Munugode
-
కాంగ్రెస్ కు విధేయురాలైన నాకు టికెట్ ఇవ్వలేదు: స్రవంతి
-
మునుగోడులో కాంగ్రెస్ కు షాక్
-
మహిళలే ఈసారి కేసీఆర్ ని ఓడించాలి :రాజగోపాల్ రెడ్డి
-
‘నా ఏకైక లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమే’
సాక్షి, నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను గద్దె దించడమే తన ముందున్న లక్ష్యమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో ముఖ్యకార్యకర్తలతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమయ్యారు. దీనిలో భాగంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ నేను పార్టీ మారినా కాంగ్రెస్‌లోకే వచ్చా. నా ఏకైక లక్ష్యం కేసిఆర్ నియంత పాలనను గద్దె దించడమే. ఒక ఎమ్మెల్యేని ఓడ కొట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం యంత్రాంగం వందమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చింది నిజం కాదా?, మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడిన తప్పిస్తే మునుగోడుగడ్డ ప్రజలు ఎక్కడ కూడా తలలించుకునేలా చేయలేదు. ఆనాడు ఎంపీగా నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకోరావడానికి కష్టపడ్డాం.కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబ చేతిలో పోయింది.ఆ కుటుంబాన్ని గద్దే దించడానికి పోరాడుతున్నా. రాజ్‌గోపాల్‌రెడ్డికి ప్రజాబలం ఉంది. అధికారంలో ఉన్నా.. లేకపోయినా నా సొంత డబ్బులతో పేద ప్రజలకు సహాయం చేశా.రాజగోపాల్ రెడ్డి అంటే ప్రాణమిచ్చే వాళ్లు లక్ష మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చింది. చిరుమర్తి లింగయ్య మోసం చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు గెలుస్తాడా?, ఏ రాజకీయ సంచలనం జరగాలన్నా.. రాజకీయ పెను తుఫాను రావాలన్నా మునుగోడు గడ్డ నుంచే జరుగుతుంది.కేసీఆర్‌ను మూడు నెలలు నిద్ర పట్టకుండా చేసింది మునుగోడు గడ్డ. అమ్ముడుపోయిన వ్యక్తిని అయితే మళ్లీ కాంగ్రెస్ లోకి ఎలా వస్తా.అమ్ముడుపోయానని నాపై ఆరోపణలు చేసిన వ్యక్తులకు ఒకటి చెప్తున్నా నన్నుకొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. నేను పదవి త్యాగం చేసినా.. పదవిలో ఉన్నా అది ప్రజల కోసమే.. నా పదవి మునుగోడు ప్రజల కోసం వదిలిపెట్టిన. నా చేతిలో ఉన్న రాజీనామా అస్త్రాన్ని వదిలితే ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యాయి.గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారు.చండూరు ను రెవిన్యూ డివిజన్ చేశారు. చౌటుప్పల్‌లో వంద పడకల ఆసుపత్రి ఇచ్చారు. కొత్త రోడ్లు వేశారు.గజ్వేల్ లో పోటీ చేస్తాను అని ఏఐసీసీకి చెప్పా. లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోతోంది.ధరణి పోర్టల్ ద్వారా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది’ అని విమర్శించారు. -
ఆసక్తికరంగా మునుగోడు కాంగ్రెస్ రాజకీయం
సాక్షి, యాదాద్రి: మునుగోడు కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో చలమల కృష్ణారెడ్డిలో ఆందోళన మొదలైంది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న చలమల.. ప్రచార రథాలు కూడా సిద్ధం చేసుకుని జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎట్టిపరిస్థితిలో మునుగోడు టికెట్‌ను వదిలిపెట్టేదే లేదంటున్నారు. టికెట్ కృష్ణారెడ్డికే కేటాయించాలని అనుచరులు తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేడు చౌటుప్పల్‌లో అనుచరులు, మండలాధ్యక్షులతో టికెట్ ఆశావాహుడు చలమల కృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. అందరి దృష్టి మునుగోడుపైనే.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మునుగోడు టికెట్ ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తొలి జాబితాలోనే రాజగోపాల్‌రెడ్డి పేరు వస్తుందని బీజేపీ శ్రేణులు, ఆయన అనుచరులు ఆశించారు. కానీ, ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో చేరతారని కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఎట్టకేలకు రాజగోపాల్‌రెడ్డి తెరదించారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీకీ లేదని, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయంగా కన్పిస్తుందని భావించి తన రాజీనామా ప్రకటనలో పేర్కొన్నారు. . -
Munugode: కాంగ్రెస్‌లో కయ్యం.. రేవంత్, జానారెడ్డి సపోర్ట్ ఆ నేతకేనా!
నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌లో వర్గపోరు మొదలైందా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇద్దరు నేతల మధ్య పైటింగ్ స్టార్టయిందా? మళ్ళీ నేనే అంటున్న పాల్వాయి స్రవంతి. ఒప్పందం ప్రకారం తనకే ఇవ్వాలంటున్న మరో నేత. ఇద్దరి పంతంతో తలలు పట్టుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇంతకీ మునుగోడు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గాల్లో మునుగోడు ఒకటి. మొన్నటి ఉప ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచినా అధికార బీఆర్ఎస్, బీజేపీల అంగ, అర్థ బలాలకు ఎదురొడ్డి నిలబడి కూడా 24 వేల ఓట్లను సాధించింది. ఉప ఎన్నికలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలన్న కసితో కాంగ్రెస్ కేడర్ సిద్ధమవుతోంది. అయితే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య మొదలైన టికెట్ పోరు కార్యకర్తల్ని కన్ఫూజన్‌కు గురి చేస్తోందట. టికెట్ తనదంటే తనదని ఇద్దరు నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తుండటం మునుగోడు కాంగ్రెస్‌లో కలవరం రేగుతోంది. మొన్నటి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి స్రవంతికి సీనియర్ల మద్దతు ఉంది. ఉప ఎన్నికలో టిక్కట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ చలమల్ల కృష్ఱారెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండగా ఉన్నారు. ఉప ఎన్నికలో ఓడిపోయినా పార్టీ పరువు కాపాడాను కాబట్టి తనకు మరో అవకాశం ఇవ్వాలని స్రవంతి కోరుతున్నారట. చదవండి: గులాబీ బాస్‌నే ఢీకొడుతున్న పొంగులేటి.. బీఆర్ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతుంది? పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి మరోవైపు గతంలోనే టికెట్ వచ్చినట్లు వచ్చి చేజారిందని, దీనికి తోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట చల్లమల్ల కృష్ణారెడ్డి. ఉప ఎన్నికల్లో అవకాశం ఇస్తే సాధారణ ఎన్నికల్లో తనకు సహకరిస్తానని స్రవంతి మాట ఇవ్వడం నిజం కాదా అని కృష్ణారెడ్డి గుర్తు చేస్తున్నారట. రేవంత్ ఆశీస్సులు కృష్ణారెడ్డికి పుష్కలంగాఉండటంతో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి కూడా ఈసారి కృష్ణారెడ్డికే మద్దతుగా నిలుస్తున్నారట. దీంతో తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో చలమల్ల కృష్ణారెడ్డి నియోజవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలోని మండలాలకు పార్టీ కమిటీలను ప్రకటించేలా రేవంత్‌పై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యారు చల్లమల్ల. ఈ పరిణామాలతో పాల్వాయి స్రవంతి అలెర్ట్ అయ్యారు. నేరుగా గాంధీభవవ్ను వెళ్లి మునుగోడు తాజా పరిణామాలను సీనియర్ నేతల దృష్టికి తీసుకెళ్లారట. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండా కమిటీలను ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారట. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే జిల్లాలోని నకిరేకల్‌లోని మండల కమిటీలు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యంతో నిలిచిపోయాయి. దీంతో స్రవంతి ఒత్తిడితో మునుగోడులో మండల కమిటీలు ఆగిపోయాయి. పార్టీ కోసం పనిచేసిన వారికే మండలాధ్యక్ష పదవులు ఇవ్వాలని స్రవంతి కోరుతున్నారు. అయితే తన అనుచరుడు కృష్ణారెడ్డి మాటను కాదని స్రవంతి సూచించిన వారికి రేవంత్ పదవులు ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా ఇద్దరి నేతల మధ్య నెలకొన్న వర్గపోరు మునుగోడు కాంగ్రెస్ రాజకీయాలను రసవత్తరంగా మార్చాయని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. చదవండి: కోడెల ఆత్మహత్య తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతోంది? -
మునుగోడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
-
మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆరాటం.. ఎక్కడి నుంచి పోటీ?
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావడంతో ఎర్ర పార్టీల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే జిల్లా నుంచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చన్నది వారి ఆరాటం. టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే సీపీఐ, సీపీఎంలు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నాయి? ఇదే అదను, దిగాలి బరిలోకి ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా అనేవారు. కాల క్రమంలో అదంతా గత వైభవంగా మిగిలిపోయింది. గతంలో మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి ఎవరో ఒకరు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో దేవరకొండలో సీపీఐ తరపున రవీంద్ర కుమార్ గెలిచారు. కానీ ఆయన సొంత పార్టీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో కూడా గెలిచి దేవరకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్య నాయకులే కాదు.. రెండు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కేడర్ కూడా చాలావరకు అధికార పార్టీలో చేరిపోయారు. దీంతో జిల్లాలో వామపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇక జిల్లా నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు అసెంబ్లీలో అడుగుపెట్టడం కలగానే మిగిలిపోతుంది అనుకున్నారు అంతా. ఇటువంటి క్లిష్ట సమయంలో వామపక్షాలకు మునుగోడు రూపంలో ఓ వరం లభించి పునర్జన్మ పొందినట్లు అయిందని చెప్పవచ్చు. మిర్యాలగూడ ఎవరికి? దేవరకొండ ఎవరికి? మునుగోడులో అధికార టీఆర్ఎస్కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతుగా నిలిచాయి. బీజేపీని ఓడించే లక్ష్యంతో రెండు పార్టీలు గులాబీకి దన్నుగా ఉన్నాయి. ఇప్పుడిదే వారికి కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి లెఫ్ట్, టీఆర్ఎస్ మధ్య పొత్తగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు గులాబీ పార్టీతో పొత్తుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. అదే జరిగితే జిల్లాలో రెండు పార్టీలు ఒక్కో స్థానాన్ని తమకు కేటాయించాలని అడగనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం మిర్యాలగూడ స్థానాన్ని, సీపీఐ మునుగోడు లేదా దేవరకొండ స్థానంలో ఒకదాన్ని తమకు కేటాయించాలని కోరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీపీఐ మునుగోడు కంటే దేవరకొండ సీటుపైనే మక్కువగా ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ నుంచి గెలిచి మోసం చేసి పార్టీ మారిన రవీంద్ర కుమార్‌ను దెబ్బ తీయాలని సీపీఐ నాయకత్వం భావిస్తోంది. అయితే జిల్లాలో సీపీఐకి అంతో ఇంతో కేడర్ ఉన్న నియోజకవర్గం అదే కావడం మరో కారణం. ఒకవేళ దేవరకొండలో అవకాశం రాకపోతే మునుగోడు సీటునే కోరనుంది. ఇక్కడి నుంచి ఇప్పటికే ఆ పార్టీ ఐదు సార్లు గెలవడం పార్టీ కేడర్ ఇంకా మిగిలే ఉండటంతో మునుగోడును ఇవ్వాలని బలంగా కోరే అవకాశం కనిపిస్తోంది. చదవండి: ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.? జూలకంటి రెఢీ ఇక సీపీఎం కూడా నల్గొండ జిల్లాలో ఒక సీటు కోరుదామనే ఆలోచనలో ఉందని సమాచారం. మిర్యాలగూడ సీటు తీసుకుని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని బరిలో దించాలనే ఆలోచనలో సీపీఎం ఉందని టాక్. ఇప్పటికీ అక్కడ ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఎలాగూ అక్కడి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనాలతో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసారి అక్కడ సిట్టింగ్‌కు సీటు ఇస్తే అధికార పార్టీకి చేతులు కాలే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో గులాబీ పార్టీ నాయకత్వం కూడా మిర్యాలగూడ సీటును సీపీఐఎం పార్టీకి కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓ సభలో తనకు టికెట్ రాకున్నా పార్టీ కోసం పనిచేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. అంటే ఆయనకు కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉనికే ప్రశ్నార్థకమైన తరుణంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు రూపంలో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. ఈ బంధం అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే ఉబయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. -
మునుగోడులో నైతిక గెలుపు బీజేపీదే: ఈటల
కోదాడ అర్బన్: మునుగోడులో నైతిక గెలుపు బీజేపీదే అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముదిరాజ్‌ల కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆత్మగౌరవం, ఓటుకు విలువ కట్టిన నీచమైన సంస్కృతితో కేసీఆర్ ప్రభుత్వం పాలన చేస్తోందని మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఉపఎన్నికలో పోలీసులను అడ్డుపెట్టుకుని చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారని ఈటల ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఆయనకు ప్రత్యామ్నాయం బీజేపీయేనని గుర్తించి పార్టీ కేడర్‌ను పోగొట్టుకోకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీ అర్వింద్‌తో పాటు మునుగోడు అభ్యర్థి, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. 4 కోట్ల ప్రజలను పాలించలేక విఫలమైన సీఎం.. బీఆర్ఎస్ పేరుతో 130 కోట్ల ప్రజలను ఏవిధంగా పరిపాలిస్తారని నిలదీశారు. -
మునుగోడులో ఓటమితో సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన కాంగ్రెస్
-
Munugode: ఉప ఎన్నిక ముగిసినా చల్లారని వేడి
సాక్షి, నల్లగొండ: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని అధికార పార్టీ టీఆర్ఎస్ చెబుతున్నా.. కార్యాచరణ మాత్రం ఆ దిశాగానే సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కగా, ఇప్పుడు ఆ వేడి చల్లారకుండా టీఆర్ఎస్, బీజేపీలు తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఉప ఎన్నికలో నువ్వా నేనా అన్నట్లుగా పోరాడిన పార్టీలు ఆ తర్వాత కూడా తగ్గేదేలేదు అన్నట్లు కార్యక్రమాలు చేపడుతున్నాయి. బలం పెంచుకునే దిశగా ఆ రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. మునుగోడులో గెలుపుతో టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవాలతోపాటు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టగా, అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ బీజేపీ పోరాటానికి దిగింది. మరోవైపు సీఎం కేసీఆర్ మంగళవారం నిర్వహించిన సమావేశంలోనూ క్షేత్ర స్థాయిలో వెళ్లాలని దిశా నిర్దేశం చేయడం కూడా ఆ సంకేతాలనే ఇస్తుంది. బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కోసం జిల్లా కోర్ కమిటీని, నియోజకవర్గ కన్వీనర్లను కూడా నియమించడం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించింది. ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించే పనిలో పడింది. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఎన్నికలకు ముందే ఆయా శాఖల వారీగా ప్రభుత్వం గుర్తించింది. ఉప ఎన్నికల సమయంలో ప్రజలు నేతల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు విన్నవించారు. త్వరలోనే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నింటిపై త్వరలో నిర్వహించబోయే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించేందుకు సిద్ధం అవుతోంది. ప్రధానంగా రోడ్లు, కాలేజీలు, చండూరును రెవెన్యూ డివిజన్ చేయడం తదితర సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు దృష్టిపెట్టారు. ఇక సాధారణ ఎన్నికలకు మరో సంవత్సరం గడువు ఉన్నా ముందస్తు వస్తే ఎలా ముందుకు సాగాలన్న అంశంపై టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనా ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు జిల్లాలో మరింత అభివృద్ధిపై దృష్టి సారించింది. సమస్యలే ఎజెండాగా.. ఉప ఎన్నికలో ఓటమిపాలైనా.. అధిక ఓట్లు సాధించిన బీజేపీ మాత్రం ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాతోనే మునుగోడులో ప్రజ సమస్యలపై దృష్టిపెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం హామీలు ఇచ్చిందే తప్ప వాటిని పరిష్కరించలేదంటూ బీజేపీ నుంచి పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గొల్ల కురుమలకు వచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై సోమవారం మునుగోడులో ధర్నా చేశారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారం కోసం తన పోరాటం కొనసాగిస్తానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. ఓడినా ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. «ఇలా ముందస్తు నేపథ్యంలో అధికార పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించగా బీజేపీ మాత్రం ప్రజాసమస్యలపై కార్యచరణ ప్రారంభించింది. మునుగోడులో ఇరు పార్టీల పోటాపోటీ కార్యాచరణ -
బీజేపీ ధర్నా .. టీఆర్ఎస్ ర్యాలీ
మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో సోమవారం దాదాపు 3 గం. పాటు ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 11 గంటల సమయంలో.. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఇటీవలి ఉప ఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన విజయోత్సవ సంబరాల్లో భాగంగా బైక్ ర్యాలీగా చండూరుకు వెళ్లేందుకు ఏర్పాట్లుచేసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి బైక్ ర్యాలీ వెళ్లిన తర్వాత ధర్నా చేసుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు. అందుకు అంగీకరించిన రాజగోపాల్‌రెడ్డి కాస్త ఆలస్యంగా మునుగోడుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అప్పటికే ధర్నాకు తరలివచ్చిన బీజేపీ నాయకులు భారీగా అంబేడ్కర్ చౌర స్తాలో గుమిగూడి నినాదాలు చేస్తూ నృత్యా లు ప్రారంభించారు. 12 గంటల సమయంలో నారాయణపురం మండలం నుంచి ర్యాలీగా వచ్చిన ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ సమయంలో ఇరుపార్టీల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ తమ పార్టీ జెండాలను ఊపారు. ఒక దశలో ఒకరి జెండాలు మరొకరి జెండాలకు తగలడంతో ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 30 నిమిషాలకు పైగా చౌరస్తాలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. చివరకు పోలీసులు వారిని నెట్టివేశారు. హామీలు అమలు చేసేవరకు ఉద్యమాలు మునుగోడు నియోజకవర్గంలోని 7,600 మంది గొల్ల, కురుమల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నగదు ఇవ్వకుంటే లక్ష మందితో ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం బీజేపీ ధర్నాలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో గొల్ల, కురుమలకు నగదు జమ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వాటిని డ్రా చేసుకునే వీలులేకుండా ఖాతా లను ఫ్రీజ్ చేయించారని ఆరోపించారు. టీఆర్ఎస్కు ఓట్లు వేస్తే నగదు బదిలీ చేస్తామని చెప్పి.. గెలిచిన తరువాత మాట మార్చుతున్నారని విమర్శించారు. మునుగోడు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని, టీఆర్ఎస్కు ఓట్లు వేయకపోతే ఆసరా పెన్షన్లు, రైతు బంధు రద్దు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు తాను ఉద్యమాలు చేస్తానని, అవసరమైతే తన ప్రాణాలు సైతం త్యాగం చేస్తానని రాజగోపాల్ అన్నారు. పీఎస్‌కు తరలింపు.. విడుదల ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత వచ్చిన రాజగోపాల్‌రెడ్డి దాదాపు 2.30 గంటల పాటు ధర్నా చేశారు. దీంతో మునుగోడు–నల్లగొండ, మునుగోడు–చౌటుప్పల్ ప్రధాన రహదారులకు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ధర్నాకు గంట పాటు సమయం ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత విరమించాల్సిందిగా రాజగోపాల్‌రెడ్డితో పాటు బీజేపీ నాయకులను కోరారు. కానీ కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమని వారు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో వారిని బలవంతంగా స్టేషన్‌కు తరలించిన పోలీసులు ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. -
‘మునుగోడు’ హామీలను వెంటనే అమలు చేయండి.. కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజ లకు ఇచ్చిన హామీలను వెంటనే ఆచరణలో పెట్టాలని మంత్రు లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు అమల య్యేలా చూడాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యా హ్నం సుమారు మూడు గంటల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సమావేశ మయ్యారు. మునుగోడు అభివృద్ధికి సంబంధించిన పలు అంశా లపై దిశానిర్దేశం చేశారు. ‘‘ఎన్నికల సమయంలో నేతలు కేవలం హామీలు ఇస్తారనే అపోహను తొలగించాల్సిన అవసరం ప్రజా ప్రతినిధులపై ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భ ంగా నియోజకవర్గంలో రీజనల్ హాస్పిటల్, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, రోడ్ల నిర్మాణం వంటి అనేక అంశాలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు అందాయి. త్వరలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఒక తేదీని నిర్ణయించుకుని పంచాయతీరాజ్, రోడ్లు– భవనాలు, నీటి పారుదల, గిరిజన సంక్షేమం తదితర శాఖలకు చెందిన మంత్రులు మునుగోడుకు వెళ్లండి. జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వ హించి, అవసరమైన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయండి. చర్ల గూడెం, శివన్నగూడెం రిజర్వాయర్ల పనుల పురోగతిని సమీ క్షించండి..’’ అని సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ఇప్ప టికే నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నట్టు సమాచారం. కూసుకుంట్లకు అభినందన మునుగోడు ఉప ఎన్నికలో తనకు టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. ఆయనతోపాటు మునుగోడులో విజయం కోసం కృషి చేసిన పార్టీ నేతలను అభినందించారు. సీఎంను కలిసినవారిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునీత, బొల్లం మల్లయ్యయాదవ్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్రకుమార్ నాయక్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎంసీ కోటిరెడ్డి, పార్టీ నేత సోమభరత్ కుమార్, ఉమా మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్‌పై భారీగా ఫిర్యాదులు? -
‘బిడ్డా మీ ఆటలు సాగవింక.. ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఉర్కించి కొడతాం’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడటంతో నాయకుల పరస్పర విమర్శలు రాజకీయ వేడిని తగ్గనీయడం లేదు. తాజాగా టీఆర్ఎస్ గెలుపును తక్కువ చేసి మాట్లాడతున్న నాయకులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మందికి నీతులు వల్లించే ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది అవుతున్న సొంత నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆయన హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి అని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మీడియాతో సోమవారం మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఈ వందల కోట్లు ఎక్కడి నుండి తెచ్చారో చెప్పాలి. చొప్పరి వేణు నీతో ఉంటాడా లేదా? ఈటల హత్య రాజకీయాలు చేసే వ్యక్తి. ప్రవీణ్ యాదవ్‌ను పోలీసుల టార్చర్ తో చంపింది నిజం కాదా? నన్ను కూడా చంపే ప్రయత్నం చేయలేదా? ఇన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తే కానీ గొడవలు.. మీ భార్య సొంత ఊరిలో ఎలా గొడవలు చేశారు. పలివెల గ్రామంలో పల్లా రాజేశ్వర్ రెడ్డినీ చంపే కుట్ర చేశారు’ అని విమర్శలు చేశారు. (చదవండి: తెలంగాణ సర్కార్‌కి గవర్నర్ లేఖ.. అందులో ఏముంది?) ఇష్టానుసారంగా మాట్లాడితే కబర్ధార్! ‘వివేక్ నీ మొహానికి మళ్ళీ ఎంపీ గా గెలవగలవా? నువ్వు కనీసం వార్డ్ మెంబర్ గా గెలిచే స్థితి లేదు. కేటీఆర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడితే బిడ్డ కబర్దార్. కేసిఆర్, కేటీఆర్ పైన ఇక నుండి ఏం మాట్లాడిన ఉర్కించి కొడతాం. బిడ్డ బీజేపీ నాయకుల్లారా ఇక నుండి మీ ఆటలు సాగవు. ఈటల రాజేందర్ నువ్వు గెలిచి ఏడాది దాటింది. హుజూరాబాద్ లో చేసిందేమిటి. రూ. 3000 పెన్షన్ అన్నవ్ ఇప్పటి వరకు ఇచ్చావా? రోడ్లు, డ్రైనేజ్ లైన అభివృద్ధి చేసినవా?’అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. కాగా, వామపక్షాల భిక్షతో టీఆర్ఎస్ గెలిచిందని ఈటల రాజేందర్ విమర్శించిన సంగతి తెలిసిందే. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి టీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టారని, అధికార పార్టీకి పోలీసులు కూడా సహాకరించారని ఆరోపించారు. (చదవండి: బీజేపీ ఓటమిపై ఈటల హాట్ కామెంట్స్.. వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలిచింది!) -
బిగ్ క్వశ్చన్ : మునుగోడు ఓటమి బీజేపీకి నేర్పిన పాఠం ఏంటి ..?
-
టీఆర్ఎస్ కు ఇంకా భారీ మెజారిటీ రావాల్సింది : కేటీఆర్
-
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం
-
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో మంత్రి మల్లారెడ్డి మాస్ స్టెప్పులు
-
మునుగోడులో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచింది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
ప్రజలు కేసీఆర్‌తోనే ఉన్నారని మరోసారి రుజువైంది : మంత్రి జగదీష్ రెడ్డి
-
మద్యం, డబ్బు పంచి టీఆర్ఎస్ గెలిచింది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు
-
10వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
పరేషాన్లో టీఆర్ఎస్, బీజేపీ? వారికి భారీగా ఓట్లు.. ఎవరిది విజయం?
సాక్షి, నల్గొండ: హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి సొంత మండలం చౌటుప్పల్‌లో చేదు ఫలితాలు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు సొంతూర్లోనే షాక్ తగిలింది. ఆయన సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. తొలి రౌండ్లో స్వతంత్ర అభ్యర్థులు అనూహ్యంగా ఓట్లు సాధించడం విశేషం. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ తొలి రౌండ్లో.. చపాతి మేకర్ గుర్తు శ్రీశైలం యాదవ్ 104 ఓట్లు, చెప్పుల గుర్తు గాలయ్య 157 ఓట్లు, ఉంగరం గుర్తు కేఏ పాల్ 34 ఓట్లు, రోడ్డు రోలర్ గుర్తు శివకుమార్ 84 ఓట్లు సాధించారు. (చదవండి: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్) అయితే, నిముషనిముషానికి మారుతున్న ఆధిక్యం ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీకి కలవరం పుట్టిస్తుండగా.. ఇతర అభ్యర్థులు భారీగా ఓట్లకు గండిపెట్టడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ సహా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలిచారు. ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం.. నాలుగు రౌండ్లు ముగిసేసరికి 63351ఓట్లను లెక్కించగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 26443 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 25729, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 7380 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి 714 స్వల్ప ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక అనూహ్యంగా బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారి నాలుగు రౌండ్లలో కలిపి 907 ఓట్లు ఖాతాలో వేసుకోవడం గమనార్హం. ఇక మిగతా స్వతంత్రులు, నోటాకు పోలైన ఓట్లు 2892. ఈ ఓట్లు అభ్యర్థుల గెలుపోటలను తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించినా ఆశ్చర్యపోనవసరం లేదు! ఎవరి ఓట్లు చీలిపోయి ఓటమిపాలవుతారో? ఎవరికి మేలు జరిగి విజయబావుటా ఎగరేస్తారో చూడాలి. (చదవండి: ఓటమి తట్టుకోలేక కౌంటింగ్‌పై బీజేపీ ఆరోపణలు.. మంత్రి జగదీష్ రెడ్డి) -
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై జోరుగా బెట్టింగ్
-
మునుగోడు ఎగ్జిట్‌పోల్స్ సర్వేలో ఆ పార్టీదే హవా..!
-
మునుగోడులో పట్టుబడ్డ డబ్బు, మద్యం
-
ఓటు హక్కు వినియోగించుకున్న పాల్వాయి స్రవంతి
-
మునుగోడులో ప్రారంభమైన పోలింగ్
-
మునుగోడు వార్
-
మునుగోడు ఉప ఎన్నికపై 500 ఫిర్యాదులు: సీఈవో వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రేపు(గురువారం) ఉదయం జరగనుంది. ఈ క్రమంలో.. ఏర్పాట్ల పర్యవేక్షణపై సాక్షి టీవీతో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ సాక్షికి వెల్లడించారు. ‘‘వెబ్ క్యాస్టింగ్ ద్వారా 298 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పరిశీలిస్తాం. పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ఓటర్లకు చేతిపై ఎలాంటి పార్టీల గుర్తులు ఉండరాదు. పోలింగ్ కేంద్రాల్లో గుర్తులు ప్రదర్శించరాదు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి.. దాదాపుగా ఐదు వందల వరకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేయించాం. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తిరిగి రిసెప్షన్ లో ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈవీఎంలను వదిలి వెళ్లవద్దు. స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరించేందుకు ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ ప్రక్రియలో వెయ్యి మందికి పైగా ఏజెంట్లు ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రంలోకి కూడా అనుమతి ఉన్నవారినే పంపిస్తాం అని సీఈవో వికాజ్‌రాజ్ సాక్షితో అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక- కీలక పాయింట్లు.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
మునుగోడులో జోరుగా డబ్బు పంపిణీ
-
ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: చివరిరోజు పార్టీల ప్రచార జోరుతో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సరిగ్గా సాయంత్రం ఆరు గంటల సమయంలో మైకులు మూగబోయాయి.. ఎన్నికల ప్రచార వాహనాలు నిలిచిపోయాయి. ఎల్లుండి(3వ తేదీన) ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రచారం ముగియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మునుగోడును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిధిలోని అన్ని లాడ్జిలు, హోటల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఖాళీ చేయిస్తున్నారు. ఓటర్లకు ప్రలోభానికి గురి చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు నిలిచారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. తెలంగాణ ఈసీ ప్రకటన ప్రకారం.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
ఈ ఉద్రిక్తతకు కారణం మీరే.. కాదు మీరే!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ-టీఆర్ఎస్ శ్రేణులు రణరంగం సృష్టించాయి. మునుగోడు మండలం పలివెలలో ఇరు పార్టీ శ్రేణులు కర్రలతో దాడులు చేసుకుని పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, తాజా ఘటనపై ఇరు పార్టీ నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. తప్పంతా టీఆర్ఎస్దేనని బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీనే రెచ్చగొట్టిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ కార్యకర్తలే రెచ్చగొట్లాని చూశారని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఈ తరహా రెచ్చగొట్టే చర్యలకు టీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉండి ఎన్నికలపైనే దృష్టిపెట్టాలని సూచించారు. మరొవైపు మంత్రి హరీష్‌రావు సైతం ఈ ఘటనపై స్పందించారు. ఓటమి భయంతోనే బీజేపీ దాడులు చేస్తుందన్న హరీష్‌రావు.. టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. బీజేపీకి అబద్ధాలు చెప్పడం అలవాటేనని, ఆ పార్టీ కార్యకర్తలే తమపై దాడి చేశారని టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకునే దాడికి తెరలేపిందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ పేర్కొన్నారు. అందుకే తమ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తుందని ఆమె ఆరోపించారు. ఓటమి భయం కారణంగానే టీఆర్ఎస్ దాడులు చేసిందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించగా, తమ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చాలా సౌమ్యుడని, ఆయనపైనే టీఆర్ఎస్ దాడులు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇది కూడా చదవండి: ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ -
మహిళా గర్జన పేరుతో మునుగోడులో కాంగ్రెస్ బహిరంగ సభ
-
మునుగోడు ఉపఎన్నిక కోసం 298 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు
-
ఆ తర్వాత మునుగోడులో స్థానికేతరులు ఉంటే కఠిన చర్యలు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకేనని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఆరు గంటల తర్వాత స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో ఉండకూదని ఆదేశించారు. నవంబర్ 3న ఉప ఎన్నిక ఓటింగ్ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సీఈఓ. నాన్ లోకల్ వాళ్ళు మునుగోడులో ఎవరు ఉన్నా చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మునుగోడులో అణువణువు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని గుర్తు చేశారు. ‘మంగళవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించాము. ఎవరైనా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్‌కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. రేపు సాయంత్రం 6గంటల వరకు మునుగోడులో ప్రచారం ముగుస్తుంది. ఓటర్లకు ఇప్పటికే కొత్త డిజైన్‌తో కూడిన ఓటర్ ఐడి ఇచ్చాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము. ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ఇప్పటి వరకు 111 బెల్ట్ షాపులను సీజ్ చేశాము. 185 కేసులు నమోదు కాగా.. 6.80కోట్ల నగదు 4500లీటర్ల లిక్కర్ పట్టుకున్నాము. కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి వివరణ కాసేపటి క్రితమే అందింది. దీనిపై ఈసీకి నివేదిక పంపాము. రిటర్నింగ్ అధికారిపై సీఈఓ కార్యాలయం నుండి ఎలాంటి ఒత్తిడి లేదు. ’ అని వెల్లడించారు సీఈఓ వికాస్ రాజ్. మునుగోడు ఉప ఎన్నికల ఓటింగ్ కీలక అంశాలు ► నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► 3366 పోలింగ్ సిబ్బందిని, 15 బలగాల సిబ్బంది మునుగోడులో మోహరిస్తున్నారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
డబ్బుల బదిలీ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రాజగోపాల్ రెడ్డి
-
చండూరు సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు: కిషన్‌రెడ్డి
-
కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్పేవన్నీ అబద్ధాలే: హరీష్‌రావు
-
దళితులను మోసగిస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి: తరుణ్ చుగ్
మునుగోడు: ఎనిమిదేళ్లుగా దళితులను మోసగిస్తున్న సీఎం కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నికలో దళితులు బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. శనివారం మునుగోడులో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని, ఆ వర్గాలకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెప్పి నిలువునా ముంచాడని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ అక్కడి దళితులకు దళితబంధు ఇచ్చారని, ఇప్పుడు మునుగోడు ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మోసపూరిత హామీలు గుర్తుపెట్టుకుని మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అగౌరవ పరిస్తే.. రాష్ట్రపతి పదవి ఒకమారు దళితుడికి, ఒకమారు గిరిజన మహిళకు కట్టబెట్టిన ఘనత బీజేపీదే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 12 మంది దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి..: సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని బీజేపీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు కూడా అహంకారం ఎక్కువైందని విమర్శించారు. నవంబర్ 6న మునుగోడు ఎన్నిక ఫలితం అనంతరం కేసీఆర్ కుటుంబం అంతా జైలుకు వెళ్లక తప్పదన్నారు. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బాష అ«ధ్యక్షతన జరిగిన సభలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ మునుస్వామి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, గంగిడి మనోహర్ రెడ్డి, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడు ఎన్నికల మూడ్ ఏంటీ?
మూడు పార్టీలకు మునుగోడు టెన్షన్ పట్టుకుంది. అభ్యర్థులతో పాటు నాయకులకు కూడా బీపీ పెరుగుతోంది. పైకి ధీమాగా కనిపిస్తున్నా.. లోలోన ఆందోళనకు గురి చేస్తోంది. డబ్బు మంచినీళ్ళలా ఖర్చవుతోంది. కాని ఓటర్ల మనోగతం ఎలా ఉందో ఎవరికీ అంతుపట్టడంలేదు. చివరికి ఏమవుతుందో అన్న ఆతృత అందరినీ వెంటాడుతోంది. ఇంతకీ ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీలోనూ కనిపించని గెలుపు ధీమా మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు చావో రేవో అన్న పరిస్థితి సృష్టించింది. రెండు నెలలుగా అక్కడ జరుగుతున్న రాజకీయం, పార్టీల మార్పిళ్ళు, డబ్బు ఖర్చు, ఓటర్ల కోసం ఇస్తున్న ఆఫర్లు వంటివి తలపండిన రాజకీయ విశ్లేషకులను సైతం దిగ్ర్బాంతికి గురి చేస్తున్నాయి. మరోవైపు పోటీ చేసే అభ్యర్థులకు, అక్కడ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న ఆయా పార్టీల సీనియర్ నాయకులకు టెన్షన్ రోజు రోజుకూ పెరుగుతోంది. సస్పెన్స్, క్రైం థ్రిల్లర్‌ను తలపించే విధంగా మునుగోడు రాజకీయాలు అనేక రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఒక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక కంటే... రాష్ట్రం భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికగా ప్రచారం జరుగుతోంది. కాని ప్రజల నాడి పట్టుకోవడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. మంచినీళ్ళలా డబ్బును ఖర్చు పెడుతున్నా.. చివరికి ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నాయకులు. అస్త్రశస్త్ర ప్రయోగం ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా నియోజకవర్గంలో మకాం వేశారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా గులాబీ పార్టీ నాయకత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మంత్రులందరినీ నియోజకవర్గంలోనే మోహరించి ప్రచారం సాగిస్తోంది. బీజేపీ కూడా ఇప్పటి వరకు ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర కీలక నేతలంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్, ఉత్తమ్, జానా రెడ్డితో పాటు మాజీ మంత్రులను రంగంలోకి దించి ప్రచారం సాగిస్తోంది. అన్ని పార్టీలకు సంబంధించిన ఇంత మంది నేతలు నియోజకవర్గంలోనే ప్రచారం నిర్వహిస్తున్నా గెలుపుపై ఏ పార్టీలోనూ అంత ధీమా కనిపించడం లేదని ఆయా పార్టీల నేతలే అంటున్నారు. తింటారా.. తాగుతారా? ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. ఓటర్ల అవసరాలను గుర్తించి వాటిని తీర్చి తమవైపుకు తిప్పుకునే యత్నం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన ఓటర్ల వద్దకు కూడా వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పార్టీలు చేస్తున్న పోటా పోటీ ఖర్చును చూస్తున్న ఓటరు కూడా నేతలకే ఆఫర్ ఇస్తున్నాడంట. ఇంతవరకు నేతలే వచ్చి.. గెలిపిస్తే ఇది చేస్తా అది చేస్తానంటూ ఆఫర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులు అయ్యాయని అంటున్నారు. ఎప్పుడు మీరేనా ఆఫర్లిచ్చేది? ఈసారి మేం మీకు ఆఫర్ ఇస్తామంటున్నారట. మేం ఇంతమంది ఓటర్లం ఉన్నాం ఇంత కావాలి.. ఇస్తే ఓటు మీకే అని నాయకులకు ఆఫర్లు ఇస్తున్నారట. చేసేదేం లేక అడిగినంత ముట్టజెప్పేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయని టాక్. -
భారత్ జోడో యాత్రకు మునుగోడు ఓటర్లు
సాక్షి, యాదాద్రి: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా మునుగోడు ఓటర్లు పాల్గొననున్నారు. నియోజకవర్గం నుంచి సుమారు 20 వేల మంది యాత్రలో పాల్గొనేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న షాద్‌నగర్‌లో జరిగే పాదయాత్రలో మునుగోడు నియోజకవర్గం నుంచి మండలానికి 2 వేల మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. -
ఆ పార్టీలిచ్చింది తీసుకోండి.. ఆడబిడ్డకు ఓటేయండి: రేవంత్ రెడ్డి
చండూరు: మునుగోడు ఉపఎన్నికలో ఆ రెండు పార్టీల ద్వారా వచ్చింది తీసుకోండి కానీ, ఆడబిడ్డ స్రవంతికి ఓటు వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన చండూరు మండలం కొండాపురం, గుండ్రపల్లి, బంగారిగడ్డ గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మునుగోడు నియోజకవర్గంలో 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏనాడు కూడా ఆడబిడ్డకు ఏ పార్టీ సీటు ఇవ్వలేదు. ఈసారి సోనియాగాంధీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు స్రవంతికి టికెట్ ఇచ్చింది. కడుపులో పెట్టి ఆశీర్వదించాల్సిన బాధ్యత మీది’అని అన్నారు. 2014లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, 2018లో రాజగోపాల్‌రెడ్డి గెలిచి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, మద్యం ఎవరు పోసినా తన్నండని మహిళలకు రేవంత్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, చలమళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు -
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. వెంటనే ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి కాన్వాయ్, సభలు, ర్యాలీ లపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తున్నారని, రాజగోపాల్ రెడ్డికి ఉన్న ముప్పు కారణంగా ఆయన భద్రతను బలో పేతం చేయాలని కోరారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) దాదాపు 12 వేల బోగస్ ఓట్లను తొలగించినప్పటికీ ఇంకా ఉన్న 14 వేల ఓటర్లలో ర్యాండమ్ వెరిఫికేషన్ సందర్భంగా 1,800 కంటే ఎక్కువ బోగస్ ఓటర్లు ఉన్నారని ఈసీ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి టీఆర్ఎస్పై ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 13న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘాన్ని కలసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లా డుతూ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని, రిటర్నింగ్ అధికారి, డీఈవో అనుమతి లేకుండానే భారీ సంఖ్యలో వాహనాలను టీఆర్ఎస్ మోహరించిందని తెలిపారు. అంతేగాక టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల వనరుల దుర్వినియోగం, ఓటర్లను ప్రలోభపెట్టడంతోపాటు ఆ పార్టీ నాయకులు, మంత్రులు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వాహనాల్లో ఎలాంటి తనిఖీలు లేకుండా మద్యం, నగదును చెక్‌పోస్టుల ద్వారా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అలాగే మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్కు చెందిన అనధికార వ్యక్తులను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బోగస్ ఓట్లను పునఃపరిశీలించి, ఓటర్ల జాబితాలో నిజమైన ఓటర్లు మాత్రమే ఉండేలా చూడాలని కోరారు. మైక్రో జనరల్ అబ్జర్వర్లను, మైక్రో పోలీస్ అబ్జర్వర్లను కూడా నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్ర సాయుధ బలగాల ద్వారా అన్ని పోలింగ్ స్టేషన్లకు భద్రత కల్పించడంతో పాటు పోలింగ్ బూత్‌లలో వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ చేయాలని బీజేపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. -
కొత్త ఓటర్లకు డిజిటల్ కార్డులు.. డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో ఈ కార్డులు
నల్లగొండ: కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఓటర్ గుర్తింపు కార్డు లను తొలిసారిగా రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికలో యువ ఓటర్లు వినియోగించబోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో ఈ కార్డులు ఉండనున్నాయి. ఈ–ఎపిక్ కార్డులుగా పేర్కొనే ఈ కార్డులు ఆరు ప్రధాన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటాయి. క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ (ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు కలిగిన) ఓటరు గుర్తింపు సంఖ్య, ఓటరు ఫోటో, చిరునామా, ఇతర వివరాలు ఈ కార్డులో ఉంటాయి. మునుగోడులో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు ఈ కార్డులను గురువారం నుంచి ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిని పోస్టు ద్వారా మునుగోడుకు పంపించినట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. పాత ఓటర్లు సైతం మీ–సేవా కేంద్రాల్లో డబ్బులు చెల్లించి ఈ డిజిటల్ ఓటరు కార్డులను పొందవచ్చు. 22,350 మంది అర్హులకు పంపిణీ ఈ కార్డులను సెక్యూర్డ్ పీడీఎఫ్ ఫైల్ రూపంలో ఫోన్లో లేదా వేరే ఎలక్ట్రానిక్ పరికరంలో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఈ–ఎపిక్ కార్డు అందుబాటులో లేకున్నా పీడీఎఫ్ ఫైల్ ప్రింట్‌ను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కార్డులను టాంపర్ /ఎడిట్ చేయడం సాధ్యం కాదు. ఈ మేరకు పటిష్ట రక్షణ చర్యలను ఎన్నికల సంఘం తీసుకుంది. నకిలీ ఓటరు కార్డుల తయారీ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం అందిన దరఖాస్తులను ఎన్నికల సంఘం పరిశీలించి 22,350 మంది అర్హులని తేల్చింది. వారందరికీ చెన్నైలో ముద్రించిన కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. -
ప్రజలతో కలిసి పండుగ.. మునుగోడులో బీజేపీ వినూత్న ప్రచారం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక తుదివిడత ప్రచారాన్ని బీజేపీ వినూత్నంగా సాగిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా సోమవారం స్థానిక ప్రజలకు పార్టీ ఎన్నికల గుర్తు అయిన కమలం పువ్వును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు అందజేశారు. బీజేపీకి మద్దతు పలకాల్సిందిగా కోరారు. దీంతో పాటు నియోజకవర్గంలోని వివిధ సామాజిక వర్గాల వారితో కలిసి పార్టీ ముఖ్యనేతలు బాణాసంచా కాల్చి పండుగ సంబరాలు జరుపుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. పండుగ రోజున ఈ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర మెజారిటీ ఓట్లున్న కుటుంబాలు, సామాజిక వర్గాలతో మమేకం కావడం బీజేపీకి ఉపకరిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, మునుగోడు స్టీరింగ్ కమిటీ చైర్మన్ డా.జి.వివేక్ వెంకటస్వామి, సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, డా.గంగిడి మనోహర్‌రెడ్డి తదితరులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు మేనిఫెస్టో విడుదల బుధవారం మునుగోడు ప్రజలకు బీజేపీ అభ్యర్థి ఎన్నికల హామీపత్రాన్ని విడుదల చేయనున్నారు. కేవలం ఈ నియోజకవకర్గం వరకే పరిమితమై, తాను గెలిస్తే చేయ బోయే కార్యక్రమాల గురించి ఇందులో వివరించనున్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా బీజేపీ అభ్యర్థులు ఇలాంటి మినీ మేనిఫెస్టోలను ప్రకటించిన విషయం తెలిసిందే. రంగంలోకి జిల్లాల అధ్యక్షులు.. బుధవారం నుంచి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఒక్కో జిల్లా నుంచి 200 మంది దాకా అనుచరగణం ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 31న చండూరులో నిర్వహిస్తున్న పార్టీ బహిరంగ సభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ నెల 30న టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నందున దానికి దీటుగా నడ్డా సభ విజయవంతానికి రాష్ట్రపార్టీ పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక నవంబర్ 1న ప్రచార గడువు ముగియనున్నందున, ఆరోజు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలంతా మునుగోడు వ్యాప్తంగా రోడ్డుషోలు నిర్వహిస్తారు. సమన్వయకర్తల నియామకం ఎన్నికల ప్రచారం, నిర్వహణ, ఇతర అంశాల పర్యవేక్షణకు తాజాగా మళ్లీ సమన్వయకర్తలను నియమించినట్టు సమాచారం. నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీలకు ఒక్కొక్కరు చొప్పున 9 మందిని నియమిస్తున్నారు. మునుగోడు మండలానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మర్రిగూడకు ఏపీ జితేందర్‌రెడ్డి, చండూరు మండలానికి డీకే అరుణ, చండూరు మున్సిపాలిటీకి గరికపాటి మోహన్‌రావు, గట్టుప్పల్‌కు ఎంపీ ధర్మపురి అరవింద్, చౌటుప్పల్ అర్బన్ మండలానికి ఇంద్రసేనారెడ్డి, రూరల్ మండలానికి బూర నర్సయ్యగౌడ్, సంస్థాన్ నారాయణ్‌పూర్ మండలానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నాంపల్లికి ఈటల రాజేందర్‌లను సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలుస్తోంది. -
రెండు జిల్లాల్లో ఎస్ఏ–1 పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో 1–10 తరగతులకు నవంబర్ 1 నుంచి జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్ –1 (ఎస్ఏ–1) పరీక్షను నవంబర్ 9 నుంచి నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నది. మిగతా జిల్లాల్లో ముందుగా ప్రకటించిన ప్రకారం ఎస్ఏ–1 షెడ్యూల్ అమలులో ఉంటుందని వెల్లడించింది. -
తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన మునుగోడు ఉప ఎన్నిక
-
మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయం: మంత్రి తలసాని
-
Munugode Bypoll 2022: ఓటర్లకు ప్రలోభాలపై ఈసీ సీరియస్! కేసులు తప్పవా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు అందిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. విచ్చలవిడిగా డబ్బులు, మద్యం, ఇతర తాయిలాలను పంపిణీ చేస్తున్నవారిపై, తీసుకున్నవారిపై ఐపీసీ సెక్షన్ 171(బీ) కింద కేసులు నమోదు చేయాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అభ్యర్థిని/ఓటరును/ మరే ఇతర వ్యక్తిని బెదిరించినా, గాయపర్చినా సెక్షన్ 171(సీ) కింద కేసు పెట్టాలని సూచించింది. ఈ రెండు కేసుల్లో ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ నిబంధనలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఆదేశించింది. ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్‌రాజ్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించారు. మునుగోడుకు అదనంగా పరిశీలకులు మునుగోడులో అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల అదనపు పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సుభోత్ సింగ్, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సమత ముళ్లపూడిని తాజాగా నియమించింది. అక్రమ నగదు ప్రవాహం నియంత్రణలో వీరికి సహకరించేందుకు మరో ఏడుగురు ఆదాయ పన్నుశాఖ అధికారులను ఆ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్స్) మునుగోడుకు పంపించనున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.2.49 కోట్ల నగదు, 1,483.67 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వికాస్‌రాజ్ తెలిపారు. 36 మందిని అరెస్టు చేసి 77 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: టీఆర్ఎస్లో ముసలం ఖాయం) -
మునుగోడులో ఎన్నికల అధికారిపై కే ఏ పాల్ వాగ్వాదం
-
దావత్ @మునుగోడు!.. నాటుకోడి మాంసం, మద్యం, కల్లుతో విందులు
సాక్షి, రంగారెడ్డి: ‘మనుగోడు పోదాం చలో..చలో.. ఎంజాయ్ చేద్దాం పదో.. పదో’.. అనే నినాదం ప్రస్తుతం జిల్లాలో మార్మోగుతోంది. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎలక్షన్ పుణ్యాన రాజకీయ పార్టీల నేతలు పండుగ చేసుంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే ఆయా పార్టీల శ్రేణులకు కలిసొచ్చింది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు నిత్యం వారికి కేటాయించిన గ్రామాల్లో డోర్ టు డోర్ తిరుగుతూ.. కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి పలువురు నేతలు అక్కడకు వెళ్తున్నారు. కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రచార బాట పట్టారు. బీఎస్పీ నుంచి సైతం స్థానిక నేతలు తరలివెళ్తున్నారు. నిత్యం ఉదయం 7గంటలకే సాగర్‌రోడ్డు నుంచి మాల్ మీదుగా మునుగోడులోని గ్రామాలకు చేరుకుంటున్నారు. రాత్రి వేళ తిరిగి వస్తున్నారు. ఇలా వారం రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఆయా పార్టీలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పార్టీ సీనియర్లు వందలాది మంది ప్రచారానికి వెళ్తున్నారు. నాటు కోడి.. భలే క్రేజీ మునుగోడు ప్రచారంలో విందు కోసం నాటు కోడి మాంసం క్రేజ్‌గా మారింది. నగరం నుంచి మునుగోడు ప్రచారానికి వెళ్తున్న ప్రజాప్రతినిధులకు, పార్టీ పెద్దలకు విందులో కచ్చితంగా నాటు కోడి మాంసం ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం నిర్వహించే గ్రామాల్లో పార్టీ శ్రేణులకు ముందుగానే సమాచారం ఇచ్చి.. ఈ రోజు మా నేత వస్తున్నాడు.. నాటు కోడి మాంసం ఉండేలా చూడు బ్రదర్.. ఖర్చు ఎంతైనా చూసు్కందాం అని సూచిస్తున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ నాటు కోళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. భోజనం ఏర్పాట్లు చేసే నిర్వాహకులు నిత్యం రంగారెడ్డి జిల్లాలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మాడ్గుల్, కడ్తాల్, నల్గొండ జిల్లా పరిధిలోని చింతపల్లి, దేవరకొండ తదితర మండలాల్లోని గ్రామాలకు వెళ్లి నాటుకోళ్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో మాంసం ఉన్న నాటు కోడి ధర రూ.2 వేలు పలుకుతోంది. రెండు కిలోల కోడిని రూ.5 వేలకు పైగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. నాటుకోడి మాంసంతో పాటు విలువైన మద్యం, కల్లు, మటన్, చికెన్‌తో విందు ఆరగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, చేతి ఖర్చుల కోసం నిత్యం రూ.వేలల్లో జేబు నింపుకొంటున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా తమకు అక్కర్లేదు.. నిత్యం విందు భోజనం, చేతి ఖర్చులు అందుతున్నాయా..? లేదా..? అనే విధంగానే అన్ని పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారు. చుక్కలు చూపిస్తున్న ఓటర్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జిల్లా నేతలకు మునుగోడు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఏ పార్టీ వారు వెళ్లి అడిగినా.. మీకే మా మద్దతు ఓటుకు రేటెంత అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు సదరు గ్రామాల్లోని తమ బంధువులు, తెలిసిన వాళ్లను తీసుకెళ్లి అయ్యా.. అమ్మా అంటూ బతిమాలుతున్నారు. డబ్బులిచ్చి ఓటర్ల ఇళ్లల్లోనే విందులు ఏర్పాటు చేస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. మునుగోడు ఓటర్లను యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మాడ్గుల్, కడ్తాల్ మండలాల పరిధి లోని గ్రామాలకు తీసుకువచ్చి మీ ఓట్లన్నీ మా పార్టీకే వేయాలి.. మీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పు అని మద్యం తాగించి, డబ్బులు ఇస్తున్నారు. మునుగోడు పోరుతో మద్యం, చికెన్, మటన్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. -
మునుగోడులో మంత్రి మల్లారెడ్డి ప్రచారం
-
ప్రచారానికి హోం గార్డ్స్ కాదు.. ఎస్పీ స్థాయి వారు వెళతారు: కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
నేడు మునుగోడు నామినేషన్ల విత్ డ్రా కు తుది గడువు
-
ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తాయి
బోధన్/బోధన్‌టౌన్: ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక రావడంతోనే గిరిజనబంధు, మైనారిటీలకు రిజర్వేషన్లు అంటూ కేసీఆర్ హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటాకుర్దు నుంచి బోధన్ వరకు సాగింది. అనంతరం నిర్వహించినసభలో షర్మిల మాట్లాడారు. లిక్కర్ స్కాంలో కూతురు అరెస్టు కాకుండా ఉండేందుకు కేసీఆర్ ఢిల్లీలో తిప్పలు పడుతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ఉన్నా రని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో పాలన స్థంభించిపోయిందని అన్నారు. కేసీఆర్ చెప్పే ప్రతి పథకంలోనూ మోసం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అబివృద్ధి చేసినట్లు చూపిస్తే ముక్కు నేలకు రాసి పాదయాత్ర ముగించి ఇంటి వెళ్తానని పేర్కొన్నారు. ప్రజలకు సమస్యలు ఉన్నాయని తాను నిరూపిస్తే కేసీఆర్ పదవికి రాజీనామా చేసి దళితనేతను ముఖ్యమంత్రి చేస్తారా అని ఆమె సవాల్ విసిరారు. -
టీఆర్ఎస్కు బూర రాజీనామా.. కేసీఆర్‌కు ఘాటుగా లేఖ
సాక్షి, హైదరాబాద్: భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ.. శనివారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2009 నుంచీ తెలంగాణ ఉద్యమంలో కొనసాగిన విషయాన్ని గుర్తు చేశారు. 2014లో భువనగిరి ఎంపీగా గెలిచినా.. 2019లో తన ఓటమికి పార్టీలో అంతర్గత కుట్రలు కూడా కారణమని ఆరోపించారు. తనను ఎంతగానో అవమానించినా ఇన్నాళ్లూ భరించానని, రాజకీయంగా వెట్టిచాకిరీ చేయలేకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తాను పైరవీలు చేసే వ్యక్తిని కాదని.. ప్రజల సమస్యలను వివరించే అవకాశం కూడా తనకు కల్పించలేదని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల సమస్యలను ప్రస్తావించిన తనపై అసహనం వ్యక్తం చేయడం ఓ ఉద్యమకారుడిగా ఎంతో బాధించిందన్నారు. లేఖలోని అంశాలు బూర నర్సయ్యగౌడ్ మాటల్లోనే.. బీసీలు వివక్షకు గురికావడం బాధాకరం ‘‘మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా మాజీ ఎంపీ అయిన నన్ను ఒక్కసారి కూడా సంప్రదించలేదు. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలకు సమాచారం ఇవ్వకున్నా అవమానాన్ని దిగమింగాను. మునుగోడు టికెట్ బీసీలకు ఇచ్చే అంశాన్ని పరిశీలించండి అని అడగటం కూడా నేరమేనా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలు ఆర్థిక, రాజకీయ, విద్య రంగాలలో వివక్షకు గురికావడం బాధాకరం. మీరంటే అభిమానంతో, ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతతో ఎన్నో అవమానాలు భరించి పార్టీలో కొనసాగాను. కానీ అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. నాకు వ్యక్తిగతంగా అవకాశాలు రాకున్నా ఫర్వాలేదు. కానీ అట్టడుగు వర్గాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చే అవకాశమే లేనప్పుడు పార్టీలో కొనసాగడం అర్థరహితం. రాజకీయ వెట్టిచాకిరీని ప్రజలు ఎక్కువ కాలం భరించలేరు. ఒక్క నిమిషం కలిసే అవకాశం ఇవ్వలేదు తెలంగాణ ఉద్యమంలో రోజులు, నెలలు, ఏళ్లు గడిపిన సహచర ఉద్యమకారులు ఇప్పుడు కనీసం ఒక నిమిషం కేసీఆర్‌ను కలవాలన్నా.. తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నారు. తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రభుత్వం తరఫున పెట్టకపోవడం అందరినీ బాధిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతర ప్రాంతాల వాళ్లు ఇక్కడ రొయ్యలు అమ్ముకోవచ్చు. కర్రీ పాయింట్స్ పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో, సచివాలయంలో మాత్రం తెలంగాణ ప్రజలే ఉంటారని అప్పట్లో ప్రజల చప్పట్ల మధ్య చెప్పాం. కానీ ఇప్పుడు తెలంగాణ కాంట్రాక్టర్ల ఏడాది టర్నోవర్ కలిపినా.. ఇతర ప్రాంత కాంట్రాక్టర్ల టీడీఎస్ అంత కూడా ఉండడం లేదు.’’అని నర్సయ్యగౌడ్ లేఖలో పేర్కొన్నారు. ఇదీ చదవండి: బీజేపీలోకి టీఆర్ఎస్ కీలక నేత -
బీజేపీ దీపావళి ధమాకా..!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని మోత మోగించేందుకు బీజేపీ సిద్ధమైంది. దీపావళి దాకా వచ్చే 7, 8 రోజులు గ్రామస్థాయిలో, ఆ తర్వాత చివరి వారంరోజులు మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించనుంది. ఇప్పటిదాకా ఒక మోస్తరుగా సాగిన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం నుంచి 10 మంది స్టార్ క్యాంపెయినర్లు వేడెక్కించనున్నారు. వెయ్యిమంది చొప్పున జనం పాల్గొనేలా 200 గ్రామసభలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 1, 13, 17 వార్డుల్లో, జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చౌటుప్పల్ మండలంలోని ఎస్.లింగోటం, పీపల్‌పహాడ్, తూప్రాన్‌పేటలో, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో, సినీనటుడు బాబూమోహన్ నాంపల్లి మండలంలోని గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహిస్తారు. ఆదివారం ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాంపల్లి మండలంలోని మహ్మదాపురం, దామెర, బీటీపురం, దేవత్పల్లిలో, కిషన్‌రెడ్డి మునుగోడు మండలంలోని మునుగోడు, చీకటి మామిడిలో ప్రచారకార్యక్రమాల్లో పాల్గొంటారు. 6 మండలాల్లో సంజయ్ రోడ్ షో ఈ నెల 18 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 12 రోజులు మునుగోడులోనే బస చేయనున్నారు. 6 మండలాల్లో ఆరురోజులు వరుసగా రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించనున్నారు. వీరితోపాటు స్టార్ క్యాంపెయినర్లు మురళీధర్‌రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, విజయశాంతి ఐదారు రోజులపాటు తమకు కేటాయించిన గ్రామాల్లోని పోలింగ్‌బూత్ స్థాయిల్లో ప్రచారం నిర్వహిస్తారు. రాష్ట్ర బీజేపీ మహిళ, ఎస్సీ, యువ, ఇతర మోర్చాల ద్వారా ప్రచారానికి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 20 మహిళా మోర్చా బృందాలు పోలింగ్‌బూత్ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఆడవారికి బొట్టుపెట్టి కరపత్రమిచ్చి పార్టీ గుర్తు, అభ్యర్థి పేరును ప్రచారం చేస్తాయి. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళితవాడల్లో సమావేశాలు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేస్తారు. దీపావళి తర్వాత తుదిదశ ప్రచారంలో భాగంగా 7 మండల కేంద్రాలు, 2 మున్సిపాలిటీలలో రెండేసీ చొప్పున నిర్వహించే పెద్ద బహిరంగసభల్లో సంజయ్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలతోపాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. నెలాఖరులో నిర్వహించే ప్రచార ముగింపు బహిరంగసభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాగానీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్గానీ పాల్గొననున్నట్టు సమాచారం. ఢిల్లీ బృందాల ప్రత్యక్ష పర్యవేక్షణ మునుగోడు ఎన్నికల ప్రచారంలో రాష్ట్రపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారా లేదా అన్నదానిపై ఢిల్లీ బృందాలు గ్రామస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మోహరించిన ఈ బృందాలను ఢిల్లీ నుంచి జాతీయ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తీరుపై రాష్ట్రనాయకులు టెలీ కాన్ఫరెన్స్‌లు, ఇతరత్రా రూపాల్లో ఆరా తీస్తున్నారు. -
బీజేపీ, టీఆర్ఎస్లు మునుగోడు ప్రజలను మోసం చేశాయి
-
మునుగోడులో ఓటమి ఒప్పుకున్న టీఆర్ఎస్
మునుగోడు: ఎనిమిదేళ్లు గా ప్రజా సమస్యలు పట్టించుకోని సీఎం కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికకు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిపి.. మొత్తం 88 మందిని పంపడం ద్వారా పరో క్షంగా ఓటమిని అంగీకరించారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం ప్రవీణ్‌కుమార్ మునుగోడు మండలం కొంపల్లి, చల్మెడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రోజు కూడా ఫామ్ హౌస్‌ని వదిలి బయటకురాని సీఎం.. నేడు కేవలం ఒక ఎంపీటీసీ పరిధిని ఎంచుకొని ప్రచారం చేయడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. వెల్మకన్నె గ్రామానికి ప్రచారానికి వెళ్లి మహిళలతో మాట్లాడారు. మాటల సందర్భంలో తాము ఎప్పుడూ ఏసీ కారులో తిరగలేదని ఆ మహిళలు చెప్పారు. దీంతో ప్రవీణ్‌కుమార్ వారిని కారులో ఎక్కించుకుని కాసేపు తిప్పారు. -
టీఆర్ఎస్ వ్యాఖ్యలపై సీపీఎం అసహనం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.18 వందల కోట్లు ఇస్తే ఉపఎన్నికల బరి నుంచి తప్పుకుంటామన్ని టీఆర్ఎస్ ప్రకటనపై మిత్రపక్షమైన సీపీఎం అసహనం వ్యక్తం చేసింది. బీజేపీ పట్ల రాజకీయంగా మెతక వైఖరి సరైంది కాదని స్పష్టం చేసింది. మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్ వ్యాఖ్యలు బీజేపీపట్ల మెతక వైఖరిని సూచిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. టీఆర్ఎస్ డబ్బుల కోసమే అక్కడ పోటీ చేస్తోందా, నిజంగా డబ్బులు ఇస్తే ఎన్నికల నుంచి విత్‌డ్రా చేసుకుంటారా అని తమ్మినేని ప్రశ్నించారు. ‘బీజేపీ, మతోన్మాద వ్యతిరేక త అనేది నియోజకవర్గ డబ్బుల కోసమా? మోదీ దేశం మొత్తాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మరి ఈ ప్రకటనతో బీజేపీతో తమకు పంచాయతీ లేదని చెప్తారా? భవిష్యత్తులో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఒకవేళ సత్సంబంధాలు వస్తే బీజేపీని సమర్ధిస్తారు కదా? ఇది సరైన వైఖరి కాద’ని ఆయన టీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. కాగా, తమ్మినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనం రేపాయి. టీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు కూడా సందిగ్ధంలో పడినట్లు సమాచారం. ఇక నుంచి అటువంటి వ్యాఖ్యలు చేయబోమని వారన్నట్లు తెలిసింది. -
బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు: బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోందని విమర్శించారు. తెలంగాణ సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఎన్ని ఆటంకాలెదురైనా మరింత పట్టుదలతో అభివృద్ధి ప్రస్థానం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి కొరటికల్ గ్రామంలో నిర్వహించిన కురుమ ఆత్మీయ సమ్మేళన సహపంక్తి భోజన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గొర్రె పిల్లలిచ్చింది కేసీఆర్ ఒక్కరే తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులవారి జీవనోపాధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పువ్వాడ చెప్పారు. నిన్నటివరకు కురుమలు ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రెపిల్లలను పట్టుకొని పోయిన పాలకులే తప్ప, మొదటిసారిగా వారికి గొర్రెపిల్లలను ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆర్ ఒక్కరేనని మంత్రి చెప్పారు. తెలంగాణలోని అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆయన పాలనను యావత్ దేశ ప్రజానీకం కోరుకుంటుంటే బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పువ్వాడ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలో బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కురుమ సంఘం నేతలు పాల్గొన్నారు. -
మునుగోడు ఓటర్ల జాబితాలో అక్రమాలు
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ నేతృత్వంలోని బీజేపీ బృందం గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటర్ల జాబితాలో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ఇటీవల ఓటర్ల జాబితా లో చేరినవారి వివరాలను పరిశీలించాలని, అక్రమాలను అడ్డుకొనేందుకు వెంటనే పరిశీలకుడిని పంపించాలని కోరింది. అనంతరం కేంద్ర మంత్రి మురళీధరన్, ఎంపీ సారంగి, తెలంగాణ బీజేపీ నాయకుడు రామచందర్రావులతో కలిసి తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లాడారు. ‘మునుగోడులో 25వేల కొత్త ఓటర్ల నమోదు జరిగింది. సాధారణంగా కొత్త ఓటర్ల నమోదు సమయంలో ఎన్నడూ ఈ నియోజకవర్గంలో 2,000 మంది దాటలేదు. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో కొత్త ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? 25 వేల కొత్త ఓటర్లు అంటే.. 40 వేల మందికిపైగా జనాభా ఈ నియోజకవర్గానికి వచ్చినట్టు భావించాలి. అంత భారీగా వలస ఎలా సాధ్యం? దీనిపై చర్యలు చేపట్టాలని ఈసీని కోరా’ అని తరుణ్ ఛుగ్ వెల్లడించారు. అధికారులను బదిలీ చేయాలి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులు మునుగోడు ప్రాంతంలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఈసీ అనుమతి లేకుండా అక్కడికి వెళ్తున్న అధికారులను బదిలీ చేయాలని కోరామని తరుణ్ ఛుగ్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి సచివాలయాన్ని మునుగోడుకు మార్చి అక్కడ మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేశారని.. అధికార యంత్రాంగం, మంత్రులు మొత్తం అక్కడే ఉన్నారని విమర్శించారు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవం రాజగోపాల్‌రెడ్డిపై కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు. కాగా మునుగోడు లో ఓటర్ల నమోదు వ్యవహారంలో గోల్మాల్ ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేర్కొన్నారు. అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ఎన్నికల పర్యవేక్షకులను నియమించి అవకతవకలకు అడ్డుకట్ట వేయా లని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. -
రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయిస్తా
మునుగోడు: కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మునుగోడు నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీనిచ్చారు. గొల్ల కురుమలకు గొర్రెల కోసం ఇచ్చిన నగదు బ్యాంకుల్లో ఫ్రీజింగ్ చేయించి తమకు ఓట్లు వేస్తేనే ఇస్తామని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని, దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఎన్నికలు అయిన తరువాత కేంద్ర మంత్రులతో మాట్లాడి నగదు ఇప్పిస్తానని, ఒకవేళ బ్యాంక్ అధికారులు ఇవ్వకపోతే హైదరాబాద్‌లోని తన 90 కోట్ల ఆస్తిని అమ్మి ఇస్తానని ప్రకటించారు. ఆయన గురువారం మునుగోడు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మునుగోడుకు నిధులు మంజూరు చేయాలని మూడున్నరేళ్లుగా తాను అసెంబ్లీలో గొంతుచించుకొని అడిగినా కేసీఆర్ పభ్రుత్వం నయాపైసా ఇవ్వలేదన్నారు. తనను నమ్ముకున్న ప్రజలకు ఏమీచేయలేకపోయానని, రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని భావించి.. ఏడాది సమయం ఉన్నప్పటికీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం అవుతానని కలలు కంటున్నాడని, అది నిజ జీవితంలో జరిగే పని కాదన్నారు. ఏదైనా సినిమాలో నటించి సీఎం పాత్ర పోషించుకోవాలని హితవు పలికారు. -
మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఇవాళ (గురువారం) ప్రారంభమైంది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఓటర్ల జాబితాను తమకు సమర్పించాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది రచనా రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని వాదించారు. ఫార్మ్ 6 ప్రకారం కొత్తగా దాదాపు 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారు. మునుగోడు నియోజకవర్గం లోని వివిధ మండలాల లో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగింది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. నవంబర్ 3 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా ఓటర్ల నమోదు అక్రమంగా జరిగిందని ఆమె వాదించారు. ఇక.. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ‘తుది ఓటర్ల లిస్ట్ ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటున్నారు. జనవరి 2021 వరకు రెండు లక్షల 22 వేలు ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం లో 2 లక్షల 38 వేలు ఓట్లు ఉన్నాయి. 25వేల ఓట్లలో ఏడు వేలు తొలగించాం. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది’ అని వాదించారు. రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులు ఎలా వచ్చాయని ఈసీని ప్రశ్నించిన హైకోర్టు.. ఈ నేపథ్యంలో దరఖాస్తుల వివరాలు, ఓటర్ల జాబితా తమకు సమర్పించాలని ఆదేశించింది. మునుగోడు ఉప ఎన్నికల ఓటర్ల జాబితా పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది. -
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
మునుగోడులో మరో ట్విస్ట్
-
లెక్కలు లేని.. 3.5 కోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగదు అక్రమ రవాణాపై దృష్టిపెట్టారు. గతవారం మూడు ఘటనల్లో రూ.3.7కోట్లు పట్టుకోగా..సోమవారం రాత్రి నగరంలోని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు లెక్కలు లేని రూ.3.5 కోట్లను పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిర్మాణ రంగ వ్యాపారైన హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్వర్రావు సైదాబాద్‌కు చెందిన మరోవ్యాపారి బాలు మహేందర్‌కు రూ.3.5 కోట్లు నగదు రూపంలో ఇవ్వాలని భావించారు. అయితే ఈ నగదు తీసుకునేందుకు బాలు మహేందర్ కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన తన స్నేహితులు గండి సాయికుమార్ రెడ్డి, మహేశ్, సందీప్‌కుమార్, మహేందర్, అనూష్‌రెడ్డి, భరత్‌లను పంపాడు. ఈ ఆరుగురూ సోమవారం రాత్రి రెండుకార్లలో మారియట్ హోటల్ వెనుక ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడకు మరో కారులో వచ్చిన వెంకటేశ్వర్రావు నాలుగు అట్టపెట్టెల్లో సీల్‌వేసి తీసుకువచ్చిన నగదును వీరికి అప్పగించాడు. వాటిని తమ కార్లలో పెట్టుకుని ఆరుగురూ సైదాబాద్ వైపు బయల్దేరారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి వారిపై దాడిచేసి నలుగురిని పట్టుకున్నారు. వెంకటేశ్వర్రావు, బాలు మహేందర్‌లు పారిపోయారు. కాగా, వీరి వాహనాలను తనిఖీ చేయగా రూ.3.5 కోట్లు బయటపడ్డాయి. ఈ నగదుకు సంబంధించిన లెక్కలు వారి వద్ద లేకపోవడంతో కార్లతో సహా స్వాధీనం చేసుకుని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వెంకటేశ్వర్రావు, బాలు మహేందర్ కోసం గాలిస్తున్నారు. ఈ నగదుతో మునుగోడు ఉప ఎన్నికలకు ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
దశలవారీగా బీజేపీ ప్రచార జోరు.. ఆ సభకు అమిత్ షా లేదా నడ్డా!
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ జాతీయ, రాష్ట్రనేతలు హోరెత్తించనున్నారు. దశలవారీగా ప్రచార వేగం పెంచాలనే వ్యూహంతో పార్టీ నాయకత్వముంది. ఈ నెల 14న ఉప ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే దాకా ఒక మోస్తరుగా, 17న ఉపసంహరణల పర్వం ముగిశాక మరోస్థాయిలో ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి చివరి వారం రోజులు పూర్తిస్థాయి ప్రచారంతోపాటు మొత్తం 298 పోలింగ్‌బూత్‌ల స్థాయిలో ఎన్నికల మేనేజ్మెంట్పై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినట్టు సమాచారం. సోమవారం కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 7 మండలాలు, 2 మున్సిపాలిటీల వారీగా మోహరించిన వివిధ స్థాయిల్లోని నాయకులపై, వారి కార్యక్షేత్రాలపై పార్టీకి ఓ స్పష్టత వచ్చింది. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలు, మునుగోడులో అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడంలోభాగంగా ఓటర్ల జాబితాపైనా కమల దళం దృష్టి కేంద్రీకరించింది. ఈ నియోజకవర్గంలో ఇటీవలి కాలంలోనే 23 వేల ఓట్లు కొత్తగా జాబితాలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత 6, 7 నెలల్లో వెయ్యిదాకా కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఉప ఎన్నిక తేదీ ప్రకటించాక 23 వేల ఓట్లు కొత్తగా జాబితాలో చేర్చడాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎన్నికల అక్రమాలకు పాల్పడటంలో భాగంగానే కొత్తగా ఓటర్లను చేర్చిందని ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. ముగింపు సభకు అమిత్ షా లేదా నడ్డా! ఈ నెల 15 నుంచి మునుగోడులో ముఖ్యనేతలు పూర్తిస్థాయి ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర నేతలు వారం పదిరోజుల పాటు అక్కడే బసచేయనున్నట్టు సమాచారం. 18 నుంచి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, కార్యదర్శి అర్వింద్ మీనన్ ఇతర నేతలు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచార ముగింపు సభలో బీజేపీ అగ్రనేత అమిత్‌షా లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని పార్టీనేతలు చెబుతున్నారు. -
తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన తనను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. నిబంధనల ప్రకారం, పారదర్శకంగా తన కంపెనీకి జాతీయ స్థాయి లో ఓ కాంట్రాక్టు టెండర్ లభిస్తే టీఆర్ఎస్ నేతలు మాత్రం కాంట్రాక్టు పొందేందుకే బీజేపీలో చేరినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకపోతే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తాను యాదాద్రి ఆలయం గర్భగుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని, టీఆర్ఎస్ నేతలు కూడా అక్కడకు రావాలన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్నవారిపై న్యాయపోరాటం సైతం చేస్తా నని హెచ్చరించారు. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి సోమవారం చండూరులో నామినేషన్ దాఖలు చేశారు. బంగారి గడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించి రిటర్నింగ్ అధికారికి 3 సెట్ల నామినేషన్లు సమర్పించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సమాజం ఒక్కతాటిపైకి వచ్చి ప్రజాస్వా మ్యా న్ని ఖూనీ చేసిన టీఆర్ఎస్ను బొంద బెట్టే సమ యం వచ్చిందన్నారు. ఫాంహౌస్‌కు, ప్రగతి భవన్ కు పరిమితమైన సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పే ధర్మయుద్ధంలో ఓటర్లు కలసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవిషత్తు తరాల బాగు కోసమే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. -
టీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రం తాకట్టు
చండూరు, మునుగోడు: ప్రాజెక్టులు, పథకాల పేరు తో రూ. లక్షల కోట్లు దోచుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపిస్తే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తాకట్టు పెడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 2014కు ముందు సీఎం కేసీఆర్ బ్యాంకు రుణం తీసుకొని కొనుగోలు చేసిన కారు, పార్టీ ప్రచార రథానికి వాయిదాలు చెల్లించకపోతే బ్యాంకు అధికారులు వాటిని తీసుకువెళ్లా రని... అలాంటి కేసీఆర్ సీఎం పదవి లభించాక రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసి నేడు రూ. 100 కోట్లతో విమానం కొనుగోలు చేస్తున్నారన్నారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు సందర్భంగా ఆపార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జి తరుణ్‌ఛుగ్, ఎన్నికల సమన్వయకర్త సునీల్ బన్సల్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలసి నల్లగొండ జిల్లా చండూరులో నిర్వహించిన రోడ్ షోలో సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నికలు వచ్చినా అక్కడ గెలిచేందుకు అభివృద్ధి పనులకు నిధులు, దళితబంధు, ఇతర పథకాలతో ఓటర్లని బుట్టలో వేసుకొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. అందులో భాగంగానే నియోజక వర్గంలోని యాదవులకు గొర్రెల పంపిణీ పథకం కింద ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 1.54 లక్షలు జమ చేశారన్నారు. అయితే లబ్ధిదారులు డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా ఆ సొమ్మును స్తంభింపజేశారని... ఎన్నికలు పూర్తయ్యాక నిధులను వెనక్కి తీసుకొనే కుట్రలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. గౌడ కులస్తుల వృత్తిని నిర్వీర్యం చేసేందుకు గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు పెట్టించి కల్లు తాగేవారు లేకుండా సీఎం కుట్రలు పనుతున్నారని సంజయ్ ఆరోపించారు. నవంబర్ 3న జరిగే ఉపఎన్నికలో బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సంజయ్ కోరారు. ఓటుకు రూ.లక్ష ఇచ్చినా బీజేపీదే గెలుపు... సీఎం కేసీఆర్ మునుగోడులో గెలిచేందుకు ఓటుకు రూ. లక్ష ఇచ్చినా గెలిచేది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం ఏర్పడిందని, యాదవులకు గొర్రెల పంపిణీ, ఆసరా పెన్షన్లు, రోడ్ల మరమ్మతులకు నిధులను కేసీఆర్ మంజూరు చేశారని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలనకు మునుగోడు ఉప ఎన్నికతో చరమగీతం పాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సహ ఇన్చార్జి అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఆ పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, గంగిడి మనోహర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న రాజగోపాల్ రెడ్డి
-
దేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్
మునుగోడు: తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో దోచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని కూడా దోచుకునేందుకు బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం కాన్షీరాం వర్థంతి సందర్భంగా నల్లగొండ జిల్లా మునుగోడులోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేపడుతోందన్నారు. సీఎం కేసీఆర్ తనకు ఆదాయం వస్తే చాలు, ప్రజల ఆరోగ్యాలు తనకు అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నియంత పాలన, దేశంలో మతతత్వ పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్, బీజేపీలను మునుగోడు ఉపఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. బహుజనుల రాజ్యాధికారం సాధించేందుకు కాన్షీరాంను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కాన్షీరాం స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని మునుగోడు ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి అందోజు శంకరాచారి తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడులో ఎలాగైనా గెలవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, సర్వశక్తులూ ఒడ్డాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకు తగినట్టుగా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. బూత్ స్థాయి నుంచి పార్టీ కేడర్‌ను కదిలించేలా ప్రచార షెడ్యూల్‌ను రూపొందించుకుంటోంది. ఉప ఎన్నిక ప్రచారం సమయంలోనే రాహుల్ గాంధీ పాదయాత్ర ఉండటంతో రెండు కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక ఇన్చార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, టీపీసీసీ ముఖ్య నాయకులందరూ ఈనెల 14 వరకు అక్కడే ఉండాలని నిర్ణయించారు. ఆ తర్వాత కూడా స్థానిక కేడర్‌తో కలిసి ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని తీర్మానించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శంషాబాద్‌లో రాహుల్ గాంధీతో నిర్వహించనున్న మునుగోడు బహిరంగ సభ ద్వారా మంచి ఊపు తీసుకురావాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. గెలుపు తమదేనంటున్న నేతలు సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మిత్రభేదమే తప్ప శత్రు వైరుధ్యం లేదన్నారు. వాటాల పంపకం విషయంలోనే టీఆర్ఎస్, బీజేపీ మ«ధ్య పంచాయితీ నడుస్తోందన్నారు. ఆ రెండు పార్టీలకు గట్టి బుద్ధి చెప్పాలని మునుగోడు ఓటర్లకు రేవంత్ పిలుపునిచ్చారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో విజయం కాంగ్రెస్ పార్టీదేనని, నవంబర్ ఆరో తేదీన అద్భుతమైన ఫలితం చూస్తారని పేర్కొన్నారు. పార్టీలోని ముఖ్య నాయకులందరం మునుగోడు ఉప ఎన్నికపైనే దృష్టి సారించామని, కచ్చితంగా గెలిచి తీరుతామని సీఎల్పీ నేత భట్టి ధీమా వ్యక్తం చేశారు. -
మునుగోడులో ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్?
అల్వాల్: నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ప్రజాస్వామిక శక్తులు ఐక్యం కావాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. మునుగోడు ఎన్నికలో కేఏ పాల్ ఆధ్వర్యంలోని ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్ పోటీ చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆదివారం మహోబోధి విద్యాలయంలో కోదండరాం ఇతర ప్రజా సంఘాల నాయకు లతో కలసి గద్దర్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే కొందరు దానిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారుల్లో గద్దర్ ఒకరని, ప్రజాశాంతి పార్టీ నుంచి కాకుండా ప్రజాస్వామిక వాదుల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను పోటీ చేయించడానికి చర్చలు జరుపుతు న్నామని కోదండరాం తెలిపారు. కాగా, ప్రజా సంఘటన ద్వారానే మునుగోడులో పోటీ చేయాలని నిర్ణయించామని, అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని గద్దర్ చెప్పారు. 1978లో కాళోజీ నారాయణరావు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేశారని, ఆయన బాటలోనే ప్రస్తుతం తాను పోటీ చేయాలని ప్రజా సంఘాల నుంచి అభ్యర్థ నలు వస్తున్నాయని, దీనిపై మరింత చర్చించిన తరువాతే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. -
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం : పాల్వాయి స్రవంతి
-
ప్రగతిభవన్‌కు మునుగోడు పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక సమయం దగ్గరపడినా ఆ పార్టీలో అసంతృప్తి సద్దుమణగడం లేదు. ఉపఎన్నిక సంకేతాలు వెలువడింది మొదలుకుని కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ గళం విప్పిన నేతలు నామినేషన్ల స్వీకరణ మొదలైనా పట్టు వీడటం లేదు. కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని రెండు రోజుల క్రితం ప్రకటించారు. కానీ నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఇంకా పట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో మునుగోడుకు చెందిన అసంతృప్త నేతలతో శనివారం ప్రగతిభవన్‌లో కీలక భేటీ జరిగింది. కేటీఆర్, హరీశ్‌రావులతో భేటీ మునుగోడు నియోజకవర్గానికి చెందిన పార్టీ అసంతృప్త నేతలను వెంట బెట్టుకుని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ శనివారం ప్రగతిభవన్‌కు వచ్చారు. నారాయణపూర్ ఎంపీపీ, మునుగోడు వైస్ ఎంపీపీ, పలువురు సర్పంచులు సహా సుమారు 70 మంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులతో భేటీ అయ్యారు. గతంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఇబ్బంది పెట్టిన తీరును ఏకరువు పెట్టారు. తమపై కేసులు నమోదు చేయించడం, ఆర్థికంగా దెబ్బతీయడం వంటివీ చేశారని వివరించారు. ఉప ఎన్నిక వాతావరణం ప్రారంభమైనా తమకు పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీల నుంచి చేరికలకు ఒత్తిడి, ప్రలోభాలు వస్తున్నా టీఆర్ఎస్పై అభిమానంతో కొనసాగుతున్నామని.. పార్టీ ఇన్చార్జులుగా నియమితులైన నేతలు కూడా తమను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తాం మునుగోడు టీఆర్ఎస్ అసంతృప్త నేతల అభిప్రాయాలు విన్న కేటీఆర్, హరీశ్‌రావు రెండు, మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అసంతృప్త నేతలను కలుపుకొని వెళ్లాలని ప్రస్తుతం యూనిట్ ఇన్‌చార్జీ్జలుగా నియమితులైన నేతలకు సూచించినట్టు సమాచారం. అయితే అసంతృప్త నేతలు కేటీఆర్, హరీశ్‌లతో జరిగిన భేటీపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే.. తమ ఇబ్బందులను పరిష్కరించకపోతే సొంత దారి చూసుకుంటామనే సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది. -
‘మునుగోడు’లో ఓటర్ టర్నౌట్ యాప్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు (రియల్ టైమ్‌లో) ప్రకటించడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ‘ఓటర్ టర్నౌట్’ పేరుతో అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌ను రాష్ట్రంలో తొలిసారిగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో వినియోగించనుంది. సామాన్య ప్రజలు సైతం ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని అసెంబ్లీ/లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. యాప్ ఇలా పనిచేస్తుంది... నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ వివరాలను యాప్ ద్వారా అప్లోడ్ చేస్తారు. యాప్‌లో ఎంట్రీల నమోదుకు 30 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. ఉదాహరణకు ఉదయం 9 గంటల్లోగా జరిగిన పోలింగ్ శాతం వివరాలను రిటర్నింగ్ అధికారి ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య నమోదు చేస్తారు. ►ఉదయం 9 గంటలు, 11 గంటలు, మధ్యాహ్నం 1 గంట, 3 గంటలు, సాయంత్రం 5 గంటలు, 7 గంటల వరకు జరిగిన పోలింగ్ వివరాలను ఆ తర్వాతి అర్ధగంటలోగా ప్రకటిస్తారు. తుది పోలింగ్ వివరాలను అర్ధరాత్రి 12 గంటలలోగా విడుదల చేస్తారు. ►పోలింగ్ ముగిసిన తర్వాత పురుషులు, మహిళలు, ఇతర ఓటర్లు ఎంత మంది ఓటేశారు? మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? వంటి వివరాలను యాప్‌లో అప్లోడ్ చేసి, ధ్రువీకరించుకున్న తర్వాత సబ్మిట్ చేస్తారు. ►అనంతరం సీఈఓ నియోజకవర్గాల వారీగా వివరాలను పరిశీలించి ధ్రువీకరించుకున్నాక వాటిని ప్రకటిస్తారు. పోలింగ్ ముగిసే సమయానికి సుమారుగా ఇంత పోలింగ్ జరిగిందని యాప్‌లో వివరాలు అందుబాటులోకి వస్తాయి. -
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో ఆయనకు పార్టీ బీ ఫామ్‌ను అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల విలువైన చెక్కును కూడా ఇచ్చారు. కాగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూసుకుంట్ల కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, మునుగోడులో టీఆర్ఎస్దే విజయమని చెప్పారు. నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
మునుగోడులో భారీగా పట్టుబడ్డ డబ్బు
-
12న మునుగోడులో వామపక్షాల బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికకు వామపక్షాలు సన్నాహాలు మొదలుపెట్టాయి. టీఆర్ఎస్కు మద్దతు ప్రకటన, దానికి దారితీసిన పరిస్థితు లను కేడర్‌కు తెలియజెప్పాలని సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి. అందులోభాగంగా ఈ నెల 12న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ ఎన్నికలు రావడానికి కారణం ఎవరనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాయి. బీజేపీ ఎత్తుగడతోనే ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యవ హరిస్తోంది. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీ నామా చేయించి, అనంతరం ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయా లన్నది ఎత్తుగడ. బీజేపీ వ్యూహాన్ని ఎండగట్టడం, దాని మతోన్మాద వైఖరిని తూర్పార బట్టడం ఈ సభ ఉద్దేశమని సీపీఐ, సీపీఎం నాయకులు వెల్ల డించారు. అంతేకాదు దేశంలో బీజేపీ ఆర్థిక విధానాల వల్ల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియచేస్తామన్నారు. బీజేపీ ప్రమా దాన్ని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని కేడర్‌లోకి తీసుకెళ్తారు. రెండు కమ్యూనిస్టు పార్టీల్లోని కేడర్‌లో టీఆర్ఎస్పై అక్కడక్కడ అసంతృప్తి నెలకొంది. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలన్న అంశంపైనా కేడర్‌లో కొంత విముఖత వ్యక్తమవుతోంది. దాన్ని పసిగట్టిన రెండు పార్టీలు సభ నిర్వహించడం ద్వారా తమ విధానాన్ని కేడర్‌లోకి తీసుకెళ్లనున్నాయి. -
సంబురాల నుంచి... ఎన్నికల సమరానికి
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఎన్నికల ప్రచారం, ఇతర బాధ్యతలకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఆదేశాలతో పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రికల్లా తమ తమ కార్యస్థానాలకు చేరుకున్నారు. దసరా వేడుకలు ముగియడంతో తమ అప్పగించిన ప్రాంతాల్లో మెజారిటీ నాయకులు బస చేశారు. శుక్రవారం నుంచి నేతలు తమకు అప్పగించిన విధులు, బాధ్యతల్లో నిమగ్నం కానున్నట్టు పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. ఈ నియోజకవర్గంలోని 298 పోలింగ్ బూత్‌ల పరిధిలోని ప్రతి ఒక్క ఓటరును కలుసుకునే విధంగా నాయకత్వం రూపొందించిన కార్యాచరణ అమలుకు నేతలు సిద్ధమౌతున్నారు. వివిధ సామాజికవర్గాల ఓట్లు రాబట్టేందుకు వీలుగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొత్తం 7 మండలాల (కొత్తగా ఏర్పడిన గట్టుప్పల్‌తో సహా) ఇన్చార్జిలు, సహ ఇన్చార్జిలు, రెండు మున్సిపాలిటీల పరిధిలోని కాలనీలు, ప్రాంతాల్లో మోహరించనున్నారు. ఇంటింటికీ వెళ్లి మద్దతు కూడగట్టేలా వ్యూహం అమలు చేస్తున్నారు. పార్టీ ప్రచారంలో భాగంగా పెద్ద పెద్ద సభల కంటే చిన్న చిన్న సమావేశాలకే ప్రాధాన్యమివ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ ఎన్నికల ప్రచారం ముగిసేలోగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బహిరంగ సభ ఉంటుందని పార్టీవర్గాలు వెల్లడించాయి. మరోవైపు బండి సంజయ్ 10 రోజుల పాటు మునుగోడులోనే బస చేయనున్నట్టు తెలిపాయి. బైక్ ర్యాలీలు వాయిదా రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శనివారం నుంచి చేపట్టాల్సిన బైక్ ర్యాలీలను ఆదివారానికి వాయిదా వేశారు. మునుగోడు మొత్తం చుట్టివచ్చేలా ఈ మోటార్ బైక్ ర్యాలీలకు రూపకల్పన చేశారు. శనివారం రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నిర్వహించాల్సిన మునుగోడు ఎన్నికల సన్నాహక భేటీ కూడా సోమవారానికి వాయిదా పడింది. మునుగోడుపై సంఘ్ సమీక్ష గురువారం సాయంత్రం మునుగోడుపై సంఘ్ పరివార్ సమీక్ష నిర్వహించింది. బండి సంజయ్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ ఎన్నికను బీజేపీతో పాటు సంఘ్ పరివార్ సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు పరివార్ క్షేత్రాల కార్యకర్తలు సిద్ధమైనట్టు సమాచారం. -
మునుగోడులో వేగం పెంచిన రాజకీయ పార్టీలు
-
తప్పని ఎన్నిక.. మునుగోడులో తొలి ఉపపోరు.. మొదటిసారి గెలిచిందెవరు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి తొలిసారిగా ఉపఎన్నిక జరుగనుంది. తాజామాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. 2018 వరకు ఈ నియోజకవర్గానికి 12 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా, ఆరుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు సీపీఐ, ఒకసారి (2014లో) టీఆర్ఎస్ గెలిచాయి. 1967కు ముందు మునుగోడు నియోజకవర్గంలోని కొంతభాగం చిన్నకొండూరు, మిగిలిన ప్రాంతం నల్లగొండ నియోజకవర్గంలో ఉండేవి. మునుగోడు ప్రాంతం చిన్నకొండూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు 1965లో ఒకసారి ఉపఎన్నిక జరిగింది. చిన్నకొండూరు నుంచి 1962 సాధారణ ఎన్నికల్లో సీసీఐ అభ్యర్థి కొండవీటి గురునాథరెడ్డి విజయం సాధించగా, ఆ ఎన్నిక సక్రమంగా జరగలేదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీనేత, మాజీమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కోర్టులో కేసు వేశారు. ఆ ఎన్నికను రద్దు చేస్తూ కోర్టు మూడేళ్ల తర్వాత తీర్పు చెప్పింది. దీంతో 1965లో చిన్నకొండూరు నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా లక్ష్మణ్ బాపూజీ గెలుపొందారు. ఆరుసార్లు గెలిచిన కాంగ్రెస్ మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థులే ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1967, 1972, 1978, 1983, 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఇక సీపీఐ అభ్యర్థులు ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 1985, 1989లో, 1994లో ఉజ్జిని నారాయణరావు, 2004లో పల్లా వెంకట్‌రెడ్డి, 2009లో ఉజ్జిని యాదగిరిరావు సీపీఐ అభ్యర్థులుగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభాకర్‌రెడ్డిపై 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. -
నవంబర్ 3న మునుగోడు దంగల్: ఆ మూడు పార్టీల గేమ్ ప్లాన్ ఇదే
సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే ఉంది. నవంబర్ 3 పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో మూడు ప్రధాన పార్టీలు తల మునకలయ్యాయి. మునుగోడు ముఖచిత్రాన్ని పరిశీలిస్తే మునుగోడులో మొత్తం ఓటర్లు 2 లక్షల 27 వేల 101. సామాజిక వర్గాల వారీగా అధికంగా ఉన్న ఓటర్లు గౌడ, ముదిరాజ్, యాదవ, పద్మ శాలి, ఎస్సీలు, రెడ్డి. మొత్తం మండలాలు ఏడు. మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల. నియోజకవర్గంలో మొత్తం రెండు మున్సిపాలిటీలు. చండూరు, చౌటుప్పల్. చదవండి: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి స్రవంతిలను ఆ పార్టీలు ప్రకటించాయి. టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లపై 22552 మెజారిటీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డికి వచ్చిన ఓట్లు 97239, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వచ్చిన ఓట్లు 74687. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి వచ్చిన ఓట్లు 12725 ఓట్లు. మొత్తం మునుగోడులో ఉన్న గ్రామాల సంఖ్య 159. మునుగోడు లో ఉన్న బూతుల సంఖ్య 294. రెండు గ్రామాలకు ఒక ఇంఛార్జ్‌గా ఎమ్మెల్యేను నియమించే వ్యూహంలో టీఆర్ఎస్ ఉంది. ప్రతీ వంద మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్‌ని నియమించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. లక్ష ఓట్లు కొల్లగొట్టేవిధంగా బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. రెండు బూత్లకి ఒకరి చొప్పున 150 మంది ఇంచార్జులను కాంగ్రెస్ నియమించింది. 76 వేల ఓట్లను టార్గెట్‌గా కాంగ్రెస్ పెట్టుకుంది. -
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
-
Munugode By Polls: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ♦ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ ♦నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 17 ♦15 న నామినేషన్ల పరిశీలన మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను ఆ పార్టీలు ప్రకటించాయి. టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
చేరికల జోరు పెంచాలి.. బీజేపీ నేతలకు సునీల్ బన్సాల్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ఇతర పార్టీల నుంచి నేతల చేరికల పర్వంలో వేగం పెంచడంతోపాటు పార్టీని మరింత పటిష్టం చేయడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రపార్టీ సంస్థాగత ఇన్చార్జీ సునీల్ బన్సల్ ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. త్వరలోనే టీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన నలుగురు నేతలు బీజేపీలో చేరనున్నట్టు చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ వెల్లడించారని సమాచారం. త్వరలోనే మరికొందరు పార్టీలో చేరతారని, ఈ దిశలో పలువురు నాయకులతో చర్చలు వివిధస్థాయిల్లో ఉన్నాయని తెలియజేశారు. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను మరింత విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయడంతోపాటు కేంద్రం వివిధ వర్గాలు, పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బన్సల్ సూచించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ భేటీలో చేరికల అంశంతోపాటు ప్రజాగోస–బీజేపీ భరోసా మోటార్ బైక్ ర్యాలీల నిర్వహణ, కేంద్రమంత్రులు చేపడుతున్న రెండోవిడత పార్లమెంట్ ప్రవాస్ యోజన తదితర విషయాలు చర్చకొచ్చాయి. కరీంనగర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీతోనూ విడిగా బన్సల్ సమావేశమయ్యారు. 7 నుంచి హర్‌ఘర్ కమల్–హర్‌ఘర్ మోదీ మునుగోడులో ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని బన్సల్ ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వచ్చి మునుగోడు నుంచి పోటీ చేస్తున్నందున పార్టీ కమలం గుర్తు, అభ్యర్థి రెండింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7 నుంచి ‘హర్ ఘర్ కమల్–హర్ ఘర్ మోదీ’పేరిట కార్యక్రమాలు చేపడుతున్నట్టు రాష్ట్ర నేతలు తెలియజేశారు. దీని పరిధిలోని 7 నుంచి ప్రతీ శక్తి కేంద్రం (మూడు, నాలుగు పోలింగ్ బూత్‌లు) పరిధిలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఒకేసారి నియోజకవర్గం మొత్తం కవర్ చేసేలా 95 ర్యాలీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మునుగోడులోని 189 గ్రామాల్లో బైక్‌యాత్రలు ఉంటాయని, ఇందులో స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇన్చార్జీలు, ఇతర నేతలు పాల్గొంటారని స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. వెంటనే బూత్‌కమిటీల నియామకం పూర్తిచేయాలని బన్సల్ ఆదేశించారన్నారు. ఈ నెల 10న బూత్ కమిటీల సభ్యులతో పార్టీ అధ్యæక్షుడు బండి సంజయ్ సమావేశం కానున్నారు. చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
మునుగోడుపై బీజేపీ శ్రేణులకు బన్సల్ దిశానిర్దేశం
-
విషాదం: స్నేహితుడి పుట్టిన రోజున బిర్యానీ కోసం వెళ్తూ..
సాక్షి, నల్గొండ: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని బిర్యానీ కోసం మునుగోడుకు బయలుదేరిన స్నేహితుల బృందంలో ఒకరిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకర ఘటన మునుగోడు మండలం గూడపూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన దండు మణికంఠ(18) స్నేహితుల్లో ఒకరిది పుట్టిన రోజు. ఆ వేడుకను పురస్కరించుకుని మణికంఠ మరో ఎనిమిది మంది స్నేహితులతో కలిసి బిర్యానీ కోసం ఆటోలో మునుగోడుకు బయలుదేరారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కంభాల శేఖర్ ట్రాక్టర్ నడుపుకుంటూ కోరటికల్కు వస్తున్నాడు. గూడపూర్ సమీపంలోకి రాగానే స్నేహితులతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వెనక చక్రానికి తగిలింది. ఈ ప్రమాదంలో ఆటోలో డ్రైవర్ సీటు పక్కనే కూర్చొని ప్రయాణిస్తున్న మణికంఠ ట్రాక్టర్ చక్రం తగిలి కిందపడి పోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108 వాహనంలో నల్లగొండ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో మృతుడి స్వగ్రామం కొరటికల్‌లో విషాదం అలుముకుంది. · -
మునుగోడు ఓటర్ల దయకోసం మూడు పార్టీల పాకులాట
-
మునుగోడులో ఇదే ట్రెండూ! బీరువాలు తెరుస్తున్న కార్యకర్తలు
ఖద్దరు బట్టల దర్పమే వేరు.. ధగ ధగా మెరుస్తూ..నిలబడి ఉండే ఖద్దరంటే అందరూ మోజు చూపిస్తారు. అయితే రాజకీయ నాయకులకు ఖద్దరు అనేది బ్రాండ్‌గా మారింది. కొందరైతే పండుగప్పుడో... ఏదైనా ఫంక్షన్‌కో ఖద్దరు ధరిస్తారు. నాయకులైతే ఎక్కువగా ఖద్దరులోనే కనిపిస్తారు. అయితే ఖద్దరు ధరించేవారికి ఉన్న డిమాండ్, విలువ ఇతరులకు ఉండదనేది వాస్తవం. ఇప్పుడు మునుగోడులోని అన్ని పార్టీల కార్యకర్తలు బీరువాలో దాచిన ఖద్దరు దుస్తులు బయటకు తీస్తున్నారట. ఒక ఉప ఎన్నిక అనేక విచిత్రాలకు వేదికవుతోంది. అనేక రాజకీయ పరిణామాలకు దారి తీస్తోంది. భవిష్యత్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో రాజకీయ పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక ఓ పాఠంగా మారబోతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఆ నేతల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం కొందరు చోటామోటా నేతలు కూడా అదే స్థాయిలో కష్టాలు పడుతున్నారు. నేతల్ని ఆకట్టుకునేందుకు ఇన్నాళ్లు బీరువాల్లో దాచుకున్న తెల్లటి ఖద్దరు బట్టల్ని బయటకు తీస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు మునుగోడు రోడ్లపై ఎక్కడ చూసిన తెల్లటి ఖద్దరు ధగధగలే కనిపిస్తున్నాయి. మునుగోడులో ఖద్దరు మెరవడానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు. తెల్లటి బట్టలు వేసుకుని వెళ్తేనే లీడర్లం అని చెప్పుకోవడానికి అనువుగా ఉంటుందనే కారణం ఒకటైతే... ప్రస్తుత ఉప ఎన్నిక నేపథ్యంలో దర్పం ప్రదర్శించి నా వెనుక ఇన్ని ఓట్లు ఉన్నాయని..నేతల్ని నమ్మించాలన్నా నాలుగు రూపాయలు సంపాదించాలన్నా ఖద్దరే ముద్దు అనే ఆలోచనతో చోటా నేతలంతా ఖద్దరు బాట పట్టారు. దీంతో మునుగోడులో ఎక్కడ చూసినా ఖద్దరు బట్టలు ధరించిన వారే కనిపిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని వస్త్ర దకాణాల్లో ఇప్పుడు తెల్లని ఖద్దరు వస్త్రాలకు గిరాకీ భారీగా పెరిగింది. మునుపెన్నడు లేని విధంగా ఖద్దరు కొనుగోళ్లు బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ దొరక్కపోతే పక్క ఊళ్ళ నుంచి ఖద్దరు తెప్పించుకుంటున్నారట. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కత్తి మీద సాములా మారింది. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎత్తులు, పై ఎత్తులతో నాయకులు సతమతమవుతుంటే.. చోటామోటా లీడర్లు మాత్రం తమకు పైసలు వచ్చే టైమొచ్చిందని సంబరపడుతున్నారు. -
మునుగోడుపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్
-
6 మండలాలు, 2 మున్సిపాలిటీలకు ఇన్చార్జిల నియామకం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా కార్యాచరణకు బీజేపీ స్టీరింగ్ కమిటీ నడుం బిగించింది. దసరా తర్వాత అక్కడ గడపగడపకూ బీజేపీ పేరిట కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ నియోజకవర్గం పరిధిలో కేంద్రమంత్రులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రమంత్రులు, ముఖ్యనేతలతో ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తే మంచిదనే దానిపై చర్చించింది. మునుగోడులోని ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇన్చార్జి, ఇద్దరు సహ ఇన్చార్జిల చొప్పున 24 మందిని నియమించింది. ఎమ్మెల్యే, మాజీ ఎంపీలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. సంస్థాన్ నారాయణపూర్‌కు ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, మునుగోడుకు చాడ సురేశ్‌రెడ్డి, మర్రిగుడెంకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చౌటుప్పల్‌కు కూన శ్రీశైలంగౌడ్, నాంపల్లికి ఏనుగు రవీందర్‌రెడ్డి, చండూర్‌కు నందీశ్వర్‌గౌడ్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, చండూర్ మున్సిపాలిటీకి ఎం.ధర్మారావులను నియమించింది. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఈ భేటీ అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల్లో సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత గురించి పార్టీపరంగా చార్జ్‌షీట్ సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 27న చౌటుప్పల్ మండలంలో మండల ఇన్చార్జీల సమావేశం ఉంటుందన్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సమన్వయకర్త డా.గంగిడి మనోహర్‌రెడ్డి, సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, కె.స్వామిగౌడ్, యెండెల లక్ష్మీనారాయణ, గరికపాటి మోహన్‌రావు, డా.దాసోజు శ్రవణ్ హాజరయ్యారు. హెచ్‌సీఏలో గందరగోళం ఇలా.. కల్వకుంట్ల కుటుంబం కారణంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో గందరగోళ పరిస్థితి నెలకొందని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ ఆరోపించారు. కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారన్నారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీ చేయొద్దని తనకు కేసీఆర్ సూచించారన్నారు. -
చల్నేదో బాల్ కిషన్
కతలు జెప్తున్నరు. చెవుల పూలు బెడ్తున్నరు. చెట్టు పేరు జెప్పి కాయలమ్ము కుంటున్నరు. కాయలను గాదు. ఏక్ దమ్ పండ్లనే అమ్ముకుంటున్నరు. ఎవలమ్ముకుంటున్నరు? ఎందు కమ్ముకుంటున్నరు? ఎవరంటె మన లీడర్లే. ఇంతకు గా చెట్టేంది? గది ఏందో గాదు. నిజాం చేత్లకెల్లి గుంజుకొన్న తెలంగాననే. బందూకులు బట్కోని రజాకార్ల తోని కొట్లాడినోల్ల గురించి మొన్నటిదాంక తప్పిజారి ఒక్క లీడర్ గుడ్క మాట్లాడలే. గియ్యాల గా లీడర్లే తీస్ మార్ కాన్ లెక్క ఫోజు గొడ్తున్నరు. గాల్లే నిజాం సర్కార్‌ను కూలగొట్టి తెలంగానకు సతంత్రం తెచ్చినట్లు మాట్లాడ్తున్నరు. గా దినం అయితారం. అంబటాల్లయింది. కడ్పులు ఎల్కలు చెంగడ బింగడ దుంకుతున్నయి. తలె ముంగట గూసున్న. కోడికూర తోని నా పెండ్లాం బువ్వ బెట్టింది. అంచుకు ఎల్లిగడ్డతొక్కు ఏసింది. సరింగ గప్పుడే మా తాత బోన్గిరి కెల్లి వొచ్చిండు. గాయిన పెండెం వాసుదేవ్, జైని మల్లయ్య గుప్త, గుండా కేశవులు, ముత్యం ప్రకాశ్, మాదాసు యాదగిరి అసువంటోల్లతోని గల్సి బందూకు బట్టి రజాకార్లతోని కొట్లాడినోడు. ‘‘తాతా! బువ్వ తిందురాయె’’ అన్న. గాయిన కాల్లు చేతులు గడుక్కోని నా పక్క పొంటి వొచ్చి గూసున్నడు. బువ్వ దినుకుంట ముచ్చట బెట్ట బట్టిండు. ‘‘ఇంతకుముందు టీఆర్ఎస్ మోటర్ బోయిన తొవ్వ మీదికెల్లే కడ్మ పార్టీలు బొయ్యేటియి. గని గిప్పుడు బీజేపీ ఏసిన తొవ్వ మీది కెల్లే టీఆర్ఎస్ మోటార్ బొయ్యే గతి బట్టింది’’ అని అన్నడు. ‘‘తాతా! నువ్వెప్పుడు రాజకీయాలే మాట్లాడ్తవేందే’’ ‘‘రాజకీయాలు గానిదేమన్న ఉన్నాదిర. బారతం రాజకీయమే. రామాయనం గూడ రాజకీయమే’’. ‘‘రామాయనం రాజకీయమెట్ల అయితదే?’’ ‘‘రాముని దిక్కు దుంకె బట్కె విబీషనుడు లంకకు రాజయిండు. నిజం జెప్పాలంటె పార్టీ ఫిరాయింపులు గాయినతోనే షురువైనయి’’ ‘‘బీజేపీ ఏసిన తొవ్వ మీదికెల్లే టీఆర్ఎస్ మోటర్ బోయిందంటివి. గదేందో జెర కుల్లకుల్ల జెప్పు తాతా’’ ‘‘మొన్న 17 తారీకు పరేడ్ మైదాన్ల సెంటర్ల ఉన్న బీజేపీ సర్కార్ తెలంగాన విమోచన దినం జేసింది. గా దాన్కి సెంటర్ హోం మంత్రి అమిత్ షా వొచ్చిండు. ‘మా సర్కారొస్తె సెప్టెంబర్ 17 తారీకు నాడు తెలంగాన విమోచన దినం జేస్తమన్నోల్లు గాల్ల సర్కారొచ్చినంక రజాకార్ల బయంతోని తెలంగాన విమోచన దినం జెయ్యలేదు. గియ్యాల మేము జేస్తుంటె అన్ని పార్టీలు జేస్తున్నయి’ అన్కుంట గాయిన స్పీచ్ గొట్టిండు’’. ‘‘ఇంతకుముందు కేసీఆర్ తెలంగాన విమోచన దినం ఎందుకు జెయ్యలేదు?’’ ‘‘విమోచన గాదు, మన్నుగాదు. గది జేస్తేంది, చెయ్యకుంటేంది. గదొక పెద్ద ఎజెండనా? గది జెయ్యకుంటె గీ దేసం ఏమన్న మున్గుతదా అని అసెంబ్లీల అన్న కేసీఆర్ ఇయ్యాల బీజేపీ సెట్ జేసిన ఎజెండలకే వొచ్చిండు. సమైక్యత వజ్రోత్సవం అన్కుంట కేసీఆర్ 17 తారీకు పబ్లిక్ గార్డెన్ల మూడు రంగుల జెండ ఎగిరేసిండు. ‘మత పిచ్చిగాల్లు దేసంను ఆగమాగం జేస్తున్నరు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తం. దలిత బందు తీర్గనే గిరిజన బందు బెట్టి ఒక్కో గిరిజన కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇస్తం’ అన్కుంట కేసీఆర్ స్పీచ్ గొట్టిండు’’ అని మా తాత జెప్పిండు. ‘‘హుజూరాబాద్ బై ఎలచ్చన్లు వొచ్చినప్పుడు దలిత బందు అన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లు రాంగనే గియ్యాల గిరిజన బందు అంటున్నడు తాతా!’’ ‘‘అవ్ ఎలచ్చన్లు వొస్తేనే ముక్యమంత్రికి జెనం యాది కొస్తరురా’’ (క్లిక్: గటు దిక్కు బోవద్దు గన్పతీ!) ‘‘అమిత్ షాను బీజేపోల్లు అబినవ సర్దార్ పటేల్ అంటె, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కెసీఆర్‌ను అబినవ అంబేడ్కర్ అని అంటున్నడే’’ ‘‘వారీ! ఎల్క తోలును ఒక్క తీర్గ యాడాది ఉత్కితె యాడనన్న తెల్లగైతదా? అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేలైతడా? కేసీఆర్ యాడనన్న అంబేడ్కర్ అయితడా?’’ అని మా తాత అడిగిండు. బువ్వ దిన్నంక గాయిన మంచం మీద ఒరిగిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) తోక: పొద్దు మీకింది. ఎప్పటి లెక్కనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బకాడ్కి బోయిన. గాడ పాన్లు దినుకుంట మా దోస్తులు ముచ్చట బెడ్తున్నరు. ‘‘నమీబియాకెల్లి గాలిమోటర్ల ఎన్మిది చిర్తపులులను మనదేసం దెచ్చిండ్రు. గవ్విట్ల మూడు చిర్తపులులను కన్జరేషన్ బాక్సులకెల్లి కునో జాతీయ పార్క్‌లకు ప్రతాని మోదీ ఇడ్సి పెట్టిండు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘నెలొద్దుల ముందుగాలనే గ్యాస్ బండ, పిట్రోలు అనేటి రెండు చిర్తపులులను ప్రతాని జెనం మీద్కి ఇడ్సిపెట్టిండు’’ అని మా సత్నారి అన్నడు. నివొద్దే గదా! - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
పవర్ లేని పవర్ మంత్రి ఉరికించి కొడతా అంటుండు.. ఆయనకు సోయి లేదా?
సాక్షి, నల్గొండ: టీఆర్ఎస్ శ్రేణులు రైతులను భయభ్రాంతులకు గురిచేసే కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. మీటర్లు పెట్టినా రైతుల దగ్గర బిల్లు వసూలు చేయబోమని ఏపీ సీఎం జగన్ కూడా క్లారిటీ ఇచ్చారని తెలిపారు. ఏ రైతు ఎన్ని యూనిట్లు వాడారో తెలుసుకునేందుకు మాత్రమే మీటర్లు పెట్టాలనే ఉద్దేశ్యమని అన్నారు. ఈ విధానం వల్ల ఏ ఒక్క రైతు నష్టపోరని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఏనాడు బీజేపీ అధికారికంగా మోటార్లకు మీటర్లు అనే ప్రకటన చేయలేదు. ఏ రాష్ట్రంలో అన్నా మీటర్లు పెట్టారా?. డిస్కంలు నష్టపోతున్నాయి, కొత్త విద్యుత్ సంస్కరణలు తేవడం అనేది కేంద్రం ఆలోచన. హుజూరాబాద్ ఎన్నికలు రాగానే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు. మునుగోడు ఉప ఎన్నిక రాగానే గిరిజన బంధు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. మోదీ మచ్చలేని నాయకుడు. అవినీతిరహిత పాలన అందిస్తున్న వ్యక్తి మోదీ. అవినీతి పాలన చేసేది కేసీఆర్ కుటుంబమే. 2014 కంటే ముందు కేసీఆర్ ఆస్తి ఎంత?. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించారు. చదవండి: (అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే!) కేసీఆర్ ఏనాడన్నా మునుగోడు సమస్యలపై మాట్లాడారా? ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి మునుగోడు గురించే మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్లో చేరితేనే గొర్రెలు ఇస్తామని, పింఛన్లు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభమవుతుంది. మంత్రి జగదీష్ రెడ్డికి సోయి లేదు. పవర్ లేని పవర్ మంత్రి జగదీష్ రెడ్డి. రోడ్లు వేయాలని మంత్రికి సోయి లేదా?. ప్రజా సంక్షేమం పట్టని ప్రభుత్వం ఇది. ప్రగతి భవన్, కేసీఆర్ ఫాం హౌస్ చుట్టే రోడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (అదే బావి.. నాడు భర్త, నేడు భార్య) 'జగదీష్ రెడ్డి ఉరికించి కొడతా అంటోండు. ఎవరినికొడతావ్. టీఆర్ఎస్కి క్యాండిడేట్ని ప్రకటించే దమ్ము లేదు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను ఇరవై, ముప్పై లక్షలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు రెండు ఊర్లకు ఒక ఎమ్మెల్యే ఇంచార్జా. అవినీతి సొమ్ము, డబ్బు మూటలు తీసుకొచ్చి కొనుగోలు చేస్తారా' అని ప్రశ్నించారు. మీరెన్ని చేసినా ప్రజలు ధర్మాన్ని గెలిపిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. -
2న జింఖానా మైదానంలో ప్రపంచ శాంతి సభ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ శాంతి సభను నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ వెల్లడించారు. 2న సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. సికింద్రాబాద్‌లోని హరిహరకళా భవన్లో శాంతి సభ పోస్టర్‌ను ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... శాంతి సభలకు 25 పార్టీల్లో 19 పార్టీలు మద్దతు ప్రకటించి రానున్నారని ఆయన వెల్లడించారు. ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకు, ప్రపంచ శాంతి కోసం ఈ సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈ సభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నామని... ఆయన వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాకపోతే ప్రజలు, దేవుడి తీర్పుకు అంగీకరించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీలో ఉందని ప్రజా గాయకులు గద్దర్‌తో పాటు మరికొంత మంది పేర్లు పరిశీలిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 25న తన పుట్టిన రోజు సందర్భంగా 59 మంది మునుగోడు నియోజకవర్గ నిరుద్యోగులకు, అక్టోబర్ 2వ తేదీన సభకు వచ్చిన నిరుద్యోగుల్లో లాటరీ ద్వారా అమెరికాలో ఉద్యోగాల కోసం పాస్ పోర్టుతో పాటు వీసాను కూడా అందిస్తామని చెప్పారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... ప్రజలందరూ సమానంగా, సమాన హక్కులు పొందడం అనేది ప్రజాస్వామ్య దేశం లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే లౌకికవాదాన్ని పదికాలాలపాటు సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము ఈ శాంతి సభలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ క్రిష్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రవికుమార్, కన్వీనర్ జీ శ్యాం అబ్రహాం, వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, సంఘ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, బిషప్‌లు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఉప ఎన్నిక కోసమే ‘గిరిజన బంధు’) -
మునుగోడు ఎన్నికతో టీఆర్ఎస్ సైలెంట్! ఉనికేలేని బీజేపీకి ఇది ప్లస్?
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టదలచుకోలేదా? ప్రత్యర్థి పార్టీ కార్యకర్త చనిపోయినా తమకు అనుకూలంగా మలుచుకుంటుందా? ఖమ్మం జిల్లాలో అసలు కమలనాథుల వ్యూహం ఏంటి? తెలంగాణలో బీజేపీ ఉనికి లేని జిల్లా ఏదంటే ఖమ్మం అనే చెప్పాలి. ఈ జిల్లాలో కాషాయ సేనకు చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేరు. దీంతో ఇక్కడ కమలం పార్టీ పుంజుకోవడం సాధ్యం కావడంలేదు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అదేవిధంగా వామపక్షాలు, టీఆర్ఎస్ పార్టీల హవా కూడా నడుస్తోంది. వామపక్షాలకు సీట్లు లేకపోయినా ఓట్ బ్యాంక్, కేడర్ బలం అయితే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఒక్కొక్క సీటులో మాత్రమే విజయం సాధించింది. కాషాయ నేతల హడావుడి ఖమ్మం జిల్లాలో నాలుగో ప్లేస్‌లో ఉన్న కమలం పార్టీ పుంజుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అందుకే రాజకీయంగా రచ్చ జరిగిన ఏ ఘటనను వదిలిపెట్టడంలేదు. సొంత పార్టీ కార్యకర్త చనిపోతే ఎంత హడావుడి చేశారో.. టీఆర్ఎస్ కార్యకర్త హత్యకు గురైన సందర్భంలో కూడా అంతే హడావుడి చేస్తున్నారు కమలం పార్టీ నాయకులు. ఆగస్టు 15వ తేదీన ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై టీఆర్ఎస్ నాయకత్వం, ప్రభుత్వం స్పందించిన తీరుపై ఆ పార్టీ కేడర్లోనే అసంతృప్తి వెల్లడవుతోంది. ఇక్కడే బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఘటనలో టిఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని బీజేపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. అదే సమయంలో సొంత పార్టీ కార్యకర్త కృష్ణయ్య హత్యకు గురైతే అధికారంలో ఉండి కూడా టీఆర్ఎస్ సరిగా స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మునుగోడు కారణమని ప్రచారం ఇదే అంశాన్ని బీజేపీ రాష్ట్ర నేతలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ్మినేని కృష్ణయ్య హత్య ఘటనలో టిఆర్ఎస్ సైలెంట్ గా ఉండటానికి ప్రదాన కారణం మునుగోడు ఉప ఎన్నికనే అనే విషయాన్ని జనంలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కమలం నాయకులు. కృష్ణయ్య హత్యలో సీపీఎం నాయకుల పాత్ర ఉండటంతో.. కేసు నుంచి బయట పడటానికి మునుగోడులో టిఆర్ఎస్కు మద్దతు ప్రకటించిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది. కృష్ణయ్య హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కమలనాథులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే కేంద్ర మంత్రి బీఎల్ వర్మ స్వయంగా కృష్ణయ్య ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణయ్య హత్య విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర మంత్రి వర్మ వారికి మాటిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పరామర్శకు ప్లాన్ చేశారు. చనిపోయింది టీఆర్ఎస్ నాయకుడే అయినా మానవత్వంతో అయినా ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం! కొన్ని నెలల క్రితం ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఇష్యూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చల్లోకి వచ్చింది. టిఆర్ఎస్ నాయకులు, పోలీసుల వేధింపుల వల్లే తాను చనిపోతున్నానని ప్రకటించి సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మృతుని అమ్మమ్మ, చెల్లితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పడం, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు ముఖ్య నేతలు ఖమ్మం వచ్చి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేయడంతో.. కల్ గా బీజేపీకి కొంత మైలేజ్ వచ్చింది. ఈ ఘటన బీజేపీ కార్యకర్తల్లో ఎంతో మనో ధైర్యాన్ని నింపిందన్న అంశాన్ని గుర్తుచేస్తూ... కృష్ణయ్య హత్యను టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు లైట్ గా తీసుకుంటున్నారన్న చర్చ సైతం ఖమ్మం జిల్లాలో మొదలైంది. మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల ముఖ్యనేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. టిఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలకు గాలం వేస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో పాటు మరికొందరు నేతలను బీజేపీలోకి రప్పించుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రాజకీయ సమీకరణాలు మార్చేందుకు కమలం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడ్డాకే పార్టీ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. షెడ్యూల్ వెలువడేలోగా పార్టీపరంగా మునుగోడు నియోజకవర్గంలో జరిగే ప్రచార కార్యక్రమాలన్నింటిలోనూ కూసుకుంట్లకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆయనే పార్టీ అభ్యర్థి అనే సంకేతాలను కేడర్‌కు కేసీఆర్ పంపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్యతోపాటు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సైతం పాల్గొనడం గమనార్హం. మునుగోడు నియోజకవర్గంలో గ్రామాలవారీగా జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాల నివేదికలను విశ్లేషిస్తూ రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుతోపాటు ఇటీవల ప్రకటించిన గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆత్మీయ వన భోజనాల ద్వారా మండలాలవారీగా నియమితులైన పార్టీ ఇన్చార్జీలు కేడర్‌కు దగ్గర కావాలని సూచించారు. చేరికల ద్వారా పార్టీ బలోపేతం కావాలని, పాత, కొత్త కేడర్‌ను సమన్వయం చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
మునుగోడు ఉప ఎన్నిక.. వ్యూహం మార్చిన కాంగ్రెస్
సాక్షి, నల్లగొండ: మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించిన తరువాత పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ముఖ్య నేతలంతా మండలాల్లో పర్యటిస్తుండడంతో కాంగ్రెస్ క్యాడర్లో కదలిక మొదలైంది. ఈ దూకుడును పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్‌గా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని నియమించింది. ఆ బాధ్యతల నుంచి మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ను తప్పించింది. అన్నింటికంటే ముందుగానే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వెంటనే అన్ని పార్టీల కంటే ముందే చండూరులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తరువాత కొద్దిరోజులకు గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టినా తరువాత మిన్నకుండిపోయింది. టికెట్ విషయంలో ఆశావహుల నుంచి పోటీ పెరగడంతో వారితో చర్చించింది. ఎవరికి టికెట్ ఇచ్చినా అంతా కలిసి పని చేసేలా, అభ్యర్థి గెలుపునకు కృషి చేసేలా ఒప్పించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసింది. ఆ తరువాతే పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అన్ని మండలాలకు రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన నారాయణపూర్ మండలం ఇన్ఛార్జిగా ఉండగా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు వంటి నేతలు మండలాల ఇన్‌చార్జీలుగానే కాకుండా, ఇతర మండలాల్లోనూ పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎత్తుగడలను ముఖ నేతలకు చెబుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో కేడర్‌లో కదలిక వచ్చింది. చదవండి: గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన పూర్తి స్థాయిలో ఉండేందుకే దామోదర్‌రెడ్డికి బాధ్యతలు నవంబరు లేదా డిసెంబరులో ఉప ఎన్నికలు ఉండనున్న నేపథ్యంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్‌ను అధిష్టానం మార్చింది. ఈ మార్పును రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ప్రకటించారు. ఇప్పటివరకు కమిటీకి కన్వీనర్‌గా ఉన్న మధుయాస్కీ గౌడ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని నియమించింది. దీంతో ఆయన స్థానికంగా ఉండి పూర్తి స్థాయిలో దృష్టి సారించి పని చేసేలా ఈ మార్పు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబరు 24వ తేదీన రాష్ట్రంలో ప్రారంభం కానుంది. అప్పటికి మునుగోడులో ఎన్నికల జోరు పెరగనుంది. ఆ సమయంలో మధుయాస్కీగౌడ్ రాహుల్ యాత్రకు సంబంధించిన వ్యవహారాల్లో ఉంటే మునుగోడులో కార్యక్రమాలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆయన్ని తప్పించినట్లు తెలిసింది. -
అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. తెలంగాణ కాంగ్రెస్ సీన్ నుంచి అవుట్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్రహోం మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిస్థితిపై ఆరా తీశారు. గతంలో ఇచ్చిన కార్యక్రమాల పీడ్ బ్యాక్ అడిగి తెలుసుకున్న షా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటానని తెలంగాణ నేతలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీన్ నుంచి అవుట్ అయిందంటూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎప్పుడైనా ఒకటవుతాయని దీనిని ప్రజలకు మరింత అర్థమయ్యేలా చేయాలని అన్నారు. చదవండి: (అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డొచ్చిన టీఆర్ఎస్ నేత కారు.. అద్దం పగులగొట్టి..) -
Congress: స్రవంతికే మునుగోడు టికెట్.. తెర వెనుక జరిగిందిదే!
మునుగోడు కాంగ్రెస్ టిక్కెట్ పాల్వాయి స్రవంతికి ఇవ్వడం వెనుక ఏం జరిగింది? టిక్కెట్ ఆశించిన ఆ ముగ్గురు పార్టీ కోసం పనిచేస్తారా? అభ్యర్థికి పార్టీ ఆర్దిక వనరులు సమకూరుస్తుందా? స్రవంతికి టిక్కెట్ ఇప్పించేందుకు హైకమాండ్‌కు సీనియర్లు ఏం చెప్పారు? అసలు మునుగోడు టిక్కెట్ విషయంలో టీ కాంగ్రెస్ లో ఏం జరిగింది? కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేసింది. అయితే స్రవంతికి టికెట్ ఇవ్వడం వెనక చాలా తతంగమే నడిచిందంటున్నారు పార్టీలోని కొందరు నేతలు. మొదటి నుంచి పాల్వాయి స్రవంతి, చెల్లమల్ల కృష్ణారెడ్డి టికెట్ విషయంలో తీవ్రంగా పోటీపడ్డారు. కృష్ణారెడ్డికే టిక్కెట్ కన్ఫార్మ్ అయినట్లుగా ప్రచారం కూడా జరిగింది. ఉప ఎన్నిక అంటే అంత ఈజీ కాదు.. మునుగోడు ఎన్నికల్లో నిలబడాలంటే 50 నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వీక్‌గా ఉన్న స్రవంతికి టిక్కెట్ ఇస్తే ఉపయోగం లేదని, ఆర్దికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డికి ఇస్తే పార్టీకి ఉపయోగం ఉంటుందని కొందరు సలహా ఇచ్చారు. అయితే టికెట్ విషయంలో నల్లగొండ జిల్లా సీనియర్ నేతలంతా ఏకమయ్యారు. హైకమాండ్ దగ్గర తమ పలుకుబడిని ఉపయోగించారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి వంటి సీనియర్లంతా పాల్వాయి స్రవంతికే టిక్కెట్ ఇవ్వాలని తెగేసి చెప్పారట. ఒక వేళ డబ్బే ఎన్నికల్లో ప్రధానం అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ను ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాదని కూడా వారు స్పష్టం చేసినట్లు సమాచారం. దీనికి తోడు దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసురాలిగా , మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న స్రవంతిని కాదని కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే భవిష్యత్‌లో పార్టీ కోసం ఎవరూ పనిచేయరని సీనియర్ నేతలు అధిష్టానానికి విస్పష్టంగా చెప్పినట్లు సమాచారం. దీంతో అన్నీ ఆలోచించిన అధిష్టానం పాల్వాయి స్రవంతి పేరునే ఖరారు చేసిందట. చదవండి: (కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు) జిల్లాకు చెందిన సీనియర్ నేతల సూచన మేరకే.. టిక్కెట్ అయితే అనౌన్స్ చేసారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. టిక్కెట్ ఆశించిన మిగతా ముగ్గురు నేతలు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తారా అనే సందేహం ఇప్పుడు మిగతా నేతల్ని తొలిచేస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిసిన కృష్ణారెడ్డి పార్టీ కోసం పనిచేస్తానని చెప్పినా గ్రౌండ్లోలో పనిచేస్తారో లేదో చూడాలి. ఇంకో వైపు కృష్ణారెడ్డి, పల్లెరవి, కైలాష్ నేతలతో పీసీసీ, సీఎల్పీ నేతలు గాంధీ భవన్‌కు పిలిపించుకుని బుజ్జగించారు. అయినప్పటికీ ఏ మేరకు వీరు ముగ్గురు పాల్వాయి స్రవంతి కోసం పనిచేస్తారో చూడాలి. మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖర్చుతో కూడుకున్నదని ఇప్పటికే పార్టీలో చర్చ జరుగుతోంది. టిఆర్ఎస్, బీజేపీలు పెట్టే ఖర్చులో సగం అయినా కాంగ్రెస్ పార్టీ పెట్టాలని.. లేదంటే పోటీలో ఉండటం కష్టమనే అభిప్రాయం గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పాల్వాయి స్రవంతికి లోకల్‌గా కొంత పట్టున్నా ఆర్థికంగా బలహీనంగా ఉందని పార్టీ నేతలే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్రవంతికి పార్టీ తరపున ఆర్థిక వనరులు సమకూర్చాలని సునీల్ కనుగోలు సూచించినట్లు తెలుస్తోంది. పీసీసీ ఛీఫ్‌తో పాటు సీఎల్పీ, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. పాల్వాయి స్రవంతికి టికెట్ ఇప్పించడంలో సీనియర్లు పంతం నెగ్గించుకున్నారు. మరోవైపు స్రవంతికి టికెట్ ఇవ్వడం ద్వారా తొలినుంచీ కాంగ్రెస్‌లో ఉన్న వారికి ప్రాధాన్యత లభిస్తుందనే నమ్మకాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ లలో కల్పించిందనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
టార్గెట్.. 76 వేల ఓట్లు
చౌటుప్పల్ రూరల్: ‘మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు 90 రోజులకుపైగా సమయం ఉంది. రెండు బూత్‌లకో ఇన్చార్జిని, పది బూత్‌లకో క్లస్టర్ ఇన్చార్జిని, మండలానికో టీపీసీసీ నేతను పెట్టాం. వచ్చే వారం రోజుల్లో గ్రామాలవారీగా తిరగాలి. 25 మంది సభ్యులతో బూత్ కమిటీని వేయాలి. అందులోంచి ఇద్దరు యువకులను గుర్తించాలి. వారి సాయంతో ఓటరు లిస్టు ఆధారంగా కాంగ్రెస్ కుటుంబాలను గుర్తించాలి. కనీసంగా బూత్‌కు 254 ఓట్లను సాధించాలి. ఈ లెక్కన మునుగోడులో మొత్తంగా 76 వేల ఓట్లువస్తే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది’అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో మంగళవారం టీపీసీసీ సమీక్షా సమావేశం జరిగింది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావేద్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జె.గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ్మ, సంపత్‌కుమార్, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, అంజన్‌కుమార్‌యాదవ్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, పాల్వాయి స్రవంతితో పాటు 107మంది బూత్ ఇన్చార్జిలతో ఉప ఎన్నికపై సమీక్షించారు. కాంగ్రెస్ ఓటర్లను గుర్తించాలి.. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఉప ఎన్నికలకు 22 రోజుల గడువు మాత్రమే ఉండే. అక్కడ కూడా ఇలాగే పనిచేసినం. 26వేల ఓట్లు వచ్చాయి. కానీ, ఆరు బూతుల్లోనే మెజారిటీ ఓట్లు సాధించినం. ఆ బూత్ ఇన్చార్జులకు తగిన గుర్తింపునిచ్చాం, పార్టీ పదువులిచ్చినం. మునుగోడులోనూ పనిచేసిన వారికి గుర్తింపునిస్తాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌కు 76వేల ఓట్లు వచ్చాయి. బూత్‌కు కనీసంగా 254 ఓట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ నెల 18 నుంచి బూత్ ఇన్‌చార్జులంతా కార్యక్షేత్రంలోకి దిగాలి. బూత్‌లవారీగా కాంగ్రెస్ ఓటర్లను గుర్తించాలి. వారం రోజుల్లోగా ఇదంతా పూర్తి చేయాలి. ఈ నెల 25న మరోసారి మండలాల వారీగా సమీక్షిస్తాం. కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించి వెళ్లిపోయిన రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ది చెప్పాలి. రాష్ట్రంలో 13రోజుల పాటు సాగే రాహుల్‌గాంధీ జోడో యాత్రను విజయవంతం చేయాలి’అని ఠాగూర్ కోరారు. సమావేశంలో ఇంకా టీపీసీసీ నాయకులు విజయరమణారావు, గండ్ర సత్యనారాయణ, అనిల్‌కుమార్, ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేమొస్తే టీఎస్ బదులు టీజీ!
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సంచలన కార్యాచరణను రూపొందించింది. ఇందుకోసం సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించింది. పార్టీ ముఖ్య నేతలు, గత ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హాజరై సెప్టెంబర్ 17, మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రపై చర్చించారు. అనంతరం పలు కీలక తీర్మానాలను చేశారు. ఈ తీర్మానాల వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. అబద్ధాల వాట్సాప్ ఫ్యాక్టరీలు ఓవర్‌టైం పనిచేస్తున్నాయి సెప్టెంబర్ 17కు ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉందని, కానీ చరిత్రను కనుమరుగు చేసే విధంగా టీఆర్ఎస్, బీజేపీల అబద్ధాల వాట్సాప్ ఫ్యాక్టరీలు ఓవర్‌టైం పనిచేస్తూ తమను భాగస్వాములుగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కానీ, హైదరాబాద్ స్వాతంత్య్ర ఉద్యమంలో కానీ బీజేపీ, దాని మూలాలున్న ఏ సంస్థ కూడా పాల్గొనలేదని అన్నారు. కానీ వాళ్లే తెచ్చినట్టుగా ప్రజలకు భ్రమలు కల్పించేందుకు రెండు పార్టీలు పోరాడుతున్నాయని చెప్పారు. వాస్తవానికి ఆ డీఎన్ఏ తమదని, 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించే హక్కు, అధికారం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, తమ తర్వాత కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని చెప్పారు. మునుగోడులో కలిసికట్టుగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అన్ని స్థాయిల్లోని నాయకులు కలిసికట్టుగా పనిచేస్తారని రేవంత్ చెప్పారు. ఇందుకోసం మంగళవారం చౌటుప్పల్‌లో ఇన్చార్జులందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ హాజరవుతారని తెలిపారు. నాలుగు చోట్ల బహిరంగ సభలు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర విజయవంతం కోసం త్వరలోనే అందరితో మాట్లాడి కమిటీలను నియమిస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రవేశించి మహారాష్ట్రకు వెళ్లేంతవరకు రాహుల్ యాత్రలో అందరినీ భాగస్వాములను చేసా్తమని అన్నారు. కాగా రాహుల్‌యాత్ర సమయంలో మహబూబ్‌నగర్, శంషాబాద్, జోగిపేటల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ తీర్మానాలివే.. ►సెప్టెంబర్ 17, 2022 నుంచి సెప్టెంబర్ 17, 2023 వరకు ఏడాది పొడవునా తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణ ►తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీజీ అని రాసుకుని ఉద్యమాలు చేస్తే టీఆర్ఎస్ కుట్రతో, వారి పార్టీకి అనుసంధానించేలా తెరపైకి తెచ్చిన టీఎస్ (టీఆర్ఎస్లో ఆర్‌ను సైలెంట్ చేసి)ను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. టీఎస్‌ను టీజీగా మార్చాలి. అధికారంలోకి వచ్చాక పాలన మొత్తాన్ని టీజీ పేరుతో నిర్వహించాలి. ►అందెశ్రీ అందించిన అద్భుతమైన ‘జయ జయహే తెలంగాణ’ పాటను అధికారిక రాష్ట్ర గీతంగా మార్చాలి. దొరల తల్లి స్థానంలో.. ►ప్రస్తుతమున్న తెలంగాణ తల్లి దొరల తల్లి. దొరసానిగా భుజకీర్తులు, కిరీటాలున్న ఈ తల్లిని తిరస్కరించాలి. టీఆర్ఎస్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లిని తిరస్కరిస్తూ సబ్బండ వర్గాల తల్లిగా కనిపించే విధంగా తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఆవిష్కరించాలి. కడుపులో పెట్టుకుని కాపాడుకునే తెలంగాణ తల్లిని తెలంగాణ సమాజానికి సెప్టెంబర్ 17 నుంచి అంకితం చేయాలి. ►సెప్టెంబర్ 17 పురస్కరించుకుని జాతీయ జెండాతో పాటు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా తెలంగాణ జెండా రూపొందించాలి. ప్రతి గ్రామంలో జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండా ఎగురవేయాలి. -
తెలంగాణ: ఆ ఏడు మండలాల్లో నాటు కోళ్ళు గాయబ్
అక్కడి వూళ్ళలో కోళ్ళు మాయం అవుతున్నాయి. మాయం అవుతున్నాయంటే వూళ్ళలో దొంగలేమీ పడి ఎత్తుకుపోలేదు. పోనీ ఏ రోగమో వచ్చి నాటు కోళ్ళన్నీ చనిపోలేదు. కానీ, ఏడు మండలాల్లో నాటు కోళ్ళు కనిపించడంలేదంట. ఎందుకిలా జరిగింది. ఇంతకీ ఆ వూళ్ళు ఎక్కడున్నాయి? పల్లెటూళ్ళలో నాటు కోళ్ళకు గిరాకీ ఎక్కువ. చాలా మంది ఇళ్ళలో పెంచుకుంటారు. బ్రాయిలర్ కోళ్ళు తిని విసుగు చెందినవారు కచ్చితంగా నాటు కోడిని తినాలనుకుంటారు. ఎంత రేటు పెట్టైనా కొనాలనుకుంటారు. సహజసిద్ధంగా పెరిగే నాటుకోడిలో పోషకాలు కూడా ఎక్కువే ఉంటాయి. కానీ ఇప్పుడు అదే నాటుకోడి ఉన్నట్లుండి నెల రోజుల్లోనే ఓ ప్రాంతం నుంచి కనిపించకుండా పోయింది. దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు ఇలా జరిగింది? అక్కడేమన్నా కోళ్లకు రోగాలు వచ్చాయా అంటే అదేం లేదు. అక్కడ ఉప ఎన్నిక వస్తోంది. అదేంటి ఉప ఎన్నిక వస్తే నాటు కోళ్లు మాయం కావడం ఏంటనుకుంటున్నారా? విషయం అంతా అక్కడే ఉంది మరి.. నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కడ చూసినా ఎనికల వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నికల తేదీ అయితే రాలేదు గాని ..మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ప్రచారానికి వచ్చే పార్టీల కార్యకర్తలు, నేతలు, జనాలకు మందు, విందు ఏర్పాటు చేస్తున్నాయి పార్టీలు. విందులో బ్రాయిలర్ కోళ్ళ కంటే నాటు కోళ్ళకే మక్కువ చూపిస్తున్నారట. అందుకే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నాటు కోళ్ళన్నీ అక్కడికొచ్చేవారికి ఆహారంగా మారిపోతున్నాయి. ఇప్పుడక్కడ నాటు కోళ్ళ కోసం దుర్భిణీ వేసి వెతికినా కనిపించడంలేదంటున్నారు. ఎక్కడైనా కనిపించినా..దాని ధర బంగారం స్థాయికి చేరిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో మటన్‌కు కూడా విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇంతకు ముందుకు గొర్రెలు, మేకలు విరివిగా దొరికేవి. వాటి రేట్లు కూడా అంతో ఇంతో అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి కూడా డిమాండ్ పెరిగి మటన్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రచార సభలు నిర్వహించే రాజకీయ పార్టీల నేతలకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. మీటింగులకు వచ్చేవారికి నాన్ వెజ్ భోజనం పెట్టకపోతే వారు నారాజ్ అవుతున్నారట. ఒకవేళ ముక్క భోజనం పెట్టకపోతే మనసులో పెట్టుకుని ఎక్కడ ఓటు వేయరోనన్న ఆందోళన కూడా నేతల్లో కనిపిస్తోందట.. మొత్తానికి మునుగోడులో మటన్ ముక్కతో పాటు నాటుకోడికి కూడా తిప్పలొచ్చాయి. ఉప ఎన్నిక ఏమో గాని మాకు నాటు కోళ్ళు దొరకడంలేదని మునుగోడు నియోజకర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బీసీలకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ పెడతా: జాజుల
మునుగోడు: త్వరలో జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే రానున్న 2023 ఎన్నికల ముందు బీసీల పార్టీ పెడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన బీసీల ఆత్మీయ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో 67 శాతం బీసీ ఓటర్లు, మరో 30 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్నారని, అందువల్ల బడుగు బలహీన వర్గాలకు టికెట్ కేటాయించాలని సీఎం కేసీఆర్‌తో పాటు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖలు రాశానని తెలిపారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీలకు టికెట్ ఇస్తే గెలవరని చెబుతున్నారని, మంత్రి పదవులు చేసిన అభ్యర్థులను ఓడించిన చరిత్ర బీసీలకు ఉందని జాజుల గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆంధ్రాకు చెందిన నెల్లూరు ఆడబిడ్డకు ఎలా ఇస్తారని, దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవలా తయారైందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బీసీల పార్టీ పెట్టి తాను మునుగోడు నుంచి బరిలో నిలిచి తమ సత్తా చాటుతామని చెప్పారు. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు బీసీల హక్కుల సాధన కోసం, ఆత్మగౌరం కోసం పోరాడుతానని జాజుల వెల్లడించారు. అందుకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలు కావాలని ఆయన కోరారు. -
Hyderabad: పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డితో రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి, స్థానిక నేత చెలమల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని అధిష్టానం ప్రకటించడంతో అసంతృప్తికి గురైన కృష్ణారెడ్డిని పార్టీకి అండగా ఉండాలంటూ రేవంత్‌రెడ్డి నచ్చజెప్పారు. ఉప ఎన్నికలో కలిసి పనిచేయాలని కోరారు. ఇదిలా ఉంటే, ఇవాళ సాయంత్రం గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ జరగనుంది. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నారు. మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి, టికెట్ ఆశించి భంగపడ్డ చెలమల కృష్ణారెడ్డి, పల్లెరవి, కైలాష్ నేతలను భేటికి ఆహ్వానించారు. టికెట్ రాని ముగ్గురు నేతలకు టీపీసీసీ పెద్దలు నచ్చజెప్పనున్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మధుయాష్కీ, ఇతర ముఖ్య నేతలు హాజరవుతారు. చదవండి: (ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం) -
ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం
సాక్షి, యాదాద్రి: హుజూరాబాద్ మాదిరిగా, మునుగోడులోనూ టీఆర్ఎస్ నేతలు డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. దొడ్డిదారిలో గెలవాలని ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హుజరాబాద్లో ఏ తీర్పు వచ్చిందో మునుగోడులో అదే తీర్పు రిపీట్ అవుతుందని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్‌కు ఉపఎన్నిక వస్తేనే ప్రజలు, కార్యకర్తలు గుర్తుకొస్తారని అన్నారు. మునుగోడు ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు. కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ఆరంభమవుతుందని హెచ్చరించారు. చదవండి: (జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్) -
పక్కా ప్లాన్‌తోనే! అభ్యర్థిగా స్రవంతి ఖరారు వెనుక కాంగ్రెస్ పెద్ద స్కెచ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడుపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీఆర్ఎస్, బీజేపీల కంటే ముందే పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతి పేరును అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక అనేక కారణాలున్నాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్నా కైలాశ్ నేతలు కూడా టికెట్ ఆశించినప్పటికీ స్రవంతిని ఖరారు చేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం పెద్ద స్కెచ్చే వేసిందని అంటున్నారు. ప్రత్యర్థులకు షాక్..! మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనలో వ్యూహాన్ని మార్చింది. ముందు నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ మొదట్లోనే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కానీ టీఆర్ఎస్, బీజేపీలు భారీ బహిరంగ సభలు నిర్వహించి కూడా తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో వేచి చూద్దామనే ధోరణిని ప్రదర్శించింది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం ఇలాంటి సంకేతాలనే ఇచ్చారు. కానీ ఉన్నట్టుండి పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటిస్తూ శుక్రవారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మునుగోడు బరిలో ప్రత్యర్థులకు షాక్ ఇచ్చే వ్యూహంతోనే అనూహ్యంగా అభ్యర్థి పేరు వెల్లడించిందని అంటున్నారు. ప్రచారంలో వెనుకబడకుండా.. ప్రచారంలో వెనుకబడకుండా ఉండటం, నియోజకవర్గంలోని కేడర్‌ను ముందుండి నడిపే సారథిని చూపించడం, అభ్యర్థిని త్వరగా ప్రకటించాలంటు న్న ఆశావహులు, స్థానిక కేడర్ ఒత్తిళ్లు.. ఇవన్నీ దృష్టి లో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ముందే అభ్యర్థిని ప్రకటించినట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు అధి కారికంగా అభ్యర్థులను ప్రకటించకపోయినా ప్రచారంలో దూసుకెళుతున్నాయి. కానీ కాంగ్రెస్ మా త్రం ప్రజాక్షేత్రంలో పెద్దగా సత్తా చూపించలేకపోతోంద నే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమైంది. మరో వై పు నేతలు పార్టీని వీడి వెళ్లిపోతుండటం, అయినా వారితో కనీసం మాట్లాడేవారు లేకపోవడం, హైదరాబాద్ నుంచి వచ్చే రాష్ట్ర స్థాయి నాయకులు అడపాదడపా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అ వుతుండడంతో పరిస్థితి చేయి జారుతోందనే అభిప్రాయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్రవంతివైపే మొగ్గు అభ్యర్థి విషయంలో జరిపిన అభిప్రాయసేకరణలో ఎక్కువ మంది స్రవంతి పేరు సూచించినట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేతల్లో కొంత అభిప్రాయ భేదాలున్నప్పటికీ స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన సన్నిహితులు కొందరు చల్లమల్ల కృష్ణారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారనే చర్చ జరిగినా, చివరకు రేవంత్ టీం కూడా పూర్తి అధికారాలు అధిష్టానానికే అప్పగించింది. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇటీవల ప్రియాంకాగాంధీని కలిసిన సమయంలో స్రవంతి పేరునే సూచించినట్టు తెలిసింది. వెంకట్‌రెడ్డి కూడా సిఫారసు చేయడం, ప్రచారంలో వెనుకబడిపోతున్నామనే భావన నేపథ్యంలో.. ఇప్పుడే ప్రకటించడం మేలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులో మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందనే వార్తలు కూడా వస్తుండటంతో.. రెండు ప్రధాన పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. -
గటు దిక్కు బోవద్దు గన్పతీ!
కైలాసం. శంకరుడు కండ్లు మూస్కోని తపస్సు జేస్తున్నడు. పార్వతి వొంట జేస్తున్నది. అదువరదాక ఎల్కలతోని దాగుడు మూతలాడుకొన్న గన్పతి గామె తాన్కి వొచ్చిండు. ‘‘అమ్మా’’ అని బిల్సిండు. ‘‘ఏంది బిడ్డా! ఆకలైతున్నదా? ఏమన్న బెట్టాల్నా?’’ అని పార్వతి అడిగింది. ‘‘ఏమొద్దమ్మా! చవ్తి పండ్గ దినాలు గదా. ఒకసారి పట్నం బోయొస్తనే.’’ ‘‘యాడికి బోవొద్దురా కొడ్కా! వొద్దు వొద్దంటె పోయిన యాడాది పట్నం బోయినవు. ఇగొస్తడు, అగొస్తడనుకుంట ఎంతగనం ఎందురుజూసినా నువ్వు రాలేదు. మేమంత పరేశానైతిమి. లెంకంగ లెంకంగ ఆకర్కి మూతదెర్సిన మ్యాన్హోల్ల బడ్డ నువ్వు గండ్లబడ్డవు.’’ ‘‘గీపారి గట్లగాదమ్మా.’’ ‘‘గిప్పుడు వానకాలం నడుస్తున్నది. వాన బడ్డదా అంటె పట్నం తొవ్వలల్ల యాడ ఏమున్నదో ఎర్కగాదు.’’ ‘‘వాన కాలం నడుస్తున్నా దినాం వానగొట్టదమ్మా!’’ ‘‘ఎంత జెప్పినా ఇనవైతివి. పోయిరా! జెర పైలం.’’ గన్పతి కైలాసంలకెల్లి ఎల్లిండు. మెల్లగ మబ్బుల పంటి నడ్సుకుంట పట్నం దిక్కు రాబట్టిండు. నడ్మల పట్నంకెల్లి వైకుంటం బోతున్న నారదుడు గాయినకు ఎదురొచ్చిండు. ‘‘నారాయణ, నారాయణ, యాడ్‌కి బోతున్నవు గన్పతీ’’ అని నారదుడడిగిండు. ‘‘పట్నం బోతున్న. గాడ పతొక్క వాడ కట్టుల నా బొమ్మలు బెడ్తరు. గవన్ని ఒక్క తీర్గనే ఉండయి. తీరు తీర్లుంటయి. గంతేగాకుంట ఉండ్రాల్లు, పండ్లు, బచ్చాలు, పాసెం, పులిగొర అసుంటియి నాకు బెడ్తరు.’’ ‘‘తప్పి జారి గవి దినేవు!’’ ‘‘ఎందుకు దినొద్దు?’’ ‘‘ఎవలు జేసినయి ఎట్లుంటయో! మొన్న బాసర ఐఐటీ పోరగాల్లు హాస్టల్ల తిన్నంక కడ్పునొస్తున్నదని మొత్తుకున్నరు. కొంతమంది దవకాన్ల షరీకయ్యిండ్రు. పదేండ్ల కిందట రౌతుల్లెక్క ఉన్న ఉండ్రాల్లు దింటుంటె నీ రొండు దంతాలల్ల ఒకటిర్గలేదా? గదంత యాదిమర్సినవా? గింత జెప్పినా తినకుంటె బేచైనైత దనుకుంటే నీ ఇష్టం.’’ ‘‘నువ్వు గింతగనం జెప్పినంక ఎందుకు తింట నారదా?’’ ‘‘పట్నం బోతె బోయినవు గని తప్పి జారి మునుగోడు బోకు గన్పతీ.’’ ‘‘ఎందుకు బోవద్దు నారదా!’’ ‘‘గాడ్కి బోతివా అంటె కాంగ్రెస్ వినాయకునివా అని ఒకడు అడ్గుతడు. బీజేపీ వినాకునివా అని ఒకడు అడ్గితె, టీఆర్ఎస్ వినాయకునివా అని ఇంకొకడు అడ్గుతడు.’’ ‘‘చాక్ పీస్‌ల గన్పతి, గవ్వల గన్పతి, ముత్యాల గన్పతి అసువంటి తీరు తీర్ల గన్పతులను జూసిన. నువ్వు జెప్పిన గన్పతులేంది నారదా?’’ ‘‘మునుగోడుల బైఎలచ్చన్లొచ్చినై. మూడు పార్టీలు పైసలిచ్చి గన్పతులు బెట్టిపిచ్చినయి. కాంగ్రెస్ వినాయకుడు చెయ్యి సూబెడ్తడు. టీఆర్ఎస్ వినాయకుడు మోటర్ల గూసుంటె, బీజేపీ వినాయకుడు తామరపువ్వులుంటడు.’’ ‘‘మునుగోడుల బై ఎలచ్చన్లు ఎందుకొచ్చినయి నారదా?’’ ‘‘రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేసిండు. కాంగ్రెస్లకెల్లి బీజేపీలకు దుంకిండు.’’ ‘‘గాయిన రాజినామ ఎందుకు జేసిండు.’’ ‘‘అడిగితె నియోజక వర్గం అభివృద్ధి కోసమన్నడు.’’ ‘‘గాయిన జెప్పిన దాంట్ల నిజమేమన్న ఉన్నదా?’’ ‘‘ఉన్నది. ఎట్లంటవా ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేస్తే హుజూర్నగర్ల బై ఎలచ్చన్లు అయినయి. గప్పుడు టీఆర్ఎస్ సర్కార్ ఒక్క గా నియోజక వర్గంలనే గొర్లను పంచింది. కొత్తగ దలిత బందు పద్కం బెట్టి ఒకొక్క దలిత కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇచ్చింది.’’ ‘‘మునుగోడుల గుడ్క గట్లే జేస్తదా?’’ ‘‘చేస్తది. మా వూరుకు తొవ్వ లేదు. తొవ్వ ఏపిచ్చినోల్లకే ఓట్లేస్తం అని ఏ వూరోల్లన్న అంటే టీఆర్ఎస్ సర్కార్ తొవ్వ ఏపిస్తది. సూసిండ్రా నేను ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జెయ్యబట్కె మీ వూరికి తొవ్వ వొచ్చిందని రాజగోపాల్ రెడ్డి అంటడు.’’ ‘‘బై ఎలచ్చన్ల కర్సంత జెనం నెత్తిమీదనే బడ్తది గదా.’’ ‘‘అవ్. కొత్త పన్నులేస్తరు. మునుగోడుల కొత్త దుక్నాలు బడ్డయి. గవ్విట్ల సర్పంచులను, గల్లి లీడర్లను అమ్ముతున్నరు. పది వేల రూపాయల వొంతున ఓట్లు గొనెతందుకు పార్టీలు రడీగున్నయి.’’ ‘‘వామ్మో!’’ ‘‘యాడాది కొక్కపారి చవ్తి పండ్గొస్తది. గదే తీర్గ అయిదేండ్ల కొక్కపారి, ఒక్కోపారి అంతకన్న ముందుగాలే ఓట్ల పండ్గొస్తది. ‘జై గణేశ, జై గణేశ, జై గణేశ దేవా’ అన్కుంట జెనం నీకు పూజలు జేస్తరు. ఉండ్రాల్లు బెడ్తరు. మీరే మా దేవుల్లనుకుంట లీడర్లు జెనాలకు బిర్యాని బెడ్తరు. మందు తాపిస్తరు. తొమ్మిది దినాలైనంక నిన్ను నీల్లల్ల ముంచుతరు. ఎమ్మెల్యే కుర్సిలు దొర్కినంక లీడర్లు దినాం జెనాలను నిండ ముంచుతరు’’ అని నారదుడు అన్నడు. ‘‘నువ్వు గిదంత జెప్పినంక నాకు పట్నం పోబుద్ది అయితలేదు నారదా!’’ అన్కుంట గన్పతి కైలాసం దిక్కు బోయిండు. ‘‘నారాయణ, నారాయణ’’ అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి
-
నాటు కోళ్ళు మాయం..
-
జగదీశ్వర్‌రెడ్డి అందరినీ కలుపుకొనిపోవడం లేదు
మునుగోడు: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక విషయంలో జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నాయకులందరినీ కలుపుకొనిపోవడంలేదని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పక్క నియోజకవర్గాల నాయకులను పిలిపించుకొని నెలరోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. వీటి సమాచారాన్ని మాకు ఇవ్వడంలేదు. ఎందుకు అలా చేస్తున్నారో మంత్రి సమాధానం చెప్పాలి’అని అన్నారు. నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం బలంగా ఉందని, అందుకే టీఆర్ఎస్ పార్టీలో ఎంతోకాలంగా పనిచేస్తున్న బీసీ నాయకులం ఈ ఉపఎన్నికలో బీసీలకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తే బాగుండని భావిస్తున్నామన్నారు. అది సీఎం కేసీఆర్ నిర్ణయమని, తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ కోసం, మునుగోడు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పేరును ఇప్పట్లో ప్రకటించరని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాతే సీఎం కేసీఆర్ వెల్లడిస్తారని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికతోనే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని, అందువల్ల అందరం ఐక్యంగా పనిచేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 33 మహిళా కళాశాలల్లో ఒకదానిని మునుగోడులో ఏర్పాటు చేయాలని నర్సయ్యగౌడ్ కోరారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ చలువతోనే ఈ నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయించామని, రానున్న రోజుల్లో రీజినల్ రింగ్‌రోడ్డు కూడా మునుగోడు నుంచి వెళ్తుందని, దీంతో ఊహించని రీతిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. -
మునుగోడు ఎన్నిక: వాళ్లంతా బిజీబిజీ.. రూ.25 లక్షల వరకు ప్యాకేజీ!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు వస్తున్నాయంటే సర్వేలు నిర్వహించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా సర్వేలు నిర్వహించి పార్టీల బలాబలాలు అంచనా వేసి చెబుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పార్టీలు, వ్యక్తులు కూడా సర్వేలు జరిపిస్తుంటారు. తమతో పాటు ప్రత్యర్థుల బలాబలాలు తెలుసుకునేందుకు, ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ఈ విధమైన సర్వేలు నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా నియమించుకున్న సిబ్బందితో ఈ విధమైన సర్వేలు జరిపిస్తుంటారు. సర్వేల ఫలితాలను బట్టి, వ్యూహాలను మార్చడం, అవసరమైన కార్యాచరణ చేపట్టడం వంటి చర్యలు పార్టీలు చేపడ తాయి. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక తెరపైకి రావడంతో.. పదుల సంఖ్యలో సంస్థలు, యూట్యూబ్ చానళ్లు సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌లో నిమగ్నమయ్యాయి. సంస్థను బట్టి ప్యాకేజీ... ప్రస్తుతం మార్కెట్లో పదుల సంఖ్యలో సర్వే సంస్థలున్నా యి. వీటిల్లో కొన్ని మునుగోడులో రంగంలోకి దిగాయి. పార్టీలు, అభ్యర్థుల బలాలను అంచనా వేసే పనిలో ఉన్నా యి. ఈ సర్వేలు పూర్తయిన తర్వాత ఆయా సంస్థలు సదరు పార్టీకి లేదా అభ్య ర్థికి సర్వేల్లో వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి వివరాలను నివేదిక రూపంలో సమర్పిస్తాయి. ఇందుకు గాను ఒక్కో సర్వే సంస్థ తమకున్న విశ్వసనీయత ను బట్టి సంబంధిత పార్టీ, అభ్యర్థుల నుంచి ప్యాకేజీ తీసు కుంటున్నాయి. మూడు, నాలుగు ఎన్నికల్లో పనిచేయడంతో పాటు ఆయా ఎన్నికల్లో సర్వే సంస్థ అంచనాలు నిజమైన పక్షంలో సదరు సర్వే సంస్థకు విశ్వసనీయత పెరుగుతుంది. రూ.5 లక్షల నుంచి మొదలు... రాష్ట్రంలో ఉన్న ఓ ఎనిమిది సర్వే సంస్థలు మునుగోడు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి. వీటిలో నాలుగు సంస్థలు బీజేపీకి పనిచేస్తుండగా, ఒకటి కాంగ్రెస్‌కు, మరో మూడు టీఆర్ఎస్కు పనిచేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సంస్థలు మునుగోడులోని అన్ని వర్గాలు, అన్ని వయస్సుల వారి నుంచి కులాలు, మతాల వారీగా అభిప్రాయాలను తీసుకుంటున్నాయి. మునుగోడులో 2.18 లక్షల మంది ఓటర్లున్నారు. సర్వే సంస్థలు ఇందులో 1 శాతం లేదా 2 శాతం జనాభాను శాంపిల్ కింద తీసుకొని అభిప్రాయాలను సేకరిస్తాయి. ప్రజలను గుచ్చిగుచ్చి లోతుగా ప్రశ్నించడం ద్వారా వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేట్టుగా చేస్తారు. వారు వెల్లడించిన అంశాల మేరకు నివేదికలు తయారు చేసి క్లయింట్లకు అందజేస్తారు. ఇందుకు ఒక్కో సంస్థ రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్యాకేజీ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పని మొదలెట్టిన 6 చానళ్లు.. మునుగోడులో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏయే సమస్యలున్నాయి, ఏయే అభ్యర్థి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్న అంశాలను పలు యూట్యూబ్ చానెళ్లు అభిప్రాయ సేకరణ పేరుతో సర్వేలు చేస్తున్నాయి. ఇలా ప్రధానంగా 6 చానళ్లు మునుగోడులో పనిచేస్తున్నాయని తెలిసింది. ఆయా చానళ్ల వారు వివిధ సమస్యలపై స్థానికులతో మాట్లాడింపజేస్తున్నారు. వారి అభిప్రాయాలను రికార్డు చేస్తున్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 50 మందితో మాట్లాడి మొత్తంగా 350 మంది ఒపీనియన్ పోల్‌ను తమ తమ క్లయింట్లకు అందజేస్తున్నాయి ఒక్కో యూట్యూబ్ చానల్ వారికున్న విశ్వసనీయతతో పాటు వారికున్న సబ్స్క్రైబర్ల సంఖ్యను బట్టి ప్యాకేజీ తీసుకుంటున్నాయి. చానెళ్లు తక్కువలో తక్కువ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్యాకేజీగా స్వీకరిస్తున్నట్టు తెలిసింది. రేటింగ్.. విశ్వసనీయతకోసం.. చానళ్లు, సర్వే సంస్థలు కాకుండా కొన్ని సంస్థలు కేవలం తమ విశ్వసనీయతను పెంపొందించుకునేందుకు, రేటింగ్ కోసం మునుగోడులో పనిచేస్తున్నాయి. ఏ పార్టీకి సంబంధం లేకుండా, అభ్యర్థికి వత్తాసు పలకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిద్వారా సబ్స్క్రిప్షన్ పెంచుకోవడంతో పాటు భవిష్యత్‌లో పార్టీలు తమను సంప్రదించే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ విధంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. -
బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్కు మద్దతు
కూసుమంచి: మతతత్వ పార్టీ అయిన బీజేపీకి తాము వ్యతిరేకమని, ఆ పార్టీని తెలంగాణలో నిలువరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని, ఈ క్రమంలోనే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్– బీజేపీ మధ్యే గట్టి పోటీ ఉందని భావించి, తమతోపాటు సీపీఐ కూడా టీఆర్ఎస్కు సహకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో అక్కడ సీపీఐ ఐదుసార్లు గెలిచినా, ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసినా ప్రధాన పార్టీలను ఎదుర్కొనేశక్తి లేదని, అందుకే ఓట్లు చీలకుండా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. కాంగ్రెస్ కూడా తమ మద్దతును కోరినప్పటికీ బీజేపీని అడ్డుకునే శక్తి టీఆర్ఎస్కే ఉందని భావించామన్నారు. టీఆర్ఎస్కు తమ సహకారం ఈ ఎన్నిక వరకే పరిమితమని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కానందునే తాను రాజీనామా చేశానని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పడం సరైంది కాదన్నారు. తెల్దారుపల్లిలో వ్యక్తిగత కారణాలతోనే తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురయ్యారని, ఈ ఘటనకు, సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కృష్ణయ్య హత్య నేపథ్యంలోనే తాము టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామనడం అవాస్తవమని కొట్టిపారేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. -
మునుగోడులో టీఆర్ఎస్ దే గెలుపు : సీఎం కేసీఆర్
-
రోజూ రెండు గంటలు పనిచేస్తే గెలుపు కాంగ్రెస్‌దే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడులో కాంగ్రెస్‌కు 97 వేల ఓటు బ్యాంకు ఉందని, ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కాపాడుకుంటే పార్టీ గెలుపు ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ కార్యకర్త ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున రోజుకు రెండు గంటలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తే లక్ష ఓట్లు సాధిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ను ఓడించే శక్తి ‘ఆ మోదీకి లేదు.. ఈ కేడీకి లేదు’అని వ్యాఖ్యానించారు. మునుగోడులో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల టీఆర్ఎస్, బీజేపీ పాలన వైఫల్యాలపై కాంగ్రెస్ రూపొందించిన చార్జిషీట్‌ను మాజీ మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 100 రోజులపాటు మండలాల్లోని నాయకులు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి టీఆర్ఎస్, బీజేపీ చేసిన మోసాలను పేర్కొంటూ రూపొందించిన చార్జ్‌షీట్‌ను, వరంగల్ డిక్లరేషన్‌ను వివరించాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సర్వం చేసిందని, ప్రజలు ఆయనకు లక్ష ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. తన రాజీనామాతో ఉప ఎన్నికలు వస్తే నిధులు వస్తాయన్న రాజగోపాల్‌రెడ్డి.. ఒక్కో ఓటును రూ.2 లక్షలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఉప ఎన్నిక వస్తే సర్పంచ్‌లకు, ప్రజాప్రతినిధులకు డబ్బులొచ్చాయి తప్ప ప్రజలకేం రాలేదని చెప్పారు. అమ్ముడుపోయిన సన్నాసులకు మాత్రమే డబ్బులు వచ్చాయన్నారు. కమ్యూనిస్టులను చూస్తే జాలే స్తోందన్నారు. ‘మీ నాయకులను కొనుక్కొని, మీ పార్టీని బొందపెట్టిన టీఆర్ఎస్కు మీరు మద్దతిస్తారా’ అని ప్రశ్నించారు. విలీన దినోత్సవం పేరుతో మత విద్వేషాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ అదే పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. ఒక్క ఓటుతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. అధికారికంగా నిర్వహిస్తాం ఇప్పటినుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 17 వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విమోచన వజ్రోత్సవాలు నిర్వహించాలని, ఇందుకు కార్యాచరణను ప్రకటిస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచి రైతాంగ సాయుధ పోరాటం చేసిన వారి చరిత్రను దేశానికి మరోసారి చాటాలని పిలుపునిచ్చారు. కేంద్రమే రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టి వజ్రోత్సవాలు నిర్వహించాలన్నారు. అక్రమ డబ్బుతో గెలవాలని చూస్తున్నారు: ఉత్తమ్ కాంట్రాక్టుల్లో వచ్చిన అక్రమ డబ్బుతో మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ గెలవాలని చూస్తున్నాయని ఎంపీ ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను వదిలి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని విమర్శించారు. డిండి, చర్లగూడెం, కిష్టరాయినిపల్లి, బ్రాహ్మణవెల్లెం ఎత్తిపోతల పథకాలు, చౌటుప్పల్ డిగ్రీ కాలేజీ, మునుగోడులో ప్రభుత్వ జూనియర్ కళాశాలపై కేసీఆర్ హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని.. నల్లగొండ జిల్లాలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదని మాజీ మంత్రి కె.జానారెడ్డి విమర్శించారు. ఈ భేటీలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ మంత్రి బలరాంనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నల్లగొండ, యాదాద్రి డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు: రేవంత్ రెడ్డి
-
అమ్ముడుపోయినవాళ్లను తరిమి కొట్టండి.. మునుగోడులో రేవంత్‌రెడ్డి
సాక్షి, నల్లగొండ: టీఆర్ఎస్, బీజేపీలది అవకాశవాద రాజకీయమని.. అమ్ముడుపోయిన వాళ్లను మునుగోడు నుంచి తరిమేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు టీ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి. శనివారం మునుగోడులో కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ అనంతరం.. టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలు, మోసాలపై.. తెలంగాణ కాంగ్రెస్ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్లది పక్కా అవకాశవాద రాజకీయం. రజాకార్లపై పోరాటం చేసినప్పుడు బీజేపీ ఎక్కడుంది. టీఆర్ఎస్ పుట్టి ఎన్నేళ్లు అవుతోంది?. కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చింది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. నాడు ప్రధాని నెహ్రూ, పటేల్‌లు హైద్రాబాద్‌ను భారత దేశంలో విలీనం చేశారు. కాబట్టి, సెప్టెంబర్ 17ను ఏడాది పాటు ఘనంగా నిర్వహించుకుందాం. గత ఎనిమిదేళ్లుగా విమోచన దినోత్సవం గురించి ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పుడేమో పోటాపోటీగా నిర్వహిస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్లు మతం పేరుతో చిచ్చు పెడుతున్నాయి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి.ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలనేది కాంగ్రెస్ కోరిక అని చెప్పారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ఎవరికి లొంగిపోయాడు?. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు రాలే.. దళితులకు మూడెకరాల భూమి రాలేదు. తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే. మునుగోడు అభివృద్ధికి నిధులు రాలేదు. అమ్ముడుపోయినోడికి, మోసం చేసినోడికి మాత్రమే నిధులు వచ్చాయి. అలాగే.. మునుగోడులో కాంగ్రెస్ బలమేంటో పార్టీ శ్రేణులు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు రేవంత్. మునుగోడులో తమను ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడనేది బహిరంగ రహస్యమే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంతో చేసింది. కానీ, ఆయన కాంగ్రెస్‌కు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ‘ధనిక రాష్ట్రాన్ని’ దోచుకుంటోందని ఆరోపించారు. అలాగే.. మునుగోడు ఉప ఎన్నిక తీర్పు తెలంగాణకు దిక్సూచి కావాలని అన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోసురాజు, మల్లు రవి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లారా.. నిలదీయండి టీఆర్ఎస్ పాలనపై జనంలో నమ్మకం పోయిందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి. ప్రాజెక్టు పనులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేకా...ప్రమాదంలో చిక్కుకుందని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలనను ప్రజలు బేరీజు చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ అంశాలన్నింటిపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలను నిలదీయాలని ప్రజలను ఆయన కోరారు. ఇదీ చదవండి: కేసీఆర్ సర్కార్‌పై నిర్మలా సీతారామన్ ఫైర్ -
‘రాజగోపాల్‌రెడ్డి చేసింది ద్రోహం.. బీజేపీలో చేరి ఏం లాభం!’
సాక్షి, నల్లగొండ: ఎమ్మెల్యేగా మునుగోడును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం మునుగోడులో కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీ అనంతరం.. టీఆర్ఎస్, బీజేపీ మోసాలపై కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేసింది. అనంతరం ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసింది ముమ్మాటికీ ద్రోహమేనని ఆయన బీజేపీలో చేరడం దుర్మార్గమైన చర్య. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరితే ఏం లాభం?. ఆయన గతంలో టీఆర్ఎస్తో దోస్తీ చేసి రాష్ట్రంలో కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీలో చేరి వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపణలు గుప్పించారు ఉత్తమ్. అయితే..తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుని. ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయాలని మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారాయన. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ప్రభుత్వంలో.. ఉద్యోగులకు జీతాలు లేవు అని విమర్శించారు. ఇక టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతివ్వడంపై స్పందిస్తూ.. అది చాలా బాధకరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతును తెలంగాణ సమాజం అంగీకరించదని ఆయన చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లకు దోచిపెడుతూ.. రైతులను రోడ్డున పడేస్తోందని మండిపడ్డారు. మునుగోడులో ఏం అభివృద్ది చేశాయని టీఆర్ఎస్, బీజేపీలు ఓట్లు అడుగుతున్నాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ 8 ఏళ్లుగా రాష్ట్రాని దోచుకుంటుందని.. బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. మునుగోడు గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం -
మునుగోడులో టీఆర్ఎస్కు సీపీఎం మద్దతు
-
నేటినుంచి మునుగోడులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
-
Munugode By Election 2022: మునుగోడుపై బీజేపీ ‘ఫుల్ ఫోకస్’!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ అధినాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. కచ్చితంగా గెలిచి రాష్ట్రంలో పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను నిరూపించుకోవాలని ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బా క, హుజూరాబాద్ తరువాత మునుగోడులోనూ గెలవడం ద్వారా సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నదనే విషయం ప్రజలకు తేటతెల్లం చేయడానికి దోహదపడుతుందని అంచనా వేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా ముందుకెళ్లేందుకు, టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచితీరాలని రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలను కేంద్రహోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే అమిత్ షా, నడ్డాల పర్యవేక్షణలో ఎన్నికల వ్యూహరచన ఖరారు చేస్తున్నారు. పాదయాత్ర–4 సందర్భంగానూ పర్యవేక్షణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో వచ్చే నెల 12 నుంచి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న ప్రజాసంగ్రామయాత్ర–4 ముగింపు సభను అదేనెల 22 లేదా 23 తేదీల్లో రంగారెడ్డి జిల్లా శివారు, మునుగోడుకు కాస్త దగ్గరగా ఉండే అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఉప ఎన్నికల ప్రచారానికి ఊపు తెచ్చేందుకు ఈ సభలో అమిత్ షా లేదా నడ్డా పాల్గొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. మునుగోడుకు సంబంధించిన ప్రచార నిర్వహణపై నాయకత్వం పర్యవేక్షణకు అనువుగా ఉంటుందనే మల్కాజిగిరి ఎంపీ సీటు పరిధిలో పాదయాత్ర–4ను చేపడుతున్నట్టు చెబుతున్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు పకడ్బందీగా ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 3 రోజులు ఇక్కడే మకాం వేయనున్న తరుణ్ ఛుగ్ వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో రాష్ట్రంలో మకాం వేయనున్న ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ తరుణ్ ఛుగ్ మునుగోడు ప్రత్యేక కార్యా చరణను ఖరారు చేయనున్నారు. మును గోడు సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ తరఫున పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామిని ఈ ఎన్నికల ఇన్చార్జిగా నియమించనున్నారు. ఈ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డిని కూడా మరో ఇన్‌చార్జీగా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రతీ మండలం, మున్సిపాలిటీలో ముగ్గురేసి రాష్ట్ర ముఖ్యనేతలను ఇన్‌చార్జీలుగా నియమిస్తున్నారు. ఈ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతోపాటు మునుగోడుకు సంబంధం లేని బయటినేతలకు ముఖ్యమైన బాధ్యతలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో వివిధ జిల్లాల మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, నేతలకు ఎన్నికల ప్రచారం, బూత్‌స్థాయి కమిటీల పర్యవేక్షణ, ఇతర కీలక బాధ్యతలు అప్పగించేలా కార్యాచరణ ఖరారైనట్లు పార్టీవర్గాల సమాచారం. -
టీ కాంగ్రెస్ లో కొలిక్కి వచ్చిన మునుగోడు అభ్యర్థి ఎంపిక
-
‘మునుగోడు’పై కసరత్తు ముమ్మరం చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమని ముందుగానే అంచనాకు వచ్చిన టీఆర్ఎస్.. ఇతర పార్టీల కంటే ముందే క్షేత్రస్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందుకోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలనూ రంగంలోకి దింపుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కార్యాచరణ రూపొందించారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించాలని.. గ్రామాలను కీలక నేతలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇన్చార్జులుగా నియమితులయ్యే వారు.. తమకు అప్పగించిన చోటే ఉండి ప్రచారాన్ని, పనులను పర్యవేక్షించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎవరెవరికి ఏయే మండలం, గ్రామం బాధ్యతలు అప్పగించేదీ త్వరలో ఖరారు చేయనున్నారు. తర్వాత వారం పది రోజుల్లో సదరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయా మండలాలు, గ్రామాలకు వెళ్లి పార్టీ కేడర్‌తో మమేకమై పనిచేయనున్నారు. సభ నాటి నుంచే.. ఈనెల 20న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభతోనే పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నుంచి వేల వాహనాలతో మునుగోడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సభ బాధ్యతలు అప్పగించారు. తర్వాత మునుగోడులో టీఆర్ఎస్ కార్యకలాపాల్లో కొంత స్తబ్ధత నెలకొన్నా.. మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడులో పర్యటిస్తూ ఇతర పార్టీల నుంచి నేతల చేరికలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు, క్రియాశీల నేతలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్నవారిని చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ అసంతృప్త నేతలు దారికి.. మునుగోడులో టీఆర్ఎస్ అసంతృప్త కార్యకర్తలు, స్థానిక నేతలు మెల్లగా పార్టీలైన్లోకి వస్తున్నారు. చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బుచ్చిరెడ్డి బీజేపీలో చేరగా.. ఇతర మండలాల నేతలు మాత్రం టీఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటించారు. 20న జరిగిన కేసీఆర్ సభ జన సమీకరణలోనూ వారు క్రియాశీలకంగా పనిచేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు ఆ పార్టీవర్గాలు చెప్తున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాకే పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. దసరాలోగా ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని స్థానిక నేతలకు పార్టీ పెద్దల నుంచి సంకేతాలు అందినట్టు తెలిసింది. షెడ్యూల్ విడుదల కాగానే చండూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందరికీ బాధ్యతలు పార్టీపరంగా మునుగోడు ఉప ఎన్నిక సన్నద్ధతను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్.. పెద్ద సంఖ్యలో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలను నియోజకవర్గంలో మోహరించడంపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ మండలాలు, గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఆయా మండలాలు, గ్రామాల్లో సామాజికవర్గాల వారీగా ఓట్ల లెక్కలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. అందుకు తగినవారిని ఇన్చార్జులుగా నియమించనున్నారు. చదవండి: Telangana Politics: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి -
తెలుగు హీరోలతో బీజేపీ అగ్ర నేతల భేటీలు.. అందుకేనా?
దక్షిణాదిపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. సౌత్‌లో పార్టీని పటిష్టం చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కర్ణాటకలో పాగా వేసిక కమలం పార్టీ మిగతా దక్షిణాది రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. సంస్థాగతంగా బలపడేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. వివిధ రంగాలను చెందిన ప్రముఖులను తమవైపు తిప్పుకోవడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. వీరి భేటీపై స్థానిక నాయకులకు కూడా సమాచారం లేదంటే బీజేపీ అగ్రనాయకత్వం ఎంత ప్లాన్డ్గా ముందుకెళుతుందో అర్థమవుతుంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. హీరో నితిన్‌పై సమావేశమయ్యారు. అయితే ఈ రెండు మర్యాదపూర్వక భేటీలని కమలనాథులు చెబుతున్నా.. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదనలూ లేకపోలేదు. భారత మహిళల క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌తోనూ నడ్డా సమావేశం కావడం ఈ వాదనలకు మరింత బలాన్నిస్తోంది. ఇంకాస్త ముందుకెళితే ప్రధాని నరేంద్ర మోదీని అంబేద్కర్‌తో పోల్చి ప్రశంసించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు రాజ్యసభ సీటు దక్కింది. కథా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా బీజేపీ ఆశీస్సులతో పెద్దల సభలో అడుగుపెట్టారు. ఆర్ఎస్ఎస్ సమాజానికి అందిస్తున్న సేవలపై సినిమా తీస్తానని ఆయన ప్రకటించడం గమనార్హం. కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో బీజేపీ సర్కారు సత్కరించిన విషయం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రముఖ నటీమణులు విజయశాంతి, ఖుష్బూ ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్నారు. (క్లిక్: హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..) తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలంటే మునుగోడులో కచ్చితంగా గెలవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో కమలం పార్టీ అగ్రనాయకులు తెలంగాణకు వరుస కడుతున్నారు. శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ కార్యక్రమాలతో పాటు సినిమా ప్రముఖులతో భేటీలు నిర్వహిస్తూ ప్రజల దృష్టి తమపై పడేలా చేసుకుంటున్నారు. బీజేపీ ఎత్తుగడలు ఏమేరకు ఫలిస్తాయో భవిష్యత్‌లో తెలుస్తుంది. (క్లిక్: కేసీఆర్‌ను ప్రజలే ఇంట్లో కూర్చోబెడతారు) -
ఎదురుదాడిలో ఎక్కడా తగ్గొద్దు!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక దిశగా పావులు కదిపి రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించడం ద్వారా పట్టుసాధించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు దీటుగా ప్రతిస్పందించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభ, బండి సంజయ్ పాదయాత్ర, కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లక్ష్యంగా అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో టీఆర్ఎస్పై ముప్పేట దాడిని ప్రారంభించిన బీజేపీపై అదేస్థాయిలో ఎదురుదాడి చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. తెలంగాణను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని చూడటంతోపాటు ఈడీ, సీబీఐ దాడులంటూ బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఇన్నాళ్లూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విమర్శిస్తూ వస్తున్నారు. కేసీఆర్ కుటుంబపాలన, ప్రాజెక్టుల్లో అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్న బీజేపీ.. తాజాగా కవితను లక్ష్యంగా చేసుకోవడాన్ని టీఆర్ఎస్ సవాలుగా తీసుకుంటోంది. అటు సోషల్ మీడియాలో ప్రచారం, ఇటు క్షేత్రస్థాయిలో ఆందోళనల పేరిట ఉద్వేగాన్ని సృష్టించడం ద్వారా లబ్ధి పొందేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలను అడ్డుకోవడంపైనా గులాబీ దళం దృష్టి కేంద్రీకరించింది. బీజేపీతో శాంతిభద్రతల సమస్య రాష్ట్రంలో బీజేపీ ఉద్రిక్తతలు, ఉద్వేగాలను సృష్టించి హింసను ప్రేరేపించాలని చూస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ చర్యలపై సంయమనం పాటిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నా.. ఎక్కడా తగ్గకుండా ఎదురుదాడికి దిగాలని పార్టీ కేడర్‌కు టీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో దేవరుప్పుల, గద్వాల, మునుగోడు తదితర చోట్ల టీఆర్ఎస్, బీజేపీ ఘర్షణలు ఈ కోవకు చెందగా, తాజాగా హైదరాబాద్‌లో కవిత నివాసం వద్ద జరిగిన ఘటనను టీఆర్ఎస్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. భౌతిక దాడులను ప్రేరేపించడం లక్ష్యంగానే బీజేపీ చర్యలు ఉంటున్నందున అదే రీతిలో ప్రతిస్పందించకపోతే పలుచనవుతామనే భావన టీఆర్ఎస్లో కనిపిస్తోంది. బీజేపీ దుందుడుకు చర్యల వల్ల తలెత్తుతున్న శాంతిభద్రతల సమస్యను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేయాలనే వ్యూహంలో భాగంగానే మంగళవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కవిత నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించినట్లు సమాచారం. ఆరోపణలు చేసిన నేతలపై ఫిర్యాదులు ఎమ్మెల్సీ కవితపై అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పరవేశ్ వర్మను అరెస్టు చేయాలంటూ టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేసేందుకు కవిత సన్నద్ధమవుతుండగా, మరోవైపు పరవేశ్ అరెస్టుకు ఒత్తిడి కోసం టీఆర్ఎస్ నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాజాసింగ్ అరెస్ట్, దీక్ష పేరిట ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడం శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే జరుగుతోందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
సాగదీయొద్దు.. సాగనంపుదాం!
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య వైరాన్ని మరింత పెంచుతున్నట్లే కనబడుతోంది. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది మొదలు మొన్నటి హోంగార్డు వ్యాఖ్యల వరకు అన్నింటినీ సమర్ధిస్తూ వస్తున్నారంటూ తనపై విమర్శలు గుప్పిస్తున్న వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సాగనంపేందుకు మాణిక్యం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఢిల్లీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వద్ద సోమవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీలోనూ వెంకట్‌రెడ్డి అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగానే వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపే విషయమై మాణిక్యం కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడారని కాంగ్రెస్‌లోని అత్యున్నత వర్గాలు చెబుతున్నాయి. భేటీ సందర్భంగా ప్రియాంకతో ప్రత్యేకంగా మాట్లాడిన మాణిక్యం ‘వెంకట్‌రెడ్డికి పీసీసీ రాలేదన్న అక్కసును తొలి నుంచి వెళ్లగక్కుతున్నారు. నాపైనా విమర్శలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వైఖరితో కేడర్‌లో తీవ్ర అయోమయం నెలకొంటోంది. పీసీసీ అధ్యక్షుడు నిర్వహిస్తున్న భేటీలకు ఆయన హాజరుకావడం లేదు. ఇంకా ఉపేక్షిస్తే పార్టీకే నష్టం. ఆయన పార్టీని వీడాలనుకుంటే వీడనిద్దాం’అని అన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వెంకట్‌రెడ్డి పార్టీలో ఉన్నా ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలో నిలిచే సోదరుడు రాజగోపాల్‌రెడ్డి గెలుపునకే కృషి చేస్తారని, అది జరుగకుండా ఉండాలంటే వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సాగనంపడమే మేలనే అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా పేర్కొంటున్నాయి. ప్రియాంక జోక్యంతో నేడు చర్చలు ఎంపీ కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అంశంపై చర్చ జరిగినా ప్రియాంక సహా కొందరు నేతలు తీవ్రంగా తప్పుపట్టినట్లు తెలుస్తోంది. సస్పెండ్ చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సానుభూతి పెరిగి అది రాజగోపాల్‌రెడ్డికి లాభం చేకూరుస్తుందని కొందరు చెప్పినట్లుగా సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్‌లను వెంకట్‌రెడ్డితో చర్చించేందుకు పంపాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలు బుధవారం ఆయనతో చర్చించే అవకాశాలున్నాయి. చర్చలు ఎందుకంటూ ప్రియాంక ముందే మాణిక్యం అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, ఇదే సమయంలో సీనియర్ నేతలతో సఖ్యత విషయంలో వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అందరినీ కలుపుకొనిపోవాలని రేవంత్‌కు ప్రియాంక చెప్పినట్లు తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు వద్దని, సొంతపార్టీ నేతలపై వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తంగా ఉండాలని సూచించారని తెలిసింది. -
మునుగోడులో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
-
మునుగోడుపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టి
-
మునుగోడు బాధ్యత అందరిదీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను తెలంగాణ ముఖ్య నేతలందరి భుజాలపై పెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీకి రావాలని, సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని పార్టీ నేతలను హైకమాండ్ ఆహ్వానించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు నల్లగొండ జిల్లా ముఖ్య నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక ప్రణాళిక, వ్యూహ కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఈ సమావేశానికి వెళ్తారని తెలుస్తోంది. వీరితో పాటు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి, పార్టీ తరఫున సర్వేలు నిర్వహిస్తున్న సునీల్ కనుగోలు కూడా ప్రియాంకతో జరిగే భేటీలో పాల్గొననున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అంశమే ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల నివేదికలను పరిశీలిస్తారని, నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించి అభ్యర్థి ఎవరయితే బాగుంటుందన్న దానిపై కూడా సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానానికి ఫీడ్‌బ్యాక్ ఏఐసీసీ పిలుపు అందిన నేపథ్యంలో తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, కాంగ్రెస్ పరిస్థితిపై పార్టీ ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించింది. ఇప్పటివరకు పూర్తయిన సర్వే నివేదికల ప్రకారం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉందనే అంచనాకు ఆ పార్టీ ముఖ్య నేతలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడం, టీఆర్ఎస్–బీజేపీలు ఒక్కటై ఈ ఉప ఎన్నికను తెరమీదకు తెచ్చాయన్న వాదనలను నియోజకవర్గ ప్రజలు పరిగణనలోకి తీసుకుంటున్నారని సర్వేలో తేలినట్టు సమాచారం. బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే ఫలితం ఉంటుందని, అదే సమయంలో పాల్వాయి స్రవంతికి కూడా ప్రజల్లోకి వెళ్లగలిగే సామర్థ్యం ఉందనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. సర్వేల ఆధారంగా మునుగోడు అభ్యర్థిపై టీపీసీసీ నేతలు కసరత్తు చేశారని, సోమవారం జరిగే భేటీలో తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తారని తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో వారి అభిప్రాయాన్ని కూడా అధిష్టానం అడిగి తెలుసుకోనుంది. అందరి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం మునుగోడులో గెలుపు తెలంగాణ నేతల సమిష్టి బాధ్యతని స్పష్టం చేయడంతో పాటు, ఈ మేరకు వెంటనే కార్యరంగంలో దిగాల్సిందిగా దిశానిర్దేశం చేయనుంది. -
బీజేపీకి వ్యతిరేకమని ఒట్టేసి చెప్పండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి తాను నిజంగా వ్యతిరేకమని సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి మీద ఒట్టేసి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే మళ్లీ బీజేపీకే మద్దతు ఇస్తారని చెప్పారు. ఇప్పటివరకు ఎంఐఎం వయా టీఆర్ఎస్ నుంచి బీజేపీకి మద్దతు అందుతోంటే, ఇప్పుడు సీపీఐ వయా టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీకి మద్దతు ఇచ్చేలా చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, యువజన కాంగ్రెస్ నేత అనిల్‌కుమార్ యాదవ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. మళ్లీ వంచించే ప్రయత్నం మునుగోడులో కేసీఆర్ సభతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. సభలో ఆ నియోజకవర్గానికి ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా జాతీయ రాజకీయాలు మాట్లాడి కేసీఆర్ మళ్లీ వంచించే ప్రయత్నమే చేశారని విమర్శించారు. డిండి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో, ఎస్సెల్బీసీని ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదో, పోడు భూముల సమస్యలను ఎలా తీరుస్తారో, చర్లగూడెం, కిష్టరాంపల్లి భూనిర్వాసితుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదని అన్నారు. ఇవన్నీ చెప్పకుండా ఈడీ, సీబీఐల గురించి మాట్లాడితే ఏం లాభమని నిలదీశారు. పార్టీ ఫిరాయింపులకు కేసీఆరే ఆద్యుడు పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరేనని, ఏకలింగంగా ఉన్న బీజేపీని మూడు తోకలుగా చేసింది ఆయనేనని రేవంత్ అన్నారు. లేని బీజేపీని ప్రత్యా మ్నాయంగా సృష్టించిందీ, తెలంగాణపై బీజేపీ ముప్పేట దాడికి కారణమైంది కూడా కేసీఆరేనని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని గతంలో ప్రశ్నించిన ఆయన, ఇప్పుడు అదే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులు కేసీఆర్ ఉచ్చులో ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. వారి నిర్ణయం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. మునుగోడులోని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. మధుయాష్కీ మాట్లాడుతూ.. మునుగోడు సభలో కాంగ్రెస్ పార్టీనుద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారో ఆలోచించుకోవాలని, ఆయన భాషను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని అన్నారు. -
మునుగోడుపై ప్లాన్ మార్చిన కాంగ్రెస్.. ప్రియాంక కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో పొలిటికల్ హీట్ అంతా మునుగోడుపైనే ఉంది. అధికార పార్టీ టీఆర్ఎస్తో సహా ప్రతిపక్ష పార్టీలు సైతం మునుగోడుపై నజర్ పెట్టాయి. కాగా, కాంగ్రెస్ మాత్రం మునుగోడులో కచ్చితంగా తమ పార్టీ జెండాను ఎగురవేయాలని ప్లాన్స్ రచిస్తోంది. ఇక, మునుగోడుపై గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మునుగోడు బరిలోకి ప్రియాంక గాంధీ రంగ ప్రవేశం చేశారు. ప్రియాంక ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ, వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికపై అధిష్టానం వ్యూహరచన చేయనుంది. మరోవైపు.. మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రజాదీవెన సభతో శనివారం బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభలో సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మునుగోడులో బీజేపీ సభకు కేంద్రమంత్రి అమిత్‌షా -
మునుగోడు ఉపఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్
-
10 రోజుల్లో తేల్చేద్దాం! మునుగోడు అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. టీఆర్ఎస్, బీజేపీల నుంచి అభ్యర్థులు ఎవరనేది దాదాపు ఖరారైన నేపథ్యంలో గందరగోళానికి తావు లేకుండా.. వీలైనంత త్వరగా తమ అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తోంది. మరో 10 రోజుల్లో అంటే సెప్టెంబర్ మొదట్లోనే కాంగ్రెస్ అభ్యర్థి ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలో దింపాలని యోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా చేపట్టింది. వీటి నివేదికల ఆధారంగా అధిష్టానానికి టీపీసీసీ ప్రతిపాదనలు పంపనుంది. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారు విషయంలో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సుకూ ప్రాధాన్యత ఉంటుందని, ఆయనతోపాటు జిల్లాలోని కీలక నేతలందరి అభిప్రాయం తీసుకున్నాకే అభ్యర్థి ఎవరనేది నిర్ణయించనున్నారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. రేసులో ఐదుగురు మునుగోడులో పోటీకోసం కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు నేత లు టికెట్ ఆశిస్తున్నారు. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి, చండూరు ఎంపీపీ పల్లె కల్యాణి భర్త పల్లె రవికుమార్‌గౌడ్, ఇటీవల కాంగ్రెస్‌లో చేరి న తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్, టీపీసీసీఅధి కార ప్రతినిధి పున్నా కైలాశ్ నేత, వ్యాపారవేత్త చల్లమల్ల కృష్ణారెడ్డి తదితరులు రేసులో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తు న్నా యి. ఇందులో స్రవంతి అభ్యర్థిత్వంపై అధిష్టానం పెద్దలు ఇప్పటికే ఆరా తీశారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగు తోంది. గోవర్ధన్‌రెడ్డి కుమార్తెగా ఆమెకు నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీ నేతకు చాన్స్‌పై చర్చ కాంగ్రెస్ తరఫున బీసీ అభ్యర్థిని బరిలో దింపితే ఎలా ఉంటుందని టీపీసీసీ నేతలు, అధిష్టానం పెద్దల్లో చర్చ జరుగుతోంది. మునుగోడు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బీసీలు ఉండడం, అక్కడ బీసీ వాదానికి కొంత సానుకూల పరిస్థితి ఉందని సర్వేలో తేలడం, ఇతర ప్రధాన పార్టీల నుంచి అగ్రవర్ణాల అభ్యర్థులు బరిలో ఉండనుండటం నేపథ్యంలో బీసీ నేతలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ క్రమంలో పల్లె రవి, చెరుకు సుధాకర్, కైలాశ్ నేతలలో ఎవరైతే బాగుంటుందన్న దానిపై టీపీసీసీ సర్వే చేయించినట్టు సమాచారం. మొత్తంగా సర్వే నివేదికల ఆధారంగా జాబితాను అధిష్టానానికి పంపనున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ అంతా 10 రోజుల్లో పూర్తవుతుందని, సెప్టెంబర్ నెల మొదట్లోనే తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. -
ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో: సీఎం కేసీఆర్
సాక్షి, నల్గొండ: మునుగోడు ప్రజా దీవెన సభ వేదికగా సీఎం కేసీఆర్.. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య దేశమని.. రాచరిక వ్యవస్థ కాదని అన్నారు. బీజేపీ వాళ్లకు ఎందుకింత అహంకారమని మండిపడ్డారు. బెంగాల్లో మమత సర్కార్‌ను పడగొడతానని ప్రధాని అంటున్నారని.. నిన్ను(మోదీ) నీ అహంకారమే పడగొడుతుందని విమర్శించారు. దేశం నుంచి బీజేపీని తరిమి కొడితేనే మనకు విముక్తి కలుగుతుందన్నారు. ‘ఈడీకి దొంగలు భయపడతారు.. నేను ఎందుకు భయపడతా.. ఈడీ వాళ్లు వస్తే వాళ్లే నాకు చాయ్ తాగించి పోతారు. ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో. ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ల చేతిలోనే కత్తి పెట్టాలి. మీరు గోకినా గోకకపోయినా.. నేను గోకుతా. ఢిల్లీలో కరెంట్ లేదు, హైదరాబాద్‌లో ఉంటోంది. మీరు ఉద్ధరించింది ఏమిటి. అన్నింటిపై జీఎస్టీ వసూలు చేస్తూ.. బ్యాంకులు ముంచే వాళ్లకు పంచుతున్నారు. చదవండి: ‘ఏడాదిలో ఎన్నికలు.. ఎవరి కోసం రాజీనామా చేసినవ్ రాజగోపాల్ రెడ్డి’: సీఎం కేసీఆర్ మీకు చేత కాదు.. మేము చేస్తుంటే అడ్డుపడతారా. గ్యాస్ సిలిండర్ ధర ఎక్కడికి పోయింది చూసి ఓటేయండి. మాటలు విని మోసపోతే.. గోసపడతాం. అందరం కలిసి బీజేపీకి మీటర్ పెడదాం. దయచేసి ప్రలోభాలకు పోవద్దు.. ఇది పార్టీల ఎన్నిక కాదు. చండూరులో మరోసభ పెట్టుకుందాం. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు. మీటర్లు పెట్టనివ్వను. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. అది వేస్ట్ అయిపోతుంది. పాటుపడే వారికి ఓటు వేయాలి తప్ప పోటువేసేవాడికి కాదు’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, మునుగోడు సభలో కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ అభ్యర్థి ప్రస్తావనే తీసుకురాకుండా సభను ముగించారు. -
నా ధైర్యం, బలం ప్రజలే.. అందుకే కేంద్రంతో కొట్లాడుతున్నా: సీఎం కేసీఆర్
-
రైతులు తస్మాత్ జాగ్రత్త.. బీజేపీకి ఓటు పడితే బావి దగ్గర మీటర్ వస్తుంది: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సభా వేదికపై పార్టీ జెండా ఆవిష్కరించారు. వేదికపై అమరవీరుల స్థుపానికి నివాళులు అర్పించారు. ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్.. పార్టీ శ్రేణులతో కలిసి బస్సులో మునుగోడు వెళ్లారు. సీఎం వెళ్లే మార్గమంతా టీఆర్ఎస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సందడిగా నెలకొంది. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అమిత్‌షాను టార్గెట్ చేశారు. రేపు(ఆదివారం) జరిగే సభలో కృష్ణా జలాలపై అమిత్‌షా తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చడం లేదో అమిత్‌షా చెప్పాలని అన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా.. రాజగోపాల్ రెడ్డి ఎవరి కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతున్నాడని ప్రశ్నించారు. ఢిల్లీలో మా నీళ్ల సంగతేంటని రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరని నిలదీశారు. చదవండి: మునావర్ కామెడీ షో: ప్రోగ్రామ్ 5 గంటలకే ప్రారంభం.. నో సెల్ ఫోన్స్ కొట్లాట తెలంగాణకు, టీఆర్ఎస్కు కొత్తకాదని, మునుగోడుతోనే తమ పోరాటం ఆగిపోదని అన్నారు. మునుగోడు నుంచి ఢిల్లీదాకా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. మునుగోడులో గోల్మాల్ ఉప ఎన్నిక వచ్చిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ఎవరికోసం ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ బైపోల్ రావాల్సిన అవసరం ఏముంది. 8 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి మేలు జరిగింది. బ్యాంకులు, రైళ్లు, రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంది. ఇక రైతులు, భూములను కూడా మోదీ సర్కార్ అమ్మేస్తుందేమో. మాకు మద్దతు ఇచ్చిన సీపీఐకు ధన్యవాదాలు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా కామ్రేడ్లతో ఐక్యత కొనసాగించాలి. రైతులు తస్మాత్ జాగ్రత్త. మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. లక్షమందికి పైగా రైతులకు రైతుబంధు. రైతు బంధు ఎట్టిపరిస్థితిలోనూ ఆగదు. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు.. మన బతుకు ఎన్నిక. రైతులు కరెంట్ మీటర్లు పెట్టమంటే నేనుపెట్టలేదు. మీటర్లు పెట్టే మోదీ కావాలా.. మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలా.. మునుగోడు చరిత్రలో ఎన్నడూ బీజేపీకి డిపాజిట్ రాలేదు. బీజేపీకి ఓటు పడిందంటే బావి దగ్గర మీటర్ వస్తుంది’ అని మునుగోడు సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: మల్లారెడ్డా మజాకా.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిండు -
నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడిస్తోంది: రేవంత్ రెడ్డి
-
బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్కే ఉంది: చాడ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అంశం కేవలం మునుగోడుకే పరిమితం కాబోదని, భవిష్యత్తులోనూ టీఆర్ఎస్తో కలిసి నడుస్తామని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియా ముఖంగా ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే మా మద్దతు. ఉపఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదు. బీజేపీని ఓడించే సత్తా ఒక్క టీఆర్ఎస్కే ఉంది. అందుకే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇది మునుగోడుకే పరిమితం కాదు. భవిష్యత్‌లో కూడా టీఆర్ఎస్తో పని చేస్తాం అని చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు బహిరంగ సభకు రావాలని కేసీఆర్ ఆహ్వానించారని, అందుకే సీపీఐ నేతలు వెళ్తున్నారని తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్న విషయాన్ని చాడ గుర్తు చేశారు. కాంగ్రెస్‌పై విమర్శ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన సమయంలోనే.. కాంగ్రెస్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సీపీఐని ఇబ్బంది పెట్టింది. మాకు ఇచ్చిన మూడు సీట్లలో కూడా కాంగ్రెస్ పోటీ చేసింది. ఉత్తమ్ కుమార్ ఇబ్బంది పెట్టారు అని చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రెస్మీట్లో సీపీఐ నారాయణ సైతం పాల్గొన్నారు. ఇదీ చదవండి: మునుగోడులో కాంగ్రెస్.. ప్రజాస్వామ్యానికి పాదాభివందనం -
Munugode: సీఎం కేసీఆర్ కారులో సీపీఐ చాడ వెంకట్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: మునుగోడు సమరం తెలంగాణలో మరో ఆసక్తికర పరిణామానికి తెర తీసింది. ఉప ఎన్నిక కోసం.. బీజేపీని బలంగా ఢీకొట్టే టీఆర్ఎస్ మద్దతు ప్రకటించాలని వామపక్షాలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలోకి దిగాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) బహిరంగ సభ నిర్వహించనుంది అధికార టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ బహిరంగ సభ నుంచే మద్దతు ప్రకటించాలని, కార్యక్రమానికి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ వాహనంలోనే చాడ.. మనుగోడుకు చేరుకోనున్నట్లు సమాచారం. ఇక మునుగోడు సభ కోసం టీఆర్ఎస్ భారీ ఎత్తున్న కసరత్తులు చేస్తోంది. రెండు వేల మందితో హైదరాబాద్ నుంచి ర్యాలీ తీయాలని చూస్తోంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నాం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు-ఐదు గంటల వరకు విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో సీపీఐ-సీపీఎంలు ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాబట్టి, కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలడం ఖాయమని, ఒకవేళ కాంగ్రెస్‌కు వామపక్షాలు మద్దతిచ్చినా బీజేపీనే లాభపడుతుందని విశ్లేషిస్తున్నాయి. ఈ తరుణంలో.. బీజేపీని ఎదుర్కొనే టీఆర్ఎస్కు ఇవ్వడం కొంత మంచిదని నిర్ణయించుకున్నాయి. రెండు పార్టీలకు కలిపి మునుగోడు నియోజకవర్గంలో 25 వేలకుపైగానే ఓటింగ్ ఉండగా.. విజయవకాశాలను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదీ చదవండి: కారు వైపే కామ్రేడ్లు! -
Munugode Politics: కారు వైపే కామ్రేడ్లు!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్ని కల్లో టీఆర్ఎస్కే మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తున్నట్టు సమాచారం. రెండు పార్టీలకు కలిపి మునుగోడు నియోజకవర్గంలో 25 వేలకుపైగానే ఓటింగ్ ఉంటుందని, ఇది ఇతరపార్టీల విజయావకాశాలను ప్రభావితం చేస్తు ందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు చివరిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న దానిపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు దూరమే! మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నట్టు సీపీఐ నేత ఒకరు పేర్కొ న్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్నందున.. కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలుతాయని, ఆ పార్టీకి వామపక్షాలు మద్దతిచ్చినా బీజేపీనే లాభపడుతుందని ఆయన విశ్లేషించారు. ఇక కొంతకాలం నుంచి బీజేపీ, ప్రధాని మోదీల తీరుపై సీఎం కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. బీజేపీని దీటుగా ఎదుర్కోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని వామపక్షాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్కు ఇచ్చే మద్దతుతో కుదిరే పొత్తు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశముంటుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల్లో కొత్తగూడెం, భద్రాచలం, మిర్యాలగూడ, ఖమ్మం లేదా పాలేరు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని వామ పక్షాలు కోరే చాన్సుందని అంటున్నాయి. టీఆర్ఎస్ నేతలతో చర్చలు షురూ.. బీజేపీకి బ్రేక్ వేయడంపై అధికార టీఆర్ఎస్ గట్టిగా దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ విధానాలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సీపీఐ, సీపీఎంల మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంటున్నాయి. తమ పార్టీ నేతలను చర్చలకు రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారని.. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తమ నేతలతో మాట్లాడారని సీపీఐ, సీపీఎం నేతలు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌నేత మల్లు రవి కూడా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కలిసి తమకు మద్దతివ్వాలని కోరినట్టు సమాచారం. బీజేపీని ఓడించగల పార్టీకే మద్దతు ఇస్తామని తమ్మినేని స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్రస్థాయి సమావేశాల్లో చర్చలు మునుగోడు ఎన్నిక విషయంగా సీపీఐ, సీపీఎం రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సీపీఎం రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యదర్శివర్గం భేటీలు శుక్రవారం జరుగగా.. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ విస్త్రృతస్థాయి సమావేశాలు శనివారం కూడా కొన సాగనున్నాయి. ఈ సమావేశాల్లో మునుగోడులో ఎలా వ్యవహరించాలన్న దానిపై నేతలు చర్చించారు. నిజానికి మునుగోడులో పలుసార్లు సీపీఐ అభ్య ర్థులు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీకి కేడర్, ఓటు బ్యాంకు ఉంది. సీపీఎంకు కూడా కొంత ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో కొందరు సీపీఐ నేతలు పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని, టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం ఏమేరకు సమంజసమని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే గతంలో గెలిచినప్పుడు పొత్తుల వల్లే సాధ్యమైందని, పైగా నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఓటు బ్యాంకు తగ్గిందని మరికొందరు పేర్కొన్నట్టు సమాచారం. అన్ని అంశాలను పరిశీలించి టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడమే సరైనదని ఆ పార్టీ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇక సీపీఎం కూడా టీఆర్ఎస్కు మద్దతివ్వడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టవచ్చన్న అంచనాకు వచ్చినట్టు సమాచారం. తమ నిర్ణయాన్ని ఇప్పుడు ప్రకటించాలా, ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చాక చెప్పాలా అన్నదానిపై ఇంకా స్పష్టతకు రాలేదని తెలిసింది. ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తే ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా మారుతాయోనన్న ఆలోచన ఉన్నట్టు సమాచారం. అందువల్ల రెండు పార్టీల సీనియర్లు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
అమిత్ షా సభను అడ్డుకునేందుకు కుట్ర
మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడులో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మునుగోడులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 21న కేంద్ర హోంమంత్రి సభ నిర్వహిస్తున్నట్లు నెల రోజుల క్రితమే తాము ప్రకటించామని, అయితే సీఎం కేసీఆర్ కావాలనే ఒకరోజు ముందు ‘మునుగోడు ప్రజా దీవెన’పేరిట సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయని సీఎం కేసీఆర్, మునుగోడు సభకు వచ్చే ముందు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో మునుగోడు సమస్యలని సీఎం దృష్టికి తీసుకొస్తే.. ఏ ఒక్క రోజూ పట్టించుకోలేదన్నారు. ఎక్కడై నా ఉప ఎన్నికలు వస్తే తప్ప ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడంతోనే తాను పదవీ త్యాగం చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో నియంత పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు. అందుకే తాను 21న అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ఆ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అనేక హామీలు గుప్పించి ఈ తర్వాత విస్మరించడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీలు రమేశ్ కుమార్ నాయక్, రమేశ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకుపచ్చ హామీ ఏమైంది?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రాంతంలో 1.75 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే డిండి ఎత్తిపోతల పథ కాన్ని ఒకటిన్నరేళ్లలో పూర్తిచేసి మునుగోడును ఆకుపచ్చగా చేసే బాధ్యత తనదేనని చెప్పిన సీఎం కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2018 ఎన్నికల ప్రచారానికి ప్రజా ఆశీర్వాద సభ పేరుతో వచ్చి గాలిమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో సీఎం కేసీఆర్ ఇప్పుడు మళ్లీ తాయిలాలకు తెరలేపార న్నారు. ప్రగతిభవన్, ఫాం హౌస్ దాటని కేసీఆర్.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికల కోసం పరుగులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సీసీరోడ్లకు ప్రతిపాదనలు, మునుగోడు నియోజకవర్గంలో 9 వేల ఆసరా పెన్షన్లు, డిండి లిఫ్టు నిర్వాసితులకు రూ.116 కోట్లు, చేనేత కార్మికులకు బీమా, పెన్షన్లు వస్తున్నాయని, రోడ్లు, బ్రిడ్జి పనులకు రూ.7 కోట్లు వస్తున్నా యని తెలిపారు. -
Munugode Bypoll: ఇదీ అమిత్‌షా పర్యటన షెడ్యూల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 21న బహిరంగసభ నిర్వహణకు బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు. ఈ మేరకు గురువారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం అమిత్ షా పర్యటన షెడ్యూల్ జారీ చేసింది. అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం 1:20 గంటలకు బీఎస్ఎఫ్కు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:40 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బీఎస్ఎఫ్ ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 4:15 గంటలకు మునుగోడుకు వచ్చి, 4:25 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. సాయంత్రం 4:40 నుంచి 6 గంటల వరకు సభలో పాల్గొంటారు. 6:25 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని 6:30 గంటలకు బీఎస్ఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. (క్లిక్: మీకు నచ్చితే నీతి.. లేకుంటే అవినీతా?) -
రేపు మునుగోడుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
-
మునుగోడులో బరిలోకి రేవంత్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలిస్తుందా..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు బాహాటంగానే టీపీసీసీ రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌పై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇన్ని రోజులు కాంగ్రెస్‌కు అడ్డగా ఉన్న మునుగోడులో మరోసారి హస్తం జెండా ఎగురవేయాలని పార్టీ నేతలు ప్రణాళికలు రచ్చిస్తున్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకన్నారు. రేపు(శనివారం) రేవంత్ రెడ్డి మునుగోడుకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మునుగోడులో కాంగ్రెస్ జెండా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మన మునుగోడు- మన కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లనున్నట్టు స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ ర్యాలీలు, పార్టీ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. 7 మండలాలు, 176 గ్రామాల్లో కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టనుంది. అలాగే, మన మునుగోడు- మన కాంగ్రెస్ పేరుతో స్టిక్కర్లు పంపిణీ చేయనున్నారు. మరోవైపు.. బీజేపీ, అధికార టీఆర్ఎస్ సైతం మునుగోడుపై ఫోకస్‌ను పెంచాయి. కాగా, మునుగోడు కాషాయ జెండా ఎగురువేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈనెల 21న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ కూడా ప్రణాళికలు రచిస్తోంది. టీఆర్ఎస్ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. మన మునుగోడు… మన కాంగ్రెస్…#ManaMunugodeManaCongress pic.twitter.com/qrfflErQrG — Revanth Reddy (@revanth_anumula) August 19, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాట.. రేవంత్‌కు కొత్త టెన్షన్ -
21న మునుగోడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా