Amrapali
-
AP: టూరిజం ఎండీగా ఆమ్రపాలి.. తెలంగాణ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు
సాక్షి,విజయవాడ: తెలంగాణ నుంచి ఇటీవలే వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆదివారం(అక్టోబర్ 27) ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఆమ్రపాలి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిమోహన్, వైద్య ఆరోగ్య కమిషనర్‌గా వాకాటి కరుణ, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఐఏఎస్ అధికారి రొనాల్డ్‌రోస్‌కు ఇంకా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా, ఏపీకి కేటాయించిన తమను తెలంగాణలోనే కొనసాగించాలని ఐఏఎస్ అధికారులు పెట్టుకున్న అభ్యర్థనను కేంద్ర డీఓపీటీ శాఖ తిరస్కరించడంతో వీరు ఏపీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా -
ఆమ్రపాలి.. ఆంధ్రాకే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఎవరికి కేటాయించిన రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని ఇటీవల డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ మరికొందరు ఐఏఎస్ అధికారులతోపాటు ఆమ్రపాలి కూడా క్యాట్‌ను ఆశ్రయించగా, బుధవారంలోగా ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆమె ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.క్యాట్ ఈ నిర్ణయంతో ఏపీకి వెళ్లాల్సిన వారు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. డీవోపీటీ ఆదేశాల కనుగుణంగా యథావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలని క్యాట్ ఆదేశించడంతో, హైకోర్డు ఎలాంటి ఆదేశాలిస్తుందో తెలియనందున ముందైతే ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల వరకు వేచి చూడనున్నారు. ఏపీకి వెళ్లినా, రెండు రాష్ట్రాల పరస్పర అవసరాలు, ఒప్పందాలతో తిరిగి తెలంగాణకు రప్పించే అవకాశాలూ ఉంటాయనే ప్రచారం మొదలైంది. బల్దియా బాస్ ఎవరో.. మరోవైపు, ఆమ్రపాలి స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఎవరిని నియమించనున్నారనేది జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సీనియర్ ఐఏఎస్‌ను నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ గురించి, నగర నైసర్గిక స్వరూపం గురించి పూర్తిస్థాయి అవగాహన ఉన్నవారిని నియమించగలరనే ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీని మూడు లేదా నాలుగు కార్పొరేషన్లుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఆ ప్రక్రియ జరిగేంతదాకా సీనియర్ ఐఏఎస్ అధికారి అవసరమని అర్బన్‌ప్లానింగ్ నిపుణులు అంటున్నారు.ఎక్కువ కార్పొరేషన్లుగా విభజన జరిగాక ఎవరున్నప్పటికీ, కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యేంత వరకు తగిన అనుభవమున్న సీనియర్ ఉండాలంటున్నారు. 2025 చివర్లో, లేదా 2026 ఆరంభంలో జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికలోగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యే అవకాశమున్నందున, అప్పటివరకు సీనియర్ అధికారి అవసరమంటున్నారు. ప్రస్తుతానికి.. కొంత కాలం వరకు ఎవరైనా సీనియర్ అధికారికి జీహెచ్ఎంసీ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలప్పగించవచ్చుననే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: ఆ ఐదుగురు ఐఏఎస్‌లకు బిగ్ షాక్ -
ఏపీలో మేం పని చేయలేం ఐఏఎస్ అధికారుల విముఖత
-
TG: ఆమ్రపాలికి కేంద్రం షాక్
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆమ్రపాలితో పాటు తెలంగాణ కేడర్ కావాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వీరందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ 11 మంది ఐఏఎస్‌లలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్ కూడా ఉన్నారు. వీరందరూ తమకు తెలంగాణ కేడర్ కావాలని కేంద్రంలోని డీవోపీటీ శాఖకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరి విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఇదీ చదవండి: ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్‌కుమార్ -
Ghmc: పోస్టర్లు బ్యాన్..ఆమ్రపాలి కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో వాల్ పోస్టర్లు బ్యాన్ చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం(సెప్టెంబర్27) సర్క్యులర్ జారీ చేశారు. జీహెచ్ఎంసీలో వాల్ పోస్టర్లు,వాల్ పెయింటింగ్స్ పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.సినిమాల పోస్టర్లు కూడా ఎక్కడా అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.ఒకవేళ ఆదేశాలను పట్టించుకోకుండా పోస్టర్లు వేస్తే మాత్రం జరిమానా విధించాలని సర్క్యులర్‌లో తెలిపారు.ఇదీ చదవండి: మూసీకి వరద..జీహెచ్ఎంసీ హై అలర్ట్ -
జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లేందుకు సెలవు పొందడంతో ఆయన స్థానంలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలిని నియమించారు. ఈ నెల 8,9 తేదీలు, తిరిగి 23వ తేదీ సెలవు దినాలను వినియోగించుకునేందుకు అనుమతితో పాటు 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోనాల్డ్ రాస్కు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 8వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆమ్రపాలికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వు జారీ చేశారు. -
ఐఆర్బీ టెండర్లపై సీఎం రేవంత్ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లీజు టెండర్లలో అక్రమాలపైన ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. సీబీఐ లేదా అదేస్థాయి సంస్థలతో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడంతో ఔటర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఔటర్ టోల్ లీజులో అక్రమాలకు బాధ్యులైన అధికారురులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఔటర్ లీజు వ్యవహారంపైన పూర్తి వివరాలను అందజేయాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని ముఖ్యమంత్రి ఆదేశించారు. 158 కిలోమీటర్ల మార్గంలో టోల్ వసూలు ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఔటర్ రింగ్‌రోడ్డును గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఐఆర్బీ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటు, పీసీసీ చీఫ్‌గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. కనీస ధర వెల్లడించకపోవడంతో ఔటర్లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలపైన అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ఆయనపైన పరువునష్టం దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పదంగా మారిన ఔటర్ లీజు అంశాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే సమగ్రమైన విచారణ చేపట్టాలని ఆయన హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఓటీ పద్ధతిలో ఔటర్ లీజు... కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ (టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు 2022 ఆగస్టు11వ తేదీన గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదే సంవత్సరం నవంబర్ 9వ తేదీన అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహా్వనించింది. గత సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి 11 బిడ్డర్లు ఆసక్తిని ప్రదర్శించారు. బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా మూడుసార్లు బిడ్ గడువును పొడిగించారు. 30 ఏళ్ల లీజుపైన బేస్ ప్రైస్ కంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ వెల్లడించారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన బేస్ప్రైస్పైన మాత్రం గోప్యతను పాటించడంతో ఈ లీజు వ్యవహారం వివాదాస్పదమైంది. మొదట్లో 11 సంస్థలు పోటీ చేయగా, చివరకు 4 సంస్థలు మాత్రమే పోటీలో మిగిలాయి. ఆ నాలుగింటిలోనూ ఐఆర్బీ ఎక్కువమొత్తంలో బిడ్ వేసి లీజును దక్కించుకుంది. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంలో ప్రతి రోజు 1.5 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అప్పట్లో గత ప్రభుత్వం నిర్దేశించిన అంచనాల కంటే ఎక్కువ మొత్తంలో ఐఆర్బీ సంస్థకు టోల్ ఆదాయం లభిస్తున్నట్లు అధికారవర్గాల అంచనా. మరోవైపు ఏటా సుమారు రూ.550 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కామధేనువు వంటి ఔటర్‌ను ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం పట్ల ఇంజనీరింగ్ నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గడువు కంటే ముందే రూ.7380 కోట్లు చెల్లించిన ఐఆర్బీ... ఇలా వివాదాల నడుమ ఔటర్ టెండర్‌ను దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ నిర్ణీత 120 రోజుల గడువు కంటే ముందే రూ.7380 కోట్ల లీజు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించింది..దీంతో 2008 నుంచి 2023 వరకు వరకు సుమారు 15 సంవత్సరాల పాటు హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు మొట్టమొదటిసారి ప్రైవేట్ సంస్థ నిర్వహణలోకి వెళ్లిపోయింది. నిబంధనల మేరకు రానున్న 30 ఏళ్ల పాటు ఈ లీజు కొనసాగవలసి ఉంటుంది. 8 వరుస లేన్లతో (1264 లేన్ కి.మీలు) కూడిన 158 కి.మీల ఔటర్ రింగ్రోడ్డుపైన ఉన్న సుమారు 120కి పైగా టోల్గేట్ల వద్ద ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థ టోల్ వసూళ్లను కొనసాగిస్తోంది. ఔటర్ రింగురోడ్డు నుంచి టోల్ వసూలు చేయడంతో పాటు రహదారుల నిర్వహణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, తదితర ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) బాధ్యతలను కూడా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే చేపట్టవలసి ఉంటుంది. హెచ్‌జీసీఎల్ ఔటర్‌ను ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్లు, ఔటర్ మాస్టర్‌ప్లాన్ అమలు, పచ్చదనం పరిరక్షణ వంటి బాధ్యతలకు పరిమితమైంది. -
ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
హైదరాబాద్: హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ ఉత్తర్వులు విడుదల చేశారు. హెచ్‌జీసీఎల్ ఇన్చార్జి ఎండీగా విధులు నిర్వహించిన అప్పటి చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తన పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమ్రపాలికి హెచ్‌జీసీఎల్ నిర్వహణ, పర్యవేక్షణపై ఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆమె ఔటర్‌రింగ్‌రోడ్డు ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌గా, స్పెషల్ కలెక్టర్‌గా కూడా విధులు నిర్వహించనున్నారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీకి ఎండీగా కూడా ఆమె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
IAS Amrapali: బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: డ్యాషింగ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా పేరున్న ఆమ్రపాలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్‌గా ఇవాళ సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. బదిలీ ద్వారా పదోన్నతితో హెచ్ఎండీఏకు ఆమె నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను అభినందించారు. హెచ్ఎండిఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఆపై మూసి రివర్ ఫ్రెంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు. హెచ్ఎండీఏకు ఉన్నత పరిపాలనాధికారిగా కమిషనర్ మాత్రమే కొనసాగుతుండగా.. తాజాగా సంయుక్త కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2019 నుంచి హెచ్ఎండీఏకు కమిషనర్‌గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కొనసాగుతున్నారు. హెచ్ఎండీఏను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో అర్వింద్‌ను హెచ్ఎండీఏలో కొనసాగిస్తారా.. ఆ స్థానంలో నూతన అధికారిని నియమించనున్నారా? అనే దానిపైనా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి
-
తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ.. ఆమ్రపాలికి ఆ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. పదోన్నతుల బదిలీలుగా పేర్కొంటూ పలువురిని తన పేషీలో చేర్చుకుంది ప్రభుత్వం. ఊహించినట్లుగానే యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి బాధ్యతలు దక్కాయి. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమెను నియమించింది. డిప్యూటీ సీఎం ఓఎస్డీ(ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా కృష్ణభాస్కర్, వ్యవసాయ కార్యదర్శిగా బి.గోపి, TSSPDCL (దక్షిణ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీ ఫరూకీని, ట్రాన్స్ కో జేఎండీ (జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్)గా సందీప్ కుమార్, TSNPDCL(ఉత్తర) వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్నాటి వరుణ్ రెడ్డి, ఎంపీడీసీఎల్‌కు సీఎండీగా క్రాంతి వరుణ్‌రెడ్డి, వైద్య..ఆరోగ్య శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ కమిషనర్‌గా శైలజా రామయ్యర్‌ను నియమించారు. విద్యుత్ డిపార్ట్మెంట్లోనే ఈ బదిలీలు ఎక్కువగా జరిగాయి. ఇంధన శాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నియమిస్తూ.. ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలూ అప్పజెప్పారు. ఇటీవలె డీ. ప్రభాకర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి అభినందించాక.. ఆమ్రపాలికి ఏదో ఒక బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం విపరీతంగా జరిగింది. అందుకు తగ్గట్లే ఆమెకు హెచ్ఎండీఏ కమిషనర్ బాధ్యతల్ని అప్పజెప్పారు. -
ఆమ్రపాలి ఇన్ !..స్మితా సబర్వాల్ ఔట్
-
కొత్త సర్కార్ ప్లాన్!.. కేంద్ర సర్వీసులకు స్మితా.. రాష్ట్రానికి ఆమ్రపాలి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంలో కొత్త టీమ్‌పై ఫోకస్ పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేసే అధికారుల ఎంపికపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇక, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. కాగా, తెలంగాణలో త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇక, ఆయా శాఖల్లో పలువురు అధికారుల జాబితా కూడా సిద్దమైనట్టు తెలుస్తోంది. శాఖల సమీక్షలు పూర్తి కాగానే బదిలీలు ఉంటాయన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం ఉంటుందనే చర్చ మొదలైంది. మరోవైపు.. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లేందుకు స్మితా సబర్వాల్ దరఖాస్తు పెట్టుకున్నట్టు సమాచారం. కాగా, ప్రస్తుతం ఆమె.. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితా సబర్వాల్ ఏ సమీక్షకు హాజరు కాకపోవడం గమనార్హం. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. తాజాగా స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన 23 ఏళ్ల కేరీర్ గురించి ప్రస్తావిస్తూ ఆమె ఫొటోను షేర్ చేశారు. కొత్త ఛాలెంజ్‌కు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. Some pics remind us how far we have come.. through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will! Thanks to all your love ♥️, ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYv — Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023 ఇదిలా ఉండగా.. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి.. మహిళా ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు సీఎం ఆఫీసుకు గుడ్ బై చెప్పాలనుకుంటే మరొకరు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్మితా సబర్వాల్ సెంట్రల్ సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తుండగా.. ఇటు కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి.. రేవంత్ రెడ్డి టీమ్‌లో జాయిన్ కానున్నారు అనే చర్చ జరుగుతోంది. దీంతో, ఈ ఐఏఎస్‌ల అంశం ఆసక్తికరంగా మారింది. -
నేర్చుకున్నది ఎప్పటికీ వృధా కాదు!
ఇతిహాసాల్లోని పాత్రలకు తమ అభినయంతో వెండితెర మీద ప్రాణం పోయడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ పరీక్షలో నెగ్గి.. సీతగా జీవించింది కృతి సనన్ ‘ఆదిపురుష్’లో! ఆ టాలెంట్‌కి ఫ్యాషన్ స్టయిల్ని క్రియేట్ చేసే చాన్స్ దక్కించుకున్న బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ.. అర్పితా మెహతా... సాధారణంగా చాలా మంది తల్లులు .. కూతుళ్లకు చీరకట్టి.. ముస్తాబు చేసి మురిసిపోతుంటారు. కానీ అర్పితాకు మాత్రం అమ్మకు చీరకట్టడమంటే ఇష్టం. పండుగలు, వేడుకలకు అమ్మ, అమ్మమ్మకు చక్కగా చీరకట్టి.. అలంకరించి సంబరపడేది. అలా బాల్యంలోనే.. తన ప్యాషన్ ఫ్యాషనే అని గ్రహించి, పెద్దయ్యాక ముంబైలోని ఎన్ఎన్డీటీ యూనివర్సిటిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. 2009లో సొంత లేబుల్ ‘అర్పితా మెహతా’ను ప్రారంభించింది. వైవిధ్యమైన, ఆధునిక డిజైన్స్‌ని క్రియేట్ చేస్తూ, అనతికాలంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే వీటి ధరలూ అదే స్థాయిలో ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. ఆమ్రపాలీ జ్యూలరీ ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలీ’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. ఇందులో నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలూ ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలను రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలీ జ్యూలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలోనూ, మామూలు పీస్ అయితే అమ్రపాలి జ్యూలరీలోనూ లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కి ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూలరీ బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. బ్రాండ్: అర్పిత మెహత చీర ధర: రూ. 2,50,000 బ్లౌజ్ ధర: రూ. 40,000. (చదవండి: రోజ్ ఫెస్టివల్..ఎటు చూసి గూలబీ పూల గుత్తులే..!) -
ఆమ్రపాలి సక్సెస్ జర్నీ.. స్వగ్రామం.. కుటుంబ నేపథ్యం ఇదే..
ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్.అగ్రహారం. గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో కలెక్టర్‌గా పనిచేశారు. 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్ సీఈఓగా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు. తన నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. చిన్న వయసులో.. ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో ఇటీవల నియమించారు. అపాయింట్మెంట్ ఆఫ్ కేబినెట్ సెలక్షన్ కమిటీ ఆమెను పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. అతి చిన్నవయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. ఈ పోస్టులో ఆమె 2023 అక్టోబర్ 23 వరకు అంటే మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఆమ్రపాలి ఫ్యామిలీ గురించి.. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్శిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్.అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. ఆమ్రపాలి భర్త సమీర్ శర్మ కూడా ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్. ప్రస్తుతం ఆయన డయ్యూ, డామన్‌లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి. ప్రస్తుతం కర్నాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. తమిళనాడు క్యాడర్ ఐఏఎస్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉప ఎన్నికకు రెండుసార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఆమ్రపాలి మనసులో మాట.. స్త్రీ జీవితం చుట్టూ పెనవేసుకున్న నిబంధనలు, ఆచార వ్యవహరాలపై ఆమ్రపాలి ఓ సందర్భంలో స్పందిస్తూ... పుట్టడం, పెరగడం, చదువు, పెళ్లి, ఉద్యోగం ఇలా అన్ని విషయాల్లో మహిళలు అనేక ఆంక్షల మధ్య జీవిస్తున్నారు. ఈ ఆంక్షల కారణంగా ఎంతో ప్రతిభావంతులు సైతం ఇంటికే పరిమితం అవుతున్నారు. భరించలేని బాధలను పంటి బిగువున అదిమి పెడుతున్నారు. అందరితో మంచి అనిపించుకోవాలనే ఆత్రుతతో తమని తాము కోల్పోతున్నారు..’ అంటారు. ఒక్క రోజులో ఈ ప్రపంచాన్ని మార్చలేమని, వ్యక్తిగత స్థాయిలో మార్పును ఆహ్వానిస్తే అతి త్వరలో సామాజిక మార్పు, తద్వారా మహిళల జీవితాల్లో మరింత వెలుగు తీసుకురావచ్చనేది ఆమె అభిప్రాయం. ఓ కలెక్టర్‌గా నా దగ్గరకు వివిధ సమస్యలతో వచ్చే మహిళలో చాలా మందిని గమనించా.. పెళ్లైన తర్వాత భర్త సరిగా చూసుకోవడం లేదు. ఇబ్బంది పెడుతున్నాడు, భర్త, అతని కుటుంబం నుంచి కష్టాలు వస్తాయని చెప్పిన వారే ఉన్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం బయటి నుంచి చూపించడం కష్టం. తన కాళ్ల మీద తాను నిలబడగలను అనే ధైర్యం ఉన్నప్పుడు పరిష్కారం త్వరగా వస్తుంది. పెళ్లి చేసుకుంటే నా జీవితం సెట్ అయిపోతుంది, నా భర్తే అంతా చూసుకుంటారు అనే ఆలోచణ ధోరణి కంటే నా కాళ్ల మీద నేను నిలబడతాను అనే వైఖరి అమ్మాయిల్లో రావాలి. జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైనది. తల్లిదండ్రులు, బంధువులు.. అంతా కలిసి పెళ్లి విషయం చూసుకుంటారు. పెళ్లి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టే బదులు ఆర్థిక స్వాతంత్ర సాధించే దిశగా పదో తరగతి నుంచి అమ్మాయిలు ఆలోచించడం మేలు. తెలివితేటలు అభిరుచికి తగ్గ చదువు, నైపుణ్యం పెంచుకోవాలి. ఉద్యోగం లేదంటే కుట్లు,అల్లికలు.. ఇలా క్రియేటివ్ వర్క్ ఏదైనాచేస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడాలి. నా విషయానికి వస్తే కేరీర్ విషయంలో.. సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి కేరీర్ ఎంచుకోవాలనే అంశంపై చాలా మందికి స్పష్టత ఉండదు. మన వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, ఇష్టాఇష్టాలను బేరీజు వేసుకుని ఏ తరహా కెరీర్ ఎంచుకోవాలనేది తెలుస్తుంది. అందులో బెస్ట్‌గా ఉండేదాన్ని సాధించాలనే గోల్ పెట్టుకోవాలి. నా విషయానికి వస్తే కేరీర్ విషయంలో నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉన్నారు. నువ్వు అమ్మాయివి ఇలాంటి చదువే నీకు కరెక్ట్ అనలేదు. పని ప్రదేశాల్లో... ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల్లో మహిళలు పని చేస్తున్నారు. ఇక్కడ స్త్రీ, పురుషులకు ఒకే రకమైన సదుపాయాలు ఉంటున్నాయి. పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి. ఉదాహరణకు కార్యాలయంలో పని చేసే ఓ మహిళ తన పసిబిడ్డకు పాలు పట్టించేందుకు ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. క్లీన్ అండ్ సేఫ్ టాయిలెట్స్ పెద్ద సమస్య. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. సామాజిక కట్టుబాట్లు, ఆచారాలకు అమ్మాయిలు లొంగి ఉండాలి అనేట్టుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం నేర్పుతుంది. దీంతో అమ్మాయిలు లొంగి ఉండటం, సర్థుకుపోవడం వంటివి వంటబట్టించుకుంటారు. ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, అందరితో మంచి అనిపించుకోవాలి. అణుకువగా ఉండాలి అంటే. బీ కూల్, బీ నైస్ అని చెబుతారు. అబ్బాయిల విషయంలో అగ్రెసివ్‌గా ఉండు, నువ్వు ఏం చేసినా ఏం కాదు.. భయపడకు అని చెబుతారు. ఇలా మొదటి నుంచి పిల్లల పెంపకం (కండీషనింగ్)లోనే తేడాలు ఉంటాయి. ప్రపంచంలో అందరికీ నచ్చేట్టు ఎవ్వరూ బతకలేరు. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం మంచిగా బతకడం ముఖ్యం, ఆ తర్వాత పక్కన వాళ్లు. లీగల్, సోషల్ కౌన్సిలర్లు ఈ అంశంపై మహిళలతో మాట్లాడి వారిలో మార్పును తీసుకువస్తున్నారు. తరతరాలు ఉన్న పద్ధతిని ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా మార్చలేము. నెమ్మదిగా అయినా మార్పు వస్తుంది. ఇక్కడ చాలా బెటరే...కానీ అమ్మాయిల రక్షణ విషయంలో దేశంలో మన హైదరాబాద్ నగరం ఎంతో ముందంజలో ఉంది. పాలన వ్యవహారాలు, వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ, బెంగళూరులకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది పరిశీలిస్తాను. ప్రభుత్వ పనులు పక్కన పెడితే నేను ఓ సాధారణ మహిళనే. ఈ రెండు పరిస్థితుల మధ్య తేడా ను పోల్చి చూసినప్పుడు ఢిల్లీ, బెంగళూరుల కంటే హైదరాబాద్ మహిళల రక్షణ విషయంలో మెరుగైన స్థితిలో ఉంది. బెంగళూరు, ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్ మాటలను బట్టి.. ఏదైనా ఆపద వచ్చినా ఇబ్బందుల్లో ఉన్నా.. వారికి న్యాయం జరగాలంటే ఎన్ని ఫోన్ కాల్స్ చేయాలి.. ఎంత మందిని కలవాలి అనేది బేరీజు వేస్తాను. మన రాష్ట్రంలో కలెక్టర్‌గా కాకుండా ఓ సాధారణ మహిళగా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు షీ టీమ్స్ వస్తాయి. ఇలాంటి రక్షణ దేశంలో ఇతర ప్రాంతాల్లో లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా.. అమ్మాయిలను వేధించే, టీజ్ చేసే వాళ్లు అన్ని చోట్ల ఉంటున్నారు. వ్యక్తిగత స్థాయిలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే అమ్మాయి ప్రభుత్వ పాఠశాలల అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం పీఈటీలకు స్వశక్తి టీమ్‌లతో ఇప్పటికే శిక్షణ ఇప్పించాం. ప్రభుత్వ ఉద్యోగమే.. మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఈ క్రమంలో బయట పని చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అని కాకుండా ప్రైవేట్ రంగంలో అయినా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ పాఠశాల/ కాలేజీల్లో ఉన్న పిల్లలు హై స్పీడ్ ట్రాక్‌లో ఉన్నారు. కస్తూర్బా పాఠశాలల్లో మార్పు వస్తోంది. గతంలో టెన్త్‌తో చదువు ఆపేసే వారు. ఇప్పుడు ఇంటర్మీడియట్‌కు వెళ్లేలా వారిలో మార్పు తీసుకువచ్చాం. నైన్త్, టెన్త్‌లో చదువు ఆపేసిన వారు, అన్ స్కిల్ల్డ్ గల్స్ కోసం వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ర్యాగింగ్ చేసినా, టీజింగ్ చేసినా బయటకు చెప్పడానికి అమ్మాయిలు భయపడుతారు. ఇంట్లో సమస్యలు ఉంటే బయటకు చెబితే చుట్టు పక్కల అంతా చెడుగా అనుకుంటారెమో అని పెళ్ళైన వాళ్లు సందేహపడతారు. ఇలా సమస్యను బయటకు చెప్పకుండా ఉంటే పరిష్కారం లభించడం కష్టం. నువ్వు అక్కడెందుకు ఉన్నావ్, అలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, అలా ఎందుకు మాట్లాడవు... తప్పంతా నీదే అంటూ విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారని ముందుకు రారు. కానీ అమ్మాయిలు బయటకు చెప్పాలి. ఏదైనా సమస్య ఉంటే పోలీసులు, రెవిన్యూ వాళ్లకి చెప్పండి.. మేము చూసుకుంటాం. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్.. గృహిణిగా ఉండడం అనేది ఓ గొప్ప విషయం. అయితే గృహిణి ఇంట్లో చేసి పనిని ఎవ్వరూ సరిగా గుర్తించరు. అండర్ వాల్యూ చేస్తారు. గృహిణిగా ఉంటూనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నించాలి. గంటా, రెండు గంటలా అనేది కాదు. పార్ట్‌టైం జాబ్, క్రియేటివ్ వర్క్ ఏదైనా పర్లేదు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి. మనం అవునన్నా.. కాదన్నా వరల్డ్ రన్స్ ఆన్ ఎకనామికల్. హౌజ్ వైఫ్‌గా ఉండటం తప్పు కాదు. కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంపల్సరీ. ఎంతో తెలివైన వాళ్లు, సృజనాత్మకత ఉన్న వారు వారి ప్రతిభను అంతా ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఉమన్ గో అవుట్ అండ్ వర్క్... దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. నా విషయంలో తల్లిదండ్రుల నుంచి ఇటువంటి ఒత్తిడులు లేవు. అంతేకాదు ఏం చదవాలనే విషయంలో అమ్మాయిలకు ఛాయిస్ ఉండడం లేదు. అమ్మాయిలు డాక్టర్, టీచర్, అబ్బాయిలు ఇంజనీరు అంటారు. అమ్మాయిలు ఇంజనీరింగ్ చదివినా అందులో కంప్యూటర్స్ సెలక్ట్ చేసుకోమంటారు. మెకానికల్, సివిల్స్ వద్దంటారు. అమ్మాయిల తెలివి తేటలు, సామర్థ్యంతో పని లేకుండా శారీరక కష్టం లేని విధంగా చదువు సాగాలని అభిలాషిస్తారు. అన్ని రంగాల్లో ఆడవాళ్లు విజయం సాధిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇది అందరం బాధపడే విషయం...ఎందుకంటే..? మగ పిల్లలను కనాలి అనుకునే ప్రబుద్ధులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. ఇది మనమందరం బాధపడే విషయం, టెర్రిబుల్ ట్రాజిక్. రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే నమ్మకంగా ఉంటారు. తల్లిదండ్రులకు అండగా ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసినా మళ్లీ మగపిల్లలే కావాలంటారు. ఈ పద్దతిలో మార్పు రావాలి. -
Swapna Sundari: నాట్యభూషణం
‘వాగ్గేయకార’ గుర్తింపు పొందిన ఏకైక మహిళ. పద్మభూషణ్ అందుకున్న నాట్యవిలాసిని. ఆమ్రపాలి రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వ పురస్కారగ్రహీత. ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్లో ప్రదర్శనకారిణి. యంగ్ కల్చరల్ అంబాసిడర్‌గా భారత ప్రతినిధి. మూడు నాట్యరీతుల సాధన కర్త... నాట్యానికి స్వీయ గాత్ర సహకార ప్రత్యేకత. ఇన్నిటి సమ్మేళనం వక్కలంక స్వప్న సుందరి. ‘‘నా కళాప్రస్థానం గురించి చెప్పే ముందు మా అమ్మ గురించి చెప్పాలి. అమ్మమ్మ తరం వరకు మా గాత్రప్రతిభ ఇంటికే పరిమితం. అమ్మ వక్కలంక సరళ నేపథ్య గాయని. తెర ముందుకు రావడం మాత్రం నాతోనే మొదలు. అమ్మకు యామినీ కృష్ణమూర్తి నాట్యం ఇష్టం. నేను కడుపులో ఉండగానే అమ్మాయి పుడితే కళాకారిణిని చేయాలనుకుంది. తన మిత్రురాలైన బెంగాలీ గాయని గీతాదత్తో ‘బెంగాలీలో మంచి పేరు సూచించ’మని కూడా కోరిందట. గీతాదత్ సూచించిన పేర్లలో మా అమ్మమ్మ సుందరమ్మ పేరు అమరేటట్లున్న పేరు స్వప్న. అలా స్వప్నసుందరినయ్యాను. మా నాన్న ఆర్మీలో డాక్టర్. ఆ బదిలీల ప్రభావం నా మీద ఎలా పడిందంటే... మేము వెళ్లినచోట భరతనాట్యం గురువు ఉంటే భరతనాట్యం, కూచిపూడి గురువు ఉంటే కూచిపూడి... అలా సాగింది నాట్యసాధన. పదమూడేళ్లకు చెన్నైలో తొలి భరతనాట్య ప్రదర్శన, పద్నాలుగేళ్లకు ఢిల్లీలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను. మూడవది నేను ఇష్టంగా సాధన చేసిన విలాసిని నాట్యం. రాజమండ్రి సమీపంలోని కోరుకొండ నరసింహస్వామి ఆలయంలో మా గురువు మద్దుల లక్ష్మీనారాయణమ్మ స్వయంగా తన గజ్జెలను నాకు కట్టి ఆరంగేట్రం చేయించారు. నేను మా సొంత ప్రదేశం కోనసీమను చూసింది కూడా అప్పుడే. మా ఇంటిపేరు, ఊరిపేరు ఒకటే. గోదావరి లంకల్లోని వక్కలంక. విలాసిని నాట్య తొలి ప్రదర్శన తర్వాత అనేక ప్రయోగాలు చేశాను. అంతరించి పోతున్న నాట్యరీతిని తర్వాతి తరాలకు అందుబాటులోకి తీసుకురావడానికి, ఆ నాట్యరీతి ప్రాచుర్యానికి నేను చేసిన ప్రయత్నాలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. బీఏ ఆగిపోయింది! నేను స్కూల్ ఫైనల్లో ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు నన్ను యామినీ కృష్ణమూర్తిగారి ప్రదర్శనకు తీసుకెళ్లారు. ఆమెను చూసిన తర్వాత నాట్యమే జీవితం అని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మాత్రం ఎంతటి కళాకారిణివి అయినా చదువులేకపోతే ఎలాగ అన్నారు. రోజూ కాలేజ్కెళ్లాలంటే డాన్సు అవకాశాలు ఒకదాని మీద మరొకటి వస్తున్నాయి. టీనేజ్లోనే లండన్‌లోని క్వీన్ ఎలిజిబెత్ హాల్లో ప్రదర్శన ఇచ్చాను. ప్రైవేట్‌గా బీఏలో చేరాను, కానీ సెకండియర్‌లో మూడు నెలల యూరప్ టూర్‌తో నా బీఏ ఆగిపోయింది. నాట్యం నేర్చుకున్నాను, నాట్యమే చదువుకున్నాను. నాట్యంలో పీహెచ్డీ స్కాలర్స్‌కి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా వెళ్తుంటాను. చిన్న వయసులో నాట్యంలో స్థిరపడితే ప్రొఫెషన్లో కనీసం 30 ఏళ్లయినా రాణించవచ్చని ఇంట్లో వాదించాను. నేను అనుకున్నట్లే నలభై ఐదేళ్లుగా నాట్యంలో రాణిస్తున్నాను. పాటల విషయానికి వస్తే... నాట్యంలో నేపథ్యంగా వినిపించే ట్రాక్ నేనే పాడుతాను. బాలమురళి అంకుల్‌తో ఆల్బమ్ చేశాను, తమిళ్ గజల్స్ పాడాను. అమ్మతో కలిసి పాడడం, అమ్మ పాడిన పాటలను ఆమెకు నివాళిగా పాడడం గొప్ప అనుభూతి. నాట్యజ్ఞానకేంద్రం దిల్లీలో స్థాపించిన డాన్స్ సెంటర్ ద్వారా నాట్యానికి సంబంధించిన జ్ఞానాన్ని పంచడంతోపాటు ప్రచారంలోకి తెస్తున్నాను. నాట్యం, సంగీతం, ఆధ్యాత్మికం ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయి. అన్నీ కలిపితేనే సంస్కృతి. అలా నేను సాంస్కృతిక వేత్తగా ఆవిష్కారమయ్యాను. నేడు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘నైమిశం’ జిడ్డు కృష్ణమూర్తి ‘సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్’ కోసం సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన ప్రారంభించాను. కళాసాధనకు, కళాసేవకు... శిఖరాన్ని చేరడం, ప్రయాణం పూర్తవడం అనేది ఉండదు. పరిపూర్ణతను, కొత్త రూపునూ సంతరించుకుంటూ... కళాకారులకు, కళాభిమానులకు సాంత్వననిస్తూ కొత్త పుంతలు తొక్కుతూ సాగుతూనే ఉంటుంది’’ అన్నారు స్వప్నసుందరి. ప్రభుత్వం ఆమె నాట్యప్రతిభను పద్మభూషణ్‌తో గౌరవించింది. నిజానికి ఆమె నాట్యానికే భూషణం. కళల కలయిక ‘కూచిపూడి’ భాగవతం, యక్షగానం, నాటకం, పగటివేషం వంటి ప్రాచీన కళారూపాల నుంచి ఒక్కో ప్రత్యేకతను మమేకం చేస్తూ రూపొందిన నాట్యప్రక్రియనే మనం కూచిపూడి అని పిలుస్తున్నాం. నిజానికి కూచిపూడి అనే పేరు రావడానికి కారకులు గోల్కొండ పాలకుడు తానీషా. ఆ నాట్యకళాకారుల స్థిరనివాసం కోసం కూచిపూడి అగ్రహారాన్ని ఇచ్చారాయన. కూచిపూడి గ్రామంలోని నాట్యకారుల నాట్యరీతి కూడా ఆ ఊరిపేరుతోనే వ్యవహారంలోకి వచ్చింది. సిద్ధేంద్రయోగికంటే ముందు రెండు వందల సంవత్సరాల నుంచి వచ్చిన పరిణామక్రమాన్ని నేను నా తొలి రచన ‘ద వరల్డ్ ఆఫ్ కూచిపూడి డాన్స్’లో రాశాను. తెలుగు విలాసిని... విలాసిని నాట్యం మన తెలుగు వారి భారతం. భారతం అంటే మహాభారతం కాదు. భారతం– భాగవతం అని మన ప్రాచీన కళారూపాలు ఈ రెండూ. భారతం శాస్త్రీయంగా ఉంటే భాగవతం సామాన్యులకు అర్థమయ్యేటట్లు సరళంగా ఉండేది. భారతం సోలో డాన్స్, భాగవతం బృంద ప్రదర్శన. లాలిత్యం, సొగసుతో కూడిన ఈ తెలుగు నాట్యరీతిని రాజాస్థానాల్లో రాజదాసీలు, ఆలయాల్లో దేవదాసీలు ప్రదర్శించేవారు. రాజాస్థానాలు పోవడం, కొన్ని సామాజిక దురన్యాయాలను అడ్డుకునే క్రమంలో ఆలయాల్లో నాట్యాలను నిషేధిస్తూ చట్టం వచ్చిన తర్వాత ఆ నాట్యసాధన దాదాపుగా అంతరించి పోయే దశకు చేరుకుంది. ఆ సమయంలో నేను ఈ నాట్యం నేర్చుకుని, అందులో ప్రయోగాలు, విస్తరణ కోసం పని చేస్తున్నాను. నేను విలాసిని మీద పుస్తకం రాసే నాటికి ఆ నాట్యరీతికి తెలుగుభారతం అనే ప్రాచీన నామమే ఉంది. నిష్ణాతులైన కవులు, కళాకారులు, చరిత్రకారులు సంయుక్తంగా చర్చించిన తర్వాత ‘విలాసిని’ అనే పేరు ఖరారు చేశాం. – వక్కలంక స్వప్న సుందరి, సాంస్కృతికవేత్త – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు : నివేదా థామస్
నివేదా థామస్.. గ్లామర్ కన్నా అభినయతారగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా.. ఇక్కడ సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. అందం కన్నా అభినయం మీద ఆమెకున్న శ్రద్ధ అలాంటిది. తనలోని గ్లామర్‌ను ఆమె అశ్రద్ధ చేసినా ఈ బ్రాండ్స్ మాత్రం తీర్చిదిద్దుతున్నాయి.. సొబారికో దర్జా, విలాసం, సౌకర్యం .. ఈ మూడింటినీ ఒకేసారి ఆస్వాదించాలంటే సొబారికో బ్రాండ్‌ను ఎంచుకోవాలి. దేశంలోని ఏ మూలలో ఏ చేనేత ప్రత్యేకత ఉన్నా.. ఏ కళాకారుడి.. ఏ కళాకారిణి చేతిలో సృజన ఉన్నా అది ఈ బ్రాండ్‌లో ప్రతిబింబిస్తుంది. అందుకే సొబారికో అవుట్ ఫిట్స్‌ను ఇష్టపడని వాళ్లు లేరు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా. ఈ అభిమానాన్నే బ్రాండ్ వాల్యూగా స్థిరపరచుకుంది. దాన్నే వారసత్వంగానూ మలచుకుంది ఏళ్లుగా. ఫ్యాబ్రిక్, డిజైన్‌ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. డ్రెస్ బ్రాండ్ : సొబారికో అనార్కలీ సెట్ ధర: 37,500 జ్యూయెలరీ బ్రాండ్: అమెథిస్ట్ అండ్ ఆమ్రపాలి ధర: డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. అమెథిస్ట్ ఇది కిరణ్ రావు మానస పుత్రిక. అమూల్యమైన కళాఖండాల నిలయం.. ఈ బ్రాండ్. 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దుస్తులు, జ్యూయెలరీ, ఫుట్ వేర్ నుంచి ఇంటి అలంకరణ వస్తువులు.. కాఫీ షాప్ వరకు అన్నిటికీ ఈ అమెథిస్ట్ కేరాఫ్. ఈ బ్రాండ్ రిచ్‌నెస్‌కు తగ్గట్టే ధరలు ఉంటాయి. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. -
ఎంపీలతో కలసి భోజనం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి సంబంధించి పలు పెండింగ్ సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, బాలశౌరి తదితరులు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా అధికార నివాసం జన్‌పథ్–1కి చేరుకున్న ముఖ్యమంత్రిని పలువురు ఎంపీలు కలిసి మాట్లాడారు. ప్రధాని కార్యాలయ డిప్యూటీ సెక్రటరీ ఆమ్రపాలి కొద్దిసేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఎంపీలతో కలిసి జన్‌పథ్ –1 అధికారిక నివాసంలో భోజనం చేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం 4.15 గంటలకు లోక్ కల్యాణ్ రోడ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశం తరువాత తిరిగి అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం రాత్రికి కేంద్ర మంత్రులను కలిశారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మార్గాని భరత్‌రామ్, బాలశౌరి, నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ తదితరులున్నారు. -
సుప్రీం తీర్పులో ఏది ‘సంచలనం’?
