పెళ్లింట విషాదం | tragedy in marriage house | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Published Wed, Feb 18 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

tragedy in marriage  house

కూతురు పెళ్లికి శుభలేఖలు
పంచడానికి వెళుతూ తండ్రి దుర్మరణం
కాబోయే అల్లుడి ఇంటికి కూతవేటు దూరంలోనే ఘటన

 
నక్కపల్లి: కుమార్తె వివాహాన్ని ఎంతోఘనంగా చేయాలని భావించాడు. సొంత బావమరిదికే ఇచ్చి ఈనెల 25న పెళ్లికి ముహూర్తం పెట్టారు. బంధువులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళుతుండగా విధి వక్రించింది. మండలంలోని ఉద్దండపురం వద్ద మంగళవారం  ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ తండ్రి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట మండలం పాల్తేరుకు చెందిన దేవవరపు రమణ(40) కుమార్తె పెళ్లి శుభలేఖలతో మోటారు సైకిల్‌పై వెళుతూ ఉద్దండపురం సమీపంలో ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టాడు.

తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రమణకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి పెళ్లి చేశాడు.  చిన్న కుమార్తెకు పెళ్లి నిశ్చయించారు. మరోవారం రోజుల్లో కన్యాదానం చేసి ఒక అయ్యచేతిలో పె ట్టాల్సిన తండ్రి మృతదేహం వద్ద  కుమార్తె దేవి తోపాటు భార్యమంగలు బోరున విలపిస్తున్నా రు. పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement