Rajasekhara Reddy
-
వైఎస్ఆర్ అంటేనే ఒక చరిత్ర..
-
ఏపీలో ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి
-
వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
-
ఇదీ సామాజిక న్యాయం
సాక్షి ప్రతినిధి, కడప: సామాజిక న్యాయం అనేది మాటలకే పరిమితం కాదని, మొట్టమొదటిసారిగా సాధ్యమే అని ఆచరించి చూపిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. తమ ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో శనివారం దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ ఎంపీ అభ్యర్థులను, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఒక్క అనకాపల్లి పార్లమెంట్ స్థానం మినహా 25 ఎంపీ, 175 అసెంబ్లీ సీట్లు కేటాయించామని చెప్పారు. 50 శాతం సీట్లను కచ్చితంగా నా.. నా.. నా.. అని సంబోధిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కచ్చితంగా అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనదన్నారు. ఇది నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ అమలు చేశామని చెప్పారు. దాన్ని మనస్ఫూర్తిగా... స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ రోజు 50 శాతం అంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్ధానాలు.. మొత్తం 200 స్థానాలకు గాను 100 స్థానాల్లో ఈ వర్గాల వారికే సీట్లు ఇవ్వగలగడం చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం అని తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీకి మాత్రమే ఆ ధైర్యం ఈ ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు, 18 ఎంపీ స్థానాల్లో మార్పులు చేశాం. దాదాపు 99 స్థానాలు అంటే 50 శాతం స్థానాల్లో మార్పులు చేశాం. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చేమో. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టికెట్ రాని వాళ్లందరికీ సముచిత స్థానం ఇస్తూ ఏదో ఒక రూపంలో దగ్గరకు తీసుకునే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుందని భరోసా ఇస్తున్నా. విప్లవాత్మక మార్పులు.. కనీవినీ ఎరుగని విప్లవాత్మక మార్పులతో ఐదేళ్ల పాలన సాగింది. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా బట¯Œన్ నొక్కడం ద్వారా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లింది. ఇలా రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ చూడలేదు. ఎప్పుడూ జరగని ఘట్టం. లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా ఇవ్వగలుగుతారా? అనే పరిస్థితి నుంచి.. ఇది సాధ్యమే అని ఐదేళ్ల పరిపాలనలో చూపించాం. గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, 50–60 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం, వీటన్నిటి ద్వారా పారదర్శకత, లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెయ్యడం అనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయంగా గుర్తుండి పోతుంది. గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థితులు మారాయి, స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయి.. ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయం బాగు పడింది. మహిళా సాధికారత సాధ్యమైంది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు.. మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చేసి చూపించిన ప్రభుత్వంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడగలిగిందని చెప్పడానికి గర్వపడుతున్నా. వీటన్నింటి వల్ల ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఈ మార్పులన్నింటి వల్ల దేవుడి ఆశీస్సులతో మళ్లీ 2–3 నెలల్లో కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఈ సందర్భంగా సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకుపోయేలా అడుగులు వేస్తాం. 59 స్థానాలు బీసీ అభ్యర్థులకే.. మొత్తం 200 స్థానాల్లో ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయించాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 11 స్థానాలు వీరికి కేటాయించాం. మహిళలకు ఇంతకు ముందుకన్నా బెటర్‌గా చేశాం. ఇది కూడా నాకు సంతృప్తిని కలిగించడం లేదు. వచ్చే ఎన్నికలకి ఇంకా వేగంగా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తున్నాం. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12 శాతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఇది పూర్తిగా సంతృప్తి కలిగించే అంశం కాకపోయినప్పటికీ లాస్ట్ టైమ్ కన్నా బెటర్‌గా చేశాం. బహుశా ఏ ఇతర పార్టీ కన్నా బెటర్‌గానే ఉంటుందనుకుంటున్నాం. గతంలో 19 సీట్లు ఇస్తే ఈసారి 24దాకా తీసుకుపోగలిగాం. ఇది కూడా ఒక విశేషమే. వచ్చే ఎన్నికలకి ఇంకా పెద్ద సంఖ్యలో ఇచ్చేలా అడుగులు ముందుకు వేస్తాం. ఇవాళ విడుదల చేసిన జాబితా 200 మందిలో 77 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మందిలో 75 శాతం గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారిని మనం ఎంపిక చేశాం. మైనార్టీలకు ఇంతకు ముందు 5 స్థానాలిస్తే ఇవాళ 7 స్థానాలకు పెంచగలిగాం. మొత్తం మీద 50 శాతం నా.. నా.. నా.. అని పిలుచుకుంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. -
IPL 2024: విశాఖలో మరోసారి ఐపీఎల్.. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే..
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ స్టేడియం మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే నాలుగు జట్లకు హోమ్ గ్రౌండ్‌గా నిలిచిన ఈ స్టేడియం ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు హోమ్ గ్రౌండ్‌గా నిలవనుంది. ప్రస్తుత 17వ ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న చైన్నె సూపర్ కింగ్స్ మ్యాచ్ విశాఖ వేదికగా జరగనుంది. మరో 38 రోజుల్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. రెండు మ్యాచ్‌లు విశాఖలో... ప్రస్తుత సీజన్లో తొలి విడతలో 21 మ్యాచ్‌లు 10 నగరాల్లో రెండు వారాలపాటు జరగనుండగా అందులో రెండు మ్యాచ్‌లు విశాఖలోనే నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూలు ఖరారు చేసింది. 2019లో గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏకంగా రెండు ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లను విశాఖ సొంతం చేసుకోగా.. మళ్లీ ఇప్పుడు మరో రెండు మ్యాచ్‌లకు అతిథ్యమివ్వనుంది. హోమ్ గ్రౌండ్‌గా వైఎస్సార్ స్టేడియాన్ని తొలిసారిగా 2012లో డెక్కన్ చార్జర్స్ ఎంచుకోగా 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంచుకుంది. 2016లో ముంబయ్ ఇండియన్స్, పూణే సూపర్ జెయింట్స్ జట్లు ఏకంగా మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 13వ మ్యాచ్‌గా మార్చి 31న చైన్నె సూపర్‌కింగ్స్‌తోనూ, 16వ మ్యాచ్‌గా ఏప్రిల్ 3వ తేదీన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌బిన్నీ, కార్యదర్శి జైషా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ సహకారం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహం వల్లే విశాఖలో రెండు ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు అవకాశం దక్కిందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు శరత్‌చంద్రరెడ్డి, కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రపంచ స్థాయి వసతులను అందించడంతో విశాఖవాసులకు దక్కిన అదృష్టంగా భావించవచ్చని పేర్కొన్నారు. విశాఖలో క్రీడలకు ఎంతగానే ప్రోత్సహిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖకు ధోని ఐపీఎల్–2016 సీజన్లో విశాఖలో జరిగిన 53వ మ్యాచ్‌లో పూణే సూపర్‌జెయింట్స్ జట్టు ఆట చివరి బంతిని ధోనీ బౌండరీ దాటించి నాలుగు వికెట్ల తేడాతో విజయతీరానికి చేర్చాడు. అప్పట్లో సీఎస్కే జట్టుకు ఐపీఎల్ అనర్హత వేటు పడగా ధోని సూపర్‌జెయింట్స్ తరఫున ఆడాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ ఎలెవెన్ ఏడు వికెట్లకు 172 పరుగులు చేయగా ధోని సేన భారీ లక్ష్యచేధనలో ఆరు వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయాన్నందుకుంది. 30 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన ధోని 64పరుగులతో ఫినిషర్‌గా నిలిచాడు. మరోసారి ధోని ప్రత్యక్ష ఆటను చూసేందుకు విశాఖ తహతహలాడుతోంది. -
లేఖను ఎందుకు దాచారు?
సాక్షి, హైదరాబాద్/పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డిలను మంగళవారం ప్రశ్నించారు. వివేకా మరణించే ముందు రాసినట్టుగా చెబుతున్న లేఖ గురించే వారిద్దరి నుంచి ఎక్కువగా వివరాలు రాబట్టినట్టు సమాచారం. సీబీఐ నోటీసుల మేరకు సునీత, రాజశేఖరరెడ్డి హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. వివేకా హత్య తర్వాత జరిగిన పరిణామాలతోపాటు లేఖను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది?, తర్వాత పోలీసులకు అందించడం, వివేకా పీఏ కృష్ణారెడ్డికి హత్య జరిగిన రోజు ఎన్నిసార్లు ఫోన్లు చేశారు? ఆయన నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ అందుకున్నారు? హత్య జరిగిన సమాచారం అందిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు? ఇలా పలు అంశాలపై సునీత, రాజశేఖరరెడ్డిలను సీబీఐ అధికారులు మరోమారు సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇద్దరి స్టేట్మెంట్లను సీబీఐ అధికారులు నమోదు చేశారు. విచారణకు హాజరుకాని అవినాష్ కాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16న మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని 15వ తేదీన ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాను ముందుగా నిర్ణయించుకున్న పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేనని.. నాలుగు రోజుల గడువు కావాలని లేఖ ద్వారా అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఆయన ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో వారి డ్రైవర్‌కు నోటీసులు అందజేసి అతడి సంతకం తీసుకున్నారు. అవినా‹Ùరెడ్డి ఈ నెల 19న ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రత్యేక కేటగిరీగా పరిగణించి వసతులు కల్పించండి: భాస్కరరెడ్డి పిటిషన్ జైలులో తనకు ప్రత్యేక కేటగిరీ కింద సదుపాయాలు కల్పించాలని కోరుతూ వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు (ఏ–7) వైఎస్ భాస్కరరెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను గత నెలలో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తన అనారోగ్యాన్ని, వయసును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ భాస్కరరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న కోర్టు తన ఉత్తర్వులను జూన్ 2కు వాయిదా వేసింది. -
‘చంద్రబాబు చరిత్ర తెలిస్తే.. పక్కన కూర్చోరు’
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై నలుగురు మాజీ సీఎస్‌లు ఆరోపణలు చేశారంటేనే ఎంతలా అవినీతి జరిగిందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ.. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుంటే ఆయన పక్కన ఎవరూ కూర్చోరని విమర్శించారు. ఒక్కసారి వామపక్షాలు, మరోసారి జనసేన, ఇంకోసారి బీజేపీ.. చివరగా కాంగ్రెస్‌తో కూడా పొత్తుకున్నారని, అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పనుల్లో రూ.7వేల కోట్లు చంద్రబాబు మింగేశారని ఆరోపించారు. రూ. 450కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకే బినామిలకు ఇచ్చారన్నారు. చంద్రబాబు అవినీతిని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందన్నారు. ఓటమి భయంతో నీచంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు, ఆయనతో నడిచే పార్టీలకు ప్రజలు తగిన శాస్తి చెబుతారని రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
రాజన్న అన్నీ ఇచ్చిండు
పెద్దపల్లిఅర్బన్: ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్రను వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. ఆయన సేవల్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణికి వచ్చిన పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన యేల్పుల ఎల్లయ్య(80) దివంగత రాజశేఖరరెడ్డి పేదలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వృద్ధాప్య పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరిగి వేసారి కలెక్టర్‌కు మొర పెట్టుకుందామని వచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ ఇచ్చిండు.. అడుగుడు ఆలస్యంలేదు పని చేసి పెట్టిండు..దొర ఎక్కడున్న సల్లంగుండాలే.. మల్ల గసొంటోడు రావాలె.. నాడు నెలనెలా ఠంచన్‌గా పింఛన్ అచ్చేది’అని దివంగత నేతను తలచుకుని కన్నీరుపెట్టుకున్నాడు. ‘కేసీఆర్ అచ్చి ఏం చేయలేదు.. బ్యాంకుల ఖాతా కావాలంటే తెరిచినా..అయినా పింఛన్ రాలే.. తెలంగాణ అచ్చిన మొదటి నుంచి న్యాయం జరగలేదు’అని అక్కసును వెల్లగక్కాడు.. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేనకు వినతిపత్రం అందించాడు. -
ఒక్క క్లాప్.. రెండు సినిమాలు
‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’లా బుధవారం ఒక్క క్లాప్‌తో రెండు కొత్త చిత్రాలు ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం అందించిన విజయంతో రాజశేఖరరెడ్డి సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత జి.సునీత నాయుడు రెండు చిత్రాలకు శ్రీకారం చుట్టారు. ‘హైద్రాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో ఓ చిత్రం, ‘గుంటూరు టాకీస్’ ఫేం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త దర్శకుడు ఆదిత్య మండాలతో మరో చిత్రం తీయనున్నారు. ఈ రెండు చిత్రాల ప్రారంభోత్సవంలో దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజీవ్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు క్రిష్, నటులు కృష్ణంరాజు సతీమణి శ్యామల క్లాప్ ఇచ్చారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ బీట్ ఫారెస్ట్‌లో ఎర్ర చందనం దుంగలు తరలించేందుకు ప్రయత్నిస్తున్న 11 మందిని పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలు, ఒక స్కార్పియో వాహనం, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా పెంచలయ్య, రాజు, రాఘవేంద్ర, విజయభాస్కర్, వరప్రసాద్, నారాయణరెడ్డి, నర్సింహులు, రాజశేఖరరెడ్డి, జనార్దన్, బాబు, నర్సింహులు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
ఆదర్శ రైతుల భవితవ్యమేమిటి?
వ్యవసాయ రంగం దండగ కాదు.. పండగ అని నిరూపించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శ రైతు వ్యవస్థను ప్రవేశపెట్టారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన, స్థానికులై వ్యవసాయంపై అనుభవం ఉన్న వారిని ఆదర్శ రైతులుగా నియమించారు. వీరు పొలాల వెంట తిరుగుతూ సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ భాగస్వాములను చేసేవారు. వీరికి గౌరవ వేతనం రూ.1000, అవి కూడ 10 నెలలకో మారు వచ్చేవి. మండలాల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల కొరత ఉండటంతో ఆదర్శ రైతు వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అప్పటి ప్రభుత్వం వీరిని నియమించింది. వీరికి ప్రభుత్వం 20 రకాల బాధ్యతలను అప్పగించింది. 200-250 మంది రైతులకు ఒక ఆదర్శ రైతు చొప్పున నియమించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 1,280 మందిని నియమించారు. ఆదర్శ రైతులను నియమించి ఏడేళ్లు గడిచినా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో వారు పని చేయలేకపోయారన్న భావనలో ప్రభుత్వం ఉంది. పక్కదారి పట్టిన వ్యవస్థ.. రైతులకు ఎంతగానో తోడ్పాటు నిచ్చే ఈ ఆదర్శ రైతు వ్యవస్థ పక్కదారి పట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు రైతుల దరి చేరటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆదర్శ రైతులు అధికారులను వలలో వేసుకుని ప్రభుత్వ పథకాలను నీరుగారుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పథకాలు రైతులకు సక్రమంగా అందకపోగా అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నానే ఆరోపణలు ఉన్నాయి. పక్కదారి పట్టిన ఈ వ్యవస్థనను గత కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెట్టలేక పోయింది. పంటనష్ట పరిహారం సమయంలో ఆదర్శ రైతులు అనర్హుల పేర్లను జాబితాలో చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో చేతివాటం ప్రదర్శిం చిన కొంతమంది ఆదర్శ రైతులను అప్పట్లో విధుల నుంచి తొలగించారు. అంతేకాకుండా అనర్హులకు అంది న పరిహారాన్ని వాటాల వారిగా జేబులో వేసుకున్నట్లు గతంలో జిల్లాలో రైతులు ఆందోళన చేశారు. ఇవన్నీ సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించింది. రెండురోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. అంతేకాకుండా వారికి చెల్లిస్తున్న వేతనం కూడా ప్రభుత్వానికి భారంగా మారింది. నెలకు జిల్లాలో రూ.12.80 లక్షలు ఆదర్శ రైతులకు వేతనంగా చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదర్శరైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. -
ప్రారంభోత్సవానికి ఎదురుచూపు
సాక్షి, మంచిర్యాల : దండేపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ఆయకట్టు చివరి భూములకు సాగు నీరందించాలనే సంకల్పం నెరవేరడం లేదు. ఈ ఖరీఫ్‌లోనూ ఈ పథకం నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. సకాలంలో పనులు పూర్తి కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. తాజాగా ఆయా ప్రాజెక్టుల పనుల కొనసాగింపును ప్రభుత్వం ఇటీవల సమీక్షించిన నేపథ్యంలో గూడెం ఎత్తిపోతల పథకం చర్చనీయాంశమైంది. మరో వైపు దాదాపు తొంబై శాతం పనులు పూర్తయిన ఈ పథకం పనులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదీ నేపథ్యం.. జలయజ్ఞం పథకంలో భాగంగా గూడెం గోదావరి నది ఒడ్డున ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి రూ.125 కోట్లు మంజూరు చేసి 2009, జనవరి 27న నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అప్పుడు మొదలైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. పథకం నిర్మాణం పనులు చి వరి దశకు చేరుకున్నా పథకం నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్ కోసం రూ.22 కోట్లతో వ్యయంతో చేపట్టిన 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. పథకం ప్రారంభానికి ఇనాళ్లు సబ్‌స్టేషన్ నిర్మాణ ం పనులు అడ్డంకిగా మారాయి. సబ్‌స్టేషన్ నిర్మాణంలో మరో పదిశాతం పనులు మిగిలి ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేసే దిశలో అధికారులు నిమగ్నమయ్యారు. పథకం ఉద్దేశం.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కడెం ఆయకట్టు చివరి దాక నీరందించడానికి గూడెం గోదావరి ఒడ్డున ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. ఇక్కడి పంపింగ్ స్టేషన్ నుంచి మండలంలోని తానిమడుగు వరకు 11 కిలో మీటర్ల పొడవున 2.30 మీటర్ల వ్యాసం గల పైపులైన్ నిర్మించారు. తానిమడుగు వద్ద నిర్మించిన డెలివరి పాయింట్ ద్వారా నీటిని కడెం ప్రధాన కాల్వలో అనుసంధానం చేయనున్నారు. అక్కడ నుంచి కడెం ఆయకట్టు చివరిదాక సాగునీరు సరఫరా కానుంది. ఆయకట్టు వివరాలు.. ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీల నీటిని 30 వేల ఎకరాలకు సాగు నీరందిస్తారు. దండేపల్లి మండలంలో 13 గ్రామాలు, 11,202 ఎకరాలు.. లక్సెట్టిపేట మండలంలో 22 గ్రామాలు, 12,498 ఎకరాలు, మంచిర్యాలలో 13 గ్రామాలు 6,300 ఎకరాలకు సాగు నీరందించాలని రూపకల్పన చేశారు. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి కాగానే.. గూడెం ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్మిస్తున్న సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. అవి పూర్తికాగానే పథకం ట్రయల్ రన్ చేసి ప్రారంభిస్తాం. -
షీప్ మార్కెట్ కలేనా..?
రాష్ట్రంలో గొర్రెల పెంపకందారులు పడుతున్న బాధలు విన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వారి సంక్షేమానికి ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దానికి కోట్లాది రూపాయల నిధులను జమ చేశారు. ఒక్క ఖమ్మంజిల్లాలోనే కోటి రూపాయలతో సబ్సిడీపై గొర్రెల యూనిట్లు అందజేశారు. జిల్లాలోని 127 సహకార సంఘాల్లో 15 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరి వద్ద సుమారు జిల్లా వ్యాప్తంగా 10లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఒక్క ఇల్లెందు మండలంలోనే రెండు వేల గొర్రెలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వ్యాధులబారిన పడి మృత్యువాత పడుతున్న గొర్రెల వల్ల నష్టపోకుండా ఉండేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘బీమాతో ధీమా’ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం వల్ల అనేక మంది గొర్రెల పెంపకందారులు నిలదొక్కుకున్నారు. చాలా మంది మాత్రం సరైన అవగాహన లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోయారు. దళారుల వలలో చిక్కుకుని.... ఇంత కష్టపడి పెంచిన గొర్రెలను విక్రయించేందుకు జిల్లాలో సరైన మార్కెట్(సంత) సౌకర్యం లేదు. దీంతో వారంతా దళారుల చేతిలో చిక్కుకుంటున్నారు. పెంపకందారుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుం టున్న దళారులు తక్కువ ధరకు గొర్రెలు కొనుగోలు చేసి ఎక్కువ లాభాలు పొందుతున్నారు. జిల్లాలో గొర్రెల సంత ఉన్నట్లయితే అక్కడికి వెళ్లి లాభాలకు విక్రయించుకునే అవకాశం ఉంది. ఒక వేళ వెంటనే విక్రయాలు సాగనట్లయితే ఒకటి రెండు రోజులు అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. రైతుకు విశ్రాంతి తీసుకునే సదుపాయంతో పాటు గొర్రెలకు ఆహారం, దాణా, నీరు, నీడ లాంటి సదుపాయాలు ఈ షీప్ మార్కెట్లో లభించే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం జిల్లాలో షీప్ మార్కెట్ ఏర్పాటుకు రూ. 50లక్షలు నిధులు విడుదల చేసింది. రఘునాథపాలెం సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం సర్వే నంబర్ 30లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని జిల్లా అధికారులు స్థానిక తహశీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా ఇది మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. బీమాపై అవగాహన కరువు.. దళారుల వలలో చిక్కుకుని నష్టపోతున్న పెంపకందారులకు బీమా సదుపాయంపై అవగాహన కూడా కల్పించేవారే లేరు. అనారోగ్యంతో గొర్రెలు మృత్యువాత పడుతుండడంతో గొర్రెల కాపలాదారులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. కేవలం ఇల్లెందు మండలంలో 300గొర్రెలకు మాత్రమే బీమా చేయించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో షీప్ మార్కెట్, బీమా సదుపాయం కల్పించినట్లయితే గొర్రెల పెంపకందారులకు మేలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇటీవల ఇల్లెందు వచ్చి జిల్లా పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ అంజయ్యను వివరణ కోరగా షీప్ మార్కెట్ లేకపోవడంతో జిల్లాలో గొర్రెల పెంపకందారులు నష్టపోవాల్సి వస్తోందని, ప్రభుత్వం స్థలం కేటాయిస్తే షీప్ మార్కెట్‌ను నిర్మించే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ వ్యాపారం సాగే పండితాపురం సంత... రాష్ట్రంలోనే అతి పెద్ద సంతగా పేరొందిన పండితాపురం సంత జిల్లాలోని గొర్రెల పెంపకందారులను ఆదుకుంటోంది. ఏడాదిలో 52 రెండు వారాలు(ప్రతీ బుధవారం) జరిగే ఈ సంతలో ఒకవైపు సరుకులు, కూరగాయలు, దుస్తులు, ఇతర వస్తువులతో పాటు పశువుల విక్రయం సాగుతుంది. ఈ సంతకు తమ గొర్రెలు, మేకలతో వచ్చే కాపరులు రోజంతా మంచి ధర కోసం వేచి చూసి సరైన ధర లభించకపోతే తక్కువ ధరకు విక్రయించుకుని నష్టం మూట కట్టుకుని వెనుదిరుగుతుంటారు. జిల్లాలో షీప్ మార్కెట్ లేకపోవడంతో గొర్రెల పెంపకందారులు తమ గొర్రెలను తక్కువ ధరకు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ దుస్థితి నుంచి యజమానులు బయటపడాలంటే షిప్‌యార్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వైఎస్‌పై అభిమానమే గెలిపించింది
సాక్షి, ఖమ్మం : దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానం, ప్రేమే తమను ప్రజాప్రతినిధులుగా గెలిపించిందని, నేతలు, కార్యకర్తల శ్రమ ఫలితంమే ఈ విజయమని, వారి నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయమని, గిట్టనివాళ్లు కుట్రలు, కుతంత్రాలు చేస్తారని, వాటిని నమ్మవద్దని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో గురువారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహ/ంచారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గార్డెన్స్‌లో ఎంపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ చేసిన సేవలను చూసి ప్రజలు, కార్యకర్తలు తమను గెలిపించారని, రానున్న ఐదేళ్లలో జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. 2019లో కూడా కార్యకర్తల అండతో ఎన్నికల క్షేత్రంలో దూకుతానని అన్నారు. జిల్లాలో తనపై, పార్టీ ఎమ్మెల్యేలపై జరుగుతున్న దుష్ర్పచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని అన్నారు. కుంటిసాకులు చెప్పి పార్టీని వీడిన వారికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ‘సదరు నాయకుడు ఎందుకు పార్టీ ఫిరాయించాడో, ఆయన ఆలోచన ఏంటో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అందరికీ తెలుసు’ అని అన్నారు. పిలుపునిచ్చిందే తడవుగా ఈ సమావేశానికి భారీ ఎత్తున తరలివచ్చారు..ఈ విషయం చాలు జిల్లాలో పార్టీ ఎంత బలోపేతంగా ఉందో చెప్పడానికి అని అన్నారు. గతంలో ఎంపీ అభ్యర్థులుగా గెలిచిన వారు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లారని, తాను వారిలా కాకుండా జిల్లా వాసిగా ఇక్కడే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. త్వరలో పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డితో చర్చించి జిల్లాలో పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఎంపీ ల్యాడ్స్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ నిధులను వెచ్చిస్తారన్నారు. అగ్ని సాక్షిగా ప్రమాణం ఖమ్మంనగరానికి చెందిన పార్టీ నేత వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు తమ మీద కార్యకర్తలకు నమ్మకం ఉండేలా అగ్ని సాక్షిగా ప్రమాణం చేయాలని కోరారు. దీంతో సమావేశంలోని కార్యకర్తలంద రూ ప్రమాణం చేయాలంటూ నినదించారు.వెంటనే ఎంపీ పొంగులేటితో పాటు ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు వేదికపైన వైఎస్ఆర్ విగ్రహం ముం దు ఉన్న జ్యోతి ప్రజ్వలన వద్దకు వెళ్లి పార్టీలోనే ఉంటామంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. వెంటనే కార్యకర్తలు జై జగన్, జై శ్రీనన్న అంటూ నినాదాలు చేశారు. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే.. : పాయం వెంకటేశ్వర్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ అద్భుత ఫలితాలు సాధించి తిరుగులేని శక్తిగా ఎదిగిందని పినపాక ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరిన పదిహేను నెలల్లోనే ఎన్నో బాధ్యతలను మోస్తూ ఒంటి చేత్తో పార్టీని ముందుకు నడుపుతూ పార్టీకి అనూహ్య ఫలితాలు తెచ్చిపెట్టారన్నారు. ఇది చూసి ఓర్వలేకే కొందరు తమపై బురద జల్లుతున్నారని, ఎవరు ఎన్ని చేసినా తాను మాత్రం శ్రీనివాసరెడ్డి అడుగుజాడల్లో నడుస్లూ ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే ఉంటానని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. సమగ్ర సర్వే ప్రజలను ఆందోళనకు గురిచేసిందని..దీంతో తమకు సంక్షేమ పథకాలు అందుతాయోలేవోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడుతామన్నారు. ప్రలోభాలకు గురిచేస్తే చూస్తూ ఊరుకోం.. : తాటి వెంకటేశ్వర్లు తమ పార్టీ ప్రజాప్రతినిధులను ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, వారి రుణం తీర్పుకోవ డం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతని ఆయన అన్నారు. వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ ఎంత వేగంగా పార్టీ మారా రో అంతే వేగంగా వైఎస్సార్సీపీలో చేరే రోజు వస్తుందని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే నేతలకు రాజకీయాల్లో పుట్టగతులు ఉండవన్నారు. పోడు భూములకు సంబంధించి గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రభుత్వం అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మాటలకే పరిమితమైందని విమర్శించారు. ‘మామా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి.. : గుగులోతు రవిబాబునాయక్ వైఎస్సార్సీపీ కార్యకర్తల శ్రమతో గెలిచిన వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జ్ గుగులోతు రవిబాబునాయక్ డిమాండ్ చేశారు. ‘మామా.. నువ్వు పదవికి రాజీనామా చేయి.. నీమీద నేనే పోటీ చేస్తా’ అంటూ ఆయన మదన్‌లాల్‌కు సవాల్ విసిరారు. ధనార్జనే ధ్యేయంగా రాజకీయాలు చేయడం తగదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయసాధనకు వైఎస్సార్సీపీ పుట్టిందని, జిల్లాలో ప్రతీ కార్యకర్త దీని కోసం కదం తొక్కుతున్నారని అన్నారు.సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలం అన్నారు. కార్యకర్తల శ్రమ, కృషిని పార్టీ ఎప్పటికీ మరువదన్నారు. ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొదమసింహం పాండురంగాచార్యులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ.ముస్తఫా, పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు తోట రామారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, టీచర్స్ విభాగం అధ్యక్షులు కొత్తపల్లి గురుప్రసాద్, నాయకులు దారా యుగంధర్, కాంపల్లి బాలకృష్ణ, ఏలూరి కోటేశ్వరరావు, సంపెట వెంకటేశ్వర్లు, మార్కం లింగయ్యగౌడ్, జక్కం సీతయ్య, ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఆర్ కృష్ణారెడ్డి, సుధీర్, అడపా వెంకటనర్సయ్య, పగడాల భాస్కర్‌నాయుడు, గుండా వెంకటేశ్వర్లు, కొమ్మినేని వెంకటేశ్వరరావు, భూక్యా అంజయ్య, జల్లేపల్లి సైదులు, పత్తి శ్రీను, కొంగర జ్యోతిర్మయి, తుమ్మా అప్పిరెడ్డి, షకీనా, షర్మిల సంపత్, వంటికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
విమానం.. గూడెం నుంచి పౌరయూనం!
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్: తాడేపల్లిగూడెం నుంచి ఆకాశయూనం చే యూలనే జిల్లా వాసుల ఆకాంక్షలు త్వరలోనే నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్కడి విమానాశ్రయూన్ని పునరుద్ధరించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాడేపల్లిగూడెం పట్టణం జిల్లాకు నడిబొడ్డున ఉండటం.. సీమాంధ్రకు చెందిన పూసపాటి అశోకగజపతిరాజు కేంద్ర పౌర విమానయూన శాఖ మంత్రిగా నియమితులు కావడం క లిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడి విమానాశ్రయూన్ని పునరుద్ధరించి పౌర విమాన యూనానికి త్వరలోనే అవకాశం కలుగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. వైఎస్ హయూంలో టెండర్ల వరకూ వెళ్లినా... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయం పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. పనులకు సంబంధించి టెండర్లు కూడా పిలిచారు. 22 సంస్థలు టెండర్లు దాఖలు చేయగా, మైటాస్ సంస్థ పనులను దక్కించుకుంది. అయితే, సత్యం కంప్యూటర్స్‌లో తలెత్తిన సంక్షోభం కారణంగా పనులు మొదలు కాలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో... అనూహ్య పరిణామాల నడుమ ఇక్కడి విమానాశ్రయం పునరుద్ధరణ అంశం అప్పట్లో అటకెక్కింది. విమానయాన సేవలందించే కొన్ని సంస్థలు ముందుకొచ్చినా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ అంశం పెండింగ్‌లో ఉండిపోరుుంది. రాష్ట్ర విభజనకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ప్రజల ప్రయాణ అవసరాల కోసం సీమాంధ్ర ప్రాంతంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, పాత విమానాశ్రయాల పునరుద్ధరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జూన్ 2న ‘అపాయింట్ డే’గా ప్రకటించడంతో.. సీమాంధ్రలో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందులో విమానాశ్రయాల ఏర్పాటు, పునరుద్ధరణ వంటి అంశాలు కూడా ఉన్నాయి. దీంతో తాడేపల్లిగూడెంలో విమానాశ్రయ పునరుద్ధరణ ప్రాధాన్యతను సంతరించుకుంది. విమానాల రాకపోకలకు ఇది అనుకూలమని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి అధికారిక నివేదికలు వెళ్లాయి. తాజాగా కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ బాధ్యతలను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అశోకగజపతిరాజుకు అప్పగించడంతో ఈసారి విమానాశ్రయ పునరుద్ధరణ దాదాపు ఖాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు బీజేపీకి చెందిన వ్యక్తి కావడం, కేంద్రంలోని అగ్రనాయకత్వంతో ఆయనకు సత్సంబంధాలు ఉండటం కూడా కలిసొచ్చేఅంశంగా చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నాటిది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనిక కార్యకలాపాల కోసం తాడేపల్లిగూడెంలో సుమారు 650 ఎకరాల భూమిని సేకరించి విమానాశ్రయం నిర్మించారు. దీనిని ఒక్కసారి కూడా వినియోగించలేదు. అప్పటి నుంచి ఈ భూములన్నీ రక్షణ శాఖ అధీనంలోనే ఉండేవి. వీటిని పర్యవేక్షించడానికి విశాఖపట్నంలో ఎస్టేట్ ఆఫీసర్ ఉండేవారు. ఆ తరువాత విమానాశ్రయం పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ భూముల నిమిత్తం కోటి రూపాయల్ని కేంద్రానికి చెల్లించింది. దీంతో ఈ భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి దఖలుపడ్డాయి. అప్పటి నుంచి జిల్లా కలెక్టర్ కస్టోడియన్‌గా ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తున్నారు. గృహాలు, రహదారులు, వ్యవసాయ క్షేత్రాలు పోగా నికరంగా 250 ఎకరాలకు పైగా భూమి ఇక్కడ అందుబాటులో ఉంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఈ భూమి సరిపోతుందని గతంలో ఇక్కడ పలుమార్లు పర్యటించిన వైమానిక అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ విమానాశ్రయం నుంచి డొమెస్టిక్ (ప్రయూణికుల) సేవలతోపాటు, కార్గో (వస్తు) సేవలకు సైతం అనుకూలంగా ఉంటుందని సీహెచ్.శ్రీధర్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల వైమానిక బృందం ఇటీవల నివేదిక ఇచ్చింది. విమానాల రాకపోకలకు సంబంధించి వాతావరణ పరిస్థితుల విషయంలో విండ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా లభించింది. చెన్నైలోని విమానాశ్రయం రన్‌వే ఎలాంటి నాణ్యతా ప్రమాణాలతో ఉందో, ఇక్కడి విమానాశ్రయ రన్‌వేలో కూడా అదే నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయని తేల్చారు. రన్‌వేను 280 మీటర్ల మేర పెంచి, రన్‌వేపై స్పాంజ్ లేయర్ వేసి, సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే విమానాల రాకపోకలను సులభంగా సాగించవచ్చని స్పష్టం చేశారు. -
జగన్ నాయకత్వానికే మద్దతు
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వానికే కళింగవైశ్యుల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అందవరపు వరహానరసింహం(వరం) అన్నారు. శ్రీకాకుళంలోని వరం రెసిడెన్సీలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళింగ వైశ్యులు ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు. ఈ కులాన్ని బీసీ కులాల జాబితాలో చేర్చేందుకు జగన్మోహనరెడ్డి పూర్తి హామీ ఇచ్చారన్నారు. అందుకు కృతజ్ఞతగా రాష్ట్రంతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ఉన్న లక్షలాది మంది కళింగ వైశ్యులు(కళింగ కోమట్లు) రానున్న ఎన్నికల్లో జగన్ నాయకత్వాన్ని బలపరుస్తారని వెల్లడించారు. రాజశేఖర రెడ్డి అకాల మరణం వల్ల బీసీల్లో చేర్చాల్సిన కళింగ వైశ్యుల చట్టం నిలిచిపోయిందన్నారు. తరువాత వచ్చే పాలకుల నిర్లక్ష్యంతో ఇంతవరకూ బీసీ జాబితాలో చేర్చలేదని ఆరోపించారు. దీనిపై జగన్మోహనరెడ్డి గత నరసన్నపేట ఉప ఎన్నికల్లోనూ, ఇటీవల జిల్లా పర్యటనలోనూ హామీ ఇచ్చారన్నారు. వైఎస్ కుటుంబం ఇచ్చినమాట నిలబెట్టుకుంటుందని, ఆ నమ్మకంతోనే జగన్ నాయకత్వాన్ని రానున్న ఎన్నికల్లో సమర్ధిస్తున్నామన్నారు. -
అభాండాలు