Rallies
-
విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ నేతల ఆందోళనలు.. భారీగా జనసందోహం (ఫొటోలు)
-
చార్జీలపై సమరం నేడే
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో కరెంటు చార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి.. అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే రూ.15,485.36 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 27న (శుక్రవారం) కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా, ప్రజలకు తోడుగా నిలుస్తూ ఆందోళన చేపట్టాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. పెట్టుబడి సాయం అందక, కనీస మద్దతు ధర దక్కక, బీమా ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతకు అండగా నిలుస్తూ... రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు పోరులో కర్షకులు కదం తొక్కారు. రైతుపోరు తరహాలోనే కరెంట్ చార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ నేతలు సన్నద్ధమవుతున్నారు. కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టే ఆందోళనకు సంబంధించిన పోస్టర్లను రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ పార్టీ జిల్లా అధ్యక్షులు.. ఆ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలతో కలిసి కరెంటు చార్జీల పెంపుపై కదనభేరి మోగిస్తూ పోస్టర్లను విడుదల చేశారు. ఆ పోస్టర్లను వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా గోడలకు అతికించి.. ప్రజలను చైతన్యవంతం చేశాయి. ఎన్నికల్లో కరెంటు చార్జీలను తగ్గిస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని.. జనవరి నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని మోపేందుకు సిద్ధమైన వైనాన్ని ప్రజలకు వివరించాయి. శీతాకాలంలోనూ కరెంటు బిల్లులు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని, రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇక చలికాలంలోనూ కరెంటు కోతలు విధిస్తుండటంతో దోమల బాధతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు చార్జీల బాదుడు, కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తోడుగా నిలిచి తక్షణమే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధమైంది. విద్యుత్ శాఖకు సంబంధించిడిస్కంల సీఎండీ, ఎస్ఈ, డీఈఈ, ఏఈ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహించి తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు.నిరంకుశత్వంపై పోరురాష్ట్రంలో పాలకులు అరాచకాలను ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ఎదిరించిన వారిని అంతమొందించేందుకు వెనుకాడటం లేదు. ఇదెక్కడి న్యాయమని అడిగితే ఇది మా రెడ్ బుక్ రాజ్యాంగమని చెబుతున్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియాలకు మళ్లీ రాష్ట్రంలో ఊపిరిపోసి, గంజాయి మత్తులో యువతని ముంచేస్తున్నారు. ఆడ బిడ్డలకు.. పసి పిల్లలకు రక్షణ లేకుండా అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు విద్యుత్ చార్జీలను భారీగా పెంచేసి రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు గత ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్‌ను సైతం దూరం చేస్తున్నారు. రూ.వేలల్లో బిల్లులు వేస్తూ రాక్షసుల్లా ప్రజల రక్తం తాగుతున్నారు. ఈ నిరంకుశ, దారుణ పాలనలో కష్టాల్లో ఉన్న ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతోంది. విద్యుత్ చార్జీలు పెంచబోమని, ఇంకా తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే రూ.15,485 కోట్ల భారం మోపారు. ఇందులో ఇప్పటికే రూ.6,072 కోట్లు వసూలును ప్రారంభించారు. వచ్చే నెల నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుతున్నారు. బడుగులపైనా బాదుడే..గతంలో టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు నెలకు 100 యూనిట్ల వరకూ మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక దీన్ని 200 యూనిట్లకు పెంచింది. తద్వారా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు 22,31,549 మంది వినియోగదారులు అప్పట్లో అర్హత పొందారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ హయాంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వం 2018–19లో దీని కోసం రూ.235 కోట్లు ఖర్చు చేయగా, వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.637 కోట్లు ఖర్చు చేయడమే దీనికి నిదర్శనం. టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన ఎస్సీ, ఎస్టీల విద్యుత్తు వినియోగదారుల రాయితీ మొత్తం రూ.74.43 కోట్లను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ 200 యూనిట్లను ఎగ్గొడుతోంది. అర్హులకు పథకాన్ని దూరం చేస్తున్నారు. విద్యుత్‌పై చంద్రబాబుది ఎప్పుడూ ఒకే వైఖరి. ఇంధన రంగాన్ని ఆదాయ వనరుగానే చూడటం ఆయన నైజం. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడూ చార్జీల మోత మోగించారు. శ్లాబులు మార్చి, ఏమార్చి ప్రజలపై బిల్లుల భారం వేశారు. ఇదెక్కడి న్యాయమమని అడిగితే ఉమ్మడి రాష్ట్రంలో బషీర్‌బాగ్‌లో అమాయకులపై కాల్పులకు ఆదేశించి నిరంకుశంగా ప్రవర్తించారు. నిరసనకారులను గుర్రాలతో తొక్కించారు. ఇప్పుడు మళ్లీ అదే దారిలో ప్రజలపై చార్జీల పిడుగు వేస్తున్నారు.అదనపు భారాలు ఇలా..తాము వినియోగించిన యూనిట్లకు విధించే చార్జీలతో పాటు కూటమి ప్రభుత్వం అదనపు చార్జీలు కలపడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. వాడిన దానికి మించి విద్యుత్ బిల్లులు అదనంగా వసూలు చేస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని నవంబర్ నుంచి వినియోగదారులపై ప్రభుత్వం వేస్తోంది. ప్రతి యూనిట్‌కు సగటున రూ.1.27గా నిర్ణయించిన ఏపీఈఆర్సీ దీనిని 15 నెలల్లో వసూలు చేయాలని సూచించడంతో ప్రతి నెలా వినియోగదారులపై సర్దుబాటు భారం యూనిట్‌కు సగటున రూ.0.63 వేసి వసూలు చేస్తున్నారు. జనవరి నెల నుంచి ప్రజల మీద రూ.9,412.50 కోట్లతో ప్రభుత్వం మరో పిడుగు వేయనుంది. ఈ మొత్తం రానున్న 24 నెలలు వసూలు చేసుకోవాలని డిస్కంలకు ఏపీఈఆర్సీ సూచించింది. దీంతో జనవరి నుంచి విద్యుత్ వినియోగదారులపై యూనిట్‌కు రూ.1.08 చొప్పున అదనపు భారాలు పడనున్నాయి. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుంటే దానికి తోడు విద్యుత్ చార్జీలు పెంచడంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు ఈ బిల్లులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. వారికి అండగా వైఎస్సార్సీపీ నిలుస్తోంది. వేసిన అదనపు చార్జీలను ఉపసంహరించాలని, ఇకపై ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించనుంది.కరెంట్ బిల్లుల భారంతో యువకుడి ఆత్మహత్యాయత్నం» ఏలూరు జిల్లా గవరవరంలో ఉరి పోసుకున్న బాధితుడు» బిల్లు కట్టకపోవడంతో కనెక్షన్ తొలగించిన విద్యుత్తు సిబ్బంది» బాధితుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద మోహరించిన కూటమి పార్టీల నేతలుకొయ్యలగూడెం: షాక్ కొడుతున్న విద్యుత్తు బిల్లుల భారంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో చోటు చేసుకుంది. బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గవరవరం దళితవాడలో నివసిస్తున్న చాపల నాగేశ్వరరావు ఇంటికి విద్యుత్ బిల్లు రూ.2 వేలు వచ్చింది. ఇదివరకు నెలకు రూ.500 వచ్చేది. ఇప్పుడు ఒకేసారి అంత బిల్లు రావడంతో ఆయన కట్టలేకపోయాడు. దీంతో విద్యుత్ సిబ్బంది ఆయన ఇంటి సర్వీసు తొలగించారు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన నాగేశ్వరరావు తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు వెంటనే గుర్తించి తొలుత సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బాధితుడు చికిత్స పొందుతున్న జంగారెడ్డిగూడెంలోని ఆస్పత్రి వద్దకు రాత్రి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆస్పత్రి వద్దే మోహరించిన కూటమి నేతలు విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యత్నిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఎవరూ బాధితుడితో మాట్లాడకుండా ఆస్పత్రి వద్ద కాపలా కాస్తున్నారు. -
దగాకోరు పాలనపై ఛెళ్లుమన్న చర్నాకోల!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అన్నదాతలు ఆగ్రహోదగ్రులయ్యారు! టీడీపీ కూటమి సర్కారు నయవంచక పాలన, చంద్రబాబు మోసాలపై రైతన్నలు ఛర్నాకోల ఝుళిపించారు! ఎడ్ల బండ్లు.. వరి కంకులు.. ధాన్యం బస్తాలతో ‘రైతు పోరు’లో కదం తొక్కారు!! అన్నం పెట్టే రైతన్నను కూటమి ప్రభుత్వం దగా చేయటాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శుక్రవారం నిర్వహించిన రైతు పోరుకు అన్నదాతలు ఉవ్వెత్తున తరలి వచ్చారు. ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చి ర్యాలీల్లో పాల్గొన్నారు. వరి కంకులు చేతబట్టి కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటర్ల తరబడి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లలో డిమాండ్ పత్రాలను అందచేశారు. ధాన్యం బస్తాలను నెత్తిపై పెట్టుకుని మోస్తూ నిరసన తెలియచేశారు. కాలి నడకన కదం తొక్కారు. సీఎం.. డౌన్ డౌన్! అంటూ ఎలుగెత్తి నినదిస్తూ తమ ఆక్రందన చాటారు. భీమవరం, రాజమహేంద్రవరం, కాకినాడ, బాపట్ల, నెల్లూరు, కర్నూలు.. ఒక ప్రాంతం అనే తేడా లేకుండా కలెక్టరేట్లకు దారి తీసే ప్రాంతాలన్నీ అన్నదాతల పద ఘట్టనలతో ఎరుపెక్కాయి!! వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను ఉసిగొల్పి గృహాల్లో నిర్బంధించినా.. నిరసనలో పాల్గొనడానికి కదలి వస్తున్న రైతులపై ఖాకీలు బెదిరింపులకు దిగినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిరసిస్తూ.. అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు రోడ్డెక్కారు. తక్షణమే పెట్టుబడి సాయంగా రూ.20 వేలు అందించాలని.. పండించిన ధాన్యం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ఉచిత పంటల బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని నినదిస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో రైతులు కదం తొక్కారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు వైఎస్సార్సీపీ నేతలతో కలసి డిమాండ్ పత్రాలు అందజేశారు. ఆరు నెలల చంద్రబాబు ప్రభుత్వ పాలనపై పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలు అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు అండగా నిలుస్తూ వైఎస్సార్సీపీ నిర్వహించిన తొలి పోరాటం విజయవంతమవడంతో పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం తొణికిసలాడుతోంది. అక్రమ అరెస్టులు.. నిర్బంధాలతో బెదిరించినా.. కూటమి ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద అన్నదాతలకు ఇవ్వాల్సిన రూ.20 వేలు ఇంతవరకూ ఇవ్వకపోవడం.. పండించిన ధాన్యం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. అన్నదాతను కుడి, ఎడమల దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున రైతులతో ర్యాలీలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలతో తరలి వచ్చారు. దీన్ని పసిగట్టిన కూటమి ప్రభుత్వ పెద్దలు వైఎస్సార్సీపీ నేతలు, రైతులపై పోలీసులను ఉసిగొలిపారు. ఉదయమే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు వారిని హౌస్ అరెస్టులు చేశారు. ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న రైతులను అడుగడుగునా అడ్డుకున్నారు. అయితే పోలీసుల బెదిరింపులకు ఏమాత్రం వెరవకుండా జిల్లా కేంద్రాలకు రైతులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వైఎస్సార్సీపీ సారథ్యంలో నిర్వహించిన ర్యాలీల్లో కదం తొక్కారు. కూటమి సర్కారు మోసాలను ఎండగడుతూ అనకాపల్లి టౌన్ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ వరకూ వందలాది మంది రైతులతో కలసి కార్యకర్తలు, నాయకులు 5 కి.మీ. మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ, కర్నూలు సహా అన్ని ప్రాంతాల్లోను వరి కంకులను చేతపట్టుకుని నిరసన తెలిపారు. నెత్తిన ధాన్యం బస్తాలతో ర్యాలీ రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ధాన్యం బస్తాలు నెత్తిన పెట్టుకుని బొమ్మూరు నుంచి కలెక్టరేట్ వరకూ 2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎడ్ల బండ్లపై ర్యాలీలు... నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం నగరాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ఎడ్ల బండ్లపై ర్యాలీల్లో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొద్దునిద్ర నటిస్తున్న ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడలో ఉద్రిక్తత..విజయవాడలో పోలీసు వలయాలను ఛేదించుకుని కలెక్టరేట్‌కు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో మ్యూజియం రోడ్డుకు చేరుకున్న నేతలు, రైతులను పోలీసు బలగాలు అడ్డుకుని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. గుణదలలోని తన ఇంటి నుంచి కలెక్టరేట్‌కు బయలుదేరిన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను నైస్ బార్ వద్ద నడిరోడ్డుపై అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌కు తరలించారు. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును బయటికి రాకుండా అడ్డుకోవడంతో ఇంటి లోపల కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ను హౌస్ అరెస్టు చేసి నిర్బంధించారు. పార్టీ నందిగామ ఇన్చార్జి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి తదితరులను అరెస్టు చేశారు. -
ప్రచార కార్యక్రమాల్లో పిల్లలు వద్దు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార పర్వంలో పిల్లజెల్లా ముసలిముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి భాగస్వాములను చేసే రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు పంపింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీల్లో నినాదాలు ఇవ్వాలంటూ పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని పార్టీలకు ఈసీ స్పష్టంచేసింది. ఎన్నికల సంబంధ పనులు, కార్యక్రమాల్లో పార్టీలు పిల్లలను వాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనా ఉందంటూ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బందికి మరోసారి గుర్తుచేసింది. ఎన్నికల పర్వంలో పిల్లలు ఎక్కడా కనిపించొద్దని, వారిని ఏ పనులకూ వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు ఈసీ తాజాగా ఒక అడ్వైజరీని పంపింది. ‘‘బాల కార్మిక చట్టాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్లదే. క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా ఈ బాధ్యతలు నెరవేర్చండి’’ అని ఈసీ పేర్కొంది. ‘‘ప్రచారంలో నేతలు చిన్నారులను ఎత్తుకుని ముద్దాడటం, పైకెత్తి అభివాదంచేయడం, వాహనాలు, ర్యాలీల్లో వారిని తమ వెంట బెట్టుకుని తిరగడం వంటివి చేయకూడదు. పిల్లలతో నినాదాలు ఇప్పించడం, పాటలు పాడించడం, వారితో చిన్నపాటి ప్రసంగాలు ఇప్పించడంసహా పార్టీ ప్రచారాల్లో ఎక్కడా చిన్నారులు ఉపయోగించుకోకూడదు. వారు ప్రచార కార్యక్రమాల్లో కనిపించకూడదు’’ అని తన అడ్వైజరీలో స్పష్టంచేసింది. మరి కొద్ది వారాల్లో సార్వత్రిక ఎన్నికల మొదలుకానున్న నేపథ్యంలో ప్రచారపర్వంలో పార్టీలు ప్రజాస్వామ్య విలువలకు పట్టంకట్టాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంబంధ కార్యకలాపాల్లో మైనర్లను వినియోగించకూడదని, వినియోగిస్తే కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లేనని బాంబే హైకోర్టు 2014లో ఇచ్చిన ఇక ఉత్తర్వును రాజీవ్ కుమార్ పునరుధ్ఘాటించారు. -
లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం
లండన్: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలపై ప్రధాని రిషి సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యూదులతో పాటు ప్రజాస్వామ్య విలువలకు ముప్పులా పరిణమిస్తుందని అన్నారు. లండన్‌లో ఇలాంటి నినాదాలను సహించబోమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా లండన్, బర్మింగ్‌హామ్, కార్డిఫ్, బెల్ఫాస్ట్ సహా ఇతర నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో కొందరు ఆందోళనకారులు జిహాద్ నినాదాలు కూడా చేశారు. 'ఈ శనివారం జరిపిన నిరసనల్లో వీధుల్లో ద్వేషాన్ని చూశాము. జిహాద్ పిలుపులు యూదు సమాజానికి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పు. మన దేశంలో యూదు వ్యతిరేకతను ఎప్పటికీ సహించము. తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం.' అని రిషి సునాక్ అన్నారు. గ్రేటర్ లండన్ ప్రాంతంలో పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసనలు చేలరేగగా.. ద్వేషపూరిత నినాదాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. ఆందోళనలు అదుపుతప్పాయని చెప్పారు. ఈ ఘటనల్లో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారని వెల్లడించారు. జిహాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో రిషి సునాక్ ఇజ్రాయెల్ పట్ల నిలబడిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలను నిలిపివేయాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో తాము తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం -
15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. -
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బల ప్రదర్శన
జనగామ /కుషాయిగూడ (హైదరాబాద్): నియోజకవర్గంలో అసమ్మతి నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలో స్థానిక పార్టీ శ్రేణులతో ర్యాలీలు, సమావేశాలు జరపడంతోపాటు హైదరాబాద్‌లోనూ భేటీ అయ్యారు. స్థానిక నాయకత్వం తన వెంటే ఉందని చాటుకునే ప్రయత్నం చేశారు. బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో అసమ్మతి వర్గం సమావేశం కావడం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్కడికి వెళ్లడంతో వాగ్వాదం జరగడం తెలిసిందే. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ అసమ్మతిని రాజేస్తున్నాడని ముత్తిరెడ్డి ఆరోపించారు కూడా. ఈ క్రమంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు తనతోనే ఉన్నాయనేలా గురువారం బల ప్రదర్శనకు దిగారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో భారీ ర్యాలీలు నిర్వహించడంతోపాటు ఏకకాలంలో మీడియా సమావేశాలు పెట్టి స్థానిక నేతలతో తనకు మద్దతు ప్రకటించేలా చేశారు. తర్వాత వారందరితో హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉన్న నోమా ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సెలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర నేతలు తమ మద్దతు ముత్తిరెడ్డికే ఉంటుందని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీలన్నీ ముత్తిరెడ్డికి మద్దతు ఇస్తున్నట్టుగా చేసిన తీర్మానాల పత్రాలను ముత్తిరెడ్డికి అందజేశారు. కావాలని అభాసుపాలు చేస్తున్నారు: ముత్తిరెడ్డి తనపై కుట్రలు కొత్తేమీ కాదని.. ఇంతకుముందు 2014లో, 2018లోనూ కుట్రలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. తానేమిటో తెలిసిన సీఎం కేసీఆర్ రెండుసార్లు తనకే టికెట్ ఇచ్చారని.. నియోజకవర్గ ప్రజలు గెలిపించారని చెప్పారు. మల్లాపూర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నాటి కుట్రల పాచికలు పారకపోవడంతో తాజాగా కుటుంబ కలహాల బూ చితో నన్ను అభాసుపాలు చేసేందుకు, వివాదా స్పదుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు అధినేత కేసీఆర్‌పై నమ్మకముంది. ఉద్యమ నాయ కుడిగా, పార్టీ సైనికుడిగా నాకు గుర్తింపునిస్తూనే వచ్చారు. భవిష్యత్తులో కూడా నాకు ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఈ సమావేశానికి సంబంధించిన అంతర్యాన్ని, నిర్ణయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా..’’ అని తెలిపారు. -
పాంచజన్యం పూరించనున్న ఖర్గే
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్స్ లాంటివి. ఈ తరుణంలో అధికార-విపక్షాలు ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో.. ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా’ కాంగ్రెస్ ఎన్నికల సమరానికి సమాయత్తం అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయా రాష్ట్రాల్లో పర్యటించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అవి ముగిసిన వెంటనే ఆయన రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. ఎన్నికల రాష్ట్రాల్లో పర్యటించి సమీక్షించడమే కాకుండా.. ర్యాలీల్లో ఆయన ప్రసంగించనున్నట్లు ఏఐసీసీ శ్రేణులు చెబుతున్నాయి. ఆగష్టు 13వ తేదీన ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌తో ఆయన ర్యాలీలు ప్రారంభం కానున్నాయి. ఆగష్టు 18వ తేదీన తెలంగాణలో, ఆగష్టు 22వ తేదీన మధ్యప్రదేశ్ భోపాల్, ఆగష్టు 23వ తేదీన జైపూర్‌లో ఆయన పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాలకు చెందిన నేతలతో ఖర్గే వరుసగా భేటీ అవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశాలకు రాహుల్ గాంధీతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం హాజరవుతున్నారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో దోషుల్ని వదలొద్దూ! -
అల్లర్లతో ఢిల్లీ హై అలర్ట్.. భద్రతపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు..
ఢిల్లీ: హర్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. సీసీటీవీలతో నిఘాను మరింత పెంచాలని ఆయా ప్రభుత్వాలకు జారీ చేసిన నోటిసుల్లో పేర్కొంది. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘర్షణలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పలు హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. ఢిల్లీతో సహా చుట్టపక్కల రాష్ట్రాల్లో దాదాపు 30 వరకు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశాయి. ఇప్పటికే ఉన్న అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ ర్యాలీలకు అనుమతించవద్దంటూ సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. అదనపు బలగాలను మోహరించాలని నోటీసుల్లో పేర్కొంది. ర్యాలీలపై పిటీషన్ దాఖలు.. హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల సెగ దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. నుహ్ జిల్లాలో అల్లర్లకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్లు ర్యాలీలు నిర్వహించతలపెట్టాయి. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఆయా సంఘాలు ర్యాలీలను రద్దు చేయాలని కోరుతూ పిటీషనర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. నుహ్, గుర్‌గ్రామ్‌లలో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అల్లర్లను ప్రేరేపించే చిన్న సంఘటన కూడా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. కావున అల్లర్లను రెచ్చగొట్టే ఎలాంటి మతపరమైన ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొన్నారు. హర్యానా ఘటనకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలోని నారిమన్ విహార్ మెట్రో స్టేషన్ పరిధిలో బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. మేవాత్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ నిరసనలకు పిలుపునిచ్చింది. మానేసర్‌లో భిసమ్ దాస్ మందిర్ వద్ద భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ మహా పంచాయత్‌ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. హర్యానాలో సోమవారం అల్లర్లు చెలరేగాయి. విశ్వహిందూ పరిషత్ ర్యాలీపై ఇతర వర్గం వారు దాడి చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. అల్లరిమూకలు వందల సంఖ్యలో వాహనాలకు నిప్పంటించారు. అల్లర్లను అదుపుచేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ నిలిపివేసింది. ఇదీ చదవండి: ఎన్సీఆర్కు పాకిన హర్యానా మత ఘర్షణలు.. 116 మంది అరెస్ట్.. ఢిల్లీ హై అలర్ట్ -
ర్యాలీస్‌లో రేఖా ఝున్‌ఝున్‌వాలా వాటాల విక్రయం
ముంబై: దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా తాజాగా ర్యాలీస్ ఇండియాలో మరో 6.2586 శాతం వాటాలను విక్రయించారు. దీంతో ఇకపై తన దగ్గర 2.278 వాటాలు (సుమారు 44.30 లక్షల షేర్లు) ఉన్నట్లవుతుందని ఆమె స్టాక్ ఎక్సేచంజీలకు తెలియజేశారు. 2013 మార్చి 11 నాటికి తమ వద్ద 2.03 కోట్ల షేర్లు (10.4581 శాతం వాటాలు) ఉన్నట్లు.. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 17 మధ్య తాము 37 లక్షల షేర్లు (1.9446 శాతం) విక్రయించామని పేర్కొన్నారు. జూలై 18 – జూలై 20 మధ్యలో మరో 1.21 కోట్ల షేర్లను (6.2586 శాతం) విక్రయించినట్లు వివరించారు. శుక్రవారం ర్యాలీస్ ఇండియా షేర్లు 1.31 శాతం క్షీణించి సుమారు రూ. 218 వద్ద క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,237 కోట్ల ప్రకారం రేఖ వద్ద ప్రస్తుతమున్న వాటాల విలువ సుమారు రూ. 96 కోట్లుగా ఉంటుంది. -
కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాలి
సాక్షి, హైదరాబాద్: పాలకులు తక్షణమే కొత్త వేతన సవరణ సంఘాన్ని నియమించాలని, జూలై ఒకటో తేదీతో వర్తించేలా కరువు భత్యం ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యూయూఎస్పీసీ) డిమాండ్ చేసింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించింది. దశల వారీగా పోరాట కార్యాచరణను స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఈనెల 18, 19 తేదీల్లో మండలాల్లో బైక్ ర్యాలీలు. ఆగస్టు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడతామని, సెపె్టంబర్ 1 న చలో హైదరాబాద్ పేరిట రాష్ట్రస్థాయి ఆందోళన నిర్వహిస్తామని వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొంది. శనివారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో యూయూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల మొదటి తేదీనే వేతనాలు ఇవ్వాలని, ట్రెజరీల్లో ఆమోదం పొంది ప్రభుత్వం వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న సప్లిమెంటరీ బిల్లులు, సెలవు జీతాలు, జీíపీఎస్, జీఎస్ జిఎల్‌ఐ క్లైములు, పెన్షనరీ బెనిఫిట్స్, బీఆర్సీ బకాయిలు తదితర బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఇహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని యూయూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగాలు.. పదోన్నతులివ్వాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులను బదిలీలు, పదోన్నతులు, నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేయాలని, తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావుడిగా అప్ గ్రేడ్ చేసిన పండిట్, పీఈటీ పోస్టులపై నెలకొన్న వివాదాన్ని త్వరగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. పర్యవేక్షణాధికారుల పోస్టులను అవసరం మేరకు మంజూరు చేసి రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని, పాఠశాలల్లో సర్విస్ పర్సన్స్ ను నియమించాలని, మౌలిక వసతులు కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని కోరారు. జీఓ 317 అమలు కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి (టీఎస్ యూటీఎఫ్), వై అశోక్ కుమార్, పి నాగిరెడ్డి(టీపీటీఎఫ్), ఎం సోమయ్య, టి లింగారెడ్డి(డీటీఎఫ్), యు పోచయ్య, డి సైదులు (ఎస్టీఎఫ్ టీఎస్), సయ్యద్ షౌకత్ అలీ (టీఎస్ పిటిఎ), కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి (బీటీఎఫ్), బి కొండయ్య (టీఎస్ ఎంఎస్టీఎఫ్), ఎస్ హరికృష్ణ, వి శ్రీను నాయక్ (టీటీఎ), జాదవ్ వెంకట్రావు (ఎస్సీ ఎస్టీ టీఎ), వై విజయకుమార్ (ఎస్సీ ఎస్టీ యూయస్ టీఎస్) డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ సిపిఎస్ రద్దు చేయాలని, 2004 సెపె్టంబర్ 1కి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమై ఆ తర్వాత నియామకాలు జరిగిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు కోరారు. -
పవన్ వ్యాఖ్యలపై కొనసాగిన నిరసనలు
సాక్షి నెట్వర్క్: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న వార్డు, గ్రామ వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. జనసేనాని తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వలంటీర్లు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలతో శవయాత్రలు, ర్యాలీలు నిర్వహించారు. రాస్తారోకోలు చేశారు. పవన్ గడ్డి బొమ్మలు, ఫ్లెక్సీలు, చిత్రపటాలకు చెప్పుల దండలు వేసి మానవ హారాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్లో వలంటీర్లు మానవహారంగా ఏర్పడి పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. గొలుగొండ మండలం ఏఎల్‌పురంలో వలంటీర్లు ర్యాలీ జరిపి, ప్రధాన రోడ్డులో మానవహారం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో ర్యాలీ నిర్వహించి, పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో పవన్ దిష్టిబొమ్మకు చెప్పులు వేసి శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వేంపల్లె, చింతకొమ్మదిన్నె తదితర ప్రాంతాల్లో వలంటీర్లు ర్యాలీ చేసి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అన్న మయ్య జిల్లా తంబళ్లపల్లె, రామాపురం గ్రామాల్లో నిరసనలు జరిగాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ నిరసనలు కొనసాగాయి. కాకినాడలో ఆత్మగౌరవ సభ కాకినాడ సూర్యకళా మందిరంలో వలంటీర్లంతా గురువారం ఆత్మగౌరవ సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా హెచ్చరించారు. తమ మనోభావాలు దెబ్బతినేలా మరోసారి వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వలంటీర్లకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వలంటీర్లు రాస్తారోకో చేశారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్.పైడిపాల సచివాలయం వద్ద నిరసన తెలిపారు. కాజులూరు మండలం గొల్లపాలెంలో మానవహారం నిర్వహించి దిష్టిబొమ్మతో శవ యాత్ర చేశారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పినపళ్లలో నిరసన వ్యక్తం చేశారు. -
సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్‌కు షాక్.. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి లైన్ క్లియర్..
