
వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పి.ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు సోమవా రం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా పనిచేస్తున్న 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రావీణ్యకు పదోన్నతి కల్పిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఇదే బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ బి.గోపిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
కరీంనగర్ స్పెషల్ ఆఫీసర్‌గా, డీఆర్వోగా పనిచేసిన ప్రావీణ్య తదుపరి గ్రేటర్ హైదరాబాద్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా కొనసాగారు. 2021సెప్టెంబర్ 3న గ్రేటర్ వరంగల్ కమి షనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రావీణ్య పరిపాలనలో పెద్దగా జోక్యం చేసుకోలేదనే విమర్శలను ఎదుర్కొన్నారు. నగరంలోని 66 డివిజన్లలో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనుల వివరాలను ప్ర త్యేకంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.కానీ.. రాజకీ య ఒత్తిళ్లతో కాస్త వెనక్కి తగ్గారనే విమర్శలున్నా యి.
తప్పులు చేసిన అధికారులు, ఉద్యోగులపై కనీసం విచారణ, చర్యలు చేపట్టలేకపోయారనే వి మర్శలను ఎదుర్కొన్నారు. కాగా.. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ప్రావీణ్యకు అదనపు కలెక్టర్లు శ్రీవత్స,అశ్విని తానాజీ వాకడే,కలెక్టరేట్ పరి పాలనాధికారి శ్రీనాథ్, ఆర్డీఓ మహేందర్ జీ పుష్పగుచ్ఛాలు అందించి.. అభినందనలు తెలిపారు. కాగా.. రెండేళ్లు దాటకముందే కలెక్టర్ గోపిని బదిలీ చేయడంపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గ్రేటర్ వరంగల్ కమిషనర్ ఎవరో?
నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య పదోన్నతిపై కలెక్టర్‌గా వెళ్లడంతో కమిషనర్ పోస్టు ఖాళీ అయింది. ఇంకా ఎవరినీ నియమించకపోగా.. ఇన్‌చార్జ్ కూడా ఎవరికీ ఇవ్వలేదు. దీంతో త్వరలోనే నూతన కమిషనర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రావీణ్య బదిలీ కావడంతో కమిషనర్ పోస్టుతోపాటు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) వైస్ చైర్మన్ పోస్టు ఖాళీ అయింది. దీంతో గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా ఎవరు వస్తారు? ఎప్పుడు నియమిస్తారు? ఐఏఎస్? నాన్ ఐఏఎస్ వస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment