బెంగళూరు: వక్ఫ్ భూముల వివాదంలో రైతులకు జారీ చేసిన అన్ని నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కర్ణాటక మఖ్యమత్రి సిద్దరామయ్య శనివారం అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, కర్నాటక వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
‘వక్ఫ్ ఆస్తులతో ముడిపడిన భూ రికార్డులకు సంబంధించి రైతులకు అందించిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని డిప్యూటీ కమిషనర్‌లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆయన పేర్కొన్నారు’ అని సీఎంఓ కార్యాలయం తెలిపింది.
కాగా విజయపుర జిల్లాకు చెందిన పలువురు రైతులకు తమ భూములు వక్ఫ్ ఆధీనంలోకి వస్తాయని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు తీవ్ర నిరసనలు తెలిపారు. అయితే బీజేపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2022 మధ్య విజయపుర జిల్లాలోని రైతులకు వక్ఫ్ బోర్డు నోటీసులు పంపించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై ఇటీవల సిద్ధరామయ్య స్పందించి.. రైతులు ఎవరినీ ఖాళీ చేయబోమని, వారికి జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకుంటామని చెప్పారు.
50 ఏళ్ల క్రితమే తమ పేరిట కొన్ని భూములు రిజిస్టర్ అయినట్లు వక్ఫ్ బోర్డు పేర్కొందని, అయితే, ఏదైనా క్లెయిమ్‌లు చెల్లుబాటు కావాలంటే వక్ఫ్, రెవెన్యూ రికార్డులు తప్పనిసరిగా సమలేఖనం చేయాలని ర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు. లేకుంటే రెవెన్యూ రికార్డులకే ప్రాధాన్యం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment