Waqf land
-
వక్ఫ్ భూమిలో అక్రమంగా వరి నాట్లు
పెనమలూరు : కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూములను రాత్రికి రాత్రే ఆక్రమించుకోవడంలో అధికార పార్టీ నేతలు ఆరితేరిపోయారు. వరినాట్లు వేసి మరీ కబ్జా చేయడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప పరిధి లోని ఆర్ఎస్ నంబర్ 176లో 12.92 ఎకరాల వక్ఫ్ భూమి ఆక్రమణకు గురవుతోందని బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై తహసీల్దార్ గోపాలకృష్ణ స్పందించి.. వక్ఫ్ భూముల లీజ్ కోసం ఈ నెల 31వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహిస్తామని గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు శుక్రవారం సాయంత్రం చీకటి పడుతుండగా చకచకా వరి నాట్లు వేశారు. సమాచారం తెలుసుకున్న వక్ఫ్ అధికారులు భూమి వద్దకు వెళ్లి చూసి.. తహసీల్దార్‌కు, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళ ఏమీ చేయలేమని, ఏం చేయాలో శనివారం ఆలోచిద్దామని వారు చెప్పినట్లు తెలిసింది. కాగా ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే అక్రమంగా నాట్లు వేసిన వారిపై కేసులు పెట్టాలని, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని మైనార్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్ బాషా డిమాండ్ చేశారు. -
వక్ఫ్ భూముల వివాదం.. రైతులకు జారీ చేసిన నోటీసులు వెనక్కి: సీఎం ఆదేశం
బెంగళూరు: వక్ఫ్ భూముల వివాదంలో రైతులకు జారీ చేసిన అన్ని నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కర్ణాటక మఖ్యమత్రి సిద్దరామయ్య శనివారం అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, కర్నాటక వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.‘వక్ఫ్ ఆస్తులతో ముడిపడిన భూ రికార్డులకు సంబంధించి రైతులకు అందించిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని డిప్యూటీ కమిషనర్లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆయన పేర్కొన్నారు’ అని సీఎంఓ కార్యాలయం తెలిపింది.కాగా విజయపుర జిల్లాకు చెందిన పలువురు రైతులకు తమ భూములు వక్ఫ్ ఆధీనంలోకి వస్తాయని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు తీవ్ర నిరసనలు తెలిపారు. అయితే బీజేపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2022 మధ్య విజయపుర జిల్లాలోని రైతులకు వక్ఫ్ బోర్డు నోటీసులు పంపించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై ఇటీవల సిద్ధరామయ్య స్పందించి.. రైతులు ఎవరినీ ఖాళీ చేయబోమని, వారికి జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకుంటామని చెప్పారు.50 ఏళ్ల క్రితమే తమ పేరిట కొన్ని భూములు రిజిస్టర్ అయినట్లు వక్ఫ్ బోర్డు పేర్కొందని, అయితే, ఏదైనా క్లెయిమ్‌లు చెల్లుబాటు కావాలంటే వక్ఫ్, రెవెన్యూ రికార్డులు తప్పనిసరిగా సమలేఖనం చేయాలని ర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు. లేకుంటే రెవెన్యూ రికార్డులకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. -
వక్ఫ్ భూములు కాపాడాలి
♦ భూముల సమాచారం పక్కాగా ఉండాలి ♦ రిజిస్ట్రేషన్లు చేయొద్దు ఆక్రమణలు వాస్తవమే ♦ శాసనసభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంగారెడ్డి జోన్: రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడాలని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై ఏర్పాటైన శాసనసభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధికారులను ఆదేశించారు. భూములు ఆక్రమణకు గురైన విషయం వాస్తవమేనని అంగీకరించారు. వక్ఫ్ భూముల విచారణకు నియమించిన శాసన సభ కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సభ్యులు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ రజ్వీలు మంగళవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ మేరకు వారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లతో స మీక్ష నిర్వహించారు. చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడు తూ... గతంలో నియమించిన కమిటీ నివేదిక లో స్పష్టత లేకపోవడంతో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల విజ్ఞప్తి మేరకు సీఎం స్పందించి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం శాసన సభ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున వక్ఫ్ భూములు ఆక్రమణకు గురైనందున వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ పో లీస్, వక్ఫ్ అధికారులు సమన్వయంతో పనిచేసి వక్ఫ్ భూములు, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని సూచించారు. ఆస్తుల విషయంలో గందరగోళం... జిల్లాలో 23,910.11 ఎకరాల వక్ఫ్ భూములున్నట్టు సమాచారం ఉండగా, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ మాత్రం 20,806 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నివేదిక అందించారని చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో 4,480 ఎకరాలు ఉండగా, 7,728.3 ఎకరాలు ఓఆర్సీ, ఇతరుల కబ్జాలో ఉందన్నారు. 8,603.2 ఎకరాల భూమి వివరాలను తేల్చాల్సి ఉందన్నారు. వక్ఫ్ బోర్డు నుంచి ఆదాయం రూ.5 కోట్లు వస్తుండగా అంతే మొత్తంలో ఖర్చవుతుందన్నారు. వక్ఫ్ భూములను కొందరు దాతలు విరాళంగా అందజేశారన్నారు. వాటిని విద్య, వైద్యం, ఇతర సామాజిక అంశాలకు వినియోగించాలనే వారి లక్ష్యమన్నారు. కాని వారి లక్ష్యం నెరవేరకపోగా, ఆస్తులను కొందరు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారన్న ఆరోపణలపై తమ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. రిజిస్ట్రేషన్లు జరగకుండా నియంత్రించాలి... వక్ఫ్ భూములు రిజిస్ట్రేషన్ జరగకుండా చూడాలని బాజిరెడ్డి అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్ల వారీగా వివరాలను సంబంధిత రిజిస్ట్రార్లకు అందజేయాలని సూచించారు. ఆస్తుల ఆక్రమణను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు వివరాలను, రెవెన్యూ రికార్డులకు సరిచూసుకుని త్వరగా నివేదికలు అందజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. జిల్లా నుంచి వచ్చే నివేదిక ఆధారంగా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత వస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలోని వక్ఫ్‌బోర్డు పట్ల తీవ్ర నిర్లక్ష్యం జరిగిందన్నారు. వక్ఫ్ ఆస్తులతో ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేశారన్నారు. వక్ఫ్ ఆస్తులను రెవెన్యూ శాఖకు అప్పగించి, వాటి పరిరక్షణకు శాసన సభ కమిటీ చర్యలు చేపట్టిందన్నారు. బోర్డులు ఏర్పాటు చేయాలి... క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తహసీల్దార్లు వక్ఫ్‌భూములను కాపాడాలని కమిటీ సభ్యులు ఫారూక్ హుస్సేన్, సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ రజ్వీ అధికారులకు సూచించారు. సదరు భూ ముల్లో బోర్డులను ఏర్పాటుచేసి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోహీర్‌లో అత్యధికంగా భూములున్న నేపథ్యంలో వాటి పరిరక్షణకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 175 దరఖాస్తులు ఆర్డీఓల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించి వివరాలను వక్ఫ్ బోర్డుకు అందజేయాలన్నారు. వక్ఫ్ భూములు లీజుకు పొందిన, ఆస్తుల విషయంలో అద్దె పెంచకుండా, ఖాళీ చేయకుండా బోర్డుకు ఆదాయం రాకుండా కబ్జా చేస్తున్న వాటి వివరాలను అందజేయాలన్నారు. జిల్లాలో వక్ఫ్ భూములను క్షేత్రస్థాయిలో గుర్తించడానికి మరో ఐదుగురు ఇన్స్పెక్టర్లను కేటాయించాలని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. పహాణీల్లో వక్ఫ్‌భూములను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. ఉదయం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో శాసన సభా కమిటీ సభ్యుల సమావేశంలో కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వక్ఫ్ భూముల వివరాలు వెల్లడించారు. సమావేశంలో శాసన సభ్యులు మహిపాల్ రెడ్డి, డీఆర్ఓ దయానంద్, వక్ఫ్ సీఈఓ మహ్మద్ అసదుల్లా, సంగారెడ్డి, మెదక్ ఆర్డీఓలు శ్రీనివాస్ రెడ్డి, మెంచు నగేశ్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
వక్ఫ్‌భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
► రెవెన్యూ పోలీసు అధికారుల సహకారం ► దుల్హాన్ పథకం అమలులో కర్నూలు టాప్ ► రాష్ట్రమైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ షేక్ ఎండీ ఎక్బాల్ కర్నూలు(అగ్రికల్చర్): వక్ఫ్ భూముల ఆక్రమణ లకు చెక్ పెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ షేక్ ఎండీ ఎగ్బాల్ తెలిపారు. ఇప్పటికే అక్రమణలో ఉన్న వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ఇందుకు పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటామని చెప్పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015-16లో దుల్హాన్ స్కీమ్ అమలులో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ విడుదల చేసిన జీఓ ఎంఎస్ నెం.67 ద్వారా పేద ముస్లీం , క్రిష్టియన్ యువతుల వివాహ సమయంలో రూ.50 వేల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి 2015-16లో జిల్లాలో 498 మందికి రూ.2.49 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యం విధించగా జనవరి నాటికే అధికమించారన్నారు. 