో కార్యాలయ విద్యుత్తును తొలగించారు. మొదట వివిధ పథకాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయగా, గ్రామాల్లో మంచినీటి సరఫరా లేక ప్రజలు ఆందోళనలు చేశారు. దీంతో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరింపచేయించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకే ఇబ్బంది కలిగించాలని, అప్పుడే విద్యుత్తు బకాయిలను చెల్లిస్తారని నిర్ణయించిన ట్రాన్స్‌కో డీఈ, డివిజనల్ కార్యాలయానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దీంతో ట్రాన్స్‌కో-ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య పలుమార్లు వాగ్యుద్ధం జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ట్రాన్స్‌కో బాన్సువాడ డివిజన్ పరిధిలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ. 20 కోట్ల బకాయి ట్రాన్స్‌కోకు ఉండడం గమనార్హం. ఇందులో గ్రామ పంచాయతీల ద్వారా రావాల్సిన బకాయి రూ. 15కోట్లు కాగా, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖల ద్వారా మరో రూ. 5 కోట్ల బకాయి రావాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీల నుంచి సుమారు 7 కోట్ల బకాయి, గృహ విద్యుత్తు కనెక్షన్ల నుంచి రూ. 15 కోట్ల వరకు రావాల్సి ఉందని సమాచారం. జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి బకాయిలు రావాల్సి ఉండడంతో ఎలాగైనా వాటిని వసూలు చేయాలనే లక్ష్యంతో ట్రాన్స్‌కో అధికారులు ఉన్నారు. -
రుణ మాఫీ తేలేనా!
బాన్సువాడ: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెవెన్యూ అధికారులు, బ్యాంకర్లు, గ్రామసభలు నిర్వహించి రుణమాఫీకి అర్హులైన రైతులను గుర్తించాలి. 1బి, ఆర్ఓ ఆర్, పహాణీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. అయితే జిల్లాలోని అనేక గ్రామాలలో కేవలం జాబి తాలోని పేర్లను చదివి సభలను ముగిస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం పకడ్బందీగా విచారణ జరుపుతుండడంతో నకిలీ పాస్ పుస్తకాలు, భూమి లేకున్నా పాస్ పుస్తకాలపై రుణాలు తీసుకొ న్న వారి వివరాలు బయటపడుతున్నాయి. వెరసి జిల్లాలో రైతు రుణ మాఫీ పథకం చిక్కుముడిలా త యారైంది. భూమి ఉందా? లేదా? అనేది ధ్రువీకరిం చాలని అధికారుల ఆదేశాలు ఉండడంతో గ్రామస్థా యి సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారు. భూమి లేకున్నా రుణాలు బాన్సువాడ, గాంధారి, ఎల్లారెడ్డి, బిచ్కుంద తదిత ర మండలాలలో పలువురు భూమి లేకున్నా పాస్ పుస్తకాలు సృష్టించి బ్యాంకుల నుంచి పెద్ద సంఖ్య లో రుణాలు పొందారు. ఈ వ్యవహారంలో ఎక్కడా రెవెన్యూ అధికారుల జోక్యం లేదు. తహశీల్దార్లు, ఆర్డీఓలకు సంబంధించిన నకిలీ స్టాంపులు, సంతకాలు ఫోర్జరీ చేసి కొందరు దళారులు రైతులకు రుణాలు ఇప్పించిన సంఘటనలు ఉన్నాయి. సహకార బ్యాంకులలో సైతం బినామీ పేర్లతో రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది. కేవలం పహాణీ జిరాక్స్ ఆధారంగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఉన్నాయి. భూమి అమ్మే ముందు రుణం తీసుకోవడం, భూమి కొనుగోలు చేసిన వ్యక్తి అదే పాస్ పుస్తకంపై మరో బ్యాంకులో రుణం తీసుకున్న సంఘటనలు ఉన్నా యి. దీంతో రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందనే దానిపై అనుమానాలు ఉన్నాయి. బంగారంపై రుణాలు సై తం బోగస్‌గా ఉన్నాయని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. వ్యవసాయ ఖాతా కింద వడ్డీ ఉండడంతో, నకిలీ పాస్ పుస్తకాలతో కొందరు ఈ వ్యవహారాన్ని పూర్తి చేశారు. పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకొని వాణిజ్య బ్యాంకులు పెద్ద సంఖ్యలో రుణాలు మంజూరు చే శాయి. రుణాలు తీసుకున్న రైతుల వివరాలు గ్రామసభలలో చదివి వినిపించి, అందరి ఆమోదం తీసుకొని వాటిపై సర్పంచ్, వీఆర్ఓ, పంచాయతీ అధికారి, డ్వాక్రా సంఘాల బుక్ కీపర్, నోడల్ అధికారి సంతకాలు చేసి అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశా లు జారీ చేశారు. ఇదే ఇపుడు సంకటంగా మారింది. గ్రామాలలో రూ. కోట్లలో రుణాలు ఒక్కో గ్రామంలో కోట్ల రూపాయలలో రుణ మాఫీ వ్యవహారం కొనసాగుతోంది. ఏ మాత్రం తేడా వచ్చి నా, తమను బాధ్యులుగా చేస్తారన్న భయంతో జిల్లాలోని అ త్యధిక ప్రాంతాల్లో సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) జరగడం లేదు. నోటీస్ బోర్డులలో పెట్టడం, గ్రామసభకు హాజరైన కొద్ది మందికి పేర్లు చదివి వినిపించడంతోనే సరిపెడుతున్నారు. గ్రామసభలలో లోతైన చర్చ, అభిప్రాయ సేకరణ, లోపాలు సరిదిద్ది నివేదిక రూపొందించి వాటిపై సంతకాలు చేయాలన్న నిబంధన ఆచర ణకు నోచుకోవడం లేదు. దీంతో నకిలీ, బినామీ రుణాలు వెలుగు చూసే పరిస్థితి లే దు. జాబితాలలో పేర్లు గల్లంతు ఇదిలా ఉండగా, ప్రస్తుతం బ్యాంకు అధికారులు ఇచ్చిన జాబితాలలో పలు పేర్లు గల్లంతు కాగా, ఒక వ్యక్తి వివరాలు పలు ప్రాంతాల్లో ఉండటం ఇబ్బందికరంగా మారింది. ఆధార్ సీడింగ్ చేయకుండానే జాబి తాలు పంపడంతో కింది స్థాయి అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాలకు వచ్చిన జాబితాలలో స్థానికుల పేర్లు కొన్ని చోట్ల కనిపించడం లేదు. స్థానికేతరుల పేర్లు ఉంటున్నాయి. అనేక చోట్ల కుటుంబ సభ్యులలో కొందరి పేర్లు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతు న్నారు. కొంత మంది గ్రామీణ ప్రాంతాలవారు పట్టణాలలో రుణాలు తీసుకున్నారు. సంబంధిత రైతు గ్రామానికి ఖాతా వివరాలు వెళ్లాలంటే బ్యాంకు అధికారుల చు ట్టూ తిరగాల్సిన పరిస్థితి. వ్యక్తిగతంగా కోరితే సర్దుబాటు చేయడమే తప్పా, ఇలాంటి వివరాలు సరి చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ లేదు. వేరు వేరు చోట్ల రుణాలు ఒక రైతు వివిధ బ్యాంకులలో రుణాలు తీసుకొంటే ఆ వివరాలు విడివిడి జాబితాలలో ఉన్నాయి. ఆధార్ నంబర్‌ను ఆధారం చేసుకొని రైతు ఎన్ని చోట్ల రుణాలు తీసుకొన్నా ఒకే దగ్గర కనిపించేలా జాబితా అందిస్తే ఇబ్బంది ఉండేది కాదని గ్రామ స్థాయి అధికారులు అంటున్నారు. ఒకరి ఖాతాపై ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తారని ఆశిస్తే కేవలం లక్ష రూపాయలని ప్రకటించడం, ఆ తర్వాత రూ. 35వేలు ఉన్న వారివి ప్రథమ ప్రాధాన్యం, ఆ తర్వాత బాండ్లు, హామీ పత్రాలు ఇస్తామని అధికారులు ప్రచార ం చేయడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ మాఫీపై ఆశపడి బ్యాంకులలో పాత రుణాలు చెల్లించకుండా, కొత్తవి తీసుకోకుండా వేచి ఉంటే సర్కారు నిర్ణ యంతో రెండింటికి చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైందని అంటున్నారు. ఈ వ్యవహారం గందరగోళంగా ఉండడంతో ప్రాథమిక స్థాయిలో తప్పులు జరగకుండా ఉండేం దుకు కొంత సమయం కావాలని జిల్లా అధికారులు అంటున్నారు. జాబితా సవరణకు ప్రభుత్వం ఈనెల ఐదు వరకు గడువును పొడిగించింది. -
‘మంజీరమ్మ’కు గర్భశోకం
బాన్సువాడ: ఇసుక మాఫియా, కాంట్రాక్టర్లు బరి తెగిస్తున్నారు. మంజీరా నంది నుంచి విచ్చలవిడిగా ఇసుకను తోడేస్తున్నారు. దీంతో నదీ గర్భంలో ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. నది కాస్త ఎడారిగా మారుతోంది. ఇసుక కాంట్రాక్టర్లు అనుమతి పొందిన దానికంటే అధికంగా ఇసుకను తోడేస్తున్నారు. యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారు. దీనితో భూగర్భ జలాలకు ముప్పు ఏర్పడుతోంది. సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తరలింపు ఇలా కొందరు అనుమతితో, మరికొందరు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువల ఆధునీకరణ పేరుతో అనుమతి పొంది అక్రమ ర వాణాకు పాల్పడుతున్నారు. దీంతో మంజీరా నదిలో విచ్చలవిడిగా గుంతలు ఏర్పడ్డాయి. మంజీరా తీరప్రాంతంలో నిబంధనలకు మించి 30 అడుగుల లోతు ఇసుకను తోడేస్తున్నారు. గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతి ఇచ్చి చేతులు దులుపుకుం టోంది. ఇసుక క్వారీల అనుమతి పొందిన యజమానులు పొక్లెయిన్లతో ఐదు అడుగుల మేర మాత్రమే ఇసుకను తీయాల్సి ఉండగా, 25 అడుగుల లోతు మేరకు తోడే స్తున్నారు. దీంతో నది ఉపరితలం దెబ్బతింటోంది. తీవ్ర వర్షాభావంతో ప్రస్తుతం మంజీరా నదికి చుక్క నీరు రాలేదు. కౌలాస్ నాలా ప్రాజెక్టు నుంచి ప్రతి ఏడాది 2-3 టీఎంసీల నీరు వచ్చి చేరేది. కానీ, కౌలాస్నాలపై ఎగువన ఏడూరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో కౌలాస్ నాలా ప్రాజెక్టు నిండలేదు. దీంతో పాటు నల్లవాగు సైతం పారడం లేదు. దీంతో నీరు లేక నది ఎడారిని తలపిస్తుంది. వీరికి తీవ్ర నష్టం బిచ్కుంద మండలం బండరెంజల్, గుండెనెమ్లి, వాజీద్నగర్, పుల్కల్, హస్గుల్, ఖద్గాం, శెట్లూర్, బిచ్కుంద, పిట్లం మండలం మద్దెల్ చెరువు, బాన్సువాడ మండ లం చింతల్‌నాగారం, బీర్కూర్ మండలం కిష్టాపూర్, దామరంచ, బీర్కూర్, బరంగేడ్గి, కోటగిరి మండలం హంగర్గ, పొతంగల్ గ్రామాల్లోన్ని మంజీరా తీర ప్రాంత వా సులు ఈ గుంతల కారణంగా నష్టపోతున్నారు. ఈ ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం బిచ్కుంద మండలంలోని షెట్లూర్, వాజీద్నగర్, ఖద్గాం, బీర్కూర్ మండలం కిష్టాపూర్ ప్రాంతాలలో ఇసుక తరలింపునకు కాంట్రాక్టర్లు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పటికే షెట్లూర్ క్వారీకి అ నుమతి లభించింది. పొక్లయినర్లతో ఇసుకను భారీ లారీలలో తరలించేందుకు కాంట్రాక్టర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిబంధనలన్నింటిని విస్మరిస్తున్నారు. ఇసుక కాంట్రాకర్లు, మాఫియా ధనదాహానికి మంజీరా నది ప్రస్తుతం చుక్క నీరు లేక బోసిపోయింది. తగ్గుతున్న భూగర్భ జలాలు మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పుల్కల్ మంజీరా తీరంలో కోట్ల రూపాయల నిధులతో బావిని త వ్వారు. తొమ్మిది గ్రామాలకు ఈ బావి ద్వారా తాగడానికి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇసుక తరలింపుతో ఈ తొమ్మిది 9 గ్రామాలకు నీటి ముప్పు ఏర్పడే అవకాశాలు న్నాయి. బాన్సువాడ పట్టణానికి మంజీరా నది నుంచే నీరు సరఫరా అవుతోంది. తాగునీటికి సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భూగర్భ జల నిపుణులు పేర్కొ ంటున్నారు. ఐదేళ్లుగా జిల్లాలో పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో నదులు, వాగులు, చెరువులు కళకళలాడి భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. జిల్లా వర ప్రదాయిని అయిన మంజీరా నది నీటితో గలగల పారి, భూగర్భ జలాల వృద్ధికి ఎంతో తోడ్పడింది. అయితే, మూడు నెలలుగా జిల్లాలో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టినట్లు ఇటీవల భూగర్భ జల శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. నిపుణుల ఆందోళన గత వర్షాకాలంలో జిల్లాలో సగటున 9.86 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు సు మారు నాలుగు సెంటీమీటర్ల లోతు సాంధ్రతలో వృద్ధి చెందాయి. కొన్ని నెలలకే 4.19 సెంటీమీటర్ల లోతుకు పడిపోయాయి. దీనిని బట్టి చూస్తే నీటి సాం ద్రత తగ్గుతోందని భూగర్భ జల శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. నీటి సాంద్రత తగ్గడానికి ముఖ్య కారణం మంజీరా నది నుంచి ఇసుక తరలింపేనని స్పష్టం చేస్తున్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవడానికి తెచ్చిన ‘వాల్టా’ చట్టం సరిగ్గా అమలు కావడం లేదు. అక్రమార్కులకు చుట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం ఇసుక తరలింపుపై ఆంక్షలు విధించాలి. బోర్లు వేసుకోవడానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కానీ, అవేవి జరగడం లేదు. బాన్సువాడ ప్రాంతంలో సుమారు 200 మీటర్ల లోతు బోరు వేస్తే తప్ప నీరు రావడం లేదు. మంజీరా నది సంరక్షణను విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని ప్రకృతి ప్రేమికులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు. -
‘ఆధార్’ తెస్తేనే రేషన్ సరుకులు
బాన్సువాడ : ‘నువ్వు ఆధార్ కార్డును ఇప్పటి వరకు ఇవ్వలేదు.. గవర్నమెంట్ నీకు రేషన్ సరుకు విడుదల చేయలేదు.. ఇంటికి వెళ్లిపో.. ఆధార్ తెస్తేనే రేషన్ సరుకు ఇస్తాం.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..’ అంటూ రేషన్ డీలర్లు లబ్ధిదారులను రేషన్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతలో భాగంగా రా ష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వారు ఆధార్ కా ర్డును నమోదు చేయాలని ఆదేశించడం, రేషన్ డీల ర్లకు ఒకవైపు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టగా, మరోవైపు ఆధార్ లేదని చెబుతూ లబ్ధిదారులకు రేషన్ ఇవ్వకుండా డీలర్లు లబ్ధి పొందుతున్నారు. ఇంకా రేష న్ కార్డుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమే కాలేదు. కేవలం ఆధార్ కార్డుల ఫీడింగ్ మాత్రమే చేస్తుండగా, రే షన్ సరుకు మాత్రం ప్రస్తుతం ఉన్న కార్డులకు సరిప డా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే గత జూలై, ఆగస్టు నెలల సరుకుల్లో ప్రభుత్వం కోత విధించిందని, ఆధార్ కార్డు ఇవ్వని వారికి సరుకు ఇచ్చేది లేదని రేషన్ డీలర్లు మోసం చేయడం గమనార్హం. బాన్సువాడతోపాటు బిచ్కుంద, బీర్కూర్, కోటగిరి, వర్నీ, పిట్లం తదితర మండలాల్లో రేషన్ డీలర్లు కోత విధిస్తూ చతురతను ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆధార్ కార్డుల కోసం నమోదు కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నా, ఇప్పటి వరకు కార్డులు రాని వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారికి ఈఐడీనంబర్ మాత్రమే వచ్చింది. దీంతో వారు శాశ్వత నంబర్ కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. ఇప్పటికే ఆధార్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఆధార్ కార్డులు ఇస్తేనే తమ రేషన్ కార్డులు ఉంటాయని, లేని పక్షంలో ప్రభుత్వం బోగస్ కార్డు కింద లెక్క కట్టి, తొలగిస్తారని తెలుసుకొన్న నిరుపేద లబ్ధిదారులు ఒక్క బాన్సువాడలోనే సుమారు 4వేలకు పైగా ఉన్నారు. వీరికి ఆధార్ కార్డు ఇంకా రాకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన చెందుతున్నారు. అయితే ఆధార్ కార్డునే సాకుగా చేస్తున్న రేషన్ డీలర్లు, ఇప్పటి నుంచే చేతివాటాన్ని ప్రద ర్శించి రేషన్‌లో కోత విధించారంటూ వారి పేరిట వచ్చిన రేషన్‌ను దబాయించుకోవడం శోచనీయం. ఈ విషయమై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురాగా, వారు సైతం పట్టించుకోవడంలేదని వార్డు సభ్యుడు అక్బర్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి రోజు అనేక మంది లబ్ధిదారులు తమకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, తాము సైతం అధికారులకు ఫిర్యాదు చేసినా వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. అధికారులు స్పం దించి రేషన్‌లో కోత విధించకుండా అందరికీ రేషన్ సరుకులు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు
బాన్సువాడ, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎక్కడా లేని విధంగా దుర్కి గ్రామంలో వందలాది ఎకరాల వక్ఫ్‌భూములు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఖాజీలకు ఈ భూములను ఇ నాం రూపంలో ప్రభుత్వం అందజేసింది. ఈ భూముల్లో పంటలను సా గు చేసి, వాటి ద్వారా వచ్చే నిధుల తో దర్గాల ఖర్చులను, ఖితాబత్ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిని విక్రయించడానికి వీలు లేదు. అయితే ఇక్కడ ఉన్న భూమిని కొం దరు అక్రమార్కులు యథేచ్ఛగా విక్రయించగా, కొందరు రాజకీయ నా యకులు వీటిని కొనుగోలు చేసి, క బ్జా చేసుకున్నారు. పట్టాలు, పహా ణీలు సైతం తయారు చేసుకున్నారు. ఈ విషయమై గ్రామస్తులు అభ్యంతరాలు తెలిపారు. రెండేళ్ళ క్రితం ఇ నాం భూమిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి పూనుకోగా, గ్రామస్తులు వ్యతిరేకించి పెద్ద ఎత్తున ఆందోళనలు చే యడంతో నిర్మాణ పనులు అర్ధాం తరంగా నిలిచిపోయాయి. ఇనాం భూముల విక్రయంపై పెద్ద దుమారం రేగడంతో వీటిపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించేందుకు వక్ఫ్‌బోర్డు అధికారులు నిర్ణయించారు. ఆధీనంలోకి రాని 61 ఎకరాల భూమి ఇదిలా ఉండగా, ఇనాం భూములను యథేచ్ఛగా విక్రయిస్తున్నారని, వాటికి సంబంధించిన పర్యవేక్షణ చేయడంలో వక్ఫ్‌బోర్డు అధికారులు విఫలమవుతున్నారని 2007లోనే గ్రా మస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పం దించిన అప్పటి కలెక్టర్ దుర్కి గ్రామ శివారులో ఉన్న 61 ఎకరాల ఇనాం భూమిపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మేరకు ఇనాం భూములైన సర్వే నెంబర్లు 534, 536, 537, 540, 544, 444, 94/1-2, 107/1 నుంచి 15 వరకు, 113/1-2లలో ఇనాం కింద అందజేసినట్లు వక్ఫ్‌బోర్డు సర్వేలో తేలింది. అయితే ఇందులో అప్పటికే సుమారు 40 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఆరోపణలు వెల్లు వెత్తాయి. మొత్తం 61 ఎకరాల భూమి వక్ఫ్ గెజిట్ నెంబర్.46ఎలో క్రమ సంఖ్య 25549లో పొందు పర్చడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి పహాణీలను స్వాధీనం చేసుకోవాలని, ఈభూమిని వక్ఫ్‌బోర్డుతో అటాచ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ కలెక్టర్ ఉత్తర్వులు కేవలం కార్యాలయానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. వీటిపై ఎలాంటి విచారణ జరగలేదు. దీంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఆ భూముల్లో సాగు చేస్తూ, వక్ఫ్‌బోర్డుకు కనీస రుసుము చెల్లించడం లేదని సమాచారం. ఈ భూములు ఇనాంకు సంబంధించినవి కావడంతో వాటిని ఇనాం హక్కుదారులు కేవలం సాగు చేసి, దీని ద్వారా వచ్చే నిధులను ఖర్చు చేసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. గ్రామం లో ఉన్న ఈద్గాను కూల్చివేసి, ఇప్పటి వరకు నిర్మించలేదని, ప్రతీ ఏడాది *లక్షల ఆదాయం వచ్చినా నిర్మించకపోవడం శోచనీయమని వారు పేర్కొంటున్నారు. వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షించి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని జమ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపుల సైతం ఇనాం భూములు ఉండగా, వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రచారానికి ని‘బంధనాలు’
బాన్సువాడ, న్యూస్‌లైన్ : ఎన్నికల నియమావళిని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేస్తుండడంతో ప్రచార సరళిలో అభ్యర్థుల దూకుడు తగ్గింది. మున్సిప ల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్నప్పటికీ ఎన్నికల కోడ్ దడ పుట్టిస్తుండడంతో నాయకులు ఆర్భాటాల జోలికి వెళ్లడం లేదు. ఈసారి ఎన్నికల్లో ఫ్లెక్సీలు, కరపత్రాలు కనిపించడం లేదు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా మందకొడిగా ప్రచారం సాగుతోంది. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ప్ర కటనలు లేకుండా అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికే పరిమితం అవుతున్నారు.