Warangal District News
-
మహిళలకు వరం మహాలక్ష్మి
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ : మహిళలకు వరం మహాలక్ష్మి పథకం అని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం నుంచి మహిళలు ఉచిత ప్రయాణం చేసి రూ.10012.15 కోట్లు ఆదా చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సంబురాలు నిర్వహిస్తోంది. మంగళవారం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్లో ఆర్టీసీ వరంగల్ రీజియన్ స్థాయి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజు ఆర్టీసీ బస్సు ద్వారా ఉచిత ప్రయణం చేసి లబ్ధి పొందుతున్న ఐదుగురు మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఆర్టీసీ ఆర్ఎం ఎస్.భవాని ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణ సేవలు అందిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతమన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వరంగల్ డిప్యూటీ ఆర్ఎం (ఆపరేషన్) కేశరాజు భానుకిరణ్, వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత, సూపర్వైజర్లు, సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు. -
అభిలాష్‌కు డాక్టరేట్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని గణితశాస్త్ర విభాగం పరిశోధకుడు అభిలాష్ వొల్లలకు యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది. పరఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ ఇంటర్నెట్ రూటర్ విత్ సిమిలర్ ఇన్పుట్ ట్రాఫిక్ ట్రాన్సియంట్ క్వియింగ్ సిస్టమ్ విత్ మార్కోవియన్ మోడెల్ల్డ్ ఇన్పుట్ ప్రాసెస్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్దాంత గ్రంథానికి గాను అభిలాష్‌కు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. గణిత విభాగం ఆచార్యులు పి.మల్లారెడ్డి పర్యవేక్షణలో అభిలాష్ తన పీహెచ్డీ పూర్తిచేశారు. -
మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో ప్రణాళిక ప్రకారం నిధులు కేటాయించుకుంటూ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని పాలకవర్గానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. ఈమేరకు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో వార్షిక బడ్జెట్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2026 – 27వ సంవత్సరానికి సంబంధించిన ఆదాయం రూ.74 కోట్ల 4లక్షల 51వేల ఆదాయాన్ని అంచనా వేయగా, రూ.74 కోట్ల 2లక్షల 51వేలతో అంచనా వ్యయాన్ని రూపొందించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి సరఫరాకు అంతరాయం కలుగకుండా చూసుకోవాలన్నారు. విలీన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పట్టణంలో వంద శాతం పన్నుల వసూలు చేయాలని, వీధి దీపాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌన్సిలర్ సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు పడాలని పేర్కొన్నారు. అంచనా బడ్జెట్లో పదిశాతం నిధులను హరితహారం, నీటి సరఫరాకు కేటాయించుకోవాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ గణేష్, చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్ గంధం నరేందర్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కృషి ఒకవైపు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూనే మరోవైపు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)ను ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మహిళా సాధికారత సంబరాల కార్యక్రమాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి ఆధ్వర్యంలో డిపోలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సర్కారు సమకూరుస్తోందని, డిపోల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తోందని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్, కౌన్సిలర్లు, ఆర్టీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
డీడీగా పదోన్నతి
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి గుగులోత్ అశోక్ కుమార్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా (డీడీ) పదోన్నతి కల్పించారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీ అండ్ ఎండీ సోనీ బాలాదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రత్తీరాం తండాకు చెందిన గుగులోత్ అశోక్ కుమార్ 2011లో సాట్‌లో రెజ్లింగ్ కోచ్‌గా నియామకం అయ్యారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో డీవైఎస్ఓగా విధులు నిర్వర్తించిన అశోక్ కుమార్ ఆరేళ్ల క్రితం హనుమకొండకు బదిలీపై వచ్చారు. చిన్న వయసులో డీడీగా పదోన్నతి పొందడంతో అశోక్ కుమార్‌ను వివిధ క్రీడా సంఘాల బాధ్యులు, కోచ్‌లు అభినందించారు. కాగా తదుపరి హనుమకొండ డీవైఎస్ఓ ఎవరినేది సాట్ స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. -
భద్రకాళి ఆలయానికి నూతన ధ్వజస్తంభం
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో 50 అడుగుల నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ వద్ద గల వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ జోన్లో సుమారుగా 50 ఫీట్ల ఎత్తుతో తెలంగాణ ప్రాంతంలో అత్యంత అరుదుగా దొరికే నార వేప కర్రను ఎంచుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు గాదె శ్రవణ్‌కుమార్, మోత్కురి మయూరి, ఓరుగంటి పూర్ణచందర్, జారతి వెంకటేశ్వర్లు, పాలడుగుల ఆంజనేయులు పరిశీలించారు. ధ్వజస్తంభం 20రోజుల్లో ఆలయానికి చేరేలా చర్యలు తీసుకుంటామని ధర్మకర్తలు వివరించారు. -
కార్మికుల సంక్షేమ సేవల్లో పారదర్శకత
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట : కార్మికుల సంక్షేమ సేవల్లో పారదర్శకతను మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరుపై కలెక్టరేట్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులపై కార్మిక శాఖ, గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో కలెక్టరేట్లో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల నమోదు, క్లయిమ్ దరఖాస్తుల సమర్పణ, పరిశీలన, ఆమోద ప్రక్రియలు పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యం పెరుగుతుండడంతో నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తద్వారా వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. సమావేశంలో అధికారులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతి నిర్వహణపై సమీక్ష డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, డాక్టర్ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణపై ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
పన్ను వసూళ్లలో వెనుకబాటు
వరంగల్ అర్బన్ : వందశాతం ఆస్తి, నీటి పన్నుల వసూళ్ల లక్ష్యంగా ముందుకు సాగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) అంచనాలు తలకిందులయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 2025–26 ఆర్థిక సంవత్సరం గడువు ముగిసే వరకు వసూళ్ల పర్వాన్ని కొనసాగించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆదాయం రాబట్టుకోలేక పోయారు. గ్రేటర్ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మినహా కమర్షియల్, మిక్స్డ్ భవనాలు, నివాస గృహాలు 2,36,263 ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం డిమాండ్ మొత్తం రూ.182.19 కోట్లు ఉంది. మంగళవారం రాత్రి 10గంటల వరకు బల్దియా యంత్రాంగం సుమారు రూ.90.20 కోట్ల పన్ను వసూలు చేసినట్లు ధ్రువీకరించారు. ఆస్తి పన్ను వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటర్ చార్జీలు తదితర వివరాలను వెల ్ల డించేందుకు సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ) వెబ్సైట్ సాంకేతిక లోపం వల్ల సరైన సమాచారం అందించేలేకపోతున్నట్లు తెలిపారు. చివరి రోజు బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు పన్నులు చెల్లించాయి. -
కార్మికుల సంక్షేమ సేవల్లో పారదర్శకత
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: కార్మికుల సంక్షేమ సేవల్లో పారదర్శకతను మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరుపై కలెక్టరేట్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులపై కార్మిక శాఖ, గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో కలెక్టరేట్లో కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల నమోదు, క్లయిమ్ దరఖాస్తుల సమర్పణ, పరిశీలన, ఆమోద ప్రక్రియలు పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యం పెరుగుతుండంతో నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తద్వారా వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పారదర్శకత, జవాబుదారీ తనం ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. అధికారులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతి నిర్వహణపై సమీక్ష డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, డాక్టర్ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణపై ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రజాపాలన ప్రతిబింబించేలా.. ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభలకు వార్డు సభ్యుల నుంచి ఎంపీలు, మంత్రుల వరకు ఆహ్వానించాలన్నారు. వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు, కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్, సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. మూడు రోజులు.. 429 దస్తావేజులు కాజీపేట అర్బన్ : రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచుకునేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఈనెల 28, 30, 31వ తేదీల్లో ప్రత్యేక స్లాట్ బుకింగ్స్‌తో పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8:30 వరకు పని వేళలు నిర్ణయించింది. దీంతో వరంగల్ ఆర్వో కార్యాలయంలో 28న 149, 30న 170, 31న 110 దస్తావేజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ పూర్తి చేశారు. ఈ మూడు రోజుల్లో 429 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా, సుమారు రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం. -
నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
● డీఆర్డీఓ ఇన్చార్జ్ పీడీ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి కాళోజీ సెంటర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డీఆర్డీఓ ఇన్చార్జ్ పీడీ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి ఆదేశించారు. సెర్ప్ రాణి రుద్రమదేవి జిల్లా సమైఖ్య ఆధ్వర్యంలో పర్వతగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్యాబ్ ఆపరేటర్లు, సెంటర్ ఇన్‌చార్జ్‌లు, సెర్ప్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని వరంగల్ డీఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాంరెడ్డి పాల్గొని మాట్లాడుతూ దళారి వ్యవస్థను నిర్మూలించి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే సదుద్దేశంతో ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. సెంటర్ ఇన్‌చార్జ్‌లు (వీఓఏ) బాధ్యతయుతంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, మార్కెటింగ్ డీపీఎం దాసు, ఇతర డీపీఎంలు రేవతి, వరలక్ష్మి, జిల్లా సమైఖ్య అధ్యక్ష కార్యదర్శి, కోశాధికార్శులు రజిత, స్వప్న, ఉమా, ఏపీఎంలు సుధాకర్, రాజవీరు, సీసీలు గోలి కొమురయ్య, సుధాకర్, శ్యాంసన్, వీఓఏలు పాల్గొన్నారు. -
మహాలక్ష్మి పథకం గొప్ప మైలురాయి
వరంగల్ చౌరస్తా: మహాలక్ష్మి పథకం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలవుతున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 29 నాటికి మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 290 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేసి, సుమారు రూ.10 వేల కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ వరంగల్ ఆధ్వర్యంలో వరంగల్ బస్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. రూ.200 కోట్ల వ్యయంతో ఎలక్ట్రికల్ బస్సులు గీసుగొండ, సంగెం మండలాలకు ఒక్కో ఎలక్ట్రిక్ బస్సును కేటాయించి మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. అదనంగా రూ.200 కోట్ల వ్యయంతో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఛార్జింగ్ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అనంతరం, అత్యధికంగా ఉచిత బస్సు ప్రయాణాలు చేసిన మహిళలను కలెక్టర్, మేయర్ సన్మానించి బహుమతులు అందజేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ చింతాకుల అనిల్‌కుమార్, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ రాంరెడ్డి, డిపో మేనేజర్ ధరంసింగ్, అసిస్టెంట్ మేనేజర్ నజియా సుల్తానా పాల్గొన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద వరంగల్ బస్‌స్టేషన్ ఆవరణలో విజయోత్సవ కార్యక్రమం -
ప్రత్యేక వైద్యశిబిరం
ఎల్కతుర్తి : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని గోపాల్‌పూర్‌లో నిర్వహించిన ప్రత్యేక వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి అప్పయ్య, సర్పంచ్ కర్రె లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఈ వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 283 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పీహెచ్సీ డాక్టర్ విజేందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ● ప్రమాదంలో డ్రైవర్ మృతిదామెర : రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందిన సంఘటన దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం..యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లపల్లి కి చెందిన అవిశెట్టి శ్రీశైలం (26) ఇసుక కోసం మంగళవారం తెల్లవారుజామున లారీతో ఏటూరునాగారం వెళ్తున్నాడు. ఈ క్రమంలో దామెర మండలంలోని ఒగ్లాపూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో టిప్పర్ వెనుక భాగాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ శ్రీశైలం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 వాహనంలో చికిత్స ని మిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చి కిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి మామ బాతుక జంగయ్య ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ వన్నాల రామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కమలాపూర్ : నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 108, 102 జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ సూచించారు. కమలాపూర్ ప్రభుత్వాస్పతి ఆవరణలో ఉన్న 108, 102 అంబులెన్సులను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్సుల్లో ఉన్న రికార్డులు పరిశీలించి మండల ప్రజలకు అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవికాలం దృష్ట్యా వడదెబ్బ, డయేరియా వంటి కేసులు వచ్చే అవకాశాలు ఉన్నందున అంబులెన్సుల్లో ఐస్ ప్యాక్‌లు, ఓఆర్ఎస్ ద్రావణం అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ వరికోలు శ్రీనివాస్, పైలెట్ బండారి కుమారస్వామి, 102 కెప్టెన్ పవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఫోర్స్మెంట్ విధులపై దృష్టిసారించాలి
రామన్నపేట : కమిషనరేట్ పరిధిలో ఇసుక రవాణాతో పాటు, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం, పేకాటను కట్టడి చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నియంత్రించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. కమిషనరేట్ పోలీసు అధికారుల నేర సమీక్షా సమావేశాన్ని మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్లు, అధికారులు, సిబ్బంది పనితీరుపై సీపీ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ కమిషనరేట్ పరిధిలో పేకాట రాయుళ్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని, స్టేషన్ అధికారులు తమ పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, జనగామ ఏఎస్పీ చేతన్, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్ర, అదనపు డీసీపీలు ప్రభాకర్, రవి, బాలస్వామి, శ్రీనివాస్‌తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
కేయూ అంచనా బడ్జెట్
రూ. 396.69 కోట్లుకేయూ క్యాంపస్ : 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ అంచనా బడ్జెట్ రూ 396.69 కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి లోటు రూ 27.13కోట్లుగా చూపారు. సోమవారం కేయూ పరిపాలనభవనంలోని సెనెట్హాల్లో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించగా ఎకనామిక్స్ విభాగం అధిపతి, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్‌లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, విరమణ బెనిఫిట్స్, నిర్వహణ వ్యయాలు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వివిధ ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ. 355.90 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ఎయిడ్గా రూ. 205.47కోట్లు రానుండగా ఇతర వనరుల నుంచి రూ 126.52 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్‌ను ప్లానింగ్, నాన్‌ప్లానింగ్ రూపంలో రాబడులు, ఖర్చులు మొత్తం 8 అంశాలను చూపారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి రూ. 10లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50లక్షలు, అకడమిక్ , ట్యూషన్ ఫీజుల రూ పంలో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ. 41.41కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.54 కోట్లు ఉన్నట్లు చూపారు. ఈ అకడమిక్ సెనెట్ బడ్జెట్ ఆమోదంతోపాటు స్టాండింగ్ కమిటీ వార్షిక నివేదకను కూడా ఆమోదించింది.కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, విద్యా కళాశాల డీన్ రాంనాథ్కిషన్, అకడమిక్ ఆడిట్ విభాగం రిజిస్ట్రార్ కోల శంకర్, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు, పరీక్షల విభాగం అధికారులు, వివిధ విభాగాల డీన్లు, అకడమిక్, అకౌంట్స్ విభా గాల ఉద్యోగులు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తొలుత కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతికి సంతాపకంగా నివాళులర్పిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అకడమిక్ సెనెట్‌లో ఆమోదం దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కేయూ కూడా ఒకటి. ప్రస్తుతం కేయూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది.అకడమిక్, పరిశోధనల పరంగా అభివృద్ధిలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లోనూ సిలబస్ కూడా మారుతోంది. విద్యార్థులకు స్కిల్, జాబ్ ఒరియెంటేడ్ కోర్సులు లక్ష్యంగా సిలబస్ రూపల్పన చేపడుతున్నాం. కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నాం. త్వరలోనే విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తీసుకురాబోతున్నాం. రూసానిధులతో ఐ రీసెర్చ్సెంటర్లు, 42 మంది అధ్యాపకులు వ్యక్తిగత ప్రాజెక్టులు,74 మంది ప్రాజెక్ట్ ఫెల్లోలు గా నియామకాలు చేశాం. కెహబ్లోనే త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. యూనివర్సిటీలో పరీక్షల విభాగం మూల్యాంకనం ఆన్లైన్లో డిజిటలీకరణ, క్యాంపస్‌లో సీసీ కెమెరాలు, యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు డిటైల్డ్ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు రూ. 400 కోట్ల మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. – కె. ప్రతాప్‌రెడ్డి, వీసీ -
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఖిలా వరంగల్: బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. గుంటూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వరంగల్, పోలీస్ కమిషనరేట్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ సంయుక్తంగా మామునూరు సబ్‌డివిజన్ ఏసీపీ వెంకటేష్, హెచ్ఎం విద్యాసాగర్ అధ్యక్షతన ఇటుక బట్టిల్లో పనిచేసే వలస కార్మికుల పిల్ల లకు విద్యా సామగ్రి, యూనిఫామ్‌ను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్‌ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ ఏడాది ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనేది పోలీస్, వివిధ ప్రభుత్వశాఖల సమన్వయంతో చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎన్.రవి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ జె.శ్యాం సుందర్, ఎస్సైలు సుధాకర్, శ్రీకాంత్, గుంటూరుపల్లి సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ దండు నరేష్, బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, కుమ్మరి రవికుమార్, డాక్టర్ అనంద్, వసుధ, డీసీపీఓ ఉమ, శిరీష, తదితరులు పాల్గొన్నారు. కళానైపుణ్యాలను పెంచేది ‘రంగస్థలం’ ● రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు తిరుమలయ్య హన్మకొండ కల్చరల్: కళాకారుల ప్రతిభను వె లికితీసి వ్యక్తిత్వం, కళానైపుణ్యాలను పెంచేది రంగస్థలమని రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి వరంగల్‌లోని పోతనవిజ్ఞానపీఠంలో రెండురోజుల పాటు జరిగే పీఠం వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గందె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా తిరుమలయ్య, విశిష్ట అతిథిగా కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, యేర కోటేశ్వరరావు, నేరెళ్ల శోభావతి, పీఠం మేనేజర్ జేఎన్ శర్మ పాల్గొని మాట్లాడారు. అనంతరం రంగస్థల కళాకారులను సన్మానించారు. మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వరంగల్ ప్రదర్శించిన ‘వివాహబంధం’ నాటిక అలరించింది. ఈ నాటికలో మాడిశెట్టి రమేశ్, సాదుల సురేశ్, కొడం సురేందర్, వేముల ప్రభాకర్, ఆకుతోట లక్ష్మణ్ నటించారు. సురభి సంతోష్ రంగాలంకరణ చేయగా, సంగీతం పాక సృజన్ అందించారు. -
ఆర్టిజన్లు సమ్మెకు వెళ్తే అంధకారమే
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ ఉ ద్యోగులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు ఇనుగాల శ్రీ ధర్ సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్లు డిమాండ్లు న్యాయమైనవన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించి అర్హతను బట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశా రు. ఏప్రిల్ 7వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉ న్నారన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీశ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం కావా లని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మన్నె శశికుమార్, టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, టీఎస్‌ఈఈయూ–327 నాయకులు పి.మహేందర్ రెడ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, టీఆర్వీకేఎస్ నాయకులు బండారి ప్రభాకర్, నరేందర్ పాల్, టీఆర్పీఈ యూ నాయకులు రమణారెడ్డి, మహేశ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సికిందర్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
‘పారాక్వాట్’ను నిషేధించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: దేశవ్యాప్తంగా పారాక్వాట్ గడ్డిమందును నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవా లని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం పారాక్వాట్ గడ్డి మందు నిషేధంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన పారాక్వాట్ గడ్డి మందు నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి తీర్మానం ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. రైతులు పంటపొలాల్లో కలుపు మొక్కల నివారణకు, పొలం గట్లపై గడ్డి పెరగకుండా ఉండేందుకు పారా క్వాట్ డైక్లోరైడ్ గడ్డిమందును ఎక్కువగా వినియోగిస్తారన్నారు. అనేక రైతు కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో అప్పులబాధతో, కుటుంబ కలహాలతో, ఇతర సమస్యలతో క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారు ఎక్కువగా ఈ గడ్డిమందును వాడుతున్నారన్నారు. ఈ మందుకు విరుగుడు లేకపోవడంతో బతకాలనే ఆశ ఉన్నప్పటికీ బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నాయని వెల్ల డించారు. ఈనెల 27న ఎంపీ కడియం కావ్య పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని పార్లమెంట్లో లేవనెత్తారన్నారు. గడ్డిమందు నిషే ధంపై తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా, దిక్సూచిగా ఉండాలని పేర్కొన్నారు. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి పర్వతగిరి: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తూనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం టూక్యానగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. టూక్యానగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్(46) సోమవారం విధులకు హాజరయ్యాడు. పాఠం బోధిస్తున్న క్రమంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే నెక్కొండలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, మృతుడు చంద్రశేఖర్‌ది సంగెం మండలం కాట్రపల్లి గ్రామం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. -
మక్కల కొనుగోళ్లలో జాప్యం
మహబూబాబాద్ రూరల్ : మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మానుకోట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కె ట్ కార్యాలయం ఎదుట రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మక్కలను మార్కెట్ యార్డులో విక్రయానికి తీసుకువస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్క్ ఫెడ్ అధికారులు, సిబ్బంది కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో మక్కలకు మద్దతు ధర రూ.2400 అందడంలేదని, వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి క్వింటాకు ధర రూ.1,800 చెల్లిస్తున్నారని తెలిపారు. ఆందోళనతో మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిచిపోగా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏఎంసీ గదిలో పీఏసీఎస్ సెక్రటరీ ప్రమోద్‌కుమార్‌ను నిర్బంధించారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
వర్ధన్నపేట: వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య అన్నారు. సోమవారం వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్ ఆవరణలో డ్రైవర్లకు నిర్వహించిన నేత్ర పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డ్రైవర్లు ప్రతీ మూడు నెలలకోసారి కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రోడ్డు నిబంధనలు ప్రతిఒక్కరూ పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. పరిమితికి మించిన లోడుతో వెళ్లడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అందరు సహకరించి రోడ్డు నిబంధనలు పాటించాలని, లేదంటే చట్టరీత్య చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు సాయిబాబు, రాజు, రామారావు, రాజేందర్, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతతో తగ్గిన విద్యుత్ అంతరాయాలు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ అంతరాయాలు తగ్గాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ఎంతో దోహపడుతుందన్నారు. స్కాడా కంట్రోల్ రూమ్ నుంచి అవుటేజి మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల అంతరాయాల లోకేషన్ తెలుసుకోవచ్చని, తద్వారా వేగంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టొచ్చన్నారు. పొడవు లైన్లలో, అడవుల్లో కవర్డ్ కండక్టర్‌తో చెట్లు కొమ్మలు విరిగినా ఎలాంటి అంతరాయాలు ఉండవన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, జయవంత్ రావు చౌహాన్, అన్నపూర్ణ, వెంకట రమణ, జీఎంలు సామ్య నాయక్, శ్రీనివాస్, వేణు మాధవ్, వాసుదేవ్, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియాతో మేలుకంటే కీడు ఎక్కువ
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: సోషల్ మీడియా ద్వారా మేలుకంటే కీడు ఎక్కువగా జరుగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. తాను ఇటీవల రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణతో పాల్గొంటే దానిపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుందన్నారు. మహిళలపై విచక్షణ కోల్పోయి అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, ఇటువంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా మరింత క్రమశిక్షణతో పని చేస్తూ వర్ధన్నపేట ప్రజల సంక్షేమం కోసం దృఢ సంకల్ప ంతో ముందుకు సాగుతున్నానన్నారు. -
ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
నర్సంపేట రూరల్: ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. నర్సంపేట పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పొన్నాల శివశంకర్, అతని భార్య రేణుక, పర్ని అశోక్‌కు పలు వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించగా వారి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. కార్యక్రమంలో టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రవికుమార్, గూడ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
వినతులపై వెంటనే స్పందించాలి
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి వినతిపై నిర్లక్ష్యం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన వినతులను ఓపికగా విన్న కలెక్టర్.. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 138 అర్జీలు అందినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణతోపాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో వేగం పెంచండి : వరంగల్ కలెక్టర్ న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యల పరిష్కారానికి పారదర్శకంగా సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. -
రోడ్డెక్కిన ఆశ వర్కర్లు
పరకాలలో నిరసన ర్యాలీ, ధర్నా పరకాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన కనీస వేతనం అమలు చేయాల్సింది పోయి.. ఉన్న జీతాలను మూడు నెలలకోసారి ఇవ్వడంతో ఆర్థిక ఇబ్బందులతో తప్పడంలేదని బీఆర్టీయూ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. చలో హైదరాబాద్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు జిల్లాల వారీగా ఎక్కడిక్కడే అరెస్టులు చేయడం అన్యాయమంటూ పరకాల అంబేడ్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు సోమవారం నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా మంజుల మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రేవంత్‌డ్డి ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయని మండిపడ్డారు. ప్రతీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో, ఎన్నికల్లో ఆశవర్కర్లు సేవలందిస్తున్నా.. తమను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమకిచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడ ప్రేమలత, పీహెచ్సీ అధ్యక్షురాలు పి.సునీత, ఎం.రమాదేవి, లావణ్య, శైలజ, రమాదేవి, సునీత, అనిత, స్వప్న, విజయ, సుజాత, వనమాల తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో వేగం పెంచండి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● ప్రజావాణిలో 165 వినతులు న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యల పరిష్కారానికి పారదర్శకంగా సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సాంకేతికతను వినియోగిస్తూ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా నేరుగా అనుసంధానం చేసి ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా దరఖాస్తుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడే విధానాన్ని అమలు చేశారు. ప్రజావాణిలో మొత్తం 165 దరఖాస్తులు రాగా రెవెన్యూ 71, జీడబ్ల్యూఎంసీకి సంబంధించినవి 23, ఇతర శాఖలకు సంబంధించినవి 71 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ, సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు. సమస్యలు ఇలా.. ● నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన వి.శారద, వరంగల్ యాకుబ్పురాకు చెందిన అక్తర్ బేగం ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ పథకం కింద ఆర్థిక సాయం అందించాలని దరఖాస్తులు అందించారు. ● రాయపర్తి మండలానికి చెందిన పి.లక్ష్మికి సర్వే నంబర్ 1522లో 21 గుంటల భూమిని కొంతమంది రికార్డులో పేర్లు మార్చారు. విచారణ చేసి పట్టా పాస్‌బుక్ అందించాలని విన్నవించారు. ● కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ని రద్దు చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్ నేతలు కోరారు. -
వరంగల్
మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలిన్యూశాయంపేట: జనగణన 2027 మొదటి విడతలో చేపట్టనున్న ఇళ్ల గణనను సమర్థవంతంగా నిర్వహించాలని జనగణన సంచాలకుడు భారతీ హోలీకేరి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జనగణన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జనగణన, ఇళ్ల గణన, మ్యాప్ తయారీ, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ హజ్ యాత్రికులు సురక్షితంగా తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం ఐఎంఏ హాల్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా హజ్ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. యాత్రికులు అవసరమైన ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మొత్తం 64 మంది యాత్రికులు ఫిట్నెస్ పొందగా, వారిలో 58 మంది యాత్రికులకు టీకా వేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాష్, జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు సర్వర్మోహియోద్దీన్, మెంబర్లు సయ్యద్ ఫైజుల్లా, అఫ్జల్ మోహియోద్దీన్, అజీమ్, డాక్టర్ ఉమర్, గులామ్‌హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. స్వశక్తితో ఎదగడమే ధ్యేయంనర్సంపేట: స్వశక్తితో ఎదిగేలా చేయడమే ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ప్రధాన ధ్యేయమని జిల్లా బాలల సంక్షేమ అధికారి ఉమా అన్నారు. ఈ మేరకు పట్టణంలోని సంజీవని బాలల వసతి గృహంలో షేర్ స్వచ్ఛంద సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సర్వేవర్ నెట్వర్కింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రకాల వేధింపులు, కష్టాల నుంచి బయటపడిన బాలికలు, మహిళలకు మానసిక ధైర్యాన్ని నింపుతున్నామన్నారు. వారిని సమాజంలో స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహించడం కార్యక్రమ ప్రధాన లక్ష్యం అన్నారు. షేర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శిరీష మాట్లాడుతూ చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించారు. సీడబ్ల్యూసీ మెంబర్ సాహిదా మాట్లాడుతూ బాలికల రక్షణ, సంక్షేమం, పునరావాసంపై చర్చించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ డైరెక్టర్ డాక్టర్ మోహన్‌రావు, ఐసీపీఎస్ సుమన్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 మౌనిక, షేర్ స్వచ్ఛంద సంస్థ కమ్యూనిటీ మొబులైజర్స్ ప్రశాంతి, కల్పన, గాయత్రి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ఉన్నత విద్య బలోపేతం
కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలుతో ఉన్నత విద్య బలోపేతం అవుతోందని తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్, బ్రిజేశ్ పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక సభ్యుల సంక్షేమం, డిగ్రీ కళాశాలల ఉన్నతి, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఈ సమావేశంలో చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల (సీకేఎం) నుంచి ఇటీవల క్రమబద్ధీకరణ పొందిన అధ్యాపకులు మూకుమ్మడిగా సంఘంలో సభ్యత్వం పొందారు. వీరిని రాష్ట్ర కార్యవర్గం సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం వివిధ కళాశాలల అధ్యాపకులకు సంబంధించిన వేతన బకాయిలు, పదోన్నతికి సంబంధించిన అంశాలు, నూతన వేతన సవరణలో ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ వంటి అనేక అంశాల పరిష్కారానికి సంబంధించిన తీర్మానాలను ఆమోదించించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం.భవాని, అసోసియేట్ సెక్రటరీ అమరేందర్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీ సుభాశ్‌రెడ్డి, మల్టీ జోన్–1 ఉపాధ్యక్షుడు ఎ.రమేష్, కాకతీయ విశ్వవిద్యాలయం సెక్రటరీ డి.సమ్మయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.సీతారాములు, జి.మహేందర్, శాతవాహన విశ్వవిద్యాలయం సెక్రటరీ రాజేశ్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. టీజీసీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్, బ్రిజేశ్ -
బీఆర్ఎస్ కబ్జాలపై సీఐడీ విచారణ చేయాలి
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026మైనింగ్ మాఫియా విచ్చలవిడితనానికి గుట్టలన్నీ గుల్ల అవుతున్నాయి. అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట చేపట్టి అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టారు. అనుమతుల పేరిట పరిమితికి మించి, హద్దులు దాటి గుట్టలను కరిగించారు. భువనగిరి–ఆరెపల్లి బైపాస్ పక్కన.. నగరాన్ని ఆనుకుని ఉన్న కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. నిబంధనలు పక్కనబెట్టి రూ.కోట్లాది విలువైన మట్టిని, రాళ్లను యథేచ్ఛగా తరలించారు. మైనింగ్ దందాపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.అక్రమ మైనింగ్‌తో ఆనవాళ్లు కోల్పోయిన కోమటిపల్లి గుట్టసాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు.. జీవవైవిధ్యం, నగర ప్రశాంతతను దెబ్బతీసే విధంగా గుట్టలను గుల్ల చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారం రెవెన్యూ శివారులోని కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. ఈ గుట్ట మొరం క్వారీగా మారింది. అనుమతికి మించి యథేచ్ఛగా గుట్టను కొల్లగొట్టారు. విచ్చలవిడిగా సాగిన ఈ వ్యవహారంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒకరు భాగస్వామిగా ఉండి.. తన స్నేహితుడి కుమారుడికి లీజు ఇచ్చినట్లు సమాచారం. ఇష్టారాజ్యంగా మొరం తరలించి గుట్టను గుల్ల చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో త్వరలోనే విచారణకు ఆదేశించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. కోమటిపల్లి గుట్టే కాదు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సాగుతున్న అక్రమ మైనింగ్‌పై ‘విజిలెన్స్’ రంగంలోకి దిగనుండడం చర్చనీయాంశంగా మారింది. ఇష్టారాజ్యంగా మైనింగ్.. విచ్చలవిడిగా తరలింపు.. 2017లో క్వారీకి అనుమతి పొందిన ఓ వ్యాపారి మరో ప్రాంతంలో మొరం తవ్వకాలు చేపట్టాడు. దీంతో అప్పుడు ఉన్న మైనింగ్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఆ క్వారీ రెన్యువల్ కాలేదు. ఏడాదికోసారి పర్యావరణం, కార్మిక శాఖల అనుమతులు పొందాల్సి ఉంది. ఇవేమీ లేకుండా క్వారీ నిర్వహణ సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. 50 నుంచి 60 ఫీట్ల లోతు వరకు మొరం గుట్టను తవ్వారు. అయితే బండరాళ్లు రావడంతో వదిలివేసి.. మరో ప్రాంతంలో తవ్వుతున్నారు. ఇలా 20 నుంచి 30 ప్రాంతాల్లో గుట్టను బ్లాస్టింగ్ చేసి చీల్చారు. లీజు కాలం ముగిసినా ఈ గుట్టపై 2023 వరకు యథేచ్ఛగా తవ్వకాలు సాగాయి. వరంగల్ నగరం శివారుతో పాటు నగరంలో సాగుతున్న వందలాది కొత్త నిర్మాణాల కోసం ఇక్కడి మొరం సరఫరా చేశారు. ఆ సమయంలో ఒక హెక్టారు లీజుకు ఏడాదికి లక్ష రూపాయలతో పాటు మొరం రవాణా కోసం పర్మిట్ అవసరం. క్యూబిక్ మీటరుకు రూ.70 చొప్పున సర్కారు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఒక ట్రాక్టర్ బయటికి వెళ్లిందంటే రూ.210 చెల్లించాలి. ఒక ట్రాక్టర్లో మూడు క్యూబిక్ మీటర్ల మొరాన్ని తరలించవచ్చు. ప్రతి రోజు ఇక్కడి నుంచి వెయ్యి ట్రిప్పుల మొరం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తోంది. రోజుకు సర్కారు రూ.2.10 లక్షల ఆదాయాన్ని కోల్పోయిందంటే.. అధికారుల అండతో కోమటిపల్లి గుట్టపై మొరం మాఫియా ఏ మేరకు అక్రమార్జన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్‌లో ఓ ఉదాహరణ మాత్రమే.. ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. కాగా అక్రమ మైనింగ్‌పై శనివారం అ సెంబ్లీ లో ప్రభుత్వం విచారణ చేయిస్తామని ప్రకటించడంతో పలుచోట్ల మై నింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హసన్‌పర్తి మండలం భీమారం శివారులోని సర్వే నంబర్ 340లో సుమారు 57 ఎకరాల్లో కోమటిపల్లి గుట్ట ఆక్రమించుకుని ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్టేడియానికి కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. అయినా అప్పటి సర్కారు 341/1 సర్వేనంబర్ పేరిట 3.260 రెండున్నర హెక్టార్ల భూమిని క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి ఐదేళ్ల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్‌అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. ఈ క్వారీని గతంలో కీలక ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు, సన్నిహితుడు తన కుమారుడి పేరిట కేటాయించారు. అయితే ఇందులో సదరు ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్టనర్‌గా ఉన్నట్లు తనిఖీలకు వెళ్లిన సందర్భంగా అధికారుల విచారణలో వెల్లడి కావడం గమనార్హం. శాసనసభలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి లీజు ఒకచోట.. తవ్వకాలు మరోచోట రూ.కోట్లాది విలువైన మట్టి, రాళ్ల తరలింపు కోమటిపల్లి గుట్టను కొల్లగొట్టిన అక్రమార్కులు ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సాగిన దందా మైనింగ్ దందాపై విచారణకు ప్రభుత్వం ఆదేశం -
పాలిటెక్నిక్ విద్యతో ఉన్నత శిఖరాలు
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కాశిబుగ్గ : పాలిటెక్నిక్ విద్యతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ అన్నారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. దేశవిదేశాల నుంచి పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. ముందుగా కలెక్టర్‌తోపాటు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థులు అన్ని విభాగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. కలెక్టరేట్లో కూడా ఈ కళాశాలకు చెందిన ఇంజనీర్లు ఉన్నారని వివరించారు. బీటెక్ చదివిన వారికంటే పాలిటెక్నిక్ చదివిన వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యకు అధిక ప్రాధాన్యం ఉందన్నారు. డిప్లొమా, ఇంజనీరింగ్ మధ్య తేడా లేదని, నైపుణ్యమే విజయానికి మూలమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఈవీ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్ర భాకర్, సంగీత కళాశాల బృందం, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆనాటి జ్ఞాపకాల సందడి.. 20 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి తీపి గుర్తులు, గురువులతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. దశాబ్దాల తర్వాత ప్రాణ స్నేహితులను కలుసుకోవడం మరుపురాని అనుభూతిగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అప్పటి తరగతి గదుల్లోకి వెళ్లి సంబురాల్లో మునిగితేలారు. తమ కళాశాలను సరస్వతి అమ్మగా భావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. -
అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ సిద్ధం
● టీ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి సారంగపాణి వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణలో 2026–27 సంవత్సరంలో నిర్వహించనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్‌ను రూపొందించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సారంగపాణి పేర్కొన్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ..ప్రతిభ గల అథ్లెట్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు తమ అసోసియేషన్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహిపాల్, మహిధర్, రత్నాకర్, నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, చైర్మన్ గట్టు మహేష్‌బాబు, చీఫ్ కోచ్ ఎండీ గౌస్, సభ్యులు మనోజ్, సోమశేఖర్, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.కాశిబుగ్గ : జూడో పోటీలు అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరబోయిన కైలాశ్యాదవ్ తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ ఓ సిటీలోని ఇండోర్ స్టేడియంలో వార్షిక సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన సబ్–జూనియర్ నేషనల్ జూడో చాంపియన్ షిప్ పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో జూడో క్రీడను విస్తరింపచేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అజీజ్ ఫరూక్వి, ఉపాధ్యక్షుడు జిల్లెల్ల శ్రీనివాసరావు, జేఎన్టీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఎంఎస్ దిలీప్, సంయుక్త కార్యదర్శి సంతోష్‌కుమార్, సాయిరాం, హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యామల పవన్, తోట శ్యామ్, విష్ణువర్ధన్, సీహెచ్ రాము, నాయకపు రాజు, సభ్యులు పాల్గొన్నారు. -
హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయాలి
● కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కేయూ క్యాంపస్: విశ్వవిద్యాలయ రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈమేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కేయూతో సహా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాల పాటు సేవలందించిన ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అనంతరం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించారు. వయోభారంతో వైద్య ఖర్చులు అధికం కావడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర ఆరోగ్య బీమా సౌకర్యం లేకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు మరింత కష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతిపాదిత ఉద్యోగుల ఆరోగ్య పథకంలో విశ్వవిద్యాలయ రిటైర్డ్ సిబ్బందిని చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ.సదానందం, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ రవీందర్, బాధ్యులు పాల్గొన్నారు. ● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావున్యూశాయంపేట : అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను పేదలకు పంచుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. హనుమకొండ పార్టీ కార్యాలయంలో బి.సంతోష్ అధ్యక్షతన పార్టీ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను కొందరు స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారుల అండదండలతో పేదల అసైన్డ్ భూములను భూకబ్జాదారులు ఆక్రమించుకున్నారని, వాటిని అధికారులు రద్దు చేసి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేనిచో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుంచి జిల్లావ్యాప్తంగా ‘ఇంటింటికి సీపీఐ’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో నాయకులు భిక్షపతి, శ్రీనివాస్, స్టాలిన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్మకు అక్షర మాల’ పరీక్ష పూర్తి
కాళోజీ సెంటర్/గీసుకొండ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మకు అక్షరమాల పరీక్ష పూర్తయిందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉప సంచాలకుడు తుమ్మ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఉల్లాస్ వయోజన విద్యతో నిరక్షరాస్యులైన మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులను చేయడమే లక్ష్యంగా ఉల్లాస్ కార్యక్రమం రూపొదించబడిందన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామంలోని సెర్ఫ్, మెప్మా, విద్యాశాఖ సమన్వయంతో ఎస్‌హెచ్‌జీ సంఘాల్లో పనిచేస్తున్న గ్రామ సమైఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, వీఓఏ, ఆర్పీలు, సీఆర్పీల పర్యవేక్షణలో ఆదివారం పరీక్ష నిర్వహించగా 82,499 మందికి గాను 70,853 హాజరయ్యారన్నారు. అలాగే గీసుకొండ మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన పరీక్ష కేంద్రాలను రమేష్‌రెడ్డి సందర్శించారు. మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్, టాస్ ఎడ్యుకేషన్ అధికారి సదానందం, రాజిరెడ్డి, సర్పంచులు వీరగోని రాజ్‌కుమార్, పేర్ల శ్రవణ్, బోడకుంట్ల మానస ప్రకాష్, తిరుమలరెడ్డి అర్పిత దిలీప్, సీసీలు, వీఓలు, తదితరులు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ విద్యతో ఉన్నత శిఖరాలు
కాశిబుగ్గ: పాలిటెక్నిక్ విద్యతో విద్యార్థులు ఉన్నత శి ఖరాలను అధిరోహిస్తారని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘ నంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌తోపాటు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ ప్రభు త్వ పాలిటెక్నిక్ విద్యార్థులు అన్ని విభాగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యకు ప్రాధాన్యం ఉందన్నారు. డిప్లొమా, ఇంజనీరింగ్ మధ్య తే డా లేదని, నైపుణ్యమే విజయానికి మూలమన్నా రు. కార్యక్రమంలో ఈవీ శ్రీనివాసరావు, ప్రిన్సిపా ల్ బైరి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్!
వరంగల్సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026ఆన్‘లైన్’లోకి ఈసారి కూడా లోటేనా? కాకతీయ యూనివర్సిటీ 41వ అకడమిక్ సెనెట్ సమావేశం నేడు (సోమవారం) పరిపాలన భవనంలో నిర్వహించనున్నారు. ఐపీఎల్ టోర్నీ ప్రారంభమవడంతో మళ్లీ తెరమీదకు..సాక్షి, వరంగల్: ‘మొదట చిన్నగా గెలిపిస్తారు.. తర్వాత ఎక్కువ డబ్బు పెట్టేలా చేస్తారు.. లాస్ అయితే ఇంకోసారి మనీ పెడితే వస్తుంది అనిపిస్తుంది’.. ఇదే అసలైన ట్రాప్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ20 టోర్నీ మొదలైన వేళ ఈ సైకాలజీ ట్రాప్ (ఆన్లైన్ బెట్టింగ్) ఎక్కువ జరిగే అవకాశముందని పాత ఘటనలే గుర్తుచేస్తున్నాయి. అయితే శనివారం వైభవంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజ్ బెంగళూరు మ్యాచ్‌తో మొదలవడంతో ఈ టోర్నీ జోష్‌ను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు సిద్ధమయ్యారు. కరోనా తర్వాత సెల్ఫోన్ల వాడకం పెరగడంతో ఈ ఆన్లైన్ బెట్టింగ్ పట్టణాల నుంచి పల్లెలకు కూడా విస్తరించింది. ఎవరితో సంబంధం లేకుండానే సెల్ఫోన్లోనే క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు నిక్షిప్తం చేసుకొని ఫోన్ పే, గూగుల్ పే యూపీఐలతో డబ్బులు బదిలీ చేస్తూ గుట్టుచప్పుడూ కాకుండా బెట్టింగ్ చేస్తున్నారు. కొందరేమో తమ తల్లిదండ్రులు బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసిఉన్న యూపీఐ ఐడీల ద్వారా పందెం కాస్తున్నారు. అలాగే కూర్చున్న చోటి నుంచి డబ్బులు సంపాదించొచ్చన్న అత్యాశతో యువత నుంచి ఉద్యోగులు సైతం గతంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లో ఆడి మోసపోయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడూ మళ్లీ ఐపీఎల్ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభమవడంతో ఈ బెట్టింగ్ యాప్‌ల జోరు పెరుగొచ్చని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే పిల్లలు వాడే సెల్ ఫోన్లతో పాటు వారి ప్రవర్తనపై కన్నేసి ఉంచాలంటున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ చేసిన వాళ్లపైనే కేసుల నమోదుకు ఆస్కారం ఉండడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఈ ఆన్లైన్ పందెం జోరుగా సాగుతోందని పోలీసులు అంటున్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కొత్త రూపు సంతరించుకున్న దందా క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఒప్పుడు ఫోన్ల ద్వారా ఆయా జట్టు విజయాలపై బుకీలకు సమాచారం ఇచ్చేవారు. ఫంటర్లను పెట్టుకొని దందా చేసేవారు. ఇప్పటికీ ఈ దందా ఉన్నా... ఇప్పుడు కొత్త రూపు మార్చుకుంటోంది. నిర్వాహకుడే సొంతంగా యాప్ రెడీ చేసి వివిధ నగరాల్లో ఉంటున్న బుకీలకు యూజర్ నేమ్, పాస్ వర్డ్లు ఇచ్చి సరికొత్త దందాకు శ్రీకారం చుట్టారు. ప్రధాన నిర్వాహకులు ఆయా జట్ల విజయాలకు సంబంధించిన రేషియోను ఆ యాప్‌లో నిక్షిప్తం చేస్తుండడంతో ఇందుకు అనుగుణంగా బుకీలు తమ ఫంటర్లకు చెప్పి దందాలు సాగిస్తున్నారు. ఇలా బుకీలకు వచ్చిన ఆదాయంలోనే కొంత డబ్బును ప్రధాన నిర్వాహకుడికి అందిస్తారు. ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపులతో పోలీసులకు దొరికే అవకాశం ఉండడంతో బిట్ కాయిన్ల రూంలో బెట్టింగ్ దందా చేస్తుండడం గమనార్హం. ఇప్పటికే పోలీసులకు చిక్కిన బెట్టింగ్ బుకీలతో ఈ దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సమాచారం ఇవ్వండి..ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల గురించి సమాచారం తెలిస్తే ఇవ్వాలి. యువత బెట్టింగ్ చేయొద్దు. బెట్టింగ్‌లతో యువత అప్పులు, ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యల వరకు వెళ్లడంతో కుటుంబ జీవన విధానంపై ప్రభావం చూపుతుంది. – సన్ ప్రీత్‌సింగ్, పోలీస్ కమిషనర్ యాప్‌ల ద్వారానే పందెం, ఆపై డబ్బు హుష్‌కాకి తొలుత లాభం చూపిస్తారు.. ఆ తర్వాతే ఎత్తుకెళ్తారు ఆన్లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉంటేనే మంచిది గతంలో బెట్టింగ్ చేసి ప్రాణాలు తీసుకున్న యువతదొరికితే ఎఫ్ఐఆర్లే.. ఈ యాప్‌లతో జాగ్రత్త..ఇల్లీగల్ స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాల విలువ భారత్‌లో ప్రతీ ఏటా రూ.8,20,000 కోట్ల దాకా ఉంటుందని థింక్ ఛేంజ్ ఫోరం (టీసీఎఫ్) చెబుతున్న రిపోర్ట్ ఆన్లైన్ బెట్టింగ్ జోరును చెబుతోంది. ముఖ్యంగా బెట్టింగ్ యాక్టివిటీ జోరును ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పెంచుతోందని గతంలోనే వెల్లడించింది. దాదాపు 75 వెబ్సైట్లు, యాప్‌లు బెట్టింగ్‌కు సంబంధించినవి పనిచేస్తుండడంతో కోట్లాది మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ బారిన పడుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డప్ఫాబెట్, 1 ఎక్స్‌బెట్, స్కై ఎక్స్ ఛేంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్ లైన్ గురూ, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్ వంటి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు డౌన్లోడ్ చేసి పందెం కాస్తూ నష్టపోయిన వారు గతంలో చాలా మంది ఉన్నారు. హోటళ్లు, అపార్ట్మెంట్లు, ఇంటర్నెట్ సెంటర్లు, సిటీ శివారుల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకొని టీవీతో పాటు ఇతర సదుపాయాలు సమకూర్చుకొని బెట్టింగ్ దందా చేసే అవకాశముంది. 2023లో తొమ్మిది కేసుల్లో 23 మందిని అరెస్టు చేసి రూ.7,99,000లు, 2024లో ఐదు కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేసి రూ.34,43,700లు, 2025లో ఆరు కేసుల్లో 16 మందిని అరెస్టు చేసి రూ.3,63,500ల నగదును వరంగల్ కమిషనరేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈసారి కూడా ఇలా జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. ఈ తరహా కేసుల్లో అరెస్ట్ అయితే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుండడంతో యువత కెరీర్‌కు ఇబ్బందయ్యే అవకాశం ఉండనుంది. అందుకే ఈ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని పోలీసులు అంటున్నారు. -
నేడు కలెక్టరేట్లో గ్రీవెన్స్
న్యూశాయంపేట: జిల్లాలోని కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆది వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజ లు సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కారానికి వినతులు అందించాలన్నారు. నేడు గ్రేటర్లో.. వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రేటర్ గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నిబద్ధత కలిగిన నాయకత్వమే ముఖ్యం వర్ధన్నపేట: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ఎంపిక చేయడం ఎంతో అవసరమని డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ అన్నారు. ఆదివారం వర్ధన్నపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని వర్ధన్నపేట నియోజకవర్గ, మండల, డివిజన్ అధ్యక్షుల పదవుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి అర్హత, అనుభవం, ప్రజలతో అనుబంధం కలిగిన నాయకులు ముందుకు రావాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని పార్టీ ఎప్పటికీ మరచిపోదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాటోతు శ్రీనివాస్, దేవరకొండ అనిల్, మన్నె బాబురావు, వీసం సురేందర్‌రెడ్డి, పోరెడ్డి మహేందర్‌రెడ్డి, రఘుచందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హామీలు నెరవేర్చాలి నల్లబెల్లి: ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పతనం తప్పదని ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హామీలను విస్మరిస్తోందని విమర్శించారు. ఉద్యమకారులకు సంక్షేమ నిధి ఏర్పాటు, పెన్షన్, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ గుర్తింపుకార్డు, తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సమావేశానికి ఉద్యమకారులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉద్యమకారుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినీకాంత్, ఉపాధ్యక్షుడు ఆకుల సాంబరావు, ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షురాలు కందికట్ల జయ, సంధ్యారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాడులు ఖండించాలి నర్సంపేట: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాద దాడిని ఖండించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు చట్టాలతో దేశ సంపద మొత్తం కార్పొరేట్ శక్తుల చేతిలోకి వెళ్లిందన్నారు. దేశ వనరులను, దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు గంపగుత్తగా అప్పగించే దళారీ ప్రభుత్వాలను యువత ప్రశ్నించాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత పెడదారిన పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గట్టి కృష్ణ, బండి కోటేశ్వర్లు, గంగుల దయాకర్, జక్కుల తిరుపతి, ప్రజా సంఘాల నాయకులు పూలక్క, గుర్రం అజయ్, ఇట్టబోయిన రవి, కార్తీక్, మర్రి మహేష్, సంధ్య, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యాల అంచనా పరీక్ష
● నేడు, రేపు నిర్వహించనున్న అధికారులు కాళోజీ సెంటర్: జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేయడమే లక్ష్యంగా ఎఫ్ఎల్ఎస్ 2026 (ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ) కార్యక్రమాన్ని ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో 3వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో నాలుగు పాఠశాలలను ఎంపిక చేశారు. ఖిలావరంగల్ మండలం బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్, జీపీఎస్ ఈస్ట్ఫోర్టు స్కూల్, వరంగల్ మండలం ఇస్తామియా పబ్లిక్ స్కూల్, నల్లబెల్లి మండలం యూపీఎస్ బొల్లోనిపల్లి పాఠశాలల్లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థుల భాషా, గణితం విషయాల్లోని అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తిమూడో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈనెల 30, 31 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలి. బి.రంగయ్యనాయుడు, డీఈఓ అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ సిద్ధం వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణలో 2026–27 సంవత్సరంలో నిర్వహించనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్‌ను రూపొందించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సారంగపాణి పేర్కొన్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ..ప్రతిభ గల అథ్లెట్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు తమ అసోసియేషన్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహిపాల్, మహిధర్, రత్నాకర్, నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, చైర్మన్ గట్టు మహేష్‌బాబు, చీఫ్ కోచ్ ఎండీ గౌస్, సభ్యులు మనోజ్, సోమశేఖర్, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఏ వర్గం వారూ సంతోషంగా లేరు● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్హసన్పర్తి: సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆరోపించారు. ఒకటో డివిజన్ సన్నాహక సమావేశాన్ని పెగడపల్లిలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. పెగడపల్లి సొసైటీకి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదని వాపోయారు. రుణమాఫీ చేయకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు నరెడ్ల శ్రీధర్, పావుశెట్టి శ్రీధర్, అటికం రవీందర్, మాజీ సర్పంచ్ నన్నబోయిన కుమార్ యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, దేవస్థాన మాజీ చైర్మన్ లక్ష్మణ్, రైతు బంధు సమితి జిల్లా మాజీ కార్యవర్గ సభ్యుడు విక్టర్‌బాబు, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జక్కు రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.● -
దేశంలో మహిళలకు రక్షణ కరువు
నర్సంపేట: బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ లేదని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యే అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో ఉన్నారని ఆరోపించారు. మహిళలు అంటే గౌరవం లేని పార్టీ బీజేపీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక వైపు మహిళలకు గౌరవం ఇవ్వాలని మాట్లాడుతుంటే దేశంలో మహిళలకు రక్షణ కరువవుతుందన్నారు. దేశంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు, ఆడబిడ్డలపై దాడులు జరుగుతుంటే చూస్తూ నోరు విప్పని బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ ఆర్గనైజర్ సెక్రటరీ కోతి మమత, నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు వెండి సక్కుబాయి, వివిధ మండలాల మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, బుర్రి సునీత, బిక్కిరెడ్డి సంధ్య, సురం సాంబలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఒత్తిడిని జయించాలి
● కలెక్టర్ సత్యశారద వర్ధన్నపేట/హసన్‌పర్తి: పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళి కలో భాగంగా ఆదివారం బీమారంలో నిర్వహిస్తు న్న వర్ధన్నపేట బీసీ సంక్షేమ బాలికల హాస్టల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మమేకమై వారి చదువు, పరీక్షల సన్నాహాలు, హాస్ట ల్ సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదలతో చదువుకుంటూ పాఠాలను పునరావృతం చేస్తే మంచి ఫలి తాలు సాధించవచ్చన్నారు. ఒత్తిడికి లోనుకాకుండా సానుకూల ధృక్పధంతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థ్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అ న్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూ చించారు. డీబీసీడీఓ పుష్పలత, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంగెంలో.. సంగెం: విద్యార్థులు పరీక్షల సమయంలో భయం వీడాలని, సమర్థవంతంగా ఎదుర్కొంటేనే విజయాన్ని సాధించగలుగుతారని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు అనేవి జీవితంలో ఒక ముఖ్యమైన దశ మాత్రమేనని ముగింపు కాదన్నారు. అధిక ఆందోళన, భయంతో విద్యార్థుల ప్రతిభకు భంగం కలుగుతుందని ప్రశాంతమైన మనస్సుతో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునన్నారు. పరీక్షల సమయంలో సరైన ఆహారం, నిద్ర, తేలికపాటి వ్యాయామం ఎంతో అవసరమన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాలపై దృష్టి సారించాలని, సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ ఫ్లోరెన్స్, మండల ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, ప్రత్యేకాధికారి నీలిమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం
ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టు భవనంలో జిల్లాల న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్లు బీవీ.నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తులు జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు, ఇందులో సివిల్ కేసులు 267, ఎంవీఓపీ కేసులు 34 (రూ.61,25,961), క్రిమినల్ కేసులు 794, బ్యాంకు పీఎల్సీ కేసులు 41, ఎలక్ట్రిసిటీ పీఎల్సీ కేసులు 230, ట్రాఫిక్ ఈ–చాలన్ కేసులు 59,603, బీఎస్ఎన్ఎల్ కేసులు 10, సైబర్ క్రైమ్ 13 కేసులను పరిష్కరించినట్లు, జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైనట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్‌లను ఏర్పాటు చేయగా.. జిల్లా కేంద్రంలో 8, పరకాలలో 2, బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు న్యాయమూర్తులు బీవీ.నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి తెలిపారు. మొత్తం 474 పెండింగ్ కేసుల్లో సివిల్ కేసులు 48, యమ్ వీఓపీ కేసులు 41, (రూ.2,54,60,000)ల క్రిమినల్ కేసులు 426, బ్యాంక్ పీఎల్సీ కేసులు 29, సైబర్ క్రైమ్ కేసులు 29, సమ్మర్ ట్రయల్ కేసులు 8,282 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. అందరి సహకారంతో లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాల న్యాయమూర్తుల నారాయణబాబు, ప్రేమలత, క్షమాదేశ్ పాండే, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, రామలింగం, డీసీపీ దార కవిత, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వలుస సుధీర్, సత్యనారాయణ పాల్గొన్నారు.స్నేహపూర్వక రాజీ వేదిక లోక్ అదాలత్ : పరకాల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్ పరకాల: లోక్ అదాలత్ అనేది ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాల్లో ఒకటని.. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న లేదా వ్యాజ్యానికి ముందు దశలో ఉన్న వివాదాలతో పాటు కేసులను స్నేహపూర్వకంగా పరిష్కారంతో రాజీచేసుకునే ఒక వేదిక ఉంటుందని పరకాల మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, పరకాల కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జి.సాయి శరత్ అన్నారు. పరకాల కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. రెండు బెంచ్‌ల ద్వారా జూనియర్ సివిల్ జడ్జి జి.సాయి శరత్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బొడ్డు శ్రీవల్లి శైలజ సివిల్, క్రిమినల్, బ్యాంక్ కేసులను పరిష్కరించారు. మొత్తం 437 కేసులను పరిష్కరించగా.. వాటిలో 3 సివిల్ కేసులు, 425 క్రిమినల్ కేసులతో పాటు 9 బ్యాంకు కేసులను పరిష్కరించారు. నగదు రూపంలో రూ.12,32,370 సేకరించారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు ఓంటేరు రాజమౌళి, ఎ.రవికుమార్, పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండ్యాల భద్రయ్య, ఏపీపీ రుధిర, ఏజీపీ మేరుగు శ్రీనివాస్, పరకాల కోర్టు పరిధి పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం
ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టు భవనంలో జిల్లాల న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్లు బీవీ నిర్మలా గీతాంబ, జీఎల్. శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తులు జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు, ఇందులో సివిల్ కేసులు 267, ఎంవీఓపీ కేసులు 34 (రూ.61,25,961), క్రిమినల్ కేసులు 794, బ్యాంకు పీఎల్సీ కేసులు 41, ఎలక్ట్రిసిటీ పీఎల్సీ కేసులు 230, ట్రాఫిక్ ఈ–చాలన్ కేసులు 59,603, బీఎస్ఎన్ఎల్ కేసులు 10, సైబర్ క్రైమ్ 13 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. సకాలంలో ఆస్పత్రులకు తీసుకెళ్లాలి దుగ్గొండి: అత్యవసర పరిస్థితుల్లో రోగులను సకాలంలో ఆస్పత్రులకు తీసుకెళ్లాలని 108 జిల్లా మేనేజర్ గుర్రపు భరత్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలో 108, 102 వాహనాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, గత నెలలో 110 మంది రోగులను సకాలంలో ఆస్పత్రిలో చేర్చిన సిబ్బందిని అభినందించారు. వడదెబ్బ సోకిన వారి కోసం అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని, గర్భిణులకు 102 సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో 108 సిబ్బంది ఈఎంటీ కోరికల నర్సింగరావు, పైలట్ కోతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గణిత పరీక్షకు 99.91 శాతం మంది హాజరుకాళోజీ సెంటర్: జిల్లాలో శనివారం నిర్వహించిన పదో తరగతి గణితశాస్త్రం పరీక్షకు 99.91 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. మొత్తం 9,492 మంది విద్యార్థులకు 9,483 మంది పరీక్షలు రాశారని ఆయన పేర్కొన్నారు. 94 మంది ప్రైవేట్ అభ్యర్థులకు 90 మంది హాజరయ్యారని తెలిపారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026ధాన్యం కొనుగోళ్లకు సాంకేతిక విద్యకు చిరునామా.. వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకుంది. వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి● జిల్లా వ్యవసాయాధికారి అనురాధ సంగెం: రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ సూచించారు. కాపులకనిపర్తి రైతు వేదికలో శుక్రవారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సదిరం చంద్రమౌళి, తహసీల్దార్ రాజ్‌కుమార్, హార్టికల్చర్ అధికారి తిరుపతిరెడ్డి, మండల వ్యవసాయాధికారి బస్వపత్రి జగదీశ్వర్, ఏఈఓ లావణ్య, రైతులు పాల్గొన్నారు. ఖిలా వరంగల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సత్యశారద ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు పర్యవేక్షించాలని, దిగుబడికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గతంలో మాదిరిగా ఈసారి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, రవాణాశాఖ అధికారి శోభన్‌బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌరఫరాల అఽధికారి కిష్టయ్య, వరంగల్ ఆర్డీఓ సుమ, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, మార్క్‌ఫెడ్ డీఎం రంజిత్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో టార్పాలిన్లు, గన్నీ సంచులు, తేమ యంత్రాలు.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్, మహిళా సంఘాలు, ఓడీసీఎంస్ ఆధ్వర్యంలో 240 ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే వీటిని ప్రారంభించనున్నారు. ఈసారి యాసంగి సీజన్లో 1.05 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఇప్పటికే సాగునీటి కాల్వలు, చెరువులు, బోరుబావుల కింద సాగుచేసిన పంటలు మరో 10 రోజుల్లో కోతకు రానున్నాయి. 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఏగ్రేడ్ క్వింటాలు ధర రూ.2,389, సాధారణ రకం క్వింటాలు ధర 2,369గా నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. నిర్దిష్ట తేమ శాతం వచ్చాకే ధాన్యం నింపడానికి గన్నీ సంచులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి కేంద్రానికి 40 వరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచనున్నారు. వర్షాలు వస్తే మరో 2,400 టార్పాలిన్లు తెప్పించనున్నారు. గతేడాది కంటే అధికంగా కొనుగోలు చేయడానికి కార్యాచరణ రూపొందించారు. టార్పాలిన్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచనున్నారు. 47లక్షల గన్నీ సంచులకు ఇప్పటికే 27 లక్షల గన్నీ సంచులు, 9,600 టార్పాలిన్లకు 2,400 టార్పాలిన్లు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా 240 తేమయంత్రాలు, 240 కాంటాలు, 240 ప్యాడీక్లీనర్లు అందుబాటులో ఉంచారు. త్వరలోనే ప్రారంభిస్తాం..జిల్లా వ్యాప్తంగా 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 2.10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. అందుకు తగిన విధంగా రైతులకు వసతులు కల్పిస్తున్నాం. త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నాం. – సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా -
రేపు కేయూ 41వ అకడమిక్ సెనెట్ సమావేశం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 41వ అకడమిక్ సెనెట్ సమావేశాన్ని ఈనెల 30న (సోమవారం) ఉదయం 11గంటలకు పరిపాలనా భవనంలోని సెనెట్ హాల్లో నిర్వహించనున్నట్లు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం శనివారం తెలిపారు. ఈసమావేశంలో యూనివర్సిటీ 2026–27 అంచనా బడ్జెట్‌ను, 2025–2026 వార్షిక నివేదికను ప్రవేశపెడతారని పేర్కొన్నారు. వీటిపై చర్చించి సెనెట్ సభ్యులు ఆమోదిస్తారని తెలిపారు. మాజీ వీసీలు, అకడమిక్ సెనెట్ సభ్యులు, కేయూ పాలకమండలి సభ్యులు, వివిధ విభాగాల డీన్లు, ప్రత్యేక అహ్వానితులుగా యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొంటారని తెలిపారు. -
భూసేకరణ వేగవంతం చేయండి
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో భూసేకరణ, భూభారతి, మీ సేవ పెండింగ్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో చర్చించారు. వచ్చే శనివారం నాటికి పురోగతి నివేదిక సమర్పించాలని, సాగునీటి కాల్వల కోసం పెగ్ మార్కింగ్ పనులను సోమవారం నుంచి ప్రారంభించాలని సూచించారు. ఆర్ఓఆర్, సీనియర్ సిటిజన్ కేసులను వారానికోసారి సమీక్షించి పరిష్కరించాలని, భూభారతి, సాదా బైనామా ఫైళ్లను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మీ సేవ దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్లకు సూచించారు. జనగణన పటిష్టంగా నిర్వహించాలి మే నెలలో ప్రారంభం కానున్న జనగణనను కచ్చితత్వంతో, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి తెలిపారు. కలెక్టరేట్లో ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ, ట్రైనర్లకు జనగణన విధానాలు, డేటా సేకరణలో కచ్చితత్వంపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ రవి, డీఆర్ఓ సత్యపాల్‌రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి, సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ సతీశ్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వర్తించాలి: వరంగల్ కలెక్టర్ న్యూశాయంపేట: మహిళా ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా భద్రతా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోష్ యాక్ట్–2013పై కలెక్టరేట్లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పనిస్థలాల్లో మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం ప్రతి కార్యాలయ బాధ్యత అని స్పష్టం చేశారు. మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు రూపొందించిన పోష్ చట్టం పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధి సుధాకర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పోష్ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఎల్ఎస్ఏ అడ్వకేట్ సురేశ్ పాల్గొన్నారు. పెండింగ్ ఫైళ్లు పరిష్కరించాలి.. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ, సాదాబైనామా ఫైళ్లు, ఇతర సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ, సాదాబైనామా ఫైళ్ల పురోగతిపై సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. -
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి హన్మకొండ: కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు జరిగే బీజేపీ వరంగల్ పశ్చిమ కార్యకర్తల మొదటి శిక్షణ శిబిరం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ ప్రశిక్షణ అభియాన్ హనుమకొండ హంటర్ రోడ్డులోని వేదవ్యాస ఆవాసంలో శనివారం ప్రారంభమైంది. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రావు పద్మ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ, దొంతి దేవేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్పీ.జయంత్‌లాల్, సండ్ర మధు.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పార్టీ మార్గదర్శకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు. రావు పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త పండిట్ జీ ఆశయాలను ఆకళింపు చేసుకుని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పులి సరోత్తంరెడ్డి, రావు అమరేందర్ రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
‘సీ్త్రనిధి’లో జిల్లాకు రెండో స్థానం
కాళోజీ సెంటర్: సీ్త్రనిధి పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం సాధించింది. ఈమేరకు శనివారం హైదరాబాద్‌లో 2024–25 సంవత్సరానికి సంబంధించిన 13వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క,సెర్ప్ సీఈఓ, పీఆర్డీ కమిషనర్ దివ్యదేవరాజన్, సీ్త్రనిధి ఎండీ విద్యాసాగర్ తదితరులు జిల్లాలో సీ్త్రనిధి పథకం అమలుపై చర్చించారు. పూర్వ డీఆర్డీఓ కౌసల్యాదేవి (హసన్‌పర్తి ఈటీసీ ప్రిన్సిపాల్), ఏపీఎం రేణుకాదేవి, సీ్త్రనిధి డీపీంఎ అనిత, కమ్యూనిటీ కోఆర్డినేటర్ శ్రీలతకు అవార్డులు అందజేశారు. -
ఆస్తి పన్ను చెల్లించినా రెడ్ నోటీస్
వరంగల్ అర్బన్: ఆస్తి, నీటి పన్నులు చెల్లించిన ఓ కార్పొరేటర్‌కు రెడ్ నోటీసు జారీ చేసి, గృహం సీజ్ చేస్తామని నోటీసు అంటించడంపై పన్నుల విభాగం సిబ్బంది తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన తన భవనాలకు సంబంధించిన ఆస్తి పన్ను, నీటి చార్జీలు రూ.2.20 లక్షల సొమ్ముతోపాటు రూ.25 వేల వడ్డీని ఈనెల 20న చెల్లించి రశీదు స్వీకరించారు. కానీ, బల్దియా పన్నుల విభాగం సిబ్బంది.. ఎవరు పన్నులు చెల్లించారు? ఎవరు చెల్లించలేదనే విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా నోటీసులు అంటించడం వారి నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. పన్నులు చెల్లించినప్పటికీ తన నివాసానికి నోటీసు అంటించి.. తన పరువుకు భంగం కలిగించారని కార్పొరేటర్ గందె కల్పన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భద్రకాళికి గులాబీలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంతనవరాత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు గులాబీపూలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించే భక్తులు ఎండతాకిడితో ఇబ్బంది పడకుండా శాశ్వత ప్రాతిపదికన జర్మన్ పెండల్స్ టెంట్లు వేయించాలని అందుకయ్యే ఖర్చు రూ.10లక్షలు విరాళంగా ఇస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఆలయ ధర్మకర్తలు పది రోజుల్లో పనిపూర్తి చేయిస్తామని హామీ ఇవ్వడంతో టెంట్లు ఏర్పాటు పనులను పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. వరంగల్‌కు చెందిన బాకరాజు చంద్రశేఖర్‌రావు, రాజశ్రీ దంపతులు భక్తులు స్వయంగా కుంకుమార్చన జరుపుకోవడానికి వీలుగా పంచలోహాలతో తయారుచేసిన అమ్మవారి పాదుకలను ఆలయానికి సమర్పించారు. రాత్రి దేవాలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. -
వరంగల్
శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026శుద్ధబ్రహ్మ పరాత్పర రామ..భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సీతారాముల కల్యాణంశ్రీరామనవమి వేడుకలను ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు ఉత్సవ విగ్రహాలను పూలతో అలంకరించారు. భక్తులు రామనామాన్ని స్మరిస్తూ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. –సాక్షి, నెట్వర్క్– మరిన్ని ఫొటోలు 9లోu -
పరిశ్రమలకు ఇంక్యుబేషన్.. నిట్ వరంగల్
కాజీపేట అర్బన్: పరిశ్రమలకు నూతన ఆవిష్కరణలు, ఆలోచనలను అందజేసేందుకు ఇంక్యుబేషన్లా నిట్ వరంగల్ నిలుస్తుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ అన్నారు. నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం ఐఏఐసీ–26 (ఇండస్ట్రీ అకాడమీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్)ను రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీయల్ కన్సల్టెన్సీ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సౌజన్యంతో నిర్వహించారు. ఐఏఐసీ–26 సమావేశానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్ ఇన్నోవేషన్ సెంటర్ వేదికగా నిలుస్తోందన్నారు. కాగా, ఐఏఐసీ–26 సమావేశంలో టెక్నాలజీ స్టాల్స్, ఇన్నోవేషన్, ఏఐ ఎగ్జిబిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఫిలిప్స్ టౌన్సెండ్ అసోసియేషన్, ఎల్అండ్టీ అడ్వైజర్ వినాయక్ మరాఠే, ఏఎన్ఆర్ఎఫ్ సీఈఓ శివకుమార్, ఐఏఐసీ ప్రతినిధులు, నిట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్.కాంతారావును కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిశారు. హనుమకొండ హోటల్ హరిత కాకతీయలో మర్యాద పూర్వకంగా కలుసుకుని మొక్క అందించారు. జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణపై చర్చించారు. కాజీపేట అర్బన్: కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం 176 స్లాట్ రిజిస్ట్రేషన్లను రాత్రి 8.30 నిమిషాల వరకు సబ్ రిజిస్ట్రార్లు పూర్తి చేయనున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో శనివారం, సోమవారం, మంగళవారం మూడురోజుల పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచేందుకు సబ్ రిజిస్ట్రార్ల పని వేళలు మారుస్తూ 11 గంటల పాటు రిజిస్ట్రేషన్లు కొనసాగేలా మార్పు చేసింది. ఇప్పటి వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలను మారుస్తూ ఉదయం 9:30 నిమిషాల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ప్రతీ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 48 స్లాట్ బుకింగ్స్ ఉండగా.. వరంగల్ ఆర్‌ఓలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉండడం ద్వారా 96 స్లాట్స్ అవకాశం ఉండేది. ప్రస్తుతం మార్చిన స్లాట్స్‌లో భాగంగా 176 స్లాట్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే తరహా పని వేళలు, స్లాట్ బుకింగ్‌లు కొనసాగనున్నాయి. -
పంటలకు గిట్టుబాటు ధర : ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట: పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మార్క్‌ఫెడ్ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, నాయకులు ఎద్దు సత్యనారాయణ, వర్ధన్నపేట సొసైటీ మాజీ అధ్యక్షుడు కౌడగాని రాజేశ్‌ఖన్నా, సర్పంచ్ బేతి సాంబయ్య, మార్క్‌ఫెడ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతులు వినియోగించుకోవాలి
ఐనవోలు: మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నందనం సొసైటీ ద్వారా కొంటున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని నందనం సొసైటీ పరిధి రాంనగర్ రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతులకు మార్కెట్లో మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. అదేవిధంగా రాంనగర్లో జరుగుతున్న శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, మార్క్‌ఫెడ్ అధికారులు, సొసైటీ సీఈఓ సంపత్, రైతులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: కలెక్టర్
న్యూశాయంపేట: విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ రంగశాయిపేట శివారు జక్కలొద్ది మైనారిటీ గురుకులంలో శుక్రవారం రోడ్డు భద్రత–ట్రాఫిక్ నియమాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ట్రాఫిక్ నిబంధనలపై పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, డీఈఓ రంగయ్యనాయుడు, డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, ఖిలావరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఆర్ఎల్సీ డాక్టర్ జంగా సతీశ్, ప్రిన్సిపాల్ భిక్షపతి పాల్గొన్నారు. జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శిని కలిసిన కలెక్టర్ భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావును హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూమొక్క అందజేశారు. -
బకాయిదారులకు రెడ్ నోటీసులివ్వండి
హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వరంగల్ అర్బన్: బడా బకాయిదారులకు తక్షణమే రెడ్ నోటీసులు అందించి పన్ను వసూలు చేయాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పరిధి 6, 7, 8 డివిజన్లలో పన్ను వసూళ్ల ప్రక్రియను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పన్ను వసూళ్ల విధానాన్ని సంబంధిత వార్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను వడ్డీ మాఫీ లేదని స్పష్టం చేశారు. నగర ప్రజలు ఈ నెల 31వ తేదీలోపు పన్నులు చెల్లించి జరిమానాల బారిన పడకుండా ఉండాలని కోరారు. 400 మంది బడా బకాయిదారులకు రెడ్ నోటీసులు అందించి వెంటనే వారి నుంచి పన్నులు వసూలు చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనవు కమిషనర్ చంద్రశేఖర్, ఈఈ మహేందర్ రెవెన్యూ అధికారి బాకం సంతోశ్‌కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, వార్డు ఆఫీసర్ క్రాంతి, బిల్ కలెక్టర్లు శివ సాయి, అజయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీ దొంగలకు ఐదేళ్ల జైలు
వరంగల్ లీగల్ : ఐదుగురు దోపిడీ దొంగలకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి గురువారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరబోయిన శ్రీనివాస్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన మట్ట మల్లేశం నర్సంపేటలోని ఎల్ఐసీ బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. 2019 ఏప్రిల్ 18న విధులు ముగించుకొని తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ సమయంలో చింతనెక్కొండ క్రాస్ వరకు తన మిత్రుడి ద్విచక్ర వాహనం పై వెళ్లి అక్కడి నుంచి ఆటో కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో రంగశాయిపేటకు చెందిన శాగంటి వంశీ రావడంతో మల్లేశం తన ఆటోలో ఎక్కాడు. మరో ఆటోలో ఐనవోలు మండలం ముల్కలగూడేనికి చెందిన గువ్వల శివ, దోమల రాజు, హసన్‌పర్తి మండల మడిపల్లికి చెందిన హరిక శ్రీవర్ధన్, ఖిలా వరంగల్ మండలం నక్కలపల్లికి చెందిన ఎర్ర కార్తీక్.. వంశీ ఆటోను వెంబడించారు. ఈ రెండు ఆటోలు పర్వతగిరి శివారులోని చెరువు వద్ద ఆగాయి. అందరూ మూకుమ్మడిగా మల్లేశంపై దాడి చేసి అతడి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. ఈ విషయంపై బాధితుడు మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పర్వతగిరి పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో నేరస్తులు ఐదుగురికి జడ్జి అపర్ణాదేవి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. సాక్షులను కోర్టులో కానిస్టేబుల్ సింగరబోయిన రాజు హాజరుపర్చారు. యువతిని మోసం చేసిన నేరస్తుడికి పదేళ్లు.. వరంగల్ లీగల్ : ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో నేరం రుజువుకావడంతో చెన్నారావుపేట మండలం జోజిపేటకు చెందిన నెలకంటి జోసెఫ్ తంబికి పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి జి.ప్రేమలతారెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.వెంకట్రామ్నాయక్ కథనం ప్రకారం.. ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామానికి చెందిన ఓ యువతి నర్సంపేటలోని సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన సోదరి ఊరైన చెన్నారావుపేట మండలం జోజిపేట గ్రామానికి వెళ్లిన వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన జోసెఫ్ తంబితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లు కొనసాగిన వారి స్నేహం ఆసరా చేసుకొని తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన జోసెఫ్ తంబి పలుమార్లు యువతిని లోబర్చుకున్నాడు. అనంతరం సదరు యువతి వివాహ విషయమై పలుమార్లు అడగగా జోసెఫ్ తంబి ఏదో కారణం చెబుతూ వాయిదా వేసేవాడు. చివరకు 2 జనవరి 2022న యువతి తల్లిదండ్రులతో సహా జోసెఫ్ తంబి ఇంటికెళ్లి పెళ్లి విషయమై మాట్లాడారు. దీనికి తంబి తల్లిదండ్రులు, కుటుంబీకులు అభ్యంతరం తెలిపి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. పెద్దల సమక్షంలో మాట్లాడినా ఎలాంటి మార్పు లేదు. దీంతో చివరికి 6 ఫిబ్రవరి 2022న ఖానాపురం పీఎస్‌లో సదరు యువతి ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువు కావడంతో నేరస్తుడు జోసెఫ్ తంబికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జడ్జి ప్రేమలతారెడ్డి తీర్పు వెలువరించారు. కేసును పోలీసు అధికారులు ఎం.సాయిరమణ, కె.సూర్యప్రసాద్ పరిశోధించారు. లైజన్ ఆఫీసర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, భరోసా న్యాయ అధికారి నీరజ పర్యవేక్షణలో కానిస్టేబుల్ నమిండ్ల మహేశ్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
ఉపాధి పనుల్లో పారదర్శకత పాటించాలి
● ఇన్చార్జ్ డీఆర్డీఓ గూడూరు రాంరెడ్డి దుగ్గొండి: విధి నిర్వహణలో తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవాలని జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ బహిరంగ ప్రజావేదిక గురువారం జరిగింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు గ్రామాల్లో రూ.8 కోట్ల 49 లక్షల 46 వేల విలువైన ఉపాధి హామీ పనులు చేపట్టారు. రూ. 5 కోట్ల 85 లక్షల 7వేలు కూలీలకు చెల్లించగా రూ.2 కోట్ల 64 లక్షల 39 వేల విలువగల మెటీరియల్ పనులు జరిగాయి. సామాజిక కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ఉపాధి హామీ పనుల్లో అవినీతి, అక్రమాలను వెలికితీసి సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడారు. పనుల్లో పారదర్శకత పాటించాలని, శాశ్వత అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆడిట్లో తేలిన అవినీతి రూ. 42,200 ఉపాధి హామీ 17వ సామాజిక తనిఖీలో భాగంగా వివిధ గ్రామాల్లో రూ. 42,200 అవినీతి జరిగినట్లు లెక్కతేల్చారు. ఆ డబ్బులకు బాధ్యులైన పంచాయతీ కార్యదర్శుల నుంచి రూ.15,667, ఫీల్డు అసిస్టెంట్ల నుంచి రూ.15,876, టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి రూ.4,759, మేట్ల నుంచి రూ.5,898 రికవరీ చేస్తామని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ అధికారి అలివేలు, అదనపు డీఆర్డీఓ శ్రీవాణి, ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ఎస్సార్పీ కవిత, ఏపీఓ శ్రీనివాస్, ఈసీ రాజు, స్పెషల్ టీఏలు సుధాకర్, సురేశ్, డీఆర్పీలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. -
చట్టాల అమలు అధికారుల బాధ్యత
● డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ ఖానాపురం: చట్టాల అమలు ప్రతీ అధికారి బాధ్యత అని వరంగల్ రూరల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ అన్నారు. తెలంగాణ అటవీశాఖ, టీజీఎఫ్డీసీ సంయుక్త ఆధ్వర్యంలో గ్రూప్–1 అధికారుల శిక్షణ కార్యక్రమం గురువారం పాకాలలో ముగిసింది. పాకాల అడవుల్లో ట్రెక్కింగ్, నీటిగుంతలు, నైట్క్యాంపింగ్ పరిశీలన, జీవవైవిధ్య పార్కు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పక్షులను తిలకించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ మాట్లాడుతూ శిక్షణ సమయంలో ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలన్నారు. వణ్యప్రాణుల రక్షణకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని, వన్యప్రాణులను వేటాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎఫ్ఓ విశాల్ బత్తుల, ఎఫ్ఆర్వో పుప్పాల రవికిరణ్, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. -
ఇసుక తీసుకోవడానికి అనుమతివ్వండి
● అసెంబ్లీ సమావేశాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజువర్ధన్నపేట: ఆకేరువాగు సమీప పొలాల్లో ఇసుక తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఆకేరు వాగు వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల మీదుగా ప్రవహిస్తూ మహబూబాబాద్ నుంచి గోదావరిలో కలుస్తుందని వివరించారు. ఈ వాగు సమీప పొలాల్లో మేట వేసిన మట్టిని ఫిల్టర్ చేయగా వచ్చే ఇసుకను నిర్మాణాలకు ఉపయోగిస్తారని చెప్పారు. ఇసుక విక్రయాలు ఆగిపోవడంతో ఈ మూడు మండలాలకు చెందిన ఐదువేల కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. ఒక్క ట్రాక్టర్ ఇసుక విక్రయిస్తే వారికి ఒక వెయ్యి రూపాయలు వస్తాయన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన ఇసుక పాలసీతో దళారులు, మాఫియాకు మింగుడు పడడం లేదన్నారు. ఆకేరు వాగు పరీవాహక ప్రాంతాల్లో ఆయా గ్రామ పంచాయతీలకు రాయల్టీ చెల్లించే విధంగా ఏర్పాటు చేస్తే గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరడంతోపాటు బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందన్నారు. ఇసుక తీసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. -
కారు ఢీకొని పాడిరైతు మృతి
● గిర్నిబావిలో విషాదఛాయలు దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో పాడిరైతు మృతి చెందిన సంఘటన మండలంలోని గిర్నిబావిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎండీ యాకూబ్‌పాషా (56) రెండు పాడిగేదెలతో జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం పాలను తీసుకుని గిర్నిబావిలోని పలువురి ఇళ్ల వద్దకు వెళ్లి ఇచ్చి మోపెడ్ వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న కారు శాలివాహన వీధి సమీపంలో వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కిందపడిన యాకూబ్‌పాషా తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య కై రూన్బీ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అందరితో కలిసి మెలిసి ఉండే యాకూబ్‌పాషా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తరచూ ప్రమాదాలు.. గిర్నిబావిలో వరంగల్– నర్సంపేట ప్రధాన రహదారిపై శాలివాహన వీధి సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాదికి నాలుగు నుంచి ఐదు రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. గతేడాది చెల్పూరి మల్లయ్య రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొని మృతి చెందాడు. ఇప్పుడు అదే స్థలంలో యాకూబ్‌పాషా మృతి చెందాడు. గిర్నిబావి ప్రధాన రహదారిపై వేగాన్ని నియంత్రించడానికి వరంగల్, నర్సంపేట వైపు రెండు వైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. దీనికి తోడు షాపుల వారు రోడ్డును ఆక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు పరిపాటిగా మారుతున్నాయి. -
విద్యార్థులు పుస్తకాలను చదవాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారదచెన్నారావుపేట: విద్యార్థులు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని, మంచి పుస్తకాలు చదివితే మనిషి జీవితం మారుతుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. సర్పంచ్ అనిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదికే పరిమితం కాకుండా ప్రతిరోజు గ్రంథాలయానికి గంట సమయం కేటాయించాలని, ఇతిహాసాలతోపాటు మహనీయుల జీవిత చరిత్రలు చదవాలని సూచించారు. విద్యార్థులతో పాటు గ్రామస్తులు సైతం రీడింగ్ రూంను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి కోరారు. రీడింగ్ రూం వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టర్ విద్యార్థులతో సెల్పీ దిగారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాఠశాలలకు 200 కంప్యూటర్లు అందిస్తామని తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు జయ, డీఈఓ రంగయ్యనాయుడు, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి అలివేలు, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ప్రత్యేక అధికారి డాక్టర్ బాలకృష్ణ, తహసీల్దార్ అబీద్‌అలీ, ఎంపీడీఓ ఆయేషా, ఎంఈఓ పాపమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేశారు. గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి గీసుకొండ: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా దస్రు తండా గ్రామపంచాయతీ పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. టీకా కార్యక్రమం ఏప్రిల్ 9 వరకు కొనసాగుతుందని, పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గాలికుంటు వ్యాధిపై ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలను పంపిణీ చేశారు. జిల్లా పశువైద్య, పశుసంవర్థక అధికారి డాక్టర్ ఎం.బాలకృష్ణ, సర్పంచ్ కేలోత్ అమృత, స్థానిక పశువైద్య అధికారి గైని శ్రీనివాస్, గీసుకొండ పశువైద్యాఽధికారి డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ రాధిక, సిబ్బంది చిరంజీవి, చందు, జితేందర్, గోపాలమిత్రలు ఇస్మాయిల్, రమేశ్, రైతులు పాల్గొన్నారు. భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి న్యూశాయంపేట: దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో జె.చొక్కారావు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణ పురోగతిపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. నర్సంపేట, దుగ్గొండి, రాయపర్తి, వర్ధన్నపేట, నల్లబెల్లి మండలాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధం చేసి ముందస్తు నివేదికలు సమర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. -
రామాలయంలో పూజలు
రాయపర్తి: మండల కేంద్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన ఎదుర్కోళ్ల కార్యక్రమంలో టీటీడీ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ రాంరెడ్డి కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రామయ్యకు పసిడి పాదుకలు నర్సంపేట: శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని నర్సంపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామోజు జయకుమార్ పసిడి పాదుకలను తయారుచేశారు. రాముడిపై ఉన్న తన భక్తిని చాటుతూ 8 మిల్లీమీటర్ల వెడల్పు, 7 మిల్లీమీటర్ల ఎత్తులో 40 మిల్లీగ్రాముల బంగారంతో సూక్ష్మ పాదుకలను తయారు చేశారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో ప్రపంచం అల్లకల్లోలంగా మారుతోందని, అందుకే ప్రపంచ శాంతి నెలకొనాలని సీతారాములను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశం ఎదుర్కొనే ఆటంకాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. దళిత యువతకు పథకాలున్యూశాయంపేట: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత యువతకు ఫేజ్–2 ప్రణాళికలో భాగంగా పలు నూతన పథకాలు అమలు చేయనున్నట్లు జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈవీలు, స్కూటర్లు, ఆటోరిక్షాలు, సోలార్‌పంపు యూనిట్లు, వ్యవసాయ సంబంధిత డ్రోన్స్, సెరికల్చర్ తదితర పథకాల కోసం ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులు సరైన ధ్రువపత్రాలతో టీజీఓబీఎంఎంఎస్‌న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో వచ్చేనెల 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
పారిశుద్ధ్య కార్మికులు పోషకాహారం తీసుకోవాలి
● అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి వర్ధన్నపేట: పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి పోషకాహారం తీసుకోవాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్యశిబిరం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యాధికారి తరుణ్చంద్ర, వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఇమ్మడి సుధీర్‌కుమార్, వైస్ చైర్పర్సన్ నేతావత్ షీభారాణి, వార్డు కౌన్సిలర్లు బానోతు జ్యోతి, నూనావత్ కమిలి, మాలోతు దేవేందర్, చిలువేరు రమ, తిరుపల్లి వాణి, డీఎంసీ రేణుక పాల్గొన్నారు. -
అదుపుతప్పిన ఆటో.. టెన్త్ విద్యార్థి మృతి
● మరో విద్యార్థికి గాయాలు గీసుకొండ: ఓ పదో తరగతి విద్యార్థి తమాషాకు ఆటో నడిపేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో నడిపిన విద్యార్థి మృతిచెందడంతోపాటు మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన ల్యాదళ్ల అక్షయ్(15), ల్యాదళ్ల శశాంత్‌కుమార్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. ఇప్పటికే మూడు సబ్జెక్టులు రాయగా, మరో నాలుగు రాయాల్సి ఉంది. ఈ నెల 25న ఉదయం 7 గంటల సమయంలో శశాంత్‌కుమార్ తన తండ్రి ఆటోను తీసుకుని తాగునీటి కోసం వెళ్తుండగా వెంట అక్షయ్ కూడా వెళ్లాడు. ఊరి చివరన వెళ్లాక తాను నడుపుతానని శశాంత్‌కుమార్ నుంచి అక్షయ్ ఆటోను తీసుకున్నాడు. గేర్లు వేసి అజాగ్రత్తగా ఒకవైపు తిప్పగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్షయ్ తలకు, శరీర భాగాలకు బలమైన గాయాలయ్యాయి. శశాంత్కుమార్కు కాలు విరిగింది. బంధువులు ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించగా అక్షయ్ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి పది గంటలకు మృతిచెందాడు. మృతుడి తండ్రి ప్రవీణ్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. -
వరంగల్
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలను ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో సీతారాముల కల్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీల బాధ్యులు భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. గురువారం రాత్రి ఆలయాలను రంగురంగుల విద్యుత్‌దీపాలు, మామిడితోరణాలతో అలంకరించారు. – సాక్షి, నెట్వర్క్ సస్పెన్షన్లకు కేరాఫ్‌గా మిల్స్‌కాలనీ ఠాణా కేసుల నమోదులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలతో ఎస్సై సురేశ్‌పై వేటు తప్పుడు కేసుల్లో మట్టెవాడ పీఎస్‌కు మరక.. ఇంతేజార్గంజ్లోనూ చేతివాటం ఉన్నతాధికారుల చర్యలతో అవినీతి ఖాకీల్లో గుబులు -
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
సంగెం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగేలా సిబ్బంది పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశించారు. సంగెం పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మామిడి మొక్క నాటారు. అనంతరం స్టేషన్ పరిధిలోని గ్రామాలు, ప్రజల జీవనవిధానం, నేరాలు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలను ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బంది పనితీరు, బీట్ వ్యవస్థ, పెట్రోలింగ్, రికార్డుల నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్లో నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టుకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, విధి నిర్వహణలో అలసత్వం లేకుండా పారదర్శకంగా సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై కె.వంశీకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సంగెం పోలీస్‌స్టేషన్ తనిఖీ -
వివాదాల్లో ‘వరంగల్’ పోలీసులు
సాక్షి, వరంగల్: వరంగల్ డివిజన్ పోలీసులు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల తప్పుడు కేసుల్లో ఓ ఏసీపీ, సీఐ, ఎస్సై సస్పెన్షన్ వ్యవహారం మరువకముందే.. ఇప్పుడు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ ఎస్సై సురేశ్‌పై వేటు పడింది. మహిళలపై అనుచితంగా ప్రవర్తించడం, కేసుల నమోదులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు విచారణలో తేలడంతో పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆయనను సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇదే ఠాణాలో పనిచేస్తున్న మరో ఎస్సై కూడా సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. అలాగే, తప్పుడు కేసుల్లో మట్టెవాడ పీఎస్, ఇంతేజార్గంజ్ ఠాణా పరిధిలోనూ ఒకరిద్దరు అధికారులు కేసుల నమోదులో నిర్లక్ష్యంతోపాటు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఇలా ఈ మూడు పోలీస్స్టేషన్లలో అవినీతి అధికారుల వైఖరి వివాదాస్పదమవుతోంది. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులే కట్టు తప్పుతుండడంతో ఇంకా ఎక్కడ న్యాయం జరుగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కావాలని నమోదుచేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులతోపాటు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన గొర్రెల దహనం కేసులో నిందితులను పట్టుకోవాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గతంలో డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదీ పోలీసువర్గాల్లో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వివాదాలు, సస్పెన్షన్లకు కేరాఫ్ మిల్స్‌కాలనీ పోలీసులు.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ ఇటీవల కాలంలో వరుస వివాదాలు, అధికారుల సస్పెన్షన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సీఐ వెంకటరత్నం గతేడాది మే నెలలో సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఒక భూవివాదంలో నిందితులకు సహకరిస్తూ, తొమ్మిదేళ్ల క్రితమే మరణించిన వ్యక్తిపై తప్పుడు కేసు నమోదు చేయడం అప్పట్లో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే, ఒక హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనపై వేటు పడింది. అలాగే, ఎస్సై శ్రీకాంత్‌పై గతేడాది ఆగస్టులో అట్రాసిటి కేసు నమోదైంది. అర్ధరాత్రి సమయంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఒక దళిత మహిళపై దాడి చేసిన ఆరోపణలతో ఎస్సై, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది. సీఐ వెంకటరత్నం కంటే ముందు పనిచేసిన రమేశ్‌ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఎస్సై సురేశ్‌పై వేటు, మరో ఎస్సై సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత సీఐ రమేశ్ ఠాణా విభాగాధికారిగా పనితీరుపై సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ అధికారులపై స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దానికి తలొగ్గిన అధికారులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. ఒకప్పుడు నేర నియంత్రణలో మంచి పేరున్న ఈస్టేషన్.. నెలల వ్యవధిలో అధికారులు సస్పెన్షన్ అవుతుండడంతో కమిషనరేట్‌కు కళంకంగా మారుతోందన్న చర్చ ఉంది. అలాగే, మట్టెవాడ, ఇంతేజార్గంజ్ ఠాణాల్లోనూ పోలీసులు వివాదాల్లో చిక్కుకోవడం తెలిసిందే. -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
నర్సంపేట: ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ పథకాన్ని తీసుకువచ్చిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అన్నారు. ఈ మేరకు మండలంలోని గురిజాల గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘ఉపాధి’కి కోత విధిస్తూ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు నమిండ్ల స్వా మి, జిల్లా ఉపాధ్యక్షురాలు మొగులూరు శారద, మర్ధ నర్సమ్మ, కళావతి, వెంకన్న, మజ్జిగ అనిత, రజిత, తదితరులు పాల్గొన్నారు. అలాగే కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం పట్టణ, మండల పార్టీ కార్యకర్తల వి స్తృత స్థాయి సమావేశంలో నాగయ్య పాల్గొని మాట్లాడారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని రగిల్చిన అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, కమిటీ సభ్యులు ఈసంపల్లి బాబు, తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో వసంతనవరాత్ర ఉ త్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవా రం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేదపాఠశాల విద్యార్థులు తెలుపురంగు చామంతిపూలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పూజా కార్యక్రమాలకు వేల్పుల భాస్కర్, సత్యవతి, రో హిత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, కాసం పుల్ల య్య బట్టల దుకాణం అధినేత కాసం నమశ్శివాయ దేవాలయానికి 16 ఎల్ఈడీ లైట్లను అందజేశారు. క్రాంతికుమార్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యం
వర్ధన్నపేట: బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నా గరాజు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నిజ మవుతుందన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో అధికంగా దళితులు ఉన్నారని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఓ ప్రైవేట్ కంపెనీ సహకారంతో 25 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటికి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పార్టీ బలోపేతానికి కృషి వర్ధన్నపేట: పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ అన్నారు. బుధవారం వర్ధన్నపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్రశిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్పాయ్ నుంచి నేటి మోదీ వరకు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారన్నారు. కార్యకర్తలు శిక్షణలో నేర్చుకున్న ప్రతీ అంశాన్ని ఆచరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షురాలు కొండేటి అనిత సత్యం వెంకటరమణను శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బన్న ప్రభాకర్, రాయపురపు కుమారస్వామి, గార్లపాటి మంజులారెడ్డి, మాదాసు రాజు, మైస రాము, రాయపురం రమ్య రాజు, నాంపెల్లి యాకయ్య, తేజనాయక్, అడుపరాజు తదితరులు పాల్గొన్నారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలికాజీపేట రూరల్ : ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలను నివారించాలని సూచించారు. డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అనంతరం ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీలు సత్యనారాయణ, పింగలి ప్రశాంత్‌రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు పి.వెంకన్న, సీతారాం రెడ్డి, సుజాత, కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. -
అడవులపై అవగాహన ఉండాలి
ఖానాపురం: అడవుల సంరక్షణ, అటవీ చట్టాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ సూచించారు. ఈ మేరకు ఇటీవల గ్రూప్–1 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు శిక్షణలో భాగంగా బుధవారం సాయంత్రం పాకాలకు వచ్చారు. ఈ సందర్భంగా పాకాలలో ట్రెక్కింగ్ చేసి పలు పనులను పరిశీలించారు. అనంతరం పర్యావరణ అధ్యయన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అటవీలోని విలువైన సంపదను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించుకోవాలన్నారు. అడవుల్లోని వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ డీఎఫ్ఓ విశాల్ బత్తుల, ఎఫ్ఆర్ఓ పుప్పాల రవికిరణ్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా 99 మంది శిక్షణ అధికారులు బుధవారం రాత్రి పాకాలలోనే బస చేయగా ఎఫ్ఆర్ఓ రవికిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేపట్టారు. గురువారం ట్రెక్కింగ్ చేపట్టనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ -
వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి
రైతులతో ఆర్బిట్రేషన్ సంగెం మండలంలోని సంగెం, చింతలపల్లి గ్రామాలకు చెందిన 163 గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులతో కలెక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. రైతుల సమస్యలు, అభ్యంతరాలను స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, సంగెం తహసీల్దార్ రాజ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.కాశిబుగ్గ: రోగుల వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించి, అందులో ఉన్న ఫిర్యాదులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న ఆహారం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, పౌష్టికాహారం సమయానికి అందేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత, ఔషధాల లభ్యత, నాణ్యమైన వైద్యసేవల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, జిల్లా వెనుకబడిన వర్గాల అభివృద్ధి అధికారి పుష్పలత, సీకేఎం సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.ఉపాధి’ పనులను పూర్తి చేయాలి న్యూశాయంపేట: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల జారీ చేసి మార్గదర్శకాల ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశహాల్లో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి వాటిని త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పనుల పూర్తి వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సహాయ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీవాణి, పీఆర్ ఇంజనీర్ ఇజ్జగిరి, డీపీఓ కల్పనా, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద సీకేఎం ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ -
గ్రాంట్లపైనే ఆశలు!
రూ.1,040.58 కోట్ల బడ్జెట్‌కు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఆమోదంవరంగల్ అర్బన్: ఊరించే అంకెలు.. ఊహాజనిత పద్దులు.. వాస్తవాలకు పొంతన లేని లెక్కలు.. కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ఈసారి బడ్జెట్ అంచనాలను రూపకల్పన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లపై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెరుగుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్తిపన్నుల రివైజ్డ్ పేరుతో కొంత మేరకు రాబడి పెంచుకునే విధంగా స్వల్పమార్పులు చేర్పులు చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసన మినహా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా సాగింది. 2026–27 చివరి బడ్జెట్‌ను జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం బడ్జెట్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రూ.1,040.58 కోట్లతో కూడిన ప్రతిపాదనలను అధికారులు సమావేశంలో ప్రవేశపెట్టి ‘మమ’ అనిపించారు. తొలుత మేయర్ గుండు సుధారాణి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. నగరాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పోడియం వద్ద బైఠాయించిన బీజేపీ కార్పొరేటర్లు.. నగరాభివృద్ధి కోసం యూజీడీ, స్మార్ట్‌సిటీ, అమృత్ స్కీంలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పీఎం మోదీకి కృతజ్ఞతలు తెలియజేయకపోవడంతో బీజేపీ కార్పొరేటర్లు పొడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపారు. అకౌంటెంట్ శివలింగం బడ్జెట్ చదువుతుండగా పోడియం ఎదుట సుమారు గంటన్నర పాటు బైఠాయించారు. నిబంధనలు పాటించాలని హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ విన్నవించారు. చివరికి మేయర్ కేంద్ర ప్రభుత్వం, మోదీకి కృతజ్ఞతలు తెలపడంతో శాంతించారు. బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని, మెప్పు కోసం అంకెలగారడి చేశారని కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది. మౌలిక వసతులకు నిధుల కోత నగర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో బడ్జెట్లో మొండిచెయ్యి చూపించారు. కీలకమైన రంగాలకు కేటాయింపులను విస్మరించారు. పార్కులు, క్రీడా మైదానాలు, శ్మశానవాటికలు, వెజ్, నాన్ మార్కెట్లు తదితర సమస్యల పరిష్కారానికి గత ఏడాది రూ.10.40 కోట్లు కేటాయించారు. కానీ, ఈ ఏడాది రూ.2.70 కోట్లతో సరిపెట్టడంతో కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు, వింగ్ అధికారులు పాల్గొన్నారు.సొంత రెవెన్యూ : రూ.349.18 స్టాంపు డ్యూటీ రూ.40అద్దెలు, ఫీజులు, ఇతర ఆదాయం రూ.10.10శానిటేషన్ ద్వారా రూ.23.56 టౌన్ ప్లానింగ్ రూ.126.50 ఇంజినీరింగ్ సెక్షన్ నుంచి రూ.36.27ఖర్చులు ఇలా.. (రూ.కోట్లలో) జీతాలు, ఈఎఫ్‌పీ, ఈఎస్ఐ, వ్యయాలు రూ.100 శానిటేషన్ వ్యయం రూ.40.75 విద్యుత్ చార్జీలు రూ.29,05 రుణాల చెల్లింపులు రూ.20 లక్షలు గ్రీన్‌బడ్జెట్ రూ.34.91 ఇంజినీరింగ్ రూ.36,15 పరిపాలన వ్యయం రూ.30.41 టౌన్ ప్లానింగ్ వ్యయం రూ.1.40 డీజేఆర్ఎఫ్కు రూ.1.50 విలీన గ్రామాలు, మురికివాడలకు రూ.25.43 మౌలిక వసతులకు రూ.2.70 66 డివిజన్లకు మిగులు నిధులు రూ.47.41 సొంత ఆదాయంలో మిగులు బడ్జెట్ రూ.75 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల బడ్జెట్ రూ.685.20 నాన్‌ప్లాన్ గ్రాంట్ : రూ.127 ప్రకృతి విపత్తులు రూ.2 యూఐడీఎఫ్ వసతుల కల్పన రూ.75 15, 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 ప్లాన్గ్రాంట్స్ రూ.43 రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.18 ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.7 స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ నిధులు రూ.8 వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, అమృత్ నిధులు రూ.10 ఇతరములు రూ.515 ఎంపీ నిధులు రూ.50 లక్షలు మెప్మా నిధులు రూ.1.20 అత్యవసర ప్రత్యేకాభివృద్ధి నిధులు రూ.503 రెవెన్యూ గ్రాంట్ రూ.2.50 ఎన్నికల నిధులు రూ.6.50 జనాభా లెక్కలు రూ.50 లక్షలు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ రూ.2 డిపాజిట్లు, అడ్వాన్స్‌లు రూ.6.20 బడ్జెట్ స్వరూపం ఇలా.. (రూ.కోట్లలో) సొంత ఆదాయం రూ.349.18 కోట్లు ప్రభుత్వాల నుంచి అంచనా రూ.685.20 కోట్లు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన చివరి బడ్జెట్ సమావేశం -
‘పెన్షన్ వాలిడేషన్ యాక్ట్’తో అన్యాయం
హన్మకొండ అర్బన్ : గతేడాది పార్లమెంట్లో ఆమోదించిన పెన్షన్ వాలిడేషన్ చట్టంతో అన్యాయం జరుగుతోందని, వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జి.వీరస్వామి, ఉపాధ్యక్షుడు టి.పురుషోత్తం డిమాండ్ చేశారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో పెన్షన్ వాలిడేషన్ యాక్ట్‌కు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రభుత్వ పెన్షనర్లు పొందుతున్న ప్రయోజనాలన్ని కూడా 2026 జనవరి 1నుంచి ఈ చట్టం ప్రకారం వర్తించవన్నారు. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం సరికాదని విమర్శించారు. వెంటనే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం అమలుతో 2025 డిసెంబర్ 31 వరకు పెన్షనర్లు పొందుతున్న సదుపాయాలు భవిష్యత్‌లో ఉండవన్నారు. అలాగే 2024 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి వరకు రిటైర్డ్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్సీ–2020 బకాయిలన్నింటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ సంబంధించిన జీఓ కాపీని చించివేసి హనుమకొండ కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి అందజేయాలని వినతిపత్రం అందజేశారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎస్టీఓ జనరల్ సెక్రటరీ కందుకూరి దేవదాసు, ప్రధాన కార్యదర్శి సమ్మారెడ్డి, కమిటీ సభ్యులు ప్రకాశ్, రత్నాకర్, సూర్య ప్రకాశ్, సింగారెడ్డి, సత్యనారాయణ, రమేశ్, జ్యోతిరమణి, రాధ, సుభాషిణి, రాజ కొమురమ్మ, ప్రభాకర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, ఆగయ్య, భోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద కాశిబుగ్గ: రోగుల వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న ఆహారం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, పౌష్టికాహారం సమయానికి అందేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత, ఔషధాల లభ్యత, నాణ్యమైన వైద్యసేవల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆర్డీఓ ఉమారాణి, జిల్లా వెనుకబడిన వర్గాల అభివృద్ధి అధికారి పుష్పలత, సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పనులను పూర్తి చేయాలి న్యూశాయంపేట: ఉపాధి హామీ పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశహాల్లో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న పనులను మండలాల వారీగా గుర్తించి వాటిని త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పనుల పూర్తి వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీవాణి, పీఆర్ ఇంజనీర్ ఇజ్జగిరి, డీపీఓ కల్పన, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. -
గ్రాంట్లపైనే ఆశలు!
రూ.1,040.58 కోట్ల బడ్జెట్‌కు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఆమోదంవరంగల్ అర్బన్: ఊరించే అంకెలు.. ఊహాజనిత పద్దులు.. వాస్తవాలకు పొంతన లేని లెక్కలు.. కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ఈసారి బడ్జెట్ అంచనాలను రూపకల్పన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లపై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెరుగుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్తిపన్నుల రివైజ్డ్ పేరుతో కొంత మేరకు రాబడి పెంచుకునే విధంగా స్వల్పమార్పులు చేర్పులు చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసన మినహా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా సాగింది. 2026–27 చివరి బడ్జెట్‌ను జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం బడ్జెట్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రూ.1,040.58 కోట్లతో కూడిన ప్రతిపాదనలను అధికారులు సమావేశంలో ప్రవేశపెట్టి ‘మమ’ అనిపించారు. తొలుత మేయర్ గుండు సుధారాణి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. నగరాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. పోడియం వద్ద బైఠాయించిన బీజేపీ కార్పొరేటర్లు.. నగరాభివృద్ధి కోసం యూజీడీ, స్మార్ట్‌సిటీ, అమృత్ స్కీంలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పీఎం మోదీకి కృతజ్ఞతలు తెలియజేయకపోవడంతో బీజేపీ కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపారు. అకౌంటెంట్ శివలింగం బడ్జెట్ చదువుతుండగా పోడియం ఎదుట సుమారు గంటన్నర పాటు బైఠాయించారు. నిబంధనలు పాటించాలని హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బజ్పాయ్ విన్నవించారు. చివరికి మేయర్ కేంద్ర ప్రభుత్వం, మోదీకి కృతజ్ఞతలు తెలపడంతో శాంతించారు. బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని, మెప్పు కోసం అంకెలగారడి చేశారని కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది. మౌలిక వసతులకు నిధుల కోత నగర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో బడ్జెట్లో మొండిచేయి చూపించారు. కీలకమైన రంగాలకు కేటాయింపులను విస్మరించారు. పార్కులు, క్రీడా మైదానాలు, శ్మశానవాటికలు, వెజ్, నాన్ మార్కెట్లు తదితర సమస్యల పరిష్కారానికి గత ఏడాది రూ.10.40 కోట్లు కేటాయించారు. కానీ, ఈ ఏడాది రూ.2.70 కోట్లతో సరిపెట్టడంతో కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు, వింగ్ అధికారులు పాల్గొన్నారు. పన్నుల భారం లేని ప్రజారంజక బడ్జెట్ మహానగర ప్రజలపై నయాపైసా పన్ను భారం లేకుండా బడ్జెట్ రూపకల్పన చేశాం. వాస్తవాలతో కూడిన ప్రజారంజక బడ్జెట్ ఇది. యూజీడీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇటీవల బల్దియాకు 15వ ఆర్థిక సంఘం, ఇతర స్కీం ద్వారా రూ.43 కోట్ల నిధులు మంజూరయ్యాయి. – గుండు సుధారాణి, నగర మేయర్ సొంత రెవెన్యూ : రూ.349.18 స్టాంపు డ్యూటీ రూ.40అద్దెలు, ఫీజులు, ఇతర ఆదాయం రూ.10.10శానిటేషన్ ద్వారా రూ.23.56 టౌన్ ప్లానింగ్ రూ.126.50 ఇంజినీరింగ్ సెక్షన్ నుంచి రూ.36.27ఖర్చులు ఇలా.. (రూ.కోట్లలో)జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, వ్యయాలు రూ.100 శానిటేషన్ వ్యయం రూ.40.75 విద్యుత్ చార్జీలు రూ.29,05 రుణాల చెల్లింపులు రూ.20 లక్షలు గ్రీన్‌బడ్జెట్ రూ.34.91 ఇంజినీరింగ్ రూ.36,15 పరిపాలన వ్యయం రూ.30.41 టౌన్ ప్లానింగ్ వ్యయం రూ.1.40 డీజేఆర్ఎఫ్కు రూ.1.50 విలీన గ్రామాలు, మురికివాడలకు రూ.25.43 మౌలిక వసతులకు రూ.2.70 66 డివిజన్లకు మిగులు నిధులు రూ.47.41 సొంత ఆదాయంలో మిగులు బడ్జెట్ రూ.75 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల బడ్జెట్ రూ.685.20 నాన్‌ప్లాన్ గ్రాంట్ : రూ.127 ప్రకృతి విపత్తులు రూ.2 యూఐడీఎఫ్ వసతుల కల్పన రూ.75 15, 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 ప్లాన్గ్రాంట్స్ రూ.43 రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.18 ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.7 స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ నిధులు రూ.8 వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, అమృత్ నిధులు రూ.10 ఇతర నిధులు రూ.515 కోట్లుఎంపీ నిధులు రూ.50 లక్షలు మెప్మా నిధులు రూ.1.20 అత్యవసర ప్రత్యేకాభివృద్ధి నిధులు రూ.503 రెవెన్యూ గ్రాంట్ రూ.2.50 ఎన్నికల నిధులు రూ.6.50 జనాభా లెక్కలు రూ.50 లక్షలు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ రూ.2 డిపాజిట్లు, అడ్వాన్స్‌లు రూ.6.20 బడ్జెట్ స్వరూపం ఇలా.. (రూ.కోట్లలో) సొంత ఆదాయం రూ.349.18 కోట్లు ప్రభుత్వాల నుంచి అంచనా రూ.685.20 కోట్లు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన చివరి బడ్జెట్ సమావేశం -
భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేదపాఠశాల విద్యార్థులు తెలుపురంగు చామంతిపూలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పూజా కార్యక్రమాలకు వేల్పుల భాస్కర్, సత్యవతి, రోహిత్ ఉభయ దాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, కాసం పుల్ల య్య వస్త్ర దుకాణం అధినేత కాసం నమశ్శివాయ దేవాలయానికి 16 ఎల్ఈడీ లైట్లను అందజేశారు. కార్యక్రమంలో దేవాలయ పరిశీలకుడు క్రాంతికుమార్, వాసవీ కబ్ల్ ఇంటర్నేషనల్ సెక్రటరీ దాచేపల్లి సీతారాం పాల్గొన్నారు. -
వేయిస్తంభాల ఆలయంలో లక్షతులసి అర్చన
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహిస్తున్న సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఏడో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతారాములకు లక్షతులసి అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, పాంచరాత్ర ఆగమానుసారంగా పంచసూక్తములతో చతుర్వేద మూలమంత్రంగా అర్చనలు జరిపారు. కమ్మ సంఘం రాష్ట్ర నాయకుడు చిన్న కోనయ్య–ధనలక్ష్మి దంపతుల సౌజన్యంతో తూర్పుగోదావరి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తులసి దళాలతో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు లక్షతులసి అర్చన చేశారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. హన్మకొండ : ప్రయాణికుల సలహాలు, సూచనల మేరకు మెరుగైన సేవలు అందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ ఎం.రవిచందర్ తెలిపారు. ఈ నెల 26న(గురువారం) మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు హనుమకొండలోని వరంగల్–2 డిపో నుంచి డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంత ప్రయాణికులు 99595 58556 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు ఇవ్వాలని కోరారు. -
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి
కాజీపేట రూరల్ : ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీలు సత్యనారాయణ, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
చట్టబద్ధమైన దత్తతను స్వీకరించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కాజీపేట అర్బన్ : మాతృత్వం ఒక వరం..ఆ కలను సాకారం చేసుకునేందుకు పిల్లలు లేని తల్లిదండ్రులు చట్టబద్ధమైన దత్తతను మాత్రమే స్వీకరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ సూచించారు. హనుమకొండ కంచరకుంటలోని శిశుగృహలో బుధవారం వడ్డేపల్లికి చెందిన దంపతులకు నాలుగు నెలల శిశువును దత్తతగా కలెక్టర్ అందజేశారు. కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న దంపతులకు సీనియారిటీ ఆధారంగా, దత్తతకు ఎంపికై న శిశువును అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీఓ విశ్వజ, ఇన్చార్జ్ శిశుగృహ మేనేజర్ మాధవి పాల్గొన్నారు. -
విద్యారంగానికి 20 శాతం నిధులు ఇవ్వాలి
కాళోజీ సెంటర్: విద్యారంగానికి బడ్జెట్లో రూ.26,674 కోట్లను కేటాయించి ప్రభుత్వం తీవ్ర నిరాశకు గురిచేసిందని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి విమర్శించారు. కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ సంధ్యారాణికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలని 1965లో కొఠారి కమిషన్ సూచించిందని, తెలంగాణ విద్య కమిషన్ సైతం 18 శాతం నిధులను కేటాయించాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్ టీఏలు, పెన్షనర్ల బెనిఫిట్స్, డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. టీపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి మనోజ్, జిల్లా కార్యదర్శి సురేశ్‌బాబు, నాయకులు బెల్లంకొండ పూర్ణచందర్, మనుపాటి వెంకటేశ్వర్లు, కడారి భోగేశ్వర్, బెల్లంకొండ రమేశ్, కుమారస్వామి, సోమేశ్వర్, బైరి స్వామి, రిటైర్డ్ ఉపాధ్యాయుల బకాయిల సాధన సమితి జిల్లా బాధ్యులు కందుకూరి దేవదాస్, గఫార్ తదితరులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి -
సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగుచేయాలి
గీసుకొండ: రైతులు సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగుచేసి నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయవచ్చని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కొనాయమాకుల రైతువేదికలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ తక్కువ మోతాదులో రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తూ అధునాతన సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేయాలన్నారు. అనంతరం ఉద్యాన పథకం కింద రైతులకు కూరగాయల విత్తనాల మినీకిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ అధికారి బాలకృష్ణ, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, మండల ఉద్యానశాఖ అధికారి తిరుపతి, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, మండల ఉద్యాన విస్తరణ అధికారి వేణు, సర్పంచ్ వజ్ర రాజు, రైతులు రహీం, పోలీస్ శంకర్రావు, రాజేశ్వరరావు పాల్గొన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి పర్వతగిరి: సైబర్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పీఎంశ్రీ టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ కళాశాల, పాఠశాలలో మంగళవారం బాలల భద్రత, సైబర్ క్రైంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైం అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు ఆన్లైన్లో జాగ్రత్తలు పాటించాలని, అపరిచితులతో సంభాషణకు దూరంగా ఉండాలని కోరారు. సైబర్ క్రైం హెల్ప్ లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను వినియోగించుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీబీసీడీఓ పుష్పలత, డీఎసీసీడీఓ భాగ్యలక్ష్మి, డీటీడబ్ల్యూఓ నారాయణరెడ్డి, డీఎండబ్ల్యూఓ రమేశ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ విజయకుమార్, ఏఎస్సీ వేణుగోపాల్, ఎంపీడీఓ శంకర్‌నాయక్, పర్వతగిరి సర్పంచ్ చీదురు శంకర్, సీఐ రాజగోపాల్, ఎస్సై బి.ప్రవీణ్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి న్యూశాయంపేట: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి పెట్రోల్‌బంకు కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)అధ్వర్యంలో ఆర్థిక సాధికారతకు ఇందిరా మహిళాశక్తి వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. పెట్రోల్ బంకుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని కోరారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ఎల్డీఎం రాజు, మెప్మా పీడీలు పాల్గొన్నారు.కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
క్షయ రహిత జిల్లా కోసం కృషి చేయాలి
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆత్మకూరు: క్షయ రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాఽధి దినోత్సవం నిర్వహించారు. వివిధ విభాగాల స్పెషలిస్టులతో వైద్య శిబిరం నిర్వహించారు. 630 మంది రోగులకు వివిధ సంస్థల సహకారంతో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండో దశ కార్యక్రమంలో భాగంగా వంద రోజుల క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. హైరిస్క్ ఉన్న గ్రామాల్లో స్క్రీనింగ్ పరీక్షలు విరివిగా జరపాలన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో 25 హైరిస్క్ గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో 252 మందికి నిక్షయ్ పోషణ్ యోజనద్వారా ప్రతీ నెల రూ.1,000 ఆరు నెలల పాటు అందించనున్నట్లు తెలిపారు. జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ.. టీబీ లక్షణాలు, నివారణ మార్గాలను వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నారాయణ, సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరిరాజు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రుబీనా, మండల వైద్యాధికారిణి డాక్టర్ స్పందన, జిల్లా మాస్‌మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జూన్‌లో సూపర్ స్పెషాలిటీ!
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణ ప్రాంతవాసులకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు చేపట్టిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు జెట్‌స్పీడ్‌లో కొనసాగుతున్నాయి. వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో రూ.1,371 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణంలో 400 మంది కార్మికులు మూడు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారు. 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులు ఈ ఏడాది జూన్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో పనులు పూర్తికావొస్తున్నాయి. ఈ పనులు ప్రారంభమైన సరిగ్గా ఐదేళ్లకు అందుబాటులోకి రానున్న ఈ ఆస్పత్రిలో పనిచేసేందుకు డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉందని జిల్లా వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. 1500 పడకల ప్రస్తుత ఎంజీఎం ఆస్పత్రి ఇక్కడికి తరలుతుంది. మరో 500 పడకలు (కార్డియాలాజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్టో ఎంట్రాలాజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) ఏర్పాటుతో రెండువేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనిద్వారా హైదరాబాద్‌కు రెఫరల్ వైద్యం తగ్గి, ఇక్కడే అన్ని వైద్య సేవలు అందనున్నాయి. హైదరాబాద్‌కు వెళ్లనవసరం లేకుండా అవయవమార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే జరగనున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఈ ఆస్పత్రి ప్రారంభం కానుండడం కూడా అధికార పార్టీ కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశముందన్న చర్చ ఉంది. వేలాది మందికి వైద్యసేవలు.. ఉపాధి అవకాశాలు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021 జూన్‌లో ప్రారంభమయ్యాయి. 2022లో ఆకృతి (డిజైన్) మార్చి అంచనా వ్యయం పెంచారు. 2024 మార్చికి అందుబాటులోకి వస్తుందనుకుంటే ప్రభుత్వం మారడం, డిజైన్ల మార్పు, అంచనాల పెంపు, దానిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ తదితర కారణాలతో కాస్త ఆలస్యమయ్యాయి. ఈ నిర్మాణ పనులు మొదలైనా ప్రారంభానికి మాత్రం ముహూర్తం కుదరలేదు. అయితే ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్యనేతలు తరచూ ఈ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడం...వెరసి ఈ ఆస్పత్రి తుది దశ నిర్మాణ పనులు వేగిరంగా సాగుతున్నాయి. జూన్ నాటికి పూర్తి పనులు చేసి ఆస్పత్రి పనులు ప్రారంభించేలా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడంతోపాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశముంది. అందుబాటులోకి రానున్న 24 అంతస్తుల భవనం త్వరలోనే డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఉత్తర తెలంగాణవాసులకు అందనున్న మెరుగైన వైద్యసేవలు -
గ్యాస్.. వ్యాపారం లాస్!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్‌లో గ్యాస్ కొరత, ధరల పెరుగుదల కారణంగా చిన్న, మధ్యతరహా హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలు ఏర్పడి, చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ కొరత ప్రభావం, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరగడం సరఫరాలో ఆలస్యం, బ్లాక్ మార్కెట్ పెరుగుదల కారణంగా చిన్న హోటళ్లు కుదేలవుతున్నాయి. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని 30 శాతం హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు మూసివేశారు. చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం గ్రేటర్ వరంగల్ ట్రైసిటీలో చిరు హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు 6,500 నుంచి 9,000 వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. వీటిని ఆధారం చేసుకుని సుమారు 25 వేల నుంచి 30 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఒక్కో హోటల్, ఫా స్ట్ఫుడ్ సెంటర్లపై సగటున ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఉపాధి పొందుతున్నారు. గ్యాస్ కొరతతో 650 నుంచి 900 వరకు హోటళ్లు, సెంటర్లు మూతపడగా.. 2 వేల నుంచి 2,500 కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కమర్షియల్ ఎల్పీజీ రూ.2 వేలు దాటడం.. అదీ సరిపడా సరఫరా లేని కారణంగా ఒక రోజు నడిస్తే మరో రోజు మూసేయాల్సిన పరిస్థితి. గ్యాస్ కొరత అరికడితేనే.. ట్రైసిటీలో చిన్న హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్, ఇతరత్రా సెంటర్లు నడపాలంటే రోజుకు ఒకటిన్నర నుంచి రెండు సిలిండర్లు అవసరం. ఉదయం టిఫిన్‌కు ఒక సిలిండర్, మధ్యాహ్నం భోజనం వండేందుకు 1 సిలిండర్, సాయంత్రం స్నాక్స్‌కు సగం సిలిండర్ వినియోగించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన త్రినగరిలో రోజుకు సగటున 10 వేల గ్యాస్ సిలిండర్ల వరకు వినియోగిస్తున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ‘రోజువారీ వ్యాపారం పూర్తిగా గ్యాస్ ఆధారితం కావడంతో చిరు వ్యాపారులైన తాము ఎక్కువగా నష్టపోతున్నామని వాపోతున్నారు. చిరు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు4,500 – 6,000 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు 2,000 – 3,000 మొత్తం ఫుడ్ ఔట్లెట్లు 6,500 – 9,000 ఆధారపడిన కుటుంబాలు 25,000 – 35,000 ఒక్కో హోటల్‌పై జీవనాధారం సగటున 4–5 మంది తాత్కాలికంగా మూత పడినవి 650 నుంచి 900 వరకు సంక్షోభం ప్రభావం చూపే కుటుంబాలు సుమారు 2,000–2,500ఉపాధి కోల్పోతున్నాం.. ఫోర్ట్‌రోడ్డు పెట్రోల్ బంక్ జంక్షన్లో 30 ఏళ్లుగా హోటల్, టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాం. వాణిజ్య సిలిండర్ల కొరతతో పది రోజులుగా హోటల్ మూసివేశాం. మా దగ్గర ఐదుగురు కార్మికులు పని చేస్తారు. వారూ ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. మాలాంటి వారి కోసం ప్రభుత్వం ఆలోచించి సిలిండర్లు వచ్చేలా చూడాలి. – సతీశ్ హోటల్ నిర్వాహకుడు, ఖిలావరంగల్‘గ్రేటర్’లో మూతపడుతున్న చిన్న, మధ్య తరహా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కమర్షియల్ బదులు డొమెస్టిక్ వాడితే కేసులు సంక్షోభంలో చిరు వ్యాపారుల కుటుంబాలు ప్రత్యామ్నాయ ఉపాధి లేక ఇబ్బందులుఈ ఫొటోలోని వ్యక్తి పేరు అహ్మద్. హనుమకొండలోని కిషన్‌పురలో టిఫిన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కమర్షియల్ ఎల్పీజీ దొరకక టిఫిన్ సెంటర్‌ను తాత్కాలికంగా మూసేశారు. టిఫిన్ సెంటర్ నడిస్తేనే ఆ కుటుంబం గడిచేది. ఇంట్లో కూడా కట్టెల పొయ్యితో వంట చేసుకుంటున్నారు. ‘కమర్షియల్ సిలిండర్ ఎక్కువ రేట్ అయినా కొందాం అంటే దొరకట్లేదు. ఇంటిల్లిపాదికి ఇబ్బందిగా ఉంది. టిఫిన్ సెంటర్ నడిస్తేనే మాకు ఆదాయం. లేకపోతే కష్టమే’ అని అహ్మద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వరంగల్ స్టేషన్ రోడ్డులో కర్రీపాయింట్ నిర్వహిస్తున్న రమ వంట గ్యాస్ దొరకడం లేదని వారం నుంచి కర్రీపాయింట్ బంద్ పెట్టింది. ఆ తర్వాత కట్టెలతో వ్యాపారం కొనసాగిద్దామని ప్రయత్నించింది. కట్టెల ధరలు సైతం ఎక్కువగా ఉన్నయాని కర్రీ పాయింట్ మూసేసింది. దీంతో చిన్నాచితకా పనులకు వెళ్లాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. వరంగల్ ఫోర్ట్రోడ్డుపై కర్రీపాయింట్ నడుపుతున్న సంపత్‌రావు గ్యాస్ బుక్ చేసినా రాలేదు. ప్రస్తుతం కట్టెల పొయ్యిపై నడిపిస్తున్నాడు. కొరతతో మెనూ సగానికి తగ్గించాడు. గతంలో రోజుకు రూ.2వేల వరకు గిరాకీ అయ్యేది. మెనూలో అన్ని రకాలు లేకపోవడంతో కొనే వారు సైతం తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అంచనా గణాంకాలు (గ్రేటర్ వరంగల్) -
– వివరాలు 8లోu
– సాక్షిప్రతినిధి, వరంగల్ ‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్‌లో ఐదు... మానుకోటలో నాలుగు. జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులో యఽథాతఽథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం... ఆ ప్రకారమే 2029 ఎన్నికలు.. కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా డీలిమిటేషన్ -
రాజీమార్గమే రాజమార్గం
వరంగల్ లీగల్: రాజీమార్గమే రాజమార్గమని.. రాజీ కుదుర్చుకోదగిన కేసులు పరిష్కరించుకుని ప్రశాంతంగా జీవించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, జీఎల్ శ్రీదేవి అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు ఈనెల 28న (శనివారం) వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టులతో పాటు నర్సంపేట, పరకాల కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, పోలీసు, రెవెన్యూ అధికారులతో, వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు, ఇన్సూరెన్స్ సంబంధ, చిట్ ఫండ్ కంపెనీ, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్, వివాహ/కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్, బ్యాంకు, చిట్ ఫండ్, ఎక్సైజ్ కేసులు, ఎలక్ట్రిసిటీ సంబంధ కేసులతో పాటు రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కోర్టుల్లో లేని కేసులను ప్రీ–లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని కోరారు. న్యాయవాదులు, చిట్‌ఫండ్, బ్యాంకు ఇన్సూరెన్స్ అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శులు ఎం.సాయికుమార్, జి.రామలింగం, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో 11 బెంచ్‌లు జిల్లాలో లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించేందుకు వరంగల్ కోర్టులో 9, నర్సంపేట కోర్టులో 2 బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో గుర్తించబడిన కేసుల్లో మొత్తం 1,056 రాజీపడదగు పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో 10 బెంచ్‌లు లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించేందుకు హనుమకొండ కోర్టులో 8, పరకాల కోర్టులో 2 బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే, జిల్లాలో లోక్ అదాలత్‌లో గుర్తించబడిన కేసుల్లో మొత్తం 751 రాజీపడదగు పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి వివరించారు. 28న లోక్ అదాలత్.. సద్వినియోగం చేసుకోవాలి న్యాయమూర్తులు వీబీ నిర్మలాగీతాంబ, జీఎల్ శ్రీదేవి -
రాజీమార్గమే రాజమార్గం
● 28న లోక్ అదాలత్.. సద్వినియోగం చేసుకోవాలి ● న్యాయమూర్తులు వీబీ.నిర్మలా గీతాంబ, జీఎల్.శ్రీదేవివరంగల్ లీగల్: రాజీమార్గమే రాజమార్గమని.. రాజీ కుదుర్చుకోదగిన కేసులు పరిష్కరించుకుని ప్రశాంతంగా జీవించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ.నిర్మలా గీతాంబ, జీఎల్.శ్రీదేవి అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు ఈనెల 28న (శనివారం) వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టులతో పాటు నర్సంపేట, పరకాల కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, పోలీసు, రెవెన్యూ అధికారులతో, వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు, ఇన్సూరెన్స్ సంబంధ, చిట్ ఫండ్ కంపెనీ, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్, వివాహ/కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్, బ్యాంకు, చిట్ ఫండ్, ఎక్సైజ్ కేసులు, ఎలక్ట్రిసిటీ సంబంధ కేసులతో పాటు రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కోర్టుల్లో లేని కేసులను ప్రీ–లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని కోరారు. న్యాయవాదులు, చిట్ ఫండ్, బ్యాంకు ఇన్సూరెన్స్ అధికారులు సహకరించాలని కోరారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శులు యం.సాయికుమార్, జి.రామలింగం, తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలో 10 బెంచ్‌లు లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించేందుకు హనుమకొండ కోర్టులో 8, పరకాల కోర్టులో 2 బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే, జిల్లాలో లోక్ అదాలత్‌లో గుర్తించబడిన కేసుల్లో మొత్తం 751 రాజీపడదగు పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి వివరించారు. -
విద్యారంగానికి బడ్జెట్‌ను 20% పెంచాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం పెంచాలని, విద్యారంగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ యూనియన్ జిల్లాశాఖ అధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యారంగానికి ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన 8.22 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతులు, కంప్యూటర్లు, గ్రంథాలయాలు, ఉపాధ్యాయుల నియామకం, ప్రీ–ప్రైమరీ తరగతుల ప్రారంభం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. 2023 జూలైతో ముగిసిన పీఆర్సీ గడువు 33 నెలలు దాటినా, కొత్త పీఆర్సీపై బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడాన్ని ఖండించారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలకు నిధులు కేటాయించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024 మార్చి తర్వాత రిటైరైన ఉద్యోగుల ప్రయోజనాల చెల్లింపుల్లో జాప్యం వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని విడుదల చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బత్తిని శ్రీమాంజనేయులు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించి మినిమం టైమ్ స్కేలు వర్తింపజేయాలని, సమ్మె కాలపు జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గిరిజన, ఆశ్రమ రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులకు డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్: కేజీబీవీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రంగయ్యనాయుడు, కేజీబీవీల కోఆర్డినేటర్ కొల్లూరి ఫ్లోరిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతగల బాలికలు http://tgrjc.cgg.gov.in లో ఏప్రిల్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఖానాపురం, వర్ధన్నపేట, గీసుకొండలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఐఓఈ) కళాశాలలు ఉన్నాయని వారు తెలిపారు. ఆశవర్కర్లకు అండగా ఉంటాం.. న్యూశాయంపేట: ఆశవర్కర్లకు అండగా ఉంటామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జి.యువరాజు, ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె.లలిత ఆధ్వర్యంలో ఏకశిల పార్కు నుంచి భారీ ప్రదర్శనగా వచ్చి మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు సుదర్శన్‌రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశ వర్కర్లకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనమన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు బి.మంజుల, ఎన్.రవి, పి.రమేశ్, మహేశ్వరి, సంధ్య, లత, అనిత, సాలమ్మ, వసుమతి, మంజుల, సునీత, జ్యోతి, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి ఖిలా వరంగల్: పంటల సాగులో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల, శాస్త్రవేత్తలు శ్రావణ్, మధు, కేవీకే శాస్త్రవేత్త సౌమ్య సూచించారు. ఈమేరకు మంగళవారం వరంగల్ రైతుశిక్షణ కేంద్రంలో రైతులు–శాస్త్రవేత్తల చర్చా గోష్టి నిర్వహించారు. వరంగల్, ఖిలా వరంగల్, గీసుకొండ, సంగెం, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల రైతులు హాజరై పంటల సాగులో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు, సాంకేతిక సలహాలు పొందారు. ముఖ్యఅతిథిగా వారు హాజరై పంటలసాగు, విత్తనాల ఎంపిక, పురుగులు, తెగుళ్ల నియంత్రణ, సమగ్రపంటల సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా జీవనియంత్రణ పద్ధతులు, సమగ్ర పురుగు మందుల నిర్వహణ, మట్టి పరీక్షల ప్రాముఖ్యత, అధిక దిగుబడులు సాధించే ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై ప్రదర్శనలు, చర్చ నిర్వహించారు. వర్ధన్నపేట ఏడీఏ నర్సింగం, బయోకంట్రోల్ ల్యాబ్ ఏడీఏ మాధవి, వరంగల్ మండల వ్యవసాయాధికారి రవీందర్‌రెడ్డి, ఏఈఓ ఆశాదీప్, రైతులు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి కనకాంబరాలతో పుష్పార్చన నిర్వహించారు. ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేద పాఠశాల విద్యార్థులు కనకాంబరాలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు పాలకుర్తి శ్రీనివాస్‌గౌడ్, కృష్ణవేణి ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. జానకీరాముడిగా అలంకరణ వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం సీతారాములకు లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు జరిపి రాముల వారి ఉత్సవ విగ్రహాన్ని జానకీ రాముడిగా అలంకరించారు. అనంతరం 11 మంది వేద పండితులు పాల్గొని లక్ష శ్రీరామ నామాలు పఠించారు. -
ఆదాయం అదరహో..
ఖానాపురం: మునగ సాగు రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని గడించవచ్చని నిరూపిస్తున్నారు రైతులు. మునగకాయలకు మార్కెట్లో ధరలు సైతం అధికంగానే ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత పంటల సాగులో జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. రైతులు ఎక్కువగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. జిల్లాలో వరి, మక్కజొన్న, పత్తి, మిర్చితో పాటు కూరగాయల పంటలను సైతం అధికంగానే సాగు చేస్తుంటారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలో 112 ఎకరాల్లో రైతులు మునగకాయ పంటలను సాగు చేస్తున్నారు. ఒక ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు పెట్టుబడి అవుతుంది. 3.5 నుంచి 1.5 మీటర్ల దూరంతో మునగ మొక్కలు నాటుకున్నారు. ప్రధానంగా మునగ రెండు సంవత్సరాల కాలపు పంట. 6 నెలల నుంచి 8 నెలల కాలపరిమితిలో మొదటి దఫా దిగుబడి వస్తుంది. ఆ తర్వాత మూడు ఫీట్ల వరకు కొమ్మలను కత్తిరించుకోవాలి. దీంతో సైడ్ కొమ్మలు వచ్చి రెండో దశ దిగుబడి మూడు నెలల వ్యవధిలోనే వస్తుంది. మొదటి దశ కంటే రెండో దశలోనే దిగుబడి అధిక మొత్తంలో వస్తుంది. సాగులో రైతులు డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. డ్రిప్ విధానం ద్వారా పంటలకు కావాల్సిన నీరు, ఎరువులు, రసాయనాలను నేరుగా మొక్కలకే అందుతుంది. మునగలో రైతులు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను గడిస్తున్నారు. రెండు సంవత్సరాల తర్వాత పంటను తొలగించాల్సి ఉంటుంది. రైతులకు సిరులు కురిపిస్తున్న మునగసాగు ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి.. రూ.లక్ష వరకు రాబడి జిల్లాలో 112 ఎకరాల్లో పంటసాగుమునగసాగు ఎకరాల్లో.. మండలం సాగు చెన్నారావుపేట 10 నెక్కొండ 5 ఖానాపురం 2 నర్సంపేట 15 నల్లబెల్లి 5 దుగ్గొండి 20 వర్ధన్నపేట 5 పర్వతగిరి 10 రాయపర్తి 5 సంగెం 10 గీసుకొండ 25 మొత్తం 112ఎకరంలో రూ.లక్ష ఆదాయంనాకున్న ఎకరం భూమిలో మునగ పంటను సాగు చేశా. జూలై నెలలో పంట వేయగా డిసెంబర్ మొదటి వారంలో దిగుబడి వచ్చింది. మరోసారి జూన్‌లో కత్తిరింపు (ఫూనింగ్) చేపట్టాను. సెప్టెంబర్‌లో రెండోసారి దిగుబడి వచ్చింది. రెండు సంవత్సరాల వ్యవధిలో లక్ష రూపాయల ఆదాయాన్ని పొందాను. మునగ పంటలో అంతర పంటగా కూరగాయలను సైతం సాగు చేసుకున్నాను. కూరగాయల సాగుతో రూ.1,60,000 ఆదాయం వచ్చింది. డ్రిప్ విధానంతో స్థిరమైన ఉత్పత్తి సాధ్యమైంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చింది. – సత్తూర్ అజయ్, చంద్రుగొండ, నెక్కొండ మండలం ఆధునిక పద్ధతులతో లాభాలురైతులు ఆధునిక పద్దతులు అవలంబిస్తే అధిక లాభాలు పొందవచ్చు. ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సాగు కోసం రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీలు, పథకాలు ఇస్తోంది. మునగ సాగులో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. – తరుణ్, ఉద్యానశాఖ అధికారి, ఖానాపురంమార్కెట్లో మునగకు మంచి ధరలు మునగకాయలకు మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయి. రైతులు వ్యాపారులకు కిలో రూ.70 నుంచి రూ.150 విక్రయిస్తున్నారు. ఆ తర్వాత మార్కెట్లో వ్యాపారులు ప్రజలకు రూ.50కి నాలుగు కాయల చొప్పున విక్రయిస్తున్నారు. గత నెలలో రైతులు కిలో రూ.150 వరకు విక్రయించడంతో మార్కెట్లో మునగకాయల ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులకు రైతులు రూ.70కి పైగా విక్రయిస్తున్నారు. వీటితో పాటు రైతులు మునగసాగులో అంతరపంటగా కూరగాయల సాగు సైతం చేసుకొని లాభాలు పొందుతున్నారు. -
పన్ను వసూళ్లలో వేగం పెంచండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వరంగల్ అర్బన్: క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లలో వేగం పెంచాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం నగర పరిధి 54వ డివిజన్ పరిధి కేయూసీ రోడ్డు సమీపంలో కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పన్ను వసూళ్ల తీరును పరిశీలించారు. అనంతరం గృహ వినియోగదారుడు చెల్లించిన పన్ను సంబంధ రసీదును కలెక్టర్ చెల్లింపుదారుడికి అందించారు. కార్యక్రమంలో ఆర్ఐ నరేశ్, వార్డు ఆఫీసర్ జెస్సీ ప్రియదర్శిని, బిల్ కలెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పునర్విభజనలో మరో తొమ్మిది!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మళ్లీ చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభనకు సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన బిల్లు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. మహిళలకు రిజర్వేషన్లు, డీలిమిటేషన్ చట్టాలకు సవరణ చేయనుందని ప్రకటించారు. ఆ వెనువెంటనే డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌లో పెరిగే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలపై చర్చ జరుగుతోంది. పునర్విభజన జరిగితే ఉమ్మడి వరంగల్‌లో కొత్తగా దాదాపుగా 9 నియోజకవర్గాలు ఏర్పడనునున్నాయి. దీంతో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 21కి చేరనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనల ప్రకారం 2021లో జరగాల్సి ఉండగా.. జనగణన ఆలస్యం కారణంగా నిలిచిపోయింది. కేంద్రం మళ్లీ జనగణనకు శ్రీకారం పూర్తికాగానే నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కొత్తగా తొమ్మిది పెరిగే అవకాశం.. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరలో నియోజక వర్గాలను పునర్ వ్యవస్థీకరించారు. అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత ఒక్కటి పెరిగి ఆ సంఖ్య 12 నియోజకవర్గాలకు చేరింది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో రెండు (వరంగల్ పశ్చిమ, పరకాల), వరంగల్‌లో మూడు (వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట), జనగామలో మూడు (జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి), మ హబూబాబాద్‌లో రెండు (మహబూబాబాద్, డోర్నకల్), జేఎస్ భూపాపల్లిలో ఒకటి (భూపాలపల్లి), ములుగులో ఒకటి (ములుగు) ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 35.12 లక్షలున్న జనాభా.. ప్రస్తుతం అది 41.50 లక్షలు దాటి ఉంటుందని అంచనా. జనగణన పూర్తయితే 2027 జనాభా ప్రకారం పునర్విభజనలో ఉమ్మడి జిల్లాలో దాదాపు తొమ్మిది కొత్త నియోజకవర్గాలు రానున్నాయి. దాంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 21కి పెరిగే అవకాశం ఉంది.‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్‌లో ఐదు... మానుకోటలో నాలుగు... జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులో యథాతథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం... ఆ ప్రకారమే 2029 ఎన్నికలు... కేంద్రం కసరత్తు నేపథ్యంలో డీలిమిటేషన్ చర్చనీయాంశంజిల్లా నియోజకవర్గాలు మొత్తం ప్రస్తుతం పెరగనున్నవి జనాభా నియోజక వర్గాలు హనుమకొండ 02 04 10,80,858 06 వరంగల్ 03 02 8,90,651 05 జేఎస్ భూపాలపల్లి 01 01 4,16,763 02 జనగామ 03 00 5,66,376 03 మహబూబాబాద్ 02 02 77,45,49 04 ములుగు 01 00 25,77,44 01 12 09 39,87,241 21 -
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
నా భర్త పడకంటి రమేష్ ఎంజీఎం బ్లడ్‌బ్యాంక్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా 2004 నుంచి 2025 వరకు కాంట్రాక్ట్ బేసిస్‌లో విధులు నిర్వర్తించాడు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ నియామకాల్లో ఎంహెచ్ఎస్ఆర్బీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ –2 ఉద్యోగానికి ఆయన ఎంపికయ్యాడు. ఈ సంవత్సరం జనవరి నెలలో 27న బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించాడు. మరణించిన మూడు రోజుల తర్వాత డీఎంఈ కార్యాలయం, హైదరాబాద్ నుంచి పోస్టు ద్వారా ఉద్యోగానికి ఎంపికై నట్టు ప్రభుత్వ ఉత్తర్వు వచ్చింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. విద్యార్హతను బట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించండి. – పడకంటి పద్మశ్రీ, శంభునిపేట, వరంగల్ పారదర్శకత పాటించాలి ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందించే వాహన స్కీం మంజూరులో పారదర్శకత పాటించాలి. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో గ్రామ కమిటీ, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర అన్యాయం జరిగింది. న్యాయం కోసం ఎస్సీ కమిషన్‌ను సంప్రదించా. ప్రస్తుతం ఆ కేసు ఎస్సీ కమిషన్ విచారణలో ఉంది. నేను హైదరాబాద్‌లో జోమాటో డెలివరీ పార్టర్న్గా పనిచేస్తున్నా. – బిర్రు సురేందర్, అప్పల్రావుపేట, నెక్కొండ -
కోడలు నన్ను పోషించడం లేదు
నాకు 77 సంవత్సరాలు. నా భర్త మరణించాడు. నాకు వారసత్వంగా వచ్చిన 5 ఎకరాలను నా కుమారుడికి ఇచ్చా. నా కుమారుడు ఆర్టీసీ ఉద్యోగి. దురదృష్టవశాత్తు అతడు మరణించాడు. ఆ తర్వాత పింఛన్‌తో పాటు భూమిని నా కోడలు తీసుకుని నన్ను వేధిస్తోంది. నా పోషణ నిమిత్తం న్యాయం చేయాలి. – ఎన్.పద్మ, మందపల్లి, గిర్నిబావి ఎండ తీవ్రతతో అంగన్వాడీల సమయాన్ని మార్చాలి అద్దె భవనాల్లో సరైన వసతులు లేవు. ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఈ క్రమంలో అంగన్ వాడీ కేంద్రాల సమయాన్ని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మార్చాలి. మే 1వ తేదీ నుంచి 31 వరకు టేక్‌హోం రేషన్ ఇచ్చే విధంగా అనుమతి ఇవ్వాలి. – అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్, వరంగల్ జిల్లా -
ఆలకించి.. ఆదేశించారు!
న్యూశాయంపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి కలెక్టర్ సత్యశారద అర్జీలు స్వీకరించారు. అనంతరం, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొన్ని సమస్యలను దరఖాస్తు దారుల సమక్షంలోనే సంబంధిత అధికారులతో చర్చించి కలెక్టర్ సత్యశారద పరిష్కరించారు. పరిష్కారం కాని సమస్యలుంటే అందుకు గల కారణాలను సంబంధిత దరఖాస్తుదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. కాగా, ప్రజావాణికి మొత్తం 127 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 50, జీడబ్ల్యూఎంసీ 16, ఇతర శాఖలకు సంబంధించినవి 61 దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లావైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌లో వైద్యశిబిరం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమం ఆలస్యం కావడంతో దరఖాస్తుదారులకు అరటి పండ్లు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యశారద సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం -
కలెక్టరేట్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి
● భవన సముదాయాన్ని సందర్శించిన కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్ పాత ఆజంజాహి మిల్ మైదానంలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని కలెక్టర్ సోమవారం సందర్శించారు. సముదాయంలోని మూడు అంతస్తుల నిర్మాణ పనులు పూర్తై న నేపథ్యంలో వివిధ శాఖలకు గదుల కేటాయింపునకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, రోడ్లు భవనాల శాఖ జిల్లా అధికారి రాజేందర్, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మ్యాపింగ్‌కు రాజకీయ పార్టీలు సహకరించాలి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) మ్యాపింగ్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవ వర్గాలకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, గుర్తింపు పొందిన వివిధ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎన్నికల విభాగం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ రంజిత్, రాజకీయ పార్టీల నాయకులు ఫైజుద్దీన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత న్యూశాయంపేట: అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద గుర్తుచేశారు. నేటి విద్యార్థుల్లో పెరుగుతున్న పర్యావరణ చైతన్యం భవిష్యత్‌కు ఆశాజనకమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ సంక్షేమ గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సృజనాత్మకత చిత్రాలను కలెక్టరేట్లో ప్రదర్శించారు. ముఖ్యంగా కరీమాబాద్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిత్రలేఖనంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు నోట్‌బుక్స్, పెన్నులు, ప్రశంస పత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
అన్ని షోరూంల్లో లాంఛనంగా అమల్లోకి..
ఖిలా వరంగల్ : వాహన వివరాలు ఇకనుంచి వాహన్ పోర్టల్‌లో కనిపించనున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త వాహనాలు, లైసెన్సులు తదితర సేవలను వాహన్ పోర్టల్‌లో అందిస్తుండగా.. హైదరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా వాహన్ పోర్టల్ సేవలను సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ డీటీసీ సురేశ్‌రెడ్డి పర్యవేక్షణలో వాహన షోరూంలలో ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. గతంలోనే వాహన్ పోర్టల్‌పై షోరూంల యజమానులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. కాగా, ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తయితే వాహనదారులకు మరిన్ని సౌకర్యాలు అందనున్నాయి. సేవలు అందేదిలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు రవాణాశాఖ సేవలు ఇకనుంచి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి న వాహన్ పోర్టల్ ద్వారా అందనున్నాయి. ప్రధానంగా లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, వాహన బదిలీలు, ఎన్ఓసీలు, ఫిట్నెస్, పర్మిట్, బీమా, ఇంజిన్ ఛాసిస్ నంబర్ వంటి సమాచారం ఈ పోర్టల్ ద్వారా అందుతాయి. పూర్తి పారదర్శకంగా సేవలు నమోదవుతాయి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా వాహన వివరాలు పరిశీలించే అవకాశం ఉంటుంది. వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించినప్పుడు ఫీజు ఆన్లైన్లో చెల్లిస్తే కూర్చున్న చోట నుంచే తేలికగా ఆయా రాష్ట్రాలకు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. వాహన పోర్టల్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతీ షోరూం సోమవారం అనుసంధానమైంది. తద్వారా ఏ రోజు విక్రయించిన వాహనాలు ఆ రోజే పోర్టల్‌లో నమోదవుతాయి. అలాగే, వాహనాల కొనుగోలుకు రుణం ఇచ్చే బ్యాంకులను అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియతో బోగస్ ఫైనాన్స్ సంస్థల ఆటకు అడ్డుకట్ట వేసినట్లయింది.వరంగల్ ఆర్టీఏ కార్యాలయంజిల్లాల వారీగా వ్యక్తిగత వాహనాల వివరాలుజిల్లాలు ద్విచక్ర కార్లు / షోరూంలు వాహనాలు జీపులు వరంగల్ 1,85,865 24,791 23 హనుమకొండ 2,16,234 48,513 26 జనగామ 61,036 8,537 12 జేఎస్ భూపాలపల్లి 95,681 11,258 7 ములుగు 4,433 3,767 2 మహబూబాబాద్ 1,23,103 9,096 17షోరూంల్లో పారదర్శకంగా సేవలు కొనుగోలు చేసిన వ్యక్తిగత వాహనాలన్నీ సోమవారం మధ్యాహ్నం వాహన షోరూంల్లో వాహన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అప్డేట్ చేశారు. వాహన్ పోర్టల్ పూర్తిస్థాయిలో అమలుల్లోకి వచ్చింది. కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం లభించింది.వాహన్ పోర్టల్ సేవలు పక్కాగా అమలుదేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన్ పోర్టల్ సేవలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వాహన షోరూంల్లో వాహన్ పోర్టల్ సేవలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఇక నుంచి షోరూంల్లో వాహనదారులకు పారదర్శకంగా సేవలందుతాయి. ఎలాంటి జాప్యం ఉండదు. – సురేశ్‌రెడ్డి, డీటీసీ, వరంగల్ ఆర్టీఏ సేవలన్నీ ఇక ఆన్లైన్లోనే.. దేశవ్యాప్తంగా ఒకే విధానం -
డౌన్ సిండ్రోమ్ పిల్లలకు ప్రేమ, సహనం అవసరం
హన్మకొండ అర్బన్: డౌన్ సిండ్రోమ్ అనేది లోపం కాదు.. అది ప్రత్యేక పరిస్థితి మాత్రమే అని సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు ప్రేమ, సహనం, సరైన శిక్షణ అందిస్తే సమాజంలో ఉన్నత స్థానం సంపాదించగలరని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వీరిపై సానుభూతి, గౌరవంతో వ్యవహరించాలని సూచించారు. డౌన్ సిండ్రోమ్ పిల్లలపై సమాజంలో సానుకూల ధృక్పథం పెంపొందించడం, వారికి సమాన అవకాశాలు కల్పించడం బాధ్యతగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు బండ రామలీల, కొడం కళ్యాణ్, ప్రొఫెసర్ పద్మ, డౌన్ సిండ్రోమ్ పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బీఎడ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలివరంగల్ క్రైం: ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వి నియోగం చేసుకోవాలని, రాజీపడే కేసులను పరిష్కరించుకోవాలని సీపీ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, ఆస్తి, కుటుంబపరమైన, వైవాహిక, బ్యాంకు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీపడే మార్గముంటే కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు. -
సేవలు షురూ
వరంగల్మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026కోర్టుకు బాంబు బెదిరింపు ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో 25 చిన్న ౖసైనెడ్ గ్యాస్ బాంబులను సోమవారం పేల్చనున్నట్లు కోర్టుకు మెయిల్ చేశారు. వాహన్ పోర్టల్ఎయిడ్స్ నియంత్రణకు కృషి చేయాలి గీసుకొండ: ఎయిడ్స్ నియంత్రణలో జిల్లాను ముందు వరుసలో నిలపడానికి వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అరుణ్‌జోషి సూచించారు. ఎయిడ్స్ నిర్మూలన అందరి బాధ్యత అనే అంశంపై సంబంధిత సిబ్బందికి వరంగల్ నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గర్భిణులకు మొదటి మూడు నెలలలోపు ఎయిడ్స్ సిఫిలిస్, హెచ్‌బీఎస్ ఏజీ వందశాతం జరిగేలా చూడాలన్నారు. ఎయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ మేనేజర్ స్వప్న మాధురి, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, నాకో ప్రతినిధి సెల్వం, ఎంజీఎం, నర్సంపేట, వర్ధన్నపేట ఐసీటీఎస్ సిబ్బంది, ఎన్జీఓలు పాల్గొన్నారు. ఇంగ్లిష్ పరీక్షకు 99.91శాతం హాజరు కాళోజీ సెంటర్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలో భాగంగా సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 99.91 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. మొత్తం 9,383 విద్యార్థులకు 9,375 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ప్రైవేట్ అభ్యర్థులు మొత్తం 19 మంది కాగా, 18 మంది పరీక్షకు హాజరైనట్లు వివరించారు. హనుమకొండలో 99శాతం..విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన టెన్త్ ఇంగ్లిష్ పరీక్షకు 99.86శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా 64 కేంద్రాల్లో జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 12,047మంది విద్యార్థులకుగాను 12030మంది హాజరయ్యారని, 17మంది గైర్హాజరయ్యారని డీఈఓ ఎల్వి గిరిరాజ్‌గౌడ్ తెలిపారు. డీఈఓ ఆరు కేంద్రాలు, అసిస్టెంట్ కమిషనర్ భువనేశ్వరి నాలుగు కేంద్రాలను, నాలుగు ఫ్లయింగ్స్క్వాడ్ల బృందాలు 25 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 26న మెగా జాబ్‌మేళా నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 26న నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాను జిల్లాలోని డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు, అర్హులైన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ మల్లం నవీన్ సూచించారు. ఈ మేరకు కళాశాల ఆవరణలో జాబ్‌మేళా కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరిన్ని వివరాలకు 98491 51377, 99480 48349, 94931 27804 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ కంపెనీ హెచ్ఆర్లు సుధీర్, సందీప్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, అకాడమీ కో ఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎంఎంకే రహీమొద్దీన్, అధ్యాపకులు డాక్టర్ సోమయ్య, డాక్టర్ రాంబాబు, డాక్టర్ భద్రు, డాక్టర్ రాజీరు, దివ్య తదితరులు పాల్గొన్నారు. రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ ● మొదటి విడతలో ఎకరానికే.. ● రైతు ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ ఖిలా వరంగల్: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం నిధులను రైతుల ఖాతాల్లో వేసింది. తొలి విడతలో ఎకరానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో సోమవారం నగదు జమ చేసింది. రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి కేవలం ఒక ఎకరానికే రూ.6 వేల చొప్పున జమ చేసింది. దీంతో ఒకటి కంటే ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు విడతల వారీగా రైతు భరోసా సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ వేయనుంది. జిల్లాలో యాసంగి పంటకు 1,55,169 మంది రైతులకుగాను 1,26,590 ఎకరాలకు ఎకరానికి రూ.6 వేలు చొప్పున పెట్టుబడి సాయం కింద మొత్తం రూ.75,95,40,280 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. రానున్న రోజుల్లో 1,45,510 ఎకరాలకు రూ.8,73,060 కోట్లు జమ చేయాల్సి ఉంది.స్వచ్ఛ ఆటోలకు మైకులు తప్పనిసరివరంగల్ అర్బన్: స్వచ్ఛ ఆటోలకు మైకులు తప్పనిసరిగా అమర్చేలా చూడాలని మేయర్ గుండు సుధారాణి శానిటేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 24వ డివిజన్లో ఆకస్మికంగా పర్యటించిన మేయర్, శానిటేషన్ నిర్వహణ తీరును పరిశీలించారు. శుభ్రత కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచనాలు చేశారు. ఈసందర్భంగా చెత్త సేకరణకు వచ్చే స్వచ్ఛ ఆటోలు తమ ప్రాంతానికి వచ్చినప్పుడు సమాచారం అందడం లేదని స్థానికులు మేయర్‌కు ఫిర్యాదు చేశారు. -
సత్వర వైద్యసేవలతో టీబీకి చెక్
సరిగా అందని సహాయం టీబీ రోగులకు కేంద్ర ప్రభుత్వం నిక్షయ్ పోషన్ యోజన కింద నెలకు రూ.వెయ్యి చొప్పున ఆరు నెలల పాటు రూ.6 వేల సహాయం అందిస్తుంది. అయితే గతేడాది ఈ పథకం కింద జిల్లాకు రూ.12 లక్షల నిధులు రాగా, 193 మందికి పంపిణీ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగా విడుదల చేయకపోవడంతో అర్హులైన రోగులకు ఆర్థిక సహాయం అందడం లేదని బాధితులు వాపోతున్నారు.● జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలు ● గతేడాది 1,263, ఈ ఏడాది ఇప్పటివరకు 298 పాజిటివ్ కేసులు ● ఆరు నెలల పాటు చికిత్స పొందితే జబ్బు నయం నేడు ప్రపంచ క్షయ (టీబీ) వ్యాధి నివారణ దినోత్సవంగీసుకొండ: దగ్గు, తుమ్ముల ద్వారా క్షయ వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నా వ్యాధిగ్రస్తులు ఆరు నెలల పాటు సరైన చికిత్స పొందితే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. వాడుక భాషలో టీబీ (ట్యూబర్క్యులోసిస్)గా పిలిచే క్షయ వ్యాధి ప్రాణాంతకమే అయినా దీని నివారణకు సరైన చికిత్స విధానం ఉంది. ఇది మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అలాగే వెన్నెముక, మెదడు, మూత్రపిండాలు తదితర అవయవాలపై కూడా దీని ప్రభావం ఉంటుందని వైద్యులు అంటున్నారు. క్షయ వ్యాధి లక్షణాలు దగ్గు, జ్వరం రావడం, ఆకలి సరిగా లేకపోవడం, బరువు తగ్గడం, రక్తంతో కూడిన దగ్గు రావడం, రాత్రి పూట చెమటలు పట్టడం, కఫంలో రక్తం పడడం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి ఉంటే అలాంటి వారు తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న పిల్లలు, వృద్ధుల్లో టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, కిడ్నీ, హెచ్ఐవీ వ్యాధులతో బాధపడేవారికి టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్షయ వ్యాధి ఒకరినుంచి వేరొకరికి సంక్రమించే అవకాశం ఉంది. అందువల్ల తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్యులు చెబుతున్నారు. వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వెలుతురు ఉన్న గదుల్లో జీవించాలని, మూసి ఉన్న చీకటి గదుల్లో బ్యాక్టీరియా సులభంగా వ్యాపించే ప్రమాదం ఉందని అంటున్నారు. వ్యాధి సోకిన వారితో ఇతర వ్యక్తులు కలిసి ఉండటం, నిద్రించడం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు క్షయ వ్యాధి నిర్ధారణకు కఫం పరీక్ష చేస్తారు. ఊపిరితిత్తుల నుంచి కఫాన్ని సేకరించి సీబీనాట్, ట్రూనాట్ అనే రెండు రకాల పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలను బయట చేయించుకుంటే ఒక్కో దానికి సుమారు రూ.3 వేల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో అయితే ఉచితంగా చేయించుకోవచ్చని వైద్యాధికారులు తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారు క్రమం తప్పకుండా కనీసం 6 నుంచి 9 నెలల వరకు వైద్యుల సలహా మేరకు టీబీ నివారణ మందులు తీసుకుంటూ ఉండాలి. యాంటీ బయాటిక్స్ ఐసోనియాజిడ్, పిఫాంపిన్, ఇతాంబుటోల్, పిరజినైమైడ్ మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలు జిల్లాలోని ఎంజీఎం వద్ద గల టీబీ సెంటర్, నర్సంపేట మెడికల్ కళాశాలలోని టీబీ సెంటర్, వర్దన్నపేటలోని సీహెచ్‌సీలో టీబీ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 73,990 మందికి పరీక్షలు చేయగా 1,263 మందికి టీబీ నిర్ధారణ అయింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 3,800 మందికి పరీక్షలు చేయగా 298 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 875 మంది టీబీ సోకిన వారు చికిత్స పొందుతున్నారు. ఈ విభాగానికి జిల్లా ప్రోగ్రాం అధికారిగా డాక్టర్ అరుణ్‌కుమార్ జోషి వ్యవహరిస్తున్నారు. -
భూమి హక్కు పత్రాలు అందించాలి
మాది ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ గ్రామం. మేము 40 మంది కుటుంబ సభ్యులం. నాకు ఇప్పుడు 75 ఏళ్లు. గత కొన్నేళ్లుగా గ్రామంలోని భూమిని దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. మాకు ఇప్పటి వరకు ఆ భూమిపై హక్కు పత్రాలు లేవు. మా తాత ముత్తాతల నుంచి ధ్రువీకరణ పత్రాలను అన్ని శాఖలకు అందించాం. న్యాయం చేయాలని హైకోర్టు చుట్టూ తిరిగాం. జడ్జిమెంట్ కాపీలను కూడా అధికారులకు అందించాం. మా సమస్యను పరిష్కరించాలని గత సంవత్సరం ఆగస్టులో కలెక్టర్ ఆదేశించినా సంబంధిత అధికారులు పెడచెవిన పెట్టారు. – మహ్మద్ సమద్, కుటుంబ సభ్యులు, అశోక్‌నగర్ -
వేతన వెతలు!
● ఉపాధి కూలీలకు అందని డబ్బులు ● రెండు నెలలుగా ఎదురుచూపులు ● జిల్లాలో రూ.5.13 కోట్లకు పైగా బకాయిలునల్లబెల్లి: వలసలు నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతోంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి వందరోజుల పనిదినాలు కల్పిస్తుంది. చేసిన పని ఆధారంగా గరిష్టంగా ఒక్కొక్కరికి రోజుకు రూ.307 చొప్పున చెల్లిస్తున్నారు. స్థానికంగానే పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రారంభంలో కూలీలకు ఎంతగానో ఉపయోగపడింది. రానురాను పథకంలో మార్పులు చేయడం.. ఇందులో నిబంధనలకు లోబడి వేతనాలు సరైన సమయంలో విడుదల చేయకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందడంలేదు. పనులు చేసినా పస్తులుండే పరిస్థితి వచ్చిందని కూలీలు వాపోతున్నారు. రెండు నెలలుగా కూలీ డబ్బులు అందకపోవడంతో కుటుంబం గడిచే పరిస్థితి లేదని అంటున్నారు. నిలిచిన వేతనాలు ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలకు పని చేసిన 21 రోజుల్లోనే వేతనాలు చెల్లించాలి. కానీ జనవరి 17 నుంచి ఇప్పటి వరకు కూలీలకు వేతనాలు అందలేదు. జిల్లాలో 11 మండలాల్లో 24,904 కుటుంబాలు కూలీలు పనులు చేస్తున్నారు. వీరికి 1,88,000 పని దినాలకు సంబంధించిన సుమారు రూ.5.13 కోట్ల వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కూలీలు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.పక్క ఫొటోలో కనిపిస్తున్న మహిళ నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఈసం యాకమ్మ. గత ఫిబ్రవరి, మార్చి నెలలో ఐదు వారాల పాటు ఉపాధి హామీ పనికి వెళ్లింది. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో కుటుంబం గడవటం ఇబ్బందిగా మారింది. ఈ సమస్య యాకమ్మ ఒక్కరిదే కాదు.. జిల్లావ్యాప్తంగా ఉపాధి పని చేస్తున్న కూలీలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ●వేతనాలు చెల్లించాలిఉపాధి హామీ పనులకు సంబంధించిన కూలీలకు వేతనాలు పెండింగ్‌లో ఉండడంతో చాలా కష్టమవుతోంది. కూలీ డబ్బులు ఎ ప్పుడు వస్తాయని సిబ్బందిని అడిగితే ఎవరు సమాధానం ఇవ్వడంలేదు. వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలి. – కనుకం సాల్మొన్, ఉపాధి కూలీ, నల్లబెల్లి చర్యలు తీసుకుంటాం..ఉపాధి హామీ కూలీలకు వేతనాలు నిలిచిపోయిన మాట వాస్తవమే. కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. త్వరలోనే కూలీలందరికీ వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. – రాంరెడ్డి, ఇన్చార్జ్ డీఆర్డీఓ మండలం పని చేసిన పని దినాలు కుటుంబాలుచెన్నారావుపేట 2,515 16,647 దుగ్గొండి 2,566 20,049 గీసుకొండ 1,671 15,169 ఖానాపురం 1,926 16,105 నల్లబెల్లి 2,551 22,739 నర్సంపేట 1,643 13,191 నెక్కొండ 1,237 10,009 పర్వతగిరి 2,907 23,227 రాయపర్తి 2,340 18,164 సంగెం 3,945 34,980 వర్ధన్నపేట 1,655 14,725 మొత్తం 24,906 2,05,005 -
ఉపకారికి ఆపద !
హన్మకొండ అర్బన్: ఆపదలో ఆదుకునే అత్యవసర సేవకులకు కష్టమొచ్చింది. ఏడు నెలలుగా సిబ్బందికి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. కుయ్.. కుయ్..మంటూ ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలిస్తూ ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్న అత్యవసర సేవల ఉద్యోగులకు వేతనాలకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయట్లేదు, సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108, 102 అంబులెన్స్ సిబ్బంది గతేడాది ఆగస్టు నుంచి 2026, ఫిబ్రవరి వరకు సుమారు ఏడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడంతో వేతనాలు నిలిచిపోయాయని, వెంటనే బడ్జెట్ విడుదల చేసి పెండింగ్ జీతాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సేవలు తెలంగాణలో సుమారు 625 వరకు 108 అంబులెన్స్ వాహనాలు పనిచేస్తుండగా, వాటిలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (ఈఎంటీ), పైలట్లు, సపోర్ట్ సిబ్బంది కలిపి దాదాపు 3,000 మంది సేవలందిస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు సేవలందించే 102 అంబులెన్స్ వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 185 ఉన్నాయి. వీటిలో సుమారు 250 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. పార్థివ వాహన సేవలకు ఇబ్బందులు ఆస్పత్రుల్లో మరణించిన వ్యక్తుల పార్థివ దేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఉపయోగించే పార్థివ వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 ఉన్నాయి. వీటిలో దాదాపు 180 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. జీతాలు అందక ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 70 వరకు 108 అంబులెన్స్ వాహనాలు, 10 వరకు 102 అంబులెన్స్ వాహనాలు, అదేవిధంగా 4 పార్థివ వాహనాలు పని చేస్తున్నాయి. వీటిలో సుమారు 320 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే వైద్య సేవలు అందించేందుకు వీరు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. నిర్వహణ భారం.. బడ్జెట్ విడుదల అవ్వకపోవడంతో అంబులెన్‌్స్ వాహనాల నిర్వహణ కష్టంగా మారింది. ప్రతీ రోజు డీజిల్ ఖర్చులు, వాహనాల మరమ్మతులు, అంబులెన్్స్లలో అవసరమైన మందులు సమకూర్చడం వంటి అంశాల్లో వ్యయభారం పెరిగిందని సిబ్బంది చెబుతున్నారు. దీంతో అత్యవసర సేవలను నిరంతరాయంగా కొనసాగించడం కూడా సవాల్‌గా మారిందని వారు పేర్కొంటున్నారు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో పాటు పని ఒత్తిడి అధికమవుతుండడంతో ఈ రంగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు క్రమంగా విధులు వదులుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారం, నిరంతర పని ఒత్తిడి వంటి కారణాలతో ఉద్యోగులు ఈ రంగంలో కొనసాగేందుకు నిరాసక్తత చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల అంబులెన్స్ సేవల్లో ఉద్యోగుల కొరత కూడా పెరుగుతోందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బడ్జెట్ విడుదల చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని 108, 102, పార్థివ వాహనాల సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. పని ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకుని సకాలంలో జీతాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 108, 102 అంబులెన్స్ సిబ్బందికి 7 నెలల జీతాలు బకాయి బడ్జెట్ విడుదల చేయాలని వినతి అసలే పనిభారం.. ఆపై వేతనాలు లేవు డీజిల్... మరమ్మతులకు నిధులు కరువు -
వైద్యం వ్యాపారం కాదు.. మానవసేవ
● వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ధర్మసాగర్: వైద్యం వ్యాపారం కాదు.. మానవసేవ అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో కూరపాటి ఫౌండేషన్ సహకారంతో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు ఎంపీ స్వయంగా పలు వైద్యపరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ కూరపాటి ఫౌండేషన్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మండలాల వారీగా వైద్యశిబిరాలు నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం 30–40 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన తర్వాత కనిపించే ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తక్కువ వయసులోనే వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ఉప సర్పంచ్ కొమురమ్మ, సాయిపేట సర్పంచ్ ఆడాలి లక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, కూరపాటి ట్రస్ట్ చైర్మన్ కూరపాటి రమేశ్, డాక్టర్ సుష్మిత తదితరులు పాల్గొన్నారు. -
మక్కలకు లేదు ‘మద్దతు’
● పరిశీలనలోనే కేంద్రాల ఏర్పాటు.. ప్రారంభంకాని కొనుగోళ్లు ● కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,400.. వ్యాపారుల ధర రూ.1,950 ● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 3.43 లక్షల ఎకరాల్లో సాగు ● అసెంబ్లీలో ఈనెల 18న చర్చ.. మంత్రి ఆదేశించినా పురోగతి లేదు ● మొక్కజొన్న రైతుకు తప్పని దళారుల బెడదసాక్షిప్రతినిధి, వరంగల్: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా మొక్కజొ న్న రైతులకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకడం లే దు. యాసంగి మక్కల కొనుగోళ్ల కోసం ప్రతీసారి మార్చి మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే మార్క్‌ఫెడ్, ‘ప్యాక్స్’, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఈసారి వేచిచూసే ధోరణిలో ఉ న్నాయి. ఎక్కడా కూడా మార్క్‌ఫెడ్ ఇంకా కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో సిండికేట్‌గా మా రిన కొందరు ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో తమకు తోచిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.2,400 కాగా..కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,950 చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఎంఎస్పీతో పోలిస్తే క్వింటాకు రూ.650 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు.. ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయశాఖ అంచనాలను మించి రైతులు 88 శాతం అధికంగా సాగు చేశారు. వాస్తవానికి 2025–26 యాసంగిలో మొత్తం సాగు అంచనా 68,67,407 ఎకరాలు కాగా, 81,20,332 (118 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. ఇందులో మొక్కజొన్న సాగు అంచనా 6,45,574 ఎకరాలకు 12,13,914 (188 శాతం) ఎకరాల్లో వేశారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌లో 3,43,732 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న వేశారు. సాగైన మొత్తం విస్తీర్ణంలో సగటున ఎకరానికి 18 క్వింటాళ్లు వస్తే 6,18,717 టన్నులు.. 25 క్వింటాళ్లు వస్తే 8,59,330 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 26 కేంద్రాలను ప్రతిపాదించిన మార్క్‌ఫెడ్, వ్యవసాయశాఖలు ఈసారి ఇంకా కొనుగోలు కేంద్రాల పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో రైతులు అవసరాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 18న మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో చర్చకు తేగా.. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఐదు రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో పురోగతి లేదు. ఈ ఫొటోలో ఉన్నది హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు నకీర్త మధు. మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల కురిసిన వడగళ్లకు కొంత మేరకు దెబ్బతింది. మిగిలిన పెరడు కోసి కంకి కొట్టాడు. అమ్మేందుకు మక్కలను కల్లం వద్ద ఆరబోశాడు. బయట అమ్ముకుందామంటే ధర తక్కువ. కొనుగోలు కేంద్రాలు అగొచ్చే ఇగొచ్చే అని అధికారులు అంటుంటే ఐదారు రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ, ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితి ఒక్క నకీర్త మధుదే కాదు.. అనేక మంది మక్క రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. 2025–26 యాసంగి సాగు అంచనా : 8,96,861 ఎకరాలు సాగైన విస్తీర్ణం: 10,67,535 (118 శాతం) ఎకరాలు మొక్కజొన్న సాగు అంచనా : 2,25,259 సాగైన మొక్కజొన్న విస్తీర్ణం : 3,43,732 (152.59 శాతం) మక్కల దిగుబడి అంచనా(ఎకరానికి): 18–25 క్వింటాళ్లు దిగుబడి అంచనా: 6.19 – 8.59 లక్షల మెట్రిక్‌టన్నులు కావాల్సిన కొనుగోలు కేంద్రాలు : 30–35 మక్కలకు కనీస మద్దతు ధర: రూ.2,400 వ్యాపారులు పెడుతున్న ధర: కనిష్టం రూ.1,700, గరిష్టం రూ.1,950 ఎంఎస్పీ కంటే క్వింటాలుకు రూ.500 నుంచి రూ.650 తక్కువ -
ఆదర్శ జీవితానికి శ్రీరాముడు స్ఫూర్తి
హన్మకొండ కల్చరల్: ఆదర్శ జీవితానికి శ్రీరాము డు స్ఫూర్తి అయితే, సత్పరిపాలనకు రామరాజ్యం దిక్సూచి అని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. వేయిస్తంభాల గుడిలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రభాతసేవ, గణపతి పూజ, రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు పంచరాత్ర శాస్త్ర ఆగమంతో అర్చకులు సూక్తవిధానంతో విశ్వక్సేనారాధన, విష్ణుసూక్తంతో నిత్యాహ్నికం ని ర్వహించారు. అనంతరం రాములవారి ఉత్సవ విగ్రహాన్ని బాలరాముడిగా అలంకరించి గరుడ వాహనంపై ప్రతిష్ఠించి మంగళవాయిద్యాలతో ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వైద్యులు రాహుల్–అక్షిత దాతలుగా వ్యవహరించారు. నిజామాబాద్‌కు చెందిన హనుమాన్ మాలధారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, నరసింహచార్యులు, శ్రీవాత్సవ్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
● కలెక్టర్ సత్యశారద ● వాగ్దేవిలో జనగణన శిక్షణ ప్రారంభంఖిలా వరంగల్: జనగణన విజయవంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలావరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల అడిటోరియంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జనగణన 2027 సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. చార్జ్ సెన్సెస్ క్లర్క్‌లు, టెక్నికల్ అసిస్టెంట్లకు జనగణన ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహనతో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి అవసరమైన ఖచ్చితమైన గణాంకాలు అందుతాయని, అభివృద్ధి ప్రణాళికల రూప కల్పనలో ఇవి కీలకమన్నారు. ప్రతీ ఇంటిని సందర్శించి సరైన వివరాలను సేకరించడం సిబ్బందిపై ఉందన్నారు. అనంతరం సిబ్బందికి విధివిధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సెన్సెస్ అధికారి (డీఆర్ఓ) విజయలక్ష్మీ, ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ, ఆర్డీఓ సుమ, తహసీల్ధార్ ఇక్బాల్, అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. నీటిని వృథా చేయొద్దు వర్ధన్నపేట: ప్రతిఒక్కరూ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జల సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ముగ్గులు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ విధానాలు, నీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నీరు జీవనానికి మూలాధారమన్నారు. భవిష్యత్ తరాల కోసం దాన్ని కాపాడడం ప్రతిఒక్కరి బాధ్యతన్నారు. ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెపొందించుకునేలా అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి విధానాన్ని డెమో ద్వారా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కౌడగాని సునితరాజేష్ఖన్నా, మిషన్ భగీరథ ఈఈ సునీత, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ, అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
సహజ వనరులే జీవనాధారం
● జల్ మహోత్సవంలో మంత్రి సీతక్క ఆత్మకూరు: సహజవనరులే జీవనాధారమని, సహజవనరుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుమలగిరిలో జల్ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో 12,706 గ్రామాల్లో మిషన్ భగీరథ జలాలు వస్తున్నాయని, ఈవిషయమై ఇప్పటికే 12,405 మంది సర్పంచ్‌లతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన నీటిని తాగుతూ రోగాలు కొని తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఆధునికత పేరుతో రోగాలు కొని తెచ్చుకుంటున్నారని, పూర్వపు ఆచారాలు పాటించాలని కోరారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అంగన్వాడీ సెంటర్లలో పాలు అందజేశామని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పాలు అందించనున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పపువ్వుతో ఆరోగ్యకరమైన వంటలు చేసేవారని గుర్తు చేశారు. మేడారంలో మహిళలు స్వయం ఉపాధితో రూ.కోట్ల లాభం పొందారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్ఓ ప్లాంట్లకు దూరంగా ఉండాలని కోరారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ మిషన్‌భగీరథ నీటిని సద్వినియోగం చేసుకోవాలని, నీటిని వృథాచేయొద్దని సూచించారు. సర్పంచ్ బూర దేవేంద్రకు హర్‌ఘర్‌జల్ ప్రశంసపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ నారాయణ, మిషన్ భగీరథ ఈఈ గాయత్రి, డీఈ మధు, ఏఈ రంజిత్, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు పర్వతగిరి మహేశ్వరిరాజు, ముద్దం సాంబయ్య, ఎల్కటి రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కమలాపురం రమేశ్, నాయకులు బీరం సుధాకర్‌రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ ఏరుకొండ రవిందర్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు కక్కెర్ల రాజు, మార్క రజనీకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు పాల్గొన్నారు. కాగా, జల్ మహోత్సవ్‌కు ఆత్మకూరు మండల వాస్తవ్యుడు, డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఆహ్వానం లేనందునే కార్యక్రమానికి రాలేకపోయానని తన సన్నిహితులకు ఆయన చెప్పినట్లు సమాచారం. -
భద్రకాళి అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్ : వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం భద్రకాళి అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన నిర్వహించారు. ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ, అర్చకులు, వేద పాఠశాల విద్యార్థులు గులాబీపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి వైభవంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. వ్యాపారవేత్త డాక్టర్ శ్రీనివాస్, బాలజననీ దంపతులు పుష్పార్చనకు దాతలుగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్త తొనుపునూరి వీరన్న, సిబ్బంది పర్యవేక్షించారు. -
యుద్ధం కాదు.. ప్రపంచ శాంతి అవసరం
విద్యారణ్యపురి : ప్రస్తుతం యుద్ధం కాదు.. ప్రపంచ శాంతి అవసరమని దేశాధినేతలు సమస్యను చ ర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జాతీయ ఉ త్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ప్రపంచంలో తలెత్తిన యుద్ధ వాతావరణం దాని ప్రభావాలపై అవగాహ న కల్పిస్తూ జనవిజ్ఞాన వేదిక హనుమకొండలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ‘యుద్ధం కాదు ప్రపంచ శాంతి అవసరం’ అనే అంశంపై ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర పర్యావరణ ఉపసమితి కన్వీనర్ కె.బి ధర్మప్రకాశ్ మాట్లాడుతూ.. యుద్ధాలు దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీస్తున్నాయని వివరించారు. సమావేశంలో జేవీవీ అధ్యక్షుడు పురుషో త్త ం, ప్రధాన కార్యదర్శి భిక్షపతి, సుమలత, వంద న , రేవతి, రాజ్‌కుమార్, శ్రావణ్ కుమార్, శ్రీని వాస్, వెంకటస్వామి, అజయ్, నరేష్ పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వల్లంపట్ల నాగేశ్వర్రావు -
రెండు పంటలకు సాగునీరు
● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ● డీబీఎం 38 ఉపకాల్వపై తూము ఏర్పాటు దుగ్గొండి: డీబీఎం 38 ఉప కాల్వపై తూము ఏర్పాటుతో రైతులకు రెండు పంటలకు సాగునీరు అందనుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం డీబీఎం 38 ఉపకాల్వ 14ఎల్పై తూము ఏర్పాటు చేయించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంచర్ల చెరువులోకి ఎస్సారెస్పీ నీరు ప్రవహిస్తుండటంతో రైతులు తమ చిరకాల స్వప్నం సాకారం అయిందన్నారు. రెండు పంటలకు సాగు నీరు అందనుందన్నారు. అనంతరం నీరు విడుదల చేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, ఎస్సారెస్పీ డీఈ రామకృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క రమేష్, సర్పంచ్ భూర రాధికచందూగౌడ్, ఒలిగె నర్సింగరావు, ఎర్ర ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యం నెక్కొండ: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని చంద్రుగొండ, దీక్షకుంట, నాగారం, తోపనపల్లి, అలంకానిపేట, నెక్కొండలోని నందమూరి నగర్, రాజీవ్‌నగర్ ఎస్సీ కాలనీల్లో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి, బక్కి అశోక్, కుసుమ చెన్నకేశవులు, తిరుమల్చౌహాన్, శ్రీనివాస్, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ఆదర్శ జీవితానికి శ్రీరాముడు స్ఫూర్తి
హన్మకొండ కల్చరల్: ఆదర్శ జీవితానికి శ్రీరాముడు స్ఫూర్తి అయితే, సత్పరిపాలనకు రామరాజ్యం దిక్సూచి అని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ పేర్కొన్నారు. వేయిస్తంభాల గుడిలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రభాతసేవ, గణపతి పూజ, రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు పంచరాత్ర శాస్త్ర ఆగమంతో అర్చకులు సూక్తవిధానంతో విశ్వక్సేనారాధన, విష్ణుసూక్తంతో నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం రాములవారి ఉత్సవ విగ్రహాన్ని బాలరాముడిగా అలంకరించి ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వైద్యులు రాహుల్–అక్షిత దాతలుగా వ్యవహరించారు. నిజామాబాద్‌కు చెందిన హనుమాన్ మాలధారులు పాల్గొన్నారు. అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, నరసింహాచార్యులు, శ్రీవాత్సవ్, సిబ్బంది మధుకర్, రజిత పాల్గొని సేవలందించారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సిద్ధమైంది. అకౌంటింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులు సిద్ధం చేసి మేయర్ గుండు సుధారాణికి, హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌కి అందజేశారు. ఈనెల 25న బడ్జెట్ ఆమోదం కోసం గ్రేటర్ వరంగల్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. పాలకవర్గం పదవీ కాలం మరో నెలన్నర రోజుల్లో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ పాలక వర్గానికి చివరి బడ్జెట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. -
భద్రకాళి అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్ : వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం భద్రకాళి అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన నిర్వహించారు. ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ, అర్చకులు, వేద పాఠశాల విద్యార్థులు గులాబీపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి వైభవంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన వ్యాపారవేత్త డాక్టర్ శ్రీనివాస్, బాలజనని దంపతులు పుష్పార్చనకు దాతలుగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్త తొనుపునూరి వీరన్న, సిబ్బంది పర్యవేక్షించారు. వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నేడు (సోమవారం) గ్రీవెన్స్ సెల్‌ను నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ క్యాంపస్: కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎన్.లింగమూర్తి యాది సభను సోమవారం జర్నలిజం సెమినార్‌హాల్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పూలే ఆశయ సాధనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే యాదిసభకు హాజరుకావాలని ఆయన కోరారు. హన్మకొండ కల్చరల్/ఖిలా వరంగల్ : వేయిస్తంభాల ఆలయాన్ని యూకే నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ ఆదివారం సందర్శించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను యూకే, ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం రాబర్ట్ పార్కర్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ ఆహ్వానించింది. అసిస్టెంట్ టూరిజం ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్ ఆలయ చరిత్రను వివరించారు. అలాగే రాబర్ట్ పార్కర్ వరంగల్ కోటలోని తూర్పుకోట, పడమర కోట, శృంగార బావి, కళాతో రణం, ఖుష్‌మహల్ తదితర ప్రాంతాలను సందర్శించి కాకతీయుల కళాసంపద విశిష్టతను, పర్యాటక ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. సౌండ్ అండ్ లైట్లు ఇన్చార్జ్ విజయ్, కళ్యాణ్, కేంద్ర పురావస్తు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
మక్కలకు లేదు మద్దతు
పరిశీలనలోనే కేంద్రాల ఏర్పాటు.. ప్రారంభంకాని కొనుగోళ్లుసాక్షిప్రతినిధి, వరంగల్: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా మొక్కజొన్న రైతులకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకడం లేదు. యాసంగి మక్కల కొనుగోళ్ల కోసం ప్రతీసారి మార్చి మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే మార్క్‌ఫెడ్, ‘ప్యాక్స్’, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఈసారి వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. ఎక్కడా కూడా మార్క్‌ఫెడ్ ఇంకా కొనుగోళ్లను ప్రారంభించక పోవడంతో సిండికేట్‌గా మారిన కొందరు ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో తమకు తోచిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాకు రూ.2,400 కాగా.. కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,950 చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఎంఎస్పీతో పోలిస్తే క్వింటాకు రూ.500 నుంచి రూ.650 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు.. ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయశాఖ అంచనాలను మించి రైతులు 88 శాతం అధికంగా సాగు చేశారు. వాస్తవానికి 2025–26 యాసంగిలో మొత్తం సాగు అంచనా 68,67,407 ఎకరాలు కాగా, 81,20,332 (118 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. ఇందులో మొక్కజొన్న సాగు అంచనా 6,45,574 ఎకరాలకు 12,13,914 (188 శాతం) ఎకరాల్లో వేశారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌లో 3,43,732 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న వేశారు. సాగైన మొత్తం విస్తీర్ణంలో సగటున ఎకరానికి 18 క్వింటాళ్లు వస్తే 6,18,717 టన్నులు.. 25 క్వింటాళ్లు వస్తే 8,59,330 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 26 కేంద్రాలను ప్రతిపాదించిన మార్క్‌ఫెడ్, వ్యవసాయశాఖలు ఈసారి ఇంకా కొనుగోలు కేంద్రాల పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో రైతులు అవసరాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 18న మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో చర్చకు తేగా.. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఐదు రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో పురోగతి లేదు. 2025–26 యాసంగి సాగు అంచనా : 8,96,861 ఎకరాలు సాగైన విస్తీర్ణం: 10,67,535 (118 శాతం) ఎకరాలు మొక్కజొన్న సాగు అంచనా : 2,25,259సాగైన మొక్కజొన్న విస్తీర్ణం : 3,43,732(152.59 శాతం) మక్కల దిగుబడి అంచనా(ఎకరానికి): 18-25 క్వింటాళ్లు దిగుబడి అంచనా: 6.19-8.59 లక్షల మెట్రిక్‌టన్నులు కావాల్సిన కొనుగోలు కేంద్రాలు : 30-35మక్కలకు కనీస మద్దతు ధర రూ.: 2,400వ్యాపారులు పెడుతున్న ధర: కనిష్టం రూ. 1,700, గరిష్టం రూ. 1,950ఎంఎస్పీ కంటే క్వింటాకు ధర: రూ.500 నుంచి రూ.650 తక్కువ మొక్కజొన్న పంట చేతికందే సమయంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించాం. మక్కలను అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు లేక దళారుల దగ్గరకు వెళ్లక తప్పడం లేదు. మద్దతు ధర కంటే ఐదారు వందల రూపాయలకు తక్కువ కొంటున్నరు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. – తాళ్లపల్లి సారయ్య, వైస్ ప్రెసిడెంట్, ‘మ్యాక్స్’, భీమదేవరపల్లి నేను 2 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశా. గతంలో కంటే ఈసారి దిగుబడి కూడా సరిగ్గా రాలేదు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు రూ.1,700కే అమ్ముకున్న. వాళ్లు కూడా 20 రోజుల తర్వాత డబ్బులు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే క్వింటాకు రూ.600 నుంచి రూ.700 ఎక్కువగా వచ్చేవి. కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోవాల్సి వచ్చింది. – నకీర్త సంపత్, రైతు, పీచర, వేలేరు మండలం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,400.. వ్యాపారుల ధర రూ.1,950 ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 3.43 లక్షల ఎకరాల్లో సాగు అసెంబ్లీలో ఈనెల 18న చర్చ.. మంత్రి ఆదేశించినా పురోగతి లేదు మొక్కజొన్న రైతుకు తప్పని దళారుల బెడదఈ ఫొటోలో ఉన్నది హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు నకీర్త మధు. మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల కురిసిన వడగళ్లకు కొంత మేరకు దెబ్బతింది. మిగిలిన పెరడు కోసి కంకి కొట్టాడు. అమ్మేందుకు మక్కలను కల్లం వద్ద ఆరబోశాడు. బయట అమ్ముకుందామంటే ధర తక్కువ. కొనుగోలు కేంద్రాలు అగొచ్చే ఇగొచ్చే అని అధికారులు అంటుంటే ఐదారు రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ, ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితి ఒక్క నకీర్త మధుదే కాదు.. అనేక మంది మక్క రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. -
కడియం శ్రీహరి వల్లే పార్టీ మారా..
● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ● నగరంలో ముఖ్య కార్యకర్తల సమావేశం హసన్‌పర్తి: ‘స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వల్లే నేను పార్టీ మారాను. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం మేరకు తిరిగి సొంత గూటికి చేరాను. అని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వర్ధన్నపేట డివిజన్ పరిధి 13 డివిజన్లలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని 1, 2వ డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నగరంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సర్వేల ఆధారంగా గెలుపు అవకాశాలు ఉన్నవారికే కార్పొరేటర్ టికెట్ ఇస్తామని చెప్పారు. కష్టపడి పనిచేసిన వారికే పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లావుడ్య రవి, డివిజన్ అధ్యక్షుడు నరేడ్ల శ్రీధర్, గండు అశోక్ యాదవ్, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, గనిపాక విజయ్‌కుమార్, పీఏసీఎస్ మాజీ వైస్ ప్రసిడెంట్ నన్నబోయిన కుమార్ యాదవ్, ప్రమోద్, దేవేందర్, లోకేశ్, నంది శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. డీటీఎఫ్ రెండు జిల్లాల బాధ్యులు విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.2 శాతం నిధులు కేటాయించడం అన్యాయమేనని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, కె.యాకయ్య, జి.ఉప్పలయ్య, గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనెఫెస్టోలో విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం శోఛనీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుమీద కొన్ని పాఠశాలలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రధాన స్రవంతి పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం సరికాదని తెలిపారు. విద్యారంగానికి కేటాయించిన నిధుల విషయంపై పునఃసమీక్షించి కనీసం 20 శాతం నిధులు కేటాయించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ గడువు ముగిసి 32 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు రిపోర్ట్ తెప్పించుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. -
‘ట్రామా’.. ధీమా
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో ట్రామాకేర్ సేవలను మరింత పకడ్బందీగా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే మెరుగైన చికిత్స అందించేందుకు మూడుస్థాయిల్లో ట్రామా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా లెవల్–1, లెవల్ –2, లెవల్–3గా విభజించి వైద్యారోగ్య శాఖ సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు కసరత్తు ప్రారంభించింది. ఎంజీఎం ఆస్పత్రిలో కూడా నిపుణులైన వైద్యులతో ట్రామా చికిత్సలో నాణ్యతను పెంచేందుకు కృషి చేస్తోంది. మూడేళ్ల క్రితం ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ (ఈఎండీ)ను అందుబాటులోకి తీసుకురావడంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. అయితే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఈఎస్‌ఐసీతోపాటు లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎంకు చోటు కల్పించడంతో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులకు అన్ని విభాగాల వారు ఒకే సమయంలో 24 గంటలు అందుబాటులో ఉండడం ద్వారా సత్వర వైద్యం అంది ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్‌లో నిర్మితమవుతున్న మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 నుంచి 12 పడకలతో ట్రామా ఐసీయూ అందుబాటులోకి రానుండడం కూడా క్షతగాత్రులకు ఎంతో ఉపయుక్తం కానుంది. న్యూరో, ఆర్థో, జనరల్ సర్జరీ, కార్డియాక్ స్పెషలిస్టులు, అనస్థీషాయా నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యులతో పాటు డెంటల్, ఈఎన్టీ నిపుణులు కూడా అందుబాటులో ఉండడం వల్ల రోడ్డు ప్రమాద బాధితులకు అవసరమైన వైద్యం అందించే వీలుంటుంది. ఈ లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి క్షతగాత్రులకు భరోసా కల్పించేలా చేస్తున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీ అపరేషన్ థియేటర్‌తో పాటు రేడియాలాజీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సీటిస్కాన్ సేవలు ఎంజీఎంలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. రోజుకు 200 వరకు ట్రామా కేసులు.. ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీకి రోజుకు 500 నుంచి 700 వరకు కేసులు వస్తుంటాయి. వీటిలో 150 నుంచి 200 వరకు ట్రామా కేసులు ఉంటాయి. 30 నుంచి 50 వరకు మేజర్ కేసులుంటే, మిగిలినవి మైనర్. శని, ఆదివారాల్లో ఈ కేసులు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందేలా చేస్తున్నారు. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం ద్వారా ఎంజీఎంలో మరిన్ని సౌకర్యాలు పెరిగి 24 గంటలపాటు అన్ని విభాగాల వైద్యులు ఉంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఇవ్వడం ద్వారా సమయానుకూలంగా స్పందించే అవకాశముంటుంది. ఇలా గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు మెరుగైన సత్వర చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలుస్తాయి. క్షతగాత్రులకు సత్వర సేవలు.. ఇప్పటికే రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సత్వర సేవలు అందుతున్నాయి. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎం ఆస్పత్రికి చోటుకల్పించడం ద్వారా ఇంకొన్ని సౌకర్యాలు పెరుగుతాయి. క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. – డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ లెవల్–1లో ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం గోల్డెన్ అవర్ చికిత్సలో నాణ్యత పెంచే దిశగా అడుగులు ఇప్పటికే ఈఎండీతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు కొత్త మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ట్రామా ఐసీయూ -
కల్వకుంట్ల కుటుంబానికి బానిస కౌశిక్‌రెడ్డి
ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ బల్మూరి వెంకట్ కమలాపూర్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి బానిసగా మారి కల్వకుంట్ల కుటుంబానికి కార్యకర్తగా పని చేస్తున్నాడని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ విమర్శించారు. కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా కల్వకుంట్ల కుటుంబం చెప్పినట్లు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ‘హుజూరాబాద్ గడ్డ నా రాజకీయ అడ్డా అని, బల్మూరి వెంకట్ పుట్టింది, చచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే’ అన్నారు. హుజూరాబాద్ కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని, నియోజకవర్గ అభివృద్ధే తమ ధ్యేయమని, నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్‌తో కలిసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. శాసన మండలి విప్‌గా నియమితులైన తర్వాత మొదటిసారిగా కమలాపూర్‌కు, దేశరాజుపల్లికి వచ్చిన బల్మూరికి కాంగ్రెస్ శ్రేణులు డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. బల్మూరి వెంకట్ మహిళలతో కలిసి కోలాటం ఆడారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్పర్సన్ ఝాన్సీ రవీందర్, దేశరాజుపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సముద్రాల రమేశ్, సర్పంచ్ మహేశ్వరి కుమారస్వామి, ఏఎంసీ డైరెక్టర్ కృష్ణ, నాయకులు చరణ్‌పటేల్, ధనాకర్, ఇస్తారి, రవీందర్, కనుకరత్నం, హనుమాన్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు పూర్తి కమిటీలు ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు నెలల క్రితమే డీసీసీ అధ్యక్షులు.. డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన వారికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్‌కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్, మహబూబాబాద్‌కు ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్‌కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సంధర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్లు అలకకు గురికాగా, కేడర్‌లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. జంబోజెట్ జాబితా... అందుకే పెండింగ్? నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం ఆరు జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ఇంకా పెండింగ్‌లోనే పెట్టింది. దీంతో స్థానిక కేడర్‌లో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారంలోనే జిల్లాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితర పోస్టులకు టీపీసీసీకి జాబితా పంపించనట్లు తెలిసింది. ఉగాది సందర్భంగా 14 జిల్లాల కమిటీలను ప్రకటించిన అధిష్టానం ఆరు జిల్లాల కమిటీలను మాత్రం ప్రకటించలేదు. జిల్లా కమిటీల్లో అన్ని పోస్టులు కలిపి 30 నుంచి 50 మంది దాటకుండా ఉండేలా జాబితా రూపొందించాల్సి ఉండగా.. అంతకుమించి పంపడం వల్ల వడపోత చేస్తున్నారని చెబుతున్నారు. వరంగల్, జనగామ జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల మధ్య పొసగకపోవడం వల్ల అక్కడినుంచి కూడా జంబోజెట్ జాబితా వెళ్లినట్లు తెలిసింది. ఆ జాబితాలు అధిష్టానం పరిశీలనలోనే ఉండగా.. హనుమకొండ, ములుగు జిల్లాల జాబితాపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన వెలువడవచ్చంటున్నారు. కమిటీలు ఆలస్యం కావడం పట్ల పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చాలాచోట్ల గ్రూప్ రాజకీయాలు, కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోటీ కారణంగా కమిటీలు ఆలస్యం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. డీసీసీ అధ్యక్షులను నియమించి నాలుగు నెలలు పూర్తిస్థాయి కార్యవర్గంపై ఇంకా అస్పష్టత పొరుగు జిల్లాల్లో కార్యవర్గం, కమిటీల ఖరారు ఉమ్మడి జిల్లాలో ముందుకు కదలని పరిస్థితి ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ -
భద్రకాళి అమ్మవారికి మల్లెలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం అమ్మవారికి మల్లెపూలతో పు ష్పార్చన నిర్వహించారు. ఉదయం అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు మల్ల్లెకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి ఘనంగా లక్షపుష్పార్చన నిర్వహించారు. వరంగల్‌కు చెందిన న్యాయవాది భాస్కరవజ్జుల పురుషోత్తం, భవానీ దంపతులు పుష్పార్చనకు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. నయీంనగర్: భద్రకాళి ఆలయ అభివృద్ధి కోసం మాడవీధుల నిర్మాణానికి తమ స్థలాలను స్వచ్ఛందంగా అప్పగించిన వారికి శనివారం ఇళ్ల పట్టాలు అందించారు. 17 నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ‘కుడా’ కార్యాలయంలో లక్కీ డ్రా ద్వారా ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్‌పాయ్ న్యూశాయంపేటలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ‘కుడా’ ఆధ్వర్యంలో మాడవీధుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ‘కుడా’ అధికారులు అజిత్‌రెడ్డి, భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం మహా సుదర్శన హోమం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ప్రభాతసేవ, గణపతి పూజ. రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, విష్ణుసూక్త మూలమంత్రయుక్తంగా నిత్యాహ్నికం నిర్వహించి రాముల వారి ఉత్సవిగ్రహాన్ని జానకీ వల్లభుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. యాగశాలలో మహా సుదర్శనహోమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో వెలమ సంఘం జిల్లా నా యకులు గుజ్జా సంపత్‌రావు, హైకోర్టు రిజి స్ట్రార్ ఓం శ్రీవిద్యాభారతి, వేదపండితులు గంగు మణికంఠ, సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్
మరిన్ని ఫొటోలు 9లోuహనుమకొండ జిల్లా వ్యాప్తంగా శనివారం ముస్లింలు ఈద్–ఉల్–ఫితర్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజామునుంచే నూతన వస్త్రాలు ధరించి సుగంధ ద్రవ్యాలు అద్దుకుని అల్లా నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు తరలిరావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వరంగల్ నగరంలోని బొక్కలగడ్డ, కాజీపేట, పరకాల బస్టాండ్ సమీపంలోని ఈద్గాలు, మసీదుల్లో వేలాది మంది ఒకసారి సామూహిక(నమాజ్) ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్–ముభారక్ తెలుపుకున్నారు. ముఖ్య అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య తదితరులు హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. – న్యూశాయంపేట/పరకాల ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు పాల్గొన్న ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు -
భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
కఠిన ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు శనివారం ఈద్–ఉల్–ఫితర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయమే సమీపంలోని ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతగురువులు ఖుత్బా (ప్రసంగం) వినిపించారు. అనంతరం ఒకరికొకరు ఈద్–ముబారక్ చెప్పుకొని సోదరభావాన్ని చాటుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. – నర్సంపేట/గీసుకొండ– మరిన్ని ఫొటోలు 9లోu ఖిలా వరంగల్ ఈద్గాలో ప్రార్థనలు చేస్తున్న మంత్రి కొండా సురేఖ ఈద్గాల్లో ముస్లింల సామూహిక ప్రార్థనలు శుభాకాంక్షలు చెప్పిన ప్రజాప్రతినిధులు -
ట్రామా.. ధీమా
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో ట్రామాకేర్ సేవలను మరింత పకడ్బందీగా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే మెరుగైన చికిత్స అందించేందుకు మూడుస్థాయిల్లో ట్రామా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా లెవల్–1, లెవల్ –2, లెవల్–3గా విభజించి వైద్యారోగ్య శాఖ సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు కసరత్తు ప్రారంభించింది. ఎంజీఎం ఆస్పత్రిలో కూడా నిపుణులైన వైద్యులతో ట్రామా చికిత్సలో నాణ్యతను పెంచేందుకు కృషి చేస్తోంది. మూడేళ్ల క్రితం ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ (ఈఎండీ)ను అందుబాటులోకి తీసుకురావడంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. అయితే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఈఎస్‌ఐసీతోపాటు లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎంకు చోటు కల్పించడంతో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులకు అన్ని విభాగాల వారు ఒకే సమయంలో 24 గంటలు అందుబాటులో ఉండడం ద్వారా సత్వర వైద్యం అంది ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్‌లో నిర్మితమవుతున్న మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 నుంచి 12 పడకలతో ట్రామా ఐసీయూ అందుబాటులోకి రానుండడం కూడా క్షతగాత్రులకు ఎంతో ఉపయుక్తం కానుంది. న్యూరో, ఆర్థో, జనరల్ సర్జరీ, కార్డియాక్ స్పెషలిస్టులు, అనస్థీషాయా నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యులతో పాటు డెంటల్, ఈఎన్టీ నిపుణులు కూడా అందుబాటులో ఉండడం వల్ల రోడ్డు ప్రమాద బాధితులకు అవసరమైన వైద్యం అందించే వీలుంటుంది. ఈ లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి క్షతగాత్రులకు భరోసా కల్పించేలా చేస్తున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీ అపరేషన్ థియేటర్‌తో పాటు రేడియాలాజీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సీటిస్కాన్ సేవలు ఎంజీఎంలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. లెవల్–1లో ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం గోల్డెన్ అవర్ చికిత్సలో నాణ్యత పెంచే దిశగా అడుగులు ఇప్పటికే ఈఎండీతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు కొత్త మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ట్రామా ఐసీయూరోజుకు 200 వరకు ట్రామా కేసులు.. ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీకి రోజుకు 500 నుంచి 700 వరకు కేసులు వస్తుంటాయి. వీటిలో 150 నుంచి 200 వరకు ట్రామా కేసులు ఉంటాయి. 30 నుంచి 50 వరకు మేజర్ కేసులుంటే, మిగిలినవి మైనర్. శని, ఆదివారాల్లో ఈ కేసులు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందేలా చేస్తున్నారు. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం ద్వారా ఎంజీఎంలో మరిన్ని సౌకర్యాలు పెరిగి 24 గంటలపాటు అన్ని విభాగాల వైద్యులు ఉంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఇవ్వడం ద్వారా సమయానుకూలంగా స్పందించే అవకాశముంటుంది. ఇలా గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు మెరుగైన సత్వర చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలుస్తాయి. క్షతగాత్రులకు సత్వర సేవలు..ఇప్పటికే రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సత్వర సేవలు అందుతున్నాయి. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎం ఆస్పత్రికి చోటుకల్పించడం ద్వారా ఇంకొన్ని సౌకర్యాలు పెరుగుతాయి. క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. – డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కాశిబుగ్గ: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్‌లోని 19వ డివిజన్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బల్దియా నిధులు రూ.29.70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ ఫ్లోరింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆలయంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలని ఆమె సూచించారు. కల్యాణ మండపం ఏర్పాటు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం... శ్రీ సీతారామాంజనేయ, హరిహర పుత్ర దేవాలయానికి తాత్కాలికంగా నియమించిన ఐదుగురు ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. మోతీలాల్ నాయక్, లకుం భాస్కర్, కుడికాల కోటేశ్వర్, పోతన లక్ష్మీనర్సయ్య, వెలిశాల మధుమతి ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. వీరు ఆలయంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాల వరకు ధర్మకర్తలుగా వ్యవహరించనున్నారు. -
మాటల్లోనే మహిళా సాధికారత..
నర్సంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళా వ్యతిరేక బడ్జెట్ అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఏఐఎఫ్డీడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు. నర్సంపేటలో శనివారం ఆమె మాట్లాడారు. మహిళా సంక్షేమ పథకాలకు సరిపడా నిధులు కేటాయించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. మహిళల ఉపాధి, ఆరోగ్యం, భద్రత, విద్య వంటి కీలకరంగాల్లో స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం ఈ బడ్జెట్ వైఫల్యాన్ని బయటపెడుతోందని పేర్కొన్నారు. మాటల్లోనే మహిళా సాధికారత ఉందని, బడ్జెట్లో కనిపించడం లేదని చెప్పారు. మహిళలు హక్కుల కోసం పోరాడాలని రాగసుధ పిలుపునిచ్చారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి : డీటీఎఫ్ కాళోజీ సెంటర్: వనరులను దోచుకోవడానికి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను డిమాండ్ చేశారు. డీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధంతో ఇరాన్, ఇతర గల్ఫ్‌దేశాల్లో వేలాది మంది మరణిస్తున్నారని, పర్యావరణం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణులతో చర్చించి విద్యాకమిషన్ నివేదికను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో పీఆర్సీకి నిధులు కేటాయించకపోవడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్స్కూల్స్ను వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు కె.యాకయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎ.గోవిందరావు నివేదిక ప్రవేశపెట్టారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు నివేదికపై చర్చించి ఆమోదించారు. జిల్లా కమిటీ సభ్యులు డి.మహేందర్‌రెడ్డి, ఎం.రామస్వామి, అనందచారి, నర్సింహులు, సూరయ్య, రాంరెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి వరంగల్ చౌరస్తా: రైతులు పండించిన ప్రతీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వరంగల్ అబ్బనికుంటలోని రైతు సంఘం కార్యాలయంలో ఉపాధ్యక్షుడు ఊరటి అంశాలరెడ్డి అధ్యక్షతన శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి 31న వరంగల్ అబ్బనికుంటలో సంఘం భవన్లో రాష్ట్ర రైతు సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథులుగా హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి చంద్రకుమార్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ పాల్గొంటున్నారని పేర్కొన్నారు. పండిట్ దీన్‌దయాళ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి వరంగల్ అర్బన్: పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ గిర్మాజీపేటలో 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన అధ్యక్షతన గుజరాత్ సమాజ్ భవన్లో శనివారం నిర్వహించిన దీన్‌దయాళ్ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడారు. పార్టీ బలోపేతానికి నిరంతర అధ్యయనం, సంస్థాగత క్రమశిక్షణ, సమర్థవంతమైన సమాచార మార్పిడి ఎంతో కీలకమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు రత్నం సతీశ్‌షా, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు గడల కుమార్, ప్రశిక్షణ అభియాన్ అబ్జర్వర్ కనుకుంట్ల రంజిత్ కుమార్, జిల్లా మాజీ కోశాధికారి కూచన క్రాంతి కుమార్, జిల్లా నాయకులు మాదాసు రాజు, మండల అధ్యక్షులు సీతా నాగరాజు, మండల నాయకులు రామిని సుమన్, జెట్లింగ్ శివ, కొత్తకొండ రాజేశ్ పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి మల్లెలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం అమ్మవారికి మల్లెపూలతో పుష్పార్చన నిర్వహించారు. ఉదయం అమ్మవారికి నిర్మాల్య సేవలు, నిత్యాహ్నికం నిర్వహించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం ముఖ్య అర్చకుడు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు మల్ల్లెకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి ఘనంగా లక్షపుష్పార్చన నిర్వహించారు. వరంగల్‌కు చెందిన న్యాయవాది భాస్కరవజ్జుల పురుషోత్తం, భవాని దంపతులు పుష్పార్చనకు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం మహా సుదర్శన హోమం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ప్రభాతసేవ, గణపతి పూజ. రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, విష్ణుసూక్త మూలమంత్రయుక్తంగా నిత్యాహ్నికం నిర్వహించి రాముల వారి ఉత్సవిగ్రహాన్ని జానకీ వల్లభుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. యాగశాలలో మహా సుదర్శనహోమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో వెలమ సంఘం జిల్లా నా యకులు గుజ్జా సంపత్‌రావు, హైకోర్టు రిజి స్ట్రార్ ఓం శ్రీవిద్యాభారతి, వేదపండితులు గంగు మణికంఠ, సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. నయీంనగర్: భద్రకాళి ఆలయ అభివృద్ధి కోసం మాడవీధుల నిర్మాణానికి తమ స్థలాలను స్వచ్ఛందంగా అప్పగించిన వారికి శనివారం ఇళ్ల పట్టాలు అందించారు. 17 నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ‘కుడా’ కార్యాలయంలో లక్కీ డ్రా ద్వారా ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్‌పాయ్ న్యూశాయంపేటలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ‘కుడా’ ఆధ్వర్యంలో మాడవీధుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ‘కుడా’ అధికారులు అజిత్‌రెడ్డి, భీంరావు పాల్గొన్నారు. -
పూర్తి కమిటీలు ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులు.. డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్‌కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్, మహబూబాబాద్‌కు ఎమ్మెల్యే మురళీనాయక్ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్‌కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సందర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్లు అలకకు గురికాగా, కేడర్‌లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. డీసీసీ అధ్యక్షులను నియమించి నాలుగు నెలలు పూర్తిస్థాయి కార్యవర్గంపై ఇంకా గందరగోళం పొరుగు జిల్లాల్లో కార్యవర్గం, కమిటీలు ఖరారు ఉమ్మడి వరంగల్‌లో ముందుకు కదలని పరిస్థితి ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠజంబోజెట్ జాబితా... అందుకే పెండింగ్? నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం ఆరు జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ఇంకా పెండింగ్‌లోనే పెట్టింది. దీంతో స్థానిక కేడర్‌లో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారంలోనే జిల్లాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితర పోస్టులకు టీపీసీసీకి జాబితా పంపించనట్లు తెలిసింది. ఉగాది సందర్భంగా 14 జిల్లాల కమిటీలను ప్రకటించిన అధిష్టానం ఆరు జిల్లాల కమిటీలను మాత్రం ప్రకటించలేదు. జిల్లా కమిటీల్లో అన్ని పోస్టులు కలిపి 30 నుంచి 50 మంది దాటకుండా ఉండేలా జాబితా రూపొందించాల్సి ఉండగా.. అంతకుమించి పంపడం వల్ల వడపోత చేస్తున్నారని చెబుతున్నారు. వరంగల్, జనగామ జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల మధ్య పొసగకపోవడం వల్ల అక్కడినుంచి కూడా జంబోజెట్ జాబితా వెళ్లినట్లు తెలిసింది. ఆ జాబితాలు అధిష్టానం పరిశీలనలోనే ఉండగా.. హనుమకొండ, ములుగు జిల్లాల జాబితాపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన వెలువడవచ్చంటున్నారు. కమిటీలు ఆలస్యం కావడం పట్ల పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చాలాచోట్ల గ్రూపు రాజకీయాలు, కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోటీ కారణంగా కమిటీలు ఆలస్యం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. -
మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తం
● ఆశ వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట ● రోడ్డుపై బైఠాయించి ఆశల ధర్నా హన్మకొండ: ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు నెలకు రూ.18,000 వేతనం చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి యత్నించారు. రాంనగర్‌లోని సీఐటీయూ కార్యాలయం నుంచి మంత్రి ఇంటికి ఆశాలు ర్యాలీగా బయల్దేరారు. మంత్రి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు సీఐటీయూ నాయకులు, ఆశాలు తీశ్రంగా శ్రమించారు. పోలీసులు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం మంత్రి ఇంటి సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మంత్రి పీఏతో ఫోన్లో మాట్లాడించి.. శనివారం మంత్రి సురేఖను కలిసేలా ఏర్పాటు చేస్తామని, వినతి పత్రం ఇచ్చి సమస్యలు వివరించుకోవచ్చని సీఐ రంజిత్ కుమార్ చెప్పడంతో శాంతించి ధర్నా విరమించారు. ఆశాలను నాలుగవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ నెల 28న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశాలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ కార్యక్రమంలో ఆశా యూనియన్, సీఐటీయూ నాయకులు సుంచు రాజేశ్వరి, బైరి శోభ, జనగాం శ్వేత, సీహెచ్ శ్రీవాణి, పద్మ, సీహెచ్ రాణి, రమ, కవిత, రజిత, ఈసంపల్లి శోభ, కరుణలత, లీల, పుష్ప, ప్రేమలతతోపాటు వందలాది మంది ఆశాలు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు మొండిచేయి
● బీవీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ వర్ధన్నపేట: బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మొండిచేయి చూపించిందని బీవీహెచ్‌పీఎస్ (భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి) రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ అసహనం వ్యక్తం చేశారు. ఇల్లంద గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన దివ్యాంగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా దివ్యాంగులను అణచివేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రత్యేకశాఖ ఏర్పాటు వంటి అంశాలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఎంతో చేసిందని గుర్తుచేశారు. హామీలను నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఈదయ్య, ఎండీ షరీఫ్, బాలకృష్ణ, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్, సుమతి, వీరమ్మ, అలివేలు, పూలమ్మ, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలకు పాడె: బీజేపీ గీసుకొండ: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆరు గ్యారంటీలకు పాడె కట్టినట్లుగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన బడ్జెట్‌పై మాట్లాడారు. జిల్లాకు బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ఎంజీఎం అభివృద్ధి, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, ఎయిర్‌పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్పార్కుపై బడ్జెట్లో ఊసే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడడం తప్పితే రాష్ట్ర సర్కారు పెద్దగా ఏం కేటాయించలేదని పేర్కొన్నారు. వివాహం చేసుకున్న పేదింటి మహిళలకు తులం బంగారం, పొదుపు సంఘాల వారికి నెలకు రూ.2500, ఫించన్‌ను రూ.4 వేల ప్రస్తావనే లేదన్నారు. బీసీలకు బడ్జెట్లో కేవలం నాలుగు శాతమే కేటాయింపులు చేశారని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బడ్జెట్‌పై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. -
అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం
● కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు ● ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు ● యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు ● అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం.. ఆరు గ్యారంటీలకు ఆదరణ ● సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళా సంక్షేమానికి పెద్దపీట ఉమ్మడి జిల్లాలో కేటాయింపులు ఇలా.. గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్‌మెంట్‌కు రూ.5 కోట్లు జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు వరంగల్‌లోని రీజినల్ సైన్స్ సెంటర్‌కు రూ. 30 లక్షలు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) రూ. 93.22 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు అవీ, ఇవీ, అన్నీ.. వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్‌లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది. -
అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం
● కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు ● ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు ● యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు ● అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం.. ఆరు గ్యారంటీలకు ఆదరణ ● సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళల సంక్షేమానికి పెద్దపీట ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు ఇలా.. గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్‌మెంట్‌కు రూ.5 కోట్లు జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు వరంగల్‌లోని రీజినల్ సైన్స్ సెంటర్‌కు రూ. 30 లక్షలు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) రూ. 93.22 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు అవీ, ఇవీ, అన్నీ.. వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్‌లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది. -
పక్షి సంపదను సంరక్షించుకోవాలి
న్యూశాయంపేట : అంతరించి పోతున్న పక్షి సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హనుమకొండ జిల్లా అటవీశాఖాధికారి, జూపార్కు క్యూరేటర్ బి.లావణ్య అన్నారు. శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు కాకతీయ జూవాలజికల్ పార్క్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలకు వచ్చే పిచ్చుకలు, పక్షులకు ఆహారం, నీటిని అందించి వాటి సంరక్షణకు సహాయపడాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, కేయూ ప్రొఫెసర్ తిప్పని రాధిక, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ ఎన్జీఓ ప్రతినిధులు నాగేశ్వర్రావు, శ్యాంసుందర్, రవిబాబు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీ బడ్జెట్ రూ.5.43 కోట్లు
● బడ్జెట్‌పై పరకాల మున్సిపల్ కొత్త పాలకవర్గం సమావేశం ● హాజరైన అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పరకాల: పరకాలలోని అన్ని రకాల ఆదాయ వనరులను ఆధారంగా చేసుకుని పరకాల మున్సిపాలిటీ 2026–27 వార్షిక అంచనా బడ్జెట్‌ను రూ.5 కోట్ల 43 లక్షల 10 వేల 270కు ఆమోదించినట్లు పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్ తెలిపారు. శుక్రవారం పరకాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్ అధ్యక్షతన ప్రత్యేక బడ్జెట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరకాల మున్సిపల్ కొత్త పాలకవర్గం పట్టణాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పట్టణ ప్రజల అవసరాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు, వివిధ అభివృద్ధి పనులకు ఖర్చుల ఆదారంగా బడ్జెట్‌ను ఆమోదించడాన్ని ఆయన అభినందించారు. మోడల్ మున్సిపాలిటీ కోసం రాజకీయాలకతీతంగా పట్టణాభివృద్ధిలో భాగస్వాములం అవుదామని చైర్మన్ సునీల్‌కుమార్ కోరారు. బడ్జెట్ అంచనతో పాటు రూ. 5 కోట్ల 8 లక్షల 2వేలతో అంచనా వ్యయం, రూ.3.48 లక్షలతో మిగులు బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. పరకాల మున్సిపల్ కమిషనర్ ఎస్.అంజయ్య మాట్లాడుతూ.. పరకాల మున్సిపాలిటీ పరిధిలో మరో రూ.50 లక్షలకు పైగా పన్నులు వసూలు జరిగితే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయని పాలకవర్గ సభ్యులకు వివరించారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఏకు దివ్యతో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. మొక్కల పెంపకానికి రూ.64 లక్షల ఖర్చు మున్సిపాలిటీ పరిధిలో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం కోసం గత బడ్జెట్ 2025–26 సంవత్సరం బడ్జెట్లో రూ.64 లక్షలు ఖర్చు చేయయడాన్ని బీఆర్ఎస్ 14వ వార్డు కౌన్సిలర్ కొక్కిరాల దీప్తి ప్రశ్నించారు, అదే విధంగా ఈ ఏడాది కూడా అధికంగా హరితహారం మొక్కల కోసం కొత్తగా గ్రీన్ బడ్జెట్‌ను రూ.1 కోటి 2 లక్షల 5 వేలకు పెంచడాన్ని ఆమె తప్పు పట్టారు. గ్రీన్ బడ్జెట్ పేరిట కోట్ల రుపాయలు వృథా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటికలను ఉపయోగంలోకి తీసుకురావాలని 21 వార్డు కౌన్సిలర్ అల్లె దశరథం కోరారు. -
మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తం
హన్మకొండ: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు నెలకు రూ.18,000 వేతనం చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాదవి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశలు శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి యత్నించారు. రాంనగర్‌లోని సీఐటీయూ కార్యాలయం నుంచి మంత్రి ఇంటికి ఆశలు ర్యాలీగా బయల్దేరారు. మంత్రి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు నెట్టేసి పోలీసులను తోపుకుంటూ ముందుకు వెళ్లేందుకు సీఐటీయూ నాయకులు, ఆశలు తీశ్రంగా శ్రమించారు. పోలీసులు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. అనంతరం మంత్రి ఇంటి సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు మంత్రి పీఏతో ఫోన్లో మాట్లాడించి.. శనివారం మంత్రి సురేఖను కలిసేలా ఏర్పాటు చేస్తామని వినతి పత్రం అందించి సమస్యలు వివరించుకోవచ్చని సీఐ రంజిత్ కుమార్ చెప్పడంతో శాంతించి ధర్నా విరమించారు. ఆశలను నాలుగో తరగతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 28న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ కార్యక్రమంలో ఆశ యూనియన్, సీఐటీయూ నాయకులు సుంచు రాజేశ్వరి, బైరి శోభ, జనగాం శ్వేత, సీహెచ్ శ్రీవాణి, పద్మ, సీహెచ్ రాణి, రమ, కవిత, రజిత, ఈసంపల్లి శోభ, కరుణలత, లీల, పుష్ప, ప్రేమలతతోపాటు వందలాది మంది ఆశలు పాల్గొన్నారు. ఆశ వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట రోడ్డుపై బైఠాయించి ధర్నా -
మొక్కజొన్నకు మద్దతు ధర
నర్సంపేట: మొక్కజొన్నకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట మార్కెట్ యార్డులో తెలంగాణ మార్క్‌ఫెడ్, నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పంటను విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని, తేమ శాతం నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మొక్కజొన్నలో తేమ శాతం 14కు మించకుండా ఉండాలని తెలిపారు. క్వింటాలుకు రూ.2,400 ధర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీసీఓ నీరజ, డీఎం మార్క్‌ఫెడ్ అధికారి రంజిత్‌రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు పటిష్టంగా అమలు కావాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణ, పోషణ్ అభియాన్, అక్షయపాత్ర భోజనం, ‘బేటీ బచావో.. బేటీ పడావో’ వంటి కార్యక్రమాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సీడీపీఓలు స్వరూప, ఉమా, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సింధురాణి, ఇన్చార్జ్ డీసీపీఓ ప్రవీణ్ కుమార్, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, సఖి కేంద్రం అడ్మిన్ హైమావతి, శిశు గృహ మేనేజర్ మాధవి, చైల్డ్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్, డీహెచ్డబ్ల్యూ కో–ఆర్డినేటర్ కళ్యాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
పిచ్చుకలు.. ప్రకృతి సమతుల్యతకు సూచికలు
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పిచ్చుకలు ప్రకృతి సమతుల్య తకు సూచికలని, అవి జీవించాలంటే సహజ వాతావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని పిచ్చుకల సంరక్షణపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణీకరణ, కాలుష్యంతో పిచ్చుకలు తగ్గిపోతుండడంతో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం పిచ్చుకల గూళ్లను పరిశీలించి కొన్ని పిచ్చుకలను ప్రకృతిలోకి వదిలారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్‌అగర్వాల్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ పాల్గొన్నారు. రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ సమర్పించాలి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం యాక్షన్‌ప్లాన్‌ను రెండు రోజుల్లో సిద్ధంచేసి సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సమన్వయంతో కృషిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన ఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, గూడ్స్, ప్యాసింజర్ (ఎలక్ట్రిక్) వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ విభాగాలు అందించి ఊబర్, జొమాటో, స్విగ్గీ, రాపిడో సంస్థలు, వ్యవసాయరంగంతో అనుసంధానం చేసి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. టీజీఓబీఎంఎంఎస్‌న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న కాపీతోపాటు సరైన ధ్రువపత్రాలు ఈనెల 25లోపు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. 23న పర్యావరణ పరిరక్షణపై కార్యక్రమం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు వరంగల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తమ ప్రదర్శనలను ఎంపికచేసి విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
నేడు ఈద్–ఉల్–ఫితర్
ఎంతో నిష్టతో కూడిన నెలరోజుల కఠిన రంజాన్ ఉపవాస దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఆత్మశుద్ధి, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే రంజాన్ మాసానికి వీడ్కోలు పలుకుతూ సంతోషాల పండుగ ఈద్–ఉల్–ఫితర్ రానే వచ్చింది. నేడు (శనివారం) ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకోనున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలతోపాటు గ్రామాలు కోలాహలంగా మారాయి. వరంగల్‌లోని ప్రధాన ఈద్గా మైదానాలను చదును చేసి సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు కార్పెట్లు, షామియానాలు ఏర్పా టు చేశారు. విద్యుత్ దీపాలతో పరిసరాలను అందంగా అలంకరించారు. – న్యూశాయంపేట రంజాన్ వేడుకలకు ముస్తాబైన జిల్లా ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు -
వరంగల్
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026భద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో అర్చనహన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం లిల్లీపూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి విశేషాలంకరణ జరిపారు. అనంతరం ముఖ్యార్చకుడు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు లిల్లీపూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వరంగల్‌కు చెందిన సూరినేని నవీన్‌రావు, నీరజ దంపతులు పుష్పార్చన ఉభయదాతలుగా వ్యవహరించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని పూజలు నిర్వహించుకున్నారు. ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, సిబ్బంది పర్యవేక్షించారు. -
పిచ్చుకలు.. ప్రకృతి సమతుల్యతకు సూచికలు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పిచ్చుకలు ప్రకృతి సమతుల్య తకు సూచికలని, అవి జీవించాలంటే సహజ వాతావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని పిచ్చుకల సంరక్షణపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణీకరణ, కాలుష్యంతో పిచ్చుకలు తగ్గిపోతుండడంతో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం పిచ్చుకల గూళ్లను పరిశీలించి కొన్ని పిచ్చుకలను ప్రకృతిలోకి వదిలారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అటవీశాఖాధికారి అనూజ్‌అగర్వాల్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ పాల్గొన్నారు. రెండు రోజుల్లో యాక్షన్‌ప్లాన్ సమర్పించాలి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం యాక్షన్‌ప్లాన్‌ను రెండు రోజుల్లో సిద్ధంచేసి సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సమన్వయంతో కృషిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని, రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం..స్వయం ఉపాధి పథకాలు అందించేందుకు అర్హులైన ఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, గూడ్స్, ప్యాసింజర్ (ఎలక్ట్రిక్) వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ విభాగాలు అందించి ఉబేర్, జొమాటో, స్విగ్గీ, రాపిడో సంస్థలు, వ్యవసాయరంగంతో అనుసంధానం చేసి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. టీజీఓబీఎంఎంఎస్‌న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న కాపీతోపాటు సరైన ధ్రువపత్రాలు ఈనెల 25లోపు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ముస్లింలకు ఒక ప్రకటనలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో జిల్లా ప్రజలకు సుఖ సంతోషాలు, సకల శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ అందరూ సోదరభావంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. -
రంజాన్ పండుగ శుభాకాంక్షలు
హన్మకొండ అర్బన్: రంజాన్ పండుగ సందర్భంగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద ఆయా జిల్లాల ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ సోదరభావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. న్యూశాయంపేట : అంతరించిపోతున్న పక్షి సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హనుమకొండ జిల్లా అటవీశాఖాధికారి, జూపార్క్ క్యూరేటర్ బి.లావణ్య అన్నారు. శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు కాకతీయ జూవాలజికల్ పార్క్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలకు వచ్చే పిచ్చుకలు, పక్షులకు ఆహారం, నీరును అందించి వాటి సంరక్షణకు సహాయపడాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, కేయూ ప్రొఫెసర్ తిప్పని రాధిక, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ ఎన్జీఓ ప్రతినిధులు నాగేశ్వర్రావు, శ్యాంసుందర్, రవిబాబు, అటవీశాఖ సిబ్బంది సూరిదాస్, శివకుమార్, శారద, శ్వేత, సురేశ్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం లిల్లీపూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి విశేషాలంకరణ జరిపారు. అనంతరం ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు లిల్లీపూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వరంగల్‌కు చెందిన సూరినేని నవీన్‌రావు, నీరజ దంపతులు పుష్పార్చన ఉభయదాతలుగా వ్యవహరించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం భద్రాద్రి రాముడిగా పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. పాంచరాత్ర ఆగమానుసారం చెరకుమల్లి శ్రీవాత్సవచార్యులు ఆధ్వర్యంలో రాముల వారి ఉత్సవ విగ్రహాన్ని భద్రాద్రి రాముడిగా అలంకరించి పూజలు, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. యాగశాలలో వివిధ ధాన్యాలు, పండ్లు, పూలు సమర్పిస్తూ మహా సుదర్శన హోమం ని ర్వహించారు. పూజా కార్యక్రమాల్లో తమిళనా డు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ముఖేశ్, తిరుమూర్తి, బ్రాహ్మణ సేవాసంఘం సమాఖ్య రాష్ట్ర అ ధ్యక్షుడు మోతుకూరి రామేశ్వరరావు, శ్రీరామసేవాసమితి సభ్యుడు కట్ల రాజు ఉన్నారు. విద్యారణ్యపురి: వేసవి తీవ్రత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఆదేశాల ప్రకారం అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఒంటి పూట మాత్రమే బడులు నడపాలని, రెండుపూటలా నడిపితే చర్యలు తీసుకుంటామని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో వార్షిక పరీక్షల పేరిట హాల్ టికెట్లు జారీ సమయంలో ఫీజులు చెల్లించని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయని, విద్యాశాఖ సూచనలు పాటించాలని ఆయన కోరారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమహన్మకొండ: ఎన్నికల హామీలు నెరవేర్చడంలో రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, రాష్ట్ర నాయకురాలు రావు పద్మ ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్పీ.జయంత్‌లాల్, సండ్ర మధు, డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ పెసరు విజయ్‌చందర్ రెడ్డి, చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, దొంతి దేవేందర్ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ రావు, నానునాయక్, చాడా స్వాతి, దాస్యం అభినవ్ భాస్కర్, గుజ్జుల వసంత, బైరి లక్ష్మి, కోమల, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. హన్మకొండ: విద్యుత్ బస్సులు ఆర్టీసీకే కేటాయించేలా చూడాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి ఉపేంద్రచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ –1, వరంగల్ –2 డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తూ ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని, ఆర్టీసీ యూనియన్లపై ఆక్షలు ఎత్తివేయాలని, 2021, 2025 వేతన సవరణ అమలు చేయాలని, 2017 అలవెన్సులు చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎస్ వరంగల్ –2 డిపో కార్యదర్శి వై.శ్రీనివాస్, కరీంనగర్ జోన్ కోశాధికారి ఎండీ ఆర్కేపాషా, ఉద్యోగి సంపత్ పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
దుగ్గొండి: గ్రామంలో రోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన ఆదేశించారు. మండలంలోని మల్లంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ రకాల రికార్డులు, నర్సరీలో మొక్కలను పరిశీలించారు. వనమహోత్సవంలో నాటడానికి ఏ రకాల మొక్కలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ఆదాయం పెరిగేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ఎంపీఓ మోడెం విద్యాసాగర్, సర్పంచ్ బూర రాధిక, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. హామీలను నెరవేర్చాలి : బీజేపీన్యూశాయంపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ వృద్ధులు, వితంతువుల పింఛన్ల మొత్తాన్ని పెంచాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలని డిమండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుసుమ సతీశ్, వన్నాల వెంకటరమణ, రత్నం సతీశ్, నాయకులు పరమేశ్వర్, మురళీకృష్ణ, మహేందర్‌రెడ్డి, హరిశంకర్, బన్న ప్రభాకర్, ఎ.జనార్దన్, ఎ.వెంకట్, రాజేశ్వర్‌రావు, రఘునారెడ్డి, క్రాంతి, రాజు, రాజ్‌కుమార్, శివకుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 23న పర్యావరణ పరిరక్షణపై కార్యక్రమం న్యూశాయంపేట: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తమ ప్రదర్శనలను ఎంపికచేసి విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. భద్రాద్రి రాముడిగా పూజలు హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం భద్రాద్రి రాముడిగా పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాంచరాత్ర ఆగమానుసారంగా చెరకుమల్లి శ్రీవాత్సవాచార్యులు ఆధ్వర్యంలో రాముల వారి ఉత్సవ విగ్రహాన్ని భద్రాద్రి రాముడిగా అలంకరించి పూజలు, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. పింఛన్ మంజూరు చేస్తాంసంగెం : పెయింటింగ్ చేస్తు ప్రమాదానికి గురై వికలాంగుడిగా మారిన మండలంలోని లోహితకు చెందిన అరూరి మహేందర్‌కు దివ్వాంగ పింఛన్ మంజూరు చేస్తామని ఎంపీడీఓ కాసర్ల రవీందర్ తెలిపారు. మహేందర్ తండ్రి భిక్షపతి పదేళ్ల క్రితం మృతి చెందగా తల్లి కోమల కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో మహేందర్ పెయింటింగ్ పని చేస్తు ప్రమాదానికి గురి కాగా నడుం నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయి మంచానికి పరిమితమయ్యాడు. మహేందర్‌కు ఇటీవల వైద్యులు సదిరం సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో మహేందర్ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓ శుక్రవారం విచారణ చేపట్టారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి, సర్పంచ్ బొమ్మెర నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మినరల్ మిథ్య!
వరంగల్ అర్బన్: మినరల్ వాటర్ తాగుతున్నాం.. మా ఆరోగ్యానికి ఢోకా లేదని ధైర్యంగా ఉన్నారా.. మీరు తాగేది స్వచ్ఛమైన మినరల్ వాటరే అని అనుకుంటున్నారా.. ఆ నీటిని కాచి చల్లార్చకుండానే మీ పిల్లలకు తాగిస్తున్నారా.. అయితే ఆరోగ్యం చేజా రిపోతున్నట్లే.. నగరంలో అనేకమంది మినరల్ వాటర్ప్లాంట్ల నిర్వాహకులు సరఫరా చేస్తున్న నీరు స్వచ్ఛమైనది కాదని, ఆ నీటిలో కనీస నాణ్యత లేద ని మీకు తెలుసా? ఔను.. చాలా ప్లాంట్లలో నిబంధనలకు విరుద్ధంగా అండర్‌గ్రౌండ్ నుంచి తీసిన నీటికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా క్యాన్లు, ప్యాకెట్లలోకి నింపుతున్నారు. దీనిపై కా ర్పొరేషన్ ప్రజారోగ్య విభాగం దృష్టి సారించకుంటే ప్రజారోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదముంది. 12 ప్లాంట్లకు మాత్రమే బీఐఎస్ గుర్తింపు.. వరంగల్ నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేషన్ సరఫరా చేసే నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో చాలా మంది మినరల్ వాటర్‌పై ఆధారపడుతున్నారు. దీంతో నగరంలో ఇబ్బడి ముబ్బడిగా గ్రౌండ్ వాటర్ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. తక్కువ ధరకే నీటిని సరఫరా చేస్తామంటూ అనేక మంది అనుమతి లేకుండా, కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 450కి పైగా గ్రౌండ్ వాటర్ప్లాంట్లు, 3,500 వరకు ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో 12 మాత్రమే బీఐఎస్ గుర్తింపు కలిగి ఉన్నాయి. రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం నగరంలో ఉన్న 450 ప్లాంట్ల నుంచి రోజుకు లక్షల లీటర్ల నీళ్లు ఉత్పత్తి అవుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ప్రతీ వాటర్ ప్లాంట్ నుంచి 18 లక్షల లీటర్ల వరకు నీరు ఉత్పత్తి అవుతోంది. మినరల్ పేరుతో విచ్చలవిడిగా రసాయనాలు కలిపిన ఈ నీరు క్యాన్లు, ప్యాకెట్ల రూపంలో నివాస గృహాలు, హోటళ్లు, దుకాణాలకు సరఫరా అవుతోంది. 20 లీటర్ల వాటర్ క్యాన్‌కు రూ.10 నుంచి రూ.30 వరకు, వాటర్ ప్యాకెట్ రూ.2 చొప్పన విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు రూ.20 లక్షలకు పైగా వ్యాపారం జరుగుతోంది. పట్టించుకోని అధికార యంత్రాంగం నిబంధనలు పాటించకుండా ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ప్రజారోగ్య విభాగం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. వాటర్, ఇండస్ట్రియల్ డిపార్టుమెంట్లు ఈ ప్లాంట్లను పర్యవేక్షించడం లేదు. డబ్బులిచ్చి మరీ రోగాలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. వేసవిని తమ ‘మార్కెట్‘కు అనుకూలంగా ఎంచుకొని అక్రమార్కులు నగరప్రజలే టార్గెట్‌గా విజృంభిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. నామమాత్రంగా దాడులు నిర్వహించినా అధికారులపై రకరకాల ఒత్తిళ్లు వస్తున్నాయి. అయితే, ఇదే పరిస్థితి ఉంటే ‘మంచి’ నీటి రూపంలో మనకు అనారోగ్యంతో పాటు ఆర్థిక నష్టం కూడా జరుగుతోంది. గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన వాకటి కరుణ పర్యవేక్షణలో అనుమతి లేని ప్లాంట్లను మూసివేసేందుకు జిల్లా అధికారులతో కమిటీని నియమించి, తనిఖీలు చేసి సీజ్ చేశారు. కొన్నేళ్లుగా ఆహార కల్తీ నిరోధక శాఖ, రెవెన్యూ, గ్రేటర్ వరంగల్ అధికారులు వాటర్ప్లాంట్ల వైపు చూడడం మరిచిపోయారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలు పాటించని వాటర్ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటించని వాటర్ప్లాంట్ల నిర్వాహకులు నీటిలో విచ్చలవిడిగా రసాయనాల వాడకం వ్యాధులబారిన పడుతున్న నగర ప్రజలు పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ అధికారులువాటర్ ప్లాంట్‌కు బీఐఎస్ అనుమతి తీసుకోవాలి. ఏడాదికోమారు రెన్యువల్ చేసుకోవాలి. రూ.90 వేల ఫీజు చెల్లించాలి. విశాలమైన ప్రాంతంలో హెచ్‌డీపీ, స్టీల్ పైపులు ఏర్పాటు చేయాలి. ఐఎస్ఐ మార్కు కలిగిన ఫిల్టర్ మిషన్లు ఉండాలి. నీటి ట్యాంకులు ఇతర సామగ్రి నాణ్యమైనవి వినియోగించాలి. జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ నుంచి అనుమతి పొందాలి. వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. బల్దియా నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలి. ఇద్దరు టెక్నీషియన్లు ఉండాలి. ఎప్పటికప్పుడు వాటర్ శాంపిల్ పరీక్షలు చేయాలి. కానీ, వీటిలో ఒక్క నిబంధన కూడా ప్లాంట్ల నిర్వాహకులు పాటించడం లేదు. గల్లీకో చోట విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ నీటి వ్యాపారం సాగిస్తున్నారు. -
పరిశుభ్రతకు ప్రాధాన్యం
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డులోని డ్రెయినేజీల పూడికతీత పనులను చైర్మన్ పాలకుర్తి సారంగపాణితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగాది శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. గతంలో కొంతమంది వద్ద డబ్బులు తీసుకుని మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇచ్చి తర్వాత తొలగించారనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ అంశఽంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన పట్టణంలో అవసరమైన పారిశుద్ధ్య కార్మికులను అదనంగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి 250 మంది కార్మికులను నియమించాలని ఇటీవల సీఎంకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే స్వయంగా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ షీభారాణి రాజేందర్, మున్సిపల్ కమిషనర్ సుఽధీర్‌కుమార్, కౌన్సిలర్లు కమిలి, పాపారావు, తిరుపల్లి వాణి, ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, నాయకులు ఎండీ చోటు, ఎండీ అప్సర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
● రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు ● రైతుల మహాగర్జన సభ విజయవంతం కావాలని పూజలు హన్మకొండ కల్చరల్: పాలకులు రైతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్లో ఓసీ జేఏసీ, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష మందితో రైతుల మహా గర్జన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో సమాఖ్య రాష్ట్ర, ఉమ్మడి జిల్లాల నాయకులు పాల్గొని రైతుల మహాగర్జన సభ విజయవంతం కావాలని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, ప్రత్యేకపూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. అనంతరం పోలాడి రామారావు విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా అందరినీ మహా గర్జన సభకు ఆహ్వానిస్తున్నట్లు, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను మహాగర్జన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. పూజా కార్యక్రమంలో రాష్ట్ర వైశ్య సంఘాల జేఏసీ చైర్మన్ అయిత నాగరాజు, రైతు సంఘాల రాష్ట్ర జేఏసీ తోట సురేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. -
అభివృద్ధి.. సవాళ్లు!
సాక్షి, వరంగల్: పరాభవనామ సంవత్సరంలో వరంగల్ జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కోనుంది. మౌలిక వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాను ముందుకు నడిపితే.. వ్యవసాయం, వాతావరణం, పరిపాలన సమస్యలు కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పన కోసం.. హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి కేంద్రంగా గ్రేటర్ వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడం కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్న గ్రేటర్ వరంగల్‌లో వరద, మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఉద్దేశించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూడీజీ) ప్రాజెక్టుకు రూ.5,257 కోట్లతో ఫేజ్–1 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, ఏళ్లుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడంతో ఆ నిర్మాణ పనులు కూడా ఈ ఏడాదిలో ప్రారంభించే అవకాశముంది. రంగశాయిపేట నాయుడు పెట్రోల్‌బంకు నుంచి ఆరెపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది. కేంద్రం తీసుకొచ్చిన ‘సాస్కీ’ ప్రాజెక్టు కింద రూ.300 కోట్లతో కీలక ప్రాజెక్టులు, వివిధ పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది. – శ్రీరామోజు వీరబ్రహ్మచార్యులు, జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి, ఓసిటీ, వరంగల్ హనుమకొండ ప్రాంత శుభాశుభ ఫలితాలు హన్మకొండ కల్చరల్: శ్రీపరాభవ నామసంవత్సరంలో హనుమకొండ జిల్లా పునర్వసు నక్షత్రం, మిధునరాశి అవుతుంది. ఈ సంవత్సరం గురువు జూన్ 1వరకు ఒకటో స్థానంలో ఉండి స్థానిక సమస్యల అవగాహన, ఆర్థిక, అభివృద్ధి పనుల్లో చురుకుగా ఉండగలదు. గురుగ్రహం వల్ల శుభం కలుగుతుంది. డిసెంబర్ నుంచి రాహు, కేతుల వల్ల స్థానమార్పులు ఉంటాయి. కొంత ప్రతికూల పరిస్థితులు, స్థానిక సమస్యలు ఏర్పడుతాయి. వీటిని అధిగమించే అవకాశం ఉంది. పరాభవ నామ సంవత్సరంలో వరంగల్, హనుమకొండ జిల్లాల జాతకం కీలక ప్రాజెక్టులకు కోట్లాది రూపాయల ఖర్చు త్వరలో నగరంలో యూజీడీ పనులు ప్రారంభంజిల్లాల వారీగా.. జిల్లా : వరంగల్ హనుమకొండ రాశి : వృషభం మిథునరాశి నక్షత్రం : రోహిణి పునర్వసు ఆదాయం : 5 08 వ్యయం : 14 11 -
ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు షురూ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి నిర్మాల్య సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వసంత నవరాత్ర ఉత్సవాలు జరపడానికి అనుజ్ఞాప్రార్థన జరిపి పూర్ణాభిషేకం నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమా దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్న అనంతరం అమ్మవారి సన్నిధిలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఉగాది పర్వదినం కావడంతో భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. మొదటిరోజు పసుపు రంగు చామంతులకు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు జ్యోతిష్య పండితుడు అయినవోలు రాధాకృష్ణశర్మ సిద్ధాంతిచే పంచాంగ పఠనం నిర్వహించారు. -
లక్ష్య సాధనకు ఇష్టపడి చదవాలి
సివిల్స్ 123వ ర్యాంకర్ అట్ల తరుణ్‌తేజ కాజీపేట అర్బన్: లక్ష్యాన్ని ఎంచుకుని సాధించేందుకు ఇష్టపడి చదవాలని సివిల్స్ 123వ ర్యాంకు సాధించిన అట్ల తరుణ్ తేజ అన్నారు. హంటర్ రోడ్డులోని శ్రీవ్యాస ఆవాసంలో గురువారం సులక్ష్య సేవాసమితి 13వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సివిల్స్ సాధించాలనే సంకల్పంతో నాలుగుసార్లు విఫలమైనా ఐదోసారి 123వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఓటమితో కుంగిపోకుండా విజయం సాధించే వరకు శ్రమించాలన్నారు. సమాజ సేవలో సులక్ష్య సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆవాసంలోని చిన్నారులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భారతీయ వాయుసేన ఆఫీసర్ అనిల్‌కుమార్ త్రిపాఠి, సేవా సమితి వ్యవస్థాపక, అధ్యక్షుడు మండువ సంతోశ్, సాయికిరణ్, వినయ్, ప్రణీత్, వసుంధర, రామాచారి పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: పోతన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో గురువారం పీఠం కార్యవర్గసభ్యులు గంధ శ్రీనివాస్, బన్న అయిలయ్య, ఎన్వీఎన్ చారి, అడ్టూరి చంద్రశేఖర్, జూలూరు నాగరాజు పాల్గొని పసుమర్తి సాంబశివ సోమయాజులు రాసిన ‘భూకంపాలు జ్యోతిష్య శాస్త్ర పరిశీలన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉగాదిని పురస్కరించుకుని కవులు వల్స పైడి, జూలూరు నాగరాజు, కుడికాల జనార్దన్ తదితరులు కవితాగానం చేశారు. ఈసందర్భంగా సాంబశివ సోమయాజులుకు జ్యోతిష్య జ్ఞానరత్న పురస్కారం ప్రదానం చేశారు. అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నగరానికి చెందిన వీఆర్ విద్యార్థి, రాజశేఖర్, రమేశ్‌బాబు, సుబేదార్ ప్రభాకర్, చెనుమల్ల శ్రీధర్‌ను సన్మానించి పోతన పురస్కారాలు ప్రదానం చేశారు. ఎంపీ కడియం కావ్య హన్మకొండ అర్బన్: మానసిక దివ్యాంగుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మానసిక దివ్యాంగులపై ఉన్న అపోహలు, వివక్ష తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధార్ లింకేజీ సమస్యల వల్ల పలువురు దివ్యాంగులు పెన్షన్లు, వైద్య సదుపాయాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో గురువారం మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకున్నారు. కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు కొత్త బట్టలు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు రామలీల, కళ్యాణ్ పాల్గొన్నారు. -
వరంగల్
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026● కీలక ప్రాజెక్టులకు కోట్లాది రూపాయల ఖర్చు ● త్వరలో నగరంలో యూజీడీ పనులు ప్రారంభం ● మామునూరు విమానాశ్రయానికి రెక్కలొచ్చే అవకాశం ● మెగాటెక్స్‌టైల్ పార్కుతో మెండుగా ఉద్యోగాలు ● వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపనున్న వాతావరణం ఉద్యోగం.. ఉద్యమంకాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగాలివ్వాలనే ఉద్యమం ఊపందుకుంటోంది.జిల్లా వరంగల్ ఇఫ్తార్ రాశి : వృషభం శుక్ర 6:33అభివృద్ధి.. సవాళ్లు!నక్షత్రం : రోహిణి ఆదాయం : 5 వ్యయం : 14 సాక్షి, వరంగల్: పరాభవనామ సంవత్సరంలో వరంగల్ జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కోనుంది. మౌలిక వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాను ముందుకు నడిపితే.. వ్యవసాయం, వాతావరణం, పరిపాలన సమస్యలు కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే అభివృద్ధికి అవకాశం ఎక్కువ.. కానీ, సవాళ్లు కూడా తక్కువ కావు అని జ్యోతిష్య సిద్ధాంతులు చెబుతున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం.. వరంగల్‌ను హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడం కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్న గ్రేటర్ వరంగల్‌లో వరద, మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఉద్దేశించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టుకు రూ.5,257 కోట్లతో ఫేజ్–1 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత తొందర్లోనే ఈ పనుల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశాలు ఉండడంతో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అలాగే, ఏళ్లుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడంతో ఆ నిర్మాణ పనులు కూడా ఈ ఏడాదిలో ప్రారంభించే అవకాశముంది. రంగశాయిపేట నాయుడు పెట్రోల్‌బంకు నుంచి ఆరెపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది. ఇప్పటికే కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాస్కీ (స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) ప్రాజెక్టు కింద రూ.300 కోట్లతో కీలక ప్రాజెక్టులతో పాటు వివిధ పనులు పట్టాలెక్కే అవకాశముంది. ఇదిలా ఉండగా సంగెం, గీసుకొండ మండలాల్లో విస్తరించి ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ కంపెనీల వృద్ధి పెరిగి జిల్లా ప్రజలకు ఉద్యోగవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అసాధారణ వర్షాలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు.. జిల్లాలో అసాధారణ వర్షాలు, ఉష్ణోగ్రతల మార్పులు వ్యవసాయంపై ప్రభావం చూపే అవకాశముంది. ఇది పంటలపై మాత్రమే కాకుండా పట్టణ జీవనంపై ప్రభావం చూపనుంది. అదే సమయంలో నకిలీ విత్తనాలు, పురుగు మందుల సమస్య, పంటల దిగుబడి అస్థిరత, వాతావరణ మార్పుల ప్రభావం ఉండే చాన్స్ ఉంది. మిర్చి, పత్తి పంటలు రైతులకు ఆశ చూపుతున్నప్పటికీ దిగుబడి తగ్గుదల ఆందోళన కలిగించే అవకాశముంది. అయితే సమయానుకూల పనుల వల్ల కొంతమంది రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చే అవకాశం కూడా ఉంది. అలాగే, కీలక ప్రాజెక్టులు పనులు మొదలైనా నిధుల విడుదల్లో జాప్యం, భూసేకరణ ఆలస్యంతో నింపాదిగా అభివృద్ధి పనులు సాగే అవకాశముంది. అభివృద్ధిలో వరంగల్ దూసుకెళ్తుంది.. స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో వరంగల్ జిల్లాకు రోహిణి నక్షత్రం, వృషభరాశి అవుతుంది. దీని ఆధారంగా ఆదాయం 5, వ్యయం 14 ఉంది. జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులతోపాటు విద్య, వైద్య, ఆరోగ్యం, సాంస్కృతిక రంగాలు, పారిశ్రామిక రంగాల్లో వరంగల్ అభివృద్ధి చెందుతుంది. అందరూ నేతలు కలిసికట్టుగా ఉండడం ద్వారా వరంగల్ నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. రాబడి తక్కువ, వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. – శ్రీరామోజు వీరబ్రహ్మచార్యులు, జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి, ఓసిటీ, వరంగల్ -
పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!
తగ్గిపోవడానికి కారణాలెన్నో.. పిచ్చుకల సంతతి తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్తు ,పెట్రోల్ వంటివి వినియోగం, సెల్టవర్ల కారణంగా పెరుగుతున్న రేడియేషన్, పట్టణీకరణ పేరుతో ఎక్కడికక్కడ సిమెంట్ ఇళ్ల నిర్మాణాలు, కనీసం ఇవి గూడు పెట్టుకునే ఆవాసాలు లేకపోవడం, వ్యవసాయంలో పురుగు మందులు, క్రిమి సంహారక మందుల వినియోగం బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఖిలా వరంగల్: జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు.. ఈ సంపద ప్రకృతి వరప్రసాదం. అందులో పిచ్చుకలు.. ప్రకృతికి అందం, మానవాళికి జీవవైవిధ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే నగర, పట్టణ,గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. ఇళ్లల్లోకి వచ్చి కిచకిచమంటూ పలకరించేవి. చప్పుడు చేయగానే తుర్రుమంటూ ఎగిరిపోతుండేవి. కాలక్రమంలో ఈబుజ్జి పక్షులు మన జీవితాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించడంతో పాటు వాటి ప్రాఽధాన్యం మానవాళికి తెలియజేయడం కోసం ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలతో మానవాళికి మనుగడ.. చూసేందుకు చిన్నవిగా ఉండే పిచ్చుకలు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పంటలను ఆశించే వివిధ కీటకాలను తినడం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా రైతులకు మేలు చేస్తాయి. వివిధ పంటల్లో పరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు పెంచుతాయి. నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి. మనమేం చేయాలంటే.. అవగాహన ఉన్న కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు తమ పంట పొలాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా టీ ఆకారంలో కర్రలను ఉంచడం ద్వారా వాటిపై పక్షులు వాలుతుంటాయి. ● పొలం గట్లపై మోదుగు, సీమ చింత, మల్బ రీ, నేరేడు వంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా పక్షులు పంట పొలాలకు దగ్గరలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ● నగరాల్లో ప్రత్యేక గూళ్లు లభ్యమవుతున్నాయి. ఇంటి ఫోర్టికో వద్ద, పరిసరాల్లో ఆ గూళ్లను ఏర్పాటు చేసి అక్కడక్కడా డబ్బాల్లో ధాన్యం గింజలు, తాగునీరు అందుబాటులో ఉంచాలి. సంరక్షణ బాధ్యతగా భావించాలి.. మానవ జాతి మనుగడతో ముడిపడి ఉన్న పిచ్చుకల సంరక్షణను బాధ్యతగా భావించాలి. అందరూ తమ ఇళ్ల ముందు మొక్కలు నాటి, ఇంటి సరిసరాల్లో పిచ్చుకలు నివసించడానికి వీలుగా చెక్కతో తయారు చేసిన డబ్బాలను అమర్చాలి. వాటిలో ధాన్యం, నీళ్లు అందించాలి. పిచ్చుకలు ఇళ్లల్లో నివసిస్తే ఆ ఇంటికి శుభ సూచకంగా భావిస్తారు. – గాదె స్వరూప్‌రెడ్డి పక్షి ప్రేమికుడు హనుమకొండ మందుల వినియోగం తగ్గాలి.. తెగుళ్లు నివారణ కోసం విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వినియోగం వల్ల పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులతోపాటు పిచ్చుకల మనుగడకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. రైతు నేస్తాలుగా వీటిని పరిగణించి వాటికి ప్రత్యేకంగా ఆవాసాలు కల్పించాలి. పిచ్చుకల దినోత్సవాలను నిర్వహించడం ద్వారా ఈచిన్న పక్షులను మన జీవితాల్లోకి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగాలి. – డాక్టర్ అరుణ్‌జ్యోతి, కేవీకే శాస్త్రవేత్త ● ఆహ్లాదాన్ని పంచే అతి చిన్న పక్షులు రక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
ఒకేసారి మూడు నెలల రేషన్
● సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు ● షాపులకు బియ్యం తరలింపునకు చర్యలుఖిలా వరంగల్: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న మూడు నెలల్లో మరి ఎండలు ఎలా ఉంటాయోనని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యం పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు రేషన్ పంపిణీ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల బియ్యాన్ని సమకూర్చుకునేందుకు జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేటలో ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి జిల్లాలోని మండలాలకు బియ్యం సరఫరా అవుతాయి. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని స్టేజీ–1, స్టేజీ–2 గోదాముల్లో ఏప్రిల్ నెల పంపిణీకి పోగా ఇంకా ఎన్ని క్వింటాళ్ల బియ్యం నిల్వలున్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా మూడు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఏప్రిల్ లోనే పంపిణీ చేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. 16,782.84 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం జిల్లాలో 509 రేషన్ షాపుల పరిధిలో 2,93,824 రేషన్‌కార్డులు ఉన్నాయి. 8,88,153 మంది లబ్ధిదారులకు నెలకు 5504.268 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలంటే మొత్తం 16,782.804 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఆవసరం ఉంటుంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో నిల్వ చేసేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న సన్నబియ్యానికి డిమాండ్ భాగా పెరిగింది. స్టేజీ–2 గోదాముల్లో ఒక నెలకు సంబంధించిన బియ్యం నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. మూడు నెలల బియ్యం పంపిణీ కోసం ప్రత్యామ్నాయంగా నిల్వ ఉంచడమా లేక వచ్చిన లారీలను వెంటనే దుకాణాలకు సరఫరా చేయడమా అనేది ఆలోచిస్తున్నారు. చాలా వరకు రేషన్ దుకాణాల్లోనూ స్థలం తక్కువగా ఉంది. ఒక నెల బియ్యం మాత్రమే పట్టేలా గదులు ఉన్నాయి. దీంతో దుకాణాలు వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం, లేదా అమ్మగానే డీలరు గోదాముకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. అదనపు కలెక్టర్ ఆదేశాల ప్రకారం పంపిణీ.. మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నాం. సన్నబియ్యం గోదాముల్లో నిల్వ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. 509 రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వ ఎంత మేర సరఫరా చేయాలనేది జాబితా తయారు చేశాం. జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆదేశాల ప్రకారం సన్నబియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. – కిష్టయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారిమండలాల వారీగా రేషన్‌షాపులు, కార్డులు, రేషన్ పంపిణీ వివరాలుమండలాలు రేషన్‌షాపులు కార్డులు మూడు నెలల రేషన్ (మెట్రిక్ టన్నుల్లో)చెన్నారావుపేట 23 14,240 784.872 దుగ్గొండి 34 16,044 854.568 గీసుకొండ 35 19,902 1073.778 ఖానాపురం 20 11,087 634.506 నల్లబెల్లి 30 12,882 742.53 నర్సంపేట 40 24,794 1377.168 నెక్కొండ 35 19,264 1073.079 పర్వతగిరి 35 16,636 925.419 రాయపర్తి 37 18,675 1087.923 సంగెం 31 16,562 901.8 వర్ధన్నపేట 32 16,649 935.013 వరంగల్ 85 54,613 3332.163 ఖిలా వరంగల్ 72 52,476 3059.985 మొత్తం 509 2,93,824 16,782.804 -
ఉగాది.. భవిష్యత్‌కు పునాది
వేప పూత పులకరింతలు, మామిడి పిందెల పలకరింతలు, మోదుగచెట్ల మధురిమలు. తీరొక్క పూల పరిమళాలు.. నూతనత్వానికి ఆనవాళ్లు.. నూతన సంవత్సరాది వేడుకలు. – హన్మకొండ కల్చరల్తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ పండుగ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. సౌభాగ్యానికి , ప్రేమ, ఆధ్యాత్మిక చింతనకు, పల్లెల్లోని జానపదుల జీవనశైలికి సంకేతంగా నిలుస్తోంది. తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజున కొత్తగా నిర్ణయాలు తీసుకునేందుకు ఇష్టపడతారు. పంచాంగం విని భవిష్యత్‌కు పునాది వేసుకుంటారు. కొత్త మజిలీలను వెతుక్కుంటారు. ‘శ్రీపరాభవ’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నేడు (గురువారం) ఉగాది పర్వదినం జరుపుకునేందుకు గ్రేటర్ వరంగల్ ప్రజలు సిద్ధమయ్యారు. పచ్చడి ప్రత్యేకత.. చైత్రమాసం నాటికి కొత్తగా వచ్చే పంటలైన చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేప పూతను కొత్తకుండలో వేసి పచ్చడిగా చేసి భగవత్ నివేదనలుగా సమర్పిస్తారు. దీన్ని షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తారు. ఈ పానీయం తాగితే మండుటెండల నుంచి రక్షణ పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. వేయిస్తంభాల గుడిలో ప్రత్యేకం.. చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి ఆలయంలో 48 ఏళ్లుగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేయన్నుట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ చెబుతున్నారు. సాయంత్రం సంస్కృత పండితులు సముద్రాల శఠగోపాచార్యులుచే పంచాంగశ్రవణం, కూచిపూడి నృత్యాలు, కవి సమ్మేళనం జరుగుతాయని వేయిస్తంభాల ఆలయ ఈఓ అనిల్‌కుమార్ తెలిపారు. రోడ్ల వెంట రద్దీ.. ఉగాది పండుగను పురస్కరించుకుని పండుగకు కావాల్సిన కొత్త బెల్లం, కొత్త చింతపండు, నోము దండలు, జంద్యాలు, కొత్త కుండలు, దీపాంతలు, వివిధ రకాల పూలు, మోదుగపూలు, మోదుగాకులు, ఇసుక, మర్రి ఊడలు, పసుపు కుంకుమ గంధం, మామిడాకులు తదితర వస్తు సామగ్రి కొనుగోలు, అమ్మకాలతో నగరంలో సందడి ఏర్పడింది. పరాభవ సంవత్సరంలో రాజు ‘గురువు’ శ్రీపరాభవ నామ సంవత్సరంలో గురువు రాజుగా, కుజగ్రహాలు మంత్రిగా ఉన్నాయి. గురువు రాజైతే పాలకులు కర్మయుక్తులు, ధర్మయుక్తులు అవుతారు. ప్రజలు సుభిక్షంగా జీవిస్తారు. పాడి అభివృద్ధి, బంగారం, ముత్యాలు, వస్తువుల ధరలు పెరుగుతాయి. – గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు రుషులు అందించిన అద్భుత విజ్ఞానం.. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలు ఉన్నదే పంచాంగం. దీన్ని మహా విష్ణుస్వరూపంగా భావించి పూజించాలి. సాయంకాలం పంచాంగ శ్రవణం చేయాలి. నేటి ఆధునిక కాలపు నవీన విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో భారతీయులు పంచాంగం ద్వారానే కాలగతులు తెలుసుకునేవారు. ఎక్కడో ఉన్న గ్రహాలను వాటి దూరాలను ఎలాంటి టెలిస్కోప్ వంటి ఖగోళ విజ్ఞాన శోధన పరికరాలు లేకుండా భారతీయ మేధావులు సృష్టించిన ఒకానొక అద్భుతమే పంచాంగం. – డాక్టర్ శ్రీఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి, ఆస్ట్రాలజర్పంచాంగ శ్రవణానికి ముస్తాబైన ఆలయాలు నగరంలో పండుగ రద్దీ నేడు వేయిస్తంభాల ఆలయంలో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం బంచ్కు రూ.50 పలుకుతున్న ధర సాక్షి, వరంగల్: ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వుకు ఈసారి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జిల్లాలోని చాలా మండలాల్లో వేప చెట్లు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడడంతో కొమ్మలు మోడువారిపోయాయి. ప్రస్తుతం వేప పువ్వు దొరికే పరిస్థితి లేదు. కానీ ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేసుకునే వేప పువ్వుకు ఈసారి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. గ్రేటర్ వరంగల్‌లో బుధవారం రూ.20 నుంచి రూ.50 వరకు (చిన్న కట్ట, ఆకులతో కూడుకున్నది) వేప పువ్వును వ్యాపారులు విక్రయించారు. ప్రముఖుల శుభాకాంక్షలు..న్యూశాయంపేట/వరంగల్‌క్రైం/హన్మకొండ అర్బన్: పరాభవ నామ సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్‌పాయ్, పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో ఆయా జిల్లాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని వారు ఆకాంక్షించారు. తెలుగు వారి కొత్త సంవత్సరంలో అందరూ సంతోషం, శాంతి, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


