
సాక్షి,బాన్సువాడ ః ఎన్నికల పక్రియ తొలి అంకం టికెట్ల పంపిణీలోనే కొందరికి నిరాశ ఎదురవడం సహజమే. అయితే పార్టీ కోసం పనిచేసిన తమకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెటివ్వడాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ రాలేదన్న బాధతో ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాసుల బాలరాజు బుధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో బాలరాజును నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
బాన్సువాడ కాంగగ్రెస్ టికెట్‌ను బీజేపీ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డికి అధిష్టానం ఇచ్చింది. పార్టీలో చేరీ చేరగానే ఏనుగుకు టికెట్ దక్కింది. ఇది తట్టుకోలేకపోయిన ఆ నియోజకవర్గ టికెట్ ఆశించిన బాలరాజు పురుగుల మందు తాగాడు. బాలరాజును బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పరామర్శించారు. నిజానికి ఏనుగు రవీందర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయి బీజేపీలో చేరి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment