‘1000 వర్డ్స్’ సినిమా చూసి కన్నీళ్లు వచ్చాయి అని అన్నారు నటి రేణూ దేశాయి. అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘1000 వర్డ్స్’(1000 Words movie). ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. కే రవి కృష్ణా రెడ్డి కో- ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఈ సినిమాకు డా.సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. శివ కృష్ణ సంగీతం అందించారు. తాజాగా చిత్రబృందం ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకి రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ము ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
షో అనంతరం రేణూ దేశాయ్(Renu Desai) మీడియాతో మాట్లాడుతూ.. ‘రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపించింది. కానీ ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీశారు. సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. ఇంత మంచి సినిమా తీసిన టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘1000 వర్డ్స్’ అద్భుతమైన చిత్రం. అందరినీ కంటతడి పెట్టించారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయి. ప్రతీ ఒక్కరి హృదయాల్ని కుదిపేస్తుంది. చాలా రోజులకు ఓ చక్కటి సినిమాను చూశానని అనిపిస్తుంది’ అని అన్నారు.
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ ప్రాజెక్టులో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రమణ గారితో ఓ సారి ఫోటో షూట్ చేశాను. మీరు ఎప్పుడైనా సినిమా చేస్తే నాకు చెప్పండి సర్ అని అన్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, పాత్రను చక్కగానే పోషించానని అనుకుంటున్నాను. సూపర్ హీరో ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్‌లో నాకు గాయమైంది. దాదాపు ఎనిమిది నెలలు పని లేకుండా అలా బెడ్డు మీదే ఉండిపోయాను. ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ దేవుడే రమణ గారిని నా దగ్గరకు పంపాడనిపిస్తుంది. సంకల్ప్, శివ కృష్ణ, శివ రామ్ చరణ్‌లు ఈ ప్రాజెక్ట్‌కు చాలా కష్టపడ్డారు. వాళ్లు చాలా ఎత్తుకు ఎదుగుతారనిపిస్తుంది. మేఘన గారు, దివి గారు అద్భుతంగా నటించారు. నూరీ ఈ చిత్రానికి హీరో. నా మూడేళ్ల కొడుకు అధ్విక్ కృష్ణ మొదటి సారిగా నా సినిమాను స్క్రీన్ మీద చూశాడు. ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
డైరెక్టర్, నిర్మాత రమణ విల్లర్ట్ మాట్లాడుతూ.. ‘గత 20 ఏళ్లుగా నేను ఓ మంచి సినిమాను చేయాలని తపిస్తూనే ఉన్నాను. నాకు కథలు రాయడం రాదు. నేను చాలా కథలు వింటూ వచ్చాను. అప్పుడే సంకల్ప్ ఈ కథతో వచ్చారు. ఓ తల్లి బిడ్డను కనేప్పుడు పడే బాధను చెప్పాలని, చూపించాలనే ఈ సినిమాను తీశాం. రేణూ దేశాయ్ గారు నాకు సోదరి వంటి వారు. ఆమెకు ఈ కథ చెప్పగానే ఎమోషనల్ అయ్యారు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తానని ఆమె ముందుకు రావడం ఆనందంగా ఉంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment