బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు

Jun 17 2024 1:38 AM | Updated on Jun 17 2024 11:41 AM

బాధ్య

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు

వరంగల్‌లో డాక్టర్‌ సత్య శారదదేవి

హనుమకొండలో ప్రావీణ్య..

కాళోజీ సెంటర్‌/హన్మకొండ: వరంగల్‌ కలెక్టర్‌గా డాక్టర్‌ సత్య శారదదేవి, హనుమకొండ కలెక్టర్‌గా పి.ప్రావీణ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో వారిని రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్‌ కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఆర్‌ఓ అయూబ్‌అలీ, డీఈఓ డి.వాసంతి, బీసీ వెల్ఫేర్‌ అధికారి పుష్పలత, ఆర్డీఓలు సీతం దత్తు, కృష్ణవేణి, ఎల్‌డీఎం హవేలీ రాజు, కలెక్టరేట్‌ ఏఓలు శ్రీకాంత్‌, అబీద్‌ అలీ, తహశీల్దార్లు ఇక్బాల్‌, నాగేశ్వరరావు, ఫణికుమార్‌, విజయ్‌, రవిచంద్రారెడ్డి, పర్యవేక్షకులు మంజుల, చంద్రశేఖర్‌ ఉన్నారు. హనుమకొండ కలెక్టర్‌ను కలిసిన వారిలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా(లోకల్‌ బాడీస్‌), వెంకట్‌రెడ్డి (రెవెన్యూ), డీ.ఆర్‌.ఓ. వై.వి.గణేష్‌ ఉన్నారు.

 

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు 1
1/1

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement