హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థుల మధ్య వైరం రోజురోజూకు తీవ్రతరం అవుతుంది. యూనివర్శిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగులు రెగ్యులరైజ్కు మద్దతుగా సదరు ఉద్యోగులు శుక్రవారం... ఆర్ట్స్ కాలేజీ నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ర్యాలీకి వ్యతిరేకంగా యూనివర్శిటీ విద్యార్థులు మరో ర్యాలీ నిర్వహించారు. దాంతో యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణమంతా మోహరించారు. అయితే నిన్న సాయంత్రం భగీరథ హాస్టల్లో కొంత మంది ఆగంతకలు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో యూనివర్శిటీ రహదారులు, హాస్టళ్లు, కాలేజీల వద్ద పోలీసుల పహారాను భారీగా పెంచారు.