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. తమిళనాడు వ్యాప్తంగా రూట్ మార్చ్‌లు నిర్వహించాలనుకున్న ఆర్ఎస్ఎస్కు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ ర్యాలీలపై నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) దాడులకు పాల్పడే అవకాశం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కారణంగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిబ్రవరి 10న ర్యాలీలకు అనుమతి ఇస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పుతో తమిళనాడు వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధమవుతోంది. చదవండి: జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ రాజకీయ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి? -
ఊరూరా సందడే సందడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, నేతలు పండగలా నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించి.. వైఎస్సార్సీపీ జెండాలనూ ఊరూరా ఆవిష్కరించారు. భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి.. పార్టీ కార్యాలయాల్లో భారీ కేక్‌లు కట్ చేశారు. నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసి.. అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా.. ప్రజాభ్యుదయమే ధ్యేయంగా 2011 మార్చి 12న వైఎస్సార్సీపీని సీఎం వైఎస్ జగన్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ప్రస్థానంలో 12 ఏళ్లు పూర్తి చేసుకుని ఆదివారం 13వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి, మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సాగిస్తున్న సంక్షేమాభివృద్ధి పాలనను గుర్తుచేస్తూ యువకులు జై జగన్ నినాదాలు చేశారు. ♦విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ♦ అనంతపురం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. తిరుపతిలోని తన నివాసంలో మంత్రి పెద్దిరెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. నగరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి ఆర్కే రోజా కేక్ కట్ చేశారు. తిరుపతిలో ఎంపీ గురుమూర్తి జెండా ఎగురవేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కేక్ కట్ చేశారు. ♦గుంటూరులో పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి, కేక్‌ను కట్‌చేశారు. 500 మీటర్ల వైఎస్సార్సీపీ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్, కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ పతాకం రెపరెపలాడింది. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి, ఏలూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని వేడుకల్లో పాల్గొన్నారు. ♦ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి వేణు, హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌రామ్ పాల్గొన్నారు. ♦ విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరులో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పార్టీ జెండాను ఎగురవేశారు. -
జీవో నెంబర్ 1పై దుష్ప్రచారం.. ఏపీ అడిషనల్ డీజీపీ క్లారిటీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై జరగుతున్న దుష్ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యన్నార్ వివరణ ఇచ్చారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 1861 పోలీస్ యాక్ట్‌కు లోబడే జీవో నెంబర్ 1 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇస్తామన్నారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదన్నారు. బ్యాన్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇటీవల ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవో తీసుకొచ్చినట్లు ఏడీజీపీ రవి శంకర్ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభలు నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులు వేదిక స్థలాన్ని పరిశీలించి అనుమతి ఇస్తారని తెలిపారు. రహదారులు, రోడ్లపై సభలకు అనుమతి లేదన్నారు. అదికూడా అత్యవసరమైతే అనుమతులతో నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఈ జీవో ఉద్దేశం నిషేధం కాదని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని జీవో నెంబర్1ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత చట్టం దేశ వ్యాప్తంగా అమలవుతున్నదేనని అన్నారు. అందుకే వద్దన్నాం ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రహదారుల మీద సభలు వద్దన్నామని లా అండ్ ఆర్డర్ డీఐజీ రాజశేఖర్ తెలిపారు. మరీ అత్యవసర పరిస్థితుల్లో అనుమతులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సన్నగా, ఇరుగ్గా ఉండే రోడ్లమీద సభల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది ఏర్పుడుతుందని.. అంబులెన్సులు, విమాన ప్రయాణాల వారికి సమస్యలు తేవద్దని సూచించారు. అందువల్లే పబ్లిక్ గ్రౌండ్లలో సభలు జరుపుకోవాలని జీవోలో ఉందని పేర్కొన్నారు. చదవండి: మాజీ మంత్రి నారాయణ కంపెనీలపై ఏపీ సీఐడీ సోదాలు -
రోడ్లపై నో " షో "
-
AP: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది. ఈమేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుండటంతోపాటు, వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం జిల్లాల ఉన్నతాధికారులకు సూచించింది. రహదారులకు దూరంగా, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని పేర్కొంది. వివిధ పార్టీలు, ఇతర సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని చెప్పింది. అత్యంత అరుదైన సందర్భాల్లో.. అత్యంత అరుదైన సందర్బాల్లో జిల్లా ఎస్పీలు/ పోలీస్ కమిషనర్లు సంతృప్తి చెందితే షరతులతో సభలు, ర్యాలీలకు అనుమతినివ్వొచ్చు. అందుకు నిర్వాహకులు ముందుగా లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలి. సభను ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిర్వహిస్తారు, కచ్చితమైన రూట్ మ్యాప్, హాజరయ్యేవారి సంఖ్య, సక్రమ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. వాటిపై జిల్లా ఎస్పీ/ పోలీస్ కమిషనర్ సంతృప్తిచెందితే నిర్వాహకుల పేరిట షరతులతో అనుమతినిస్తారు. సభ, ర్యాలీ నిర్వహణలో షరతులను ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే రాష్ట్రంలో రహదారులపై నియంత్రణ లేకుండా సభలు, ర్యాలీల నిర్వహణ వల్ల సామాన్య ప్రజానీకం ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు తీవ్రంగా గాయపడతున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డుపై టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది సామాన్యులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దుర్ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారులను ఆక్రమించి వేదికల నిర్మాణం, ఇష్టానుసారం ఫ్లెక్సీలు, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు, చివరి నిమిషాల్లో రూట్ మ్యాప్‌ల మార్పు, ఇరుకుగా బారికేడ్ల నిర్మాణం మొదలైన లోపాలతో ఈ రెండు దుర్ఘటనలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలపై మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణపై నియంత్రణ విధించింది. -
చివరి వరకు సర్వశక్తులు! మునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్ కృషి
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు లక్ష్యంగా నాలుగు నెలలుగా సర్వశక్తులూ ఒడ్డుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ఈ నెల 3న పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసిన ఆ పార్టీ.. ఓటర్లపై పట్టు జారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచార గడువు ముగియనుండటంతో చివరిరోజు ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసింది. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను ఇప్పటికే చౌటుప్పల్, గట్టుప్పల్, మునుగోడు మండల కేంద్రాల్లో జరిగిన రోడ్‌షోల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొనగా, మర్రిగూడ రోడ్‌షోకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వం వహించారు. ఇక చివరి రోజున సంస్థాన్ నారాయణపురం, మునుగోడు రోడ్ షోలలో కేటీఆర్, నాంపల్లి, చండూరు రోడ్ షోలలో మంత్రి హరీశ్‌రావు పాల్గొననున్నారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత నియోజకవర్గం నుంచి తిరుగుముఖం పట్టే పార్టీ ఇన్చార్జిలు, ప్రచార బృందాలు.. పోలింగ్ ముగిసేంత వరకు స్థానిక నేతలు, కేడర్‌తో సమన్వయం చేసుకోవాలని పార్టీ ఆదేశించింది. రాజగోపాల్ రాజీనామాకు ముందే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగస్టు 2న మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే నెల 8న స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించి, 21న బీజేపీలో చేరారు. అయితే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనకు ముందే టీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఈ ఏడాది జూన్ చివరి నుంచే ఉప ఎన్నిక కార్యాచరణపై దృష్టి పెట్టింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో పలు దఫాలు సమావేశమైన సీఎం కేసీఆర్ ఉప ఎన్నికపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలకు మునుగోడులోని మండలాల వారీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి ప్రచార వ్యూహానికి పదును పెట్టారు. ఆత్మీయ సమ్మేళనాలు, సామాజికవర్గాల వారీగా భేటీలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో సమావేశాలను ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడక ముందే టీఆర్ఎస్ పూర్తి చేసింది. ప్రతి ఓటునూ ఒడిసిపట్టేలా ప్రణాళిక అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేసినా.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తారనే సంకేతాలను మొదట్నుంచే ఇస్తూ వచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మునుగోడులో పార్టీ యంత్రాంగాన్ని భారీగా మోహరించారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి 10 మంది మంత్రులు, సుమారు 70 మందికి పైగా ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించి ప్రతి ఓటును ఒడిసిపట్టేలా ప్రణాళికను అమలు చేశారు. ఆగస్టు 20న మునుగోడులో జరిగిన బహిరంగ సభకు హాజరు కావడం ద్వారా ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. అక్టోబర్ 30న చండూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా ప్రచారాన్ని తారస్థాయికి చేర్చారు. ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న సుమారు 40 వేల మందికి పైగా మునుగోడు ఓటర్లను పోలింగ్ రోజున నియోజకవర్గానికి రప్పించడంపై దృష్టి సారించింది. చదవండి: మైక్ కట్.. మునుగోడులో ప్రచారానికి నేటితో తెర -
ఊరూరా సంబరాలు
సాక్షి నెట్వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులుగా ప్రజలు సంబరాలతో సందడి చేస్తున్నారు. బుధవారం వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి నూతన జిల్లా ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భీమవరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్త జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరానికి వచ్చే ప్రజల అవసరాలకు అనుగుణంగా సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, ఇచ్ఛాపురం, టెక్కలిలో సంబరాలు ఘనంగా జరిగాయి. పలాస డివిజన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో అభినందన సభ జరిపారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టెక్కలిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సోంపేటలో పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన అభినందన సభకు హాజరైన ప్రజలు తిరుపతి జిల్లా ఆవిర్భావ నేపథ్యంలో వెంకటగిరిలో బుధవారం నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీలో వేలాది మంది భాగస్వాములయ్యారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో పాదయాత్ర జరిగింది. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు పాదయాత్రలు జరిగాయి. పెదగంట్యాడలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బుచ్చెయ్యపేట మండలంలో ఎమెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి సుమారు పది వేల మంది హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో భారీ ర్యాలీ జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు శుభపరిణామం సీతమ్మధార (విశాఖ ఉత్తర): రాష్ట్రంలో జిల్లాలను పునర్విభజించటం శుభపరిణామమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. బుధవారం సీతమ్మధారలోని బీజేపీ కార్యాలయంలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. -
జిల్లాలపై హర్షాతిరేకాలు
చల్లపల్లి/ముత్తుకూరు: జిల్లాల పునర్విభజనకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా చల్లపల్లిలో గురువారం భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్కు సెంటర్ వద్ద నుంచి లక్ష్మీపురం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఏఎంసీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి, ఎస్సీ కాలనీ వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. రామానగరం పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అలాగే సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అంతర్భాగం చేసిన సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి చెప్పారు. ‘జగనన్న వరం–సర్వేపల్లి జన నీరాజనం’ వారోత్సవాల్లో భాగంగా గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తుకూరులో వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఆ ఫ్లెక్సీపై పూలవర్షం కురిపించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ముత్తుకూరు కూడలిలో జరిగిన సభలో కాకాణి ప్రసంగించారు. గతంలో చంద్రబాబు చేయలేని పనిని ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ చేసి చూపారని కొనియాడారు. ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకటరమణయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధనరెడ్డి, సర్పంచ్ బూదూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
Afghanistan: ఎదురునిలిచి... స్వరం పెంచి
కాబూల్: అఫ్గానిస్తాన్ స్వాతంత్య్రదినోత్సవాన నీలాల నింగి నిండుగా జాతీయ పతాకం ఆవిష్కృతం కావడానికి బదులుగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు హోరెత్తిపోయాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేయడానికి స్వాతంత్య్రదినాన్ని ప్రజలు ఒక అవకాశంగా తీసుకున్నారు. అఫ్గాన్ జెండా చేతపట్టుకొని వీధుల్లోకి వచ్చి ‘మా పతాకమే మాకు గుర్తింపు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. దీంతో ఈ ర్యాలీలపై తాలిబన్లు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు మృతి చెందగా, ఎందరికో గాయాలయ్యాయి. అయితే ఎంత మంది మరణించారన్న దానిపై స్పష్టమైన సమాచారమేదీ లేదు. దేశంలోని పలు నగరాల్లో ఇవే దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలపై తాలిబన్లు పెదవి విప్పలేదు. 1919 ఆగస్టు, 19న బ్రిటీష్ వలసపాలకుల నుంచి అఫ్గానిస్తాన్‌కు విముక్తి లభించింది. అప్పట్నుంచి ప్రతీ ఏటా స్వాతంత్య్రదిన వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది తాలిబన్లు అఫ్గాన్‌ను వశం చేసుకోవడంతో వారి అరాచకాలను నిరసిస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ప్రజల నిరసనల్ని అడ్డుకున్న తాలిబన్లు వారిపై తమ ప్రతాపం చూపించారు. కాబూల్‌లో కార్ల ర్యాలీ కాబూల్‌లో నిరసనకారులు కార్లకి ఎరుపు, నలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జాతీయ జెండాని కట్టి ర్యాలీ తీశారు. ఈ నిరసనల్లో మహిళలు కూడా పాల్గొన్నారు. (మా కంటి పాపలనైనా కాపాడండి; అఫ్గాన్‌లో హృదయ విదారకర దృశ్యాలు) తాలిబన్ల జెండా చించేసిన నిరసనకారులు అసదాబాద్‌లో తాలిబన్ల జెండాను చించి పడేసి, జాతీయ జెండాను మోసుకుంటూ వెళుతున్న నిరసనకారులపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ప్రాణభయంతో ప్రజలు అటూ ఇటూ పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్టుగా అల్‌జజీరా చానెల్ వెల్లడించింది. ఈ ర్యాలీలకు వందలాది మంది హాజరయ్యారు. ఖోస్ట్‌లో కర్ఫ్యూ దేశంలోని జలాలాబాద్, ఖోస్ట్, పకటియా, నాన్గర్హర్లలో తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తిపోయాయి. ఖోస్ట్‌లో వందలాది మంది ప్రజలు బయటకు వచ్చి జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించారు. తాలిబన్లు వారిని అడ్డుకొని కాల్పులు జరపడంతో హింస చెలరేగింది. ఖోస్ట్‌లో కర్ఫ్యూ విధించారు. -
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో అంతర్గత రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు సందర్భోచితంగా బహిర్గతమవుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ వంటి మహిళానేతను ధీటుగా ఎదుర్కొని దేశవ్యాప్తంగా తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళూరుతున్న కమలదళ పెద్దలకు, సొంత పార్టీలోని ఇతర రాష్ట్రాల మహిళానేతల ప్రణాళికలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత అధిష్టాన నిర్ణయాలతో రాజస్తాన్ రాజకీయాల్లో నిశ్శబ్దంగా ఉన్న వసుంధరా రాజే మరోసారి యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నారు. రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ గడువు ఉన్నప్పటికీ పార్టీలో మరోసారి తన పట్టును పెంచుకొనేందుకు, తన బలాన్ని హైకమాండ్ ముందు నిరూపించుకొనేందుకు వసుంధరారాజే ఏ అవకాశాన్ని వదులుకొనేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే మార్చి 8న తన పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా దేవ్ దర్శన్ యాత్రను ప్రారంభించి తమ బలాన్ని నిరూపించుకోవాలని వసుంధరా రాజే సింధియా వర్గం నిర్ణయించింది. దీంతో రాబోయే రోజుల్లో రాజస్తాన్ బీజేపీలో పైచేయి సాధించే గొడవ తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మౌన ముద్రలో వసుంధర.. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యానికి మాజీ సీఎం వసుంధరారాజేపై విధేయత కారణంగా జిల్లాల్లో పార్టీకి సమాంతరంగా పార్టీ యూనిట్లు పనిచేయడమే కారణమని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు జరిగిన 90 మున్సిపల్‌ల్లో బీజేపీ 38 గెలుచుకోగా, అధికార కాంగ్రెస్ పార్టీ 50 గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వసుంధరా రాజేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆమె వర్గం నాయకులు అధిష్టాన పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 2019లో కమలదళం అధిష్టానం వసుంధరా రాజే అనుయాయులను పక్కనబెట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సతీష్ పూనియాను నియమించడంతో పాటు, రాష్ట్ర నాయకులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘవాల్, కైలాష్ చౌదరి వంటి వారికి కేంద్ర ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత కల్పించినప్పటి నుంచి ఆమె మౌనముద్రలో ఉన్నారు. గతేడాది జూలైలో సీఎం గహ్లోత్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభ సమయంలోనూ ఆమె మౌనంగా ఉన్న కారణంగా కమలదళం ఆ సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంతో పూర్తిగా విఫలమైంది. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాజే మద్దతుదారులు ఇప్పుడు ఆమె మళ్ళీ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవడంలో ముందుండాలని కోరుకుంటున్నారు. గత ఆదివారం వసుంధరా రాజేకు గట్టి పట్టున్న కోటాలో జరిగిన ఒక అంతర్గత సమావేశానికి సింధియా వర్గ బీజేపీ ఎమ్మెల్యేలు హాజరై, 2023 ఎన్నికల్లో ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అధికార గహ్లోత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పార్టీని పునరుద్ధరించే సామర్థ్యం, ఛరిష్మా ఉన్న లీడర్ కేవలం వసుంధరా రాజే అని ఆమె వర్గ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. ఏప్రిల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీని నిర్వహించాలని, ఆ ర్యాలీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజే మౌనంగా ఉన్న కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 8న ప్రారంభమయ్యే గోవర్ధన్ యాత్ర కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే యూనుస్ ఖాన్ సమన్వయం చేస్తారని రాజే వర్గం తెలిపింది. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో దక్కని ప్రాధాన్యత.. సతీష్ పునియాను రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిన తర్వాత పార్టీలో అంతర్గత సమస్యలు బహిర్గతం అవుతున్నాయి. రాజే మనస్తత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అధికార పగ్గాలు అప్పగించేందుకు అధిష్టానం ఇష్టపడదని, అధిష్టాన పెద్దలతో సఖ్యత లోపించినకారణంగా అంతర్గతంగా పరిస్థితులు సర్దుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీలోని అంతర్గత సమస్యల కారణంగా రాజేను అధిష్టానం పక్కనబెట్టినప్పటికీ, రాష్ట్రంలో గహ్లోత్‌ను ఎదుర్కోగలిగి, ఓడించగలిగే బలమైన నాయకులు ఎవరూలేరనే అంశాన్ని అధిష్టానం అంగీకరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. కమలదళం పెద్దలతో వసుంధరా రాజేకు మధ్య ఏమాత్రం సత్సంబంధాలు లేని కారణంగా ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీలో ఆమె వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యత దక్కలేదు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి సహా రాజే సన్నిహితులు అనేకమందిని పక్కనబెట్టి కేవలం 14మందికి మాత్రమే అవకాశం కల్పించడాన్ని సింధియా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అయితే 2012, 2018ల్లో జరిగిన పరిణామాల సమయంలో అధిష్టానంపై పైచేయి సాధించిన పరిస్థితులు ప్రస్తుతం లేవన్న విషయాన్ని వసుంధరా రాజే అర్థంచేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మద్య నిషేధాన్ని కోరుతూ ప్రచార యాత్ర మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె మార్చి 8న ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో కమలదళ పెద్దలకు మరో తలనొప్పి ఎదురుకానుంది. ఇప్పటికే మద్యపాన నిషేధం విషయంలో నిర్ణయం తీసుకోకపోవటంపై సొంత పార్టీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ఆమె ఆరోపణలు చేశారు. మరోవైపు గత నెల 21న పార్టీ పాలిత అన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమాభారతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తు నేపథ్యంలో కేంద్రప్రభుత్వ విధానాలపై నేరుగా దాడి చేశారు. మోదీ ప్రభుత్వ మొదటి పదవీకాలంలో జల వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ మంత్రిగా గంగానది, దాని ప్రధాన ఉపనదులపై విద్యుత్ ప్రాజెక్టులను తాను వ్యతిరేకించారని ఉమాభారతి ఇటీవల వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ హైకమాండ్‌కు సవాలు విసురుతూ ఆమె రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధ అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, పార్టీ అధిష్టానం తనను పక్కనపెట్టేయడాన్ని ఉమాభారతి జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఎన్నికల ప్రచారాలు షురూ
న్యూఢిల్లీ: ఇది ఎన్నికల సీజన్. అక్టోబర్, నవంబర్లలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 11 రాష్ట్రాల్లో 56 స్థానాలకు, బిహార్‌లోని ఒక పార్లమెంటు సీటుకి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 30న ఇచ్చిన అన్‌లాక్ 5 నిబంధనల్ని కేంద్ర హోంశాఖ సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించడానికి అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వులు వెంటనే ఆమల్లోకి వస్తాయని హోంశాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 15 వరకు ఎలాంటి ఎన్నికల సభలు నిర్వహించవద్దని సెప్టెంబర్ 30న విడుదల చేసిన అన్‌లాక్ 5లో పేర్కొన్న కేంద్ర హోంశాఖ వాటిని సవరించింది. ఎన్నికల ర్యాలీలో 200 మంది వరకు పాల్గొనవచ్చునని తెలిపింది. ఇక ఏదైనా భవనం లోపల ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తే సగం హాలు వరకు మాత్రమే జనానికి అనుమతినివ్వాలని వెల్లడించింది. ఇక ఎన్నికల ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. -
ర్యాలీలకు అనుమతి నిరాకరణ
సాక్షి, విజయవాడ/గుంటూరు: రేపు (శుక్రవారం) ఉద్దండరాయునిపాలెం నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు తలపెట్టిన మహిళల ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ విజయరావు తెలిపారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలుల్లో ఉన్నాయని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ర్యాలీలో ఎవరైనా పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బందరు రోడ్డులో ర్యాలీకి అనుమతి లేదు.. అమరావతి పరిరక్షణ సమితి, జాయింట్ యాక్షన్ కమిటీ రేపు (శుక్రవారం) బందరు రోడ్డులో చేపట్టనున్న ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. బెజవాడలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయన్నారు. బందరు రోడ్డులో నిత్యం వైద్య,విద్య,వ్యాపార అవసరాల కోసం ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారన్నారు. బందరు రోడ్డుకు ఆనుకుని ప్లైఓవర్ నిర్మాణ పనులు జరగడంతో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రజా ఉద్యమాలకు పోలీస్ శాఖ సహకరిస్తుందని తెలిపారు. ర్యాలీలకు అనుమతిచ్చిన రోడ్డులో నిరసనలు తెలిపితే ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రజలకు ఇబ్బంది కలిగించే నిరసనలకు అనుమతి ఉండదని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. -
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా యూత్ కాంగ్రెస్ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కు మద్దతుగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్ కోరారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కేసీఆర్ వ్యవహారశైలికి నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించాలని కోరారు. కేంద్రం అవలంబిస్తోన్న ఆర్థిక తిరోగమన విధానాలకు నిరసనగా ఈనెల 30న ఏఐసీసీ ఆధ్యర్వంలో నిర్వహించనున్న ‘భారత్ బచావో ర్యాలీ’కి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. అనంతరం గాంధీభవన్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి మాథెర్‌తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉధృతం
సాక్షి, హైదరాబాద్: సమ్మెను ఆర్టీసీ కార్మికులు మరింత ఉధృతం చేశారు. సమ్మెపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రెండు రోజుల క్రితం ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు భగ్గుమన్నారు. ఆయన మరణవార్త అధికారికంగా వెలువడగానే పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, సంతాప ర్యాలీలు నిర్వహించారు. కొన్నిచోట్ల ముందస్తు నిర్ణయం మేరకు వంటా వార్పులో కార్మికులు పాల్గొన్నారు. సోమవారం అన్ని డిపోల వద్ద సంతాప సభలు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రధాన డిపోల వద్ద జరిగే కార్యక్రమాల్లో ప్రతిపక్ష నేతలు పాల్గొననున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రత్యక్షంగా ఆర్టీసీ ఆందోళనల్లో పాల్గొంటుండగా మిగతా పార్టీల నేతలు కూడా హజరయ్యేలా ఆర్టీసీ జేఏసీ ఏర్పాట్లు చేస్తోంది. నేడు గవర్నర్‌కు ఫిర్యాదు... రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సోమవారం కలవనున్నారు. ఆర్టీసీ విష యంలో ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. వారిది పదవుల వ్యామోహం: ఆర్టీసీ జేఏసీ టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమతపై ఆర్టీసీ జేఏసీ మండిపడింది. ఉద్యోగుల సంక్షేమం కంటే వారికి పదవుల వ్యామోహమే ఎక్కువని, రాజకీయంగా ఎదిగేందుకు వారు లాలూచీ పడు తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనను సీఎం వద్ద ఉంచారని, అందుకే ఆర్టీసీ కార్మికుల విషయంలో చులకనగా మాట్లాడుతున్నారని జేఏసీ నేత థామస్‌రెడ్డి దుయ్యబట్టారు. కొనసాగుతున్న సామాన్యుల ఇబ్బందులు... రోజుకు 8 వేల కంటే ఎక్కువ బస్సులను తిప్పుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నా గ్రామీణ ప్రాంతాలకు ఆదివారం వరకు కూడా సరిగ్గా బస్సులు తిరగలేదు. ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాలకే అవి పరిమిత మవుతున్నాయి. తక్కువ సంఖ్యలో ఊళ్లకు బస్సులు తిరుగుతుండటంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. హైదరాబాద్‌లోనూ సిటీ బస్సుల సంఖ్య తక్కువగా ఉంటోంది. బస్సుల సర్వీసింగ్‌కు కూడా సిబ్బంది లేకపోవడంతో రోజువారీ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు. ఇది బస్సు ఇంజన్లపై ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే మరో వారం రోజుల్లో చాలా బస్సులు గ్యారేజీకి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీల భర్తీకి ఆర్టీసీ ప్రకటన... ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు తిప్పుతున్న ప్రభుత్వం మరిన్ని చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర క్లరికల్ సిబ్బంది, శ్రామిక్‌లు, సాఫ్ట్వేర్ నిపుణులు, ఎలక్ట్రీషియన్లు.. ఇలా అన్ని కేటగిరీలకు చెందిన సిబ్బందిని నియమించుకునేందుకు వీలుగా ఆదివారం ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సాధారణ బస్సులను తాత్కాలిక డ్రైవర్లతో తిప్పుతున్నా ఏసీ బస్సులను మాత్రం తిప్పటం లేదు. వాటిని ప్రత్యేక నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే నడపాల్సి ఉంటుంది. తాత్కాలిక పద్ధతిలో తీసుకుం టున్న డ్రైవర్లలో అలాంటి నైపుణ్యం ఉండదన్న ఉద్దేశం తో వారికి ఏసీ బస్సులు ఇవ్వడం లేదు. ఏసీ బస్సులను నడిపే నైపుణ్యం ఉన్న వారిని కూడా తీసుకోవాలని నిర్ణయించారు. అలాంటి వారి నుంచి కూడా దరఖాస్తు లు కోరుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటనలో పేర్కొంది. సాధారణ బస్సులు నడిపే వారికి రోజుకు రూ. 1,500, వోల్వో లాంటి బస్సులు నడిపేవారికి రూ. 2,000 చెల్లించ నున్నట్లు వెల్లడించింది. ఐటీ నిపుణులకు రూ. 1,500, రిటైర్డ్ సూపర్వైజరీ కేడర్ సిబ్బందికి రూ. 1,500 చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. సమ్మెలో ఉన్న వారి స్థానంలో కొత్త నియామకాలు పూర్తిచేయనుంది. సగం బస్సులు మాత్రమే ఆర్టీసీవి ఉంటాయని ఇప్పటికే సీఎం వెల్లడించిన మీదట సంస్థకు 24 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అధికారులు తేల్చారు. శ్రీనివాస్‌రెడ్డి కన్నుమూత చార్మినార్/సంతోష్‌నగర్: ఆత్మహత్యకు యత్నించి కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ కుమారుడు అభిరాంరెడ్డికి అప్పగించారు. శ్రీనివాస్ రెడ్డి మృతి విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు హుటాహుటిన అపోలో ఆసుపత్రికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వీరంతా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు బైఠాయించిన నాయకులను వివిధ పోలీస్స్టేషన్లకు తరలించి సాయంత్రం విడుదల చేశారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి వార్త తెలుసుకుని ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వీహెచ్, జేఏసీ నాయకులు థామస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ రేవంత్‌రెడ్డి, మంద కృష్ణమాదిగ, సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తదితరులు అపోలో ఆసుపత్రికి చేరుకొని శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖమ్మంలో ఉద్రిక్తత... సాక్షి ప్రతినిధి, ఖమ్మం: శ్రీనివాస్‌రెడ్డి మృతి విషయం కార్మిక వర్గాల్లో, రాజకీయ పక్షాల్లో దావానలంలా వ్యాపించడంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కార్మికుల కోసం ఆత్మ బలిదానం చేసిన శ్రీనివాస్‌రెడ్డి త్యాగం ఊరికే పోనివ్వమని, ప్రభుత్వంపై మరింత పట్టుదలగా పోరాడుతామని ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు, పలు రాజ కీయ పక్షాల నేతలు చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డి మృతదేహాన్ని ఆదివారం భారీ పోలీస్ బందోబస్త్ నడుమ రాపర్తినగర్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. పోరుకు భట్టి, ప్రధాన పక్షాల పిలుపు.. శ్రీనివాస్‌రెడ్డి మృతితో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఆమ్ఆద్మీ పార్టీ, ఎన్డీ చంద్రన్నవర్గం నేతలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌రెడ్డి స్ఫూర్తిగా మరింత పోరు జరపాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, పలు ప్రధాన రాజకీయ పక్షాల నేతలు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. -
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు భద్రతా పరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రాలున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ మేరకు రాచకొండ, సైబరాబాద్ సీపీలు మహేశ్ భగవత్, వీసీ సజ్జనార్ కూడా ఉత్తర్వులిచ్చారు. బాణసంచా కాల్చడంపై కూడా నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకొని బుధవారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవచ్చన్నారు. సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, నేతలు వీటిని నిర్వహించవద్దని ఆయన కోరారు. ఆయా ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్ట్రాంగ్‌రూమ్స్‌కు ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ప్రకారం మూడంచెల భద్రత కల్పించామన్నారు. రాష్ట్రంలోని 48 ప్రాంతాల్లో మంగళవారం జరుగనున్న కౌంటింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ ఏజెంట్లు, మీడియాకు సైతం ప్రత్యేక ప్రాంతాలు కేటాయించామని, ఎవరూ దగ్గరకు వెళ్లరాదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ఆద్యంతం వీడియో రికార్డింగ్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం స్ట్రాంగ్‌రూమ్స్‌కు డీఎస్పీ/అదనపు ఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించామని, కౌంటింగ్ సెంటర్‌కు ఎస్పీ/డీసీపీలు నేతృత్వం వహిస్తూ భద్రత, బందోబస్తులను పర్యవేక్షిస్తారన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచీ రాష్ట్రంలో ఒక్క పెద్ద ఉదంతమూ జరుగకుండా, ఒక్క చోటా రీ–పోలింగ్ లేకుండా రికార్డు సృష్టించామని, కౌంటింగ్ నేపథ్యంలోనూ అంతే సంయమనం పాటించి గర్వకారణంగా నిలవాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో పికెట్లు, గస్తీ, నిఘా పెంచడంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు తాండూరు అభ్యర్థి కెప్టెన్ రోహిత్‌రెడ్డికి అదనపు భద్రత కల్పించమని కోరారని, సానుకూలంగా స్పందించిన డీజీపీ ఆదిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గత ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1649 కేసులు నమోదు కాగా ఈసారి ఆ సంఖ్య 1550 వరకు ఉందని చెప్పారు. పోలింగ్ రోజునే 41 కేసులు రిజిస్టర్ అయినట్లు ఆయన వివరించారు. -
పాక్‌లో ప్రతిపక్ష పార్టీలకు షాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తాజాగా నిషేధాజ్ఞలు విధించారు. దాదాపు రెండు నెలలపాటు ఏ రాజకీయ పార్టీ సమావేశాలు, సభలు, బహిరంగ కార్యక్రమాలు, ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించొద్దంటూ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారిని జైలులో పెడతామని హెచ్చరించారు. ప్రధాని నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా అతిత్వరలోనే ఆందోళనలు నిర్వహిస్తామని, ఎక్కడికక్కడ రాజధాని ప్రాంతంలో పూర్తిస్థాయి బంద్‌లు నిర్వహిస్తామని ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తరుపున ఈ ఆదేశాలిచ్చారు. నవాజ్ షరీఫ్ పదవి నుంచి దిగిపోయే వరకు తమ ఆందోళన ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. పనామా విడుదల చేసిన పత్రాల ఆధారంగా షరీఫ్‌కు ఆయన కుటుంబానికి భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు ఉన్నాయని, వాటిని రక్షించుకునే పనిలో పడి దేశాన్ని గాలికి వదిలేశారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయన వెంటనే దిగిపోవాలని, లేదంటే దిగిపోయేవరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
రోడ్డెక్కిన డాక్టర్లు
డీసీహెచ్‌ఎస్‌పై దాడికి నిరసనగా ఆందోళనలు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ మద్దతుగా నిలిచిన జిల్లా అధికారుల సంఘం అనంతపురం మెడికల్ : నాడి పట్టాల్సిన వైద్యులు రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ ఆందోళన బాట పట్టారు. కదిరి ఏరియా ఆస్పత్రి వద్ద జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డాక్టర్ రమేష్‌నాథ్‌పై జరిగిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా వైద్యులు, సిబ్బంది ఏకమై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. వీరికి జిల్లా అధికారుల సంఘం నేతలు మద్దతు తెలిపారు. సోమవారం ఉదయాన్నే అనంతపురం సర్వజనాస్పత్రి వద్దకు చేరుకున్న డాక్టర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని బైఠాయించారు. దీంతో కలెక్టర్ కోన శశిధర్ వారిని లోపలికి పిలిపించి మాట్లాడారు. ఇలా వైద్యులపై దాడి చేయడం ఏంటని..? పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము ఎలా విధులు నిర్వర్తించాలని ప్రశ్నించారు. ఎంత ఒత్తిడి ఉన్నా విధులను సమర్థవంతంగా చేపడుతున్నామని, ఇలాంటి చర్యల వల్ల విధులకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోందన్నారు. తక్షణం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ, ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఈ అంశాన్ని తనకు వదిలేయాలని, బాధ్యులపై చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక రెవెన్యూ భవన్లో జరిగిన ‘మీ కోసం’కు వచ్చిన అధికారులు కూడా దాడి ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. కార్యక్రమం నుంచి బయటకు వచ్చి కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏదైనా ఉంటే అధికారులకు విన్నవించాలే గానీ ఇలా దాడులు చేస్తే ఎలాగని, తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ యుగంధర్, ఆస్పత్రి యూనిట్ అధ్యక్షులు డాక్టర్ రామస్వామి నాయక్, కార్యదర్శి డాక్టర్ వీరభద్రయ్య, నర్సింగ్ సంఘం అధ్యక్షురాలు సావిత్రి, ఐఎంఏ అధ్యక్షులు కొండయ్య, కార్యదర్శి వినయ్, డాక్టర్లు జగన్మోహన్రెడ్డి, ఆదిశేషు, ప్రవీణ్‌దీన్‌కుమార్, యండ్లూరి ప్రభాకర్, కన్నేగంటి భాస్కర్, రాంకిషోర్, విజయమ్మ, డీఆర్ఓ సి.మల్లీశ్వరి దేవి, డీఎఫ్ఓ రాఘవయ్య, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, సెరికల్చర్ ఏడీ అరుణకుమారి, మార్కెటింగ్ శాఖ ఏడీ హరిలీల, ఎస్ఎస్ఏ పీఓ దశరథరామయ్య, డీఎంహెచ్ఓ వెంకటరమణ, చేనేత జౌళీ శాఖ ఏడీ పవన్‌కుమార్, ఉద్యాన శాఖ డీడీ సుబ్బరాయుడు, బీసీ సంక్షేమ శాఖ డీడీ రమాభార్గవి, ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ రోశన్న, డ్వామా పీడీ నాగభూషణం, డీఎస్ఓ ప్రభాకర్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరామనాయక్, జేడీఏ శ్రీరామ్మూర్తి, పశుసంవర్ధక శాఖ జేడీ జయకుమార్, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, కార్మిక శాఖ అధికారి రాణి, మైనార్టీ సంక్షేమ శాఖ డీడీ వెంకటేశ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు డాక్టర్ రమేష్‌నాథ్‌పై జరిగిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. గుంతకల్లులో వైద్యులు రోడ్డుమీదకొచ్చి ఆందోళన చేశారు. హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. గుంతకల్లులో బీజేపీ నాయకులు ఎస్ఐకు వినతిపత్రం అందజేశారు. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్జీఓ ఉద్యోగులు, వైద్య సిబ్బంది ర్యాలీలు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మడకశిరలో ర్యాలీ చేశారు. పెనుకొండలో ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. తాడిపత్రి, గోరంట్ల, గుత్తి, కణేకల్లు, ఆత్మకూరులో ఆందోళనలు నిర్వహించారు. రాయదుర్గంలో విధులు బహిష్కరించారు. శింగనమల, గార్లదిన్నె సీహెచ్‌సీల వద్ద ధర్నా చేశారు. కూడేరు, ఉరవకొండలో విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. -
ఐడీబీఐ జోరు
ముంబై: ప్రభుత్వరంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయ ప్రకటనతో మార్కెట్లో దూసుకుపోతోంది. 2.34లాభంతో 74.35 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 5శాతానికి పైగా ఎగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)లో 1.5 శాతం వాటాను వాటా విక్రయించినట్లు వెల్లడించింది. 6.75 లక్షల షేర్లు టీఐఎంఎఫ్ హోల్డింగ్స్‌కు విక్రయించినట్లు బీఎస్ఈకి ఫైలింగ్ లో తెలిపింది. దీంతో ఐడీబీఐ బ్యాంక్ షేరు పట్ల భారీ ఆసక్తి నెలకొంది. గతంలో ప్రభుత్వ రంగ కంపెనీ ఎల్ ఐసీకి దాదాపు 9లక్షల షేర్లను(2శాతం) విక్రయించిన సంస్థ తాజాగా టిఐఎంఎఫ్ హోల్డింగ్స్ కు భారీ వాటాను విక్రయించింది. దీంతో గత ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న ఐడీబీఐ షేర్లు గురువారం నాటి మార్కెట్లో పుంజుకున్నాయి. కాగా బ్యాడ్ లోన్ల కారణంగా గత ఏడాది 13 శాతం వృద్ధితో పోలిస్తే ఇవాల్టి జోరుతో కలిపి ఈ ఏడాది 3శాతం మాత్రమే వృద్ధి చెందింది. -
మంధనాకు సల్మాన్ జోరు
ఇటీవల భారీ నష్టాలతో కుదైలైన టెక్స్ టైల్ కంపెనీని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆదుకున్నాడు. సల్మాన్ కు చెందిన 'బీయింగ్ హ్యూమన్' ఫౌండేషన్ తో ఒప్పందం ఖరారు కావడంతో వరుసగా ఏడో రోజూ కూడా మంధనా ఇండస్ట్రీస్ కంపెనీ అప్పర్ సర్క్యూట్ ను తాకింది. బలమైన కొనుగోళ్లతో ఇవాల్టి బుల్ మార్కెట్ లోఈ షేర్లు 5 శాతం లాభపడ్డాయి. బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ కింద వస్త్ర ఉత్పత్తులను విక్రయించేందుకు గత వారం ఒప్పందం కుదరినట్టు సంస్థ ప్రకటించింది. తమ అమ్మకాలు సాగించేందుకు మంధర రీటైల్ వెంచర్స్ ప్రయివేట్ లిమిటెడ్ (ఎంఆర్ వీఎల్) ప్రత్యేక లైసెన్సుదారు అని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా 2012 లో మంధనా ఇండస్ట్రీస్ సల్మాన్ ఖాన్ ఛారిటబుల్ ట్రస్టు తో 'బీయింగ్ హ్యూమన్' బ్రాండ్ పేరుతో చేనేత విక్రయాలను ప్రారంభించింది. ఈ ఆర్థిక సం.రం తొలి క్వార్టర్ లో రూ.57 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. రూ.1,646.61 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఏడాది జనవరిలో 70శాతం నష్టాలతో 52 వారాల కనిష్టాన్ని తాకింది. -
30 నుంచి ఆర్మీ ర్యాలీలు
సామర్లకోట: యువకులు ఆర్మీలో చేరడానికి ఈనెల 30వ తేదీ నుంచి ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ బి. నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీన కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని క్రీడా మైదానంలోను, 31న అమలాపురం టీటీడీసీలోను ఈ ర్యాలీలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన రాజమహేంద్రవరంలో ధవిళేశ్వరం రోడ్డులోని క్వాయర్ బోర్డులో ఎంపిక జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు ఆయా తేదీల్లో సెంటర్లకు ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలన్నారు. 166 మీటర్ల ఎత్తు, 76–81 మధ్య ఛాతీ, 50 కేజీల బరువు ఉన్న, 10వ తరగతి చదివిన వారు (21 ఏళ్లు), ఇంటర్ పూర్తి చేసిన వారు (23 ఏళ్లు) అర్హులని ఆయన తెలిపారు. -
టీడీపీ నాయకులు ఇప్పుడేమయ్యారు ?
సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ హిందూపురం టౌన్ : పరిశ్రమ యాజమాన్యం తరఫున ర్యాలీలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్మికులకు అన్యాయం జరిగినా పట్టించుకోకుండా ఏమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మండిపడ్డారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరిగి మండలంలోని ఎస్ఏ రావతార్ పరిశ్రమ యాజమాన్యం చట్టాలు, రాజ్యాంగాన్ని ధిక్కరించి వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాలకార్మిక చట్టానికి విరుద్ధంగా 10 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా పని కల్పిస్తోందని మండిపడ్డారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ కార్మికుల విషయంపై కలెక్టర్, ఎస్పీ స్పందించినా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మాత్రం స్పందించ లేదన్నారు. అన్యాయంగా 183మంది కార్మికులను తొలగించారని నిరసన తెలిపితే టీడీపీ నాయకులు యాజమాన్యానికి మద్దతుగా ర్యాలీ చేశారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కార్మికులకు అన్యాయం జరుగుతున్నా టీడీపీ నాయకులు పట్టించుకోలేదని విమర్శించారు. ఎస్ఏ రావ్‌తార్ పరిశ్రమలో తొలగించిన 183 మంది కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ నెల 28వ తేదీ నుంచి దశల వారీగా ఉద్యమం చేస్తామని టీడీపీ నాయకులు మౌనం వీడి మద్దతు పలకాలన్నారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు రాజప్ప, నారాయణస్వామి, రాము, ముత్యాలప్ప, నరసింహులు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
బంద్ విజయవంతం
కుల సంఘాల ర్యాలీలు.. కళాకారుల విన్యాసాలు రహదారిపై వంటా వార్పు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు.. టైర్లకు నిప్పు ఐదు చోట్ల రాస్తారోకోలు, మహిళా సంఘాల భారీ ర్యాలీలు జనగామ : జిల్లా కోసం జనగామ దరువేసింది. 48 గంటల పాటు ఉద్యమకారుల నినాదాలతో జాతీయ రహదారి హోరెత్తింది. పోలీసుల బలగాలు.. ఉద్యమ కారుల నిరసనలతో అట్టుడికిపోయింది. వాడవాడలా బైక్ ర్యాలీలు...కుల సంఘాల పాదయాత్రలతో జనగామ జిల్లా బంద్ విజయవంతమైంది. ఐకాస చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బంద్‌లో మంగళ్లపల్లి రాజు, ఆకుల వేణుగోపాల్‌రావు, డాక్టర్లు లక్ష్మీనారాయణ నాయక్, రాజమౌళి, గిరిమల్ల రాజు, ఆకుల సతీష్, వజ్జ పర్శరాములు, మహంకాళి హర్చింద్రగుప్త, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరత్నం, జేరిపోతు కుమార్, తిప్పారపు విజయ్, గుగ్గిళ్ల శ్రీధర్, బాల్దె మహేందర్, ధర్మపురి శ్రీనివాస్, రంగరాజు ప్రవీణ్, రంగు రవి, జక్కుల వేణు, శ్రీనుగుప్త, పి.సత్యం, తొట్టె కృష్ణ, కొయ్యడ శ్రీను, మాజీద్, తీగల సిద్దూగౌడ్, పిట్టల సురేష్, అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసి వేయడంతో రహదారులన్నీ నిర్మాణుష్యంగా మారిపోయాయి. జిల్లా సాధన ఉద్యమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కలిసి రావాలని నినదించారు. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఐ, బీఎస్పీ, జేఏసీ, జిల్లా సాధనసమితి, ఐఎంఏ, చాంబర్ ఆఫ్ కామర్స్, టీజీవీపీతో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులు రహదారిపై బైఠాయించి జనగామ జిల్లా చేయాలని గొంతెత్తి గర్జించారు. జిల్లా సాధన కోసం బట్టల వర్తక సంఘం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. మార్నింగ్ వాకర్స్, జిమ్ బిల్డర్స్ అసోసియేషన్ ర్యాలీని నారోజు రామేశ్వరాచారి ఆధ్వర్యంలో తలపెట్టగా మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి ప్రారంభించారు. మండలపరిషత్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీఏ, మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయూలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. జనగామ జిల్లా కోరుతూ నమాజ్ తర్వాత ముస్లింలు జమాల్‌షరీఫ్, ఎండీ. అన్వర్, దస్తగిరి, అజహరొద్దీన్, అక్భ ర్, ముజ్జులు రైల్వేస్టేషన్ రోడ్డు జామై మజీద్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. లింగాలఘన్‌పుర్‌కు చెందిన ఒగ్గు కళాకారులు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై చేసిన వి న్యాసాలు ఆకట్టుకున్నాయి. కౌన్సిలర్ మేకల రాంప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో మూడు వేల మందికి అన్నదానం చేశారు. రెండు రో జుల బంద్‌కు సహకరించిన వారికి అరుట్ల దశమంతరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మూడవ రోజుకు న్యాయవాదుల దీక్షలు జనగామ జిల్లా కోసం తలపెట్టిన న్యాయవాదుల దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ ఆధ్వర్వంలో సత్తయ్య, ఉడుత ఉపేందర్, బాల్నె సతీష్ దీక్షలో కూర్చున్నారు. -
పిల్లలపైనే ‘బడిబాట’ భారం..!
♦ విద్యార్థులను వీధుల వెంట తిప్పుతున్న ఉపాధ్యాయులు ♦ ర్యాలీలు నిర్వహించడమే బడిబాట ఉద్దేశమా.. జోగిపేట : రాష్ట్ర ప్రభుత్వం బడీడు పిల్లలు బడి బయట ఉండవద్దనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 6వ తేదీన ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులంతా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి పిల్లలు చదువుకోవడానికి వెళుతున్నారా.. లేదా.. వెళ్లకపోతే అందుకుగల కారణాలు తెలుసుకోవడంతో పాటు వెళ్లని పిల్లలను తప్పకుండా పాఠశాలలో చేర్పించేలా తల్లిదండ్రులకు నచ్చజెప్పాలి. అయితే అందోలు మండలంలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి వె ళ్ల కుండా విద్యార్థులను ఇళ్ల నుంచి పిలిపించి వారికి బ్యాండు మేళాలు అప్పగించి గ్రామ వీధుల్లో తిప్పుతున్నారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాలన్న నిబంధనలను మాత్రం విద్యాశాఖ సూచించలేదని సమాచారం. అయినా సెలవుల్లో ఉన్న పిల్లలను పాఠశాలకు పిలిపించి వారిని ఎండలో తిప్పుతున్నారు. కొన్ని గ్రామాల్లో మా పిల్లలు పాఠశాలకు వస్తున్నారు కదా...మరి మా పిల్లలను ఎందుకు తిప్పుతున్నారని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. సెలవుల్లో ఆడుకుంటున్న పిల్లల్ని పిలిపించి బ్యాండుతో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. చదువుకోని పిల్లలను ఈనెల 12, 13 తేదీల్లో పాఠశాలలో చేర్పించాలన్న నిబంధనలు ఉన్నాయని, పిల్లలతో ర్యాలీల విషయమై ఆదేశాలు మాత్రం లేవని ఎంఈఓ దామోదర్ అన్నారు. ఏది ఏమైనా పిల్లలతో ర్యాలీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. బడి బాట అంటే ఇదేనా..! రేగోడ్ : విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్క విద్యార్థి బడిలో చదువుకోవాలి. చదువుకోవాల్సిన పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు బటి బాట వంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినా.. లక్ష్యం మాత్రం నీరుగారుతోంది. మండల కేంద్రమైన రేగోడ్ బస్టాండ్‌లో మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో ఇద్దరు చిన్నారులు సంచీ చేతపట్టుకుని చెత్త కాగితాలను ఏరుకుంటుండగా మంగళవారం ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. -
వింత నిరసన...
అధికారులు ఏదైనా పనిని సకాలంలో చేయకపోతేనో, అసలు సమస్యలను పట్టించుకోకపోతేనో... జనం నిరసన తెలపడం సహజం. ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, చీపుళ్లు, బిందెలతో ప్రదర్శనలు... ఇవన్నీ రొటీన్. మహారాష్ట్రలోని బుల్దానా చత్రపతి శివాజీ మార్కెట్ వద్ద రోడ్డు గోతులు పడి పూర్తిగా పాడైపోయిందట. స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా పబ్లిక్ వర్క్స్ విభాగం వారు అటువైపు కన్నెత్తి చూడలేదట. దాంతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు పీడబ్ల్యూడీ అధికారులు మీటింగ్‌లో ఉండగా... లోనికి చొచ్చుకొచ్చి ఒక్కసారిగా ‘నాగిని డ్యాన్స్’ మొదలుపెట్టారంట. అందరూ మూకుమ్మడిగా నాగిని డ్యాన్స్ చేస్తూ తమ చుట్టూ తిరుగుతుండటంతో అధికారులు బిక్కమొహం వేశారట. -
రంగంలోకి దిగుతున్న అమిత్ షా
‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై బీజేపీ సంకల్పం’ పేరుతో ప్రణాళిక జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో 3 ప్రాంతాల్లో సభలు హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంతో పాటు రాష్ట్రానికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై బీజేపీ సంకల్పం’ పేరుతో ఒక భారీ ప్రచార ప్రణాళికను ఆయన రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టాక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ప్రతి పైసా, ప్రతి అనుమతీ ప్రజల ముందు పెట్టడమే ఈ ప్రచార ప్రణాళిక లక్ష్యం. మార్చి ఆరో తేదీన రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో జరిగే పార్టీ బహిరంగ సభ నుంచే అమిత్‌షా ఈ ప్రణాళికను అమలులో పెట్టబోతున్నారు. ఈ సభ తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో జరిగే పార్టీ బహిరంగ సభల్లోనూ అమిత్‌షా పాల్గొంటారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛను కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందజేస్తోన్న అర్థిక సహాయం నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ‘నీరు- చెట్టు’ కార్యక్రమానికి కేంద్ర నిధులు ఎంత అందుతున్నాయన్న వంటి వివరాలను అమిత్‌షా బహిరంగ సభల ద్వారా ప్రజలకు వివరించి చెబుతారు. 2016 సంవత్సరంలోనే అమిత్‌షా రాష్ట్రంలో మూడు బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 37 లక్షల మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు. వారందరి మొబైల్ ఫోన్లకు రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం వివరాలు నిత్యం ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేయడానికి వీలుగా రాష్ట్ర పార్టీ ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అమిత్‌షా సూచించారు. -
జంబ్లింగ్ వద్దు
అవనిగడ్డ : జబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ దివిసీమలో విద్యార్థిలోకం కదంతొక్కింది. ర్యాలీలు నిర్వహించారు. తహశీల్దార్ కార్యాల యాల ముందు ఆందోళనలు చేశారు. అవనిగడ్డలో ఎస్వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాల సైన్స్ విద్యార్థులు సోమవారం ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని నినాదాలు చేశారు. కళాశాల కరస్పాండెంట్ దుట్టా ఉమామహేశ్వరరావు, పలువురు విద్యార్థులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. మెడిసిన్, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ వంటి ఏ కోర్సులోనూ లేని జంబ్లిం గ్ ఇంటర్ సైన్స్‌లోనే ప్రవేశపెట్టడం దురదృష్టకరమన్నారు.పరీక్షల సమయంలో జంబ్లింగ్ విధానాన్ని ప్రకటించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ వెన్నెల శ్రీనుకు వినతి పత్రం అందజేశా రు. కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లిలో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చల్లపల్లిలో అన్ని జూనియర్ కళాశాలల విద్యార్థులూ ఆందోళన నిర్వహించారు. శ్రీశారదా సన్‌ఫ్లవర్, విజయా జూనియర్, శ్రీవిజయక్రాంతి జూనియర్ కళాశాలల విద్యార్థులు ముందుగా ఆయా కళాశాలల నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ యార్లగడ్డ శివప్రసాద్, ఎ. కోటేశ్వరరావు, అబ్దుల్ రహీం, కె. పూర్ణానందదాస్, దుట్టా శివరాంప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే జంబ్లింగ్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4న నుంచి ప్రాక్టికల్స్ జరుగనున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. కోడూరులోఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల విధానంలో నూతనంగా ప్రవేశపెట్టిన జంబ్లింగ్ పద్ధతిని రద్దు చేయాలంటూ స్థానిక మారుతీ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని పలువురు విద్యార్థులు హెచ్చరించారు. కోడూరు ప్రధాన రహదారుల వెంట ర్యాలీ నిర్వహించి తరగతులను బహిష్కరించారు. కళశాల అధినేత దుట్టా శివరామప్రసాద్, అధ్యాపకులు ఓంవీరాంజనేయులు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
సర్కారు వైఫల్యాలపై నిరసన గళం
మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ధర్నాలు, ర్యాలీలు ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ తహశీల్దార్లకు వినతిపత్రాల సమర్పణ నేడు కూడా పలు మండలాల్లో ధర్నాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:తెలుగుదేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలు.. తద్వారా రైతులు, నిరుద్యోగులకు జరుగుతున్న నష్టంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఉద్యమబాట పట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు తహశీల్దార్ కార్యాలయాల ఆందోళన నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. మంగళవారం కూడా పలు మండలాల్లో ఇదే తరహా ఆందోళనలు చేయనున్నారు. శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా, పట్టణ, మండల నాయకులు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. అనంతరం తహాశీల్దార్ సాధు దిలీప్‌చక్రవర్తికి డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలోని కంచిలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి తహశీల్దార్ టి. కళ్యాణచక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి పి.ఎం. తిలక్, ఇప్పిలి క్రిష్ణారావు, పలికల భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. సోంపేటలోనూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ సమన్వయకర్తలు నర్తు రామారావు, పిరియా సాయిరాజ్, పీఏసిఎస్ అధ్యక్షుడు రౌతు విశ్వనాధం, సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు పాతిన శేషగిరి, తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని రణస్థలం తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, జెడ్పీటీసీ గొర్లె రాజగోపాలరావు, నాయకత్వం వహించారు. ఎచ్చెర్ల తహశీల్దార్ కార్యలయం వద్ద మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దనరెడ్డి తదితరులు ప్రభుత్వం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని మెళియాపుట్టిలో పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం పార్టీ మండల కన్వీనర్ సలాన వినోద్ కుమార్ ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. పాతపట్నంలోనూ పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉప తహశీల్దారు డి.రాజేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కొండాల అర్జునుడు నాయకత్వం వహించారు.పాలకొండ నియోజకవర్గం సీతంపేటలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. -
ప్రజా సమస్యలపై సమరం
కదం తొక్కిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీలతో దద్దరిల్లిన మండల కేంద్రాలు నరసాపురంలో గేదెలతో వినూత్న ర్యాలీ తహసిల్దార్లకు వినతిపత్రాలు అందజేత ఏలూరు (ఆర్ఆర్ పేట) :ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రజా సమస్యలతో కూడిన వినతిపత్రాలను తహసిల్దార్లకు సమర్పించి.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. నరసాపురం, మొగల్తూరులలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నరసాపురం మండలంలో ప్రజలకే కాకుండా పశువులకూ తాగునీరు అందటం లేదని పేర్కొంటూ గేదెలతో ప్రదర్శన చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిళ్లతో ర్యాలీ జరిపి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని బుట్టాయగూడెంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. డిమాం డ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్‌కు అందచేశారు. జీలుగుమిల్లిలో పార్టీ మండల కన్వీనర్ గూడవల్లి శ్రీని వాసరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆచంటలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్, మాజీ జెడ్పీటీసీ ముప్పాళ వెంకటేశ్వరరావు, వైట్ల కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. పెనుమంట్రలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెన్మెత్స రామరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి విశ్వనాథరెడ్డి భారీ ప్రదర్శన నిర్వహిం చారు. దెందులూరు, పెదవేగి తహసిల్దార్ కార్యాలయాల వద్ద పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. మెట్లపల్లి సూరి బాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో పార్టీ అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ నాయకత్వంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి, నల్లజర్లలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చింతలపూడి మండలంలో ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా చేసి తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పిం చారు. రు. కొవ్వూరులో పార్టీ నాయకులు ఎనికే వీర్రాజు, సుంకర సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆకివీడులో పార్టీ సీనియర్ నాయకుడు కేశిరెడ్డి మురళి ఆధ్వర్యంలో తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం కూడా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. -
ఎరుపెక్కిన విశాఖ
- వాడవాడల మేడే వేడుకలు - భారీ ర్యాలీలు, బహిరంగ సభలు - ఆకట్టుకున్న సీపీఎం బొమ్మల ప్రదర్శన విశాఖపట్నం(డాబాగార్డెన్స్): ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నగరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు కూడళ్లు, వీధుల్లో ఎర్రజెండాల తోరణాలు కట్టడడంతో అంతా ఎరుపుమయంగా కనిపించింది. దుకాణాలకు సెలవు దినం కావడంతో మేడే ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. వాడవాడలా ఎర్ర జెండాలు ఎగురవేశారు. పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. కార్మికుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కార్మికులకు సంకెళ్లు-కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్లా, ఆమ్ ఆద్మీ, కార్మికుడు-రైతు బొమ్మలతో సీపీఎం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించింది. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు..నిర్భయ చట్టం ఎక్కడా? అంటూ ప్రదర్శించిన బొమ్మలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కేజీహెచ్‌లో: ఆంధ్రమెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంయుక్తంగా కేజీహెచ్‌లో మేడే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదనరావు జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా శ్రమించి కేజీహెచ్‌ను అభివృద్ధిబాటలో నడిపిద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు జె.వి.సత్యనారాయణమూ ర్తి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్‌కుమార్, ఆర్ఎంవో బంగారయ్య, ఎంప్లాయీస్ యూని యన్ అధ్యక్షుడు వై.త్రినాథ్, కార్యదర్శి టి.నాగరాజు, జె.డి.నాయుడు కార్మికులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో... కార్మిక చట్టాలపై బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల దాడిని తిప్పికొట్టాలని సీపీఎం గ్రేటర్ విశాఖ నగర కమిటీ నేతలు పిలుపునిచ్చారు. నగరంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. యల్లమ్మతోట నండూరి ప్రసాదరావు భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్ల కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎ త్తున సీపీఎం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. డాల్ఫిన్ హోటల్స్ యూనియన్ ఆధ్వర్యంలో... డాల్ఫిన్ హోటల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించింది. హోటల్ ముందు యూనియన్ జెండాను గౌరవాధ్యక్షుడు వై.రాజు ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల పైబడి హోటల్లో పని చేస్తున్న సీనియర్ స్టాఫ్‌కు ఇప్పటికీ రూ.10 వేల జీతం కూడా అందకపోవడం దారుణమన్నారు. జీతం పెంచకపోగా గెస్ట్‌ల నుంచి వసూలు చేసిన సర్వీసు చార్జీలో ప్రతి నెలా యాజమాన్యం లక్షలాది రూపాయలు దిగమింగుతోందని ఆరోపించారు. 8 గంటల పనిదినం సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కె.అప్పలనాయుడు, ఉపాధ్యక్షుడు సిహెచ్.పాపారావు, కోశాధికారి ఎన్.కుమారస్వామి, సభ్యులు జి.ఆనంద్, బి.శ్రీనివాస్, టి.కృష్ణ, టి.సోమినాయుడు, సన్యాసిరావు పాల్గొన్నారు. వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. మే డేను పురస్కరించుకొని ఏపీ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ తెడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ ప్రణాళికలో 8 జోనల్ పెండింగ్ కమిటీలను ఒకటిగా ఏర్పాటు చేసి ప్రతి వీధి విక్రయదారునికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఆటోరిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో.. జిల్లా ఆటోరిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రీన్‌పార్కు హోటల్ ఎదుట ఉన్న ఆటోస్టాండ్ వద్ద మే డేను ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కె.రెహ్మాన్ మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు. -
విపక్షాల పోరుబాట
♦ ప్రభుత్వ పాలనపై సమర శంఖం ♦ వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాల ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు ♦ టీడీపీ తీరును ఎండగడుతున్న వైనం ♦ నెలరోజుల్లో పెరిగిన నిరసనల హోరు సాక్షి, విజయవాడ : ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రతిపక్షాలు చేపడుతున్న ఉద్యమాలతో నగరం హోరెత్తిపోతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ ఉద్యమం మొదలుకుని స్థానిక సమస్యల పరిష్కారం వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను రాజకీయ పార్టీలు ఉధృతం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధానిగా మారిన విజయవాడలో నెల రోజుల కాలంలో ఏదో ఒక నిరసన, ఆందోళన, ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ నుంచి వామపక్ష పార్టీల వరకూ అంతా నిరంతరం పోరుబాటలోనే పయనిస్తున్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరు వైఎస్సార్ సీపీకి చెందిన పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తన నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ బాబు.ఎ, మునిసిపల్ కమిషనర్ వీరపాండియన్‌ను కలిసి విన్నవించారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ బీసెంట్ రోడ్డులో హాకర్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ఇటీవల రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఈ నిర్ణయాన్ని కార్పొరేషన్ అధికారులు వాయిదా వేశారు. సత్యనారాయణపురంలోని సీతారామ కల్యాణమండపం వ్యవహారంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.గౌతంరెడ్డి బ్రాహ్మణ సంఘాలకు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యే బొండా ఉమాకు వ్యతిరేకంగా ర్యాలీ, నిరసన చేపట్టారు. ఈ వ్యవహరంపై బ్రాహ్మణ సంఘాలతోపాటు బీజేపీ, వామపక్షాలు ధర్నాలు చేయటంతో టీడీపీ నేతలు దిగొచ్చారు. నష్టనివారణ చర్యలు మొదలుపెట్టి కల్యాణమండపాన్ని బ్రాహ్మణ సంఘానికి అప్పగించేలా చేస్తామని ప్రకటించారు. లెనిన్ సెంటర్లోని షాపులను ఖాళీ చేయించాలని ఇరిగేషన్ అధికారులు వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. సుమారు 110 షాపులకు నోటీసులు జారీ చేసిన క్రమంలో వారికి మద్దతుగా గౌతంరెడ్డి పాదయాత్ర నిర్వహించారు. కోటి సంతకాల్లో కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కోటి సంతకాల కార్యక్రమం గత నెలలో మొదలుపెట్టి దాదాపు జిల్లాలో ఎనిమిది లక్షల సంతకాలు సేకరించారు. గతనెల 31న ప్రజావంచన దినం పేరుతో సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలు చేయకపోవడంపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. వామపక్షాల ఆందోళనలు కరెంట్ చార్జీల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాలు నిరసన చేపట్టాయి. సీపీఎం నేతలు విజయవాడ కేంద్రంగా రాష్ట్రస్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీసెం ట్రోడ్డులో హాకర్లకు మద్దతు పలకటం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన క్రమంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు నగర అధ్యక్షుడు సీహెచ్ బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఈ-చలానాల పేరుతో ఆటో వర్కర్లను పొలీసులు వేధించటాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళనలు కొనసాగించారు. -
ఒక్క కేజ్రీవాల్‌కి 120మంది ఎంపీలా?
న్యూఢిల్లీ: ఒక్క కేజ్రీవాల్‌ని ఎదుర్కొనడానికి 120 మంది ఎంపీలని రప్పిస్తున్నారని బీజేపీపై అమ్ అద్మీ పార్టీ ఎదురు దాడికి దిగింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి 120 మంది ఎంపీలని బరిలో దించుతామని కేంద్రమంత్రి అనంత్ కుమార్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి నుంచి విమర్శలు రావడంతో వెంటనే ఎంపీలు కూడా పార్టీ కార్యకర్తలే, 120 మంది ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రావడంలేదని కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వివిరణ ఇచ్చారు. -
250 ర్యాలీలు.. 1000 బ్యానర్లు.. 120 మంది ఎంపీలు
న్యూ ఢిల్లీ:ఢిల్లీ శాసన సభకి జరగబోయే ఎన్నికలని బీజేపీ ప్రతిష్టాత్మకంగాతీసుకుంటోంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి 120 మంది ఎంపీలని బరిలో దింపనున్నట్లు కేంద్రమంత్రి అనంత్ కుమార్ చెప్పారు. అంతేకాకుండా వచ్చే ఏడు రోజుల్లో 250 ర్యాలీలు నిర్వహించి, ప్రతి నియోజక వర్గంలో 1000 వరకు బ్యానర్లు ఏర్పాటు చేస్తామని అనంత్ కుమార్ అన్నారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 7న జరగనున్నయి. -
హోరు.. పోరు..
కంటోన్మెంట్: కంటోన్మెంట్ కదనరంగం వేడెక్కింది. ఈనెల 11న జరగనున్న బోర్డు ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ర్యాలీలు, పాదయాత్రలు, ధూంధాంలతో ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంది. అధికార పార్టీ ఏకంగా వార్డుకో మంత్రిని నియమించి గెలుపు బాధ్యతలను అప్పగించడంతో సగం కేబినేట్ ఇక్కడే తిష్టవేసింది. విపక్షాల నుంచి రాజకీయ ఉద్ధండుల వారసులు బరిలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలే అయినా, ఆయా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తమ ప్యానల్ అభ్యర్థుల విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాల ముఖ్య నాయకులు సైతం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇక స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్నలకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. మిత్రపక్షమైన బీజేపీ పోటీ చేస్తున్న 2, 3, 5వ వార్డుల్లోనూ టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ టీఆర్ఎస్ తరఫున సగం మంది మంత్రులు, డిప్యూటీ స్పీకర్, విప్‌లు, 20 మంది ఎమ్మెల్యేలు కంటోన్మెంట్లో మోహరించారు. మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ వారం రోజులుగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మం త్రులు టి.హరీష్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు రెండు రోజులుగా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, విప్ ఓదేలు, 20 మందికిపైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కంటోన్మెంట్లో ప్రచారం నిర్వహిస్తుండడం విశేషం. పార్టీ బలహీనంగా ఉన్న వార్డుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా నేతలు పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్కు అన్ని వార్డుల్లోనూ బలమైన అభ్యర్థులే ఉన్నా నాలుగు వార్డుల్లో రెబెల్స్ బెడద తప్పేలా లేదు. ఎంపీ, ఎమ్మెల్యేలకు సవాలే.. తెలుగు దేశం పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలకు బోర్డు ఎన్నికలు సవాల్‌గా మారాయి. నాలుగోవార్డు నుంచి స్వయంగా తన కూతురు లాస్య నందితను రంగంలోకి దింపిన సాయన్న ఆమె గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధిక సమయాన్ని ఆ వార్డుకే కేటాయిస్తున్నారు. ఎంపీ మల్లారెడ్డి 1, 6వ వార్డుల్లో గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. బస్తీకి ఓ కీలక నేతను ఇన్చార్జిలుగా నియమించారు. ఒకటోవార్డులో రఘువీర్ సింగ్, ఆరోవార్డులో బాణాల శ్రీనివాస్‌రెడ్డి గెలుపును ఆయన అత్యంత కీలకంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ ఆపసోపాలు.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తన కూతురు సుహాసిని (రెండోవార్డు), కుమారుడు (నవనీత్)లను ఎన్నికల బరిలో నిలిపారు. ఇక ఏడో వార్డులో పి.భాగ్యశ్రీ, ఎనిమిదో వార్డులో ఖదీరవన్ మాత్రమే బలమైన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. నాలుగోవార్డులో బోర్డు బరిలో నాలుగు సార్లు, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన డీబీ దేవేందర్ ఈ సారి తన కూతురు అంబికను పోటీలో నిలిపారు. సానుభూతి ఓట్లపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఈ వార్డులో కాంగ్రెస్‌కే చెందిన మరో నేత వెంకటేశ్ భార్య సుశీల కూడా ప్రధాన పోటీదారుల్లో ఒకరు కావడం గమనార్హం. ఐదో వార్డులో వార్డులో సర్వే కుమారుడు నవనీత్తోపాటు వార్డు అధ్యక్షుడు సంకి రవీందర్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అల్లుడు రాజేశ్‌లు సైతం పార్టీ అభ్యర్థులుగానే బరిలో ఉన్నారు. ఇక ఒకటి, మూడు, ఆరోవార్డులోని పార్టీ అభ్యర్థుల పోటీ నామమాత్రంగానే ఉంది. ఎవరినీ ఉపేక్షించం అనుమతి లేకుండా ప్రచార సభలు, ర్యాలీల్లో పాల్గొంటే కేబినెట్ మంత్రులనైనా ఉపేక్షించేది లేదు. బోర్డు ఎన్నికల్లో మోడల్ కోడ్ ఉల్లంఘనలను సీరియస్‌గా పరిగణిస్తాం. ఇటీవల గాయత్రి గార్డెన్స్, జీవీఆర్ గార్డెన్స్‌లో కొందరు మంత్రుల ఎన్నికల ప్రచార సభలు నిర్వహించినట్టు మా దృష్టికొచ్చింది. వీటిపై పోలీసు అనుమతుల వివరాలు, తమ సిబ్బంది వీడియో రికార్డుల ఆధారంగా సోమవారం సభ నిర్వాహకులకు నోటీసులు పంపిస్తాం. ఇప్పటివరకు 87 మందికి ఉల్లంఘన నోటీసులు పంపాం. అనుమతి లేకుండా ఫంక్షన్ హాళ్లలో ఎన్నికల సమావేశాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు. అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించకుండా ఉండేలా చూడాల్సిందిగా హోంమంత్రి, సీఎస్, డీజీపీలకు ప్రత్యేకంగా లేఖలు పంపుతున్నాం. - విఠల్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి -
ఐకేపీ యానిమేటర్లపై ఉక్కుపాదం
-
ముందస్తు నిర్బంధం
ఐకేపీ యానిమేటర్ల అరెస్టు సమస్యల పరిష్కారం కోరుతూ ఐకేపీ యానిమేటర్లు సోమవారం చేయతలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 120 మందికిపైగా యానిమేటర్లు, సీఐటీయూ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేశారు. ఒంగోలు సెంట్రల్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చేపట్టిన చలో హైదరాబాద్‌కు ఆదివారం జిల్లానుంచి వెళ్తున్న ఐకేపీ యానిమేటర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేసి యానిమేటర్లతో పాటు మద్దతుగా వెళ్తున్న సీఐటీయూ నేతలనూ అరెస్టు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 120 మందికిపైగా అరెస్టు చేసి నిర్బంధించారు. వంద రోజులుగా ఐకేపీ యానిమేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 22న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. అయితే, జిల్లా నుంచి చలో హైదరాబాద్‌కు వెళ్తున్న వారిని రాష్ర్ట ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావును వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో ఉంచారు. మరో నాయకుడు చీకటి శ్రీనివాసరావును టూటౌన్లో ఉంచారు. అరెస్టులకు నిరసనగా నేడు ర్యాలీలు... చలో హైదరాబాద్‌కు వెళ్తున్న ఐకేపీ యానిమేటర్లను అడ్డుకుని అరెస్టు చేసినందుకు నిరసనగా సోమవారం జిల్లావ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మజుందార్ తెలిపారు. యానిమేటర్లంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షురాలు అరెస్టు, విడుదల... బేస్తవారిపేట : ఐకేపీ యానిమేటర్ల సంఘ జిల్లా అధ్యక్షురాలు డీ జరీనాను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు.. జరీనా లేకపోవడంతో చిల్లర దుకాణంలో ఉన్న ఆమె భర్త ఫకీరయ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కనీసం దుకాణం మూసేందుకు కూడా సమయం ఇవ్వకుండా లాక్కుని వచ్చారు. సమాచారం అందుకున్న జరీనా.. సీఐటీయూ నాయకులతో పోలీసుస్టేషన్‌కు చేరుకుని తన భర్త అరెస్టుపై ప్రశ్నించారు. తాను చలో హైదరాబాద్‌కు వెళ్లడం లేదని, ఆరోగ్యం బాగలేకపోవడంతో కంభం వైద్యశాలలో చికిత్స చేయించుకుంటున్నానని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆమె భర్త ఫకీరయ్యను విడుదల చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో జరీనా, సీఐటీయూ నాయకులు మాట్లాడిన తర్వాత విడుదల చేశారు. అరెస్టు అప్రజాస్వామికం ఒంగోలు టౌన్ : ఐకేపీ యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్‌కు సన్నద్ధమవుతున్న సీఐ టీయూ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మజుందార్, నాయకుడు టీ మహేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, కార్యదర్శి జీ శ్రీనివాసరావు, నాయకులు సీహెచ్ గంగయ్య, డీఎంకే రఫీ, ఎన్.నాగేశ్వరరావులను పోలీసులు వారి ఇంటికి వెళ్లి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అంతేగాకుండా సీఐటీయూ కార్యాలయంలో ముఠా కార్మికుల యూనియన్ సమావేశంలో ఉన్న నాయకులను కూడా అరెస్టు చేశారన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలను ప్రభుత్వం విడనాడకుంటే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. -
మోదీ హవానే ఉంటే..ప్రచార సభలు ఎందుకు?
ముంబై: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ తమ ఆరోపణలను మరింత పదును పెడుతున్నాయి. ప్రధాని మోదీ ముమ్మర ప్రచారంపై శివసేన.. ‘బీజేపీ చెబుతున్నట్లుగా మోదీ హవానే ఉంటే.. మోదీ ఇన్ని ప్రచార సభల్లో పాల్గొనడం ఎందుకు? ఖర్చు దండగ. ఢిల్లీలో కూర్చుని బీజేపీకి ఓటేయమంటే చాలు కదా. ప్రజలు ఓట్లేసేవారు!’ అని పార్టీ పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో చురకలేసింది. ప్రధానిగా ఉంటూ ఊరూరు తిరుగుతూ ప్రచారం చేయడం ఆ పదవి ప్రతిష్టను దెబ్బతీయడమేనని, దాంతో పాటు ఆ పర్యటనల భారం కూడా ఖజానాపై భారీగానే పడుతుందని వ్యాఖ్యానించింది. దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ.. ‘మోదీ ఫోబియా’కు ఆ వ్యాఖ్యలు నిదర్శనమంటూ తిప్పికొట్టింది. మోదీ ఇన్ని సభల్లో పాల్గొనడం ఎందుకని ప్రశ్నించడం.. మైదానంలో సచిన్ టెండూల్కర్ పరుగులు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించడం.. ఈ రెండూ ఒకటేనంటూ పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ ఎద్దేవా చేశారు. -
ఓయూలో పోటాపోటీ ర్యాలీలు... ఉద్రిక్తత
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థుల మధ్య వైరం రోజురోజూకు తీవ్రతరం అవుతుంది. యూనివర్శిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగులు రెగ్యులరైజ్‌కు మద్దతుగా సదరు ఉద్యోగులు శుక్రవారం... ఆర్ట్స్ కాలేజీ నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ర్యాలీకి వ్యతిరేకంగా యూనివర్శిటీ విద్యార్థులు మరో ర్యాలీ నిర్వహించారు. దాంతో యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణమంతా మోహరించారు. అయితే నిన్న సాయంత్రం భగీరథ హాస్టల్లో కొంత మంది ఆగంతకలు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో యూనివర్శిటీ రహదారులు, హాస్టళ్లు, కాలేజీల వద్ద పోలీసుల పహారాను భారీగా పెంచారు. -
సమగ్ర సర్వేపై విస్తృత ప్రచారం
‘గులాబీ’ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు 11న గ్రామాల్లో ర్యాలీలు, సభలు 12న మండల కేంద్రాల్లో సమావేశాలు 16న విద్యార్థులచే ర్యాలీలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు హన్మకొండ సిటీ : సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు దోహదపడే సమగ్ర సర్వేపై టీఆర్ఎస్ తరఫున విస్తృత ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. హన్మకొండలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలనే లక్ష్యంతోపాటు తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమగ్ర సర్వేకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 19న జరిగే సమగ్ర సర్వేలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చా రు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషిచేయూలన్నారు. అనంతరం సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించేందు కు టీఆర్ఎస్ తరఫున నిర్వహించనున్న ప్రచార కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 11న టీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్వర్యంలో గ్రామాల్లో ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేరోజు గ్రామ నడిబొడ్డున బహిరంగ సమావేశం నిర్వహించి సర్వే ప్రాధాన్యాన్ని వివరిస్తామన్నారు. 12న ఉదయం 11 గంటలకు మండల కేంద్రాల్లో సమావేశాలు, 16న పాఠశాలల విద్యార్థులతో గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో ర్యాలీలు నిర్వహించి విస్తృత ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. 17 పార్టీ జిల్లా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని, దీనిపై తుది నిర్ణయం తర్వాత ప్రకటిస్తామన్నారు. వారి విమర్శలు అర్థం లేనివి... రాష్ట్ర ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు అర్థం పర్థం లేని విమర్శ లు చేస్తున్నారని... అవాకులు, చెవాకు లు పెలుతున్నారని రవీందర్రావు ధ్వ జమెత్తారు. రాజకీయ అవినీతి, దళారులు లేని ప్రజాపాలన జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. విద్యుత్ ప్రాజెక్టులన్ని సీమాంధ్రలో ఉన్నాయ ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అవసరాలకు విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు. విద్యుత్ సరఫరా లోపంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రజలకు వివరించారని, దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. మూడేళ్లలో 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎయిమ్స్ అస్పత్రి స్థలాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం అదేశించిందని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు నాయకులు భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, మార్నేని రవీందర్రావు, ఇండ్ల నాగేశ్వర్రావు, గైనేని రాజన్, సంపత్, అంజయ్య, జయరాజ్, పీఆర్‌రెడ్డి, జోరిక రమేశ్, చాగంటి రమేశ్, నయూమొద్దీన్ పాల్గొన్నారు. -
అట్టుడికిన ఓయూ
వేర్వేరు ప్రాంతాల్లో పలు విద్యార్థి సంఘాల ఆందోళనలు హైదరాబాద్ : ర్యాలీలు, రాస్తారోకోలు, అరెస్టులతో ఓయూ క్యాంపస్ ఐదు రోజులుగా ఆందోళనలకు కేంద్రంగా మారింది. మంగళవారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలు అంశాల పరిష్కారానికి వేర్వేరుగా ఆందోళనలు చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయవద్దని బీజేవైఎం, ఎంఎస్ఎఫ్, ఏబీవీపీ, టీఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ(విజృంభణ) ఐదో రోజు లైబ్రరీని బహిష్కరించి ర్యాలీ చేపట్టాయి. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఎదుట సమావేశమై భవిష్యత్తు పోరాటం కోసం కొత్తగా తెలంగాణ నిరుద్యోగుల సంఘర్షణ సమితిని స్థాపించారు. పాలస్తీనాపై ఇజ్రాయిలు దాడులను ఖండిస్తూ పీడీఎస్‌యూ కార్యకర్తలు ఆర్ట్స్ కళాశాల ఎదుట అమెరికా, ఇజ్రాయెల్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జమ్ముకాశ్మీర్‌పై ఎంపీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను చులకన చేసి మాట్లాడిన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి దిష్టిబొమ్మను తార్నాక చౌరస్తాలో ఏబీవీపీ కార్యకర్తలు దహనం చేశారు. ఎన్సీసీ గేటు వద్ద ఓయూ విద్యార్థి జేఏసీ(గద్దెల అంజిబాబు వర్గం) ప్రైవేటు కోచింగ్ సెంటర్ల దిష్టిబొమ్మను దహనం చేశారు. మా జీవితాల్లో చీకట్లు నింపొద్దు : కాంట్రాక్టు లెక్చరర్ల వినతి తమ జీవితాల్లో చీకట్లు నింపవద్దని విద్యార్థులను తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం కోరింది. ఉద్యోగాలు క్రమబద్దీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని సంఘం అధ్యక్షుడు కనకచంద్రం యాదవ్ విన్నవించారు. సచివాలయంలో హోంమంత్రి నాయిని న రసింహారెడ్డిని కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. -
ఊరేగింపులు, ర్యాలీలు నిషేధం
ఆలంపల్లి, న్యూస్‌లైన్: ఈనెల 16 వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సోమవారం ఎస్పీ వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌం టింగ్‌ను పర్యవేక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ పట్టణంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10:30 గంటలకు ముగిసిందని ఎస్పీ పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు అనుమతి లేదని ఆమె చెప్పారు. ఈనెల 16 తర్వాత అనుమతులు పొంది ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. వికారాబాద్ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ.. వికారాబాద్‌లోని 27 వార్డులకు కౌం టింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. కౌం టింగ్‌కు సహకరించిన అధికారులకు, నాయకులకు ఆమె అభినందనలు తెలిపారు. నెలకు పైగా ఉత్కం ఠతో ఎదురు చూసిన మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో టెన్షన్‌కు తెరపడింది. అంతా సవ్యంగా జరగడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
జిల్లాలో పోలింగ్ ప్రశాంతం
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో బుధవారం జరిగిన 16వ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తం మీద 78.34 శాతం పోలింగ్ నమోదైంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 80.86 శాతం పోలింగ్ జరగగా ఈసారి 2.52 శాతం తగ్గింది. గత ఎన్నికల కంటే జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం ఓటు హక్కు వినియోగంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించింది. దీంతో దాదాపు 85 శాతం వరకు ఓటింగ్ జరుగుతుందని భావించారు. అందుకు భిన్నంగా గతం కంటే కూడా పోలింగ్ శాతం తగ్గడం గమనార్హం. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె.ప్రభాకరరావులు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. చిన్నపాటి ఘటనలు మినహా దాదాపు జిల్లా అంతటా పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలను ముందుగానే పరిశీలించుకోండి, అవి పనిచేయలేదని పోలింగ్ ఆలస్యం కాకూడదని తొలినుంచీ కలెక్టర్ చెబుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో అరగంట నుంచి రెండు గంటలపాటు పలుచోట్ల పోలింగ్ నిలిచిపోయింది. పట్టణ ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరితే పల్లెల్లో మాత్రం క్రమంగా ఓటింగ్ పుంజుకుంది. జిల్లా అంతటా ఫ్యాన్ గాలి ప్రభంజనం కనిపించింది. ఓటర్లు సెలైంట్ ఓటింగ్‌తో దుమ్ము దులిపేశారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు నిబంధనలను అతిక్రమించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం నిర్వహించారు. దీనిపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు, ఎన్నికల సిబ్బంది రంగంలోకి దిగి నిబంధనలు అతిక్రమిస్తున్న టీడీపీ శ్రేణుల్ని వారించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ కేడర్‌పై దాడులు చేసి గాయాలపాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఈసారి జాగ్రత్తలు తీసుకుని బందోబస్తు కట్టుదిట్టం చేయడంతో అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ డబ్బు, మద్యం పెద్ద ఎత్తున పంచింది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ పదనిసలు ఇవీ... మచిలీపట్నంలోని రాంజీ హైస్కూల్లో 122 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు. పోలింగ్ అధికారులు ఫిర్యాదుతో టెక్నీషియన్ వచ్చి దాన్ని సరిచేశాడు. 23వ వార్డులో ఒక పార్టీకే ఓటేస్తే మరో పార్టీ గుర్తు వద్ద లైట్ వెలగడంతో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ ఈవీఎంను మార్పు చేశారు. 119వ పోలింగ్ స్టేషన్లో ఓటర్ స్లిప్ ఉన్నప్పటికీ ఒక వృద్ధురాలి ఓటును వేరొకరు వేయడంతో వివాదం రేగింది. పెడన నియోజకవర్గంలో 45, 57, 185 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో వేరే వాటిని పెట్టారు. గూడూరు మండలం గురిజేపల్లిలో ఇద్దరు వ్యక్తులు డబ్బు పంచుతుండగా వారి వద్ద నుంచి రూ.96 వేలు స్వాధీనం చేసుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల మండలం చిట్టూర్పు వద్ద ఈవీఎంలు మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. చల్లపల్లి మండలం రామానగరంలోని ఒక బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో అప్పటి వరకు వేసిన ఓట్లు పోయాయని కంగారుపడ్డారు. తరువాత మరమ్మతు చేసి అప్పటి వరకు వేసిన ఓట్లు ఉన్నాయని ప్రకటించారు. నాగాయలంక మండలం భావదేవరపల్లి, నంగేగడ్డ, చోడవరం ప్రాంతంలో టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ వెంట వచ్చిన 50 మంది కార్యకర్తలు సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రచారం నిర్వహించి హల్చల్ చేశారు. కోడూరు మండలం ఐబీ పేటలో టీడీపీ నాయకులు బూత్‌లోకి వెళ్లి సైకిల్‌కు ఓటు వేయాలని ఓటర్లపై ఒత్తిడి చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే టీడీపీ కేడర్ స్లిప్పులు, మద్యం పంపిణీ చేశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు తహశీల్దార్ టీఆర్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేయడంతో ఆయన పోలీసులతో వచ్చి టీడీపీ వాళ్లను పంపించి వేశారు. నాగాయలంకలో సజ్జా గోపాలకృష్ణ, తలశిల సత్యనారాయణ నేరుగా 198, 199 పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ‘మన గుర్తు తెలుసుగా.. గట్టిగా గుద్దండి’ అంటూ ప్రచారం నిర్వహించారు. అధికారులు సైతం అడ్డు చెప్పలేదు. నాగాయలంక మండలం టి.కొత్తపాలెంలో పోలింగ్ బూత్ వద్దే టీడీపీ నాయకులు డబ్బు పంచారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పెనమలూరు నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. పలుచోట్ల సిబ్బందికి ఈవీఎంలను సెట్ చేయడం రాకపోవడంతో పోలింగ్ అరగంట ఆలస్యమైంది. పామర్రు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. టీడీపీ నేతలు నిమ్మకూరు గ్రామంలో డబ్బులు పంచడం వివాదాస్పదమైంది. గుడివాడలో 90, 118 పోలింగ్ కేంద్రాల్లో, పెదపారుపూడి మండలంలో ఒకచోట ఈవీఎంలు మొరాయించాయి. టీడీపీ అభ్యర్థి తమ ప్రాంతంలో డబ్బులు ఇవ్వలేదని గుడివాడలో పార్టీ కార్యాలయం ముందు పలువురు ఓటర్లు ధర్నా చేశారు. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు. గన్నవరంలో సావరిగూడెం, ముస్తాబాద, బీబీ గూడెంలో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఏర్పాటు చేశారు. బుద్ధవరం గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద మహిళా సమాఖ్య అధ్యక్షురాలు టీడీపీకి ఓటేయాలని ప్రచారం చేయడంతో వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కేసరపల్లి వద్ద ఏ బటన్ నొక్కినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు పడుతున్నాయంటూ టీడీపీ నేతలు హడావుడి చేసి ఆందోళన నిర్వహించారు. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ చెన్నకేశవరావు, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్, రిటర్నింగ్ అధికారి ఎన్వీవీ సత్యనారాయణ వచ్చి ఆ ఈవీఎం సక్రమంగానే ఉందని నిర్ధారించారు. అయినా టీడీపీ వివాదం చేయడంతో దానిని మార్చి మరోటి ఏర్పాటు చేశారు. నూజివీడు నియోజకవర్గంలో ఐదు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కొద్దిసేపు ఆలస్యమైంది. దీంతో వాటిని మార్పు చేసి వేరేవాటిని ఏర్పాటు చేశారు. కైకలూరు హైస్కూల్లో రెండు సెంటర్లు, గుమ్మళ్లపాడు, వెలంపేటలో ఈవీఎంలు మొరాయించాయి. తిరువూరు నియోజకవర్గంలో నాలుగు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. వాటిని మార్పు చేసి వేరే వాటిని ఏర్పాటుచేశారు. బందోబస్తు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బంది ఏర్పడింది. మైలవరం నియోజకవర్గం తోలుకోడు గ్రామంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నడుమ వివాదం రేగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. రెడ్డిగూడెంలో టీడీపీ కార్యకర్త దురుసుగా ప్రవర్తించడంతో కానిస్టేబుల్ చేయి చేసుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. చంద్రాలలో 39వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయిడంతో 20 నిమిషాలు పోలింగ్ ఆలస్యమైంది. రెడ్డిగూడెం మండలంలో రెండుచోట్ల, జి.కొండూరు మండలంలో ఒకచోట ఈవీఎంలు మొరాయించాయి. నందిగామలో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలో తొమ్మిది చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వాటిని సరిచేయడంతో ఆలస్యంగా ఓటింగ్ జరిగింది. జగ్గయ్యపేటలో కవ్వింపు చర్యలు... జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య ఇంట్లో ఆ పార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి రావడంతో వారంతా చెల్లాచెదురయ్యారు. టీడీపీ నాయకుడు నూకల కుమార్‌రాజా పోలింగ్ కేంద్రం వద్ద డబ్బు పంచడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేటలో టీడీపీకి చెందిన ఓ మహిళ రెండు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించడంతో వైఎస్సార్సీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడిచేసి కొట్టారు. మరోచోట దొంగ ఓటు వేసే ప్రయత్నం చేసిన టీడీపీ కార్యకర్తను వైఎస్సార్సీపీ ఏజెంట్లు పోలీసులకు పట్టించారు. షేర్‌మహ్మద్‌పేటలో ఈవీఎం మొరాయించడంతో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. గవరవరంలో అరగంట పాటు ఈవీఎం మొరాయించింది. గురుకుల పాఠశాల, గండ్రాయిల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాల్లో, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోను ఈవీఎంలు మొరాయించాయి. ఆసక్తి చూపని నగర ఓటరు విజయవాడ నగరంలో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో ఆ మూడు నియోజకవర్గాల్లోనూ తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. తూర్పు నియోజకవర్గంలోని పటమట పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు రెండుసార్లు మొరాయించాయి. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వర్షంలోనూ ఓటర్లు ఓటేసేందుకు ముందుకొచ్చారు. మధ్యాహ్నం అరగంటపాటు కురిసిన వర్షంతో కొద్దిసేపు అంతరాయం కలిగినా... ఆ తర్వాత ఓటేసేందుకు జనం క్యూకట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటువేసిన పలువురికి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు దక్కకపోవడంతో లబోదిబోమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కొద్దిసేపు ఇబ్బందిపడ్డారు. గుణదల, సత్యనారాయణపురం ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు ఆలస్యం జరిగింది. -
క్లైమాక్స్ అదిరింది
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరుకుంది. పోలింగ్ ముగింపునకు 48 గంటల ముందు ప్రచారాన్ని ఆపేయాలన్న నిబంధనతో ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడింది. అయితే ఆఖరి రోజున ప్రధానపార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌గణేష్, సినీదర్శకుడు పూరి జగన్నాథ్, సినీ హీరో సాయిరామ్‌శంకర్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ భారీ బైక్‌ర్యాలీ హోరెత్తిపోయింది. నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తల పట్టణం జనసంద్రంగా మారింది. కాగా పోలింగ్‌కు కేవలం ఒక రోజు మాత్రమే గడువుండటంతో తెరవెనుక మంత్రాంగం ప్రారంభమైంది. ప్రలోభాలకు తెర లేచింది. ఇప్పటి వరకు రోడ్ల మీదకు వచ్చి ఓట్లు అభ్యర్థించిన వారు ఇప్పుడు శిబిరాల నిర్వహణలో నిమగ్నమయ్యారు. కులసంఘాలు, మహిళా సంఘాలు, గ్రామ పెద్దలను ప్రసన్నం చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. వైఎస్ఆర్ సీపీ ధీమా ఈ ఎన్నికల్లో విజయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సతీమణి, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వై.ఎస్.విజయలక్ష్మి విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగడంతో జిల్లా అంతటా వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లాలో పర్యటించడం, ఆయన సోదరి షర్మిలమ్మ వరుస పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో జిల్లాలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అన్నివర్గాల వ్యతిరేక విధానాలను అవలంభించిన తెలుగుదేశం తొమ్మిదేళ్ల పాలన ఇప్పటికీ ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడం.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీలోకి తీసుకోవడం.. ఇప్పటికీ చంద్రబాబుపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం.. ఇలా అనేక కారణాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవన్నీ వైఎస్ఆర్సీసీ అభ్యర్థులకు బలం చేకూరుస్తున్నాయి. కోట్లు కుమ్మరించిన టీడీపీ జిల్లాలో ఫ్యాను గాలికి తట్టుకోలేక టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. రూ.కోట్లు వెదజల్లి ఓట్లు కొల్లగొట్టాలని యోచిస్తోంది. దీంతో ప్రతీ నియోజకవర్గంలోను రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఖర్చుకు రంగం సిద్ధం చేసుకుని, ఇప్పటికే సగానికి పైగా డబ్బు ఖర్చు చేశారు. ఆదివారం రాత్రి ఒక్కో నియోజకవర్గంలో సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పంచిపెట్టారు. భీమిలి నియోజకవర్గం పరిధిలో మధురవాడ వాంబే కాలనీలో అర్ధరాత్రి 12 గంటలకు టీడీపీ నాయకులు ఇళ్ల తలుపులు కొట్టి ప్రజలను లేపి మరి ఓటుకు రూ.500 ఇచ్చారు. ఈ పంపకాల కోసం ఒంగోలు నుంచి టీడీపీ బృందం వచ్చినట్లు సమాచారం. -
ఫ్యాన్ హవా..!
జిల్లాలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఐదు నియోజకవర్గాల్లో విజయమ్మ పర్యటన పూర్తి పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం జిల్లాలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం కొనసాగుతోంది.. ఫ్యాన్ గాలి ఉధృతంగా వీస్తోంది. ఓవైపు ప్రచారపర్వం.. మరోవైపు అధినేతల పర్యటనలు.. ఇంకోవైపు నామినేషన్ల సందడితో పార్టీలో కోలాహలం నెలకొంది. నామినేషన్ల దాఖలుకు బుధవారం మంచిరోజు కావడంతో ఎక్కువమంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి జిల్లాలో ఎన్నికల వేడి మరింత పెంచారు. ప్రచారంలోనూ దూకుడే.. జిల్లాలోని 16 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు వైఎస్సార్ సీపీ అందరికంటే ముందుగా అభ్యర్థులను ఖరారుచేసింది. టీడీపీ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థుల్ని ఖరారు చేయలేని పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకెళుతున్నారు. కాగా సోమవారం జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోను, మంగళవారం గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె చేసిన పర్యటన విజయవంతం కావడంతో కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ఉన్నారు. దీనికితోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. అన్నదాతలు మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగుల వరకు అన్నివర్గాలవారికి మేలు చేసేలా ఆచరణాత్మకమైన హామీలను మేనిఫెస్టోలో చేర్చారు. దీనిని పార్టీ అభ్యర్థులు ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
పోలీస్ టెన్షన్...
జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో ర్యాలీలు, సమావేశాలు షురూ రోజుకు వందకుపైగా దరఖాస్తులు ఆచితూచి అనుమతులిస్తున్న అధికారులు సాక్షి, సిటీబ్యూరో: నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం శనివారంతో ముగియడంతో నేతలు ఆదివారం నుంచి ప్రచారం ప్రారంభించారు. ఇటీవల శ్రీరామనవమి శోభాయాత్రకు బందోబస్తు నిర్వహించిన పోలీసులు ఊపిరి తీసుకునే లోపే రేపు హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే విజయయాత్ర బందోబస్తుకు సిద్ధమవుతున్నారు. ఓ పక్క ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవాలు, నేతల ఇంటింటి ప్రచారం, సభలు, సమావేశాలతో కంటి మీద కునుకు లేకుండా తిరుగుతున్నారు. ఇందుకోసం ముందస్తుగా వారు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. దీంతో ఆయా పార్టీల నేతలు పోలీసు అనుమతులు కోరుతూ డివిజన్, జోన్, కమిషనర్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ప్రచారం ఊపందుకోవడంతో పోలీసుల్లో టెన్షన్ పెరిగింది. ఆనుమతులపై ఆచితూచి అడుగు.. జంట పోలీసు కమిషనరేట్ పరిధిలో సభలు, సమావేశాలు, ర్యాలీల అనుమతులు కోరుతూ రోజూ వందకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తును కింది స్థాయి అధికారి నుంచి పైస్థాయి అధికారి వరకు క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతులిస్తున్నారు. ఒక ప్రాంతంలో ఒకే సమయంలో ఇరు పార్టీలు అనుమతి కోరితే.. మొదట ఏ పార్టీ దరఖాస్తు చేస్తే వారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో సభలు, ర్యాలీల నిర్వహణపై వచ్చే దరఖాస్తులపై అధికారులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అనుమతి ఇచ్చే ముందు ఆ ప్రాంతం సమస్యాత్మకమైందా?.. అంత్యత సమస్యాత్మకమైందా?.. సాధారణంగా ఉందా అనేది మొదట పరిశీలిస్తున్నారు. అంత్యంత సమస్యాత్మక ప్రాంతమైతే ఏపీఎస్పీ, ఏఆర్ బలగాలతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. సమస్యాత్మక ప్రాంతమైతే స్థానిక పోలీసులతో పాటు ఆర్మడ్ రిజర్వు, టాస్క్‌ఫోర్స్ పోలీసులను సిద్ధం చేస్తున్నారు. సాధారణ ప్రాంతమైతే స్థానిక పోలీసులకు తోడు ఆర్మడ్ రిజర్వు సిబ్బంది బందోబస్తులో ఉంటున్నారు. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీల అధినేతలు నగరంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఇవి మరింత ముమ్మరం కానున్నాయి. దీంతో భారీ బందోబస్తు ఏర్పాట్లలో పోలీసుల తలమునలవుతున్నారు. పక్కాగా కోడ్ అమలు పోలీసులు ఎన్నికల కోడ్‌ను, నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా రాజకీయ పార్టీ అభ్యర్థి ఉపయోగించే వాహనాలను సీజ్ చేయాలని జంట పోలీసు కమిషనర్లు అనురాగ్‌శర్మ, సీవీ ఆనంద్‌లు ఇన్స్పెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏ పార్టీకీ అనుకూలంగా మెలగరాదని సూచించారు. ఏదైనా పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. -
గర్జించిన యువజనం
వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ర్యాలీలు సీమాంధ్ర వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు.. మార్మోగిన సమైక్య నినాదాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు నిర్విరామపోరు సాగిస్తున్న ఆ పార్టీ శ్రేణులు మంగళవారంనాడు సీమాంధ్ర జిల్లాల వ్యాప్తంగా భారీర్యాలీలు, మానవహారాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిం చాయి. పార్టీ నేతల సారథ్యంలో వేలాదిగా యువకులు, విద్యార్థులు కదం తొక్కారు. ఎక్కడికక్కడ ద్విచక్రవాహనాలతో ప్రదర్శనలు చేపట్టారు. వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన భారీర్యాలీలో వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో, తాడిపత్రిలో పార్టీ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం, ఎస్కేయూ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఇంటిని ముట్టడించి అవిశ్వాసానికి మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. చిత్తూరులో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి నాయకత్వంలో విద్యార్థులు భారీ ప్రదర్శన, మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో మానవహారం, కుప్పంలో నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి నాయకత్వంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. చంద్రగిరిలో పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. కర్నూలు-రాయచూరు రహదారి దిగ్బంధం కర్నూలు జిల్లా మంత్రాలయంలో పార్టీ కార్యకర్తలు కర్నూలు - రాయచూరు రహదారిని దిగ్బంధించారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కర్నూలులో ఎస్.వి.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సోనియా, కిరణ్, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జిల్లా మంత్రుల ఫొటోలతో రూపొందించిన ఫ్లెక్సీపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా పులివెందులలో, కడపలో విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి. రాజంపేటలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. పార్టీ శ్రేణుల పాదయాత్ర: విశాఖలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ భారీ పాదయాత్ర నిర్వహించారు. పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి మీదుగా నాతయ్యపాలెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో, రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. కాకినాడలో పార్టీ కార్యకర్తలు సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్, బొత్స, కిరణ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబాయి ఆధ్వర్యంలో విద్యార్థులు అమలాపురంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జాతీయరహదారిపై రాస్తారోకో: పిఠాపురం కోటగుమ్మం సెంటర్ నుంచి వందలాది మంది విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏలూరులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం పేరిట భారీ బహిరంగసభ నిర్వహించారు. శ్రీకాకుళంలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు ధర్నాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్.కోట, గజపతినగరం, సాలూరు, కురుపాం మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ర్యాలీలు చేపట్టాయి. మానవహారాలు: విజయవాడలో వన్‌టౌన్‌లో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. సత్యనారాయణపురంలో పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఎస్సీ సెల్ రాష్ట్ర విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్, ప్రచార కమిటీ కన్వీనర్ విజయచందర్ పాల్గొన్నారు. జగ్యయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు, కనిగిరిలో, మార్కాపురంలో, గిద్దలూరులో, సంతనూతలపాడులో బైక్ ర్యాలీలు జరిగాయి. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో విద్యార్థులతో ర్యాలీలు, రాస్తారోకోలు జరిగాయి. ఈ ఆందోళనలకు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు నేతృత్వం వహించారు. గుంటూరు జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో, గుంటూరులో పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, సమన్వయకర్తలు నసీర్ అహ్మద్, షేక్‌షౌకత్ ఆధ్వర్యంలోనూ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. నేడు ట్రాక్టర్లతో రైతుల ర్యాలీలు సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని చోట్లా రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు చేపట్టనున్నారు. రేపు రహదారుల దిగ్బంధం సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు ఈనెల 12వ తేదీ గురువారం సీమాంధ్ర జిల్లాల్లో రహదారుల దిగ్బంధనానికి పార్టీ శ్రేణులు భారీగా సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా రోడ్లపైనే వంటావార్పులు చేపట్టనున్నట్టు పార్టీ వెల్లడించింది. ఆందోళనలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. -
హైదరాబాద్‌లో ఎటు చూసినా ర్యాలీలే!
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు జంట నగరాల నుంచి భారీ సంఖ్యలో సమైక్యవాదులు తరలివస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు నేతృత్వంలో సమైక్యవాదులు సభకు తండోప తండాలుగా కదలివస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీలుగా తరలివస్తున్నారు. దారి పొడుగునా సమైక్య నినాదాలు చేస్తూ సమైక్య శంఖారావం సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. * అంబర్‌పేట కార్పొరేటర్ కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో 3వేల మందితో బైక్ ర్యాలీ * కూకట్పల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డేపల్లి నర్సింహరావు నేతృత్వంలో వాహనాలతో భారీ ర్యాలీ * శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ ముక్కారూపానందరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ * సనత్‌నగర్ ఇంఛార్జ్ వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ * కుత్భుల్లాపూర్ ఇంఛార్జ్ కొలను శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో వాహనాలతో భారీ ర్యాలీ * కేపీహెచ్పీలో జార్జ్ హెర్బట్ ఆధ్వర్యంలో 100 మీటర్ల వైఎస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరణ, ర్యాలీగా బయల్దేరిన నేతలు * రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వైఎస్ఆర్ సీపీ నేత ఈసీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో సభకు వేలాదిగా తరలివెళ్లిన కార్యకర్తలు -
44వ రోజు ఎగసిపడిన సమైక్యాంధ్ర ఉద్యమం
-
సిరియాపై దాడుల నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఆందోళనలు
-
విశాఖలో కొనసాగుతున్ననిరసనలు
-
రాజమండ్రిలో ఉద్ధృతంగా సమైక్యపోరు
-
అలహాబాద్ విద్యార్థుల ఆందోళన