2016-17కు సంబంధించి ఇప్పటికే 1522 దరఖాస్తులు వచ్చాయని, ఇందుకు అవసరమైన రూ.7.22 కోట్లను వారంలో విడుదల చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ సంక్షేమ అధికారి, తహసీల్ధారు కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. దళారీలు గంప గత్తగా తెచ్చే దర ఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమన్నారు. రాష్ట్రంలో 10వేల మసీదులుండగా మొదటి విడత కింద 2500 మసీదులను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 81 మసీదులు, శ్మశానాలు, ఈద్గాలకు రూ.8.91 కోట్లు అవసరమంటూ నివేదికలు అందించారని, ఈ మేరకు నిధులు ఇస్తామన్నారు. కర్నూలు ముస్లిం రెసిడెన్షియల్ స్కూలును 4.90 ఎకరాల్లో నిర్మిస్తున్నామని, ఇందుకు రూ.10 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. సమావేశంలో వక్ఫ్‌బోర్డు సీఈఓ అబ్దుల్ ఖదీర్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్‌మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. -
కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు
బాన్సువాడ, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎక్కడా లేని విధంగా దుర్కి గ్రామంలో వందలాది ఎకరాల వక్ఫ్‌భూములు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఖాజీలకు ఈ భూములను ఇ నాం రూపంలో ప్రభుత్వం అందజేసింది. ఈ భూముల్లో పంటలను సా గు చేసి, వాటి ద్వారా వచ్చే నిధుల తో దర్గాల ఖర్చులను, ఖితాబత్ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిని విక్రయించడానికి వీలు లేదు. అయితే ఇక్కడ ఉన్న భూమిని కొం దరు అక్రమార్కులు యథేచ్ఛగా విక్రయించగా, కొందరు రాజకీయ నా యకులు వీటిని కొనుగోలు చేసి, క బ్జా చేసుకున్నారు. పట్టాలు, పహా ణీలు సైతం తయారు చేసుకున్నారు. ఈ విషయమై గ్రామస్తులు అభ్యంతరాలు తెలిపారు. రెండేళ్ళ క్రితం ఇ నాం భూమిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి పూనుకోగా, గ్రామస్తులు వ్యతిరేకించి పెద్ద ఎత్తున ఆందోళనలు చే యడంతో నిర్మాణ పనులు అర్ధాం తరంగా నిలిచిపోయాయి. ఇనాం భూముల విక్రయంపై పెద్ద దుమారం రేగడంతో వీటిపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించేందుకు వక్ఫ్‌బోర్డు అధికారులు నిర్ణయించారు. ఆధీనంలోకి రాని 61 ఎకరాల భూమి ఇదిలా ఉండగా, ఇనాం భూములను యథేచ్ఛగా విక్రయిస్తున్నారని, వాటికి సంబంధించిన పర్యవేక్షణ చేయడంలో వక్ఫ్‌బోర్డు అధికారులు విఫలమవుతున్నారని 2007లోనే గ్రా మస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పం దించిన అప్పటి కలెక్టర్ దుర్కి గ్రామ శివారులో ఉన్న 61 ఎకరాల ఇనాం భూమిపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మేరకు ఇనాం భూములైన సర్వే నెంబర్లు 534, 536, 537, 540, 544, 444, 94/1-2, 107/1 నుంచి 15 వరకు, 113/1-2లలో ఇనాం కింద అందజేసినట్లు వక్ఫ్‌బోర్డు సర్వేలో తేలింది. అయితే ఇందులో అప్పటికే సుమారు 40 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఆరోపణలు వెల్లు వెత్తాయి. మొత్తం 61 ఎకరాల భూమి వక్ఫ్ గెజిట్ నెంబర్.46ఎలో క్రమ సంఖ్య 25549లో పొందు పర్చడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి పహాణీలను స్వాధీనం చేసుకోవాలని, ఈభూమిని వక్ఫ్‌బోర్డుతో అటాచ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ కలెక్టర్ ఉత్తర్వులు కేవలం కార్యాలయానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. వీటిపై ఎలాంటి విచారణ జరగలేదు. దీంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఆ భూముల్లో సాగు చేస్తూ, వక్ఫ్‌బోర్డుకు కనీస రుసుము చెల్లించడం లేదని సమాచారం. ఈ భూములు ఇనాంకు సంబంధించినవి కావడంతో వాటిని ఇనాం హక్కుదారులు కేవలం సాగు చేసి, దీని ద్వారా వచ్చే నిధులను ఖర్చు చేసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. గ్రామం లో ఉన్న ఈద్గాను కూల్చివేసి, ఇప్పటి వరకు నిర్మించలేదని, ప్రతీ ఏడాది *లక్షల ఆదాయం వచ్చినా నిర్మించకపోవడం శోచనీయమని వారు పేర్కొంటున్నారు. వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షించి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని జమ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపుల సైతం ఇనాం భూములు ఉండగా, వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.