సీనియర్ విద్యార్థి మొబైల్ కొట్టేసిందని అధికారుల మందలింపు
అందరి ముందు నిలదీయడం వల్లే అఘాయిత్యం
జమీషా ఖురేషీ (ఫైల్)
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో నిర్వహించే ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యారి్థని జమీషా ఖురేషీ (17) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన మక్బూల్, నసీమా దంపతులకు కుమారుడు సోహెల్ అబ్బాస్, కుమార్తె జమీషా ఖురేషీలు ఉన్నారు.
ఈ అమ్మాయికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు వచి్చంది. మొదటి సంవత్సరం పీయుసీ–1 లో మంచి మార్కులు సాధించింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం క్యాంపస్‌లోని క్యాంటిన్‌కు వెళ్లింది. అక్కడ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యారి్థని మొబైల్ ఫోన్ పోయింది. ఆ ఫోన్‌ను జమీషా ఖురేషీ తీసుకున్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన ట్రిపుల్ ఐటీ అధికారులు ఆమెను అందరి ముందు మందలించారు. జరిగిన విషయాన్ని విద్యారి్థని తల్లిదండ్రులకు తెలియజేశారు.
దీంతో ఆమె మనస్థాపానికి గురై హాస్టల్ గదిలో ఉన్న వాటర్ పైప్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌లో ఉన్న తోటి విద్యార్థులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్టడీ అవర్స్‌కు వెళ్లి పోవడంతో ఎవరూ గుర్తించలేదు. 10 గంటల తర్వాత విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment