ఆలంపల్లి, న్యూస్‌లైన్: ఈనెల 16 వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సోమవారం ఎస్పీ వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌం టింగ్‌ను పర్యవేక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ పట్టణంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10:30 గంటలకు ముగిసిందని ఎస్పీ పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు అనుమతి లేదని ఆమె చెప్పారు.
ఈనెల 16 తర్వాత అనుమతులు పొంది ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. వికారాబాద్ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ.. వికారాబాద్‌లోని 27 వార్డులకు కౌం టింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. కౌం టింగ్‌కు సహకరించిన అధికారులకు, నాయకులకు ఆమె అభినందనలు తెలిపారు. నెలకు పైగా ఉత్కం ఠతో ఎదురు చూసిన మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో టెన్షన్‌కు తెరపడింది. అంతా సవ్యంగా జరగడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఊరేగింపులు, ర్యాలీలు నిషేధం
Published Tue, May 13 2014 12:35 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement