ఒక్క క్లాప్.. రెండు సినిమాలు
‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’లా బుధవారం ఒక్క క్లాప్‌తో రెండు కొత్త చిత్రాలు ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం అందించిన విజయంతో రాజశేఖరరెడ్డి సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత జి.సునీత నాయుడు రెండు చిత్రాలకు శ్రీకారం చుట్టారు. ‘హైద్రాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో ఓ చిత్రం, ‘గుంటూరు టాకీస్’ ఫేం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త దర్శకుడు ఆదిత్య మండాలతో మరో చిత్రం తీయనున్నారు.
ఈ రెండు చిత్రాల ప్రారంభోత్సవంలో దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజీవ్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు క్రిష్, నటులు కృష్ణంరాజు సతీమణి శ్యామల క్లాప్ ఇచ్చారు.