సాక్షి, న్యూఢిల్లీ : నోయిడా, గ్రేటర్ నోయిడాలలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్న ప్రముఖ భవన నిర్మాణ సంస్థ ‘ఆమ్రపాలి గ్రూప్’కు వ్యతిరేకంగా మంగళవారం సుప్రీం కోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. తామూ ఓ ఇంటి వాళ్లమవుదామనే ఓ జీవితకాల స్వప్న సాఫల్యం కోసం కష్టపడి సంపాదించిన సొమ్మే కాకుండా, బ్యాంకుల నుంచి అరువు తెచ్చికొని మరీ సొమ్ము చెల్లిస్తే నిర్దాక్షిణ్యంగా దాన్ని మరో వ్యాపారానికి తరలించి, అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని ఆలస్యం చేయడం దారుణమంటూ ఆ రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై సుప్రీం కోర్టు మండి పడడం, ఆ గ్రూప్ రిజిస్ట్రేషన్నే రద్దు చేయడం మనకు ఎంతో సబబుగాగా అనిపిస్తుంది. సుప్రీం కోర్టు అంతటితో అగకుండా ఆమ్రపాలి చేపట్టిన అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ‘నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్’కు అప్పగించడం, అదనపు నిధులు అవసరమైతే సేకరించేందుకు వీలుగా అపార్ట్మెంట్ల భూమి హక్కులను ఓ కోర్టు రిసీవర్‌కు అప్పగించడం మరీ అద్భుతమని కొంత మంది సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. భవన నిర్మాణ రియల్టర్లు కస్టమర్ల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేయడం, భవన నిర్మాణాలను పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేయడం లాంటి సమస్యలు ఒక్క నోయిడాకు, ఒక్క ఆమ్రపాలి గ్రూపునకే పరిమితం కాలేదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఆగిపోయి లేదా ఆలస్యమవుతున్న నిర్మాణాలు 1.50 లక్షలని ఓ అంచనా కాగా, దేశవ్యాప్తంగా అలా ఏడున్నర లక్షల నిర్మాణాలు ఉన్నాయి ? ఇలాంటి సమయంలో ఒక్క నోయిడాకే పరిమితమై సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం అన్నది చట్టంలోని ‘అందరికి సమాన న్యాయం’ సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆమ్రపాలి గ్రూప్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం వరకు సుప్రీం కోర్టు తీర్పు సబబే! ఆ నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ సంస్థను తానే ఎంపిక చేయడం, డబ్బుల సేకరణకు భూమిపై కోర్టు రిసీవర్‌కు హక్కులు కల్పించడం కచ్చితంగా ప్రభుత్వ కార్యనిర్వహణలో జోక్యం చేసుకోవడమే అవుతుందన్న వాదన నిపుణుల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇలా సుప్రీం కోర్టు ప్రభుత్వ కార్యనిర్వహణలో జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అస్సాంలో పౌరసత్వం చట్టాన్ని ఎలా అమలు చేయాలో, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి బస్సులు కొనాలో నిర్దేశించడమే కాకుండా భారత క్రికెట్ బోర్డు కార్యకలాపాలను చూసుకునేందుకు నలుగురు సభ్యుల ప్యానెల్‌ను కూడా నియమించింది. కార్య నిర్వహణా రంగం ప్రభుత్వానికి సంబంధించినది. అది నిస్తేజమైతే చికిత్సకు ఆదేశాలు జారీ చేయవచ్చు. కింది స్థాయి నుంచి సుప్రీం కోర్టు వరకు కొన్ని కోట్ల కేసులు అపరిష్కృతంగా మూలుగుతున్నాయి. ఆ విషయంలో సుప్రీం కోర్టు కార్యనిర్వహణ రంగంలోకి దూసుకుపోయి ఉంటే లేదా క్రియాశీలకంగా వ్యవహరించి ఉంటే ఈపాటికి అన్ని కేసులు పరిష్కారమయ్యేవన్నది కూడా నిపుణుల వాదన. -
‘ఆమ్రపాలి’ గ్రూప్ నుంచి మనోహర్‌కు రూ.36 లక్షలు!
న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్ కేసులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ శశాంక్ మనోహర్ పేరు బయటకు వచ్చింది. గ్రూప్ సీఎండీ అనిల్ కుమార్ శర్మ... గృహ కొనుగోలుదారులు చెల్లించిన నిధుల నుంచి రూ.36 లక్షలను దారిమళ్లించి మనోహర్ ఖాతాలో వేసినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘ఆమ్రపాలి’ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు కుమ్మక్కై నిధులను దుబారా, దుర్వినియోగం చేసిన వ్యవహారంలో సుప్రీం ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఆదేశించింది. సుప్రీం తీర్పులో... దారిమళ్లిన నిధులను పొందినట్లు, అనిల్‌కుమార్ శర్మ చెల్లింపులు చేసినవారి జాబితాలో మనోహర్ పేరు రెండుసార్లుంది. దీనిపై ఆయన స్పందిస్తూ... ఈ కేసులో నాలుగేళ్ల క్రితమే తాను పట్నా హైకోర్టులో హాజరైనట్లు తెలిపారు. తనకేం సంబంధం లేదని పేర్కొన్నారు. -
ఆమ్రపాలి కుంభకోణం : ధోనీపై సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ నకు రెరా రిజిస్ట్రేషన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఇంటి కొనుగోలుదార్లకు చెందిన డబ్బును ఆమ్రపాలి గ్రూప్ అక్రమ పద్ధతుల్లో దాళి మళ్లించిన కుంభకోణం భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధమున్న వార్త కలకలం రేపుతోంది. ధోని భార్య సాక్షికి చెందిన రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఆమ్రపాలి గ్రూప్ చీకటి ఒప్పందాలను కుదుర్చుకుందని కోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు సుప్రీం కోర్టుకు అందించిన నివేదికలో పేర్కొనడం గమనార్హం. రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆమ్రపాలి మాహి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పవన్ కుమార్ అగర్వాల్, రవీందర్ భాటియా సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక తేల్చింది. ఈ నివేదికను సుప్రీం కోర్టు అంగీకరించింది. 2009 - 2015 మధ్య రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ .42.22 కోట్లు చెల్లించినట్లు కోర్టుకు తెలిపింది. ఈ మొత్తంలో రూ .6.52 కోట్లు అమ్రపాలి నీలమణి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించింది. మాహిగా పేరొందిన ధోనికి రితి స్పోర్ట్‌లో ప్రధాన వాటా ఉండగా, సాక్షి అమ్రపాలి మాహికి డైరెక్టర్. మూడేళ్ల క్రితం వరకు ధోని ఈ బృందానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. గ్రూప్ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి చాలా లావాదేవీలను నిర్వహించారని, ఇతర గ్రూప్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు కూడా ధోనీ జోక్యం చేసుకున్నాడని తమ ఆడిట్ రిపోర్టులో పవన్ కుమార్ అగర్వాల్, రవీందర్ భాటియా పేర్కొన్నారు. రాంచీలో ఓ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఈ సంస్థ (ఆమ్రపాలి మహి) విలీనం చేశారని, దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ఎంవోయూ కూడా కుదిరిందన్నారు. కానీ ఈ ఒప్పంద పేపర్లు తమ దగ్గర అందబాటులో లేవని పేర్కొన్నారు. ఆడిట్ నివేదిక ప్రకారం, నవంబర్ 22, 2009 తేదీన సంతకం చేసిన ఎండార్స్మెంట్ ఒప్పందం ప్రకారం, ధోని తనను తాను అమృపాలి గ్రూప్ ఛైర్మన్‌కు రితి స్పోర్ట్స్ ప్రతినిధితో పాటు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండాల్సి ఉంది. దీనికి ధోనీ అంగీకరించినట్టుగా ఎలాంటి రికార్డు అందుబాటులో లేదు. అలాగే మార్చి 20, 2015 నాటి మరో స్పార్సర్షిప్ ఒప్పందం ప్రకారం ఐపిఎల్ 2015 ఎడిషన్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కోసం వివిధ ప్రదేశాలలో "లోగో స్పేస్" ను ప్రకటించే హక్కును అమ్రపాలి గ్రూప్ సొంతం చేసుకుంది. అ ప్పుడు ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నారు. అయితే ఈ ఒప్పందం సాదా కాగితంపై ఉందని , అమ్రపాలి, రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మాత్రమేఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందానికి చెన్నై సూపర్ కింగ్స్ తరపున సంతకాలు లేవని నివేదిక తెలిపింది. 42వేలకు పైగా గృహకొనుగోలుదారుల డబ్బులను అక్రమంగా మళ్లించారని తాము భావిస్తున్నామని, వాటిని రికవరీ చేయాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం జూలై 23న జారీ చేసిన ఆర్డర్లో అభిప్రాయపడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతని ప్రభుత్వరంగ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పోరేషన్ (ఎన్బీసీసి)కి అప్పగించింది. రితి స్పోర్ట్స్ పేరుతో పలు ప్రాంతాల్లో ఆమ్రపాలికి అధికారులు మంజూరు చేసిన ఆస్తుల లీజును కూడా సుప్రీం కోర్టు రద్దు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో గ్రూప్ సీఎండీ అనిల్ శర్మ, ఇతర డైరెక్టర్లను, సీనియర్ అధికారులను విచారించాలని ఆదేశించింది. ఇది ఇలా వుంటే ఆమ్రపాలి గ్రూప్ ప్రాజెక్టులో పదేళ్ల కింద బుక్ చేసుకున్న 5,500 చ.అ.పెంట్‌హౌస్‌కు సంబంధించిన యాజమాన్య హక్కులకు రక్షణ కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన సర్వీసులకు చెల్లించాల్సిన సొమ్ముతో పాటు, పెట్టుబడిగా పెట్టిన రూ.25 కోట్లు కంపెనీ ఎగవేసిందని ఆరోపించారు. అలాగే కంపెనీ తమకు 115 కోట్ల రూపాయల మేర బకాయి పడిందని రితి స్పోర్ట్స్, ధోని సంయుక్తంగా సుప్రీంను కోరాయి. మరోవైపు ఈ వార్తలపై రితి స్పోర్ట్స్ గానీ, క్రికెటర్ ఎంఎస్ ధోనీ గానీ అధికారికంగా స్పందించాల్సి వుంది. చదవండి : ‘ఇల్లు’ గెలిచింది..! -
ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అనేకసార్లు ఆమ్రపాలి గ్రూప్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత ధర్మాసనం తాజా సంచలన తీర్పును వెలువరించింది. సంస్థ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) నమోదుతోపాటు అన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అలాగే కంపెనీ డైరెక్టర్లు అందరిపైనా మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ను ఆదేశించింది. సంస్థ లావాదేవీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఈడీని ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది. తద్వారా సుమారు 42వేల గృహ కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాదు కోర్టు రిసీవర్‌గా ఆర్ వెంకట్రామన్‌ను నియమించింది. భారతదేశం అంతటా అన్ని ప్రాజెక్టుల ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని, అవి సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలని, ప్రమోటర్లందరి ఉల్లంఘనలపై నివేదికను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సంబంధిత మంత్రిత్వ శాఖలను కోర్టు కోరింది. ఇద్దరు ఆడిటర్లలో ఒకరైన అనిల్ మిట్టల్‌పై విచారణ జరిపి ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని సుప్రీం చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని సుప్రీం ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఆ నిర్మాణాలను చేపట్టాల్సిందిగా నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌ను సుప్రీం ఆదేశించింది. నిర్మాణాలు పూర్తైన తర్వాత వినియోగదారులకు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా గృహనిర్మాణాల కోసం వినియోగదారుల నుంచి సేకరించిన నిధులను ఇతర సంస్థల్లోకి మళ్లించారన్న కుంభకోణంలో ఆమ్రపాలి చిక్కుకుంది. అలాగే ఆమ్రపాలి గ్రూప్‌నకు ప్రచారకర్తగా వ్యవహరించిన తనను మోసం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి : అవినీతికి మరణశిక్ష విధించలేం: సుప్రీం నన్ను రూ.40 కోట్లకు ముంచారు : ధోని -
గ్రేటర్‌కు మూడు కోట్ల మొక్కలతో ‘హరితహారం’
సాక్షి, హైదరబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘హరితహారం’ కార్యక్రమం ఐదో విడత ఈ నెలలో చేపట్టనున్నారు. గత నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలను నాటిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది హరిత హారంలో భాగంగా 83.30 కోట్ల మొక్కలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే మూడు కోట్ల మొక్కలను నాటేందుకు వీలుగా జీహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్, అడిషనల్ కమిషనర్లు అమ్రపాలి కాటా, కృష్ణలు భారీ ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా మొక్కలను పెంచడానికి రాజేంద్రనగర్, కొంగరకలాన్‌లోని నర్సరీలకు అప్పగించి వాటి పని తీరును పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతానికి కోటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన కోటిన్నర మొక్కలను ప్రైవేటు నర్సరీలకు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం టెండర్లు వేసి అందులో ఎంపికైన ప్రైవేటు నర్సరీలకు మొక్కల పెంపకాన్ని అప్పగించి.. మరో పది రోజుల్లో కోటిన్నర మొక్కలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
అవినీతికి మరణశిక్ష విధించలేం: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో రియల్టర్లు ప్రజలను మోసం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులు, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కైన బిల్డర్లు నిబంధనలను తుంగలో తొక్కి ఆకాశహర్మాలు నిర్మిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని అభిప్రాయపడింది. వినియోగదారుల్ని ఆమ్రపాలి గ్రూప్ మోసం చేసిందన్న సుప్రీంకోర్టు, అవినీతికి పాల్పడినవారికి మరణశిక్ష విధించలేమని స్పష్టం చేసింది. -
ధోనీతో లావాదేవీల వివరాలు కోరిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనీతో జరిపిన అన్ని లావాదేవీల వివరాలను బుధవారంలోగా తమకు నివేదించాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించింది. ఆమ్రపాలి గ్రూప్ తనను మోసం చేసిందని ధోని సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. రాంచీలోని ఆమ్రపాలి సఫారిలో పెంట్‌హౌస్‌ను తాను బుక్ చేసుకున్నానని, ఇంతవరకూ పెంట్‌హౌస్‌ను తనకు అప్పగించలేదని పిటిషన్లో ధోని ఆరోపించారు. మరోవైపు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు తనకు చెల్లించాల్సిన బకాయిలను సైతం ఆమ్రపాలి గ్రూప్ చెల్లించలేదని ధోనీ కోర్టుకు నివేదించారు. 2006 నుంచి 2009 మధ్య కంపెనీని ప్రమోట్ చేసినందుకు తనకు రూ 40 కోట్లు రావాలని ధోని కోరుతున్నారు. కాగా ధోనీతో జరిగిన లావాదేవీల వివరాలను పూర్తిగా తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించింది. మరోవైపు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నఆమ్రపాలి గ్రూప్‌పై పెద్దసంఖ్యలో గృహాల కొనుగోలుదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాము అడ్వాన్స్‌లు చెల్లించినా తమకు ఇస్తామన్న ఇళ్లను ఇంకా ఇవ్వలేదని పిటిషన్లలో పేర్కొన్నారు. కాగా గృహ కొనుగోలుదారులు చెల్లించిన డబ్బుతో నిర్మించిన ఫైవ్‌స్టార్ హోటల్, మాల్, కార్పొరేట్ కార్యాలయాలతో పాటు లగ్జరీ కార్లు, ఎఫ్ఎంసీజీ కంపెనీని అటాచ్ చేసి వాటిని విక్రయించి బకాయిపడిన వారికి చెల్లింపులు చేపట్టాలని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించింది.