సాక్షి, యాదాద్రి: మునుగోడు కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో చలమల కృష్ణారెడ్డిలో ఆందోళన మొదలైంది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న చలమల.. ప్రచార రథాలు కూడా సిద్ధం చేసుకుని జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎట్టిపరిస్థితిలో మునుగోడు టికెట్‌ను వదిలిపెట్టేదే లేదంటున్నారు. టికెట్ కృష్ణారెడ్డికే కేటాయించాలని అనుచరులు తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేడు చౌటుప్పల్‌లో అనుచరులు, మండలాధ్యక్షులతో టికెట్ ఆశావాహుడు చలమల కృష్ణారెడ్డి సమావేశం కానున్నారు.
అందరి దృష్టి మునుగోడుపైనే..
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మునుగోడు టికెట్ ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తొలి జాబితాలోనే రాజగోపాల్‌రెడ్డి పేరు వస్తుందని బీజేపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆశించారు. కానీ, ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్‌లో చేరతారని కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఎట్టకేలకు రాజగోపాల్‌రెడ్డి తెరదించారు. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీకీ లేదని, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయంగా కన్పిస్తుందని భావించి తన రాజీనామా ప్రకటనలో పేర్కొన్నారు.
.
Comments
Please login to add a commentAdd a comment