విషాద ఛాయలు | - | Sakshi
Sakshi News home page

విషాద ఛాయలు

Published Sat, Jan 11 2025 8:57 AM | Last Updated on Sat, Jan 11 2025 11:19 AM

-

 వైఎస్‌ అభిషేక్‌రెడ్డి మృతితో శోక సంద్రంలో పులివెందుల

ఆయనతో అనుబంధాన్ని మరువలేమంటున్న జనం

పులివెందుల రూరల్‌: పారిశ్రామిక వేత్త వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి మనుమడు, వైఎస్‌ మధురెడ్డి కుమారుడు వైఎస్‌ అభిషేక్‌రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన 2017లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రజల్లో ముద్ర వేసుకున్నారు. 2018లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వైద్య విభాగపు ప్రధాన కార్యదర్శిగా పదవి రావడంతో.. పార్టీ ఆదేశాల మేరకు బలోపేతం చేసే విధంగా నిరంతరం కృషి చేశారు. చిన్న పిల్లవాడి నుంచి కార్యకర్తలు, నాయకుడి వరకు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే వారు. 

రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి పులివెందుల నియోజకవర్గంలోనే కాక.. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులలో మంచి పేరు సంపాదించారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఒకపక్క రాజకీయాలు, మరో పక్క వైద్య వృత్తిలో రాణిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రాజకీయాలలో ఉంటూ తన వద్దకు ఎవరూ వచ్చినా చిన్న, పెద్దా తేడా లేకుండా.. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సమస్యలను తెలుసుకోవడంలో చొరవ తీసుకుంటుండే వారు. 

అలాగే వైద్య వృత్తిలో కూడా నిరుపేదలకు వైద్య సేవలు అందించడంలో తనదైన శైలిలో పేరు సాధించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అనతి కాలంలోనే అధిక గుర్తింపు పొందారు. ఒక్కసారిగా తన అభిమాన నాయకుడు, వైద్యుడు వైఎస్‌ అభిషేక్‌రెడ్డి మృతి చెందారన్న విషయం తెలుసుకున్న పులివెందుల నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరూ చూసినా, ఎక్కడ చూసినా మంచి మనస్సున్న నాయకుడిని కోల్పోయామని బాధను వెలిబుచ్చుతున్నారు. 

వైఎస్‌ అభిషేక్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు, చైర్మన్లు, కౌన్సిలర్లతోపాటు మహిళలు చర్చించుకుంటూ ఆయన లేని లోటును మరువలేమన్నారు. శనివారం జరిగే అంత్యక్రియలకు నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పార్థీవ దేహాన్ని చూసేందుకు తరలి రానున్నారు.

వైఎస్‌ అభిషేక్‌రెడ్డి మరణం బాధాకరం
వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు వైఎస్‌ అభిషేక్‌రెడ్డి మరణం అత్యంత బాధాకరమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న నాయకుడు అకాల మరణం చెందడం విచారకరమన్నారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలుపుతూ, ఆయన మరణానికి సంతాపం ప్రకటించారు.

ఎంతో భవిష్యత్‌ ఉన్న నాయకుడు
వైఎస్‌ అభిషేక్‌రెడ్డి ఎంతో భవిష్యత్‌ ఉన్న నాయకుడని, పిన్న వయసులోనే చనిపో వడం మనసును కలచివేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం ఆయన చాలా కష్టపడ్డారని, ఆయన లేనిలోటు తీర్చలేనిదన్నారు. అభిషేక్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
–కడప కార్పొరేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
విషాద ఛాయలు 1
1/2

విషాద ఛాయలు

విషాద ఛాయలు 2
2/2

విషాద ఛాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement