బాన్సువాడ, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎక్కడా లేని విధంగా దుర్కి గ్రామంలో వందలాది ఎకరాల వక్ఫ్‌భూములు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఖాజీలకు ఈ భూములను ఇ నాం రూపంలో ప్రభుత్వం అందజేసింది. ఈ భూముల్లో పంటలను సా గు చేసి, వాటి ద్వారా వచ్చే నిధుల తో దర్గాల ఖర్చులను, ఖితాబత్ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిని విక్రయించడానికి వీలు లేదు.
అయితే ఇక్కడ ఉన్న భూమిని కొం దరు అక్రమార్కులు యథేచ్ఛగా విక్రయించగా, కొందరు రాజకీయ నా యకులు వీటిని కొనుగోలు చేసి, క బ్జా చేసుకున్నారు. పట్టాలు, పహా ణీలు సైతం తయారు చేసుకున్నారు. ఈ విషయమై గ్రామస్తులు అభ్యంతరాలు తెలిపారు. రెండేళ్ళ క్రితం ఇ నాం భూమిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి పూనుకోగా, గ్రామస్తులు వ్యతిరేకించి పెద్ద ఎత్తున ఆందోళనలు చే యడంతో నిర్మాణ పనులు అర్ధాం తరంగా నిలిచిపోయాయి. ఇనాం భూముల విక్రయంపై పెద్ద దుమారం రేగడంతో వీటిపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించేందుకు వక్ఫ్‌బోర్డు అధికారులు నిర్ణయించారు.
ఆధీనంలోకి రాని 61 ఎకరాల భూమి
ఇదిలా ఉండగా, ఇనాం భూములను యథేచ్ఛగా విక్రయిస్తున్నారని, వాటికి సంబంధించిన పర్యవేక్షణ చేయడంలో వక్ఫ్‌బోర్డు అధికారులు విఫలమవుతున్నారని 2007లోనే గ్రా మస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పం దించిన అప్పటి కలెక్టర్ దుర్కి గ్రామ శివారులో ఉన్న 61 ఎకరాల ఇనాం భూమిపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మేరకు ఇనాం భూములైన సర్వే నెంబర్లు 534, 536, 537, 540, 544, 444, 94/1-2, 107/1 నుంచి 15 వరకు, 113/1-2లలో ఇనాం కింద అందజేసినట్లు వక్ఫ్‌బోర్డు సర్వేలో తేలింది. అయితే ఇందులో అప్పటికే సుమారు 40 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఆరోపణలు వెల్లు వెత్తాయి.
మొత్తం 61 ఎకరాల భూమి వక్ఫ్ గెజిట్ నెంబర్.46ఎలో క్రమ సంఖ్య 25549లో పొందు పర్చడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి పహాణీలను స్వాధీనం చేసుకోవాలని, ఈభూమిని వక్ఫ్‌బోర్డుతో అటాచ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ కలెక్టర్ ఉత్తర్వులు కేవలం కార్యాలయానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. వీటిపై ఎలాంటి విచారణ జరగలేదు. దీంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఆ భూముల్లో సాగు చేస్తూ, వక్ఫ్‌బోర్డుకు కనీస రుసుము చెల్లించడం లేదని సమాచారం. ఈ భూములు ఇనాంకు సంబంధించినవి కావడంతో వాటిని ఇనాం హక్కుదారులు కేవలం సాగు చేసి, దీని ద్వారా వచ్చే నిధులను ఖర్చు చేసుకోవాలి. కానీ అలా జరగడం లేదు.
వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం
వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. గ్రామం లో ఉన్న ఈద్గాను కూల్చివేసి, ఇప్పటి వరకు నిర్మించలేదని, ప్రతీ ఏడాది *లక్షల ఆదాయం వచ్చినా నిర్మించకపోవడం శోచనీయమని వారు పేర్కొంటున్నారు. వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షించి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని జమ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపుల సైతం ఇనాం భూములు ఉండగా, వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు
Published Tue, May 20 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement
Advertisement