Clap
-
రోజూ చప్పట్లు కొట్టడం వల్ల మెమొరి పవర్ పెరుగుతుందా?
ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు, వారు చేసిన పని హర్షణీయంగా... ప్రశంసార్హంగా అనిపించినప్పుడు వారిని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతాం.. అయితే అలా చప్పట్లు కొట్టడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటికే ‘క్లాపింగ్ థెరపీ’ అని పేరు. చప్పట్లు కొట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూద్దాం... ►సాధారణంగా ఎవరినైనా అభినందిస్తున్నప్పుడు చప్పట్లు కొడతాం. అది ప్రశంసలో ఒక భాగం. కానీ చప్పట్లు కొట్టడం వెనుక చాలామందికి తెలియని ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ‘లాఫింగ్ థెరపీ’ మాదిరిగానే ‘క్లాపింగ్ థెరపీ’ కూడా ఇప్పుడు ఫేమస్ అయ్యింది. క్లాపింగ్ థెరపీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే.. ►మనిషి శరీరంలో ప్రతి అవయవం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అరచేతులు రక్తనాళాలు, నరాల చివరలకు కేంద్రం. మీరు వాటిని ఉత్తేజపరిస్తే మీ ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. అయితే చప్పట్లు కొట్టడం వల్లే ఆరోగ్యం విషయంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ►చప్పట్లు కొట్టడం ఆందోళనను నియంత్రించడానికి సులభమైన మార్గం. చప్పట్లు కొట్టడం ప్రారంభించగానే మెదడుకి సానుకూల సంకేతాలు వెళ్తాయి. ఇది నిరాశను పోగొడుతుంది. సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి రోజువారి వ్యాయామంలో చప్పట్లు కొట్టడాన్ని కూడా భాగంగా చేసుకోవాలి. ►కరతాళ ధ్వనులు చేయడం వల్ల రక్తపోటు స్ధాయులు నియంత్రణలో ఉంటాయి. తద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుంది. చప్పట్లు కొట్టినపుడు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అనేక గుండె సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు, చప్పట్లు కొట్టడంతో శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ►చప్పట్లు కొట్టడం వల్ల తెల్ల కణాల ఉత్పత్తి పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రుజువైంది. ఫలితంగా కాలానుగుణంగా వచ్చే అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. పిల్లలు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవడంతో పాటు వారి చేతి రాతలో తప్పులు దొర్లకుండా ఉంటాయి. ► చప్పట్లు కొట్టడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఆశిస్తూ చప్పట్లు కొట్టే ముందు అరచేతులకు కొద్దిగా ఆవ నూనె లేదా కొబ్బరి నూనె రాసుకోవడం మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. అరచేతుల్ని నిటారుగా ఉంచి.. చేతివేళ్లు ఒకదానికొకటి తాకేలా ఉంచి చప్పట్లు కొట్టాలి. మంచి ఫలితాల కోసం ఉదయం పూట కొట్టడం మంచిదట. లేదంటే ఎవరి వీలును బట్టి వారు ఈ క్లాపింగ్ థెరపీ ని అనుసరించవచ్చు. -
చక్దా ఎక్స్‌ప్రెస్.. క్రికెటర్‌తో కేక్ కట్ చేసిన అనుష్క శర్మ (ఫొటోలు)
-
రోజు ఏమార్చి రోజు..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ ఆశయానికి ఆదిలోనే అడ్డంకులను సృష్టిస్తున్నారు. ప్రతి రోజూ చెత్త సేకరించాల్సిన క్లాప్ వాహనాలు కాస్తా ఏమార్చి... రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని కొన్ని కాలనీలల్లో ప్రతి రోజూ చెత్తను సేకరించడం లేదు. కాలనీ పెద్దగా ఉందన్న కారణంతో పాటు ఎత్తైన కొండవాలు ప్రాంతాలున్నాయన్న కారణాన్ని చూపుతూ చెత్త సేకరణను కాస్తా అటకెక్కిస్తున్నాయి. అసలే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో క్లాప్ వాహనదారులు కాస్తా మొండికేస్తుండటం చెత్త సమస్యతో పాటు కొత్త రోగాల సమస్యలను కూడా తెచ్చిపెడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోజూ 30 కిలోమీటర్ల మేర వాహనాలను తిప్పుతున్నామన్న కారణాన్ని చూపుతూ రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విధంగా కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నామన్న సమాచారం కాస్తా సదరు కాంట్రాక్టరు జీవీఎంసీ అధికారులకు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు వ్యవహారంపై జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నార న్నది చూడాల్సి ఉంది. ఇదీ అసలు ఉద్దేశం వాస్తవానికి ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్తను సేకరించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్లాప్ వాహనాలను ప్రారంభించింది. ఇంటింటికీ సదరు క్లాప్ వాహనం వెళ్లి... పొడి చెత్త, తడిచెత్తను వేరు చేస్తూ చెత్తను సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో 629 వాహనాలు అవసరమని పేర్కొంటూ జీవీఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. ఇప్పటివరకు 625 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ వాహనాలను ఆయా వార్డులు, సచివాలయాల వారీగా కేటాయించారు. ఏ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెత్తను సేకరించాలి? ఎక్కడ డంప్ చేయాలనే విషయాన్ని కూడా పక్కాగా రూట్ మ్యాప్‌ను జీవీఎంసీ అధికారులు నిర్దేశించారు. ప్రతి రోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం ద్వారా ఎక్కడికక్కడ చెత్తను పారవేసే అవకాశం ఉండకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా చెత్త పేరుకుపోయి నగరం దుర్గందభరితంగా మారకుండా క్లీన్ సిటీగా ఉంటుంది. మరోవైపు ఈ విధంగా సేకరించిన చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించి... అక్కడ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి ప్లాంటులో చెత్త నుంచి విద్యుత్ తయారవుతోంది. ఈ విద్యుత్‌ను జీవీఎంసీ కాస్తా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)కు విక్రయించడం ద్వారా యూనిట్‌కు రూ.6కుపైగా మొత్తాన్ని పొందుతోంది. ఒకవైపు ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం... నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆదాయవనరుగా మార్చుకునే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, ఇందుకు విరుద్ధంగా కొన్ని కాలనీలల్లో జరుగుతుండటం గమనార్హం. పక్కాగా రూట్ ఉండాలంటూ...! చెత్త సేకరణ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా చేపట్టేందుకు జీవీఎంసీ ఉన్నతాధికారులు గత నెలలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా చెత్త సేకరణ వాహనాలకు పక్కాగా రూట్‌మ్యాప్ చేయాలని నిర్ణయించింది. ఏ సమయానికి ఎక్కడెక్కడ ఉండాలనే పక్కా ప్లానింగ్‌ను అమలు చేసేందుకు నిర్ణయించారు. ఉదయం 6 గంటలకు బయలుదేరే చెత్త సేకరణ వాహనం ఎక్కడి నుంచి మొదలై.... ఎక్కడెక్కడకు ఎంత సమయానికి చేరుకోవాలంటూ సమయాన్ని నిర్దేశించి పక్కా రూట్‌మ్యాప్‌ను అమలు చేయాలని ఆదేశించారు. తద్వారా చెత్త సేకరణకు ఏ సమయానికి ఎక్కడున్నాయో...తమ ఇంటికి ఏ సమయానికి వస్తుందన్న సమాచారం కూడా ప్రజలకు తెలియాలనేది ఆలోచన. ప్రస్తుతం ఒక్కో రోజు ఒక్కో సమయానికి చెత్త సేకరణ వాహనం ఇళ్ల వద్దకు వస్తుండటంతో ప్రజలు కాస్తా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ తాజా నిర్ణయంతో ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా నిర్దేశించిన సమయానికే ఇంటి వద్దకు వాహనం వస్తుందన్న ధీమా కలిగింది. దీని అమలు బాధ్యతను శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు చూడాలని స్పష్టం చేశారు. అయితే, ఇది కాస్తా కొన్ని కాలనీల్లో పూర్తి విరుద్ధంగా తయారయ్యింది. రెండు రోజులకు ఒక్కసారి వాహనం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దూరమవుతుందంటూ..! వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో చెత్త సేకరణ కోసం 629 వాహనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఇందుకు అనుగుణంగా జీవీఎంసీకి ఇప్పటివరకు 625 వాహనాలను కేటాయించారు. అయితే, ఈ వాహనాలకు ఇప్పటికే రూట్‌మ్యాప్‌ను అందించారు. అయినప్పటికీ తమకు కేటాయించిన ప్రాంతంలో పార్కింగ్‌కు అవకాశం లేదంటూ ఎక్కడో దూరంగా పార్కింగ్ చేసుకుంటున్నారు. పార్కింగ్ ప్రాంతం నుంచి చెత్త సేకరణ కోసం బయలుదేరాల్సిన ప్రాంతానికే కొన్ని సమయాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటోంది. ఈ దూరాన్ని కూడా ఇప్పుడు వాహనం తిరిగినట్టుగా సదరు కాంట్రాక్టరు లెక్కలు చూపుతున్నారు. ఫలితంగా ప్రతి రోజూ 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు వాహనం తిరిగినట్టుగా లెక్కలు తేలుతున్నాయి. ఈ మొత్తం దూరానికి కూడా జీవీఎంసీ అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రోజూ 30 కిలోమీటర్ల మించి తిరగాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే పార్కింగ్‌కు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ నిర్ణయించింది. దీనిని ఆసరాగా తీసుకుని క్లాప్ వాహనదారులు 30 కిలోమీటర్లు మించి పోతుందంటూ కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్త సేకరణ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ సమాచారమేదీ కనీసం జీవీఎంసీ అధికారులకు సదరు కాంట్రాక్టరు అందించలేదని తెలుస్తోంది. మరోవైపు కొన్ని కాలనీల నుంచి జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు కూడా అందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణపై ఇబ్బందులు లేకుండా చేసేందుకు జీవీఎంసీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. (చదవండి: అన్న.. చెల్లి.. అదుర్స్ .. జాతీయ స్థాయిలో పతకాల పంట) -
ఓటీటీలో ఆది పినిశెట్టి క్లాప్ మూవీ రిలీజ్
‘‘నేను నటుడిగా కాకుండా ఓ ప్రేక్షకుడిగా కథలు వింటాను. సుకుమార్‌గారు ‘రంగస్థలం’లో నా పాత్ర (కుమార్ బాబు) గురించి చెప్పిన వెంటనే చేస్తానని చెప్పేశా. అలాగే పృథ్వీ ఆదిత్యగారు ‘క్లాప్’ కథ చెప్పగానే ఓకే చెప్పాను. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది’’ అని ఆది పినిశెట్టి అన్నారు. పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్లాప్’. బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐ.బి. కార్తికేయన్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీ సాయి మూవీస్ పతాకాలపై రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘క్లాప్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా నేడు ‘సోనీలివ్’ ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘క్లాప్’ టీజర్, ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో కామెడీ, డాన్స్, ఫైట్స్ వంటి కమర్షియల్ అంశాలుండవు. కానీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. నేను, ఆకాంక్ష స్పోర్ట్స్ పర్సన్స్‌గా నటించాం. మా ఇద్దరి జర్నీ మరొకరి భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దిందనేది ప్రధాన అంశం ఇళయరాజాగారి సంగీతం, రీ రికార్డింగ్ సినిమాకు బలం’’ అన్నారు. ‘‘ఈ కథలోని నిజాయితీ, ఆదిగారివల్లే ఈ సినిమా తీశాను’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. ‘‘ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ కరోనా వల్ల సోనీలివ్‌తో కమిట్ అయి, రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు రామాంజనేయులు. -
ఈ సినిమా ఏంటో ఆ డైలాగ్ చెబుతోంది: మంత్రి నిరంజన్ రెడ్డి
‘‘నువ్వు గొప్పగా కల కనకపోతే ఎవరో కన్న కలలో నువ్వు బానిసవి అవుతావు’ అనే డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ డైలాగ్ ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చెబుతోంది’’ అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సి.నిరంజన్ రెడ్డి అన్నారు. రామ్‌గౌడ, ప్రియాపాల్ జంటగా వీజే సాగర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. సి.రవిసాగర్ నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి మంత్రి నిరంజన్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. ‘‘మంచి సందేశం ఇవ్వాలనే ఈ సినిమా నిర్మిస్తున్నాను’’ అన్నారు రవిసాగర్. ‘‘చిన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎలా మిస్ అవుతున్నారు? పెద్దయ్యాక ఎలా తయారవుతున్నారు? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు వీజే సాగర్. -
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
-
AP: పరిశుభ్రతకు పెద్దపీట
పబ్లిక్ టాయిలెట్స్‌ను నిర్మించడమే కాకుండా వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిర్వహించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. విలేజ్ క్లినిక్స్ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలి. గ్రామంలో పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించాలి. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టి పెట్టాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని చెప్పారు. ఇందుకు కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రేడ్ 2, గ్రేడ్ 3 నగర పంచాయతీలకు క్లాప్ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ ఆయా ఊళ్లకు త్వరగా చేరవేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు (ఎస్‌డబ్ల్యూపీసీ), అర్బన్‌లో 72 చోట్ల ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ (ఐఎస్‌డబ్ల్యూఎం) ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, జూన్ 2022 నాటికి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు చెత్త సేకరణకు 30 లక్షల డస్ట్‌బిన్స్ సరఫరా చేశామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి డస్ట్‌బిన్స్ అందించాలని సీఎం ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలని, సంబంధిత కంపెనీలతో మాట్లాడుకుని ఆయా వాహనాలను సత్వరమే తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. దుర్వాసన రాకుండా చర్యలు ► నగరాలు, పట్టణాల్లో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి సమీపంలోని ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడమే కాకుండా ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. ► గుంటూరులో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం (వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్– డబ్ల్యూటీఈ) సిద్ధమైన నేపథ్యంలో.. మరో రెండు ప్రతిపాదిత ప్రాంతాల్లో కూడా ఈ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మురుగు నీటి నిర్వహణపై దృష్టి ► మురుగు నీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలి. ఎక్కడా కూడా మురుగు నీరు నిల్వ లేకుండా చేయాలి. దీన్నొక సవాల్‌గా తీసుకోవాలి. అవసరమైన ప్రాంతాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. ► మురుగు నీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను పాటించాలి. క్లాప్ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్ కంట్రోల్ రూంలో సమర్థులైన అధికారులను పెట్టాలి. వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. -
2న ‘క్లాప్’ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలోని బెంజి సర్కిల్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌తో కలిసి ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత, చెత్త రహితంగా తీర్చిదిద్దడమే క్లాప్–జగనన్న స్వచ్ఛ సంకల్పం లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన, ఆరోగ్యకర పరిసరాలు కల్పించి తద్వారా జీవన ప్రమాణాలు పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా మునిసిపాలిటీల పరిధిలో జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1,500 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. తడి, పొడిచెత్తను వేరుచేసి సేకరించేందుకు వీలుగా పట్టణాల్లో ప్రతి ఇంటికి మూడు వంతున మొత్తం 1.20 కోట్ల నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు చెత్తబుట్టలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని చెప్పారు. కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ క్లాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి 2,600 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్‌గ్రిడ్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఎండీ సంపత్ కుమార్, సీపీ బత్తిన శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. క్లాప్ అమలుపై నేడు కలెక్టర్లతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలతో పాటు అన్ని గ్రామాల్లోను మెరుగైన పారిశుధ్యంæ ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం నినాదంతో అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రభుత్వం ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనుంది. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ఇళ్ల వద్ద పోగయ్యే చెత్తను ఇష్టానుసారం పడవేయకుండా పరిశుభ్రత ప్రతి ఒక్కరి అలవాటుగా మార్పు తెచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగా పారిశుధ్య కార్యక్రమాల ప్రణాళికను అమలు చేయనుంది. గాంధీ జయంతి రోజునే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమం అమలుకు సంబంధించి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. -
ఆ ట్విస్ట్ తెలిసి వావ్ అనుకున్నా!
‘‘భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం ప్రేక్షకులను నిరాశపరచలేదు. ‘క్లాప్’ టీజర్ చూస్తుంటే అథ్లెట్ ఫిలిం అనిపిస్తోంది. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు హీరో చిరంజీవి. ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘క్లాప్’. ఐబీ కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, రాజశేఖర్ రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ‘క్లాప్’ సినిమా టీజర్‌ను చిరంజీవి విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ఆది పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుందనిపిస్తోంది. తన పాత్రలో ఉన్న ట్విస్ట్ తెలిసి ‘వావ్’ అనుకున్నాను. ఇళయరాజాగారు సంగీతం అందించిన ఈ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. -
స్ప్రింటర్‌గా ఆది పినిశెట్టి.. పోస్టర్ రిలీజ్
ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. ‘‘స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. సరైన స్ప్రింటర్‌లా కనిపించడానికి ఆది కఠినమైన శిక్షణ తీసుకున్నారు. తమిళ–తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఒలింపిక్స్‌లో భారతదేశం మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నందున మా సినిమా టీజర్ విడుదలకు ఇది సరైన సమయం అని భావించి, ఈ నెల 6న టీజర్ రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. Gearing up for the run! 🏁 #ClapTeaser#Ilaiyaraaja @aakanksha_s30 @Kurupkrisha @prithivifilmist @BigPrintOffl @SRCOffl @SSSMOffl @CNGS_2019 @PMM_Films @pravethedop @ClapMovie @LahariMusic @UrsVamsiShekar @DoneChannel1 pic.twitter.com/PNITGVEDYx — Aadhi🎭 (@AadhiOfficial) September 2, 2021 చదవండి : RC 15: మరో వివాదంలో డైరెక్టర్ శంకర్.. -
అథ్లెటిక్ నేపథ్యంలో...
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్లాప్’. ప్రిత్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. ఐబీ కార్తికేయన్ సమర్పణలో శ్రీ షిరిడీసాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి, యం.రాజశేఖర్ రెడ్డి తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. రెండు విభిన్నమైన పాత్రల్లో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాటను హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నాం. దినేశ్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్న ఈ స్పెష్ల్ సాంగ్‌లో మోనాల్ గజ్జర్ చిందేస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కుమార్, సహ నిర్మాతలు: ఫై.ప్రభ ప్రేమ్, జి.మనోజ్, జి.శ్రీహర్. -
క్లాప్‌కి ఇళయరాజా క్లాప్
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా రూపొందనున్న చిత్రం ‘క్లాప్’. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఐబి కార్తికేయన్, యం. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనున ్న ‘క్లాప్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా క్లాప్ ఇచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తమిళ వెర్షన్‌కు హీరో నాని క్లాప్ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తదితరులు ‘క్లాప్‘ బౌండెడ్ స్క్రిప్ట్‌ని చిత్రబృందానికి అందించారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పాను. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలకంటే మా సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ కథపై ఏడాది వర్క్ చేశాను. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో చిత్రకథ సాగుతుంది’’ అన్నారు పృథ్వి ఆదిత్య. ‘‘మిత్రుడు రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు.. కథ విని ఇంప్రెస్ అయి ఈ చిత్రంలో భాగమయ్యాను. ఇళయ రాజాగారి మ్యూజిక్ ఈ చిత్రానికి బిగ్ ఎస్సెట్ కానుంది. ఈ నెల 17నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, మధురైలలో షూటింగ్ జరుపుతాం. నాలుగు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ప్రవీణ్ కుమార్, సహ నిర్మాతలు: ఫై.ప్రభ ప్రేమ్, జి.మనోజ్, జి.శ్రీహర్ష. -
ఆది పినిశెట్టి ‘క్లాప్’మూవీ ప్రారంభమైంది
-
ప్రారంభమైన ఆది పినిశెట్టి ‘క్లాప్’
విభిన్నమైన పాత్రలను చేస్తూ వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ‘క్లాప్’ చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్‌లో ఆది హీరోగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లు పై ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారధులు మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి. కళ్యాణ్, చంటి అడ్డాల, శ్రీమతి శోభారాణి, కొమర వెంకటేష్, హీరోలు నాని, సందీప్ కిషన్, ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, రచయిత చిన్నికృష్ణ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పూజాకార్యక్రమాల అనంతరం హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్ష సింగ్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా క్లాప్ నివ్వగా మెగా నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తమిళ్ చిత్రానికిగాను హీరో నాని క్లాప్ నిచ్చారు. ‘క్లాప్’ బౌండెడ్ స్క్రిప్ట్‌ను ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్లు చిత్ర యూనిట్‌కు అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ‘పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేస్తాను అని చెప్పాను. అంతలా ఇంప్రెస్ అయ్యాను. వెరీ ఆర్ట్ టచ్చింగ్ మూవీ . డైరెక్టర్ చాలా టాలెంట్ వున్న వ్యక్తి. ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథ రాశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నిటికంటే ఈ క్లాప్ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ కన్విక్షన్ బాగా నచ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. రెండు షేడ్స్ వున్న పాత్రల్లో నటిస్తున్నాను. బాగా చెయ్యాలనే తపనతో వున్నాను. నిర్మాత కార్తికేయన్ నేను ఎప్పటినుండో సినిమా చెయ్యాలనుకుంటున్నాం, ఇన్నాళ్లకు కుదిరింది’ అన్నారు. దర్శకుడు పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ.. ఇది వెరీ స్పెషల్ డే నాకు. వన్ ఇయర్ నుండి ఈ కథపై వర్క్ చేశాను. కార్తికేయన్‌కి పాయింట్ చెప్పగానే నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయమన్నారు. ఆది కథ విని వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది’ అన్నారు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ఇది నా మూడవ సినిమా. తమిళ్లో ఫస్ట్ సినిమా. చాలా ఎక్సయిటింగ్‌గా వుంది. ఈ చిత్రంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూర్స్కి థాంక్స్’ అన్నారు. -
కూతురి క్యూట్ వీడియోను పోస్ట్ చేసిన హీరో!
-
కూతురి క్యూట్ వీడియోను పోస్ట్ చేసిన హీరో!
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ గారాలపట్టి మిషా మరో టాలెంట్‌ను బయటపెట్టింది. ఇప్పటికే పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ పాటకు బుజ్జీబుజ్జీ స్టెప్పులు వేసిన ఈ బుజ్జాయి ఇప్పుడు ‘చప్పట్లు ఎలా కొట్టాలో నేర్చేసుకుందట’ . ఈ విషయాన్ని ప్రౌడ్ ఫాదర్ షాహిద్ మిషా చప్పట్లు కొడుతున్న వీడియోను పోస్టు చేసి టాంటాం చేశారు. గత ఏడాది ఆగస్టులో పుట్టిన మిషా తండ్రి షాహిద్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా మారిపోయింది. వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా అప్పట్లో ఈ తండ్రీకూతుళ్లు వేసిన స్టెప్పులు వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను అలరించింది. ఇప్పుడు తాజాగా మిషా చప్పట్టు కొడుతున్న వీడియోను కూడా నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. -
ఒక్క క్లాప్.. రెండు సినిమాలు
‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’లా బుధవారం ఒక్క క్లాప్‌తో రెండు కొత్త చిత్రాలు ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం అందించిన విజయంతో రాజశేఖరరెడ్డి సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత జి.సునీత నాయుడు రెండు చిత్రాలకు శ్రీకారం చుట్టారు. ‘హైద్రాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో ఓ చిత్రం, ‘గుంటూరు టాకీస్’ ఫేం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త దర్శకుడు ఆదిత్య మండాలతో మరో చిత్రం తీయనున్నారు. ఈ రెండు చిత్రాల ప్రారంభోత్సవంలో దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజీవ్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు క్రిష్, నటులు కృష్ణంరాజు సతీమణి శ్యామల క్లాప్ ఇచ్చారు. -
పెళ్లింట విషాదం
కూతురు పెళ్లికి శుభలేఖలు పంచడానికి వెళుతూ తండ్రి దుర్మరణం కాబోయే అల్లుడి ఇంటికి కూతవేటు దూరంలోనే ఘటన నక్కపల్లి: కుమార్తె వివాహాన్ని ఎంతోఘనంగా చేయాలని భావించాడు. సొంత బావమరిదికే ఇచ్చి ఈనెల 25న పెళ్లికి ముహూర్తం పెట్టారు. బంధువులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళుతుండగా విధి వక్రించింది. మండలంలోని ఉద్దండపురం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ తండ్రి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట మండలం పాల్తేరుకు చెందిన దేవవరపు రమణ(40) కుమార్తె పెళ్లి శుభలేఖలతో మోటారు సైకిల్‌పై వెళుతూ ఉద్దండపురం సమీపంలో ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రమణకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి పెళ్లి చేశాడు. చిన్న కుమార్తెకు పెళ్లి నిశ్చయించారు. మరోవారం రోజుల్లో కన్యాదానం చేసి ఒక అయ్యచేతిలో పె ట్టాల్సిన తండ్రి మృతదేహం వద్ద కుమార్తె దేవి తోపాటు భార్యమంగలు బోరున విలపిస్తున్నా రు. పోలీసులు కేసు నమోదు చేశారు.