idupula paya
-
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని.. ఆత్మహత్య!
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో నిర్వహించే ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యారి్థని జమీషా ఖురేషీ (17) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన మక్బూల్, నసీమా దంపతులకు కుమారుడు సోహెల్ అబ్బాస్, కుమార్తె జమీషా ఖురేషీలు ఉన్నారు.ఈ అమ్మాయికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు వచి్చంది. మొదటి సంవత్సరం పీయుసీ–1 లో మంచి మార్కులు సాధించింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం క్యాంపస్‌లోని క్యాంటిన్‌కు వెళ్లింది. అక్కడ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యారి్థని మొబైల్ ఫోన్ పోయింది. ఆ ఫోన్‌ను జమీషా ఖురేషీ తీసుకున్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన ట్రిపుల్ ఐటీ అధికారులు ఆమెను అందరి ముందు మందలించారు. జరిగిన విషయాన్ని విద్యారి్థని తల్లిదండ్రులకు తెలియజేశారు.దీంతో ఆమె మనస్థాపానికి గురై హాస్టల్ గదిలో ఉన్న వాటర్ పైప్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఉన్న తోటి విద్యార్థులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్టడీ అవర్స్‌కు వెళ్లి పోవడంతో ఎవరూ గుర్తించలేదు. 10 గంటల తర్వాత విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ దంపతులు
వైఎస్ఆర్ జిల్లా: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్ 72వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ అంజలి ఘటించి నివాళులు అర్పించారు. సీఎం జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలిసి వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజు రాత్రి సీఎం జగన్ ఇక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. అంతకుముందు వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులను రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని, రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ కోసం రూ.154 కోట్లు కేటాయించామని తెలిపారు. పులివెందుల రోడ్డును ఫోర్‌లైన్ రోడ్డుగా మారుస్తున్నామని, రూ.30 కోట్లతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ బీట్ ఫారెస్ట్‌లో ఎర్ర చందనం దుంగలు తరలించేందుకు ప్రయత్నిస్తున్న 11 మందిని పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలు, ఒక స్కార్పియో వాహనం, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా పెంచలయ్య, రాజు, రాఘవేంద్ర, విజయభాస్కర్, వరప్రసాద్, నారాయణరెడ్డి, నర్సింహులు, రాజశేఖరరెడ్డి, జనార్దన్, బాబు, నర్సింహులు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
మోగిన సమ్మె సైరన్
ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో గురువారం సమ్మె సెరైన్ మోగింది. గురువారం ఉదయం ట్రిపుల్ ఐటీలోని పీయూసీ, బీటెక్ చదువుతున్న దాదాపు 8వేలమంది విద్యార్థులు ర్యాలీగా వచ్చి మెయిన్ రోడ్డులో ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని.. కేసీఆర్ డౌన్, డౌన్.. సోనియా మేలుకో అంటూ నినాదాలు చేశారు. శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి క్యాంపస్‌లో నిరసన వ్యక్తం చేస్తామని విద్యార్థులు పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోతే రైతులకు, విద్యార్థులకు తీవ్ర అన్యా యం జరుగుతుందన్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ను పొరుగు ప్రాంతంగా భావించి వలస వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ ఆదేశానుసారం నిరసన ట్రిపుల్ ఐటీ వీసీ రాజ్‌కుమార్ ఆదేశానుసారం గురువారం నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ నిరసనను శుక్రవారం నల్లబ్యాడ్జీలతో ప్రదర్శిస్తాం. తదుపరి వీసీ ఆదేశానుసారం తమ కార్యక్రమాలు వెల్లడిస్తాం. - కె.ఎల్.ఎన్.రెడ్డి, ప్రొఫెసర్ సమైక్యంగా ఉంటేనే.. రాష్ట్రం రెండుగా విడిపోతే సీమాంధ్ర ప్రాం తానికి చెందిన విద్యార్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతాం. కావున రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సుభిక్షం. -మహాలక్ష్మి(పీ-2విద్యార్థిని), గుంటూరు కలిసుంటేనే అభివృద్ధి రాష్ట్రం కలిసుం టేనే అభివృద్ధి చెందుతుంది. ఒకే భాష ఉన్న తెలుగు రాష్ట్రం విడిపోవడం చాలా బాధాకరం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కలిసి ఉంటేనే సుఖం. - అనూష (విద్యార్థిని), కరీంనగర్ -
ఇడుపులపాయ కిటకిట
ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : సుధీర్ఘంగా సాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిన వేళ.. మహానేత వైఎస్ తనయ షర్మిల ఇడుపులపాయకు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు వెల్లువలా తరలివచ్చారు. మరోవైపు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధించడంతో.. సర్పంచులు, వార్డు సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడి కి తర లివచ్చారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పులివెందుల నియోజకవర్గంలోని వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్, కడప డీసీసీబీ బ్యాంకు చెర్మైన్ తిరుపాల్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు అంజద్ బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, జిల్లా రైతు విభాగం కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర మహిళా నేత వాసిరెడ్డి పద్మ, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి, అల్లె ప్రభావతి, వైఎస్ఆర్ సీపీ కడప పట్టణ మైనార్టీ విభాగపు కన్వీనర్ షఫీ, చక్రాయపేట, వేం పల్లె మండల కన్వీనర్లు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి తరలివచ్చిన వారిలో ఉన్నారు. వైఎస్ఆర్ ఘాట్ జై జగన్.. జై జై జగన్.. వైఎస్ఆర్ అమర్ రహే వంటి నినాదాలతో మార్మోగింది. సర్పంచులను పరిచయం చేసుకున్న వైఎస్ విజయమ్మ ఇటీవల ఎన్నికైన సర్పంచులను వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరిచయం చేసుకున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గెస్ట్‌హౌస్‌లో దాదాపు 2 గంటల పాటు ఒక్కో గ్రామం వారీగా సర్పంచ్ వివరాలను తెలుసుకుంటూ.. వారి గ్రామాల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.