ఎన్నిక లు వచ్చాయంటే నెలరోజుల ముందు నుంచే కరపత్రాలు, వాల్ పెయింటింగ్స్, స్టిక్కర్లు, లౌడ్ స్పీకర్లు తదితర ప్రచార సాధనాలతో సందడిగా కనిపించేది. దీంతో చిరు వ్యాపారులకు ఎంతో లబ్ధి చేకూరేది. కానీ ప్రస్తుతం వారికి కనీసం ఉపాధి కరువైంది. సాధారణ ఎన్నికల షెడ్యూ ల్ విడుదల కాకముందే, దసరా, దీపావళి, బక్రీద్, క్రిస్మస్ తదితర పండుగల శుభాకాంక్ష లు తెలుపుతూ ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు పోటీచేసే ఆశావాహులు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో జిల్లాలో అక్కడక్కడ గోడలకు వేసిన ఫ్లెక్సీలను ఇప్పటికే అధికారులు తొలగించారు. ప్రస్తుతం వీటిని అంటించే వారికి సైతం నోటీసులు జారీచేస్తున్నారు. ఎన్నికలొస్తున్నాయంటే పట్టణాలు, పల్లెలు బ్యానర్లతో నిండిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కని పించడం లేదు. బ్యానర్లు కట్టడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం అవుతుంది. దీంతో ఎక్కడా పార్టీల నాయకుల ప్రచార బ్యానర్లను ఏర్పాటు చేయడం లేదు. లౌడ్ స్పీకర్లకూ అనుమతి... అలాగే లౌడ్ స్పీకర్లకు అనుమతి తీసుకొని నిబంధనలకు లోబడి ప్రచారం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయనే ఈసీ హెచ్చరికలతో వీటిని వినియోగించేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో మైక్‌సెట్ షాపుల వారికి గిరాకీ లేక ఉసూరుమంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు తమతో పాటు పది మందిని మాత్రమే వెంట తీసుకొని తిరగాల్సి ఉంటుం ది. గుంపులుగా ప్రదర్శనగా వెళ్లరాదని నిబంధన అమలులో ఉండడంతో భారీ ప్రదర్శనలకు అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు. కేవలం కొద్దిమందితోనే ప్రచారం చేసుకుంటున్నారు. చిన్న పత్రికలపై ప్రభావం... ఎన్నికల్లో ప్రకటనల ద్వారా తమ పత్రికకు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని భావించిన పత్రికలపైనా కోడ్ ప్రభావం పడింది. ప్రస్తుతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకట నలు వేయించుకోవడం కష్టమైంది. మీడియా లో ప్రకటనలు జారీ చేయాలనుకుంటే అభ్యర్థు లు ముందుగా జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి నిర్ణీత ఫార్మాట్లో ప్రకటన ధర, సమయం, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పబ్లిష్ చేయించుకుంటారో వివరాలు తెలియజేస్తూ దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాల్సి ఉంది.అనుమతి లేకుండా ప్రకటనలు జారీ అయితే ఈసీ చర్యలు తప్పవు. ఇంతటి ప్రయా స ఎందుకని చాలామంది అభ్యర్థులు ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. అనర్హత వేటు భయం... ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నిర్ణీత వ్యయం కంటే అధికంగా ఖర్చుచేస్తే అనర్హత వేటుపడే అవకాశం ఉండడంతో ఆచితూచి ఖర్చు పెడుతున్నారు.జీరో బ్యాంకు ఖాతా ద్వారానే లావాదేవీలు సాగించాలనే నిబంధన ఉంది. దీంతో ఎక్కువగా వ్యయం కింద జమ కాకుండా గోప్యంగా ఖర్చుచేస్తున్నారు. ఈసీ నిబంధనలే కాదు అభ్యర్థులకు వేసవి ప్రతాపం అడ్డంకిగా మారింది. వారం రోజులుగా ఎండలు అధికం కావడంతో ఉదయం పది గంటల్లోపే అభ్యర్థు లు ప్రచారాన్ని ముగిస్తున్నారు. తిరిగి సాయంత్రం ప్రచారం చేసుకుంటున్నారు. ముందస్తు ప్రచారంతో ఊరట పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న పలువురు అభ్యర్థులు షెడ్యూల్ విడుదల కాకముందే ఫ్లెక్సీలతో జోరుగా ప్రచారం చేసుకుననారు. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఫ్లెక్సీలను వాడుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థుల హడావిడి ఫ్లెక్సీల ఏర్పాటులో ఎక్కువగా కనిపించింది.ఈ పార్లమెంట్ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థులు దూకుడుగా వ్యవహరించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డితో పాటు కామారెడ్డి నియోజకవర్గాలు వస్తాయి. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఆశావాహులు పెద్ద ఎత్తున ఫ్లెక్లీలు ఏర్పాటు చేయిం చారు. జహీరాబాద్ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించుకున్న మదన్మోహన్రావు ఒక అడుగు ముందుకు వేసి రెండు నెలల క్రితమే సైకిల్‌యాత్ర పేరిట నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఫ్లెక్సీలు, గోడరాతలతో విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ తరపున బిచ్కుంద మఠానికి చెందిన ఒక మఠాధిపతి, మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర కుమారుడు ఆలె జితేంద్ర పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. మద్నూర్‌కు చెందిన ఒక పారిశ్రామికవేత్త టీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి సిద్ధమై, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. షెడ్యూల్ రావడంతో వీటన్నింటిని అధికారులు తొలగించారు. -
‘బడా’ దోపిడీ
పెద్దగుట్టలో కనీస సౌకర్యాలూ కరువేమూడు రాష్ట్రాల నుంచి భక్తులుసంపాదనే ధ్యేయంగా ముజావర్లు అడుగడుగునా పేరుకుపోయిన సమస్యలు దక్షిణ భారతదేశంలోనే ముస్లింల పవిత్ర దర్గాలలో ఇది ఒకటి. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాల నుంచి కులమతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు ఏడాది పొడవునా దర్గాను దర్శించుకుంటారు. మనసారా వేడుకుంటే కోరికలు నెరవేరుతాయని నమ్ముతా రు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ దర్గా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలో ఉంది. అయితే ఇక్కడకు వచ్చే భక్తులను ముజావర్లు (దర్గా పర్యవేక్షకులు) యథేచ్ఛగా దోచుకుంటున్నారు. - బాన్సువాడ, న్యూస్‌లైన్ దర్గా ముఖ ద్వారం బాన్సువాడ, న్యూస్‌లైన్: వక్ఫ్ బోర్డు పరిధిలోకి వచ్చే బడాపహాడ్ అధికారులకు, నిర్వాహకులకు బంగారుబాతుగా మారింది. దర్గా నిర్వహణను ఏటా వేలం పాటల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ప్రతి ఏడాది సగటున సుమారు రూ. కోటి నుంచి రూ. రెండున్నర కోట్ల వరకు వేలం పాడి కాంట్రాక్టర్లు దీని నిర్వహణను దక్కించుకొంటారు. అక్కడి నుంచే దోపిడీ ప్రారంభమవుతుంది. అధికారులు బడాపహాడ్ ను కాంట్ట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకొంటారు. కాంట్రాక్టర్ల నుంచి ముజావర్లు హక్కులు పొందుతారు. వారే దర్గాను పర్యవేక్షిస్తారు. దర్గా వద్ద భక్తులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా డబ్బులు తీసుకుంటారు. డబ్బులు ఇవ్వనివారిని దర్గా లోపలికి కూడా రానివ్వరు. న్యాజ్ (కందూరు) చేస్తే వివిధ రూపాలలో దాదాపు రెండు వేల రూపాయలు చెల్లించాల్సిందే. ఎవరైనా ముజావర్లను ప్రశ్నిస్తే, ‘‘పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసుకోండి, మాకేం కాదు’’ అం టూ నిర్భయంగా చెబుతారు. విడిది కోసం వినియోగించే పూరిగుడిసెలకు రోజుకు రూ. 100 నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తారు. వక్ఫ్‌బోర్డు అధికారులకు భక్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతులేని నిర్లక్ష్యం బడాపహాడ్‌కు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వక్ఫ్‌బోర్డు అధికారులు, దర్గా నిర్వాహకులు నిర్యక్ష్యం చూపుతున్నా రు. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ అరకొర వసతులు మాత్రమే కల్పిస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భక్తుల విడిది కోసం విశ్రాంతి గృహా లు లేవు. స్నానం చేయడానికి నీటి వసతి లేదు. తాగడానికి సైతం నీరు లేదు. మూత్రశాలలు లేవు. దర్గాపై రోప్‌వే నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసినా అవి కనుమరుగయ్యాయి. రహదారి అధ్వానం బడాపహాడ్ పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ద్విచక్రవాహనచోదకులు సైతం వెళ్లలేని స్థితికి చేరుకుంది. బీటీ కాస్తా మట్టి రోడ్డుగా మారిపోయింది. పెద్ద పెద్ద గుంతలు, కంకర తేలి, వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డుపై ప్రయాణం భక్తుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఎంతో ప్రత్యేకత సంతరించున్న ఈ పుణ్య క్షేత్రంపై ప్రభుత్వధికారులు మాత్రం ఎప్పటికీ శీతకన్నే ప్రదర్శిస్తున్నారు. జాకో రా, కూనిపూర్, వెంకటేశ్వర క్యాంపు, జలాల్ పూర్ గ్రామాల వద ్ద మురికి నీరు రోడ్డుపైన ప్రవహిస్తోంది. దోపిడీని అరికట్టాలి బడాపహాడ్‌లో భక్తులను దోచుకోవడమే ధ్యేయంగా కొందరు ముఠాగా ఏర్పడ్డారు. కాంట్ట్రాక్టు అమర్ అనే వ్యక్తి పేరుపై ఉండగా, అతనితో సంబంధం లేని ఆరుగురు వ్యక్తులు దర్గాలో ఉన్నారు. భక్తులు వస్తే వారి నుంచి బలవంతంగా డబ్బులు తీసుకొంటున్నారు. దర్శనం చేయనివ్వడం లేదు. దీంతో భక్తులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. -షేక్ జమీల్, ఆర్మూర్ చర్యలు తీసుకుంటాం బడాపహాడ్‌లో కొందరు భక్తులను దోచుకొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకొంటాం. నిబంధనల మేరకే డబ్బులు తీసుకోవాలి. దర్గా వద్ద మౌలిక వసతుల కల్పన కోసం కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశాం. త్వరలో అభివద్ధి పనులు ప్రారంభమవుతాయి. - జావీద్ అక్రం, వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు. -
సర్పంచులకు అందని గౌరవం
బాన్సువాడ, న్యూస్‌లైన్ : గ్రామానికి ప్రథమ పౌరుడుగా వ్యవహరించే సర్పంచుకు వేతనం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. గత ఏడాది ఆగస్టు రెండున పదవీ బాధ్యతలు స్వీకరించిన వీరికి ఇప్పటి వర కు వేతనాల నిధులు విడుదల కాలేదు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలకు సర్పంచులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేజర్ పంచాయతీల సర్పంచుకు రూ. 1500, మైనర్ పంచాయతీ సర్పంచుకు రూ. 1000 చొప్పన నె లవారీ గౌరవ వేతనాలు అందాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సగం నిధులు పం చాయతీరాజ్ కమిషనర్ నుంచి విడుదల కావాలి. మిగతా సగం పంచాయ తీ భరిస్తుంది. జిల్లాలో మొత్తం సర్పంచులకు సుమా రు రూ. కోటి వరకు గౌరవ వేతనం అందాల్సి ఉంది. వేతనాల విషయమై ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులను సర్పంచులు ప్రశ్నిస్తున్నప్పటికీ, నిధులు మంజూరు కానిది తామేమీ చేయ లే మంటూ వారు చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు నెల లో ఒకరోజు శిక్షణ తరగతులకు హాజరు కావాల్సి ఉం డడంపై సర్పంచులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
వార్డెన్ల అవినీతికి ఈ-చెక్
బాన్సువాడ, న్యూస్‌లైన్ : వసతిగృహాల్లో ఉంటూ చదువుతున్న విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్లకు ప్రభుత్వం ‘ఈ-చెక్’ పెట్టింది. ఎ లాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం లేకుండా ‘అన్లైన్’ అస్త్రాన్ని ప్రయోగిం చింది. ఇకపై ఈ-హాస్టల్స్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారానే బిల్లు లు సమర్పించిన వారికి చెల్లింపులు జరపాలని, మ్యానువల్‌గా ఇచ్చిన వాటికి నిలిపివేయాలంటూ ట్రెజరీ శాఖను ఉన్నతాధికారులు ఆదేశించారు. హాస్టల్స్ వెబ్సైట్లో కాకుండా, ట్రెజరీ శాఖ వెబ్సైట్లో బిల్లులు సమర్పిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతా ఆన్లైన్లో రెండేళ్ళ క్రితమే ఈ-హాస్టల్స్ విధానం ప్రవేశపెట్టినా, పకడ్బందీగా అమలు కాకపోవడంతో ప్రస్తుతం దీన్ని పక్కాగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు కొందరు పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు కేటాయిస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు రావడంతో వాటికి చెక్ పెట్టాలని అధికారులు నిర్ణయించారు. వసతి గృహాల్లో ఎంతమంది విద్యార్థులున్నారు.. వారి ఫొటోలు ఇతర వివరాలన్నింటిని ఆన్లైన్లో నమోదు చేశారు. వసతి గృహానికి సంబంధించిన ముఖ్యమైన విభాగాలను కూడా ఫొటోలను తీసి ఆన్లైన్లో ఉంచా రు. దీన్ని బట్టి పిల్లలు ఎంతమంది ఉన్నా రు..? ఆ మేరకు సరకులు తెస్తున్నారా..? ఎక్కువగా తెస్తున్నారా..? అనేది కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. నేరుగా వ్యాపారుల ఖాతాలోకి వార్డెన్లు పిల్లలకు భోజనం పెట్టేందుకు కూరగాయల నుంచి ఇతర నిత్యావసర వస్తువులను ఎక్కడ కొనుగోలు చేస్తున్నా రో ఆయా వ్యాపారి వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆధార్‌కార్డు నెంబర్లు ఆన్లైన్ లో అధికారులకు తెలపాలి. నెలనెలా తాము కొనుగోలు చేసిన బిల్లులను వెబ్సైట్లోనే నమోదు చేయాలి. నేరుగా ఆయా వ్యాపారుల ఖాతాలో జమ చేస్తా రు. ఇప్పటికీ కొంత మంది వార్డెన్లు ఆన్లైన్లో కాకుండా మ్యానువల్‌గా సమర్పిస్తున్నారు. ట్రెజరీ శాఖ అధికారులు కూడా ఇలాంటి వారికి చెల్లింపులు జరుపుతూ వస్తున్నారు. మరికొంత మంది వార్డెన్లు తమ బ్యాంకు ఖాతాలను వినియోగించకపోవడంతో అవి రద్దయ్యాయి. ఈ విషయం అధికారులకు చెప్పకుండా ట్రెజరీ శాఖ వెబ్‌సైట్‌కు వెళ్లి అందులో బిల్లులు నమోదు చేస్తున్నారు. ఇలా చేయ డం త ప్పని, ఇలాంటి వాటికి చెల్లింపులు నిలిపివేయాలని, ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆ దేశించారు. బ్యాంకు ఖాతాలు రద్దయిన వార్డెన్ల ఖాతాలను తిరిగి పునరుద్ధరించేలా చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులకు తప్పని ‘కడుపు కోత’ ప్రభుత్వం గత ఏడాది మెనూ ధరలను పెంచగా, ఆకాశన్నంటిన నిత్యావసరాలతో విద్యార్థులు ఒంటిపూట భోజనంతో సరిపెట్టుకొంటున్నారు. మూడు నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ప్రతీ ఒక్కరికి నెలకు 750, ఎనిమిదోతరగతి నుంచి పదోతరగతి వరకు విద్యార్థికి 850 చొప్పున మెస్ చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ లెక్కన ఏడో తరగతి వరకు ఒక్కో విద్యార్థిపై రోజుకు 25, ఆ పై తరగతి విద్యార్థులకు 27 వెచ్చిస్తున్నారు. ఈ మొత్తంలో రెండు పూటలా ఆహారం, మధ్యలో అల్పాహారం, వారానికి ఆరు సార్లు గుడ్లు, సాయంత్రం స్నాక్స్, ఆదివారం పండ్లు, ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా అందించాలి. వార్డెన్ల అక్రమాల కారణంగా ఇవి అందడం లేదు. బడ్జెట్ పెరిగిపోతుండటంతో ప్రతిరోజూ పాలు, అల్పాహారం, వారానికి ఆరుసార్లు గుడ్లు, ఆదివారం పండ్లు అందించలేమని వార్డెన్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో మెనూ నిబంధనలను పక్కన పెట్టేస్తున్నారు. ఆన్లైన్ విధానం పక్కగా అమలైతే హాస్టల్ విద్యార్థులకు మేలు జరగనుంది. -
అదుపులేని ఇసుక రవాణా
బాన్సువాడ/కోటగిరి, న్యూస్‌లైన్ : అక్రమ ఇసుక రవాణకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అక్రమార్కులు అర్ధరాత్రి వేళ ఇసుకను తరలిస్తున్నారు. మంజీర పరీవాహక ప్రాంతాలైన హున్సా, మందర్నా, సుంకిని గ్రామాల నుంచి ప్రతిరోజు 10 నుంచి 20 వరకు ట్రాక్టర్ల ఇసుకను తోడుకెళ్తున్నారు. టెండర్లు లేకుండానే, పట్టా భూముల నుంచి అనుమతి లేనప్పటికీ కొందరు అక్రమార్కులు సిండికేట్‌గా మారి యథేచ్ఛగా దందాను సాగిస్తున్నారు. ఇసుకను టాక్లీ గ్రామ శివారులో డంప్ చేసి అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా బోధన్, నిజామబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ‘న్యూస్‌లైన్’ నిఘాలో తేలింది. ఒక్కో టిప్పర్‌ను రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ ఇసుక రవాణాకు పలువురు రాజకీయ నాయకుల అండదండలతో పాటు కొందరి అధికారుల సహకారం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల క్రితం పోలీసులు రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి, జరిమానా విధించి వదిలేశారు. ఇదిలా ఉండగా అక్రమార్కులు ఇందిరమ్మ గృహాల నిర్మాణం పేరిట ఇసుక తరలింపునకు తహశీల్దార్ల నుంచి అనుమతి పొందుతున్నారు. అనుమతికి మించి ట్రాక్టర్లలో ఇసుకను తరలించి ప్రైవేటు ఇళ్ల నిర్మాణాలకు అమ్ముకుంటున్నారు. పొతంగల్ శివారు నుంచి ఇలా ఇసుకను తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో హున్సా, మందర్నా నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు తనిఖీ చేసినా... ఇసుక అక్రమ రవాణాపై బోధన్ సబ్ కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. పుల్కల్, వాజీద్నగర్, బీర్కూర్, బరంగేడ్గి గ్రామాల్లోని క్వారీలను ఇటీవల నిలిపివేయించారు. అయితే తాజాగా మళ్లీ ఆ క్వారీలు ప్రారంభమయ్యాయి. పట్టాల ద్వారా అనుమతి పొందిన క్వారీలే కాకుండా, అనుమతులు లేకుండా కొందరు అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు కేసులు పెట్టినా, జరిమానాలు విధిస్తున్నా ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. బాన్సువాడ మండలం చింతల్ నాగా రం, బీర్కూర్, కోటగిరి మండలం హంగర్గ, మందర్నా, హున్సా, పోతంగల్, బిచ్కుంద మండలం బండరెంజల్, గుండెనెమ్లి, వాజీద్నగర్, పుల్కల్, హస్గుల్, ఖద్గాం, శెట్లూర్ పిట్లం మండలం మద్దెల్ చెరువు గ్రామాలకు ఆనుకొని ఉన్న మంజీర నది నుంచి ప్రతి రోజు పెద్ద మొత్తంలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ ప్రాంతంలోని రెవె న్యూ, పోలీసు అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో ఇసుక రవాణాకు అడ్డుకట్ట వే యలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. -
పథకం పడకేసింది
బాన్సువాడ, న్యూస్‌లైన్: బాల్యానికి భరోసా ఇవ్వడం కోసం, విద్యార్థుల ఆరోగ్య, విద్య ప్ర గతిని తెలుసుకోవడం కోసం ప్రభుత్వం 2010 నవంబర్ 14న జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించింది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే దీని ఉద్దేశం. బాలల దినోత్సవం సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ పథకం విద్యార్థులకు వరంగా మారుతుందని అందరూ భావించారు. ఈ పథకం ప్రకారం పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆరోగ్య రక్ష కార్డులో విద్యార్థి రుగ్మతలను, ఆరోగ్య పరిస్థితిని నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల వయసు, ఎత్తు, బరువు, ఛాతి కొలత, దృష్టి లోపం, వినికిడి లోపం, విద్యార్థుల వ్యక్తిగత వివరాలను పేర్కొనాలి. విద్యార్థి తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే.. అందుకు గల కారణాలను రాయాలి. కార్డులో రాసిన వివరాల ఆధారంగా సదరు విద్యార్థికి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం అమలులో అధికారులు చిత్తశుద్ధి చూపకపోవడంతో లక్ష్యం నీరుగారిపో యింది. విద్యార్థులకు ఇచ్చిన బాల ఆరోగ్య రక్ష కార్డులు మూలనపడ్డాయి. చాలా చోట్ల విద్యార్థులకు బాల ఆరోగ్య రక్ష కార్డులు ఇవ్వలేదంటే విద్య, వైద్యశాఖల అధికారుల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. లోటుపాట్లను సవరించేందుకు జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకంలోని లోటుపాట్లను సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకంలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ పథకాన్ని రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం (ఆర్బీఎస్కే)గా పిలవనున్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న బాల ఆరోగ్య రక్ష పథకం ఎనిమిదో తరగతిలోపు విద్యార్థులకే వర్తించేది. కొన్ని పాఠశాలలలో మాత్రం పదో తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేవారు. కొత్తగా విస్తరించే పథకంలో అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలతో పాటు 9, 10 తరగతుల విద్యార్థులనూ చేర్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు బాల ఆరోగ్య రక్ష పథకంలో పీహెచ్సీ వైద్యులు వారి పరిధిలోని పాఠశాలలకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించేవారు. పీహెచ్సీలలో సిబ్బంది కొరత, పేషెంట్ల రద్దీ దృష్ట్యా విద్యార్థులకు సరైన సేవలు అందలేదు. ఈ నేపథ్యంలోనే జబార్ను ఆర్బీఎస్కేగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో అమలయ్యే ఆర్బీఎస్కే కోసం కొత్తగా వైద్యులు, సిబ్బందిని నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రత్యేకంగా క్లస్టర్ల వారీగా నియామకాలు చేపడతారని తె లిసింది. ప్రతి క్లస్టర్‌కు ఒక వైద్యుడు, స్టాఫ్ నర్సు/ఏఎన్ఎం, ఫార్మసిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తారని, వీటిని ఆయుష్ ద్వారా భర్తీ చేస్తారని సమాచారం. సేవలు ఇలా క్టస్లర్లలో ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులకు, ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం బాలల ఆరోగ్య విషయాలను పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది కార్డులలో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా సేవలు అందిస్తారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలు నమోదు చేసిన కార్డులను స్కూల్ ప్రధానోపాధ్యాయులు భద్రపరచాల్సి ఉంటుంది. నూతన పథకాన్నైనా పకడ్బందీగా అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వైద్య పరీక్షలు చేస్తలేరు పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు. బాల ఆరోగ్య రక్ష పథకం సరిగా అమలు కావడం లేదు. దీనిని ఎంతో ఘనంగా ప్రా రంభించారు. ఆచరణలో విఫలమయ్యారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలి. -సదానంద్, విద్యార్థి తండ్రి, బాన్సువాడ వైద్య సిబ్బందిని నియమించాలి వైద్యుల కొరత కారణంగానే బాల ఆరోగ్య రక్ష పథ కం అమలు కావడం లేదు. ఈ పథకం సక్రమంగా అమలు కావాలంటే ముందు వైద్య సిబ్బందిని నియమించాలి. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలి. సేవలు సక్రమంగా అందేలా చూడాలి, -ప్రవీణ్ గౌడ్, ఎస్ఎఫ్ఐ నాయకుడు, బాన్సువాడ -
తాగునీటి పథకాల టెండర్లలో అవగాహన
బాన్సువాడ, న్యూస్‌లైన్: బాన్సువాడలోని ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా పథకం) డివిజన్ కార్యాలయంలో మంగళవారం కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి తాగునీటి పథకాల పనులను దక్కించుకున్నారు. బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గాల్లో ఉన్న తాగునీటి పథకాల నిర్వహణకు ఆ శాఖ టెండర్ల ను ఆహ్వానించింది. ప్రజలకు మంచినీటి సరఫరా సందర్భంగా క్లోరినేష న్, పైప్లైన్ల నిర్వహణ, ట్యాంకుల్లో నీరు నింపడం తదితర పనులు ఈ పథకాల ద్వారా చేయాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఈ పథకాల నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టర్లు అవగాహనకు వచ్చి, ఎలాంటి పోటీ లేకుండా పనులు సాధించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ సారి సైతం కాంట్రాక్టర్లందరూ ఏకమై పోటీ లేకుండా చేశారు. ఈ సారి ఒక్కొక్క నిర్వహణ పథకానికి అధికారులు భారీగానే అంచనా వ్యయం పెంచారు. ఇది కాంట్రాక్టర్లకు కలిసివచ్చింది. అధికారులు-కాంట్రాక్టర్లు లోలోపల అవగాహనకు వచ్చి తూతూమంత్రంగా టెండర్ల దరఖాస్తులను స్వీకరించినట్లు తెలుస్తోంది. పోటీ లేకపోవడంతో అధికారులు తయారు చేసిన అంచనా వ్యయానికే టెండర్లు ఖరారయ్యాయి. దీంతో తోటి కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులకు పర్సంటేజీలు లభించాయి. ఇదీ సంగతి బాన్సువాడ పట్టణంలోని తాగునీటి పథకం నిర్వహణకు రూ. 7.32 లక్షల వ్యయంతో టెండర్లను ఆహ్వానించగా, 10 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తు చేసుకొన్నారు. వారంతా ఏకం కావడంతో భారీగా డబ్బులు చేతులు మారాయి. చివరకు ఒక కాంట్రాక్టర్ పోటీ లేకుండా, అంచనా వ్యయానికి సమానంగా టెండర్ దాఖలు చేశారు. ఒకవేళ కాంట్రాక్టర్ల మధ్య పోటీ ఉం టే 10 నుంచి 20 శాతం తక్కువకు దాఖలు చేసే అవకాశం ఉండేది. కానీ సిండికేట్ కారణంగా అంచనా వ్యయానికి సమానంగానే ఖరారైంది. కోటగిరి మం డలంలోని మందర్న మంచినీటి నిర్వహణ పథకానికి రూ.7.24 లక్షలతో టెండర్‌ను ఆహ్వానించగా 11 మంది దరఖాస్తు చేసుకొన్నారు. అంచనా వ్యయానికి సమానంగా దరఖాస్తు చేసిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కాయి. బిచ్కుంద తాగునీటి పథకానికి అంచనా వ్యయం రూ. 4.5 లక్షలు కాగా, 10 మంది దర ఖాస్తు చేసుకొన్నా, టెండర్ ఫారాలను తీసుకొన్న వారందరూ ఎక్సెస్‌తో దాఖలు చేసి, అవగాహన కుదుర్చుకొన్న కాంట్రాక్టర్‌తో సమానంగా వేయించారు. దీం తో సమానంగా దరఖాస్తు చేసిన కాంట్రాక్టర్‌కే పను లు దక్కాయి. జుక్కల్ మండలం నాగల్గాం గ్రామం లో రూ. 3.3లక్షలతో టెండర్‌ను ఆహ్వానించగా, 8 దరఖాస్తులు వచ్చాయి. అయితే కాంట్రాక్టర్ల మధ్య అవగాహన కుదరడంతో అంచనా వ్యవయానికి స మానంగా దరఖాస్తు చేసుకొన్న కాంట్రాక్టర్‌కే పనులు లభించాయి. బీర్కూర్ మండలం దామరంచ గ్రా మంలో రూ. 10 లక్షలతో మంచినీటి పథకాల నిర్వహణకు టెండర్‌ను ఆహ్వానించగా, 10 దరఖాస్తు ఫారాలు అమ్ముడు పోయాయి. చివరకు అవగాహన కుదుర్చుకున్న కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. కోటగిరి మంచినీటి పథకానికి రూ. 8.88 లక్షల అం చనా వ్యయం కాగా, 11 మంది దరఖాస్తులు తీసుకున్నారు. ఎవరూ టెండర్ ఫారాన్ని దాఖలు చేయలేదు. దీంతో ఈ పథకానికి సంబంధించి టెండర్ ఖరారు కాలేదు. వర్నీ మండలం తగిలేపల్లిలో రూ. 3.98 లక్షల అంచనా వ్యయంతో టెండర్‌ను ఆహ్వానిం చినా, కాంట్రాక్టర్ల మధ్య అవగాహన కుదరలేదు. ఏడుగురు కాంట్రాక్టర్లు దరఖాస్తు చేసుకోగా, పోటీ పె రిగి, అత్యధికంగా 32 శాతం లెస్తో దరఖాస్తు చేసుకొన్న కాంట్రాక్టర్‌కు పనులు దక్కాయి. పోటీ అధికం గా ఉన్నందున ప్రభుత్వానిక సుమారు లక్ష రూపాయల నిర్వహణ ఖర్చు తగ్గింది. వాయిదా పడిన పైప్‌లైన్ నిర్మాణ టెండర్లు మంగళవారం జరగాల్సిన పైప్‌లైన్ నిర్మాణ పనుల టెండర్లను అధికారులు వాయిదా వేశారు. బాన్సువాడలో రూ. 10 లక్షలతో, కోటగిరి మండలం కొడ్చిర్ల లో రూ.10 లక్షలతో, బిచ్కుంద మండలం భీమ్లా తాండలో రూ. 7 ల క్షలతో, సీరాంపల్లిలో రూ. 8 లక్షలతో, తక్కడ్‌పల్లి తాండలో రూ. 8 లక్షలతో, జుక్కల్ మండలం శాంతినగర్‌లో రూ. 10 లక్షలతో, సోపూర్లో 8 లక్షలతో , మద్నూర్ మండలం అంతాపూర్లో రూ. 10 లక్షలతో, నిజాంసాగర్ మండలం గున్కుల్‌లో రూ. 8 లక్షలతో, పిట్లం మండలం కోమట్చెర్వు తాండలో ’7.12లక్షలతో పైప్‌లైన్ పనులకు టెండర్లను ఆహ్వానించారు. మంగళవారం తాగునీటి పథకా ల నిర్వహణ టెండర్లు ఖరారవడంతో, వీటిని వచ్చేనెల మొదటి వారానికి వాయిదా వేశారు. దరఖాస్తులను పరిశీలిస్తున్నాం - వసంత్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ తాగునీటి పథకాల నిర్వహణకు దరఖాస్తులు చేసుకొన్న వారి అంచనా వ్యయాలను పరిశీలించాం. లెస్ తో దరఖాస్తు చేసుకొన్న వారికే టెండర్లు దక్కుతాయి. పరిశీలన కోసం ఉన్నతాధికారులకు పంపిస్తాం. -
జోరుగా నకిలీ నోట్ల చెలామణి
