aspirant
-
టికెట్ నో అన్న పార్టీ.. పురుగుల మందు తాగిన ఇంఛార్జ్
సాక్షి,బాన్సువాడ ః ఎన్నికల పక్రియ తొలి అంకం టికెట్ల పంపిణీలోనే కొందరికి నిరాశ ఎదురవడం సహజమే. అయితే పార్టీ కోసం పనిచేసిన తమకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెటివ్వడాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ రాలేదన్న బాధతో ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాసుల బాలరాజు బుధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో బాలరాజును నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాన్సువాడ కాంగగ్రెస్ టికెట్‌ను బీజేపీ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డికి అధిష్టానం ఇచ్చింది. పార్టీలో చేరీ చేరగానే ఏనుగుకు టికెట్ దక్కింది. ఇది తట్టుకోలేకపోయిన ఆ నియోజకవర్గ టికెట్ ఆశించిన బాలరాజు పురుగుల మందు తాగాడు. బాలరాజును బీఆర్ఎస్, బీజేపీ నేతలు పరామర్శించారు. నిజానికి ఏనుగు రవీందర్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయి బీజేపీలో చేరి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. -
ఆసక్తికరంగా మునుగోడు కాంగ్రెస్ రాజకీయం
సాక్షి, యాదాద్రి: మునుగోడు కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో చలమల కృష్ణారెడ్డిలో ఆందోళన మొదలైంది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న చలమల.. ప్రచార రథాలు కూడా సిద్ధం చేసుకుని జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎట్టిపరిస్థితిలో మునుగోడు టికెట్‌ను వదిలిపెట్టేదే లేదంటున్నారు. టికెట్ కృష్ణారెడ్డికే కేటాయించాలని అనుచరులు తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేడు చౌటుప్పల్‌లో అనుచరులు, మండలాధ్యక్షులతో టికెట్ ఆశావాహుడు చలమల కృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. అందరి దృష్టి మునుగోడుపైనే.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మునుగోడు టికెట్ ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తొలి జాబితాలోనే రాజగోపాల్‌రెడ్డి పేరు వస్తుందని బీజేపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆశించారు. కానీ, ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో చేరతారని కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఎట్టకేలకు రాజగోపాల్‌రెడ్డి తెరదించారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీకీ లేదని, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయంగా కన్పిస్తుందని భావించి తన రాజీనామా ప్రకటనలో పేర్కొన్నారు. . -
ఎందుకీ ఆత్మహత్యల పరంపర?.. రాజస్తాన్ కోటాలో ఏం జరుగుతోంది?
రాజస్తాన్‌లోని కోటా. ప్రవేశ పరీక్షల కోచింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్యలకు కోటలా మారింది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 18 మంది నిండు ప్రాణాలను తీసుకున్నారు. ఈ ఆత్మహత్యలకి కారణలేంటి ? విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించలేరా? కోటాలో ఏ కోచింగ్ సెంటర్లో అడుగుపెట్టినా కళ్లు చెదురుతాయి. పెద్ద రిసెప్షన్ హాలు, లగ్జరీ ఫరీ్నచర్, గోడలకి పెయింటింగ్‌లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ సిస్టమ్, ఫైవ్ స్టార్ హోటల్స్‌ని తలపించేలా సకల సదుపాయాలు. ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆశతో కలలు కనే విద్యార్థులకు కావల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి దేశం నలుమూలల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఐఐటీ, ఐఐఎంలలో అత్యధిక మందికి సీటు లభిస్తున్నప్పటికీ చాలా మందిలో భవిష్యత్‌పై భరోసా కూడా కరువు అవుతోంది. రాను రాను విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కొందరు హాస్టల్ భవనంపై నుంచి దూకి, మరికొందరు సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని , కొందరు సూసైడ్ నోట్ రాసి మరికొందరు మౌనంగా కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన బహదూర్, రాజస్తాన్ జలోర్‌కు చెందిన పుషే్పంద్ర సింగ్ , బిహార్‌కు చెందిన భార్గవ్ మిశ్రా, యూపీకి చెందిన మంజోత్ చాబ్రా, ఇప్పుడు యూపీలోని అజమ్‌గఢ్‌కు చెందిన మనీశ్ ప్రజాపతి .. గత కొద్ది రోజుల్లో కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు వీరంతా. అందరూ 16 నుంచి 19 ఏళ్ల వయసు మధ్యనున్న వారే. మనీష్ నాలుగు నెలల క్రితమే కోటాలో ఇంజనీరింగ్ కోచింగ్‌లో జాయిన్ అయ్యాడు. బుధవారమే అతని తండ్రి వచ్చి కొడుకుని చూసి క్షేమసమాచారాలు అడిగి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన తన ఊరు చేరకుండానే మనీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచి్చంది. అంతే ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. ఈ మధ్య కాలంలో కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 12 ఏళ్లలో 150 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిçÜ్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాక 2021లో నలుగురు ఆత్మహత్యకు పాల్పడితే, 2022లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 18 మంది బలవన్మరణం చెందారు. ప్రధాని హోదాకు తగని ప్రసంగం గురువారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ప్రధాని మోదీ రెండు గంటల ప్రసంగమంతా హాస్యం, వ్యంగ్యం, అసందర్భ వ్యాఖ్యలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ లాంటి తీవ్రమైన, సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు నవ్వడం, ఎగతాళి చేయడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగదు’అని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. ► ఇది పోటీ ప్రపంచం. వంద సీట్లు ఉంటే లక్ష మంది పరీక్ష రాస్తున్నారు. అంత పోటీని తట్టుకొని విజయం సాధించడం సులభం కాదు. అందుకే విద్యార్థులు ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టుగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. తాము కన్న కలలు కల్లలవుతాయన్న భయంతో నిండు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ► కోటాలో ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్లో యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ. ఆ విద్యార్థులు వారి స్కూల్లో ఫస్ట్ ర్యాంకర్స్. దీంతో తల్లిదండ్రులు గంపెడాశలతో అప్పో సప్పో చేసి కోటాలో చేరి్పస్తున్నారు. తమ స్కూల్లో హీరోగా వెలిగిన విద్యారి్థకి అక్కడికి రాగానే తాను లక్షల మందిలో ఒకడినన్న వాస్తవం తెలుస్తుంది. మిగిలిన విద్యార్థులతో నెగ్గుకు రాలేక, తల్లిదండ్రుల్ని నిరాశపరచలేక ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ► కోటాలో కోచింగ్ తీసుకునే విద్యార్థులు రోజుకి 16–18 గంటల చదవాలి. ఉదయం 6.30 నుంచి మళ్లీ అర్థరాత్రి 2 వరకు తరగతులు ఉంటాయి. అంటే విద్యార్థి పడుకోవడానికి ఇచ్చే సమయం కేవలం నాలుగు గంటలు. మధ్యలో తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ‘‘ఏదో ఒకరోజు బాగా నిద్ర వచ్చి పావుగంట ఎక్కువ సేపు పడుకుంటే గిల్టీగా ఫీలవుతాను. తోటి వారి కంటే వెనకబడిపోతానన్న భయం వేస్తుంది. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటాను’’ అని ఐఐటీకి ప్రిపేర్ అవుతున్న సమర్ అనే విద్యార్థి చెప్పాడు. కంటినిండా నిద్రకి కూడా నోచుకోని చదువుల భారం వారి ప్రాణాలు తోడేస్తోంది. ► కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కోవిడ్ తర్వాత మరింత ఎక్కువయ్యాయి. కరోనా సమయంలో విద్యార్థులకి చదివే అలవాటు తప్పిపోయింది. దానికి తోడు కోవిడ్ సోకిన వారిలో మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. చదువుల ఒత్తిడి మరింతగా కుంగదీస్తోంది. ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. ► కోటాలో కోచింగ్‌కే ఏడాదికి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా అవుతుంది. నిరుపేద కుటుంబాల విద్యార్థులకి తల్లిదండ్రులు చేసిన అప్పే ఎప్పుడూ కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ లేత మనసులపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో కోచింగ్ సెంటర్ల పరీక్షల్లో ఫెయిలైనా జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఆత్మహత్యకి నివారణ మార్గాలేంటి ? విద్యార్థుల వరస ఆత్మహత్యలతో కోచింగ్ సిటీ కోటాపై వ్యతిరేకత పెరిగిపోతూ ఉండడంతో రాజస్తాన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. 24/7 పనిచేసే హెల్ప్‌లైన్ నెంబర్లు, పోలీసుల ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రత్యేకంగా కౌన్సెలర్లను నియమించి ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. మానసిక ప్రశాంతతనిచ్చే యోగా, ధ్యానం, జుంబా డ్యాన్స్‌లు వంటి క్లాసులు కూడా కొన్ని కోచింగ్ సెంటర్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలు సరిపోవని అనూ గుప్తా అనే టీచర్ చెబుతున్నారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యాలు 24 గంటలూ పోటీ పరీక్షల్లో టెక్నిక్కులను బోధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప జీవితంలో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో, పోటీ ప్రపంచంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించే పోరాటస్ఫూర్తిని విద్యార్థుల్లో కలి్పంచడం లేదని అనూ పేర్కొన్నారు. ఎలాగైనా బతకగలమన్న ధీమా విద్యార్థుల్లో నింపినప్పుడే ఆత్మహత్యల్ని నివారించవచ్చునని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చదువు మీద పెట్టే సమయానికి, ఇతర కార్యక్రమాలకి ఇచ్చే సమయానికి మధ్య సమతుల్యత ఉండాలని అహ్లా మాత్రా అనే సైకాలజిస్ట్ చెప్పారు. రోజుకి 18 గంటలు చదువు రుద్దేయడం వల్ల మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల్ని కోటా ఫ్యాక్టరీకి పంపించే ముడి పదార్థాలుగా చూస్తున్నారని ఇప్పుడు వారిపై పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో వారు ఉపయోగపడతారన్న ధోరణి నుంచి బయటకు రావాలని అవిజిత్ పాఠక్ అనే సైకాలిజిస్టు సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల నియంత్రణ బిల్లుని తీసుకురావాలని భావిస్తోంది.ఆ బిల్లు వెంటనే తీసుకువచ్చి విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
చెన్నె: వైద్య విద్య కోర్సు (యూజీ)ల్లో ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే ‘నీట్’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై విద్యార్థుల్లో భయాందోళన నెలకొని ఉంది. ఆ పరీక్షపై ఒత్తిడి పెంచుకుని తాజాగా ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పటికే రెండుసార్లు నీట్ రాయగా అర్హత సాధించలేకపోయాడు. ఏడాదిగా మూడోసారి నీట్‌కు శిక్షణ పొందాడు. చివరకు ఆదివారం పరీక్ష ఉండగా ఫెయిలవుతాననే భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. ఈ ఘటనపై తమిళనాడులో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చదవండి: సీఎం జగన్ ప్రత్యేక చొరవ.. 48 గంటల్లో భూవివాదం పరిష్కారం సేలం జిల్లా కుజయ్యూర్‌కు చెందిన ధనుశ్ (19) నీట్‌కు ప్రిపేరవుతున్నాడు. గతంలో రెండుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించకపోయాడు. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో శిక్షణ తీసుకున్నాడు. తీరా ఆదివారం పరీక్ష ఉండగా భయాందోళన పెంచుకున్నాడు. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించలేమోననే భయంతో పరీక్షకు కొన్ని గంటలు ఉందనగా ఆ యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్‌పై ఒత్తిడి పెంచుకున్నట్లు తల్లిదండ్రులు, మృతుడి సోదరుడు నిశాంత్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ధనుశ్ తల్లిదండ్రులు ‘నీట్ పరీక్ష రద్దు చేయాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్ విద్యార్థి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నీట్ బలిపీఠం మీద మరొక మరణం. ఈ ఘటన నన్ను షాక్‌కు గురి చేసింది. నీట్‌కు శాశ్వత మినహాయింపు బిల్లును తీసుకువస్తాం’ అని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. நீட் எனும் பலிபீடத்தில் மற்றுமொரு மரணம்! கல்வியால் தகுதி வரட்டும்; தகுதி பெற்றால் மட்டுமே கல்வி எனும் அநீதி நீட் ஒழியட்டும்! நாளை நீட் நிரந்தர விலக்கு சட்ட மசோதா கொண்டு வருவோம்; #NEET-ஐ இந்தியத் துணைக்கண்டத்தின் பிரச்சினையாகக் கொண்டு செல்வோம். pic.twitter.com/iAI4zm9knA — M.K.Stalin (@mkstalin) September 12, 2021 -
ఆవిరైన ఆశలు
షాద్‌నగర్‌రూరల్: కన్న కూతురుపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు.. విద్యాబుద్దులు నేర్చి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలుస్తుందని కలలు కన్నారు.. కానీ ఆ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. భవిష్యత్తును తేల్చే పరీక్షలను రాసి తిరిగి ఇంటికి వెళ్తుండగా మృత్యువు రోడ్డు ప్రమాదరూపంలో కబలించింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యాకుసుమం నేలరాలింది. ఇంటర్మీడియట్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన శనివారం షాద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకంది. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొందుర్గు మండలం పర్వతాపూర్‌కు చెందిన మంగలి శ్రీనివాసులు, అనురాధ దంపతుల కూతురు మంగలి స్రవంతి(17) షాద్‌నగర్ పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రోజూ పర్వతాపూర్ నుంచి షాద్‌నగర్‌కు వచ్చి విద్యను అభ్యసిస్తుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా శనివారం విశ్వభారతీ జూనియర్ కళాశాలలో కేటాయించిన పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ కాలనీ మీదుగా బస్టాండ్‌కు బయలుదేరింది. మోర్ సూపర్ మార్కెట్ ఎదుట నుంచి ఆర్టీసీ కాలనీకి వెళ్లే మార్గంలో ఇనుప రాడ్డులతో వెళ్తున్న ట్రాక్టర్ విద్యార్థిని స్రవంతిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇనుప లోడుతో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ స్రవంతి తలపై నుంచి వెళ్లడంతో తల పూర్తిగా చిట్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్రవంతి మృతదేహన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లి అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ట్రాక్టర్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
మెట్రో రైలు ముందు దూకేశాడు
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ 23 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కరోల్ బాగ్ మెట్రో స్టేషన్లో ఈరోజు ఉదయం ప్లాట్‌ఫామ్ మీదకు వస్తున్న మెట్రో రైలు ముందుకు దూకాడు. ఈ ఘటన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చోటు చేసుకుంది. మెట్రో రైలు ముందుకు దూకడంతో ఆ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని అధికారులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ముంబైకి చెందిన ఈ విద్యార్థి సివిల్ సర్వీసు పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. తూర్పు ఢిల్లీలోని నిర్మాన్ విహార్‌లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. కరోల్ బాగ్ మెట్రో స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్లాట్‌ఫామ్ మీదకు రైలు వస్తున్న క్రమంలో బ్లూలైన్ వద్ద రైలు ముందు దూకినట్టు సీనియర్ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు చెప్పారు. ఈ ఘటనతో మెట్రో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. మెట్రో సర్వీసులకు కొద్ది సేపు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. -
మరో ‘నీట్’ విద్యార్థి బలి: వీడియో చాట్ చేస్తూనే..
కోటా: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంటన్స్ టెస్ట్ (నీట్) కోసం సిద్ధమవుతున్న ఒక విద్యార్థి అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తండ్రితో వీడియో చాట్ చేస్తూను ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నాడు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ విషాదం చోటు చేసుకుంది. కోటాలో పేయింట్ గెస్ట్ గా ఉంటూ నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాడు కరణ్ కుమార్ ఘాసి (18) డాక్టర్ కావాలని కలలు కన్నాడు. ఇందుకు నీట్‌కు కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇంతలో ఏమైందో ఏమోగానీ ఆకస్మికంగా తనువు చాలించాడు. గురువారం ఉదయం తన తండ్రి ఉన్మారామ్కు వీడియో కాల్ చేశాడు. తండ్రితో మాట్లాడుతూ ఉండగానే తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటనతో హతాశుడైన తండ్రి కోటాలో వుండే స్నేహితుడికి సమాచారం అందించారు. దీంతో ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించి, కరణ్ రూమ్‌కు వచ్చి తలుపులు పగుల గొట్టి కరణ్‌ను పోలీసుల సహాయంతో అతణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారని పోలీసు అధికారి వెల్లడించారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని ఏఎస్ఐ అత్తర్ సింగ్ తెలిపారు. అయితే కరణ్‌కు చదువుకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి లేదని, ఆత్మహత్యకు ముందు ప్రేమికురాలికి కూడా ఫోన్ చేసి తన నిర్ణయం గురించి చెప్పాడని కున్హరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మీరా బనీవాల్ ప్రకటించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం వుందన్నారు. -
పాత కాపులే!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ఎల్పీలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటన పూర్తి భరోసా ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలామంది ప్రజాప్రతినిధులు కొంతకాలంగా అభద్రతా, అపోహల మధ్య ఉన్నారు. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు కూడా లేనిపోని ప్రచారాలకు తెరలేపాయి. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు విడతలుగా చేయించిన సర్వే చాలామందిలో అయోమయం, ఆందోళనకు కారణమైంది. ఇదే సమయంలో థర్డ్‌ఫ్రంట్ తెరమీదకు రావడం.. వచ్చే ఎన్నికల్లో మంత్రులను ఎంపీలుగా, కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా రంగంలోకి దింపుతారన్న ప్రచారం అధికార పార్టీలో గందరగోళానికి వేదికైంది. ఈ ప్రచారం చాలామంది ప్రజాప్రతినిధులను టెన్షన్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో 2019 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఇప్పుడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకే ‘సిట్టింగ్’ స్థానాలను కేటాయిస్తామని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొంతకాలంగా అభద్రతాభావంతో ఉన్న ప్రజాప్రతినిధులకు ఆయన ప్రకటన భరోసా ఇచ్చినట్లయ్యింది. సీఎం స్వయంగా చేయించిన మూడు విడతల సర్వేలో ‘గ్రాఫ్’ తగ్గిన ప్రజాప్రతినిధులూ తేరుకుంటున్నారు. ప్రచారాలు, అపోహలకు తెర.. సీఎం ప్రకటనతో ఊరట సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ జరుగుతున్న రకరకాల ప్రచారాలు అధికార పార్టీలో గందరగోళం సృష్టించాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ పలువురికి ఉద్వాసన పలుకుతారన్న చర్చ కూడా ఉమ్మడి జిల్లాలో ‘వైరల్’ అయ్యింది. ఈ ప్రచారాలపై అధికార పార్టీ నేతలు కొందరు వివరణ ఇచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పార్లమెంట్‌కు వెళ్తారని, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ జిల్లాలోని ఓ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి శాసనసభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద్ బరిలో ఉంటారని, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఈసారి రాజన్న సిరిసిల్లలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదుచోట్ల అభ్యర్థుల మార్పు అనివార్యమన్న ప్రచారమూ అధికారపార్టీలో నిన్నామొన్నటి వరకు ‘వైరల్’ కావడం పలువురిని ఆందోళనకు గురి చేసింది. ఇదే సమయంలో అధినేత కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌ను తెరమీదకు తీసుకురావడం, ఉద్యమంలో తనవెంట అడుగులేసిన సీనియర్లను ఎంపీలుగా తీసుకెళ్తానని ప్రకటించడంతో జిల్లాకు చెందిన పలువురు ఇప్పుడున్న అవకాశాలు కోల్పోతారన్న చర్చ గందరగోళం సృష్టించింది. ఇదే సమయంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ఎల్పీలో కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు. 2019 వరకు తానిక్కడే ఉంటానని, ఆ ఎన్నికల్లో అందరూ సిట్టింగ్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లు ఇస్తానని చేసిన ప్రకటన అపోహలకు తెరవేసి కొండంత భరోసా ఇచ్చింది. వలస, కొత్తగా అశావహులకు నోఛాన్స్ మూడు విడతలుగా సర్వేల ఫలితాలను ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరును వారి కళ్లకు కట్టారు. రెండు సర్వేలను సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మూడో విడత సర్వే నివేదికను డిసెంబర్లో కేవలం ప్రజాప్రతినిధులకు మాత్రమే వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 12 కాగా.. శాసనసభ్యులు, శాసనసభ నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల పనితీరు, టీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీల బలాబలాలను కేసీఆర్ వివరించారు. ఆ సర్వేలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు 89.90 శాతంతో ఫస్ట్ ర్యాంకు రాగా.. మంత్రి కేటీఆర్ 79.60 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. తొలి, రెండో సర్వేలకు పోలిస్తే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల్లో చాలామందికి ‘గ్రాఫ్’ తగ్గగా.. కొందరు ఫరవాలేదనిపించారు. ఇంకొందరు పాసు మార్కులకే పరిమితం అయ్యారు. మరికొందరు పాస్‌మార్కులను కొంచెం పైకి పెరిగారు. ప్రజాక్షేత్రంలో ఉండేవారికి ప్రజలు వేసిన మార్కులను కేసీఆర్ ప్రజాప్రతినిధులకు వివరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. చాలామందికి టిక్కెట్లు ఇవ్వడం కష్టమేనన్న చర్చ జరిగింది. ఆది వారం టీఆర్ఎస్ఎల్పీ సందర్భంగా సీఎం ‘సిట్టింగు’లందరికీ టిక్కెట్లు ఇస్తామనడం ‘గ్రాఫ్’ తగ్గిన నేతలకు ఊరటనిచ్చింది. కేసీఆర్ ప్రకటన సిట్టింగ్‌లకు భరోసా ఇవ్వగా, వలస నేతలు, కొత్తగా టిక్కెట్లు ఆశించే వారికి ఈసారి ఆశాభంగమే కలగనుందన్న చర్చ సాగుతోంది. -
అధికార పార్టీలో రాజ్యసభ హడావుడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో రాజ్యసభ అంతర్మథనం మొదలయింది. అర్థిక బలం, పార్టీలో పరపతి ఉన్న నేతలకే పదవులు అంటూ ముఖ్యుల నుంచి సంకేతాలు రావటంతో సీనియర్ నేతలు గళం విప్పేందుకు సన్నద్ధం అవుతున్నారు. ముఖ్యంగా రాజ్యసభ పదవి జిల్లా నేతల్లో ఒకరిని వరించే అవకాశం ఉండటంతో ఆర్థిక పరపతితో పాటు సామాజికవర్గాల వారీగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతానికి జిల్లాలో పార్టీ నేతలు బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి మిగిలిన సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలతో పాటు ఆశావాహుల్లోని లోటుపాట్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే చిన్నస్థాయి నామినేట్ పదవులు కూడా భర్తీ చేయకపోవటంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న క్యాడర్‌పై రాజ్యసభ కొత్త చిచ్చుపెట్టినట్లయింది. పోటీ తీవ్రం అధికార పార్టీలో రాజ్యసభ సీటు కోసం పోటీ తీవ్రమైంది. ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ ఆర్థిక పరపతిలేని నేతలు అనేక మంది ఉన్నారు. కనీసం వారి పేరును కూడా పరిశీలనలోకి తీసుకోకపోవటం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. కావలి టీడీపీ ఇన్చార్జి బీద మస్తాన్‌రావు పేరు బీసీ కోటాలో తెరపైకి వచ్చింది. పార్టీలో సీనియర్ నేతగా, వివాదరహితుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే ఆర్థికంగానూ స్థితిమంతుడు కావటంతో ఖర్చుకు వెనుకాడని పరిస్థితి. ఈ క్రమంలో అతని పేరు పరిగణనలో ఉంది. నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఎస్సీ సామాజికవర్గ కోటాలో సూళ్లూరుపేట పార్టీ ఇన్చార్జి పరసా రత్నం కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే బీద సోదరులు పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, మంత్రి లోకేష్‌ను కూడా కలిసినట్లు సమాచారం. గతంలో టీటీడీ చైర్మన్ పదవి రేసులో బీద మస్తాన్‌రావు ఉన్నారు. బీద సోదరులపై వ్యతిరేకత ఇదిలా ఉండగా పార్టీలో బీద సోదరులపై వ్యతిరేకత ఉంది. జిల్లాలో బీసీ కోటాలో పార్టీ పదవులన్నీ వారికేనా అనే అసంతృప్తి స్వరం కొంత కాలంగా బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా చిన్నపాటి పదవి నుంచి రాజ్యసభ వరకు అన్నింటికీ వారే ప్రయత్నాలు చేసుకుంటే మిగిలిన బీసీ నేతల పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. ఇప్పటికే బీద మస్తాన్‌రావు గత ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి ఓటమి పాలై అక్కడ ఇన్చార్జిగా కొనసాగుతున్నాడు. దీంతోపాటు రాజధాని నిర్మాణకమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు బీద రవిచంద్ర పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు శాసనమండలి సభ్యునిగానూ కొనసాగుతున్నారు. అలాగే పైడేరు ఎస్కేప్ చానల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ–2 చైర్మన్‌గా బీద గిరిధర్ వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకు బీద మస్తాన్‌రావు బావ దేవరాల సుబ్రహ్మణ్యం కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. బీదా మస్తాన్‌రావు సోదరి మస్తానమ్మ నగరంలో కార్పొరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకే కుటుంబంలో ఐదు పదవులు, అది కూడా పార్టీలో బీసీ కోటాలోని పదవులు కావటంతో పార్టీలోని సీనియర్ బీసీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా బీద మస్తాన్‌రావు పేరు తెరపైకి రావటం చర్చనీయాంశంగా మారింది. -
మెడిసిన్ సీటు పేరుతో 10.5 లక్షలకు టోపీ
తూర్పుగోదావరి(కపిలేశ్వరపురం): మెడిసన్ సీటు ఇప్పిస్తామని నమ్మించి రూ.10.5 లక్షలు కాజేసిన వ్యవహారంపై తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలిలా ఉన్నాయి. అంగరకు చెందిన నెక్కంటి శ్రీనివాస్‌కుమార్ అదే గ్రామానికి చెందిన గుడిమెట్ల మురళీకృష్ణ కుమారుడికి చైనాలో మెడిసన్ సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. 2013లో హైదరాబాద్‌లోని శాంభవి కన్సల్టెన్సీ ద్వారా సీటు ఇప్పిస్తానని ఆ కార్యాలయంలో ఉన్న భరత్‌కుమార్, హరిశంకర్లకు రూ.మూడు లక్షలు మురళీకృష్ణతో ఇప్పించాడు. ఎంతకీ సీటు ఖరారు కాకపోవడంతో మురళీకృష్ణ నిలదీయడంతో కుంటిసాకులు చెప్పి గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని శ్రీనివాస్‌కుమార్ అన్నాడు. ఆ క్రమంలోనే మరో రూ.3,92,000 వసూలు చేశాడు. కాలేజీ నుంచి అడ్మిషన్ లెటర్ తెచ్చి, చేర్పించే బాధ్యత తనదని, మరికొన్ని ఖర్చులకని ఇంకో రూ.3,60,000 వసూలు చేశాడు. ఇలా దఫ దఫాలుగా మొత్తం రూ. 10,52,000 వసూలు చేశాడు. ఎంతకీ సీటు రాకపోవడంతో మురళీకృష్ణ ఈ నెల ఆరున అంగర పోలీసులను ఆశ్రయించాడు. శ్రీనివాస్‌కుమార్, భరత్‌కుమార్, హరిశంకర్‌లతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.