Ramana
-
ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథ.. కన్నీళ్లు వచ్చాయి: రేణూ దేశాయ్
‘1000 వర్డ్స్’ సినిమా చూసి కన్నీళ్లు వచ్చాయి అని అన్నారు నటి రేణూ దేశాయి. అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘1000 వర్డ్స్’(1000 Words movie). ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. కే రవి కృష్ణా రెడ్డి కో- ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఈ సినిమాకు డా.సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. శివ కృష్ణ సంగీతం అందించారు. తాజాగా చిత్రబృందం ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకి రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ము ముఖ్య అతిథులుగా విచ్చేశారు. షో అనంతరం రేణూ దేశాయ్(Renu Desai) మీడియాతో మాట్లాడుతూ.. ‘రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపించింది. కానీ ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీశారు. సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. ఇంత మంచి సినిమా తీసిన టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘1000 వర్డ్స్’ అద్భుతమైన చిత్రం. అందరినీ కంటతడి పెట్టించారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయి. ప్రతీ ఒక్కరి హృదయాల్ని కుదిపేస్తుంది. చాలా రోజులకు ఓ చక్కటి సినిమాను చూశానని అనిపిస్తుంది’ అని అన్నారు.హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘1000 వర్డ్స్’ ప్రాజెక్టులో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రమణ గారితో ఓ సారి ఫోటో షూట్ చేశాను. మీరు ఎప్పుడైనా సినిమా చేస్తే నాకు చెప్పండి సర్ అని అన్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, పాత్రను చక్కగానే పోషించానని అనుకుంటున్నాను. సూపర్ హీరో ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్లో నాకు గాయమైంది. దాదాపు ఎనిమిది నెలలు పని లేకుండా అలా బెడ్డు మీదే ఉండిపోయాను. ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ దేవుడే రమణ గారిని నా దగ్గరకు పంపాడనిపిస్తుంది. సంకల్ప్, శివ కృష్ణ, శివ రామ్ చరణ్‌లు ఈ ప్రాజెక్ట్‌కు చాలా కష్టపడ్డారు. వాళ్లు చాలా ఎత్తుకు ఎదుగుతారనిపిస్తుంది. మేఘన గారు, దివి గారు అద్భుతంగా నటించారు. నూరీ ఈ చిత్రానికి హీరో. నా మూడేళ్ల కొడుకు అధ్విక్ కృష్ణ మొదటి సారిగా నా సినిమాను స్క్రీన్ మీద చూశాడు. ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.డైరెక్టర్, నిర్మాత రమణ విల్లర్ట్ మాట్లాడుతూ.. ‘గత 20 ఏళ్లుగా నేను ఓ మంచి సినిమాను చేయాలని తపిస్తూనే ఉన్నాను. నాకు కథలు రాయడం రాదు. నేను చాలా కథలు వింటూ వచ్చాను. అప్పుడే సంకల్ప్ ఈ కథతో వచ్చారు. ఓ తల్లి బిడ్డను కనేప్పుడు పడే బాధను చెప్పాలని, చూపించాలనే ఈ సినిమాను తీశాం. రేణూ దేశాయ్ గారు నాకు సోదరి వంటి వారు. ఆమెకు ఈ కథ చెప్పగానే ఎమోషనల్ అయ్యారు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తానని ఆమె ముందుకు రావడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
మోసాల రమణ నిండా ముంచాడు
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు సహకారంతోనే ఎదిగానని ఇండియన్ ఆర్మీ కాలింగ్ నిర్వాహకుడు బసవ రమణ ప్రచారం చేసుకున్నాడు. ఆయనతో తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లోనూ పెట్టి తనకున్న అనుబంధాన్ని, సంబంధాలను అందరికీ తెలియజేశాడు. ఆర్మీ కాలింగ్ సెంటర్లో చేరిన విద్యార్థులను రామ్మోహన్నాయుడు హాజరయ్యే కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేవాడు. సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ కంచరాన అవినాష్ వంటి అధికారులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్‌కు తీసుకొచ్చి వారితో విద్యార్థులకు అవగాహన కల్పించాడు. తనకు ఎంతో పలుకుబడి ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. దానికోసం ముందస్తుగా పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా విస్తృత ప్రచారం చేశాడు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇండియన్ ఆర్మీ కాలింగ్ రమణ మోసాలు తిలాపాపం..తలా పిడికెడు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. పెద్దలతో ఏ మాత్రం పరిచయం ఏర్పడినా దాన్ని తన వ్యాపారాన్ని పెంచుకునే అస్త్రంగా రమణ వాడుకున్నాడు. కేంద్రమంత్రిని.. ‘అన్నా’ అని సంబోధిస్తూ, ఆయన అండతోనే ఎదిగానని చెబుతూ, ఆయన ఆశీస్సులుంటే మరింత ఎదుగుతానని ఫొటోలు, వీడియోలతో సహా చూ పించిన దృశాలు, రక్షణ రంగంలోని అధికారులతో నిర్వహించిన సమావేశాలు, కలెక్టర్లు, జేసీలతో చేపట్టిన కార్యక్రమాలు, ఎమ్మెల్యే, వారి కుటుంబీకులతో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమాలు, నగరంలో జరిపిన పలు ఈవెంట్లతో రమణను పలుకుబడి గల వ్యక్తిగా నమ్మించాయి. ఇదే విద్యార్థుల కొంప ముంచింది. అసలు నిజం ఇదీ.. రాజకీయ ప్రముఖులు, ఆర్మీ అధికారులు, ఉన్నతాధికారులతో పరిచయాలను చూపించి విద్యార్థులను నిలువునా ముంచేశాడు. మాజీ మేజర్ జనర ల్ తన సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉన్నారని నమ్మబలికి నిరుద్యోగ యువతను ట్రాప్ చేశాడు. ఈ ప్రచారం చూసే విద్యార్థులు ఆకర్షితులై ఉద్యోగాల కోసం రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకు ముట్ట చెప్పేశారు. అంతటితో ఆగకుండా శిక్షణ, వసతి అని చెప్పి రూ.లక్షల్లో గుంజేశాడు. మోసం బట్టబయలు కావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళం కేంద్రంగానే కాదు జులుమూరు కేంద్రంగా కూడా మోసం చేశాడు. రోజూ ఆయన చేతిలో మోసపోయిన వారు బయటకి వస్తూనే ఉన్నారు. ఎంత మొత్తంలో వసూలు చేశాడో లెక్క కట్టడం కూడా కష్టమవుతోంది. జిల్లాకు వచ్చే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఐఎఫ్ఎస్ అధికారులు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులను మర్యాద పూర్వకంగా కలిసి, వారిని మచ్చిక చేసుకుని, పలు కార్యక్రమాలకు ఆహా్వనించేవాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో మోటివేషన్ కార్యక్రమాలను నిర్వహించాడు. అధికారికంగా జరిగే ఈవెంట్లకు, ప్రైవేటు కార్యక్రమాలకు తన దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థులను తన సైన్యంగా తీసుకెళ్లి బల నిరూపణ చేసేవాడు. ఈవెంట్ల పేరుతో పెద్ద ఎత్తున శాఖల వారీగా, ప్రైవేటు సంస్థల నుంచి నిధుల సమీకరణ కూడా చేసేవాడు. ⇒ పలువురు జర్నలిస్టులతో కూడా వెంకటరమణ చేతులు కలిపారు. వారికున్న పత్రికల్లో స్పాన్సర్ కథనాలు వండి వార్చారు. అవసరం వచ్చినప్పుడల్లా అండగా నిలిచారు. ఉన్నత స్థాయి వ్యక్తులను కలిసేందుకు ఓ జర్నలిస్టును రిఫరెన్స్‌గా వాడుకునే వాడు. పోలీసు శాఖలో పనిచేసిన కొందరు అధికారులు కూడా ఆయనకు అండగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఫిర్యాదులొస్తే పట్టించుకోకుండా వెంకటరమణకే వత్తాసు పలికిన ఉదంతాలున్నాయి. భారత రక్షణ వ్యవస్థ మేజర్‌గా ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న మేజర్ పెంటకోట రవికుమార్‌ను కలిసిన ఫొటోలను చూపించి, తనకు అధికారిక పలుకుబడి ఉందని నమ్మించాడు. ఐఏఎఫ్ గ్రూప్ కెపె్టన్ పి.ఈశ్వరరావు వంటి వారితో మోటివేషన్ క్లాసులు ఇప్పించాడు.జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యే సతీమణి జీ.స్వాతిని ఆహా్వనించి హడావిడి చేశాడు. అకృత్యాలు.. వికృత చేష్టలు.. ⇒ శిక్షణ, ఉద్యోగాల పేరుతో మోసం చేయడమే కాకుండా తన ఆర్మీ కాలింగ్ సెంటర్లో చేరిన విద్యార్థులను హింసించాడు. ⇒ ఏకంగా కాళ్లతో తన్ని, డేటా కేబుల్ వైర్‌తో కొడుతూ చాలామందికి నరకం చూపించాడు. ⇒ శిక్షణలో చేరిన అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. ⇒ రకరకాల మెసెజ్‌లు, మాటలతో ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. ⇒ అంతటితో ఆగకుండా అమ్మాయిలున్న వసతి గృహంలో, వాష్ రూమ్‌ల్లో, పరుపులు ఉన్న రూమ్‌ల్లో సీసీ కెమెరాలు పెట్టాడు. ⇒ ఒకసారి దొరికిపోయాక అది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అనుమతితోనే పెట్టానని నమ్మించే ప్రయత్నం చేశాడు. ⇒ ∙సీసీ కెమెరాల గుట్టు బయటకు రాకుండా ఉండటానికి అమ్మాయిలను కూడా భయపెట్టాడు. ⇒ బయటకు చెబితే వీడియోలు బయటకు వస్తాయని, అసభ్యకర ఫొటోలు వెలుగు చూస్తాయని బెదిరించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ⇒ రమణ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే రక్షణ రంగంలో ఉద్యోగాల పేరుతో ఓ నియంతలా.. సైకోలా వ్యవహరించాడనే విషయం బాధితుల మాటల్లో స్పష్టమవుతోంది. -
ఆ గ్యాప్‌ను ఫిల్ చేయాలనుకుంటున్నాను: రమణ గోగుల
‘‘ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతమైన పాటలు, సంగీతం అందిస్తున్నారు. అయితే ఓ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్కు ఎక్కడో చిన్న గ్యాప్ ఉందనిపిస్తోంది. ఆ గ్యాప్‌ను ఫిల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కొన్ని కొత్త ఐడియాస్ ఉన్నాయి. మంచి కథ, హీరో, దర్శక–నిర్మాతలు, సరైన సమయం... ఇలా అన్నీ కుదిరితే కచ్చితంగా సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అన్నారుసంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల. వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది.సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల దాదాపు పన్నెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘గోదారి గట్టు..’ పాటను పాడారు. ఈ సందర్భంగా రమణ గోగుల చెప్పిన విశేషాలు. ⇒ వెంకటేశ్‌గారి ‘ప్రేమంటే ఇదేరా..’ సినిమాతో సంగీత దర్శకుడిగా నా కెరీర్ మొదలైంది. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత వెంకటేశ్‌గారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని పాటతో తిరిగి ఇండస్ట్రీకి వచ్చాను. ఇదంతా చూస్తుంటే లైఫ్ ఫుల్ సర్కిల్ అవ్వడం ఇదేనేమో అనిపిస్తోంది. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఫోన్ చేసి, ‘గోదారి గట్టు..’ పాట పాడాలని కోరారు. నేనేమో ఇప్పటివరకు వేరే సంగీత దర్శకుల పాటలను పాడింది లేదు.సరే... ఓసారి పాట విందామని విన్నాను. చాలా నచ్చింది. పాటలో ఓ హార్ట్ ఉందనిపించి, ఒప్పుకున్నాను. మధుప్రియ నాతో కలిసి చాలా బ్యాలెన్సింగ్‌గా పాడారు. భాస్కరభట్లగారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, భీమ్స్ ఈ పాట పాడేందుకు నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. వెంకటేశ్‌గారు నాకు లవ్లీ ఫ్రెండ్. ఆయన ఫోన్ చేసి, అభినందించారు. పాట రిలీజైన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎవరో ఓ వ్యక్తి మాది గుంటూరు అంటూ ఫోన్ చేసి, ‘గోదారి..’ పాట బాగుందని మాట్లాడాడు. చాలా హ్యాపీ ఫీలయ్యాను. ⇒ నాకు మ్యూజిక్‌తో పాటు టెక్నాలజీ అంటే ఇష్టం. దీంతో అబ్రాడ్‌లో ఓ మల్టీనేషనల్ కంపెనీకి వర్క్ చేశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డాటా ఎనలిటిక్స్ వంటి అంశాలపై పని చేశాను. అలాగని సంగీతానికి దూరంగా లేను. నాకు ఇష్టమైనప్పుడు మా ఇంట్లో పియానోను, గిటార్‌ను ప్లే చేస్తూనే ఉంటాను. ఏఐతో సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ హ్యూమన్ టచ్ ఉన్నప్పుడే సాంగ్స్ బాగుంటాయి. ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ గ్యాప్‌లో దాదాపు వంద సినిమాలు రిజెక్ట్ చేసి ఉంటాను. నాకు ఇష్టం అయితేనే సాంగ్స్ కంపోజ్ చేస్తాను. -
వైఎస్సార్సీపీ ఓటమిని తట్టుకోలేక ఆగిన మరో గుండె
ఎస్.రాయవరం (అనకాపల్లి జిల్లా): వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఓటమిని తట్టుకోలేక అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం వెంకటాపురానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రమణ(49) మనస్తాపంతో నిద్రాహారాలు మానివేశాడు.అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటివద్ద గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతదేహాన్ని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్నా..
మధురవాడ (భీమిలి): కాలేజీల్లో కామ పిశాచాల వేధింపులు తాళలేక కొంతమంది అమ్మాయిలు చదువులు మధ్యలోనే మానివేస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలే శరణ్యమని భావించి చిన్నతనంలోనే తనువులు చాలిస్తున్నారు. ఫ్యాకల్టీయే బరితెగించి లైంగికంగా వేధింపులు పాల్పడగా.. తట్టుకోలేకపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఇక్కడ డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ (16) లైంగిక వే«ధింపులకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తాళలేక పోతున్నానంటూ తండ్రికి మెసేజ్ పెట్టి గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రాంతంలో హాస్టల్ భవనం 4వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యా సంస్థ నిర్లక్ష్యమే కారణం విద్యా సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె మృతి చెందిందని బాలిక తండ్రి గండికోట రమణ ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సీపట్నం సమీపంలోని నాతవరం మండలం పద్మనాభపురానికి చెందిన రైతు కూలి గండికోట రమణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్లయి అగనంపూడిలో ఉంటోంది. ఆఖరి కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకుంటోంది. రెండో కుమార్తె రూపశ్రీ కొమ్మాది కాలేజీ హాస్టల్లో ఉండి చదువుతోంది. రూపశ్రీ కనిపించడం లేదని తండ్రికి కళాశాల సిబ్బంది ఫోన్ చేసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత రూపశ్రీ అర్ధరాత్రి 12.48 గంటలకు 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్‌కి వెళ్లి, 1.05కి 4 ఫ్లోర్ నుంచి కిందకి దూకిందని తెలిసింది. దూకే క్రమంలో చెట్టుకు తగిలి కిందకి పడి తీవ్రంగా గాయపడింది. రూపశ్రీని తరలించిన ఆస్పత్రికి అల్లుడు హరికృష్ణతో కలసి రమణ చేరుకునే లోపు రూపశ్రీ మృతి చెందింది. తండ్రి సెల్‌కి పంపిన మెసేజ్ ఇలా.. హాయ్ అమ్మా, నాన్న, అక్కా, చెల్లి మరియు కుటుంబ సభ్యులకు.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ కాలేజీలో లైంగిక వే«ధింపులు జరుగుతున్నాయి నాన్న. మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలం నాన్న. చాలా చెండాలంగా ప్రవర్తిస్తున్నాడు. ఫొటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు. స్టూడెంట్స్‌కి చెప్పాల్సిందిపోయి ఆ ఫ్యాకల్టీ ఇలా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి నాన్న? నా ఫొటోలు కూడా తీసి బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరికి చెప్పకోలేక. అలా అని కాలేజికి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం అని బెదిరించారు. నాకే వేరే దారి కనిపించలేదు. ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు ఆ పని నేనే చేస్తున్నా. క్షమించండి నాన్నా. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కళాశాల టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజుకు చెందిన కళాశాల ఇది. ఇక్కడ యాజమాన్యం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మృతురాలు తండ్రి, సగర సామాజిక వర్గ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోక్సో, ర్యాగింగ్ కేసు నమోదు మృతురాలు రూపశ్రీతో పాటు ఇంకా ఎంత మంది విద్యార్థులు వేధింపులకు గురయ్యారనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితులపై పోక్సో యాక్ట్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ర్యాగింగ్ తదితర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పీఎం పాలెం సీఐ రామకృష్ణ తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై తక్షణం నివేదిక అందజేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండి సీతారాం నగర పోలీసులను, సాంకేతిక విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. -
ఆగమోక్తంగానే స్వామివారి కైంకర్యాలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి కైంకర్యాలు అన్నీ ఆగమోక్తంగానే నిర్వహిస్తున్నామని తిరుమల శ్రీ వారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు చెప్పారు. తిరుమలలోని అర్చక నిలయంలో ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు గురువారం మీడియాతో మా ట్లాడుతూ.. టీటీడీ పరిపాలన, అధికారులు, స్వామి వారి ఆలయంపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను అర్చకులందరం ఖండిస్తున్నామని అన్నారు. శ్రీవారి ఆలయంలో క్రమం తప్పకుండా అన్ని కైంకర్యాలు ఆగమోక్తంగానే జరుగుతు న్నాయని స్పష్టం చేశారు. పరిపాలన అంశాలు, అధికారులపై రమణ దీక్షితులు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వచ్చిందన్నారు. శ్రీవారి ఆల యంలోకి స్తంభాలు తీసుకువచ్చారని, తవ్వకాలు జరిగాయంటూ ఆ వీడియోలో రమణ దీక్షితు లు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని చెప్పారు. ఆ గమ సలహాదారులు, ప్రధాన అర్చకుల సూచనల మేర కు ఆలయంలో కైంకర్యాలన్నీ యథావిధిగా జరు గుతున్నాయని అన్నారు. రమణ దీక్షితులు ఆగమ సలహా మండలి సభ్యుడుగా, ప్రధాన అర్చకులుగా ఉన్న సమయంలోనే ఆలయంలోని తిరుమలరా య మండపం, రంగ మండపం ప్రాంతాల్లో కుంగిపోయిన పైకప్పు, బలహీన పడిన స్తంభాలను పటిష్టపరిచారన్నారు. కొత్తగా ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలూ జరగలేదన్నారు. వంశపారంపర్యంగా సేవ చేసుకునే కుటుంబానికి చెందిన రమణ దీక్షితులు ఆలయ ప్రతిష్ట, వ్యవస్థపై అవాస్తవాలు మాట్లాడటం బాధాకరమని అన్నారు. అవాస్తవాలు నమ్మకండి భక్తులు ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని, రమణ దీక్షితులు వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. రమణ దీక్షితులను ముఖ్యమంత్రి గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించినప్పటికీ, నాలు గేళ్లుగా ఆయన గుడికే రాలేదని, ప్రతి నెలా రూ.80 వేల జీతాన్ని మాత్రం తీసుకుంటున్నారని తెలి పారు. రమణ దీక్షితులు, ఆయన కుమారుడు కూడా ఆలయానికి రావడంలేదని తెలి పారు. ఏడాదిలో రెండు మూడుసార్లు వచ్చి రెన్యువల్ చేసుకుని స్వామి కైంకర్యాల్లో పాల్గొనకుండా ఎక్కడో తిరుగుతున్నారని చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రెండో కుమారుడు కూడా అర్చక త్వాన్ని విడిచిపెట్టారన్నారు. లుంగీలు, టీ షర్టులు ధరించిన అందరూ క్రిస్టియన్లు కారని అ న్నారు. లుంగీలు, టీషర్టులు ధరించిన ధర్మారెడ్డి క్రిస్టియన్ అని చెప్పిన రమణ దీక్షితులు కూడా ఆ వీడియోలో టీ షర్టు ధరించి ఉన్నారని తెలిపారు. కైంకర్యంలో అధికారుల జోక్యం లేదు స్వామివారికి నిర్వహించే కైంకర్యాల విషయంలో టీటీడీ చైర్మన్, ఈవో, ఆలయ సిబ్బంది ఎట్టి పరి స్థితుల్లోనూ జోక్యం చేసుకోరని ఆలయ మరో ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు తెలిపా రు. ఆలయ వ్యవస్థపై, అధికారులపై తీవ్రస్థాయిలో ఆరోపించిన రమణ దీక్షితులే కొద్ది సమయంలోనే వీడియోలో ఉన్నది తన వాయిస్ కాదంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారన్నారు. -
కొడుకుకు ఉద్యోగం లేదని.. తల్లి తీవ్ర నిర్ణయం!
కరీంనగర్: కుమారుడికి సరైన ఉద్యోగం లేదనే బెంగతో ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఏఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాలు. మండలంలోని తెర్లుమద్దికి చెందిన పల్లె రమణ(40) ఈనెల 10న ఇంట్లో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న రమణను కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. రమణ కుమారుడు నిఖిల్‌కు సరైన ఉద్యోగం లేదని తరచూ బాధపడుతుండేది. ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడని మదనపడేది. ఈక్రమంలోనే పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి కుమారుడు నిఖిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఇవి చదవండి: వేములవాడలో యువకుడి దారుణహత్య -
Pulsar Bike Singer Ramana And Kundana: గ్రాండ్‌గా పల్సర్ బైక్ సింగర్ నిశ్చితార్థం (ఫొటోలు)
-
పెళ్లి పీటలెక్కనున్న 'పల్సర్ బైక్' రమణ.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్
పల్సర్ బైక్ సాంగ్‌తో ఫుల్ ఫేమస్ అయ్యాడు జానపద కళాకారుడు సింగర్ రమణ. ఈ పల్సర్ బైక్ సాంగ్‌ను రవితేజ ధమాకా మూవీలోనూ వాడేశారు. ఈ ఒక్కటేనా.. 'పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో..', 'వస్తావా.. భాను వస్తావా..' ఇలా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడాడు. బుల్లితెర షోలలో, ఈవెంట్లలో పాటలు పాడుతూ ఊహించని స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ మధ్య బేబి 2 పేరుతో ఓ షార్ట్ ఫిలిం కూడా చేశాడు. తన జీవితంలో జరిగిన రియల్ బ్రేకప్ స్టోరీ ఆధారంగా ఈ లఘు చిత్రాన్ని తీసినట్లు తెలిపాడు. ఇకపోతే రమణ ఓ శుభవార్త చెప్పాడు. త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించాడు. డిసెంబర్ నెలాఖరులో అతడి ఎంగేజ్మెంట్ జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. కుందన శ్రీ అనే అమ్మాయితో అతడి నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ స్టేజీపై ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుని ఫోటోలకు పోజిచ్చారు. పనిలో పనిగా ఎంగేజ్మెంట్ వేదికపైనే ప్రీవెడ్డింగ్ షూట్ కూడా పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్‌గా మారగా కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. చదవండి: అమ్మ మరణం.. రోదిస్తూ గదిలోకి వెళ్లా.. ఎమోషనలైన శ్రీదేవి పెద్ద కూతురు -
పుట్టిన 24 గంటలకే బైపాస్ సర్జరీ
లక్డీకాపూల్: గుండెలో రంధ్రంతో పుట్టిన ఒక రోజు వయసుగల ఆడశిశువుకు మంగళవారం నిమ్స్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. యూకేకు చెందిన ఆల్డర్ హే ఆస్పత్రి కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ ధన్నపునేని ఆధ్వర్యంలోని వైద్య బృందం నిమ్స్ కార్డియోథిరాసిక్ సర్జన్ డాక్టర్ ఎ. అమరేశ్‌రావు, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్‌తో కలసి ఈ సర్జరీ చేపట్టింది. నిజామాబాద్ జిల్లా చిట్టాపూర్‌కు చెందిన ప్రశాంత్ గ్రూప్–2 ప్రిపరేషన్ కోసం తన భార్య సమీర శ్రావణితో కలసి హైదరాబాద్ వచ్చి ఇబ్రహీంపట్నంలో ఉంటున్నాడు. ఆయన భార్య సోమవారం ఉదయం ఆడశిశువు (సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా)కు జన్మనివ్వగా శిశువుకు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు. అప్పటికే గుండె సంబంధ జబ్బులతో బాధపడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులకు చార్లెస్ హార్ట్ హీరోస్ పేరిట నిమ్స్‌లో యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని (ఈ నెల 24 మొదలు 30 వరకు) నిర్వహిస్తుండటంతో వారి ఆధ్వర్యంలో శిశువుకు బైపాస్ సర్జరీ చేశారు. కాగా, హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ (ఏపీ–తెలంగాణ) మంగళవారం నిమ్స్‌ను సందర్శించి డాక్టర్ రమణ, ఆయన బృందాన్ని కలిసి అభినందించారు. అలాగే గుండె సర్జరీ అనంతరం కోలుకుంటున్న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన చిన్నారి నిత్యను గారెత్ పరామర్శించారు. నవజాత శిశువులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. -
బడ్జెట్ ఉన్నా పేదలకు వైద్యమేదీ?
సాక్షి, హైదరాబాద్: దేశ బడ్జెట్ రూ. లక్షల కోట్లు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడికి అత్యాధునిక వైద్య సేవలు అందినప్పుడే ఆరోగ్య భారతం సాకారమవుతుందన్నారు. అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌పీఐ) ఆధ్వర్యంలో ‘ప్రివెంటివ్ కేర్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్–రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్’అంశంపై శనివారం హైదరాబాద్‌లో సదస్సు జరిగింది. ఏఎఫ్‌సీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ జనాభా పెరుగుతోందని, అందుకు తగ్గట్లుగా వైద్యులు తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా సగటున లక్ష మంది డాక్టర్లుగా పట్టాలు పొందుతున్నారన్నారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత ప్రజల జీవన వ్యయం పెరిగిందని, ఈ క్రమంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగాయని వివరించారు. అదేవిధంగా కొన్నిచోట్ల ప్రజల ఆలోచన విధానం కూడా మారిందని, ఒక వైద్యుడు రోగిని పరిశీలించి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా స్పష్టత ఇచ్చినప్పటికీ రోగి సంతృప్తి చెందడం లేదన్నారు. కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వివిధ రకాల పరీక్షలు చేయించు కున్నాక సంతృప్తి చెందే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ తరహా వైఖరిని మార్చే అవకాశం ఫ్యామిలీ డాక్టర్‌కే ఉంటుందని, వారు రోగులకు ధైర్యం చెప్పాలని సూచించారు. అప్పుడు కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కొన్నిచోట్ల వైద్యులు నాడి పట్టకుండా ప్రిస్క్రిప్షన్ రాసి పంపిస్తున్న ఘటనలు ఉన్నాయని, అలాంటి వైఖరి కూడా సరికాదన్నారు. వైద్యవిద్య ఖర్చుతో కూడుకున్నదే... వైద్యవిద్యపట్ల ఆసక్తి ఉన్నప్పటికీ చాలా మంది ఈ రంగాన్ని ఎంచుకోవడంలో ఆసక్తి చూపడం లేదని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. వైద్యవిద్య ఖర్చుతో కూడుకున్నదని, అదేవిధంగా సుదీర్ఘకాలంపాటు చదువు కొనసాగించాల్సి వస్తుందని, కోర్సు పూర్తయ్యాక ప్రాక్టీసు పెట్టుకోవడం, స్థిరపడటానికి సైతం ఎక్కువ సమయం పడుతోందని... ఇదంతా ఆలోచించి ఈ రంగానికి పరిమిత సంఖ్యలోనే ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేసిన సేవలు అత్యంత గొప్పవని ఎన్వీ రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్‌పీఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రమణ్‌కుమార్, ఏపీ చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ మల్లీశ్వరమ్మ, తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ బాలు చనిపోయినప్పుడు రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లాను: సింగర్
'నీదారి పూలదారి.. పోవోయి బాటసారి..', 'రేపటి పౌరులం..', 'ఆకతాయి చిన్నోడు..' ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు గాయని బి.రమణ. తెలుగులోనే కాదు దక్షిణాదిలోనూ పలు భాషల్లో పాటలు ఆలపించారు. తన అద్భుత గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. సినీ ఇండస్ట్రీకి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన ఆమె అన్నమయ్య కీర్తనలు, భక్తి పాటలు సైతం పాడేవారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'మాది విజయవాడ. చిన్నప్పటి నుంచే పాటలు పాడేదాన్ని. ఎక్కడికి వెళ్లినా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. రెండో బహుమతికి ఒప్పుకునేదాన్ని కాదు. చాలా ఎంకరేజ్ చేసేవారు నా గొంతు బాగుండటంతో సినిమాల్లో పాడే అవకాశాలు వచ్చాయి. ఘంటసాల గారు ఓ సారి నా పాట విని మెచ్చుకుని నాకు ఎక్కువ పారితోషికం ఇవ్వమని సూచించారు. అంతేకాక తనతోపాటు బెంగళూరులో కచేరీకి తీసుకెళ్లారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఎంతో ఎంకరేజ్ చేసేవారు. చాలా మర్యాద ఇచ్చేవారు. బాలు చనిపోయినప్పుడు నన్ను వెళ్లవద్దని సూచించారు. ఎందుకంటే అది కరోనా సమయం.. పరిస్థితులు బాలేవని బయటకు వెళ్లొద్దన్నారు. కానీ ఆయనను చూడాలని ధృడంగా నిశ్చయించుకున్నాను. ఏ అవార్డూ రాలేదు అక్కడికి వెళ్లేసరికి పుట్టెడుమంది జనాలున్నారు. వాళ్లంతా సినిమావాళ్లు కాదు. తమిళులు. నేను రోడ్డుపైనే ఏడ్చుకుంటూ వెళ్లాను. ఎంత నడిచినా ఇంకా దారి అర్థం కాకపోవడంతో నేను కూడా లైన్ కట్టి వెళ్లాను. అయ్యో పెద్దావిడ, ఏడ్చి సొమ్మసిల్లేలా ఉందని కొందరు నన్ను ముందుకు పంపించారు. బాలును చూశాక దుఃఖం ఆగలేదు. ఆయనతో కలిసి ఎన్నో డ్యూయెట్ సాంగ్స్ పాడాను. ఆ గొంతు ఇక మూగబోయిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఆ కాలంలో అందరూ నన్ను గౌరవించారు, వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి వల్లే వేల పాటలు పాడాను. కానీ ఇంతవరకు నాకు ఏ అవార్డు రాలేదని ఎప్పుడూ ఫీలవలేదు. సుశీల, జానకి, ఘంటసాల.. ఇలా ఎందరినో కళ్లారా చూస్తే చాలనుకున్నాను, అలాంటిది వారితో కలిసి పాడాను, అదే నాకు దక్కిన పెద్ద గౌరవం, తృప్తి' అని చెప్పుకొచ్చారు గాయని రమణ. చదవండి: ధర్మవరపు సుబ్రహ్మణ్యంను కడసారి చూసేందుకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదా? -
బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు
వించిపేట (విజయవాడ పశ్చిమ): టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోయింది. మహిళలన్న గౌరవం, విచక్షణ లేకుండా బరితెగించి లైంగిక వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ప్రజల్లో ఉనికి కోల్పోతున్నామనే అక్కసుతో ప్రశ్నించిన వారిపై మూకుమ్మడి దాడులకు దిగుతుండటం నిత్యకృత్యమైంది. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేయడమే టీడీపీ విధానంగా.. ఆ పార్టీ నేతలు బజారు రౌడీలను మించి కొట్లాటలకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తమ కుటుంబంలోని మహిళను ఎందుకు వేధించారని ప్రశ్నించిన పాపానికి విజయవాడలో టీడీపీ నేత ఒకరు ఏకంగా 20 మందికి పైగా అనుచరులతో కలిసి.. కత్తులతో ఆ మహిళ కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలిచింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. విజయవాడ నగరంలోని 55వ డివిజన్ (వించిపేట) టీడీపీ అధ్యక్షుడు వడ్డాది రమణ తమ్ముడు వడ్డాది నరేష్ నెల రోజులుగా స్థానికంగా నివసించే ఓ వివాహితను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం బయటకు వెళ్తున్న ఆమెపై చేతులు వేసి, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా.. ఆమె అత్త, మామ, మరిది కలిసి టీడీపీ నాయకుడు వడ్డాది నరేష్ ఇంటి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలు రమణ, నరేష్ ఇంటి వద్ద లేరు. జరిగిన విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పి.. మరోసారి ఇలా జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించి వచ్చేశారు. మా ఇంటి వద్దకే వస్తారా.. బాధితులు తమ ఇంటి వద్దకు వచ్చి వెళ్లారనే విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు వడ్దాది రమణ, నరేష్.. 20 మంది అనుచరులతో కలిసి వివాహిత ఇంటిపైకి దాడికి వెళ్లారు. ‘మా ఇంటికే వచ్చి హెచ్చరిస్తారా.. మీకెంత ధైర్యం.. ఇప్పుడు మీకు ఎవరు అడ్డువస్తారో చూస్తాం..’ అని బూతులు తిడుతూ వివాహిత మామ ఏడుకొండలు, అత్త భారతి, మరిది అరుణ్‌కుమార్‌తో పాటు స్థానిక యువకుడు హేమంత్పై కత్తులతో దాడి చేశారు. అరుణ్‌కుమార్‌కు పొత్తి కడుపులో, మిగలిన వారి ఒంటిపై పలు చోట్ల గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు వడ్డాది రమణ, వడ్డాది నరేష్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తూ కత్తులు పట్టుకుని ఇలా ఇంటి పైకి రావడం దారుణం అని, వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎల్ రమణకు తీవ్ర అస్వస్థత
-
చేనేతపై జీరో జీఎస్టీ కోసం హ్యాండ్లూమ్ మార్చ్
ఖైరతాబాద్: చేనేత ఉత్పత్తులపై జీరో జీఎస్టీ చేసేవరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ ఎల్.రమణ తెలిపారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వేదికగా చేనేతపై జీరో జీఎస్టీ డిమాండ్ చేస్తూ హ్యాండ్లూమ్ మార్చ్ బుధవారం నిర్వహించారు. సినీ నటి పూనంకౌర్‌తో కలిసి... ఎల్.రమణ హ్యాండ్లూమ్‌మార్చ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేతపై 5శాతం పన్నును యథావిధిగా కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించడం కంటితుడుపు చర్య మాత్రమేనన్నారు. జీఎస్టీ తొలగించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్, హరీశ్‌రావులు వివిధ సందర్భాల్లో జీఎస్టీ కౌన్సిల్‌కు లేఖలు రాశారని, చేనేతపై జీరో జీఎస్టీ ఉండాలని ఉద్యమం చేస్తుంటే... కేంద్ర ప్రభుత్వం 5శాతం జీఎస్టీ విధించి, దాన్ని 12శాతానికి పెంచి అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు ఎర్రమాద వెంకన్న, యువజన నేత గుండేటి శ్రీధర్, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడం రాంబాబుతో పాటు వివిధ చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఒత్తిడిలోనూ సింధు విజయం సాధించింది: తండ్రి రమణ
సాక్షి, హైదరాబాద్: ఒత్తిడిలోనూ పీవీ సింధు విజయం సాధించిందని ఆమె తండ్రి రమణ అన్నారు. దేశం మొత్తం సింధుకు అండగా నిలిచిందన్నారు. దేశానికి పతకం సాధించడం గర్వంగా ఉందన్నారు. వరుసగా రెండు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. నిన్నటి ఓటమి గురించి మరిచి.. ఈరోజు ఆటమీద దృష్టి పెట్టాలని చెప్పానని, వ్యక్తిగత ఈవెంట్లో దేశానికి రెండు మెడల్స్ తీసుకురావడం గర్వించదగ్గదన్నారు. సింధు పతకం సాధించడం ఆనందంగా ఉందని.. సింధు తల్లి విజయ అన్నారు. సింధు మ్యాచ్‌ను చివరి నిమిషం వరకు ఉత్కంఠగా చూశానని విజయ తెలిపారు. -
సమైక్య పాలకులది నేరపూరిత నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: సమైక్య పాలకుల నేరపూరిత నిర్లక్ష్యం వల్లే నీటి పారుదల రంగానికి పూర్తిగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఇన్నాళ్లూ పరాయి పాలకుల చేతిలో పరాదీనమైన తెలంగాణ ఇప్పుడు బంగారు తునక అని అభివర్ణించారు. టీటీడీపీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన ఎల్.రమణ, శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. నా లైన్ ఎవరూ మార్చలేరు ‘రాష్ట్రం వస్తుందని ముందు నుంచే మేము బలంగా నమ్మాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము చేసిన పనుల గురించి డబ్బా కొట్టు కోవాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టమని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మేము చేపట్టిన ఎజెండాతో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో మేము విఫలమైతే భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మునుపే పునర్నిర్మాణంపై బాగా ఆలోచించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయ డం ద్వారానే శాంతి సాధ్యమవుతుందని భావించాం. అందులో భాగంగానే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగం బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. మీ దీవెనలు, అండదండలు, సహకారం ఉన్నన్ని రోజులు ప్రపంచంలో ఎవరూ నా లైన్ మార్చలేరు. నేను కలగన్న తెలంగాణను వంద శాతం చేరుకుంటా.. ’అని కేసీఆర్ స్పష్టం చేశారు. చేనేతకు చేయూత: ‘చేనేత రంగం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన కార్యక్రమాలు కొంత ఉపశమనం ఇస్తున్నాయి. తాజాగా రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు కూడా బీమా పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించాం. ఒకటి రెండు నెలల్లో ఈ కార్యక్రమం ఆచరణలోకి వస్తుంది. ఉద్యమ సమయంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకున్నాం. సూరత్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికుల నైపుణ్యాన్ని స్థానికంగా వాడుకుని ఉపాధి కల్పించేందుకు ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్’ఏర్పాటు చేశాం. ఇక్కడ ఏర్పాటయ్యే భారీ స్పిన్నింగ్ మిల్లుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించా. చేనేత కార్మికులు కూడా పాత పద్ధతిలో కాకుండా వినూత్నంగా పని చేయడాన్ని అలవరుచుకోవాలి. చేనేత రంగానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది..’అని సీఎం పేర్కొన్నారు. -
టీడీపీ కి రాజీనామా చేయనున్న ఎల్. రమణ
-
అనుక్షణం ఉత్కంఠ
ప్రముఖ నిర్మాత శోభారాణి తనయుడు రమణ హీరోగా షఫీ, సిమ్రాన్, సారిక, అర్చన, శివణ్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘పాయిజన్’ (వర్కింగ్ టైటిల్). సీఎల్ఎన్ మీడియా పతాకంపై రవిచంద్రన్ దర్శకత్వంలో కె.శిల్పిక, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.శిల్పిక, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి చక్కని కథతో పాటు మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. తప్పకుండా ఫీల్‌గుడ్ మూవీని అందిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. రవిచంద్రన్ మాట్లాడుతూ– ‘‘ఫ్యాషన్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. ఈ సినిమా కోసం ఎంతోమంది నటీనటుల్ని ఆడిషన్ చేసి, ఎంచుకోవటం జరిగింది. ఈ సబ్జెక్ట్‌కు హీరో రమణ పర్ఫెక్ట్ చాయిస్’’ అన్నారు. రమణ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కర్నీ ఎంటర్టైన్ చేస్తూనే అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే కథ ఇది. నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ను ఇవ్వటానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నేహల్ డి.జె. -
మహిళల ఐపీఎల్ అనవసరం!
భారత మహిళల క్రికెట్ జట్టు టి20 ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయి ఉండవచ్చు. కానీ గత కొంత కాలంగా జట్టు ఆటతీరులో వచ్చిన మార్పులు మాత్రం అనూహ్యం. సాంప్రదాయ ధోరణిలో కాకుండా దూకుడు పెంచి సమకాలీన టి20 టీమ్‌గా మన జట్టు ఎదగగలిగింది. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా జట్టులో అందరు ప్లేయర్లు తమ ఆటతో నమ్మకాన్ని కలిగించగలిగారు. దీని వెనక ఉన్నది జట్టు కోచ్ వూర్కేరి వెంకట్ (డబ్ల్యూవీ) రామన్. శిక్షకుడిగా గతంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మాజీ క్రికెటర్ 14 నెలల తక్కువ వ్యవధిలోనే మహిళల జట్టుపై కూడా తన ముద్ర వేయగలిగారు. వరల్డ్ కప్‌లో జట్టు ప్రదర్శనను విశ్లేషించడంతో పాటు జట్టు భవిష్యత్తుకు సంబంధించి పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. విశేషాలు రామన్ మాటల్లోనే.... స్మృతి, హర్మన్ వైఫల్యాలపై... ఇద్దరు స్టార్ బ్యాటర్లు టోర్నీ మొత్తం విఫలం కావడం దురదృష్టకరం. అయితే అలా జరిగినా జట్టు విజయాలు సాధించగలిగిందంటే అది సానుకూల అంశం. క్రీజ్‌లో నిలబడిపోవడంకంటే ఒక భారీ షాట్ ఆడి హర్మన్ తిరిగి వచ్చేయడమే మంచిదని భావించా. ఎందుకంటే ఆమె అలా చేస్తే ప్రత్యర్థులు మానసికంగా పైచేయి సాధిస్తారు. ఆమె తర్వాత వచ్చే మన అమ్మాయిలేమో హర్మనే ఆడలేకపోతోంది మనమేం ఆడగలం అనే ధోరణితో మైదానంలో దిగుతారు. అది మంచిది కాదు. అయితే హర్మన్ సాధ్యమైనంతగా ప్రయత్నించింది. అయితే అనుభవం లేని ఒక జట్టును నడిపిస్తూ వ్యక్తిగతంగా కూడా విఫలమవుతూ ఆమె తీవ్ర ఒత్తిడిని అనుభవించింది. కోచ్‌గా పని చేసే శైలిపై... నా దృష్టిలో కోచ్ అనేవాడు ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌కు పని చేసే సర్వీస్ ఇంజినీర్లాంటివాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని, అన్నింటినీ చక్కబెట్టి ఇవ్వడమే నా బాధ్యత. ఆపై ఒక పైలెట్లాగా మైదానంలో కెప్టెన్ జట్టును నడిపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో బయటి నుంచి పరిశీలించడమే నేను చేస్తాను. మ్యాచ్‌కు ముందే ఆటగాళ్లతో వివరంగా మాట్లాడి వారు మనసులో ఏదైనా సందేహాలు ఉంటే వాటిని తీర్చి ఆత్మవిశ్వాసంతో గ్రౌండ్లోకి అడుగు పెట్టేలా చేయగలను. ఇప్పటి వరకు కోచ్‌గా నేను ఇలాగే పని చేస్తున్నాను. జట్టు ప్రదర్శనపై... వరల్డ్కప్కంటే ముందు మేం ముక్కోణపు టోర్నీ కూడా ఆడాం. ఈ రెండు టోర్నమెంట్లను కలిసి చూస్తే ఆస్ట్రేలియాలాంటి జట్టును రెండు సార్లు, మహిళల క్రికెట్లో అతి పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లను కూడా ఓడించగలిగాం. మా అమ్మాయిల ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతున్నాను. మా బలం ఏమిటో గట్టిగా నమ్మి దాని ప్రకారం ఆడటం వల్లే ఇది సాధ్యమైంది. సరిగ్గా చెప్పాలంటే గతంలో ఈ జట్లతో మ్యాచ్‌కు ముందు ప్లేయర్లు ఒక పెద్ద సవాల్ ఎదురైనట్లుగా భావించేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలమనే ఆత్మవిశ్వాసం వచ్చింది. అదే విజయానికి తొలి మెట్టు. మెగా టోర్నీ జరిగిన సమయంలో నేను ఒక్కసారి కూడా ‘వరల్డ్ కప్’ అనే మాటను ఉచ్ఛరించలేదు. ఒక టోర్నీ అని మాత్రమే అన్నాడు. ఎందుకంటే ప్రపంచకప్ అనే వారిపై అనవసరపు ఒత్తిడి పెంచవచ్చు. రాబోయే వన్డే వరల్డ్ కప్ కోసం కూడా నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. టోర్నీకి ఆరు నెలల ముందుగా పూర్తి స్థాయిలో జట్టును ఎంపిక చేసుకొని వారితో సన్నాహాలు సాగించాలి. టి20 ప్రపంచకప్‌లో ఆడినవారే కాకుండా వన్డేలకు తగిన ప్లేయర్లను తీసుకోవడం కూడా కీలకం. రాబోయే చాలెంజర్ టోర్నీ అందుకు కావాల్సిన అవకాశమిస్తుంది. ఫైనల్లో ప్రేక్షకులు, ఒత్తిడి గురించి... మెల్బోర్న్ మైదానంలో దాదాపు లక్ష మంది ప్రేక్షకులు ఉంటారనే విషయం నాకు తెలుసు. కానీ ఆ సమయంలో ఎలా ఉండాలో, ఏం చేయాలో నేను చెప్పలేదు. ఎందుకంటే ఆ వాతావరణం, జోష్ అంతా అనుభవిస్తేనే అర్థమవుతుంది తప్ప ఇలా ఉంటుందని మనమేమీ చెప్పలేం. ఇలాంటి స్థితిలో కూడా బంతిపైనే దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. లేదంటే ప్రేక్షకుల చేతుల్లోనే ఓడిపోతాం. అయితే మా పరాజయానికి ప్రేక్షకుల సంఖ్య లేదా అక్కడి వాతావరణం కారణం కానే కాదు. నేను అలాంటి సాకులు చెప్పను. అయితే ఫైనల్‌కు ముందు వారం రోజుల పాటు మ్యాచ్ లేకుండా విరామం రావడం మమ్మల్ని దెబ్బ తీసిందనేది మాత్రం వాస్తవం. ఒక యువ జట్టు ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉండి మళ్లీ ఆటలోకి వచ్చి నేరుగా ఫైనల్ ఆడటం మానసికంగా అంత సులువు కాదు. నలుగురు స్పిన్నర్లతో ఆడటం ఎప్పుడైనా దెబ్బ కొట్టవచ్చని ఒక దశలో భయపడ్డాను. చివరకు ఫైనల్లోనే అది జరిగింది. మనకు అందుబాటులో ఉన్న వనరులతోనే జట్టును రూపొందించాలి కదా. కొన్ని ప్రణాళికలు ఫైనల్లో పని చేయలేదు. అయితే ఆటలంటే ఇలాగే ఉంటాయి. వాటిని మరచి ముందుకు సాగాలి. టీనేజర్ షఫాలీ వర్మ గురించి... బౌలర్లపై విరుచుకుపడటమే షఫాలీ శైలి. దాదాపు అన్ని మ్యాచ్‌లలో ఆమె అదే చేసింది. షఫాలీతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నాకర్థమైంది. నిజంగా బ్యాటింగ్ గురించి ఆమెకు నేను సూచనలేమీ చేయను. జట్టు సమావేశాల తర్వాత ఆమెతో విడిగా మాట్లాడుతూ అక్కడ చెప్పిందంతా నీకు కాదులే. నువ్వు ఎలా ఆడాలనుకుంటే అలా ఆడు అనేవాడిని. 16 ఏళ్ల అమ్మాయితో అలాగే చెప్పాలి. అవసరం లేకపోయినా మనసులో వేరే ఆలోచనలు ఎందుకు చొప్పించాలి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్ సెషన్లో ఆమె ఒక్క షాట్ కూడా గాల్లోకి కొట్టకుండా ఆడింది. చూశారా నేను ఎంత పద్ధతిగా ఆడానో అని నాతో చెప్పింది కానీ నేను పట్టించుకోలేదు. తర్వాతి రోజు ఏం చేస్తుందో నేను వేచి చూశా. అన్ని షాట్లు గాల్లోకి వెళ్లాయి. నాలుగు సిక్సర్లు వచ్చేశాయి (ఆ మ్యాచ్‌లో 17 బంతుల్లో 39). నాకు నవ్వొచ్చింది. ఆమె ఆటలో చాలా వినోదం లభించింది. అమ్మాయిల ప్రతిభ గురించి... మా టీమ్ సగటు వయసు 22 ఏళ్లు! ఆస్ట్రేలియా గడ్డపై చూపిన ప్రదర్శనను కొనసాగించగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆడినవారిలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు, వారిని చూసినవారు కూడా స్ఫూర్తి పొందేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది. ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీ జట్టులో ముగ్గురు టీనేజర్లు, అనుభవం లేని ఇద్దరు యువ ప్లేయర్లను ఎంపిక చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అయితే ప్రతిభ ఉంటే వేదిక ఎంత పెద్దదైనా భయపడకుండా ఆడవచ్చని వారు నిరూపించారు. కొన్ని చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకుంటే ఈ జట్టు మున్ముందు మరింత బలమైన జట్టుగా ఎదగడం ఖాయం. సరిగ్గా చెప్పాలంటే పేస్ బౌలింగ్ దళాన్ని పటిష్ట పరచుకోవాల్సి ఉంది. ఇది మాకు బలహీనతగా కనిపించింది కాబట్టి పేసర్లను తీర్చిదిద్దడం ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే మన అమ్మాయిలు శారీరకంగా కొంత బలహీనంగానే ఉన్నారు. వారు తమ ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టి బలంగా తయారవడంతో పాటు విరామం లేకుండా బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. గతంతో పోలిస్తే వేగం, చురుకుదనం కొంత పెరిగినా అది ఇంకా మెరుగవ్వాలి. దీనికి కొంత సమయం పట్టవచ్చు కానీ భవిష్యత్తులో ఫలితాలు బాగుంటాయి. నాణ్యత లోపిస్తే పరిస్థితి ఘోరం... మహిళల ఐపీఎల్ విషయంపై తొందరపడవద్దని నా హెచ్చరిక! నా అభిప్రాయం ప్రకారం ఇప్పటికిప్పుడు అనవసరం. ప్రస్తుతం మన మహిళా క్రికెటర్లు పూర్తి స్థాయి (ఎనిమిది జట్లతో) ఐపీఎల్‌కు సిద్ధంగా లేరు. ఐపీఎల్ ఆలోచన మంచిదే కావచ్చు. కానీ వాటిని అమలు చేయడం అంత సులువు కాదు. ఇప్పటికిప్పుడు హడావిడిగా ఐపీఎల్ అని మొదలు పెట్టి అందులో నాణ్యత లోపిస్తే పరిస్థితి ఘోరంగా మారిపోతుంది. పురుషుల ఐపీఎల్ కూడా ఆరంభమైనప్పుడు ఇంత సూపర్ సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. నాకు తెలిసి ముందుగా పెద్ద సంఖ్యలో ప్లేయర్లకు గుర్తించి జట్లను తయారు చేయడం ముఖ్యం. నా అవగాహన ప్రకారం ఈ విషయంలో తొందర పడాల్సిన అవసరం లేదు. ఇక ప్లేయర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ ఎలా అని ప్రశ్నిస్తే... రాబోయే రోజుల్లో భారత్ ‘ఎ’, అండర్–23 టోర్నీలు నిర్వహించవచ్చు. అండర్–19 ప్రపంచకప్ ప్రతిపాదన కూడా ఉంది కాబట్టి అమ్మాయిలకు పెద్ద సంఖ్యలో క్రికెట్ ఆడే, తమ సత్తాను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత ఏదో రోజు ఐపీఎల్ రావచ్చేమో. హడావిడిగా కాకుండా క్రమక్రమంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాలి. ఈసారి నాలుగు జట్లు అంటున్నారు మంచిదే. ఒక్కో జట్టు మరో టీమ్‌తో కనీసం రెండు సార్లయినా తలపడితే బాగుంటుంది. -
యర్రంశెట్టి రమణగౌతం రిమాండ్
బంజారాహిల్స్: ప్రేమ పేరుతో సినీ నటిని మోసం చేసి పెళ్ళి చేసుకొని రాత్రికిరాత్రే ఉడాయించి విడాకుల పేరుతో కొత్త డ్రామాకు తెరతీసిన సినీ రచయితను బంజారాహిల్స్ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ బచ్చు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్ ఎంవీపీ కాలనీకి చెందిన యర్రంశెట్టి రమణగౌతం(27) సినిమాల్లో రచయితగా పని చేస్తుండగా బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్లో నివసిస్తున్న భవానీ సినిమాల్లో వేషాల్లో కోసం తిరుగుతుండగా పరిచయం అయింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నాలుగేళ్లు సహజీవనం చేశారు. పెళ్లి మాట ఎత్తేసరికి తప్పించుకు తిరుగుతున్న రమణగౌతంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే రోజు రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ గుడిలో తాళికట్టాడు. పెళ్ళి జరిగిన గంటసేపటికే అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తెల్లవారి ఫోన్ చేసి రూ. 50 వేలు ఇస్తాను. విడాకులు ఇవ్వాలంటూ ఫోన్ చేశాడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పక్కా పథకం ప్రకారం పోలీసులు రమణగౌతంను మంగళవారం నారాయణగూడలో ఓ అడ్వకేట్ వద్దకు వస్తున్నప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్‌చేశారు. చీటింగ్, అదనపు కట్నం వేధింపుల కేసులో బుధవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎట్టకేలకు యర్రంశెట్టి రమణగౌతం అరెస్ట్
హైదరాబాద్ : ప్రేమించి సహజీవనం చేసి పెళ్లి చేసుకుని రాత్రికిరాత్రే ఉడాయించిన నిందితుడిని బాధితురాలు పక్కా పథకం ప్రకారం పోలీసులకు పట్టించిన సంఘటన మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... వైజాగ్‌కు చెందిన యర్రంశెట్టి రమణగౌతం కూకట్‌పల్లిలో ఉంటూ టీవీ, సినిమా రచయితగా పని చేస్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన భవానీ అనే యువతిని ప్రేమించాడు. నాలుగగేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తూ, ఆమె సంపాదన మొత్తం కాజేశాడు. పెళ్లి చేసుకోవాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఇవాళ రేపు అంటూ తప్పించుకునేవాడు. దీంతో బాధితురాలు రమణగౌతంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులు అతడిని స్టేషన్‌కు పిలిపించి పెళ్లి చేసుకోవాలని సూచించారు. అదే రోజు బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్న అతను అదే రాత్రి ఉడాయించాడు. ఈ నెల 2న భవానీకి ఫోన్ చేసి నువ్వంటే ఇష్టంలేదు, విడాకులు తీసుకుందామని కోరాడు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. దాదాపు రూ. 8 లక్షలు దండుకొని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న రమణగౌతం పరారీలో ఉన్నాడు. ఇటీవల ఓ లాయర్‌ను ఆశ్రయించి విడాకులు ఇప్పించాలని కోరడంతో సదరు లాయర్ బాధితురాలికి ఫోన్ చేసి విడాకులకు అంగీకరిస్తావా అంటూ అడిగాడు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో నిందితుడిని పట్టుకోవాలంటే విడాకులు అనే ఎర వేయాలంటూ సూచించాడు. విడాకులు ఇస్తానని నమ్మించి కాసేపు అక్కడే ఉంచాలని చెప్పారు. ఆమె మంగళవారం ఉదయం 12 గంటల సమయంలో నారాయణగూడలోని న్యాయవాది ఇంటికి వెళ్లి రమణ గౌంతంతో మాట్లాడుతుండగా బంజారాహిల్స్ కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
సినీ రచయిత రమణగౌతంపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్ : ప్రేమించి సహజీవనం చేసి పెళ్ళి చేసుకొని రాత్రికి రాత్రే ఉడాయించిన సినీ రచయితపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... విశాఖకు చెందిన యర్రంశెట్టి రమణగౌతం కూకట్‌పల్లిలో అద్దెకుంటూ బుల్లితెర, వెండితెరకు సినీ రచయితగా పని చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన భవానీ అనే యువతితో నాలుగేళ్ళ క్రితం ప్రేమలో పడ్డాడు. ఆమె సంపాదించినదంతా దండుకుంటూ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి సహ జీవనం చేశాడు. పెళ్ళి చేసుకోవాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఇవాళ రేపు అంటూ తప్పించుకోసాగాడు. ఆమె తనను పెళ్ళి చేసుకుంటానని మోసగిస్తున్న రమణగౌతంపై చర్యలు తీసుకోవాలంటూ నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమణగౌతంను బంజారాహిల్స్ పోలీసులు పిలిపించి పెళ్ళి చేసుకోవాలంటూ సూచించడంతో అదే రోజు బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఓ గుడిలో పెళ్ళి చేసుకొని అదే రాత్రి ఉడాయించాడు. శుక్రవారం ఉదయం ఆమెకు ఫోన్ చేసి నువ్వంటే ఇష్టంలేదు, విడాకులు తీసుకుందామంటూ వెల్లడించాడు. దీంతో ఆమె షాక్ తింది. శనివారం మోసగాడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ బచ్చు శ్రీనివాస్ నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అశ్రుతర్పణం
ప్రస్తుతం తెలంగాణ ఇంటర్ బోర్డు చుట్టుతా వార్తలు తిరుగుతున్నాయ్. జరిగింది చాలా పెద్ద తప్పిదం. తప్పు ఎవరిదన్నా కావచ్చు, దాదాపు ఇరవై యువ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇరవై చిన్న ప్రాణాలని ప్రాణంగా చూసుకుంటూ కనీసం వెయ్యి పెద్ద ప్రాణాలుంటాయ్. వారంతా శేష జీవితాన్ని జీవచ్ఛవాల్లా గడపాల్సిందే. ముఖ్య మంత్రి నించి అంతా పరీక్ష తప్పితే ఏముంది, మళ్లీ మళ్లీ రాసుకోవచ్చు. ఉత్తీర్ణత సాధిం చవచ్చు– అంటూ కౌన్సిలింగ్ కబుర్లు చెబుతు న్నారు. మూడు లక్షల ముప్ఫై వేలమంది ఇంటర్ పిల్లల జాతకాలను కలగాపులగం చేసి పెట్టారు. ముఖ్యంగా టెన్త్, ఇంటర్ పరీక్షలంటే చావో రేవో అన్నట్టు అందరూ కలిసి తయా రుచేసి పెట్టారు. దానికి వత్తాసుగా కార్పొరేట్ విద్యా సంస్థలు కలుపు మొక్కల్లా వచ్చాయ్. వాళ్ల వ్యాపారం కోసం ర్యాంకుల్ని, మార్కుల్నీ జీవిత లక్ష్యంగా మార్చాయ్. అన్ని సబ్జెక్ట్లనీ పిల్లలకి రుబ్బి పోస్తున్నారు. నేడు వ్యాపార క్షేత్రంలో ప్రముఖ స్థానం వహిస్తోంది విద్యా వ్యాపారం. అందులోనూ విద్యార్థులకు స్టెప్పింగ్ స్టోన్స్ అయిన ‘టెన్త్, ఇంటర్’ ‘ఇక్కడ జారావో ఇంతే సంగతులు’ అంటూ పిల్లలకు పాఠాలతో పాటు నూరి పోస్తున్నారు. ఉపాధ్యాయులే కాదు, విద్యావేత్తలుగా చలామణి అవుతున్న వారే కాదు, అమ్మ నాన్నలే కాదు అంతా ఇదే హెచ్చరిక. ప్రస్తుతం పోటీ ఉన్నమాట నిజం. అంత మాత్రాన పిల్లల ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. పరీక్షకి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి పిల్లల్ని రానివ్వ లేదు. ఎంతటి క్రమశిక్షణ. మహా నగరంలో ఇళ్ల దగ్గర్నించి రకరకాల ట్రాన్స్‌పోర్ట్‌లలో రావడానికి ఓ నిమిషం ఆలస్యం కావచ్చు. అంత మాత్రాన అంత శిక్షా?! ఇప్పుడు మూడు లక్షల ముప్ఫై వేల మంది భవితవ్యాన్ని వీధిన పడేసిన ఈ అధికారులకు ఏమి శిక్ష విధిస్తారు? నిన్న ముఖ్యమంత్రిగారు నిమ్మకి నీరెత్తినట్టు మాట్లాడారు. ప్రాణంతో ఉన్న పిల్లలకు భరోసా ఇచ్చారు. కనీసం ఇన్ని రోజులుగా పిల్లల తల్లిదం డ్రులు తల్లడిల్లుతుంటే సరైన స్పందన లేదు. ఒక పనికిమాలిన ఏజెన్సీకి బాధ్యతాయుతమైన పరీక్షల వ్యవహారం అప్పగించారన్నది మాత్రం నిజం. మన దేశంలో జవాబుదారీతనం లేదు. ఉండదు. ఇదే ప్రజా రాజ్యానికి అమరిన అలం కారం. ఎంత తప్పు జరిగినా ఎవరికీ శిక్షలుం డవ్. ఇంతటి ఘోరం జరిగినప్పుడు, రాష్ట్రం పెద్ద పెట్టున రోదిస్తున్నప్పుడు, సంబంధిత మంత్రి అప్పటికప్పుడు రాజీనామా చేసి ఉండ వచ్చు. చేస్తే... పోయిన ప్రాణాలు వస్తాయా అని అడగచ్చు. కనీసం అసమర్థతని అంగీకరిం చడం ఒక మంచి లక్షణం. ముఖ్యమంత్రిగారు పరీక్ష పోతే జీవితం పోయినట్లు కాదని పదే పదే వక్కాణిస్తున్నారు. మంత్రి పదవి పోతే ఎంత? కాస్త ఈ గొడవ సద్దుమణగగానే దీని బాబులాంటి పదవి రానే వస్తుంది. పొరబాట్లు అందరూ చేస్తారు. త్యాగాలు కొందరే చేస్తారని నానుడి. కేసీఆర్ మొన్నీమధ్యనే అవినీతి మీద పెక్కు బాణాలు సంధించారు. క్షాళనకి దిగుతున్నానని హెచ్చ రించారు. రెవెన్యూ శాఖ మీద కన్ను వేశారు. చెద పురుగుల్లా రాష్ట్రంలో అవినీతి, ఆశ్రితపక్షపాతం ఎక్కడంటే అక్కడే ఉంది. ఎందుకైనా మంచిది మీమీ సింహాసనాలను ఒకసారి బాగా దులి పించుకోండి. ఈ సంఘటన పట్ల ముఖ్య మంత్రి ఇంకొంత ప్రభావవంతంగా ప్రవర్తించి ఉంటే బాగుండేది. అసలీ ట్రాజెడీ ఇంకా యువ రాజు కేటీఆర్ దృష్టికి వచ్చినట్టు లేదు. తాము చెయ్యని తప్పుకు బలైపోయిన విద్యార్థినీ విద్యా ర్థులకు అశ్రుతర్పణం సమర్పించుకుంటున్నా. వారి పెద్దలకు సానుభూతి తెల్పుకుంటున్నా. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
హీరోయిన్ లేదు!
అలా ఒక సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టారో లేదో మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొడుతున్నారు తమిళ హీరో కార్తీ. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో ‘దేవ్’ సినిమాను కంప్లీట్ చేసిన ఆయన తాజాగా ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హీరోగా నటించడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. యాక్షన్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో కార్తీ సరసన హీరోయిన్ లేదని కోలీవుడ్ సమాచారం. నరీన్, రమణ, జార్జి మరియన్ ముఖ్యతారలుగా నటించనున్న ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తారు. ‘‘ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. సినిమాలో 70శాతం పోరాట సన్నివేశాలే ఉంటాయి. అందుకే స్క్రిప్ట్ పరంగా హీరోయిన్ అవసరం లేదనుకుంటున్నాం. స్టంట్ డైరెక్టర్ అన్బరివు యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇటీవల కార్తీ నటించిన తమిళ చిత్రాలు కచ్చితంగా తెలుగులో కూడా విడుదలవుతున్నాయి. సో.. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఊహించవచ్చు. -
కథనం హైలైట్
‘పైసామే పరమాత్మ’ అన్నది సామెత. ఇప్పుడు ‘పైసా పరమాత్మ’ అనే పేరుతో ఓ సినిమా రూపొందింది. సంకేత్, సుధీర్, క్రిష్ణ తేజ, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష ముఖ్య తారలుగా విజయ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కిరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. కథపై నమ్మకంతో తెరకెక్కించాం. నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా విజయ్ కిరణ్ చక్కగా తీశారు. మా సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘యూత్, ఫ్యామిలీస్ మెచ్చే ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథనం హైలైట్‌గా ఉంటుంది. రామ్ పైడిశెట్టి సాహిత్యం, కనిష్క్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి’’ అని విజయ్ కిరణ్ అన్నారు. -
కేసీఆర్ ప్రచారాన్ని తిప్పికొట్టండి: ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ టీడీపీపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టా లని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పిలుపునిచ్చారు. చంద్రబాబుని ఉద్దేశించి తెలం గాణ ప్రజల్లో సెంటిమెంట్‌ను రాజేసేలా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎక్కడికక్కడ ఖండించాలని పార్టీ నేతలను కోరారు. ఆదివారం హైదరా బాద్‌లోని తన నివాసంలో టీడీపీ ముఖ్య నేత లు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ అధికార ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నామో, కాం గ్రెస్‌తో ఎందుకు కలుస్తున్నామో కింది స్థాయి కేడర్‌కు, ప్రజలకు తెలపాలని సూచించారు. కూటమి నేతృత్వంలో రూపొందిస్తున్న కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) విషయంలో పార్టీ అనుసరించాల్సిన వైఖరి, ప్రతిపాదించాల్సిన ముఖ్య అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, అరవింద్ కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడు ఎవరి కాళ్లు పట్టుకున్నవ్ ?
సాక్షి, హైదరాబాద్: ‘2004 ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎవరి కాళ్లు పట్టుకున్నావో చెప్పాల’ని టీఆర్ఎస్ అధినేత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నిలదీశారు. హుస్నాబాద్ సభ తర్వాత 25 రోజులకు బయటకు వచ్చిన కేసీఆర్‌కు మతిభ్రమించి నిజామాబాద్ సభలో అడ్డదిడ్డంగా మాట్లాడారని విమర్శించారు. ఆయన చేసిన వ్యా ఖ్యలకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడారు. 2009 ఎన్నికల సందర్భంలో చంద్రబాబునుద్దేశించి కేసీఆర్ పొగుడుతూ మాట్లాడిన ఆడియోలను మీడియాకు వినిపించారు. చంద్రబాబుకు సంపద ఎలా సృష్టించాలో తెలుసునని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చివేశారని 2009 ఎన్నికల సందర్భంలో కేసీఆర్ మాట్లాడారని, ఇప్పుడేమో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలం గాణ రాష్ట్రాన్ని ఇచ్చారని 2014లో సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, ఆ తర్వాత రాక్షసి అన్నాడని, కేసీఆర్ ద్వంద్వ నీతిని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. దొంగపాస్‌పోర్టుల దొంగబతుకు కేసీఆర్‌దని విమర్శించారు. ఉద్యమంలో ఏం మాట్లాడినా కేసీఆర్‌కు చెల్లిందని, ఇప్పుడూ చెల్లదన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనను అరికట్టాలనే భావన ప్రజల నుంచి వచ్చినందునే మహాకూటమికి అంకురార్పణ జరిగిందని చెప్పారు. కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికతో కేసీఆర్ ప్యాంటు, షర్టు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. గడీల పాలనను ఓడిస్తాం: మండవ కేసీఆర్ నాటకాలు నిజామాబాద్ ప్రజలకు అర్థమయ్యాయని, అందుకే 2 లక్షలన్న చోట 40 వేలకు మించి జనాలు రాలేదని మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. అమరావతికి వెళ్లి బిర్యాని, ఆవకాయ తిని వచ్చి, రెండు రాష్ట్రాలు కలసి పనిచేద్దామన్న కేసీఆర్, ఇప్పుడు చులకనగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా గడీల పాలనను ఓడిస్తామని అన్నారు. -
ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్ర: రమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. ఆది వారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ రేవంత్‌రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అనంతరం రమణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలపై నమ్మకం పోతోందని, ముగి సిన కేసులను తిరగదోడుతున్నారన్నారు. ప్రజల్లో ఆదరణ ఉన్న ప్రతిపక్ష నాయకులను కావాలనే దెబ్బతీసే యత్నం చేస్తున్నారన్నారు. హైకోర్టు, ఎన్నికల కమిషన్ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సీఎం కేసీఆర్‌లో మార్పు రావట్లేదని, ప్రజలే కేసీఆర్, మోదీని శిక్షిస్తారని పేర్కొన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, కంటి వెలుగుతో ప్రజలను గుడ్డివాళ్లను చేస్తున్నారని విమర్శించారు. వంద సీట్లు గెలుస్తామనే భ్రమలో కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అంతకుముందు రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత అజిత్‌సింగ్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా రమణ, చాడ ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. కంటి వెలుగు ఆపరేషన్లు వికటించి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రమణ, చాడ పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, అరవింద్ కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగుదేశంలో గందరగోళం
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రోజురోజుకూ గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్వ కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు ఘనమైన చరిత్ర గల పచ్చపార్టీకి తెలుగు తమ్ముళ్లు ఇటీవల గట్టి షాకే ఇచ్చారు. రేవంత్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఇంకొందరు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం టీటీడీపీ నేతలతో నిర్వహించిన సమీక్షలో చేసిన ప్రకటనలు మరింత గందరగోళంలో పడేశాయి. పొత్తులపై ఆయన చేసిన అస్పష్టమైన ప్రకటన పార్టీ కేడర్‌లో తర్జనభర్జనలకు తెరతీసింది. తెలంగాణలో పార్టీని వదిలేది లేదని.. విలీనం ఊసే లేదని.. పొత్తులు ఖచ్చితంగా ఉంటాయంటూనే.. ఎన్నికల ముందే ప్రకటిస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం లేపుతున్నాయి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: 2014లో పొత్తులు పెట్టుకుని, ఇన్నాళ్లు బీజేపీతో అంటగాగిన చంద్రబాబు బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదనడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇప్పటికే ఒంటిరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు లేకపోతే ఇక మిగిలింది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనే. గతంలో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు చేసిన పొత్తు ఉంటాయని ప్రకటన చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తోనే పొత్తు ఉంటుందని పరోక్షంగా సంకేతాలిచ్చినట్లేనని జిల్లా నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీని వీడిన సీనియర్లు..మిగిలింది ఇద్దరే.. తెలంగాణ టీడీపీలో రెండేళ్లుగా స్థబ్దత నెలకొనడంతో గత ఎన్నికల్లో పార్టీ టికెట్లపై పోటీ చేసిన వారు, కష్టాల్లోనూ పార్టీని పట్టుకొని ఉన్నవారు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు, చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు ముద్దసాని కశ్యప్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అన్నమనేని నర్సింగారావు, హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు పేర్యాల రవీందర్రావు, మంథని నియోజకవర్గ అధ్యక్షుడు కర్రు నాగయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు ఉమ్మడి జిల్లాలోని వీరి అనుచరులు, సీనియర్ నేతలు టీడీపీని వదిలి తమ భవిష్యత్‌ను చక్కదిద్దుకునేందుకు ఇతర పార్టీల్లో చేరారు. దీంతో మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు, 9 నియోజకవర్గాలకు ఇన్చార్జీలు లేకుండా పోయారు. కాగా.. టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న కరీంనగర్ జిల్లాలో మంత్రుల స్థాయిలో పనిచేసి ముఖ్యనేతలుగా ఉన్న తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, జాతీయ అధికార ప్రతినిధి ఇనుగాల పెద్దిరెడ్డి మాత్రమే పార్టీకి పెద్దదిక్కుగా మిగిలారు. అయినా.. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు అధ్యక్షులే లేకుండా పోయారు. అదేవిధంగా కరీంనగర్, రామగుండం, వేములవాడ నియోజవర్గాలకు 2014 ఎన్నికల నాటి నుంచే నియోజకవర్గ అధ్యక్షులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం జగిత్యాలకు రమణ, కోరుట్లకు సాంబారి ప్రభాకర్, ధర్మపురికి జాడిబాల్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి ఇన్చార్జి లేకపోయినా సీనియర్ నాయకుడు, పార్టీ నగర అధ్యక్షుడు కళ్యాడపు ఆగయ్య పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు. చందా గాంధీ, కందుల ఆదిరెడ్డిలాంటి సీనియర్లు పార్టీ కోసం పని చేస్తున్నారు. పొత్తులతో ఎవరికి లాభం.. పార్టీలో మిగిలేది ఎవరు.. టీడీపీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ఖాయమని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే.. ఏ పార్టీతో పొత్తు అనే విషయాన్ని తేల్చకపోయినప్పటికీ టీఆర్ఎస్తో పొత్తు ఉంటుందనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీని వీడిన నేతల్లో అంతర్మథనం మొదలైంది. అధికార టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే తమ పరిస్థితి ఏంటని టీఆర్ఎస్లో చేరిన నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జరిగితే జగిత్యాల నియోజకవర్గానికి టీడీపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణకు మాత్రమే లాభం చేకూరే అవకాశం ఉంది. జగిత్యాలలో టీఆర్ఎస్ టికెట్ కోసం చాలా మందే పోటీ పడుతున్నా.. బలమైన నాయకుడు లేకపోవడంతో రమణకు లాభం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మిగిలిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం బెర్త్ ఖరారు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పొత్తులో పెద్దిరెడ్డికి హుజూరాబాద్, హుస్నాబాద్ స్థానాలు దక్కే అవకాశం లేదు. హుజూ రాబాద్‌కు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, హుస్నాబాద్‌కు కెప్టెన్ లక్ష్మీకాంతరావు తనయుడు వొడితెల సతీష్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిని కాద ని పొత్తులో టీడీపీకి ఈ రెండు స్థానాల్లో ఇవ్వడం సాధ్యపడే అవకాశాలు తక్కువే. టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే పెద్దిరెడ్డికి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన ఎన్నికలకు ముందే తన భవితవ్యం తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏ ర్పడింది. ఇదిలా వుండగా ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వలసలతో తెలుగుదేశం పార్టీ ఆవసాన దశకు చేరగా, ఆ పార్టీ నేత చంద్రబాబు ప్రకటన టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పొత్తులు వల్ల ప్రతికూల పరిస్థితులు ఉండే మరికొందరు సీనియర్లు సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉండగా, పార్టీలో చివరకు ఎవరు మిగులుతారనే చర్చ జోరందుకుంది. -
పౌరాణిక పాత్రలతో శిఖరాగ్రం
వనపర్తి రమణమ్మ. అలియాస్ రమణశ్రీ.. పుట్టింది పేద కుటుంబం. పొట్టకూటికి కూడా లేని పరిస్థితి. తెలిసీతెలియని వయస్సు నుంచే అన్నతో కలిసి పాటలు పాడుకుంటూ భిక్షమెత్తుకుని పొట్టపోసుకోవాల్సి వచ్చింది. పౌరాణిక రంగంలో రాష్ట్రంలోనే దిగ్గజ కళాకారుడైన రేబాల రమణ చేరదీశాడు. దీంతో ఆమె అనేక జిల్లాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. ఆత్మకూరు రూరల్: తోలుబొమ్మలాట కుటుంబాలు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోని డీసీపల్లి, బోయలచిరివెళ్ల, నబ్బీనగరం, శంకర్నగరం, లింగంగుంట, వ్వూరుపాడులలో ఉన్నాయి. వీరిలో డీసీపల్లి కళాకారులు దశాబ్దాల క్రితమే విదేశాల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. అటువంటి కుటుంబానికి చెందిన వనపర్తి రమణమ్మ, తన అన్న ఆంజనేయులతో కలిసి ఏడేళ్ల పసిప్రాయం నుంచే పొట్టకూటి కోసం ఆత్మకూరు బస్టాండ్‌తో పాటు రోజుకోచోట వీధుల్లో తిరుగుతూ పాటలు పాడుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకునే వారు. ఈ క్రమంలో ప్రఖ్యాత కళాకారుడు రేబాల రమణ ఓ సారి ఆత్మకూరు విచ్చేసి వీరి గురించి తెలుసుకున్నారు. తన వద్దకు పిలిపించుకుని ఇక నుంచి రోడ్ల వెంబడి తిరగవద్దని, కళాకారులుగా తీర్చిదిద్దుతానని ఆదాయ మార్గం చూపుతానని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అనేకప్రదర్శనలిచ్చి.. రమణ ఇచ్చిన ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. విజయవాడ, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో సుమారు వెయ్యి పౌరాణిక నాటకాల్లో నటించింది. చిత్ర, కలహకంటి, మాతంగి, బాలనాగమ్మ, లచ్చి, మంజరి, సంగు, ముత్తి, తదితర పాత్రల్లో నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఓ దశలో ఆమెకు గుండెపోటు రావడంతో పౌరాణిక రంగ కళాకారులు ఆర్థికసాయం చేసి ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత నుంచి నాటకాలు వేస్తూ రంగస్థల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. పౌరాణికాలకు ఆదరణ తగ్గింది చిన్నతనం నుంచి కళాభిమానంతో ఈ రంగంపైనే ఆధారపడ్డాం. పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తూ దిగ్గజ కళాకారుల సరసన నటించే అవకాశం దక్కింది. పౌరాణికాలకు గతంలో ఉన్న ఆదరణ నేడు లేదు. సహచర కళాకారిణులైన శిరీషా, పద్మ, అపర్ణ, తదితరులం కలిసి తరచూ పౌరాణికాల్లో నటిస్తూ పొట్టకూటికి సరిపడా సంపాదించుకుంటున్నాం. ప్రభుత్వ సహకారం అందించి పౌరాణికాలను కాపాడితే మాలాంటి కళాకారులతో పాటు ఈ కళ కూడా సజీవంగా నిలుస్తుంది. – రమణశ్రీ -
స్లీప్ కౌన్సెలింగ్
డే అండ్ నైట్ షిఫ్ట్లతో సమస్యగా ఉంది నా వయసు 30 ఏళ్లు. ఐటీ ఇండస్ట్రీలో నైట్ షిఫ్ట్, డే షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటీవల నాలో చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోతున్నాను. తగిన సలహా ఇవ్వగలరు. – సమీర్, హైదరాబాద్ మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చిమార్చి పనిచేయాల్సి రావడంతో సర్కేడియన్ రిథమ్ దెబ్బతిని ఆ షెడ్యూల్స్కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. పని సామర్థ్యమూ తగ్గుతుంది. ఇలాంటి కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయినా వాళ్లకు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. తరచూ నైట్ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి ఈ సమస్య వచ్చిన వారిలో కనిపిస్తుంటాయి. పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిద్రపట్టడంలో ఇబ్బంది, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలూ కనిపిస్తాయి. ఒక్కోసారి వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ ఉండే కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్ వర్క్ డిజార్డర్‌తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీ, మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి. మంచి నిద్ర కోసం చేయాల్సినవి ఇవే... నాకీమధ్య నిద్ర బాగా తగ్గింది. టాబ్లెట్లు వాడకుండా స్వాభావికంగా నిద్రపట్టే మార్గాలు చెప్పండి. – సుమనశ్రీ, విశాఖపట్నం రాత్రి వేళల్లో మీరు నిద్రించే వ్యవధి తగ్గినా, ఆ మర్నాడు పగలంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంచి నిద్ర కావాలనుకునే వాళ్లు ఈ కింది సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవి... ∙పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి ∙నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి ∙సాయంత్ర వేళల నుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకండి ∙రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి ∙ప్రతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రపొండి ∙ పగటి పూట చిన్న కునుకు (పవర్ న్యాప్) మాత్రమే చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు ∙గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది ∙పుస్తకం చదువుతుంటే వెంటనే నిద్రపడుతుందంటారు. కానీ... నిద్రకు వుుందు పుస్తకాలు చదవద్దు ∙నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. దాంతో నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. అందుకే వుద్యం తాగాక నిద్ర వచ్చినా మెలకువ తర్వాత అలసటంతా తీరిపోయిన రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. - డాక్టర్ రమణ ప్రసాద్ ,కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
సిటీవాసులను కాపాడిన తమిళ పోలీసులు
సాక్షి, చెన్నై : చెన్నైలోని మెరీనా బీచ్‌లో స్నానానికి దిగిన అన్నదమ్ములను రాక్షస అల నీటిలోకి లాక్కెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన రమణ (35), నరేంద్ర (28)లు చెన్నై మదురవాయల్ కృష్ణానగర్‌లోని తమ బంధువుల ఇంటికి ఇటీవల వచ్చారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం మెరీనా బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగిన వీరిని రాక్షస అల నీటిలోకి లాక్కెళ్లడంతో స్థానికులు కేకలు వేశారు. అక్కడ గస్తీలో ఉన్న పోలీసులు రమణ, నరేంద్రలను రక్షించి ఒడ్డుకు చేర్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్నదమ్ములిద్దరినీ రక్షించిన పోలీసులను స్థానికులు అభినందించారు. -
పెళ్లి చూపులకు వెళ్తూ..
∙ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు ∙ నల్లమల ఘాట్‌లో ఘటన ∙ కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులు ∙ నుజ్జునుజ్జయిన కారు నల్లమల ఘాట్(మహానంది): నంద్యాల–గిద్దలూరు రహదారిపై నల్లమల ఘాట్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు.. మార్కాపురం గ్రామానికి చెందిన మర్రి రమణ, సుభద్ర దంపతులు తమ కుమారుడు కిరణ్‌కు పెళ్లి చూపుల కోసం కారులో స్వగ్రామం నుంచి బయలుదేరారు. పచ్చర్ల సమీపంలో ఉన్న కల్వర్టు మలుపుల వద్ద వేగంగా వస్తున్న బండల లారీ కారును ఢీకొట్టింది. దీంతో రమణకు నడుము, సుభద్ర కాలు, చేయి విరిగాయి. కిరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ సురేష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారు నుజ్జనుజ్జవడంతో దాదాపు గంటపాటు వారు వాహనం నుంచి బయటకు రాలేకపోయారు. అటుగా వచ్చిన ప్రయాణికులు వారిని 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మహానంది ఎస్ఐ పెద్దయ్యనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన సిబ్బందితో కలిసి నంద్యాల ప్రభుత్వాస్పత్రికి వెÐðళ్లి వివరాలు సేకరించారు. కారు డ్రైవర్ సురేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విషాదాన్ని మరపించేది హాస్యమే
– ముళ్లపూడి జయంతి సభలో సాహితీవేత్తలు రాజమహేంద్రవరం కల్చరల్ : మన జీవితాల్లో విషాదాన్ని మరపించే శక్తి ఒక్క హాస్యానికే ఉందని ప్రముఖ గేయకవి మహమ్మద్ ఖాదర్‌ఖాన్ పేర్కొన్నారు. బుధవారం కళాగౌతమి ఆధ్వర్యంలో ప్రకాశం నగర్, ధర్మంచర కమ్యూనిటీ హాలులో జరిగిన రచయిత ముళ్లపూడి వెంకట రమణ జయంతిసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గురజాడ వెంకట అప్పారావు, భమిడిపాటి కామేశ్వరరావు, ముళ్లపూడి వెంకట రమణలు తెలుగునాట నవ్వులు పండించారని, మాట ‘విరుపు’ ముళ్లపూడి ప్రత్యేకత అని ఆయన వివరించారు. ‘జీవితాన్ని ‘స్కాచి’వడపోశాడు, ‘డబ్బు’ చేశాడు వంటి పదప్రయోగాలతో నూతన ఒరవడిని ముళ్లపూడి ప్రవేశపెట్టారన్నారు. చరిత్ర పరిశోధకుడు వి.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హాస్యం అపహాస్యం కాకుండా ఉత్తమాభిరుచితో ముళ్లపూడి రచనలు చేశారన్నారు. ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ గుంటూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పౌరాణికగాథలను సాంఘిక మూసలోకి తీసుకువెళ్లడం ఒక్క ముళ్లపూడికే చెందిందన్నారు. రామాయణంలో సుందరకాండ అంతా కనిపించే హనుమంతుడు, రామపట్టాభిషేకం అయ్యాక శ్రీరాముడు సీతమ్మతల్లిని అడవులకు పంపించినప్పుడు ఆ తల్లి వెంటే పిల్లవాడిరూపంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నాడని, లవకుశులతోపాటు సీతమ్మతల్లి యోగక్షేమాలు చూసేవాడని తన చివరి సినిమాలో ముళ్లపూడి చెప్పడం సంప్రదాయ విరుద్ధం కాదని అన్నారు. ప్రజ్ఞారాజహంస చింతలపాటి శర్మ మాట్లాడుతూ మృదువైన హాస్య, వ్యంగ్య రచనకు ప్రాణం పోసినవాడు ముళ్లపూడి అని పేర్కొన్నారు. ముళ్లపూడి ‘ఋణానందహరి’లో రచించిన ‘ఎవ్వనిచే జనించు ఋణమెవ్వనిచే భ్రమియించు లోకములో..నేను ఋణంబు వేడెదన్’ అన్న పద్యాన్ని వినిపించారు. కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి ముళ్లపూడి జీవితంలో అనుభవించిన కష్టసుఖాలను, ఎత్తుపల్లాలను విశ్లేషించారు. హాసం క్లబ్ కన్వీనర్ డి.వి.హనుమంతరావు మాట్లాడుతూ ముళ్లపూడి స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిని కేవలం హాస్యరచనగా చూడరాదని, అందులో ముళ్లపూడి వేదాంత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ముందుగా ముళ్లపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాట్యాచార్యుడు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్, చిత్రకారుడు మాదేటి రవిప్రకాష్, గాంగేయశాస్త్రి, అవధాన అష్టాపద తాతా సందీపశర్మ, రామచంద్రుని మౌనిక, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ అద్దేపల్లి సుగుణ, సన్నిధానం శాస్త్రి, మల్లెమొగ్గల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
త్రీ సోల్జర్స్
ఆర్మీ క్యాంప్‌లోకి ఉగ్రవాది చొరబడ్డాడు! ‘భారత్ మాతాకీ జై’ అంటూ.. వెంకట రమణ తెగబడ్డాడు. అతడి పోరాట పటిమకు త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అతడి శ్వాసతో మువ్వన్నెల గుండె.. జెండాలా ఎగసింది! రక్తాన్ని చిందించి.. తల్లి భారతికి ప్రాణాభిషేకం చేశాడు. శక్తికి, శౌర్యానికి.. కాషాయం. శాంతికి, సత్యానికి.. తెలుపు. సస్యానికీ, సాఫల్యానికీ ఆకుపచ్చ. జెండాలోని మూడు రంగులివి. త్యాగం అనే నాలుగో రంగు అద్ది అమరుడయ్యాడు రమణ! భార్యాబిడ్డల్లో సోల్జర్ ఆత్మను నింపి వెళ్లాడు రమణ! అతడి ఆశయం కోసం ఇప్పుడీ త్రీ సోల్జర్స్... ఉగ్ర విధితో పోరాడుతున్నారు! ‘అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తాడు’ అని అడిగిన చిన్మయితో ‘రెండు రోజుల్లో వచ్చేస్తాడమ్మా’ అని చెప్పింది తల్లి అనిత.. కానీ ఆమెకు అప్పుడు తెలియదు ఒకరోజు ముందే విగతజీవిగా తన భర్త వస్తాడని. ఏడాదిలో వచ్చేది ఒకసారే.. ఉండేది రెండు నెలలే.. ఆ రెండు నెలల పండుగకు పది నెలలుగా ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఆ ఎదురు చూపులు మరో రెండు రోజులే అనుకుంటున్న సమయంలో ఉగ్రరక్కసి కాటేసింది. జమ్మూకాశ్మీర్‌లోని కుంపరాస్ పంజగ్రామ్ ఆర్మీక్యాంప్‌పై ఏప్రిల్ 27 తెల్లవారు జామున ఆర్మీ క్యాంప్‌లో ప్రవేశించి టెర్రరిస్టులు దాడి చేయడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ ఆయుష్ యాదవ్, రాజస్థాన్‌కు చెందిన సబ్ బూప్సింగ్ గుజ్జార్‌లతో పాటు విశాఖపట్నం నగర పరిధిలోని ఆసవానిపాలెం గ్రామానికి చెందిన బివి రమణ అసువులు బాసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కథనం. పెద్ద కుటుంబం పద్దెనిమిదేళ్లుగా ఆర్మీలో సేవలందిస్తూ ‘నాయక్’ హోదాకు చేరుకున్న రమణకు భార్య అనిత, పాప చిన్మయి, బాబు గణేష్ ఉన్నారు. తల్లిదండ్రులు రాములమ్మ, కుంచయ్య, ఇద్దరు తమ్ముళ్లు అప్పలరాజు, కోటేశ్వరావు, మరదళ్లు లీల, రాజేశ్వరి, వాళ్ల పిల్లలు... వీరందరికీ అతనే పెద్ద దిక్కు. తనతోపాటు పెద్దతమ్ముడు అప్పలరాజును కూడా ఆర్మీలోకి తీసుకువెళ్లాడు రమణ. తల్లిదండ్రులకు, వదినలకు చేదోడు వాదోడుగా చిన్న తమ్ముడు కోటేశ్వరరావు విశాఖలోనే ఉండి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నంతలో అంతా సాఫీగానే గడిచిపోతోందనుకునేలోగానే ఉగ్రరక్కసి వెంకట రమణ నిండుప్రాణాలను బలిదీసుకుంది. దాంతో ఆ కుటుంబం దిక్కుతోచనిదైపోయింది. జీవితాంతం తోడు ఉంటాడనుకున్న భర్త వెంకట రమణను విధి వేరు చేయడంతో భార్య అనిత జీవితం ఒక్కసారిగా చీకటైపోయింది.. అయినప్పటికీ, దేశం కోసం తన భర్త ప్రాణాలు అర్పించాడన్న ఆత్మ సంతృప్తి, తానూ తన పిల్లలూ కలిసి దేశానికి ఇంకా ఏదయినా చేయాలన్న తపనతో పొంగుకొస్తున్న కన్నీటి ఉప్పెనను రెప్పల మాటునే దాచుకుంటూ భర్త రమణీయ స్మృతులను సాక్షితో పంచుకున్నారు. ‘‘ముందు రోజు రాత్రే ఫోన్ చేశారు. తనకు రిలీవ్ దొరకలేదని, దొరికిన వెంటనే రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. ఆయన వస్తున్నారన్న మాట మాలో ఎంతో ఆనందాన్ని నింపింది. పిల్లలు నాన్న వస్తున్నారని తెలిసి సంబరపడిపోయారు. ఆ రాత్రంతా నిద్రకూడా పోలేదు. నాకయితే తెల్లవారగానే ఏదో అలజడి, మనసు కీడు శంకిస్తోంది. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఉదయం 10.30కి మావయ్య ఫోన్ చేశారు. రమణకు ఏవో దెబ్బలు తగిలాయంట, హాస్పిటల్లో ఉన్నాడంట అని. ఆ మాటలకే నాకు గుండె ఆగిపోయినంత పనైంది. ఆయనకు ఏదైనా జరగకూడనిది జరిగితే... అన్న ఆలోచనకే నాకు కాళ్లూ చేతులూ ఆడలేదు. అందరూ ఏం కాదులే’’ అని ధైర్యం చెబుతున్నా, తెలియని భయంతో గుండె బరువెక్కుతోంది. నాకు తెలిస్తే ఏమైపోతానోనని వారికి ఉదయమే తెలిసినా ఆ బాధను దిగమింగుకుని నన్ను మానసికంగా సిద్ధం చేసి అప్పుడు చెప్పారు. అంతే! ఒక్కసారిగా ప్రపంచం శూన్యంగా కనిపించింది. అయినా మనసు పొరల్లో గర్వంగా కూడా ఉంది. నా భర్త దేశం కోసం ప్రాణాలిచ్చాడు. మాతృభూమి రుణం తీర్చుకుని వీరుడిలా మరణించాడు. ఆయన పంచిన జ్ఞాపకాలతో ఆయనిచ్చిన పిల్లలను పెంచి ప్రయోజకులను చేసి ఆయనలా గొప్పవాళ్లను చేస్తాను. పాప మూడవ తరగతి, బాబు ఒకటవ తరగతి శ్రీ శారదా విద్యానిలయంలో చదువుతున్నారు. ఇకపై వాళ్లే నా లోకం. ‘‘ఏడాదిలో రెండు నెలలే ఇంటి దగగర ఉంటాను. మిగతా అన్ని రోజులూ నువ్వే పిల్లల్ని, అమ్మానాన్నలను చూసుకోవాలి. నేనున్నా లేకున్నా నువ్వు ధైర్యంగా ఉంటాలి’’ అంటూ మా పెళ్లి చూపుల్లోనే ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను’’. దేశానికి అంకితం చేశాను కూలి చేసుకుని బతికేవాడినైనా నా ముగ్గురు కొడుకుల్లో ఇద్దరిని దేసేవకు పంపించాను. కుటుంబానికి ఒకరన్నా ఆసరా ఉండాలని మూడవ వాడిని మాత్రం పంపలేదు. ఇప్పుడు అన్నయ్య స్థానంలో వాడు వెళతానంటున్నాడు. పంపడానికి నేను సిద్ధం. – కుంచయ్య, రమణ తండ్రి నా బాబు మాయమైపోయాడు అమ్మా, రెండ్రోజుల్లో వచ్చేస్తా నేనొచ్చాక ఆస్పత్రికి తీసుకువెళతా అన్నాడు. నా పెద్ద కొడుకు ఇలా వస్తానని అలా మాయమైపోయాడు. ఇక తిరిగి రాడనే నిజాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు. డ్యూటీకి ఒక్కరోజు కూడా ఆలస్యంగా వెళ్లేవాడు కాదు.’’ – రాములమ్మ, రమణ తల్లి అన్నయ్యే స్ఫూర్తి అన్నయ్య ఆర్మీలోకి వెళ్లి దేశసేవ చేస్తుంటే ఆయన స్ఫూర్తితో నేనూ వెళ్లాను. ముంబైలో సేవలందిస్తున్నాను. ఆ రోజు విషయం తెలియగానే శ్రీనగర్‌కు వెళ్లిపోయాను. అప్పటికే అన్నయ్య సజీవంగా లేడు. తమ్ముడితో మాట్లాడాలని ఆఖరి క్షణంలో అన్నాడంట. – అప్పలరాజు, రమణ పెద్ద తమ్ముడు నా గుండెల్లో ఉన్నాడు! చిన్నప్పటి నుంచీ అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఆయనే నాకు దేవుడు. అన్నయ్య పేరును గుండెలపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాను. అన్న మమ్మల్ని ఏ పనీ చేయనిచ్చేవాడు కాదు. ఏదైనా తనే చూసుకునేవాడు. అలాంటి అన్నయ్య లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. – కోటేశ్వరరావు, రమణ చిన్న తమ్ముడు గాయపడి ఉంటారనుకున్నాం ఆ రోజు టీవీల్లో స్క్రోలింగ్ చూశాం. కాశ్మీర్లో కాల్పులు, ముగ్గురు జవాన్లు మృతి, ఐదుగురికి గాయాలు అని వస్తోంది. ఆ ఐదుగురిలో మా బావ ఉంటాడనుకున్నాం. వెంటనే నా భర్తకు ఫోన్ చేసి విషయం తెలుసుకోమని చెప్పాను. తీరా ప్రాణాలే లేవని తెలిసింది! – లీల, రమణ పెద్ద మరదలు మా పెద్ద దిక్కు మొదట ఆర్మీ ఆఫీసు నుంచి నా భర్తకే ఫోన్ వచ్చింది. కచ్చితంగా బతికి ఉంటారనుకున్నాం. కానీ నిజం కాలేదు. రమణ బావ ఉండే రెండు నెలల్లోనే ఎవరికి ఏ పని కావాలన్నా చేసిపెట్టేవారు. మాకు ఆయనే పెద్ద దిక్కు. ఇప్పుడాయనే లేకపోయేసరికి దిక్కుతోచడం లేదు. – రాజేశ్వరి, రమణ చిన్న మరదలు – బోణం గణేష్, సాక్షి, విశాఖపట్నం -
కాటేసిన పాముతోనే హాస్పిటల్‌కు..!
చిత్తూరు : పాము కాటేస్తే ఏం చేస్తాం? ఉరుకులు పరుగులతో బాధితుడిని హాస్పిటల్‌కు తీసుకెళ్తాం. కానీ ఓ నాగుపాము కాటుకు గురైన వ్యక్తి ఏకంగా ఆ పామునే ఒడిసి పట్టుకుని చికిత్స కోసం అర్ధరాత్రి వేళ హాస్పిటల్‌కు రావడంతో వైద్యసిబ్బంది హడలిపోయారు. నాలుగైదు అడుగుల పొడవున్న ఆ నాగును చూసేసరికి వైద్యసిబ్బంది గుండెలు జారిపోయాయి. భయం..భయంగానే అతడికి వైద్యం చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి వెళ్లాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం చిట్రెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళఙతే.. మండలంలోని తెల్లనీళ్లపల్లెకు చెందిన రమణ (50) కూలిపనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే, ఇళ్లల్లో చొరబడిన పాములను పట్టి దూరంగా వదిలేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 11.45 గంటల సమయంలో చిట్రెడ్డిపల్లెకు చెందిన రామకృష్ణ తమ ఇంటిలో నాగుపాము చొరబడిందని, దానిని పట్టాలంటూ రమణను తీసుకెళ్లాడు. పామును పట్టే క్రమంలో రమణ దాని కాటుకు గురయ్యాడు. అయినప్పటికీ అతను అధైర్యం పడలేదు. పాము తలను ఎడమచేతితో బలంగా అదిమి పట్టడంతో అది బలంగా చేతిని చుట్టుకుంది. మోటార్ సైకిల్లో రెండు కిలోమీటర్ల దూరంలోని చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే అర్ధరాత్రి దాటింది. పామును ఒడిసిపట్టుకుని వచ్చిన రమణను చూసి డ్యూటీ నర్స్ అరుణ హడలిపోయి పరుగులు తీశారు. చివరకు భయపడుతూనే అరుణ అతడికి పాము విరుగుడుకు ఇంజెక్షన్ వేశారు. ఆ తర్వాత పామును రమణ చంపేశాడు. ఆపై108లో పుంగనూరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో పాము కాటు చికిత్సకు పేరున్న శివాడికి ప్రైవేటు వాహనంలో రమణను రామకృష్ణ తరలించాడు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అక్కడ నాటువైద్యం చేయించాడు. తాను ఇప్పటివరకు 300 పైచిలుకు పాములు పట్టానని, 15సార్లు పాముకు గురయ్యానని రమణ ‘సాక్షి’కి తెలిపాడు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
జైనథ్ : వీఆర్ఏలకు వేతనాలను పెంచడాన్ని హర్షిస్తూ సోమవారం మండల కేంద్రంలోని తహాసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కే హుస్సేన్, రమణలు మాట్లాడుతూ తాము ఏండ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి, తమ వేతనాలను పెంచిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వీఆర్ఏలంతా కలిసి తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్, ఎన్ ఫోర్స్మెంట్ డీటీ వనజారెడ్డిలను మర్యాదపూర్వకంగా కలుసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. పెట్రోలు కోసం మలుపు తిరుగుతున్న వద్ధుడు, ఎడ్లబండిని ఢీకొన్న ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. రెండు కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది. రోడ్డుప్రమాదంలో డ్రైవర్ మతి తలుపుల : జ్యోతివాండ్లపల్లి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓబీఆర్ కొత్తపల్లికి చెందిన రమణ(45) అనే ట్రాక్టర్ డ్రైవర్ మతి చెందాడు. మతుడి బంధువులు తెలిపిన మేరకు.. మంగివాండ్లపల్లి శ్రీరాములుకు చెందిన ట్రాక్టర్‌కు రమణ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. తన స్వగ్రామం ఓబీఆర్ కొత్తపల్లి నుంచి రోజు ఉదయం వచ్చి సాయంత్రం తమ గ్రామానికి చేరుకొనేవాడు. గురువారం రాత్రి కూడా ట్రాక్టర్ పని ముగించుకొని తన గ్రామానికి వెళ్తుండగా జ్యోతావాండ్లపల్లి వద్ద గుర్తు తెలియని టైరు బండికి ఢీకొనడంతో అక్కడికక్కడే మతి చెందాడు. ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మతదేహాన్ని కదిరికి తరలించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.వి.సిద్దారెడ్డి, మండల కన్వీనర్ శంకర ఆస్పత్రిలో మతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మతుని కుటుంబానికి 10 వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. వారి వెంట రైతు సంఘం శివారెడ్డి, ఎరమరెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, కొండారెడ్డి, సాహెబ్ పీరా, కుమార్‌రెడ్డి, గౌస్ మోదీన్, రాజారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. యర్రంపల్లి వద్ద వద్ధుడు.. చెన్నేకొత్తపల్లి : యర్రంపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగినరోడ్డు ప్రమాదంలో బెస్త ముత్యాలు(62) మతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. న్యామద్దెలకు చెందిన బెస్త ముత్యాలు వ్యక్తిగత పని నిమిత్తం టీవీఎస్ మోపెడ్‌లో ధర్మవరం బయల్దేరాడు. మార్గం మధ్యలోని యర్రంపల్లి జంక్షనన్ వద్ద పెట్రోలు కోసం తిరిగాడు. ఇంతలో వెనకే వస్తున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ముత్యాలు అక్కడికక్కడే మతి చెందాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న ఏఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పీవీ సింధు తల్లిదండ్రులతో ఇంటర్వ్యూ
-
ఆ కొద్ది రోజులు వదిలేశాను...
చాంపియన్‌గా ఎదగడంలో క్రీడాకారులు ఎంతగా శ్రమిస్తారో వారి వెనక బయటికి కనిపించని తల్లిదండ్రుల కష్టం కూడా ఎంతో ఉంటుంది. తమ బిడ్డను ఆటకు సిద్ధం చేయడం, మంచి చెడూ చూసుకోవడం, గెలిచినప్పుడు అభినందించి, ఓడినప్పుడు ఫర్వాలేదు నేనున్నాననే నైతిక బలం, పగలనక, రాత్రనక తోడు నిలవడం... ఇది అమ్మానాన్నలకే సాధ్యం. ఒలింపిక్స్‌లో భారత జెండా ఎగరేసిన సింధు వెనక కూడా ఆమె తండ్రి పీవీ రమణ ఉన్నారు. రాకెట్ పట్టడం మొదలు రియోలో సంచలనం వరకు సింధు కెరీర్ గురించి ‘సాక్షి’తో రమణ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... సరదాగానే మొదలు పెట్టి... ‘‘మా అమ్మాయిని ఈ స్థాయిలో నిలిపిన గోపీచంద్ వల్లే సింధు తొలి సారి రాకెట్ పట్టిందంటే ఆశ్చర్యం వేస్తుంది. తోటి క్రీడాకారులుగా నాకు, గోపీకి సాన్నిహిత్యం ఉంది. మేమిద్దరం ఒకేసారి 2000లో అర్జున అవార్డు అందుకున్నాం. ఒక కార్యక్రమంలో మా కుటుంబం గోపీని కలిసింది. అప్పుడతను సింధుతో ‘నువ్వు మీ అమ్మా నాన్నల్లా టీమ్ గేమ్ మాత్రం ఆడకు. ఆసక్తి ఉంటే బ్యాడ్మింటన్ ఆడు’ అన్నాడు. అది సింధు మనసులో నాటుకుపోయింది. ఇంటి దగ్గర సరదాగా మొదలు పెట్టాక రైల్వే గ్రౌండ్స్‌కు తీసుకెళ్లాను. అక్కడ కోచ్ మహబూబ్ అలీ ప్రాథమికాంశాలు నేర్పించారు. గోపీచంద్ అకాడమీ మొదట్లో కొద్ది రోజులు ఎల్బీ స్టేడియంలో నడిచింది. వెస్ట్ మారేడ్‌పల్లిలోని మా ఇంటినుంచి అక్కడికి తీసుకెళ్లటం, తీసుకురావడం ఇబ్బంది కాలేదు. అయితే గోపీ అకాడమీ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకు మారడంతో సమస్య మొదలైంది. నాలుగు రోజులు మాలాగే చాలా మంది పిల్లల ట్రైనింగ్ ఆగిపోయింది. అయితే ఒక వ్యాపారవేత్త కొద్ది రోజుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి ఈ పిల్లలను అక్కడికి తీసుకెళ్లేందుకు సహకరించారు. మరి కొన్నాళ్లకు అదీ నిలిచిపోయింది. దాంతో నా ఉద్యోగం చేస్తూ సింధుకు అంత దూరం తీసుకు పోవడం సాధ్యం కాదని అర్థమైపోయింది. ఆ దశలో కొద్ది రోజులు పూర్తిగా వదిలేయడంతో అమ్మాయి ఆట ఆగిపోయింది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ కలిసినప్పుడు గోపి కనీసం వారానికి రెండు సార్లు తీసుకు రావచ్చు కదా అని అడిగాడు. దాంతో మళ్లీ కొత్తగా నా టైమ్‌టేబుల్ ప్రారంభమైంది. ఈ సారి ఎంత శ్రమకు ఓర్చయినా సరే 25 కిలోమీటర్ల దూరం ఉన్న గచ్చిబౌలికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాను. నాలుగు రోజుల ఆటకే సింధు ‘నాన్నా నాకు ఆట బాగా నచ్చేసింది. ప్రతీ రోజూ వస్తాను’ అని ఉత్సాహంగా చెప్పడంతో ఇక అప్పటినుంచి ఆట ఆగలేదు. కొన్నాళ్లకు గోపీకి సొంత అకాడమీ వచ్చాక సింధును పూర్తిగా అక్కడే ఉంచేశాను. అటుపై గచ్చిబౌలికి నేనూ ఇల్లు మారిపోయాను. ముందే కొట్టేసింది సింధులో మంచి ప్రతిభ ఉంది. కనీసం 23-24 ఏళ్ల వయసు వచ్చే సరికి గొప్ప ఫలితాలు సాధిస్తుంది అని పదేళ్ల క్రితం కోచింగ్ ప్రారంభమైనప్పుడు గోపీచంద్ చెప్పాడు. కానీ మరో రెండేళ్ల ముందే ఆమె ఒలింపిక్ మెడల్ గెలుస్తుందని అతను కూడా ఊహించలేదు! నా ఉద్దేశం ప్రకారం కూడా సింధు చాలా వేగంగా దూసుకుపోయింది. ఆట ప్రారంభించినప్పుడు భారత్‌కు ఆడుతుందని మాత్రమే నమ్మాను. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాక ఆమె ఏదైనా సాధించగలదని అనిపించింది. ఆ రోజు నా మనసులో తొలిసారి ఒలింపిక్స్ పతకం మెదిలింది. రియో కోసం ఆమె పడ్డ శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. వదిలేయ్ నాన్నా, ఇదంతా చేయాలా అని ఒకప్పుడు ఉదాసీనత ప్రదర్శించిన విషయాల్లో కూడా ఆమె కఠోర సాధన చేసింది. దాని ఫలితం బాగా ఉండబోతోందని ఆమెకు అర్థమైంది. అందుకే వెయిట్ ట్రైనింగ్, ఎక్సర్‌సైజ్‌లపై మరింత శ్రద్ధ చూపి అద్భుతమైన ఫిట్నెస్ను సాధించింది. అది ఆటలో కనిపించింది. ఇప్పుడు దేశం మొత్తం సింధు వైపు చూసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమెకు గుర్తింపు లభించింది. మ్యాచ్ జరిగే సమయంలో కనిపించే ఉద్వేగాలు ఆ తర్వాత సాధారణంగా మారిపోవచ్చు. కానీ నా కూతురు కూడా ఒలింపిక్ మెడలిస్ట్ అని నేను చెప్పుకునే అవకాశం ఆమె నాకు ఇచ్చింది. నా బిడ్డ ఘనత పట్ల తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా’’ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
లక్కిరెడ్డిపల్లె మండలం గద్దెగుండ్లరాచపల్లె మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామచంద్రనాయుడు(23), రమణ(22) అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. బైక్‌పై స్వగ్రామం నుంచి రామాపురం మండలం హసనాపురానికి వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఓ ఇంటి గోడను ఢీకొట్టారు. తీవ్రగాయాలపాలైన రామచంద్రనాయుడు అక్కడికక్కడే మృత్యువాతపడగా. రమణ అనే మరో యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. మృతుల స్వగ్రామం లక్కిరెడ్డిపల్లె మండలం పాలెంచిన్నపోతులోల్లపల్లె. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాపు ఇచ్చిన ఏకవాక్య జవాబు
ఇద్దరూ ఏం మాట్లాడరు, నా వంక చూడరు. ఉదయమే కదా ‘భరాగో’ నేనెవరో పరిచయం చేసింది! అప్పటికే నేను కథలకు బొమ్మలు వేస్తున్నాను. నాకు కొన్ని అనుమానాలున్నాయి- ఓ కారెక్టర్‌ను లేక ఒక వస్తువును వేసామనుకోండి. ఆ కారెక్టర్‌కి అవసరమయితే నీడను నల్లగా వేస్తాం. ఆ నీడ నాకెందుకో అందంగా బాలెన్స్డ్గా కుదరడం లేదు. అలా కుదరాలంటే ఏం చేయాలి? వారు (బాపు, రమణ) తీసిన ఏదో పిక్చర్ ఎలాపోతుందో అని ఆంధ్రదేశంలో పర్యటిస్తున్నారు. అలా ఈ వైజాగ్ కూడా వచ్చారు. ఎలాగూ వచ్చారు కాబట్టి మిత్రుడైన ‘భరాగో’ను చూడ్డానికి వస్తున్నారు. నన్ను పరిచయం చేశాడు భరాగో. విష్ చేసి నిలబడ్డాను. కాసేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పుకున్నారు. మధ్యలో మాట్లాడ్డానికి నాకు కుదరలేదు. వారు బయలుదేరేట్టున్నారు. ‘‘మిమ్మల్ని కలుసుకోవాలనుకొంటున్నాను. ఎక్కడ కలుసుకోవాలి’’ అని బాపుగార్ని అడిగాను. ‘‘సాయంకాలం వరకూ బిజీగా ఉంటాం. ఐదు గంటలకయితే హోటల్ అప్సరలో ఫలానా రూంలో ఉంటాం’’ అంటూ రూం నంబర్ చెప్పారు. నంబర్ నోట్ చేసుకున్నాను. ఆ రూం ఇండివిడ్యువల్ రూముల సిరీస్‌లో ఉంది. అంటే ప్రయివేట్ రూం అన్నమాట. అవి ఆ హోటల్‌కి మొదట్లోనే కనిపిస్తాయి. అవి తొలకరి రోజులనుకుంటాను. పగలంతా ఎండ బాగా కాసీ సాయంకాలానికి వర్షం మొదలయింది. ఎలాగన్నా వారిని కలవాలన్న ఉద్దేశంతో వర్షానికి తడుస్తూ హోటల్‌కే బయలుదేరాను. అక్కడికి చేరేసరికి బట్టలు తడిసి ముద్దయి పోయాయి. చేతిలో కేరియర్ సంచీ. రిసెప్షన్లో మరో మారు కన్ఫర్మ్ చేసుకొని ఆ రూం తలుపు తట్టాను. ముందుగా ముళ్లపూడివారు వచ్చారు. కూచోండి అన్నారు. బయట పొడవాటి బల్ల, సోఫాలాంటి చెక్క కుర్చీలున్నాయి. బల్లమీద కూచున్నాను. కిందంతా వర్షానికి తడిసిపోయి ఉంది. పైనుండి గొట్టంలో పెద్దగా నీళ్లు పడుతున్నాయి. ఆ నీళ్లన్నీ ఇనుపచట్రం ఉన్న కంతగుండా ఎటో పోతున్నాయి. అరుగు కింద పూల మొక్కలు. బాపుగారు, ముళ్లపూడి వారూ వచ్చారు. మధ్యాహ్నం పడుకున్నారు కాబోలు. ఫ్రెష్ అయి తెల్లటి బట్టలు కట్టుకొని ఉన్నారు. సోఫాల్లా ఉన్న చెక్క కుర్చీలో కూచున్నారు. ఇద్దరూ ఏం మాట్లాడరు, నా వంక చూడరు. ఏం మాట్లాడాలో నాకూ తోచడం లేదు. ఉదయమే కదా ‘భరాగో’ నేనెవరో వీళ్లకి పరిచయం చేసింది! అప్పటికే నేను కథలకు బొమ్మలు వేస్తున్నాను. నాకు కొన్ని అనుమానాలున్నాయి- బొమ్మలపరంగా ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవాలి- అవీ ఒకటీ రెండు అంశాలు మాత్రమే! ఓ కారెక్టర్‌ను లేక ఒక వస్తువును వేసామనుకోండి. ఆ కారెక్టర్‌కి అవసరమయితే నీడను నల్లగా వేస్తాం. ఆ నీడ నాకెందుకో అందంగా బాలెన్స్డ్గా కుదరడం లేదు. అలా కుదరాలంటే ఏం చేయాలి? దానికి బాపుగారినుండి వచ్చిన సమాధానం ఇలా సంక్షిప్తంగా ఉంది. ‘‘సోవియట్ లాండ్ పుస్తకంలోని బొమ్మలు చూడండి తెలుస్తుంది.’’ తిరిగి మా మధ్య నిశ్శబ్దం. వాళ్లిద్దరూ జీవితంలో అదే మొదటిసారిగా చూస్తున్నట్టు, పై నుండి పడుతున్న వాననీరు తూములోకి పోవడం చూస్తూనే ఉన్నారు. పది నిమిషాలు గడిచాయి. ఇక నాకు ఏం మాట్లాడాలో తోచలేదు. సీతమ్మధారకు పోవాలంటే ఇప్పటిలా ఇన్ని బస్సులు లేవు. తడిసిన వాచీని చూస్తే బస్ వేళయ్యింది. వస్తానన్నట్టు లేచాను. వాళ్లూ లేచారు. వర్షం తగ్గేదాకా కూచోమనన్నా అనలేదు. ఆ రెండు మెట్లు కిందికి దిగి రెండడుగులు వేసి వెనక్కు చూశాను. వారు లోపలికి పోయి తలుపులు వేసుకుంటున్నారు. ‘‘అది మంచికయినా చెడుకయినా ఫస్ట్ ఇంప్రెషన్ ప్రభావం ఉంటుంది, ఎదుటివారిపై.’’ నేను వర్షంలోనే బస్ పట్టుకొని ఇంటికెళ్లిపోయాను. ఇక ఈ చిత్రకళలో ఏవన్నా డెవలప్మెంట్స్ కావాలంటే ప్రపంచంలోనే వెతుక్కోదలచుకున్నాను- తరువాత అలాగే చేశాను కూడ. - బాలి (ఔచిత్య అనౌచిత్యాలతో నిమిత్తం లేకుండా చిత్రకారుడు బాలి రాసుకున్న ఆత్మకథ: ‘చిత్ర’మైన జీవితం. పురాణం, నండూరి, శ్రీశ్రీ, లత, సౌరిస్, మోహన్ లాంటివారెందరో ఇందులో తీపికో చేదుకో పాత్రలుగా నిలబడతారు. ‘రావిశాస్త్రా, వాడెవడూ’ అన్న టీసీ సంగతీ, వడ్డెర చండీదాస్ సీరియల్ నవలకు బొమ్మలు వేస్తూ తనకు నచ్చని సెక్స్ శాడిజం వర్ణనలున్న పేజీల్నీ బాలి చించేసిన సంగతి కూడా ఇందులో వస్తాయి. ‘మరీ ఘోరంగా ఉన్నచోట పేజీలకు పేజీలు చించేశాను- ఆ చివరా ఈ చివరా కలిపేశాను’. ఒక సంపాదకుడు(పురాణం) ఎంపిక చేసిన నవలని ఒక ఇల్లస్ట్రేటర్ తన విచక్షణతో ఇలా చేయడం ఏ రకమైన సాహిత్య ప్రమాణం అన్న ప్రశ్న తలెత్తుతుంది. దానికి బాలి సమర్థన: ‘ఎవరి బుర్రలోకి ఏ వెర్రి ఆలోచనో వస్తే ఎలాగ?’ అచ్చు ప్రమాణాల పరంగానూ నిరుత్సాహం కలిగించే ఈ పుస్తక ప్రచురణ: శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్. పేజీలు: 226; వెల: 150; ప్రతులకు: రచయిత, ప్లాట్ నం. 1బి-83, 2-8-18, సెక్టర్-9, ఎమ్వీపీ కాలనీ, విశాఖపట్నం-9849963082.) -
ఇనుప కమ్మీలు గుచ్చుకుని కూలీ మృతి
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామ శివారులో ఇనుప కమ్మీల లోడుతో వెళుతున్న లారీలో ఇనుప చువ్వలు గుచ్చుకుని రమణ అనే కూలి మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరుగురు కూలీలు కృష్ణా పుష్కరాల పనులకు వెళ్లేందుకు ఇనుప కమ్మీల లోడుతో వెళుతున్న లారీలో ఎక్కారు. కమ్మీలపై కూర్చుని ప్రయాణం చేస్తుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కమ్మీలు గుండెలో గుచ్చుకుని రమణ అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మిలిగిన నలుగురు క్షేమంగా బయటపడ్డారు. -
శ్రీవారి ప్రసాదం పేరుతో నకిలీ జిలేబీలు
తిరుచానూరు : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం పేరుతో నకిలీ జిలేబీ తయారుచేసి విక్రయిస్తున్న పోటు కార్మికుడిను పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి పోటులో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న రమణ తిరుచానూరులోని వసంతరావునగర్లో ఉంటున్నాడు. శ్రీవారి ప్రసాదంలో జిలేబీలకు గిరాకీ ఎక్కువ. దాంతో అతను ఇంటివద్దే జిలేబీలు తయారుచేస్తూ తిరుమలలో చేసే విధంగానే ప్యాకింగ్ చేసి విక్రయించేవాడు. ఈ వ్యవహారం చాలాకాలంగా కొనసాగుతోంది. భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రమణ వ్యవహారశైలిపై కన్నేశారు. గురువారం ఉదయం తిరుచానూరులోని రమణ ఇంటిపై దాడిచేసిన తిరుమల పోలీసులు రమణను అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీసులకు అప్పగించారు. ఈ సందర్బంగా పెద్దఎత్తున జిలేబీలను స్వాధీనం చేసుకున్నారు. -
మహారాష్ట్ర ఒప్పందంపై జాగ్రత్త!
తుమ్మిడిహెట్టి ఎత్తు 152 మీటర్లకు తగ్గొద్దు: ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకునే గోదావరి బ్యారేజీల ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కోరారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల కంటే తక్కువ ఉండొద్దని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం ఆ పార్టీ నేతలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కీలక విషయాల్లో విపక్షాలను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటానని గతంలో పేర్కొన్న సీఎం కేసీఆర్ మాట తప్పారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలతో చ ర్చించాక మహారాష్ట్రతో ఒప్పందానికి వెళ్లి ఉంటే బావుండేదన్నారు. అలా కాకుండా సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరించారని, కనీసం తీసుకునే నిర్ణయాలైనా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా ఉండాలని కోరారు. తుమ్మిడి హెట్టి ఎత్తు తగ్గతే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. బాబ్లీపై తమ ఆవేదనను పట్టించుకోలేదని, పర్యవసానాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని ఎల్.రమణ పేర్కొన్నారు. -
బైక్‌ను ఢీకొన్న బొలెరో.. ఒకరు మృతి
విశాఖ జిల్లా రాంబిల్లి మండలం లోగపాలెం రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీకి చెందిన రాజు (24), గంగిరి రమణ (22) బైక్‌పై వెళుతుండగా బొలెరో ఢీకొంది. రాజు తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు. రమణకు కూడా తీవ్ర గాయాలు కావడంతో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
డీలర్ దారుణ హత్య
ఆత్మకూరు: వ్యవసాయ బావి వద్ద నుంచి ఇంటికి వస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికంగా నివాసముంటున్న రమణ (30) డీలర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈక్రమంలో నిన్న రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. గుర్తు తెలియని దుండగులు రాడ్లతో దాడి చేశారు. దీంతో తలపై బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. శుక్రవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి'
హైదరాబాద్: పాతబస్తీలో ఎంఐఎం, కొత్తసిటీలో టీఆర్ఎస్ పార్టీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఇతర పార్టీల అభ్యుర్ధులపై దాడి ఇందుకు నిదర్శనమని అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్ రమణ, శివకుమార్ ధ్వజమెత్తారు. మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతి భద్రతల అదుపులో ప్రభుత్వం విఫలమైందన్నారు. తక్షణం గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని సెక్షన్ 8 అమలు చేయాలన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తామని అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్ రమణ, శివకుమార్ తెలిపారు. -
ఎక్సైజ్ సూపరింటెండెట్ రమణపై వేటు
-
లారీ- బైక్ ఢీ.. ఇద్దరి మృతి
వేగంగా వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింన ఘటనలో బైక్ పై ఉన్న భార్యా భర్తలు మృతిచెందగా.. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం నట్టయ్యపాలెం క్రాస్ రోడ్డు వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. పెందుర్తి మండలం సుజాత నగర్‌కు చెందిన దన్నిన రమణ(31) ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య మేనకతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు పడమట మండలంలోని జాజులవాని పాలెం గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న వీరిని గాజువాక మండలం నట్టయ్యపాలెం సమీపంలో 5వ నంబరు జాతీయ రహదారి పై నుంచి వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య మేనక(28) అక్కడికక్కడే మృతిచెందగా.. రమణ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమణ మృతి చెందగా.. ఇద్దరు చిన్నారులు కుందన(2) లత్విక్(6నెలలు) ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం చిన్నారి కుందన పుట్టిన రోజు కావడంతో.. అమ్మమ్మ ఆశిస్సుల కోసం వెళ్లి వస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. -
గల్లంతైన వారి కోసం గాలింపు
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేట వద్ద కృష్ణా నదిలో గల్లంతైన ముగ్గురి కోసం స్థానికులు తీవ్రంగా గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం బల్లకట్టు సైడ్ గ్రిల్ విరిగి రామన్నపేటకు చెందిన నరసింహారావు, గోపి, రమణ నదిలో పడిపోయారు. అయితే, తమ పరిధిలోకి రాదంటూ ఇటు కృష్ణా, అటు గుంటూరు జిల్లాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానికులే గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగి 16గంటలు గడుస్తున్నా... నదిలో గల్లంతైన వారి ఆచూకీ లభించపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. -
'యాగాలతో బంగారు తెలంగాణ రాదు'
రాయికల్(కరీంనగర్): ముఖ్యమంత్రి కేసీఆర్ చేయనున్న చండీయాగం, ఆయన కూతురు ఎంపీ కవిత ఆడుతున్న బతుకమ్మలతో బంగారు తెలంగాణ రాదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం కేంద్రానికి నివేదిక ఇవ్వలేదని, అదే చండీయాగం కోసం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి ఆహ్వానించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం నుంచి ఎలాంటి నివేదిక రాలేదని, దీంతో కరువు నిధులను మంజూరు చేయలేకపోతున్నామని కేంద్రం తెలిపినట్లు రమణ గుర్తుచేశారు. కరువు కాటకాలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే కేసీఆర్ తన కూతురు కవిత ఆడే బతుకమ్మ పండగల కోసం కోట్లాది రూపాయలను విడుదల చేయడం వారి కుటుంబ పాలనకు నిదర్శనమన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందుతాడని ధీమా వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై రైతు చెప్పు విసరడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. -
బీసీ సబ్‌ప్లాన్ చట్టం చేయాలి : రమణ
నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సబ్‌ప్లాన్ చట్టం చేయాలని దీని వల్ల కల్లుగీత కార్మికుల జీవనం మెరుగుపడుతుందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ అన్నారు. బుధవారం స్థానిక దొడ్డి కొమురయ్య భవన్లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షా 15 వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 2,179 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. దాంట్లో కల్లుగీత కార్పొరేషన్‌కు రూ. 9 కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల గీత కార్మికుల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కల్లుగీత కార్పొరేషన్‌కు కనీసం రూ. 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గుడుంబాను అరికట్టడానికి చీఫ్ లిక్కర్‌ను ప్రజలకు చేరువ చేస్తామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. మద్యపాన విధానం కల్లుగీత కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ఉందని, వేలం పాటల విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే కొన్ని దుకాణాలు నిర్వహించాలన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజుగౌడ్ మాట్లాడుతూ కల్లుగీత వృత్తిలో ప్రమాదానికి గురైన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నారు. సమావేశంలో నాయకులు బీమాగాని శ్రీనివాస్, రాచకొండ వెంకట్‌గౌడ్, పొట్ట నగేష్, ఎ.గోవింద్, పి.అచ్చాలు తదితరులు పాల్గొన్నారు. -
టీచర్‌పై తెలుగుదేశం నేత దాడి
-
టీచర్‌పై తెలుగుదేశం నేత దాడి
ప్రభుత్వ విప్ కళ్లముందే దాష్టీకం సమస్యలు ప్రస్తావిస్తే ఫలితం పోలీసులకు టీచర్ ఫిర్యాదు ఒంటిమిట్ట(వైఎస్సార్ కడప): ప్రభుత్వ అధికారులపై, ఉద్యోగులపై తెలుగుదేశం నేతల దాష్టీకాలు కొనసాగుతున్నాయి. మొన్న తహసీల్దార్ వనజాక్షి, చిత్తూరు జిల్లా చిన్నగొట్టిమల్లు మండల తహసీల్దార్ నారాయణమ్మ మీద దాడులకు పాల్పడ్డ తెలుగుదేశం నేతలు తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో రెచ్చిపోయారు. ఇక్కడ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి సమక్షంలో టీడీపీ నేత ఓ టీచర్ చెంప ఛెళ్లుమనిపించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంటిమిట్టలో సోమశిల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించే కార్యక్రమానికి ప్రభు త్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ రమణ హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్ వెళ్లిపోయారు. మేడా మల్లికార్జునరెడ్డి కొద్దిసేపు ఆ ప్రాంతంలోనే ఉండి పనులను పరిశీలించారు. ఈ సమయంలో ఒంటిమిట్టకు చెందిన టీచర్ రమణ గ్రామంలో తాగునీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో పక్కనే ఉన్న ఒంటిమిట్ట టీడీపీ మం డల అధ్యక్షుడు నరసయ్య ‘నీరు ఎక్కడ రావడం లేదో నీకు తెలుసా’ అని ఆవేశంగా ప్రశ్నించారు. ఉపాధ్యాయునిపై దాడికి పాల్పడ్డాడు. ఈ గొడవను మేడా మల్లికార్జునరెడ్డి చూస్తూ మిన్నకుండిపోయా రు. తనకు జరిగిన ఈ అవమానం మరెవ్వరికీ జరగకూడదంటూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
'అసెంబ్లీ సమావేశాల్లో హక్కుల నోటీసు ఇస్తా'
విశాఖపట్నం: ఎస్టీ శాసన సభ్యురాలైన తనపై ఏసీపీ రమణ దాడి చేయడం అమానుషమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. గురువారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న తనపై ఏసీపీ రమణ దాడి చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన ఘటనపై గవర్నర్, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ సంఘటనపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హక్కుల నోటీసులు ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా ఉంటే కాకీ చొక్కాలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీ చేయాలంటూ విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ పోలీసులకు సూచించారు. మహిళ కార్యకర్తలపై దాడి విషయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని గుడివాడ అమర్నాధ్ హెచ్చరించారు. విశాఖపట్నం కలెక్టరేట్లో ధర్నా చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. వైఎస్ఆర్ సీపీ ధర్నాపై కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కలెక్టరేట్‌లోకి వెళ్లారు. అయితే అక్కడ ఉన్నతాధికారులు లేకపోవడంతో వినతి పత్రాన్ని ఆమె గోడకు అంటించారు. ఆ క్రమంలో ఏసీపీ రమణ దౌర్జన్యానికి దిగారు. ఇకపై ధర్నాలు ఎలా చేస్తారో చూస్తానంటూ ఎమ్మెల్యే, పార్టీ నేతలను ఏసీపీ రమణ హెచ్చరించారు. అనంతరం గోడకు అంటించిన వినతి పత్రాన్ని ఏసీపీ రమణ చింపేశారు. ఏసీపీ వైఖరిపై వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. -
'ఇన్స్టాంట్ క్రికెట్‌తోనే ఇక్కట్లు పెరిగాయి'
-
గోదావరిలో వ్యక్తి గల్లంతు
తూర్పుగోదావరి: స్వామివారి దర్శనానికి వచ్చిన వ్యక్తి గోదావరిలో గల్లంతయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలోని శ్రీ బాల బాలాజీ స్వామివారి ఆలయానికి వచ్చిన భక్తులు సమీపంలోని గోదావరి స్నానఘట్టంలో స్నానమాచరించడం ఆచారం. ఆదివారం ఉదయం తునికి చెందిన ఉండ రమణ(40) గోదావరిలో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న ఆలయ సహాయ సిబ్బంది అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది. (మామిడికుదురు) -
హైకోర్టు విభజనకు చంద్రబాబు, సీజే అడ్డు
* ప్రత్యేక హైకోర్టుకై నినదించిన తెలంగాణ న్యాయవాదులు * టీడీపీ నేత రమణకు పిండప్రదానం * న్యాయవాదుల ర్యాలీ, అరెస్టు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును పోలీసుల రక్షణతో నడిపిస్తున్నారని తెలంగాణ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనను చంద్రబాబు, సీజే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. న్యాయశాఖలో నియామకాలను నిలిపివేయాలని, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ, తెలంగాణ హైకోర్టు సాధన కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో వందలాది మంది న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ కలసి న్యాయవ్యవస్థకు సంకెళ్లు వేశారంటూ న్యాయవాదులు సంకెళ్లతో నిరసన తెలిపారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణకు పిండప్రదానం జరిపించారు. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రాజేందర్ రెడ్డి, కో కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి, హైకోర్టు సాధన కమిటీ చైర్మన్ సహోదర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎమర్జెన్సీలో సైతం పోలీసు రక్షణతో న్యాయవ్యవస్థ నిర్వహణ జరగలేదన్నారు. హైకోర్టు ప్రాంగణంలో 144 సెక్షన్ విధించడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజకీయాలు చేయాలనే ఆసక్తి ఉంటే తక్షణమే రాజీనామా చేసి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాలన్నారు. సమస్యలుంటే పరిష్కరించుకుందామంటున్న చంద్రబాబు హైకోర్టు విభజనపై చర్చకు రావాలన్నారు. అనంతరం చలో సెక్రటేరియట్‌కు ర్యాలీగా వెళ్తున్న తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం: ఇంద్రకరణ్ సాక్షి, హైదరాబాద్: హైకోర్టును విభజించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని.. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. హైకోర్టు విభజన, జూనియర్ సివిల్ జడ్జీల నియామక ప్రక్రియ నిలుపుదలపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు శ్రీరంగరావు, రాజేం దర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి సచివాలయంలో మంత్రిని కలిశారు. హైకోర్టు విభజన చేయకుండా న్యాయశాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తే తెలంగాణ వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. న్యాయవాదులపై పోలీసులు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారన్నారు. స్పందిం చిన మంత్రి ఇది న్యాయవాదులదే కాదు.. తెలంగాణ సమస్య అని, ఇదే అంశంపై సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు. -
పెళ్లికి నిరాకరించాడని..
వేములపల్లి (నల్లగొండ): వాళ్లిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.. కులాలు అడ్డుగోడలయ్యాయో.. మరే కారణమో తెలియదు కానీ.. ప్రియుడు చేసిన బాసలు మరిచిపోయాడు.. పెళ్లికి నిరాకరించాడు.. అతడిని ఒప్పించేందుకు ఆ యువతి చేయని ప్రయత్నమంటూ లేదు.. ప్రాథేయపడింది.. కనికరించలేదు.. పెద్దల ఎదుట తనగోడు వెళ్లబోసుకుంది.. ఫలితం లేదు.. చివరకు పోలీస్‌స్టేషన్ గడప కూడా ఎక్కింది.. శూన్యమే కనిపించింది.. మనస్తాపానికి గురై చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. ఇది తెలిసి భయంతో ప్రియుడు కూడా పురుగులమందు తాగాడు.. సంచలనం సృష్టించిన ఈ ఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు, ప్రేమికుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన పెదమాం లచ్చయ్య, రాములమ్మ దంపతుల పెద్దకుమార్తె రమణ, ఇదే గ్రామానికి చెందిన వెంకన్న,మంగమ్మల చివరి సంతానం విఘ్నేష్ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పదో తరగతి వరకు చదివారు. విఘ్నేష్ వ్యవసాయ పనులు చూసుకుంటుండగా, రమణ కూలీగా చేస్తోంది. మూడేళ్ల క్రితం విఘ్నేష్ వ్యవసాయ బావి వద్ద కూలికి వెళ్లిన రమణకు విఘ్నేష్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. కులాలు అడ్డుగోడలయ్యాయా..? విఘ్నేష్, రమణల కులాలు వేరు. అయినా ఇద్దరు కలిసిమెలసి తిరిగారు. బాసలు చేసుకుని పెళ్లాడాలనుకున్నారు. విషయం పెద్ద వాళ్లకు కూడా తెలిసింది. ఏమైందో తెలియదు కానీ విఘ్నేష్ పెళ్లికి నిరాకరించాడు. కొద్ది రోజులుగా వీరి పెళ్లి విషయమై గ్రామంలో పంచాయితీ కూడా జరుగుతోంది. అయినప్పటికీ విఘ్నేష్ పెళ్లికి ససేమిరా అన్నట్టు తెలిసింది. దీంతో రమణ సోమవారం వేములపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే విఘ్నేష్ తరఫు బంధువులు కేసు నమోదు కాకుండా, రెండు రోజుల సమయమిస్తే గ్రామంలోనే మాట్లాడుకుంటామని, పోలీసులకు లిఖితపూర్వక హామీ ఇచ్చినట్టు సమాచారం. న్యాయం జరగదనేనా..? పెద్ద మనుషుల పంచాయితీలో విఘ్నేష్ పెళ్లికి ఒప్పుకోకపోవడం, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురై రమణ ఇంట్లోనే గుళికలు తిన్నట్టు తెలుస్తోంది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన రమణను కుటుంబ సభ్యులు గమనించి మిర్యాలగూడ ఆస్పత్రిలో చేర్పించారు. భయంతో ప్రియుడు.. రమణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని విషయం తెలియడంతో విఘ్నేష్ భయాందోళనకు గురయ్యాడు. ఇంట్లోనే ఇతడు కూడా పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. రమణ ఫిర్యాదు మేరకు విఘ్నేష్‌పై మిర్యాలగూడ డీఎస్పీ సందీప్‌గోనె పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
పెళ్లింట విషాదం
కూతురు పెళ్లికి శుభలేఖలు పంచడానికి వెళుతూ తండ్రి దుర్మరణం కాబోయే అల్లుడి ఇంటికి కూతవేటు దూరంలోనే ఘటన నక్కపల్లి: కుమార్తె వివాహాన్ని ఎంతోఘనంగా చేయాలని భావించాడు. సొంత బావమరిదికే ఇచ్చి ఈనెల 25న పెళ్లికి ముహూర్తం పెట్టారు. బంధువులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళుతుండగా విధి వక్రించింది. మండలంలోని ఉద్దండపురం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ తండ్రి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట మండలం పాల్తేరుకు చెందిన దేవవరపు రమణ(40) కుమార్తె పెళ్లి శుభలేఖలతో మోటారు సైకిల్‌పై వెళుతూ ఉద్దండపురం సమీపంలో ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రమణకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి పెళ్లి చేశాడు. చిన్న కుమార్తెకు పెళ్లి నిశ్చయించారు. మరోవారం రోజుల్లో కన్యాదానం చేసి ఒక అయ్యచేతిలో పె ట్టాల్సిన తండ్రి మృతదేహం వద్ద కుమార్తె దేవి తోపాటు భార్యమంగలు బోరున విలపిస్తున్నా రు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
విశాఖలో హాలిడే ఎక్స్పో
హైదరాబాద్: విశాఖపట్టణంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న హాలిడే ఎక్స్పో ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్లో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్వి టూర్స్అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేత ఆర్వి రమణ తెలిపారు. తమ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది భక్తులు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కల్పిస్తున్నామన్నారు. విశాఖలోని గేట్‌వే హోటల్లో మూడు రోజులపాటు ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు. 2015 సంవత్సరంలో మానస సరోవరం, బదరీనాథ్, కేదారీనాథ్, అమర్నాథ్, కాశీవిశ్వనాథ్ యాత్రలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. ఎగ్జిబిషన్లో ఔత్సాహిక పర్యాటకులు తనను కలిసి తగిన సూచనలు తీసుకోవచ్చన్నారు. వివరాలకు ఫోన్: 8106666134లో సంప్రదించాలని కోరారు. -
వైఎస్ ఉంటే రజకులకు న్యాయం జరిగేది
మెదక్ రూరల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉంటే రజకులకు సముచిత న్యాయం జరిగేదని, ఆయన అకాల మృతితో రజకులకు తీరని లోటు జరిగిందని రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతరాజు రమణ పేర్కొన్నారు. మెదక్ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఆదివారం రజక ఉద్యోగుల ఐక్యవేదిక జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రమణ మాట్లాడుతూ సమాజంలో నేటికీ వెట్టి చేస్తున్నది ఒక్క రజక కులస్తులేనన్నారు. ఇతర కులవృత్తుల వారు తాము చేసిన పనికి డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటుంటే గ్రామీణ ప్రాంతంలోని రజకులు రోజంతా కష్టపడి దుస్తులు ఉతికి రాత్రి పూట వెళ్లి ఇల్లిల్లూ తిరిగి అడుక్కునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రజకుల కష్టాలను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారన్నారు. ఆయన అకాల మృతితో రజకులను పట్టించుకునే వారే లేరన్నారు. రజకులకు న్యాయం జరగాలంటే ఎస్టీ, లేదా ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజక ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు దుర్గయ్య మాట్లాడుతూ దేశంలోని 19 రాష్ట్రాల్లో రజకులు ఎస్టీ, ఎస్సీ జాబితాల్లో ఉన్నారని, మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రజకుల సమాజసేవను గుర్తించి వారికి గీతవృత్తిదారులకు ఇస్తున్న మాదిరిగానే పింఛన్ ఇవ్వాలన్నారు. రజక ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింలు మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన క్యాదర్శి పెంటయ్య, కార్యదర్శి రాజేష్, నాయకులు ప్రభాకర్, శ్రీకాంత్, యాదగిరి, విద్యార్థి విభాగం నాయకులు విజయ్, మల్లేశం, కుమార్‌లతో పాటు జిల్లా నాయకుడు బ్యాతోల్ సిద్ద రాములు తదితరులు పాల్గొన్నారు. -
బాపు,రమణ ధనుస్సు బాణాలు
‘‘బాపు-రమణ ఒకరికొకరు... ఎలాగంటే, ధనుస్సు బాణంలాగా ఒకరి గెలుపు కోసం ఒకరు కృషి చేశారు. కష్ట సుఖాలు పంచుకుంటూ స్నేహానికే వన్నె తెచ్చారు. చిత్రకారుడు, రచయితగా వృత్తిని స్వీకరించిన ఈ ఇద్దరు మిత్రులూ జీవితాంతం కలిసి నడిచారు. వీరిద్దరి కలయికతో సాక్షి చిత్రం తెరకెక్కింది. అయితే వీరిద్దరికీ బ్రేక్ ఇచ్చింది మాత్రం అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన బుద్ధిమంతుడు చిత్రమే.’’ చెన్నై, సాక్షి ప్రతినిధి:విభిన్న కళాకారులైన బాపు, రమణ ధనుస్సు బాణాలవలె ఒకరి గెలుపు కోసం ఒకరుగా నిలిచారని ప్రముఖ కథకులు, పాత్రికేయులు శ్రీరమణ (హైదరాబాద్) అభివర్ణించారు. తరతరాల తెలుగు కవిత ధారావాహిక 57వ ప్రసంగ కార్యక్రమాన్ని వేద విజ్ఞాన వేదిక, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించారు. చెన్నై ఆస్కా హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ‘బాపు రమణ సినిమాలు- సాహిత్యం’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ, ఒకరు చిత్రకారుడు, మరొకరు రచయిత ఎవరి అభిరుచులు వారివిగా ఉన్నా భిన్నత్వంలో ఏకత్వంలా జీవితాంతం కలిసి నడిచారన్నారు. గురజాడను అనుక్షణం తలచుకునే వారిద్దరూ కలిసి అద్భుతమైన పాత్ర లు సృష్టించారని చెప్పారు. రమణ సృష్టించిన పాత్రలే ఆయనను గుర్తుంచుకునేలా చేశాయన్నారు. ఫిలాసఫీతో సృష్టించిన అప్పారావు, బుడుగు పాత్రలు నేటికీ సజీవంగా నిలిచిపోయాయని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమలో ముత్యాల ముగ్గు ఒక చరిత్రగా మిగిలడం బాపు-రమణల ప్రతిభకు తార్కాణమన్నారు. ఆరు దశాబ్దాల స్నేహంతో వారి సినిమాలు ఒక బ్రాండ్‌గా నిలిచిపోయాయని తెలిపారు. సినిమా రివ్యూ జర్నలిస్టుగా నిర్మొహమాటంగా విమర్శలు రాసిన రమణను సినిమా పరి శ్రమ ఆహ్వానిస్తే తొలుత నిరాకరించారని చెప్పారు. ఎందుకంటే తనచేత విమర్శలకు గురైన వారు ప్రతీకారం తీర్చుకుంటారేమోనని వెనకడుగు వేశారన్నారు. ఒక యాడ్ ఏజన్సీలో ఆర్ట్ డెరైక్టర్ అరుున బాపు, రమణతో కలిసి సినిమా తీద్దామన్న నిర్ణయంతో సాక్షి చిత్రం వచ్చిందన్నారు. చిత్రకల్పన బ్యానర్‌పై అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంలో తీసిన బుద్దిమంతుడు సినిమాతో వారిద్దరికీ బ్రేక్ వచ్చిందని తెలిపారు. సంగీతం, రచనలపై వారిద్దరికీ ఉన్న పట్టు, చక్కటి సినిమా టీమ్, డబ్బులు ఎగవేయరు అనే మంచిపేరును పరిశ్రమలో సంపాదించుకున్నారని తెలిపారు. 60 ఏళ్లుగా సెలబ్రటీలుగా నిలిచారు, తుది శ్వాస వరకు అలాగే నిలిచారని అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జంట బాపూ-రమణ అన్నారు. కష్టసుఖాలు పంచుకుంటూ స్నేహానికి నిర్వచనంగా నిలిచారని అన్నారు. దివంగత బాపు సోదరుడు శంకరనారాయణ, కుమారుడు వెంకటరమణ, కుమార్తె భానుమతి, కోడలు భారతి ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వక్త శ్రీరమణను ఆస్కా మాజీ అధ్యక్షుడు ఈఎస్ రెడ్డి చేతుల మీదుగా వేదవిజ్ఞాన వేదిక అధ్యక్ష కార్యదర్శులు జేకే రెడ్డి, కందనూరు మధు సత్కరించారు. నగరానికి చెందిన తెలుగు కుటుం బాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
భర్తను చితకబాదిన భార్య
నేలకొండపల్లి : తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను పట్టించుకోవడంలేదని ఆగ్రహించిన భార్య, బంధువులతో కలిసి అతడిని చితకబాది పోలీస్‌స్టేషన్‌లో అప్పగించింది. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం... జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలోని జూపెడకు చెందిన ఎలక వెంకటేశ్వర్లుకు నల్లగొండ జిల్లా మోతే మండలంలోని రాయిపాడు గ్రామానికి చెందిన పప్పుల రాజారావు కూతురు రమణతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే వెంకటేశ్వర్లు బోనకల్ మండలంలోని మోటమర్రి గ్రామంలో కొద్ది రోజులుగా వీఆర్ఓగా పనిచేస్తున్నాడు. కాగా, నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన ఓ మహిళతో అతడు కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని సరిగా పట్టించుకోవడంలేదు. ఈ విషయంపై భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో ఇటీవల నల్లగొండ జిల్లా మోతే పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయినప్పటికీ వెంకటేశ్వర్లు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతోపాటు రెండు నెలల నుంచి ఇంటికి రావడంలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు భార్య రమణ మంగళవారం తన ఇద్దరు పిల్లలు, బంధువులతో కలిసి చెన్నారం గ్రామానికి వచ్చారు. అనంతరం భర్త వెంకటేశ్వర్లుతోపాటు అతడితో ఉన్న మహిళను వారు చితకబాది పోలీసుస్టేషన్లో అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి ఎస్హెచ్ఓ బాలస్వామి.. వెంకటేశ్వర్లు, అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై కేసు నమోదుచేశారు. -
‘క్యూల’ అధ్యయనం చకచకా
తిరుమల : తిరుమలకు వచ్చే యాత్రికులు వేంకటేశ్వరస్వామిని సంతృప్తికరంగా దర్శించుకునే అవకాశం కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కూడా అధ్యయనం కొనసాగింది. టీటీడీ జేఈవో కేఎస్శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితర అధికారులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో తనిఖీ చేశారు. అక్కడే సమావేశమై విధి విధానాలపై చర్చించారు. సర్వదర్శనం, కాలిబాట దర్శనం, రూ.300 టికెట్ల దర్శనం, చంటి బిడ్డ తల్లిదండ్రుల దర్శనం, ఆర్జిత సేవల భక్తులు.. ఇలా ఏ రోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు? ఏయే క్యూలలో ఎంతమేర వత్తిడి ఉంది? అన్న విషయాలను గుర్తించి రికార్డు చేశారు. రద్దీ తక్కువ వేళ క్యూ నడిచే విధానాన్ని, గంటకు ఎంత మందికి గర్భాలయ మూలమూర్తి దర్శన భాగ్యం కలిగింది? వంటి వివరాలతో ప్రత్యేకంగా మ్యాపు సిద్ధం చేశారు. వీటి ఆధారంగా స్వల్ప మార్పులు చేసి వాటిని అమలు చేయాలని ఆలయ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
సంస్కృతి... సమాజాల సమర్చకుడు
కొత్త పుస్తకం జీవితంలో ఎన్నో కష్టాలు పడి పట్టుదలతో పైకొచ్చిన వ్యక్తి... ఉన్నతాధికారిగా పగ్గాలు చేతిలో ఉన్నా ప్రజల బాగు మర్చిపోని మనిషి... నమ్మి ఇచ్చిన బాధ్యతలను నిజాయితీతో, త్రికరణశుద్ధిగా నెరవేర్చిన పాలనాదక్షుడు... సాహితీ, సాంస్కృతిక రంగాలకు ప్రాణబంధువు... ఐ.ఎ.ఎస్‌గా, అంతకు మించి మంచి మనిషిగా మన్ననలందుకున్న అందరివాడు - రమణాచారి. ఆ కళా హృదయుడి జీవన తరంగాల నుంచి కొన్ని స్మృతి వీచికలు. రమణ బాల్యంలో వారిది ఉమ్మడి కుటుంబం. పూటకు పదిహేను విస్తళ్లు లేవాలి. ఇంటి యజమాని (నాన్నగారి) ఆదాయం మాత్రం నెలకు పాతిక రూపాయలు! ఆ ఇల్లాలు పద్మావతమ్మ అటు అత్తమామలు, మరుదులు, ఇటు తన సంతానం అయిదుగురులో ఎవరికీ ఏదీ లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. పెద్ద కొడుకు రమణ పొద్దున్నే బాబాయిలతో కలిసి వెళ్లి రెండు కిలోమీటర్ల దూరం నుంచి తాగడానికి నీళ్లు తెచ్చేవారు. తర్వాత అందరి స్నానాలకు బావి నీళ్ల తోడి కాచేవారు. చెల్లెళ్లు అమ్మకు ఇంటి పనిలో సాయం చేసేశారు. రాత్రి ఏడు గంటలకు భోజనాలు అయిపోయేవి. పిల్లలందరూ ఒకే గొంగళి కప్పుకొని నిద్రపోయేవారు. నాలుగున్నరకి నిద్ర లేపేవారు. రోజూ రెండు గంటలు తప్పని సరిగా పాఠాలు చదివేవారు. చిన్నతనంలో వచ్చిన ఆ అలవాటు రమణని ఇప్పటికీ అంటి పెట్టుకునే ఉంది. అప్పట్లో రమణ కాళ్లకు చెప్పులుండేవి కావు. చిన్నాన్నలు వాడేసిన దుస్తులే వేసుకోవాల్సి వచ్చేది. అయితేనేం మొక్కవోని ఆత్మవిశ్వాసం ఉండేది. క్లిష్టమైన పాఠ్యాంశాన్నైనా అవగతం చేసుకోగల నేర్పు ఉండేది. 1975లో వరంగల్లులో కెమిస్ట్రీ లెక్చరరుగా ఉంటోన్న కాలంలో ఓ రోజు రమణ, మరో నలుగురు లెక్చరర్లతో పాటు కలెక్టరేట్‌కి వెళ్లారు. అక్కడ రేషన్‌కార్డు కోసం వెళ్ళినప్పుడు లెక్చరర్లని కూడా చూడకుండా ఓ గుమస్తా వాళ్లను అవమానించాడు. అంతే! ‘నేను కలెక్టర్‌ని కావాలి! లేదా పరిపాలనా రంగంలో ఉన్నత ఉద్యోగిగా ఉండాలి. సామాన్య ప్రజలకు న్యాయం దక్కేలా చేయాలి. గ్రూప్ వన్ పరీక్షలైనా రాస్తాను... అని రమణ పట్టుదలగా పరీక్షలు రాసి, కృతార్థుడయ్యారు. నందమూరి తారక రామారావు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోని కులీకుతుబ్‌షా డెవలప్మెంట్ అథారిటీని క్రియాశీలంగా మార్చాలని ముఖ్యమంత్రి ఆలోచించారు...మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంత అభివృద్ధికి ఏర్పాటైన సంస్థకి అడ్మినిస్ట్రేటర్‌గా ఎవరిని నియమించాలి? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది? అడ్మినిస్ట్రేటర్ సమర్థుడై ఉండాలి. ఆయనకు ఇంగ్లీషు మాత్రమే వస్తే సరిపోదు, తెలుగు, ఉర్దూ బాషల్లో కూడా మంచి ప్రవేశం ఉండాలి. అన్ని మతాల, వర్గాల వారినీ కలుపుకొని పోగలగాలి. అటువంటి అధికారి ఎవరా? అని మంత్రిమండలిలో చర్చకు వచ్చింది. 1984 నాటికి రమణని భారత ప్రభుత్వం ఐ.ఏ.ఎస్. అధికారిగా కన్ఫర్మ్ చేసింది. ఆ కాలంలోనే నెల్లూరును గజగజలాడించిన పెనుతుపానుకు వేల మంది నిరాశ్రయులయ్యారు. రైతుల పంటలు, జీవితాలు నీళ్లపాలయ్యాయి. సైక్లోన్ స్పెషలాఫీసరుగా రమణ నెల్లూరు జిల్లా ప్రజలకు తక్షణ ప్రభుత్వ సాయం అందించడంలో కృతకృత్యులయ్యారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. అయితే ఇంకేం ‘వారినే నియమిద్దాం’ అన్నారు ముఖ్యమంత్రి. కులీకుతుబ్‌షా డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత రమణ దృష్టి కులీకుతుబ్‌షా సమాధులవైపు మళ్లింది. ఒక్క ముంతాజ్ బేగం సమాధి తాజ్‌మహల్‌గా ప్రపంచ ప్రసిద్ధి చెందితే ఏడు సమాధుల మాటేమిటి? వాటిని అభివృద్ధి పరిస్తే ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌కు పేరొస్తుంది. ముఖ్యమంత్రి ఎన్టీయార్ పూనికతో కె.వి. రమణాచారి దృఢసంకల్పంతో అది ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకొంది. సుమారు నూరు ఎకరాల పైనున్న సమాధుల ప్రాంతంలో రెండు కోట్లతో అభివృద్ధిపరచే ప్రణాళికను సిద్ధంచేసి అమలుచేశారు. విదేశీ పర్యాటకులకూ ఆ ప్రాంతం ఆకర్షణగా నిలిచింది. ఓ పర్యాయం ఆంధ్ర మహిళాసభలో కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వెళ్లవలసి వచ్చింది. రమణని పిలిచి ప్రసంగం తయారు చేయమన్నారు. రమణ తయారుచేశారు. అది చదివి చెన్నారెడ్డి ఆనందించారు. ముఖ్యంగా ఆ ప్రసంగంలో రమణ ఉదహరించిన ఉర్దూ కవిత ‘లోగోంకే పాస్ వక్త్ హై / నఫ్రత్‌కే వాస్తే / జబ్కే హయాత్ కమ్హై / మొహబ్బత్కే వాస్తే’ (జనం వద్ద వైరం కోసం సమయం ఉంది... కానీ ప్రేమకోసం మాత్రం సమయం లేదు) ఆయన్ని బాగా ఆకట్టుకుంది. దీన్ని చెన్నారెడ్డి తన మిత్రులందరికీ చెప్పారు. ‘‘మా పీఆర్వో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషుల్లో ఉద్దండుడు’’ అంటూ ప్రశంసించారు. అప్పట్నించీ చెన్నారెడ్డి ఇష్టుల్లో రమణ ఒకరు. సాంస్కృతిక శాఖలో అనే కాదు, ఏ శాఖలో అయినా అద్భుతాలు చేయవచ్చు. సృష్టించవచ్చు. మనకెందుకు? మన జీతం మనకొస్తోంది కదా అనుకుంటే చేసేదేముంటుంది! గత నలభై సంవత్సరాలుగా సాంస్కృతికశాఖ పనితీరును చాలా సన్నిహితంగా గమనిస్తూనే ఉన్నవారికి రమణ లాంటి ఇద్దరు ముగ్గురి హయాంలోనే అది చాలా క్రియాశీలంగా పనిచేసిందనిపిస్తుంది. సాంస్కృతికశాఖలో రమణ ఉన్నప్పుడే అఖిలాంధ్ర నాటకోత్సవాలు ప్రవేశపెట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో మన తెలుగుజాతి చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించేలా శాతవాహనోత్సవాలు, చాళుక్యోత్సవాలు, విజయనగరోత్సవాలు, కాకతీయోత్సవాలు, గోల్కొండోత్సవాలు - ఇలా ఉత్సవాల పరంపర మొదలుపెట్టి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ‘సౌజన్య సంస్కృతీ పథకం’ ప్రవేశపెట్టి రాష్ట్రంలోని వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం చేదోడుగా ఉండాలని ఆర్థిక సహకారం అందించారు. రమణ మాటల్లో చెప్పాలంటే ‘‘ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల కంటే సాంస్కృతిక సంస్థలు, సాహితీ సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం చేదోడు అందిస్తే విశేష జనాదరణ పొందగలమన్నది నా విశ్వాసం.’’ -
40 మంది ఎర్ర కూలీల అరెస్ట్
కర్ణాటక ఆర్టీసీ బస్సు సీజ్ తిరుపతి, న్యూస్‌లైన్: ఎర్రచందనం చెట్లను నరికేందుకు గురువారం కర్ణాటక బస్సులో తిరుపతికి వస్తున్న 40 మంది ఎర్రకూలీలను అటవీశాఖాధికారులు అరెస్ట్ చేసి బస్సును సీజ్ చేశారు. వివరాలిలా.. అటవీశాఖాధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని పాకాలవారి పల్లె వద్ద దాడులు నిర్వహించారు. ఆ మార్గంలో కర్ణాటక ఆర్టీసి బస్సులో తిరుపతి వైపు వస్తున్న 40మంది ఎర్రకూలీలను అదుపులోకి తీసుకున్నారు. భోజన సామగ్రి, పనిముట్లను ఎర్రకూలీల నుంచి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు. నిందితులను, బస్సును తిరుపతి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ దాడుల్లో యాంటీపోచ్ స్క్వాడ్ ఇన్చార్జ్ రేంజ్ ఆఫీసర్ రమణ, స్క్వాడ్ అధికారులు జి.మునికృష్ణరాజు, తులసయ్య, ప్రొటెక్షన్ వాచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పగల్భ 'బాబూ'.. హిట్లరూ నీకు సాటి రాడు
-
మానవత్వం మంట కలిసింది
క్షతగాత్రుల సెల్ఫోన్లను తస్కరించారు మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: తోటి మనిషి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కాపాడాల్సింది పోయి వారి వద్దనున్న నగదు, సెల్ఫోన్లను తస్కరించి వారిని మృత్యుఒడికి చేరువ చేసిన సంఘటన మంగళవారం రాత్రి కురబలకోట మండలంలో చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులు మదనపల్లెలోనే ఉన్నప్పటికీ కుమారుడు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో సుమారు 7 గంటలకు పైగా మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. సమాచారం లేకపోవడం వల్లే తల్లిదండ్రులు ఒక్కగానొక్క కుమారుడిని కాపాడుకోలేక పోయారు. కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన రమణ, వసుంధర దంపతులకు కుమారుడు రెడ్డిశేఖర్ (21), కుమార్తె జయశ్రీ ఉన్నారు. రమణ దంపతులు పదేళ్లక్రితం మదనపల్లెలో స్థిరపడ్డారు. రెడ్డిశేఖర్ కారుడ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా కలికిరి మండలం గుట్టపాళెంకు చెందిన రెడ్డెప్ప కుమారుడు రెడ్డిభాస్కర్(22) స్థానిక నీరుగట్టువారిపల్లె మాయాబజార్లో అద్దె రూములో ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. రెడ్డిభాస్కర్, రెడ్డిశేఖర్ ఇద్దరూ స్నేహితులు. మంగళవారం సాయంత్రం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై అంగళ్లుకు వెళ్లారు. రాత్రి 11.50 గంటలకు మదనపల్లెకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలోని అంగళ్లు గొర్రెలసంత వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రెడ్డిశేఖర్, రెడ్డిభాస్కర్ రోడ్డుపై పడి కొట్టుమిట్టాడుతున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడారు. వారి ప్రాణాలను కాపాడాల్సిందిపోయి డబ్బు, సెల్ఫోన్లను తస్కరించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితులను అంబులెన్స్‌లో ఎక్కించారు. బాధితుల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయా, ఉంటే ఎవరైనా తీసుకున్నారా అని స్థానికులను అడిగినా అందరూ తెలియదంటూ జారుకున్నారు. ఆ తర్వాత బాధితులను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులకు వెంటిలేటర్ సదుపాయంతో చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే బాధితుల సంబంధీకులు తెలియక బయటి ఆస్పత్రికి రెఫర్ చేయలేక ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తంటాలు పడ్డారు. ఉదయం 6 గంటలకు సమాచారం అందుకున్న రెడ్డిభాస్కర్ బంధువులు ఆస్పత్రికి చేరుకుని వెంటనే బెంగళూరుకు తీసుకెళ్లారు. పట్టణంలోనే ఉన్న రెడ్డి శేఖర్ తల్లిదండ్రులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని అంబులెన్స్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా కుమారుడు మృతి చెందాడు. ‘అయ్యో నేనెవ్వరికీ ఎలాంటి మోసం చేయలేదే.. నాకెందుకు దేవుడు ఇంత కడుపుకోత విధించాడంటూ’ రెడ్డిశేఖర్ తల్లి గుండెలు బాదుకుంటూ విలపించారు. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీ-టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా రమణ
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి కన్వీనర్‌గా మోత్కుపల్లి ‘రావుల’ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక కమిటీలంటూ కొద్దిరోజులుగా ఊరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎట్టకేలకు సోమవారం రెండు కమిటీలను ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల కమిటీని, ఎన్నికల మేనిఫెస్టో కమిటీలను ఆయన ఏర్పాటు చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ముఖ్య నాయకులందరికీ స్థానం లభించేలా ఎన్నికల కమిటీలో కొత్త కొత్త పోస్టులను సృష్టించారు. తెలంగాణ ఎన్నికల కమిటీలో అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, కన్వీనర్ అంటూ మూడు పేర్లతో ఒకే స్థాయి పోస్టులను ముగ్గురు నాయకులకు అప్పగించడం విశేషం. మూడు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన నాయకులతో వీటిని భర్తీ చేశారు. సీనియర్ నేత, ఎంపీ టి.దేవేందర్‌గౌడ్‌కు సలహాదారు అనే కొత్త పదవిని అప్పగించారు. ఇక మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా వనపర్తి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు పార్టీ తెలంగాణ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించాలని భావించినప్పటికీ, ఆయన ఇంకా పార్టీలో చేరలేదు. దీంతో ఈ కమిటీని ప్రకటించలేదు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల ప్రణాళికను కూడా బాబు విడుదల చేశారు. కాగా పదేళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే బీజేపీ బలంలో అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. టీడీపీ తెలంగాణ ఎన్నికల కమిటీ: అధ్యక్షుడుగా ఎల్. రమణ(కరీంనగర్), వర్కింగ్ ప్రెసిడెంట్: ఎర్రబెల్లి దయాకర్ రావు(వరంగల్), కన్వీనర్: మోత్కుపల్లి నర్సింహులు(నల్లగొండ), సలహాదారుడు: టి. దేవేందర్‌గౌడ్(రంగారెడ్డి), ప్రధాన కార్యదర్శులు: రమేష్ రాథోడ్(ఆదిలాబాద్), తలసాని శ్రీనివాస్ యాదవ్(హైదరాబాద్), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (వరంగల్), నామా నాగేశ్వర్రావు(ఖమ్మం), సభ్యులు: మండవ వెంకటేశ్వర్రావు (నిజామాబాద్), టి. ప్రకాశ్‌గౌడ్(రంగారెడ్డి), అలీ మస్కతి (హైదరాబాద్), పి. రాములు (మహబూబ్‌నగర్), ఏలేటి అన్నపూర్ణమ్మ (నిజామాబాద్), రేవంత్‌రెడ్డి(మహబూబ్‌నగర్), యెగ్గె మల్లేశం(రంగారెడ్డి), రావులపాటి సీతారామారావు(ఖమ్మం). తెలంగాణ మేనిఫెస్టో కమిటీ: కన్వీనర్: రావుల చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు: తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, ఉమా మాధవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, కొత్తకోట దయాకర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, అరవింద్‌కుమార్ గౌడ్, వేం నరేందర్‌రెడ్డి, అల్లాడి రాజ్‌కుమార్, సయ్యద్ యూసఫ్ అలీ, ఇ.పెద్దిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, చిలివేరు కాశీనాథ్, సఫన్‌దేవ్, జి. సాయన్న. అయితే, తెలంగాణలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు నామమాత్రమైనవేనని నేతలు అభిప్రాయపడుతున్నారు. -
బాబు యుద్ధానికి ముందే చేతులెత్తేశారు
వైఎస్సార్సీపీ నేత రమణ ధ్వజం మళ్లీ మాయాకూటమితో ముందుకొస్తున్న బాబుకు మహా ఓటమి ఖాయం హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు యుద్ధానికి ముందే చేతులెత్తేసి.. ఇంకా తనకేదో సామర్థ్యం ఉందని ఊదరగొట్టుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పార్టీ సీఈసీ సభ్యుడు ఒ.వి.రమణ ఆదివారం పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డిని 2009 ఎన్నికల్లో ఎదుర్కోవడానికి నాలుగైదు పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి కూడా చంద్రబాబు ఓటమిపాలయ్యారని, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో తలపడటానికి మాయాకూటమిగా వస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే మూడుకాళ్ల ముసలివాడైన చంద్రబాబు రెండు మూడు పార్టీలు వచ్చి మద్దతిస్తేతప్ప నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. మాయాకూటమిలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ, సీపీఐ నారాయణ అందరూ సభ్యులేనని, వీరు చాలక ఇంకా ఎవరైనా వస్తే వారినీ కలుపుకుందామని చంద్రబాబు ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరో మద్దతిస్తారని ఎదురు చూడడంకంటే ఆయన రాజకీయాలు వదలివేయడమే ఉత్తమమని రమణ హితవు పలికారు. తొమ్మిదేళ్లు సీఎంగా, మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఏమాత్రం ప్రజాదరణను పెంచుకోలేక జగన్‌కున్న ప్రజాబలాన్ని దెబ్బకొట్టేందుకు తనతో ఎవరెవరు కలిసివస్తారా అని ఎదురుచూడడం కన్నా దేశ రాజకీయాల్లో సిగ్గులేనితనం మరొకటి లేదన్నారు. చంద్రబాబు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా ఆయనకు ఈ ఎన్నికల్లో మహాఓటమి ఖాయమన్నారు. -
పవర్‌హాలిడే
గుంటూరు: జిల్లాలో 1,150 హెచ్‌టీ కనెక్షన్ల ద్వారా డిస్కమ్‌కు రూ.97 కోట్లు నెలకు వసూలవుతుంది. అధికారికంగా ఇప్పుడు వారానికి రెండు రోజులు పవర్‌హాలిడే ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ వారం నుంచే ప్రతి శుక్రవారం పవర్‌హాలిడే అమలు కానుంది. అయితే ఈ లోగానే మరో రోజు పవర్‌హాలిడే ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పవర్హాలిడేలకు సంబంధించిన సమాచారం కానీ, మామూలు సమయాల్లో కరెంటు వాడుకున్నందుకు డిస్కం అధికారులు విధించే పెనాల్టీ(అపరాధ రుసుం) గురించి సరుకులన్నీ నాసిరకం.. పథకం ప్రారంభం నుంచే తాలు మిరపకాయల నుంచి తయారు చేసిన కారంపొడి సరఫరా చేస్తున్నారు. బర్మా కందిపప్పు, బియ్యం పొడి కలిపిన పసుపు, విత్తనాలతో కూడి నల్లగా ఉన్న చింతపండు, పొట్టుకలిసిన గోధుమ పిండి, ముక్కిపోయిన గోధుమలు సరఫరా చేయడం వల్ల కార్డుదారులు ఒకటి, రెండు సార్లు తీసుకుని ఆ తరువాత పూర్తిగా మానేశారు. అంతేకాకుండా ఈ వస్తువులపై కేవలం 25 పైసలు మాత్రమే కమీషన్ రావడంతో డీలర్లు కూడా అమ్మహస్తం సరుకులు తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలా ఈ పథకం పూర్తి స్తాయిలో విఫలమైందని చెప్పవచ్చు. ఉదాహరణకు వినుకొండ నియోజకవర్గ పరిధిలో కొన్ని నెలలుగా అమ్మహస్తం సరుకులు అందడం లేదు. కొన్ని సరఫరా లేకపోగా మరికొన్ని నాసిరకంగా ఉండటం వల్ల తెచ్చేందుకు డీలర్లు ఆసక్తి చూపడం లేదు. పామాయిల్, దేశవాళి కందిప్పుకు డిమాండ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సరఫరా లేక పథకం పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గత అక్టోబర్ నుంచి అన్ని రకాల వస్తువులు కార్డుదారులకు అందడం లేదని అంటున్నారు. ఈ విషయమై వినుకొండ పట్టణంలోని గోదాముల ఇన్చార్జి రమణను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈ నెలలో పంచదార, కందిపప్పు, పామాయిల్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మిగిన వస్తువులు కూడా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
‘గురుకులం’పై కలెక్టర్‌కు నివేదిక
నాయుడుపేట, న్యూస్‌లైన్: ‘మీ బిడ్డలకైతే ఈ ఆహారం పెడతారా ?’ శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనంలో నాయుడుపేట ఆర్డీఓ ఎంవీ రమణ స్పందించారు. వెంటనే ఆయన పుదూరులోని బాలికల గురుకులంకు చేరుకుని అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. సిబ్బంది పనితీరు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. భోజనం అందిస్తున్న తీరుపై విద్యార్థులను విచారించారు. బియ్యంలో వడ్ల గింజలు ఏరని విషయాన్ని ప్రస్తావించారు. ఇది గమనించిన గురుకులం సిబ్బంది హడావుడిగా బియ్యంలో వడ్లను ఏరించి ఆర్డీఓకు చూపించారు. విచారణకు వస్తున్నామని తెలిసి వడ్ల గింజలు ఏరారా..అని ప్రిన్సిపల్ కిరణ్మయిని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల అవసరాల మేరకే బియ్యాన్ని సివిల్ సప్లయిస్ గోదాముల నుంచి తెప్పించుకోవాలని ఆదేశించారు. బియ్యం నిల్వ ఉన్నందున పురుగులు పడుతున్నాయన్నారు. గురుకులంలో ఎలాంటి సమస్య వచ్చిన సమాచారం అందించాలని సూచిస్తూ ఆర్డీఓ తన సెల్ నంబరును విద్యార్థులకు అందించారు. మెనూలో కోత విధిస్తుండటంపై భోజన ఏజెన్సీ నిర్వాహకులపై మండిపడ్డారు. గురుకులంలోని పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట తహశీల్దార్ జనార్దన్‌రావు, సీనియర్ అసిస్టెంట్ చేవూరి చెంగయ్య ఉన్నారు.