వైఎస్సార్ జిల్లా, సాక్షి: ఎన్నికలకు ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా.. కడప నేతలు, కార్పొరేటర్లతో తాజా పరిణామాలపై ఆయన చర్చించారు.
‘‘కష్టాలు అనేవి శాశ్వతం కావు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు.మనమందరం కలిసికట్టుగా పని చేయాలి. దేశ చరితలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మోసపూరిత హామీలతో చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చారు. కానీ,
..మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా పాలన చేశాం. 2027 చివరిలో జమిలి ఎన్నికలు(Jamili Elections) రావొచ్చు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతికార్యకర్తకు అండగా ఉంటాం’’ అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో.. ఆంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటీవల కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) చేస్తున్న అరాచకాలను కడప నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేషన్లలో బలం లేకపోయినా టీడీపీ నేతలు పెత్తనం కోసం ఎలా పాకులాడుతున్నారో తమ అధినేతకు వివరించారు. ‘‘మాట మీద నిలబడితే ప్రజలు వాస్తవాలను తెలుసుకుని ఆదరిస్తారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా నిత్యం మనం ప్రజల కోసమే పోరాడాలి’’ అని నేతలకు వైఎస్ జగన్(YS Jagan) సూచించారాయన.
Comments
Please login to add a commentAdd a comment