వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ బీట్ ఫారెస్ట్‌లో ఎర్ర చందనం దుంగలు తరలించేందుకు ప్రయత్నిస్తున్న 11 మందిని పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలు, ఒక స్కార్పియో వాహనం, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా పెంచలయ్య, రాజు, రాఘవేంద్ర, విజయభాస్కర్, వరప్రసాద్, నారాయణరెడ్డి, నర్సింహులు, రాజశేఖరరెడ్డి, జనార్దన్, బాబు, నర్సింహులు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.