ప్రసంగం మధ్యలో వెనక్కి తిరిగి నవ్వుతున్న వరంగల్ అర్బ న్ కలెక్టర్ ఆమ్రపాలి
సాక్షి, వరంగల్ : వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక ఐఏఎస్ అధికారిగా, జిల్లా పరిపాలనాధికారిగా హూందాగా ఉండాల్సిన కలెక్టర్ గతితప్పారు. హన్మకొండలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెండా వందనం చేశాక హూందాగా ఉండాల్సిన కలెక్టర్ ప్రసంగం మాత్రం అదుపు తప్పింది. ఈ విషయం వరంగల్ జిల్లా అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఇపుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జెండా వందనం అనంతరం ఆమె తన ప్రసంగం మధ్యలో అదే పనిగా అకారణంగా, అసందర్భంగా నవ్వడం, గణాంకాల దగ్గర తడబడడం, అంతేకాకుండా ‘ఇట్స్ ఫన్నీ’ అంటూ వ్యాఖ్యానించారు. తెలుగులో రాసిన ప్రసంగాన్ని చదువుతూ పలుమార్లు తడబడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి ప్రస్తావన వచ్చినపుడు ఏకంగా వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తనలో తాను ‘ఇట్స్ ఫన్నీ’ అంటూ వ్యాఖ్యానించారు. ఈతతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన భారీ మైకుల ద్వారా అందరికీ వినిపించింది. అంతే కాదు ఆమ్రపాలి తడబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment