ou students
-
గాంధీ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు చేదు అనుభవం
-
పవన్ కళ్యాణ్ పై ఓయూ స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహం
-
పవన్ కల్యాణ్‌కు ఓయూ విద్యార్థుల వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: పవన్ కల్యాణ్ ఒక బ్రోకర్ అంటూ ఓయూ విద్యార్థులు ఏకిపారేశారు. పవన్ ఓ ఐటమ్ సాంగ్ చేసే వ్యక్తి అని, ప్రజా సమస్యలపై ఏనాడూ పోరాడలేదని మండిపడ్డారు. ‘ప్రజా సమస్యలపై పవన్ ఏనాడూ పోరాడలేదు. పవన్ ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోం. పవన్ కల్యాణ్ణు తరిమికొడతాం’’ అంటూ ఓయూ విద్యార్థులు హెచ్చరించారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? -
‘గ్రూప్-2’ ఆందోళన.. పలువురు అభ్యర్థులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా అభ్యర్థులు వెనక్కి తగ్గలేదు. గ్రూప్-2 పరీక్షపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, అభ్యర్థులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు, ఏడుగురు అభ్యర్థులతో టీఎస్పీఎస్సీ చర్చలు జరుపుతోంది. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్-2 అభ్యర్ధుతలు, ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. వేలాదిగా తరలి వచ్చిన గ్రూప్-2 అభ్యర్థులు ఆఫీస్ ముందు బైఠాయించారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్‌కు తమకు సమయం లేదని చెబుతూ గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తామని ప్రకటన వస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని విద్యార్థులు ఆందోళనను ఉద్రితం చేయగా, రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాని టీఎస్పీఎస్సీ చెబుతోంది. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్, టీజేఎస్ మద్దతు తెలిపింది. కోదండరాం, దయాకర్, కాంగ్రెస్ నేతలు నిరనసలో పాల్గొన్నారు. అభ్యర్థుల స్గోగన్స్‌తో టీఎఎస్పీఎస్సీ పరిసర ప్రాంతాలు ద్దద్దరిల్లితున్నాయి. చైర్మన్ బయటకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గురుకుల, గ్రూప్ 2, జేఎల్, ఏఓ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల గ్రూప్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో టెట్ పరీక్ష ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూప్స్‌కు చదివేందుకు సమయం లేదని వాపోయారు. అంతేగాక ఇప్పటికే పలు పేపర్ లీకేజీ జరిగిన అదే బోర్డుతో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. మొత్తం 5,51,943 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. -
ఓటర్ల కాళ్లు మొక్కుతూ.. మునుగోడులో ఓయూ విద్యార్థుల ప్రచారం
సాక్షి, మునుగోడు: టీఆర్ఎస్ను ఓడించాలని కోరుతూ మునుగోడులో ఓయూ జేఏసీ విద్యార్థులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసగిస్తున్న టీఆర్ఎస్కు ఓటు వేయొద్దంటూ మెడకు ఉరితాళ్లు బిగించుకుని, ఓటర్ల కాళ్లు మొక్కారు. చండూరులో ఆదివారం ఈ వినూత్న ప్రచారం కనిపించింది. ‘సాలు దొర ఇక సెలవు..’, ‘కేసీఆర్‌ను ఓడిద్దాం.. నిరుద్యోగుల జీవితాలను కాపాడుకుందాం’ అనే నినాదాలతో నియోజకవర్గంలో 9 రోజుల పాటు ప్రచారం నిర్వహించినట్లు విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు అనేక హామీలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఓటర్లు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే ఉరే శరణ్యమని వాపోయారు. రొట్టె చేస్తా.. ఓట్లు అడుగుతా.. మంత్రి సత్యవతి రాథోడ్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం గరకతండాలోని ఓ గిరిజన ఇంట్లో రొట్టె చేశారు. వారితో కలిసి రొట్టెతిన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని వారిని కోరారు. -
ఆర్టీసీ సమ్మె; ఓయూ విద్యార్థుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులతో పాటు వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలు దేరిన ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, టీఎస్‌యూ, టీఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూ క్యాంపస్‌లో భారీగా పోలీసు బలగాలను మొహరించి విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చలో ప్రగతి భవన్ ముట్టడికి వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడికి విపక్ష నేతలు, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించారు. సీపీఎం, సీపీఐ, ఏఐఎస్ఎఫ్ డీఐవైఎఫ్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. అరెస్టు సమయంలో పరుష పదజాలంతో దూషించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు పోలీస్ శిక్షణ కేంద్రంలో నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో ఆర్టీసీ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. వీరికి దళిత సంఘాలు, సీపీఎం, బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద సామూహిక దీక్షను చేపట్టారు. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ సామూహిక దీక్షను ప్రారంభించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఓయూ జేఏసీ నిరసన
-
అమ్మాయిలు.. అభద్రత!
ఓయూ లేడీస్ హాస్టల్.. 2014లో ఓతాగుబోతు లోపలికి ప్రవేశించి విద్యార్థినులను బెదిరించాడు. వారు అప్రమత్తమై అతన్నిపట్టుకునేలోపే వెనుకవైపు నుంచి గోడ దూకి పారిపోయాడు. ♦ ఈ ఏడాది ఓ యువకుడు అర్ధరాత్రి హాస్టల్ గదిలోకి ప్రవేశించి దొంగతనానికిప్రయత్నించగా అమ్మాయిలు పట్టుకొనిదేహశుద్ధి చేశారు. అయితే నిందితుడు వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ♦ తాజాగా రెండు రోజుల క్రితం తెల్లవారుజామున ఓ అగంతకుడు విద్యార్థినుల హాస్టల్లోకి ప్రవేశించి ఓ అమ్మాయి గదిలో నుంచి సెల్‌ఫోన్ దొంగిలించాడు. అడ్డుకునేందుకుప్రయత్నించిన విద్యార్థినులను కత్తి చూపి బెదిరించి గోడ దూకి పారిపోయాడు. ♦ ....ఇలా తరచూ సంఘటనలు జరుగుతున్నా ఓయూ అధికారులు పట్టించుకోవడం లేదు. భద్రత పెంపు విషయంలో చర్యలుతీసుకోవడం లేదు. తార్నాక: నగరంలో నేరాల నియంత్రణ.. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఆధునిక పద్ధతులు.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండగా, యువతుల భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చే ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం ఆ ఛాయలు కనిపించడం లేదు. కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సిన చోట బయటి వ్యక్తులు సునాయాసంగా ప్రవేశించి దాడులు చేసి దర్జాగా పోతున్నారు. ముఖ్యంగా మహిళా హాస్టళ్లలో చోరీలు నిత్యకృత్యమయ్యాయి. హాస్టళ్లలోకి ఆగంతుకులు చొరబడి విద్యార్థినులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలనుంచి ఓయూ క్యాంపస్‌కు వచ్చిన వారు ఇక్కడి హాస్టళ్లలో ఉండాలంటే భయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా పాలకవర్గం తీరు మారడంలేదు. తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సంఘటన జరిగినపుడు హడావిడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఓ అగంతకుడు తెల్లవారు జామున విద్యార్థినుల హాస్టల్లోకి ప్రవేశించి ఓ అమ్మాయి గదిలో సెల్‌ఫోన్ దొంగిలించడమే కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమెతో పాటు ఇతర విద్యార్థినులను కత్తిచూపి బెదిరించి గోడ దూకి పారిపోయాడు. ఆగంతుకుడు ప్రవేశించిన ఉమెన్స్ హాస్టల్ ఇదే.. ♦ 2014లో కూడా ఇలాగే ఓ తాగుబోతు అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి విద్యార్థినులను బెదిరించాడు. వారు అప్రమత్తమై అతన్ని పట్టుకునే లోపే వెనుకవైపు నుంచి గోడ దూకి పారిపోయాడు. ♦ 2015లో ఓ విద్యార్థిని లైబ్రరీలో చదువుకుని రాత్రి వేళ తిరిగి హాస్టల్‌కు వస్తుండగా, లా కళాశాల వద్ద ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడిచేశారు. ఆమె ప్రతిఘటించి తప్పించుకోగలిగింది. విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థులు అక్కడకు వెళ్లేసరికి వారు పారిపోయారు. ♦ ఇదే ఏడాది ఓ యువకుడు అర్ధరాత్రి హాస్టల్ గదిలోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించగా అమ్మాయిలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే సదరు వ్యక్తి వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ♦ 2016లో ఓయూ క్యాంపస్‌లో నడుచుకుంటూ హాస్టల్‌కు వెళుతున్న ఇద్దరు అమ్మాయిలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడి వారి నుంచి సెల్ఫోన్లు, బ్యాగులు లాక్కునేందుకు ప్రయత్నించారు. యువతులు కేకలు వేయడంతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు వచ్చేసరికి ఆగంతుకులు పారిపోయారు. ♦ 2016లో బయట నుంచి క్యాంపస్‌లోకి వచ్చిన ఓ ప్రేమజంటను జువాలజీ డిపార్టుమెంట్ వద్ద అడ్డుకుని పోలీసులమంటూ బెదిరించి వారినుంచి బంగారు ఆభరణాలు లాక్కున్నారు. దీనిపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు. వారం రోజుల తర్వాత ఇదే గ్యాంగ్ రాత్రి వేళ ఐపీఈ వద్ద ఓ ప్రేమజంటను బెదిరించి వారినుంచి డబ్బులు లాక్కుని వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడిన వారిలో ఒకరు పీజీ పూర్తి చేసిన నాన్బోర్డర్ కాగా, మిగతా ఇద్దరు వర్సిటీతో ఎలాంటిసంబంధం లేని వ్యక్తులు కావడం గమనార్హం. ఒక్కరినీ పట్టుకోలేదు.. లేడీస్ హాస్టల్లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగడం.. ఆగంతుకులు చొరబడ్డం జరుగుతోంది. విద్యార్థినులను భయబ్రాంతులకు గురిచేస్తున్నా ఈ సంఘటనలపై పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది లేదు. ఫిర్యాదులు చేసినా ఇంతరకు కనీసం ఒక్కరిని కూడా పట్టుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. వెనుకవైపు లేని సీసీకెమెరాలు విద్యార్థినుల రక్షణం కోసం హాస్టల్ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అధికారులు కేవలం హాస్టళ్ల ముందు మాత్రమే బిగించారు. ముందు వైపు సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నందున దుండగులు హాస్టళ్ల వెనుక నుంచి గోడదూకి లోపలికి ప్రవేశిస్తున్నారు. జరిగిన సంఘటనలన్నీ అలాగే ఉన్నా అధికారులు మాత్రం హాస్టళ్ల వెనుక వైపు రక్షణ చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు చేస్తున్నాం.. ఓయూ ఇంజినీరింగ్ లేడీస్ హాస్టల్లోకి వ్యక్తి ప్రవేశించాడనే సమాచారం రాగానే తనిఖీలు చేపట్టాం. క్లూస్‌టీమ్‌తో నమూనాలు సేకరించాం. అయితే, సీసీకెమెరాల్లో ఫుటేజ్ చూసినా ఫలితం కనిపించలేదు. ఆగంతుకుడు వెనుకవైపు నుంచి పారిపోయి ఉంటాడు. కేసు నమోదు చేసి గాలింపు చేపట్టాం. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం. – రాజశేఖర్‌రెడ్డి, ఓయూ ఇన్స్పెక్టర్ -
జన తెలంగాణ పార్టీ ఆవిర్భావం
హైదరాబాద్: జన తెలంగాణ పార్టీ (జేటీ పీ) పేరుతో ఓయూ విద్యార్థులు సోమవారం కొత్త పార్టీ స్థాపించారు. రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు గడిచినా ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు రానందున పార్టీని స్థాపించినట్లు జేటీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఓయూ పరిశోధక విద్యార్థి కొర్వి బాలకృష్ణముదిరాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆధ్వర్యంలో పార్టీని స్థాపించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి మన వారే పాలిస్తున్నా.. రైతులు నష్టపోతూనే ఉన్నారని, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు సన్న గిల్లుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు అసమానతలు పెంచేందుకు ప్రైవేట్ వర్సిటీల స్థాపనకూ రంగం సిద్దం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నారని, రాష్ట్రంలో భూస్వామ్య వ్యవస్థకు పురుడు పోస్తూ ప్రజల్ని వెట్టి వైపు మళ్లించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఇలా అనేక అంశాలను చర్చించి కొత్త పార్టీని స్థాపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యో గులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజానీ కాన్ని కలుపుకొని సాగుతామని బాలకృష్ణ వివరించారు. కార్యక్రమంలో జీటీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దగౌని సుదర్శన్, నాయకులు గోపికృష్ణ, శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో దక్కని చోటు.. బీజేపీ నుంచి పోటీ?
సాక్షి, హైదరాబాద్ : అసంతృప్తుల నిరసనలు కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలలో తన పేరు లేకపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత మానవతారాయ్ తీవ్ర అసంతృత్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని విద్యార్థులందరికీ వివరిస్తానని.. మహాకూటమికి వ్యతిరేకంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఓయూ విద్యార్థులకు సీట్ల కేటాయింపుల్లో మహాకూటమి తీవ్ర అన్యాయం చేసిందని ఓయూ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవతారయ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్థానాన్ని ఆశించిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఆసీటు టీడీపీకి కేటాయించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మరోసారి పోటీలో నిలిచారు. మరోవైపు మానవతారాయ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తన అనుచరులతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. బీజేపీ నుంచి కంటోన్మెంట్ స్థానంలో బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం. -
ఓయూలో విద్యార్ధుల ఆందోళన
-
టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి జైలుకెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వాలని ఓయూ విద్యార్థి సంఘం కోరింది. వచ్చే ఎన్నికల్లో వారికి తగు సంఖ్యలో సీట్లు కేటాయించాలని విజ్ఞపి చేసింది. ఈ మేరకు సంఘం నేత ఎం.కె.విజయ్‌కుమార్ ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ వి.గెహ్లాట్‌ను కలిశారు. ఇటీవల హైదరాబాద్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఓయూ విద్యార్థి సంఘం నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో విద్యార్థులకు టీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని విజయ్‌కుమార్ ఆరోపించారు. -
చార్జ్‌షీటే తరువాయి..!
సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజ్ కేంద్రంగా ఉస్మానియా యూనివర్శిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో జరిగిన మాస్ కాపీయింగ్ కేసులో విద్యార్థులు సైతం నిందితులుగా మారారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ అధికారులు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాపీయింగ్‌కు సహకరించేందుకు దళారుల ద్వారా నగదు చెల్లించి, ఆర్కే డిగ్రీ కాలేజీ కేంద్రంగా పరీక్ష రాసిన 104 మంది విద్యార్థులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 40 మందికి సీఆర్పీసీ 41 (నిందితులుగా) నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ఆర్కే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు కొందరు దళారులనూ అరెస్టు చేసిన విషయం విదితమే. గత అక్టోబర్‌లో ఉస్మానియా యూనివర్శిటీకి సంబంధించిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీలోనూ సెంటర్ ఏర్పాటు చేశారు. సాధారణంగా పరీక్షా కేంద్రానికి యూనివర్శిటీ ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాల సెట్లను అందిస్తుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అభ్యర్థుల సంఖ్య కంటే కొన్ని ఎక్కువగానే జవాబు పత్రాల సెట్లు అందజేస్తుంది. దీనిని అనుకూలంగా మార్చుకున్న ఆర్కే డిగ్రీ కాలేజ్ యాజమాన్యం సప్లిమెంటరీ పరీక్ష రాసే 104 మంది విద్యార్థులతో కుమ్మక్కై వేరే కేంద్రానికి సంబంధించి హాల్‌టికెట్ జారీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తమ కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది. వీరికోసం యూనివర్శిటీ నుంచి అదనంగా వచ్చే జవాబు పత్రాల సెట్లను వాడుకుంది. ఇందుకుగాను ఒక్కో సబ్జెక్ట్‌కు దాదాపు రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇలా మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొందరి పేర్లతో రెండేసి ఆన్సర్ షీట్లు సిద్ధమయ్యాయి. గుట్టుగా సాగిన ఈ వ్యవహారాన్ని యూనివర్శిటీ అధికారులు గుర్తించారు. గత అక్టోబర్ 21న ఆర్కే డిగ్రీ కళాశాల కేంద్రంలో జరిగిన కంప్యూటర్ సైన్స్–3 పరీక్ష పేపర్లు దిద్దుతున్న వర్శిటీ పరీక్షల విభాగం అధికారులు ఈ మాల్ ప్రాక్టీస్ స్కామ్‌ను పసిగట్టారు. ఆర్.హరికృష్ణ అనే విద్యార్థి పేరుతో రెండు ఆన్సర్ బుక్లెట్స్ వర్శిటీకి వచ్చాయి. ఇతడికి పరీక్ష కేంద్రంలో 7257771 నంబర్లతో కూడిన బుక్లెట్ ఇవ్వగా... దీంతో పాటు 7257384 నంబర్‌తో కూడిన బుక్లెట్ సైతం అతడి నుంచి కాలేజీ ద్వారా వర్శిటీకి చేరింది. దీంతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇతడి ఫలితాన్ని ఆపేశారు. దీంతో హరికృష్ణ వర్శిటీ అధికారులను సంప్రదించగా... ఆర్కే కాలేజీ నుంచి అటెండెన్స్ షీట్ తీసుకురావాలని సూచించారు. హరికృష్ణ తీసుకువెళ్లిన షీట్లో ఉన్న వివరాల ప్రకారం 7257771 బుక్లెట్ అతడికి జారీ అయింది. దీనిపై చీఫ్ సూపరింటెండెంట్ ముద్ర ఉండగా... 7257384 నంబర్‌తో కూడిన బుక్లెట్పై కాలేజీ ప్రిన్సిపాల్ ముద్ర ఉంది. దీంతో లోతుగా ఆరా తీసిన అధికారులు మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించారు. ఆర్కే డిగ్రీ కాలేజీలో ఏకంగా బుక్‌లెట్స్‌ను విద్యార్థులకు ముందే అందించినట్లుగా వర్శిటీ అధికారులు గుర్తించారు. ఈ కేంద్రంలో పరీక్ష రాసిన మొత్తం 104 మంది విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడినట్లు తేల్చారు. వీరికి వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించినా...ఆర్కే కాలేజీలో పరీక్ష రాసినట్లు తేల్చారు. వర్శిటీ అధికారులు ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయండంతో, ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ కాలేజీ యాజమాన్యం, చీఫ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్లు తదితరులపై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ, ఏపీ పబ్లిక్ ఎగ్జామ్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్‌కు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన ఎస్సై జగదీశ్వర్‌రావు మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు గుర్తించిన సమాధాన పత్రాలతో పాటు అనేక ఆధారాలు సేకరించారు. ఇందులో కాలేజీ ప్రిన్సిపాల్ స్వర్ణలత పాత్ర రూఢీ కావడంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ 104 మంది విద్యార్థులను కొందరు దళారులు ఆర్కే డిగ్రీ కాలేజీ నిర్వాహకుల వద్దకు తీసుకువచ్చినట్లు తేల్చారు. నగదు చెల్లించి మాల్ ప్రాక్టీస్ ద్వారా పరీక్ష రాసిన నేపథ్యంలో వీరినీ నిందితుల జాబితాలో చేర్చారు. అందరినీ అరెస్టు చేయడం సాధ్యం కాని నేపథ్యంలో సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 40 మందిని ఈ విధంగా పిలిచిన దర్యాప్తు అధికారి వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. మిగిలిన వారికీ నోటీసుల జారీ పూర్తయిన తర్వాత విద్యార్థులతో సహా నిందితులు అందరిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయనున్నారు. గరిష్టంగా నెల రోజుల్లో దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు. -
రాహుల్ టూర్: తన్నుకున్న ఓయూ స్టూడెంట్స్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటనలో గందరగోళం చోటుచేసుకుంది. హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సీనియర్ నేతలతో సమావేశం రసాభసగా మారింది. ముఖ్యనేతల జాబితాలో సీనియర్ నేత జానారెడ్డి పేరు లేకపోవడంతో ఆయన షబ్బీర్ అలీలు అలిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. దీంతో గూడూరు నారయణ రెడ్డి బుజ్జగించి లోపలికి పంపించారు. ఇక రేవంత్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సైతం చేదుఅనుభవం ఎదురైంది. సీనియర్ల మీటింగ్ లోపలికి వెళ్లడానికి రేవంత్ రెడ్డికి పాస్ నిరాకరించగా.. సునీతా లక్ష్మారెడ్డిని అనుమతించలేదు. దీంతో ఆమె కంట తడిపెట్టారు. ఉస్మానియా విద్యార్థుల భేటీలో సైతం గొడవ చోటుచేసుకుంది. కొందరికి అనుమతి లేదనడంతో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు హోటల్లోనే కొట్టుకున్నారు. ఈ గొడవతో విద్యార్థులతో రాహుల్ భేటీ రద్దైంది. చదవండి: టీడీపీతో పొత్తు అవకాశాలు: రాహుల్ -
ఆందోళన చేపట్టిన ఓయూ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో శుక్రవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పోలీస్ రిక్రూట్మెంట్లో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఓయూ లైబ్రరీ నుంచి భారీ ర్యాలీగా వచ్చిన విద్యార్థులు గన్‌పార్క్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం నిన్న విడుదల చేసిన కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో గరిష్ట వయోపరిమితి ఆరు సంవత్సరాలు పెంచాలని నిరుద్యోగులు ధర్నా చేశారు. అలాగే ఇంగ్లీష్ మీడియం మెరిట్ విధానం వల్ల తెలుగు మీడియం విద్యార్థులు నష్ట పోతున్నారని.. దాన్ని వెంటనే తొలగించి వయోపరిమితి పెంచాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతా రాయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వయో పరిమితి పెంచక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెపడుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆందోళన చేపడుతున్న జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. -
సీఎంకు ఉస్మానియా విద్యార్థుల బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంచల్ గూడ జైలు నుంచి అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 4న తమను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, అమానవీయమని, నియంతృత్వమని లేఖలో పేర్కొన్నారు. బహిరంగ లేఖ సారాంశం.....మీ(సీఎం కేసీఆర్) నియోజకవర్గం పరిధిలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన మురళీ ముదిరాజ్ ఎంఎస్సీ ఫిజిక్స్ చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉద్యోగం రాకపోయే సరికి నిరాశా నిస్పృహలతో డిసెంబర్ 3న మురళి ఆత్మహత్య చేసుకున్నాడు. మోసపోయిన లక్షలాది మంది నిరుద్యోగ యువకుల్లో మీ ప్రభుత్వ పాలనపట్ల గూడుకట్టుకున్న అసహనానికి నిలువెత్తు నిదర్శనం మురళీ ముదిరాజ్ ఆత్మహత్య. దీంతో ఉస్మానియా విద్యార్థులమైన మేము ఆ పేద బీసీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనే సదుద్దేశంతో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనే డిమాండ్‌తో శాంతియుతంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడం శోచనీయం. టీఆర్ఎస్ నాయకులు, పోలీసుల బెదిరింపుల వల్ల భయపడ్డ ఆ బాధిత కుటుంబం మురళీ శవాన్ని అప్పగించాలని ఉస్మానియా విద్యార్థులను వేడుకుంది. శవాన్ని తరలించేందుకు శాంతియుతంగా సహకరించే సమయంలో పోలీసులు అత్యుత్సాహం చూపినా సంయమనం పాటించాం. మురళీ మృతదేహాన్ని హాస్టల్ నుంచి తరలించిన తర్వాత పోలీసుల అకృత్యానికి అంతే లేకుండా పోయింది. హాస్టల్ రూం తలుపులు బద్దలు కొట్టి విచక్షణా రహితంగా భౌతిక దాడులకు దిగారు. నాలుగో తేదీ తెల్లవారు జామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు వివిధ పోలీస్స్టేషన్లలో తిప్పి వివిధ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు తరలించారు. కనీసం జడ్జి మందు ప్రవేశపెట్టకుండా ఇన్ని అక్రమ కేసులు బనాయించి చెంచల్ గూడ జైలుకు తరలించారు. మేమేం నేరం చేశామని ఇన్ని క్రిమినల్ కేసులు బనాయించారని ప్రశ్నించారు. పేద బీసీ కుటుంబానికి న్యాయం జరగాలని పోలీసులకు సహకరించినందుకా? లేక లక్ష ఉద్యోగాలు అడిగిందుకేనా ఈ శిక్షా అని సూటిగా అడిగారు. -
రోడ్డెక్కిన ఓయూ విద్యార్థినులు..
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లోని విద్యార్థినులు రోడ్డెక్కారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ ముందు రాస్తారోకో నిర్హహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. వసతి గృహంలో చెప్పపెట్టకుండా నీటి వసతి, కరెంట్ కట్చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదు.. మాతో పాటు ఓ రెండు రోజులు ఉంటే మా సమస్యలు ఎంటో అర్ధమవుతాయని అన్నారు. -
ఓయూ విద్యార్థుల ముందస్తు అరెస్టులు
- ఉద్యోగాలడిగితే మూకుమ్మడి అరెస్టులా? - నిరుద్యోగ జేఏసీ సూటి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ముందస్తు చర్యగా పలువురు నిరుద్యోగ జేఏసీ విద్యార్థులతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం ఐదుగంటలకే ఉస్మానియా హాస్టళ్ల వద్ద విద్యార్థులను అరెస్టు చేసేందుకు పోలీసులు మోహరించారు. పలువురు విద్యార్థులు అరెస్టులను తప్పించుకొనేందుకు అజ్ఞాతం లోకి వెళ్ళినట్లు విద్యార్థి నాయకులు తెలిపారు. కొంతమందిని హాస్టల్ గదుల్లోనే పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ‘ఇ’హాస్టల్, ‘బి’ హాస్టల్, న్యూ రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్(ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్) నుంచి నిరుద్యోగ జేఏసీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని ఉత్సవ ప్రాంగణం నుంచి బయటకు పంపారు. అదేవిధంగా నిరుద్యోగ విద్యార్థి ఉద్యమ నాయకుడు, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేశ్‌ను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాస్‌లు ఇచ్చి అరెస్టులు చేశారు యూనివర్సిటీ ఉత్సవ ప్రాంగణంలోనికి వస్తున్న విద్యార్థులను, ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్ ‘ఎ’ గ్రౌండ్ నుంచి, ‘బి’ గ్యాలరీకి వెళ్తున్న ఓయూ జేఏసీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో తెలంగాణ విద్యార్థి సంఘం నాయకుడు దుర్గం భాస్కర్, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, వట్టికూటి రామారావు, నిజ్జన రమేశ్, ఏఐఎస్ఎఫ్ ప్రేమ్, టీయూఎస్ఎఫ్ పుల్లారావు, దరువు మల్లన్న, ఆశప్ప, శ్రవణ్, విజయ్‌కుమార్ మాదిగ, గణేశ్ తదితరులున్నారు. వీరిని అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మా యూనివర్సిటీ, మా సెలబ్రేషన్స్ అని భావించి పాల్గొనేందుకు వస్తుంటే ఉత్సవాల్లో పాల్గొనకుండా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని దుర్గం భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. భయభ్రాంతులకు గురిచేస్తారా? ఉద్యోగాలడిగితే మూకుమ్మడిగా అరెస్టులు చేస్తారా అని నిరుద్యోగ జేఏసీ ప్రశ్నించింది. నిరుద్యోగ జేఏసీ గత కొంతకాలంగా చేస్తు న్న డిమాండ్లను పట్టించుకోకుండా, విద్యా ర్థులను ఉన్నపళంగా అరెస్టు చేసి, భయ భ్రాంతులకు గురిచేయడం అన్యాయమని నిజ్జన రమేశ్ అన్నారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల ఉద్యోగాల విషయంలో ఏ హామీ లేకుండా, కేవలం అరగంట కోసం పోలీసులతో వర్సిటీని నింపేసి, కార్యక్రమాన్ని హడావుడిగా ముగించుకొన్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికే తమపై 132 కేసులున్నాయని, ఇంకా కేసులు పెట్టి సాధించేదేమీ ఉండదని ఆయన తెలిపారు. -
ఉస్మానియా కోసం లేఖాయుద్ధం!
నిజాం సర్కారుకు వందల సంఖ్యలో విద్యార్థుల లేఖలు హైదరాబాద్ విద్యా సమితి ఏర్పాటు - సమితి సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి - చివరికి వర్సిటీ ఏర్పాటుకు నిజాం ఫర్మానా - పలు ప్రత్యేకతలతో అరబ్బీ భాషలో లోగో ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి ముందు కొన్ని కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం విద్యార్థులు ఒక రకంగా లేఖాయుద్ధమే చేశారు. వారికి మద్దతుగా విద్యావేత్తలు, సామాజికవేత్తలు ‘హైదరాబాద్ విద్యా సమితి’ని ఏర్పాటు చేసి.. ఉద్యమమూ ప్రారంభించారు. చివరికి ఇది నిజాం వద్దకు వెళ్లడంతో ఉస్మానియా ఏర్పాటుకు బీజం పడింది. – మహ్మద్ మంజూర్ లేఖాస్త్రాలు.. ఉద్యమాలు.. 1887లో నిజాం కళాశాల ఏర్పాటైంది. అందులో చదివిన విద్యార్థులకు బ్రిటిష్‌వారి అధీనంలోని మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ సర్టిఫికెట్లు అందజేసేవారు. ఆ వర్సిటీ విధానాలు, నిజాం విద్యా విధానాలు వేరుగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు చదువులను మధ్యలోనే వదిలేశారు. కొంతకాలానికి వందల సంఖ్యలో విద్యార్థులు హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటూ నిజాం సర్కారుకు లేఖలు రాయడం మొదలుపెట్టారు. ఆ లేఖల సారాంశం తెలుపుతూ అప్పటి న్యాయ, విద్యాశాఖ కార్యదర్శి అక్బర్ హైదరీ నిజాం ప్రభుత్వానికి ప్రతి వారం ఒక లేఖ రాసేవారు. కానీ ప్రభుత్వం తరఫున స్పందన కనిపించలేదు. చివరికి 1914లో విశ్వవిద్యాలయ ఉద్యమం ప్రారంభించారు. సంస్థానంలోని విద్యా విభాగంలో పనిచేస్తున్న విద్యావేత్తలు, పత్రికా సంపాదకులు, సామాజిక వేత్తలు, ధార్మిక పండితులతో 1914లో అక్బర్ హైదరీ హైదరాబాద్ ఎడ్యుకేషన్ సమితి ఏర్పాటు చేశారు. అందులో సరోజినీనాయుడు, మహ్మద్ ముర్తజా, అబ్దుల్ బాసిత్, మహ్మద్ అక్బర్ అలీఖాన్‌లను సభ్యులుగా నియమించారు. కమిటీ పలు దఫాలు సమావేశమై.. వర్సిటీ ఏర్పాటు ఆవశ్యకతపై నిజాం సర్కారుపై ఒత్తిడి తెచ్చింది. నిజాం సంస్థానం ధనికంగా ఉన్నా.. విద్యకు ప్రా«ధాన్యత లేదన్న బ్రిటిష్ పాలకుల వ్యాఖ్యలనూ సర్కారు దృష్టికి తెచ్చింది. 1914 నుంచి 1917 వరకు ఈ కమిటీ పలు నివేదికలను సమర్పించింది. దీంతో 1917 ఏప్రిల్ 26న విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిజాం ఫర్మానా జారీ చేశారు. ఓయూ విద్యార్థుల తొలి ధర్నా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల ఐక్యత తొలి నుంచీ బలంగానే ఉంది. 1938లో ఆర్ట్స్ విభాగంలో చదువుతున్న ఓ విద్యార్థి టికెట్ లేకుండా ప్రయాణం చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆ విషయం విద్యార్థులకు చేరింది. అరెస్టుకు వ్యతిరేకంగా దాదాపు 200 మంది విద్యార్థులు నిజాం సంస్థానం ప్రధానమంత్రి నివాసం షామంజిల్ (ప్రస్తుతం దిల్కుషా గెస్ట్‌హౌస్) ముందు ధర్నాకు దిగారు. వర్సిటీ విద్యార్థిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి పోలీసులకు సమాచారమివ్వకుండా.. విద్యావేత్త అయిన బహదూర్ యార్ జంగ్‌ను పిలిపించి విద్యార్థులకు నచ్చజెప్పాలని కోరారు. ఆయన వచ్చినా విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో.. స్వయంగా ప్రధానమంత్రి బయటికి వచ్చారు. చాలా సేపటి నుంచి ఏమీ తినకుండా, తాగకుండా ఉన్నారు, అలసిపోయారంటూ విద్యార్థులకు పళ్లు, ఫలాలు, షర్బత్ ఇప్పించారు. ప్రధాని తీరుతో విద్యార్థుల కోపం తగ్గింది. అనంతరం విద్యార్థిని విడుదల చేశారు. దీన్ని ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల తొలి ధర్నాగా చెబుతారు. అత్యున్నత ప్రమాణాలు పాటిద్దాం.. ‘‘విద్యాశాఖ ద్వారా (1917 ఏప్రిల్ 21, శనివారం) పంపిన ఉత్తరం అందింది. బ్రిటిష్ వైస్రా య్ ప్రసంగ సారాంశం, హైదరాబాద్ సంస్థాన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న సూచనలు, సలహాలతో ఏకీభవిస్తున్నాం. నిజాం సంస్థానంలో అత్యున్నత ప్రమాణాలతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇస్తున్నాం. ఈ విశ్వవిద్యాలయంలో ఆధునిక, ప్రాచీన విద్యతో పాటు తూర్పు, పాశ్చాత్య (ఈస్టర్న్, వెస్టర్న్) విద్యను కూడా బోధించాలి. విద్యావ్యాప్తితో పాటు నైతిక ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అన్ని విభాగాల్లో అత్యుత్తమ పరిశోధనలు జరగాలి. బోధన ఉర్దూలో జరపాలని నిర్ణయించాం. విశ్వవిద్యాలయానికి ఉస్మానియా యూనివర్సిటీగా నామకరణం చేయండి’’ 1917 ఏప్రిల్ 26న ఓయూ ఏర్పాటుకు నిజాం జారీ చేసిన ఫర్మానా సారాంశమిది. పసుపు రంగులో.. 1917లో ఉస్మానియా వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. దేశవిదేశాలకు చెందిన వర్సిటీ లోగోలను పరిశీలించి.. వందకుపైగా లొగోలు తయారు చేయించారు. ఇతర వర్సిటీల తరహాలో గుండ్రంగా కాకుండా విభిన్నంగా లోగో ఉండాలని నిర్ణయించారు. అలా విభిన్నంగా ఉన్న 32 లోగోల నుంచి ఐదింటిని జల్లెడ పట్టి.. అందులో విద్య ప్రాముఖ్యతను తెలుపుతూ అరబ్బీ భాషలో ఉన్న లోగోను ఎంపిక చేసి నిజాంకు పంపారు. దానిని పరిశీలించిన నిజాం పలు సూచనలు చేస్తూ 1919 జూలై 16న ఫర్మానా జారీ చేశారు. ఫర్మానా సారాంశమిది.. ‘‘మోనోగ్రామ్ (లొగో) నమునా బాగుంది. విశ్వవిద్యాలయం భవనం న„ŠS (నమునా) తయారయ్యే వరకు లోగో మధ్యలో అరబ్బీ అక్షరం (అయిన్) ప్రవేశపెట్టండి. లోగోకు మా సంస్థానం రంగు అయిన పసుపుపచ్చ రంగును సూచిస్తున్నాం’’. స్వాతంత్య్ర పోరాట బాటలో.. స్వాతంత్య్రం కోసం దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఉద్యమాలు కొనసాగుతున్నా.. 1942 వరకు ఉస్మానియాలో మాత్రం బయటపడలేదు. వర్సిటీ ల్లో స్వాతంత్య్ర పోరాట సంఘాలను ఏర్పాటు చేయడం కోసం రవీంద్రనాథ్ ఠాగూర్, మున్షీ ప్రేమ్‌చంద్ ఆధ్వర్యంలో విద్యావేత్తలు, మేధావులు, రచయితలతో ఓ సంస్థ ప్రారంభమైంది. 1942లో ఆ సంస్థ నేతలు ఉస్మానియా విద్యార్థులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి స్వాతంత్య్ర ఉద్యమ ఆవశ్యకతను వివరించి.. ఒక సంఘాన్ని ఏర్పాటు చేయించారు. దానికి ‘హైదరాబాద్ తరఖీ పసంద్ తరహరీక్ (హైదరాబాద్ అభివృద్ధిని నచ్చే సంస్థ)’గా పేరు పెట్టారు. మఖ్దూం మొహియుద్దీన్, రాజ్ బహదూర్, మీర్హసన్, మహబూబ్ హసన్జిగర్, అబిద్ అలీఖాన్ తదితరులు సంస్థ బాధ్యతలు స్వీకరించారు. ఇలా నిజాం పాలకుల నుంచి విముక్తి కోసం తొలి ఉద్యమం పుట్టింది. రజాకార్ల అరాచకాలు, అత్యాచారాలను ఈ సంస్థ ద్వారా నిజాం సర్కారు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు సర్కారుకు లేఖలు రాశారు. ఇక భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం.. నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేశారు. లోగో ప్రత్యేకతలివి.. లోగోలో పైన అరబ్బీలో ‘నూర్ అలా నూర్ (జ్ఞానంతోనే వెలుగు)’అనే పదం ఉంటుంది. దాని కింద ఆసిఫీయా సంస్థానం దస్తార్ (టోపీ) ఆకృతి. దాని కింద అరబ్బీలో ‘అనా మధీనతున్ ఇల్మ్ వ అలీ బాబు హా (నేను (మహ్మద్ ప్రవక్త) జ్ఞాన నగరం మదీనా హజ్రత్ అలీ. దాని ముఖ ద్వారం)’అని ఉంటుంది. మధ్యలో అరబ్బీ అక్షరం. (నిజాం ఉస్మాన్అలీ ఖాన్ పేరు అరబ్బీ భాషలో అయిన్ అక్షరంతో మొదలవుతుంది. కాబట్టి లోగో మధ్యలో ఆ అక్షరం పెట్టాలని కోరారు.) ఇరుపక్కలా ఉస్మానియా యూనివర్సిటీ అని ఇంగ్లిషులో ఉంటుంది. కింది భాగంలో కుడివైపు జామియా అని, ఎడమవైపు ఉస్మానియా అని అరబ్బీలో రాసి ఉంది. -
కేకేకు చేదు అనుభవం.. గెటవుట్ నినాదాలు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కేకే(కే కేశవరావు)కు చేదు అనుభవం ఎదురైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టిన ఆయనను విద్యార్థులు నిరసనలతో చుట్టుముట్టారు. కేకే గెటవుట్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాస్తంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓయూలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు మంగళవారం కేకే యూనివర్సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలోని ప్రిన్సిపల్ చాంబర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఓయూ ఉత్సవాల కమిటీతో మాట్లాడి బయటకు వస్తుండగా అప్పటికే అక్కడ ఉన్న వివిధ విద్యార్థి సంఘాల నేతలు కేకేను చుట్టుముట్టారు. తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టలేదని, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వెనుకకు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కేకే గెటవుట్ అంటూ ఆయనపైకి వందలాదిమంది విద్యార్థులు దూసుకెళ్లారు. అయితే, ఈ విషయాన్ని శాంతంగా మాట్లాడుకుందామని కేకే చెబుతున్నా వారు వెనుకకు తగ్గలేదు. దీంతో అప్రమత్తమైన కేకే భద్రతా సిబ్బంది, అక్కడ ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య చిన్నపాటి తోపులాట చోటుచేసుకుంది. -
మల్కాన్గిరికి వెళ్లనున్న ఓయూ జేఏసీ
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల విద్యార్థులు మల్కాన్‌గిరి ఎన్కౌంటర్ ప్రాంతానికి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఓయూ జాక్ ఫర్ సోషల్ జస్టిస్ గురువారం ప్రకటించింది. ఏవోబీ జరిగిన ఎన్‌కౌంటర్‌ను బూటకమైనదిగా జేఏసీ అభివర్ణించింది. అన్ని యూనివర్సిటీల పరిశోధన విద్యార్థులు ఈ నెల 6వ తేదీన అక్కడికి వెళ్లి ఘటనపై నిజనిర్ధారణ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు చనిపోయిన మావోయిస్టులు మరియు పోలీసు కుటుంబాల వారితో మాట్లాడనున్నట్లు తెలిపింది. భూటకపు ఎన్‌కౌంటర్‌పై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. త్వరలోనే హైదరాబాద్‌లో మానవహక్కుల సంఘాలతోపాటు ప్రజా సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు జాక్ తెలిపింది. -
ఉత్తమ్‌తో ఓయూ విద్యార్థుల భేటీ
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గురువారం భేటీ అయ్యారు. జూన్ 2న వర్సిటీలో జరిగే విద్యార్థి పోరుగర్జనకు హాజరు కావాలంటూ విద్యార్థి నేతలు ఆయనను ఆహ్వానించారు. కేసీఆర్ రెండేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ఎండగట్టే విధంగా నిర్వహిస్తున్న ఈ సభకు హాజరుకావాలని ఉత్తమ్‌ను కోరారు. విద్యార్థిసంఘాల నేతలు మానవతారాయ్, దయాకర్, కోట శ్రీనివాస్‌గౌడ్, శంకర్, నాగేశ్వర్రావు, రంజిత్ తదితరులు ఉత్తమ్‌ను కలసినవారిలో ఉన్నారు. -
ఓయూలో విద్యార్థుల ఆందోళన..
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీజీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు. పరీక్షలు వాయిదా వేసేవరకు ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. -
ఓయూ పీఎస్ ఎదుట విద్యార్ధులు ధర్నా
-
రోడ్డుపై బైఠాయించిన ఓయూ విద్యార్థినీలు
ఓయూ(హైదరాబాద్): తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఓయూలోని విద్యార్థినీలు గురువారం రాత్రి రోడ్డుపై బైఠాయించారు. ఉస్మానియా వర్సిటీలోని లేడీస్ హాస్టల్లో విద్యార్థినీలు తము పడుతున్న అవస్థలుపై అధికారులు స్పందించడం లేదని రోడ్డెక్కారు. ఒకే గదిలో పదిమంది విద్యార్థినీలు ఉండటంతో నానా యాతన పడుతున్నామని వారు వాపోతున్నారు. అలాగే, భోజనం కూడా సరిగా ఉండటం లేదని విద్యార్థినీలు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలను ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్న పరిష్కారం కాకపోవడంతోనే హాస్టల్ ఎదుట బైఠాయించామని బాధితులు తెలిపారు. -
ఓయూలో విద్యార్థుల ఆందోళన
రెండో పీజీ చేస్తున్న వారికీ వసతులు కల్పించాలని డిమాండ్ ప్రిన్సిపాల్‌పై దాడికి యత్నం.. పలువురి అరెస్టు హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పీజీ పూర్తి చేసి అక్కడే రెండో పీజీ చేస్తున్న వారికి కూడా అందరిలాగే హాస్టల్, మెస్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థులు శుక్రవారం ఓయూ సైన్స్ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గతంలో రెండో పీజీ చేసిన వారికీ అన్ని సౌకర్యాలు కల్పించిన వర్సిటీ యాజమాన్యం తమకు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై నెల రోజుల నుంచి ప్రిన్సిపాల్ చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ నర్సింహారావుపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన తలకు గాయం అయింది. ఈ ఘటనలో ఓయూ జేఏసీ నాయకులు మానవతారాయ్‌తో పాటు సుమారు 20 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ.. గతంలో చీఫ్ వార్డెన్‌గా పని చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సింహారావుపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాడిని ఖండించిన 'ఔటా' సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారావుపై విద్యార్థులు దాడి చేయడాన్ని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) నాయకులు ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. -
'గ్రూప్-2లో ఇంటర్వ్యూ రద్దు చేయాలి'
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్) : టీఎస్ పీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో గ్రూప్-2లో ఇంటర్వ్యూను వ్యతిరేకిస్తూ విద్యార్ధి సంఘాలు నిరసనకు దిగాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో గురువారం చోటుచేసుకుంది. పలువురు విద్యార్థులు గ్రూప్-2 కొత్త సిలబస్ కాపీలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ పెట్టడంతో నష్టపోతామని తెలిపారు. -
రాహుల్ వస్తున్నాడనే..నోటిఫికేషన్
హైదారాబాద్: లక్ష ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలనే డిమాండ్‌తో ఉస్మానియూ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం ర్యాలీలు నిర్వహించారు. అశోక్ నగర్ గంథ్రాలయం నుంచి సచివాలయం వరకు... ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక చౌరస్తా వరకూ ర్యాలీలు నిర్వహించారు. రాహుల్ గాంధీ ఓయూకు వస్తున్నాడనే భయంతోనే సర్కారు కేవలం 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిందని విద్యార్థులు విమర్శించారు. అది కూడా కానిస్టేబుళ్లు, క్లర్కులు తదితర ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేశారని, గ్రూప్స్, ఎగ్జ్యిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ వారు చేశారు. -
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాసనవుండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. శనివారం కాంగ్రెస్ రాష్ట్ర మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శారదతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయున వూట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధనకు విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనవసర ఆర్భాటాలకు కోట్లు వెచ్చిస్తున్న పాలకులు విద్యార్థుల మెస్ చార్జీలు చెల్లించకపోవడం దారుణవున్నారు. యుూనివర్సీటలకు వీసీలను నియమించడం లేదని, ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేయకుండా వుుఖ్యవుంత్రి విద్యార్థులపై వివక్ష చూపుతున్నారన్నారు. ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆశలు అడియూసలయ్యూయుని నెరేళ్ళ శారద ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టాలిన్, డేవిడ్, సలీంపాషా, మోహినుద్దీన్, రమేష్ముదిరాజ్, విజయ్‌యాదవ్, చరణ్‌కౌశిక్ యాదవ్, శ్రీథర్గౌడ్, బొమ్మ హన్మ ంతరావు, పుప్పాల మల్లేష్, కొల్లురి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
టీపీఎస్సీ ఎదుట ఓయూ విద్యార్థుల ఆందోళన
-
ఓయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి
సుల్తాన్‌బజార్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అక్రమంగా కబ్జాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 9మంది తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులను భేషరతుగా ఎత్తివేయాలని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎం.మహేశ్, అజాద్(టీవీవీ), పోక శ్రీనివాస్(టీవీఎస్), బద్రి (డీఎఫ్ఈ), చిక్కుడు ప్రభాకర్( తెలంగాణ ప్రజాఫ్రంట్)లు మాట్లాడారు. కబ్జాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్భంధించడం తెలంగాణ వాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు. వందల సంవత్సరాల చరిత్ర గల ఓయూ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి పంపిణీ చేస్తామని కేసీఆర్ ఓయూ వైస్‌ఛాన్స్‌లర్ ఇతరుల అభిప్రాయం తీసుకోకుండా ఓ నియంతలా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. ఓయూలో కబ్జాకు గురైన భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్నత విద్యను అందించకుండా కేసీఆర్ ఓయూ భూముల్లో పేదలకు ఇళ్లు కేటాయిస్తామని కుట్రకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల్లో విద్యార్థులకు, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేయకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు. అక్రమ కేసులు బనాయించిన ఓయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని, లేని పక్షంలో మరో ఉద్యమం తప్పదన్నారు. -
'ఓయూ విద్యార్థుల జోలికి వస్తే సమాధి కడతం'
మెదక్ (సంగారెడ్డి) : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జోలికి వస్తే సీఎం కేసీఆర్‌కు సమాధి కడతామని టీటీడీపీ నేత, కల్వకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన మినీ మహానాడులో ఎర్రబెల్లి మాట్లాడారు. విద్యార్థులపై లాఠీచార్జి చేయించినందుకు టీఆర్ఎస్ సర్కార్ వెంటనే ఓయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఎర్రబెల్లి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. -
స్వాగత్ హోటల్‌పై ఓయూ విద్యార్థుల దాడి
-
స్వాగత్ హోటల్‌పై ఓయూ విద్యార్థుల దాడి
హైదరాబాద్: తమ విశ్వవిద్యాలయ భూములను కబ్జా చేసి అందులో అక్రమ కట్టడాలు కట్టినవారు వెంటనే ఖాళీ చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు డిమాండ్ చేశారు. హబ్సీగూడాలోని స్వాగత్ హోటల్‌పై వారు సోమవారం దాడికి దిగారు. విశ్వవిద్యాలయ భూముల్లో హోటల్ నిర్మించారని, వెంటనే దానిని తొలగించాలని నినాదాలు చేస్తూ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని, అంగుళం ఆక్రమించినా క్షమించబోమని తీవ్రంగా హెచ్చరించారు. ఉస్మానియాపై ఎవరు కన్నేసినా క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణ విద్యార్థి విభాగం (టీవీవీ)వంటి కొన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ దాడి చేశారు. కాగా, ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే వచ్చి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిరువురి మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. అనంతరం పలువురు విద్యార్థి నాయకులను విద్యార్థులను అదుపులోకి తీసుకొని వ్యాన్‌లో తీసుకెళ్లారు. ఉస్మానియా భూముల్లో పేదవారికి ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు అని ప్రకటన చేసినప్పటి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల్లో అశాంతి నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు -
సీఎం ప్రకటన వెనక్కు తీసుకోవాల్సిందే
- విద్యార్థి నేతల డిమాండ్ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలోని 11 ఎకరాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తావుని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. సీఎం వైఖరికి నిరసనగా శనివారం ఓయూలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వూట్లాడుతూ న్యాయం కోసం ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులపై నాన్‌బెలబుల్ కేసులు బనారుుంచడం దారుణమని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ (విజృంభణ), ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ (తిరుగుబాటు) టీవీవీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల భూ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు అంజియాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. ఓయూ భూములపై కేసీఆర్ ప్రకటనలను ఉపసంహరించుకోవాలని, ఆక్రమిత భూములను యూనివర్సిటీ పరం చేయూలని కోరారు. ముఖ్యమంత్రి ప్రకటనకు వ్యతిరేకంగా అమ్ ఆద్మీ పార్టీ, అనుబంధ సీవైఎస్ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో క్యాంపస్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఓయూ విశ్రాంత ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్రావు నేతృత్వంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మెడికల్ విభాగంలో అన్ని కేటగిరిల సీట్లకు కామన్ ఫీజు విధానాన్ని అమలు చేయాలని, బీ కేటగిరి సీట్ల ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచడాన్ని నిరసిస్తూ నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఓయూ భూములపై సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పోరు గర్జన సభను నిర్వహించనున్నట్లు నాయుకులు ఆంజనేయులు, శివప్రసాద్ తెలిపారు. -
'ఓయూ విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్ దగ్ధమవుతాడు'
మహబూబ్‌నగర్: ఉస్మానియా విద్యార్థుల పోరాటాలు.. త్యాగాల ఫలితంగానే తెలంగాణ సీఎం కుర్చీ కేసీఆర్‌కి దక్కిందని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో నాగం మాట్లాడుతూ... యూనివర్శిటీ విద్యార్థులను కేసీఆర్ బచ్చాగాళ్లనడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. యూనిర్శిటీ విద్యార్థులతో పెట్టుకుంటే కేసీఆర్ దగ్ధమవుతాడని ఆయన హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) అంటే పోరాటాల గడ్డ అని నేత నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. 1969 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన పోరాటంలో ఉస్మానియా యూనివర్శిటీ తెలంగాణ పురిటి గడ్డ మారిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన విశదీకరించారు. -
''జబర్దస్త్ టీమ్ క్షమాపణ చెప్పాలి''
-
మంత్రి పదవులు అడిగామా?
సీఎం కేసీఆర్‌కు ఓయూ విద్యార్థుల ప్రశ్న ఉస్మానియా యూనివర్సిటీ: ‘మేమేమైనా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు, మంత్రి పదవులను అడిగామా? లేక ప్రభుత్వంలో భాగస్వామ్యం కోరామా?’ అని సీఎం కేసీఆర్‌ను ఓయూ విద్యార్థులు ప్రశ్నించారు. వయోపరిమితి దాటిపోతున్నందున కేవలం ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా వేడుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా రన్‌ఫర్ జాబ్ పేరుతో సోమవారం నిరసన పరుగు చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కళ్యాణ్, మానవతరాయ్, బాబులాల్‌నాయక్, వీరబాబు, జి.కిరణ్‌గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులను వాడుకొని... అధికారం చేపట్టిన కేసీఆర్ నేడు వారిని శత్రువుల్లా చూడడం తగదన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని, ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు ఈ నెల 17న అసెంబ్లీ ముట్టడి, డిసెంబర్లో బారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. -
ఓయూలో పోటాపోటీ ర్యాలీలు... ఉద్రిక్తత
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థుల మధ్య వైరం రోజురోజూకు తీవ్రతరం అవుతుంది. యూనివర్శిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగులు రెగ్యులరైజ్‌కు మద్దతుగా సదరు ఉద్యోగులు శుక్రవారం... ఆర్ట్స్ కాలేజీ నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ర్యాలీకి వ్యతిరేకంగా యూనివర్శిటీ విద్యార్థులు మరో ర్యాలీ నిర్వహించారు. దాంతో యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణమంతా మోహరించారు. అయితే నిన్న సాయంత్రం భగీరథ హాస్టల్లో కొంత మంది ఆగంతకలు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో యూనివర్శిటీ రహదారులు, హాస్టళ్లు, కాలేజీల వద్ద పోలీసుల పహారాను భారీగా పెంచారు. -
సచివాలయం వద్ద ఓయు విద్యార్థుల నిరసన
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయు) విద్యార్థులు సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సచివాలయం వద్ద సెక్యూరిటీ గార్డులు తమపట్ల దురుసుగా ప్రవర్తించారని ఆందోళన చేశారు. సింగపూర్ పర్యటన ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని ఈరోజు సచివాలయానికి వచ్చారు. అదే సమయంలో సచివాలయానికి వచ్చిన ఓయూ విద్యార్ధులను అక్కడ సెక్యూరిటీగార్డులు అడ్డుకున్నారు. భాస్కర్ అనే కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారని, తమని తోసివేశారని విద్యార్థులు చెప్పారు. సెక్యూరిటీగార్డుల చర్యకు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సచివాలయం వద్ద ఆందోళన చేశారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. -
ఓయూ క్యాంపస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తం
హైదరాబాద్: ఓయూలోని ఒప్పంద కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చడాన్ని నిరసిస్తు స్థానిక విద్యార్థులు గురువారం యూనివర్శిటీ క్యాంపస్‌లో కదం తొక్కారు. చలో తార్నాక కార్యక్రమానికి ర్యాలీగా విద్యార్థులు బయలుదేరారు. ఓయూ క్యాంపస్ సమీపంలోని ఆర్టీసీ ఆసుపత్రి వద్ద విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. పోలీసులపై రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ఓయూ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దాంతో ఓయూ క్యాంపెస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
'వారిది న్యాయమైన పోరాటం'
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై లాఠీచార్జ్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు మధుయాష్కీ, వివేక్, రాజయ్య, పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఉద్యోగాల కోసం విద్యార్ధుల చేస్తున్నది న్యాయమైన పోరాటమని సమర్థించారు. ఇంటికో ఉద్యోగమన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్ధుల పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ నాయకులు మర్చిపోరాదని అన్నారు. తమకు ఉద్యోగాలు రావన్న విద్యార్ధుల ఆందోళనపై టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. -
హోంమంత్రి నాయిని క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ అంశాన్ని వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన సబబేనని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ఆందోళన చేస్తున్నవారిపై లాఠీఛార్జ్ చేయటం సరికాదని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. విద్యార్థులను అవమానించే విధంగా మాట్లాడిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి క్షమాపణ చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగటం బాధాకరమన్నారు. -
బీఈడీ కుంభకోణం బట్టబయలు
బీఈడీ సీట్ల అనుమతులకు సంబంధించిన కుంభకోణం ఒకటి హైదరాబాద్‌లో బయటపడింది. విద్యార్థులే ఈ వ్యవహారాన్ని పట్టుకుని బయటపెట్టడం ఇందులో విశేషం. వాళ్లు విషయమంతా తెలుసుకుని, లంచగొండి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థలో ఒక కాలేజి సీటు అనుమతికి నర్సింహారావు అనే అధికారి మూడు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఇందుకు ఒప్పుకున్న ప్రైవేటు కాలేజీకి చెందిన ఓ వ్యక్తి సదరు సారుగారికి మూడు లక్షలు చెల్లించేందుకు రాగా ... ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వారిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న విద్యార్థులు, ఈ తతంగంపై అధికారిని నిలదీశారు. అలాంటిదేమీ లేదని నర్సింహారావు బుకాయించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అబిడ్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమ భవిష్యత్తుతో ఆడుకుంటే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా విద్యార్థులు హెచ్చరించారు. -
అసెంబ్లీ ముట్టడికి ఓయూ విద్యార్థుల యత్నం
హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడికి ఓయూ విద్యార్థులు శనివారం యత్నించారు. అయితే వారిని పోలీసుగు గన్‌పార్క్ వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో తెలంగాఱ బిల్లుపై వెంటనే చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన 20మంది విద్యార్థులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
రాజ్ భవన్ ముట్టడికి ఓయూ విద్యార్థుల యత్నం:అరెస్టు
హైదరాబాద్ : ఉస్మానియా విద్యార్థులు సోమవారం రాజ్‌భవన్ ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వీరిని అడ్డకునేందుకు యత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ కు తరలించారు. అంతక ముందు హైదరాబాద్‌లో గవర్నర్ పాలనను అంగీకరించేది లేదంటూ తెలంగాణ విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. ఈ సందర్బంగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. రాజ్ భవన్ ముట్టడిని విద్యార్థులు అసెంబ్లీ ముట్టడిగా మార్చారు. భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లాలనుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్లతో దాడి చేయగా, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. -
ఓయూలో పోలీసులపై విద్యార్థుల రాళ్లదాడి
-
ఓయూలో పోలీసులపై విద్యార్థుల రాళ్లదాడి
హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థి సంఘాల రాజ్‌భవన్ ముట్టడి సోమవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. హైదరాబాద్‌లో గవర్నర్ పాలనను అంగీకరించేది లేదంటూ వారు తమ నిరసనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఓయూ విద్యార్థుల ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎన్సీసీ గేట్ వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ...రాళ్లతో దాడి చేయటంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. రాజ్ భవన్ ముట్టడిని విద్యార్థులు అసెంబ్లీ ముట్టడిగా మార్చారు. భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లాలనుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్లతో దాడి చేయగా, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. -
రాయల తెలంగాణపై ఓయూలో ఉద్రిక్తత
-
రాయల తెలంగాణపై ఓయూలో ఉద్రిక్తత
కేంద్ర ప్రభుత్వం తలపెడుతున్న రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో వర్సిటీలోని ఎన్సీసీ గేటు వద్ద బుధవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏరప్డింది. విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులు జెండాలు పట్టుకుని నినాదాలు చేసుకుంటూ బారికేడ్ల మీద నుంచి దూకి బయటకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అలాగే విద్యార్థులు ప్రారంభించిన బైకు ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోట చేసుకుంది. దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఓయూ వద్ద భారీగా మోహరించారు. రాయల తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గురువారం తెలంగాణ బంద్‌కు కూడా టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇది ఇంకెంత ఉద్రిక్తంగా మారుతుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓయూలో ఆందోళన సందర్భంగా విద్యార్థులు కొన్ని డ్రమ్ములకు నిప్పంటించి వాటిని కూడా విసిరేసిన ఘటనలు కనిపించాయి. -
గుడ్ ల్యాండ్ రెస్టారెంట్ పై దాడి చేసిన స్టూడెంట్స్
-
రేపు ఓయూలో తెలంగాణ విద్యార్థుల యుద్ధభేరి
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మాదిగ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఓయూలో నిర్వహించనున్న తెలంగాణ విద్యార్థుల యుద్ధభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లారం రత్నయ్య కోరారు. గురువారం విద్యార్థి యుద్ధభేరి వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 7న ఏపీఎన్జీఓల పేరుతో సీమాంధ్ర పెట్టుబడిదారులు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ అండతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహ కారంతో హైదరాబాద్‌పై శాశ్వత ఆధిపత్యం కోసం సీమాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారులు కుట్ర చేస్తున్నారని, దీనిని తెలంగాణ దళిత వర్గాలు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. భౌగోళిక అంతర్భాగంలో హైదరాబాద్ తెలంగాణలో ఓ భాగమన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తామంటే యుద్ధమేనన్నారు. హైదరాబాద్‌ను తెలంగాణకు దూరం చేస్తే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేస్తామని రత్నయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల నర్సింలు ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ కృష్ణ, జిల్లా కన్వీనర్ నారాయణ, విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.