బాన్సువాడ, న్యూస్‌లైన్ :మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలు సాగే బాన్సువాడ ప్రాంతంలో జోరుగా నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. రూ. 500, రూ. 1000 నకిలీ నోట్లను యథేచ్ఛగా కొందరు చెలామణి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ట్రాన్స్‌కో డివిజనల్ అకౌంట్స్ కార్యాలయంలో విద్యుత్ బిల్లు చెల్లించ డానికి వచ్చిన ఒక వినియోగదారుడు నకిలీ రూ. 1000 నోటు ఇవ్వడం, ఉద్యోగి గుర్తించకపోవడం జరిగింది. దీంతో అధికారులు అవాక్కయ్యారు. అలాగే నెల రోజుల క్రితం ఒక జాతీయ బ్యాంకులో రూ.500 నకిలీ నోట్లు వచ్చాయి. పెట్రోల్ బంకుల్లో, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ నకిలీ నోట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో వ్యాపారులు, అధికారులు హడలెత్తిపోతున్నారు. దీంతో రూ. 1000, రూ. 500 నోట్లను రెండు, మూడు సార్లు పరీక్షించి మరీ తీసుకుంటున్నారు. ఇటీవల లింగంపేట మండలంలో నకిలీ నోట్లను చెలామణి చేస్తూ ఒక వ్యక్తి పట్టుబడడం, అతని ద్వారా లింగంపేటలో ఇద్దరిని, పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్న విషయం విదితమే. అయితే లింగంపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ. 46లక్షల నకిలీ నోట్లను (రూ.500) దుబాయి నుంచి తీసుకువస్తూ శంషాబాద్ ఏయిర్ పోర్టు వద్ద పట్టుబడగా, అతని అనుచరులు కొందరు అంతకు ముందే రూ. 4 లక్షల వరకు నకిలీ నోట్లను లింగంపేటకు తెచ్చినట్లు సమాచారం. దీంతో అతని అనుచరుల వద్ద ఉన్న నకిలీ నోట్లు బాన్సువాడ ప్రాంతానికి డంప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇక్కడ ప్రతిరోజు నకిలీ నోట్లు ప్రత్యక్షమవుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. మహారాష్ట్రలోని దెగ్లూర్, కర్ణాటకలోని ఔరాద్ ప్రాంతాల నుంచి ప్రతిరోజు బాన్సువాడకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. బాన్సువాడ, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పిట్లం ప్రాంతాల్లో జరిగే వారాంతపు సంతల్లో మూడు రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి క్రయవిక్రయాలు చేస్తారు. అందుకే ఈ ప్రాంతంలో నకిలీ నోట్లను చెలామణి చేస్తే ఆ నకిలీ నోట్లు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్తాయని, దీని వల్ల పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవచ్చని నకిలీ నోట్ల సూత్రధారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇక్కడ జోరుగా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నారు. అయితే ఈ నకిలీ నోట్ల ద్వారా మోసపోతున్న వివిధ శాఖల అధికారులు, వ్యాపారులు సమాచారాన్ని పోలీసులకు అందించడం లేదు. పోలీసులకు అందిస్తే విచారణల పేరిట తమను వేధిస్తారనే గుబులుతో నోట్లను కాల్చడం లేదా వాటిని పాతిపెడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు అప్రమత్తం.. ఇదిలా ఉండగా, నకిలీ నోట్ల చెలామణి పెరగడంతో ఆర్టీసీలో, ట్రాన్స్‌కోలో, బ్యాంకుల్లో అధికారులు నోట్లపై ఇచ్చిన వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ట్రాన్స్‌కో అధికారులు రూ. 500, రూ. 1000 నోట్లపై ఏకంగా సర్వీస్ నంబర్‌ను నమోదు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకోకుండా నిరాకరిస్తున్నారు. నకిలీ నోట్ల చెలామణి వ్యవహారంపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు నకిలీ నోట్ల చెలామణీ వ్యవహారం మా దృష్టికి రాలేదు. మాకు ఆ నోట్లను అందిస్తే విచారణ ప్రారంభిస్తాం. నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న వారిపై నిఘా పెడతాం. నోట్లను గుర్తించిన వెంటనే మాకు సమాచారం అందించాలి. - భాస్కర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, బాన్సువాడ -
‘మంజీర’ గర్భంలో గుంతలు
బాన్సువాడ, న్యూస్‌లైన్ : ఇసుక మాఫియాతో మంజీరా నది ప్రమాదకరంగా మారుతోంది. కాంట్రాక్టర్లు పొందిన అనుమతి కంటే అధికంగా ఇసుకను తోడేస్తున్నారు. నిబంధనల కు విరుద్ధంగా 30 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వుతున్నారు. దీంతో నదిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం పట్టాభూముల్లో ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చింది. బీర్కూర్ మండలంలోని బీర్కూ ర్, బరంగేడ్గి, బిచ్కుంద మండలంలోని పుల్కల్, వాజీద్నగర్, గుండెనెమ్లిల్లో పట్టాభూములనుంచి ఇసుక తరలించడానికి అనుమతి పొందిన కాంట్రాక్టర్లు.. దీనిని ఆసరా చేసుకుంటూ నది లోకి కూడా చొచ్చుకెళుతున్నారు. కూలీల ద్వా రానే ఇసుకను తవ్వాల్సి ఉంది. కాంట్రాక్టర్లు మాత్రం పొక్లెయిన్లతో 25నుంచి 30 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వుతున్నారు. దీంతో నది లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయని, వర్షపు నీటితో ఈ గుంతలు నిండిపోయి ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బిచ్కుంద మండలంలోని బండరెం జల్, గుండెనెమ్లి, వాజీద్నగర్, పుల్కల్, హస్గు ల్, ఖద్గాం, శెట్లూర్, బిచ్కుంద, పిట్లం మండలంలోని మద్దెల్ చెరువు, బాన్సువాడ మండ లం లోని చింతల్‌నాగారం, బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, దామరంచ, బీర్కూర్, బరంగే డ్గి, కోటగిరి మండలంలోని హంగర్గ, పొతంగ ల్ గ్రామాల్లోన్ని మంజీర తీర ప్రాంతవాసులు ఈ గుంతల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. మంజీర నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక త వ్వకాలు జరుపుతుండడంతో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈసారి వర్షాలు స మృద్ధిగా కురిసినా బాన్సువాడ ప్రాంతంలో 200 మీటర్ల లోతులో కూడా నీరు లభించడం లేదు. తొమ్మిది గ్రామాలకు తాగునీటిని సరఫ రా చేయడానికి పుల్కల్ గ్రామ సమీపంలోని న దీ తీరంలో బావిని తవ్వారు. బాన్సువాడ పట్టణానికి సైతం మంజీరా నది నుంచే నీరు సరఫరా అవుతోంది. ఇసుక తవ్వకాలు ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు పడిపోయి తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. రెండేళ్ల క్రితం ఇద్దరి మృత్యువాత రెండేళ్ల క్రితం మంజీర నదిలోని గుంతల్లో చి క్కుకుని ఇద్దరు యువకులు మృత్యువాత ప డ్డారు. వాజిద్నగర్ గ్రామానికి చెందిన లింగురాం, అశోక్ హోలీ జరుపుకున్న అనంతరం స్నా నానికి నదిలోకి వెళ్లి ఈ గుంతల్లో చిక్కుకొని మ రణించారు. పలువురు ప్రమాదాల నుంచి తృ టిలో తప్పించుకున్నారు. సుమారు రూ. 30 వేల విలువ చేసే ఎద్దు గుంతలో పడి మృతి చెందిం ది. నిబంధనలకు విరద్ధంగా ఇసుక తవ్వుతున్నందునే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నదీతీర ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్ర మ తవ్వకాలకు చెక్ పెట్టాలని, మంజీరను రక్షిం చాలని కోరుతున్నారు.