సాక్షి, మునుగోడు: టీఆర్‌ఎస్‌ను ఓడించాలని కోరుతూ మునుగోడులో ఓయూ జేఏసీ విద్యార్థులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసగిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓటు వేయొద్దంటూ మెడకు ఉరితాళ్లు బిగించుకుని, ఓటర్ల కాళ్లు మొక్కారు. చండూరులో ఆదివారం ఈ వినూత్న ప్రచారం కనిపించింది.
‘సాలు దొర ఇక సెలవు..’, ‘కేసీఆర్‌ను ఓడిద్దాం.. నిరుద్యోగుల జీవితాలను కాపాడుకుందాం’ అనే నినాదాలతో నియోజకవర్గంలో 9 రోజుల పాటు ప్రచారం నిర్వహించినట్లు విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు అనేక హామీలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఓటర్లు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిస్తే ఉరే శరణ్యమని వాపోయారు.
రొట్టె చేస్తా.. ఓట్లు అడుగుతా..
మంత్రి సత్యవతి రాథోడ్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం గరకతండాలోని ఓ గిరిజన ఇంట్లో రొట్టె చేశారు. వారితో కలిసి రొట్టెతిన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని వారిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment