విశాఖలో హాలిడే ఎక్స్‌పో
హైదరాబాద్: విశాఖపట్టణంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న హాలిడే ఎక్స్‌పో ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్‌వి టూర్స్‌అండ్ ట్రావెల్స్ సంస్థ అధినేత ఆర్‌వి రమణ తెలిపారు. తమ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది భక్తులు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
విశాఖలోని గేట్‌వే హోటల్‌లో మూడు రోజులపాటు ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు. 2015 సంవత్సరంలో మానస సరోవరం, బదరీనాథ్, కేదారీనాథ్, అమర్‌నాథ్, కాశీవిశ్వనాథ్ యాత్రలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. ఎగ్జిబిషన్‌లో ఔత్సాహిక పర్యాటకులు తనను కలిసి తగిన సూచనలు తీసుకోవచ్చన్నారు. వివరాలకు ఫోన్: 8106666134లో సంప్రదించాలని కోరారు.