సాక్షి, హైదరాబాద్: మునుగోడులో టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సభా వేదికపై పార్టీ జెండా ఆవిష్కరించారు. వేదికపై అమరవీరుల స్థుపానికి నివాళులు అర్పించారు. ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్.. పార్టీ శ్రేణులతో కలిసి బస్సులో మునుగోడు వెళ్లారు. సీఎం వెళ్లే మార్గమంతా టీఆర్‌ఎస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సందడిగా నెలకొంది.
సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అమిత్‌షాను టార్గెట్ చేశారు. రేపు(ఆదివారం) జరిగే సభలో కృష్ణా జలాలపై అమిత్‌షా తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చడం లేదో అమిత్‌షా చెప్పాలని అన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా.. రాజగోపాల్ రెడ్డి ఎవరి కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతున్నాడని ప్రశ్నించారు. ఢిల్లీలో మా నీళ్ల సంగతేంటని రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరని నిలదీశారు.
చదవండి: మునావర్ కామెడీ షో: ప్రోగ్రామ్ 5 గంటలకే ప్రారంభం.. నో సెల్ ఫోన్స్
కొట్లాట తెలంగాణకు, టీఆర్‌ఎస్‌కు కొత్తకాదని, మునుగోడుతోనే తమ పోరాటం ఆగిపోదని అన్నారు. మునుగోడు నుంచి ఢిల్లీదాకా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. మునుగోడులో గోల్‌మాల్ ఉప ఎన్నిక వచ్చిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ఎవరికోసం ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ బైపోల్ రావాల్సిన అవసరం ఏముంది. 8 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి మేలు జరిగింది. బ్యాంకులు, రైళ్లు, రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంది. ఇక రైతులు, భూములను కూడా మోదీ సర్కార్ అమ్మేస్తుందేమో. మాకు మద్దతు ఇచ్చిన సీపీఐకు ధన్యవాదాలు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా కామ్రేడ్లతో ఐక్యత కొనసాగించాలి.
రైతులు తస్మాత్ జాగ్రత్త. మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. లక్షమందికి పైగా రైతులకు రైతుబంధు. రైతు బంధు ఎట్టిపరిస్థితిలోనూ ఆగదు. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు.. మన బతుకు ఎన్నిక. రైతులు కరెంట్ మీటర్లు పెట్టమంటే నేనుపెట్టలేదు. మీటర్లు పెట్టే మోదీ కావాలా.. మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలా.. మునుగోడు చరిత్రలో ఎన్నడూ బీజేపీకి డిపాజిట్ రాలేదు. బీజేపీకి ఓటు పడిందంటే బావి దగ్గర మీటర్ వస్తుంది’ అని మునుగోడు సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు.
చదవండి: మల్లారెడ్డా మజాకా.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిండు
Comments
Please login to add a commentAdd a comment