warangal collector
-
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు
కాళోజీ సెంటర్/హన్మకొండ: వరంగల్ కలెక్టర్‌గా డాక్టర్ సత్య శారదదేవి, హనుమకొండ కలెక్టర్‌గా పి.ప్రావీణ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో వారిని రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఆర్ఓ అయూబ్‌అలీ, డీఈఓ డి.వాసంతి, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, ఆర్డీఓలు సీతం దత్తు, కృష్ణవేణి, ఎల్డీఎం హవేలీ రాజు, కలెక్టరేట్ ఏఓలు శ్రీకాంత్, అబీద్ అలీ, తహశీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వరరావు, ఫణికుమార్, విజయ్, రవిచంద్రారెడ్డి, పర్యవేక్షకులు మంజుల, చంద్రశేఖర్ ఉన్నారు. హనుమకొండ కలెక్టర్‌ను కలిసిన వారిలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా(లోకల్ బాడీస్), వెంకట్‌రెడ్డి (రెవెన్యూ), డీ.ఆర్.ఓ. వై.వి.గణేష్ ఉన్నారు. -
వరంగల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్య
వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పి.ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు సోమవా రం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా పనిచేస్తున్న 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రావీణ్యకు పదోన్నతి కల్పిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఇదే బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ బి.గోపిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కరీంనగర్ స్పెషల్ ఆఫీసర్‌గా, డీఆర్వోగా పనిచేసిన ప్రావీణ్య తదుపరి గ్రేటర్ హైదరాబాద్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా కొనసాగారు. 2021సెప్టెంబర్ 3న గ్రేటర్ వరంగల్ కమి షనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రావీణ్య పరిపాలనలో పెద్దగా జోక్యం చేసుకోలేదనే విమర్శలను ఎదుర్కొన్నారు. నగరంలోని 66 డివిజన్లలో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనుల వివరాలను ప్ర త్యేకంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.కానీ.. రాజకీ య ఒత్తిళ్లతో కాస్త వెనక్కి తగ్గారనే విమర్శలున్నా యి. తప్పులు చేసిన అధికారులు, ఉద్యోగులపై కనీసం విచారణ, చర్యలు చేపట్టలేకపోయారనే వి మర్శలను ఎదుర్కొన్నారు. కాగా.. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ప్రావీణ్యకు అదనపు కలెక్టర్లు శ్రీవత్స,అశ్విని తానాజీ వాకడే,కలెక్టరేట్ పరి పాలనాధికారి శ్రీనాథ్, ఆర్డీఓ మహేందర్ జీ పుష్పగుచ్ఛాలు అందించి.. అభినందనలు తెలిపారు. కాగా.. రెండేళ్లు దాటకముందే కలెక్టర్ గోపిని బదిలీ చేయడంపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ కమిషనర్ ఎవరో? నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య పదోన్నతిపై కలెక్టర్‌గా వెళ్లడంతో కమిషనర్ పోస్టు ఖాళీ అయింది. ఇంకా ఎవరినీ నియమించకపోగా.. ఇన్చార్జ్ కూడా ఎవరికీ ఇవ్వలేదు. దీంతో త్వరలోనే నూతన కమిషనర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రావీణ్య బదిలీ కావడంతో కమిషనర్ పోస్టుతోపాటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) వైస్ చైర్మన్ పోస్టు ఖాళీ అయింది. దీంతో గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా ఎవరు వస్తారు? ఎప్పుడు నియమిస్తారు? ఐఏఎస్? నాన్ ఐఏఎస్ వస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
కలెక్టర్‌పై ట్విటర్లో అసభ్యకర పోస్టులు
సాక్షి, వరంగల్ : ట్విట్టర్ వేదికగా మామునూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పెన్షన్‌పురకు చెందిన డిగ్రీ విద్యార్థి సయ్యద్ సోహెల్ హుస్సెన్ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శుక్రవారం సాయంత్రం సయ్యద్ సోహెల్ హుస్సెన్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌పై చేసిన కామెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. ట్విట్టర్లో తీవ్ర పదజాలంతో దూషించాడు. ఆ మాటలను రాష్ట్రంలోని ఇతర అధికారులు ట్యాగ్ చేయగా ఇప్పటికే లక్షల మంది నెటిజన్లు చూశారు. దీనికి తోడు సోహెల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. పరువుకు సంబంధించిన విషయాలు కావడంతో జిల్లా అధికారులు, పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ట్విట్టర్ వ్యాఖ్యల వ్యవహారం వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్‌కు తెలియడంతో స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి సయ్యద్ సోహెల్ హుస్సెన్ చిట్టాను బయటకు తీసినట్లు తెలిసింది. ట్విట్టర్ వ్యాఖ్యలపై శనివారం రాత్రి జిల్లా రెవెన్యూ అధికారి పి.మోహన్‌లాల్ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సుబేదారి పోలీసులు సయ్యద్ సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ యువకుడిపై 189, 294/బీ, 504 ఐపీసీ సెక్షన్లతో పాటు ఇతర యాక్టుల కింద కేసు నమోదు చేసినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ పి.సదయ్య తెలిపారు. -
వేగం పెరగాలి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: రైసు మిలర్ల వివాదం సమసిపోవడంతో రబీ ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. రబీ ధాన్యం ఇప్పుడిప్పుడే కొనుగోలు కేంద్రాలకు చేరుతుండగా... రా రైస్ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ బియ్యం(సీఎంఆర్) కింద ధాన్యం తీసుకునేందుకు నిరాకరించారు. ఈ మేరకు శుక్రవారం నుంచి సహాయ నిరాకరణకు రైసుమిల్లర్ల సంఘం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పౌరసరఫరాలశాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నేతలతో గురువారం జరిపిన చర్చలు ఫలించాయి. రా రైస్ విషయంలో ఏర్పడిన సమస్యలను వారం, పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సహాయ నిరాకరణను విరమించుకున్నట్లు ప్రకటించిన మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూడాలని, రైతులు పడిగాపులు కాచే పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రబీ కొనుగోళ్లలో వేగం పెంచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. 613 కొనుగోలు కేంద్రాలు, 5.04 లక్షల మెట్రిక్ టన్నులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం ఆధారంగా ఈ సీజన్లో 5,04,602 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 613 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. గురువారం నాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 538 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అ«ధికారులు ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ సంస్థల ద్వారా 1,17,289 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 63 కేంద్రాల ద్వారా 63,665 మె.టన్నులు, వరంగల్ రూరల్ జిల్లాలో 95 కేంద్రాల ద్వారా 22,406, జయశంకర్ భూపాలపల్లి (ములుగు జిల్లా కలిపి) జిల్లాలో 239 కేంద్రాల ద్వారా 33,507, మహబూబాబాద్‌లో 69 కేంద్రాల ద్వారా 14,250, జనగామ జిల్లాలో 72 కేంద్రాల ద్వారా 23,465 మె.టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం 5,04,602 మె.టన్నుల లక్ష్యానికి 1,17,289 మె.టన్నులు (23.24 శాతం) ధాన్యాన్ని సేకరించారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల విషయంలో మరింత స్పీడ్ పెంచాలని గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించిన పౌరసరఫరాలశాఖ కమిషనర్ డాక్టర్ అకున్ సబర్వాల్ అధికారులను ఆదేశించారు. రేషన్‌షాపులు, కొనుగోలు కేంద్రాల పరిశీలన ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం పర్యటించిన పౌరసరఫరాలశాఖ కమిషనర్ డాక్టర్ అకున్ సబర్వాల్ కొనుగోలు కేంద్రాలు, రేషన్ దుకాణాలను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ఉదయమే హన్మకొండకు చేరుకున్న ఆయన పోలీస్ గెస్ట్‌హౌజ్‌లో ఆబ్కారీ, ప్రొహిబిష¯Œన్, పౌరసరఫరాల శాఖ, డీఆర్డీఏ అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన రైతులతో మాట్లాడారు. తేమ గుర్తింపు విధానం, యంత్రాల పనితీరుపై ఆరా తీశారు. ఇక కాజీపేట మండలం బాపూజీనగర్‌లోని 12వ నెంబర్ చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తాగునీరు, నీడ, టార్పాలిన్లు, తూకం, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ప్రతీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేయాలని లీగల్ మెట్రాలజీ అధికారులకు స్పష్టం చేశారు. అక్కడక్కడా తేమ పేరున తూకాలలో తగ్గింపులు జరుపుతున్నట్లు విమర్శలపై దృష్టి సారించాలని సూచించారు. -
తల్లిదండ్రుల పెంపకంలో మార్పు రావాలి
-
ఆమ్రపాలి తెలుగు తిప్పలు..
సాక్షి, వరంగల్ : వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక ఐఏఎస్ అధికారిగా, జిల్లా పరిపాలనాధికారిగా హూందాగా ఉండాల్సిన కలెక్టర్ గతితప్పారు. హన్మకొండలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెండా వందనం చేశాక హూందాగా ఉండాల్సిన కలెక్టర్ ప్రసంగం మాత్రం అదుపు తప్పింది. ఈ విషయం వరంగల్ జిల్లా అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఇపుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జెండా వందనం అనంతరం ఆమె తన ప్రసంగం మధ్యలో అదే పనిగా అకారణంగా, అసందర్భంగా నవ్వడం, గణాంకాల దగ్గర తడబడడం, అంతేకాకుండా ‘ఇట్స్ ఫన్నీ’ అంటూ వ్యాఖ్యానించారు. తెలుగులో రాసిన ప్రసంగాన్ని చదువుతూ పలుమార్లు తడబడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి ప్రస్తావన వచ్చినపుడు ఏకంగా వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తనలో తాను ‘ఇట్స్ ఫన్నీ’ అంటూ వ్యాఖ్యానించారు. ఈతతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన భారీ మైకుల ద్వారా అందరికీ వినిపించింది. అంతే కాదు ఆమ్రపాలి తడబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
ఆమ్రపాలి తెలుగు తిప్పలు..
-
అద్దె చెల్లించలేదని..అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం
-
కలెక్టర్ అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం
సాక్షి, వరంగల్ అర్బన్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం ఉన్న ప్రైవేటు భవనానికి అద్దె చెల్లించనందుకు కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయం కోసం వాడుకుంటూ.. రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని, అద్దె బకాయిలు రూ.3 లక్షల చెల్లించాలని నోటీసులు జారీచేసినా కలెక్టర్ స్పందించలేదని పేర్కొంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి.. జిల్లా కలెక్టర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వాహనం జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బకాయిలు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ఫార్చున్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టు సిబ్బంది కలెక్టరేట్‌కు వచ్చారు. -
జాతరెళ్లిపోయాకే..
సమ్మక్క-సారలమ్మ జాతర ఎఫెక్ట్ అధికారుల అంతర్‌జిల్లాల బదిలీలపై పడింది. మేడారం జాతర ఈ నెల 15 వరకు ఉండడంతో అది ముగిసిన తర్వాతే జోన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్ జిల్లాలకు బదిలీ అయ్యే ఉద్యోగులను రిలీవ్ చేయాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికలసంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మూడే ళ్ల పాటు విధులు నిర్వర్తించిన అధికారులు, సొంత జిల్లాకు చెందిన వారిని బదిలీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు తహశీల్దార్లు, ఎంపీడీవోల జాబితాను రూపొందించింది. సమ్మక్క జాతర ముగిసేవరకు జిల్లాలోని ఉద్యోగులను బదిలీ చేయొద్దని వరంగల్ కలెక్టర్ సీసీఎల్ఏను సంప్రదించారు. జిల్లాలో అనుభవం ఉన్న అధికారులను రిలీవ్ చేస్తే జాతర ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా సీసీఎల్ఏ సైతం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని 15 వరకు గడువు ఇస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ జిల్లాలో ఇప్పటికే బదిలీ అయిన తహశీల్దార్లను 15వ తేదీ తర్వాతే రిలీవ్ చేయనున్నారు. ఎక్కువ మంది వరంగల్ వారే... జిల్లా నుంచి బదిలీపై వెళ్లే అధికారులకు సీసీఎల్ఏ వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలను మాత్రమే ఆప్షన్లుగా ఇచ్చింది. అంతర్ జిల్లాల వారికి కరీంనగర్ ఆప్షన్ ఉంది. జిల్లాలో 19 మంది డెప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు ఇప్పటికే బదిలీ చేసింది. ఇతర జిల్లా ల నుంచి జిల్లాకు 35మంది అధికారులు బదిలీపై రావాల్సి ఉండగా, ఇక్కడినుంచి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాకు 28 మంది బదిలీపై వెళ్లనున్నారు. బదిలీపై వెళ్లే 28 మందిలో అత్యధికంగా 21 మంది వరంగల్ జిల్లానే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. మరో 9 మంది ఆదిలాబాద్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే అధికారులకు పోస్టింగ్ ఇస్తేనే ఇక్కడి వారిని రిలీవ్ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 11 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతర పూర్తయ్యాకే స్థానచలనం కలగనుంది. పలువురికి మినహాయింపు మన జిల్లాలో పనిచేస్తున్న, ఇతర జిల్లాలకు చెందిన వారిలో ఆర్నెల్లలోగా ఉద్యోగ విరమణ పొందే 10 మం ది తహశీల్దార్లను బదిలీల నుంచి మినహాయించింది. ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేని కలెక్టరేట్ సూపరింటెండెంట్లు ఐదుగురు, ఆర్డీవో కార్యాలయ ఏవోలు ఐదుగురికి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు బదిలీ ఉత్తర్వులు రాకపోవడంతో ఇక 15వ తేదీ తర్వాతే బదిలీల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి.