YS Abhishek Reddy
-
సహజ మరణాలపై సిట్ కుట్ర: వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి
పులివెందుల: వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందితే, దానిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, దానికి ప్రభుత్వ పెద్దలు కూడా వంతపాడుతున్నారని అభిషేక్ రెడ్డి తండ్రి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారంటూ ఎల్లో మీడియా విషపూరిత కథనాలు ప్రచురించడాన్ని ఖండించారు.తమ కుమారుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని చెప్పారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శక్తివంచన లేకుండా ప్రయత్నించారని, కోమా నుంచి బయటపడతాడని ఆశించామని, దేవుడు చిన్న చూపు చూడటంతో మృతి చెందాడని తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న అభిషేక్‌రెడ్డి చిన్న వయస్సులో చనిపోవడం ఈ ప్రాంతంలో అందరినీ కలచివేసిందని చెప్పారు. అభిషేక్‌రెడ్డి పిల్లలను చూస్తే కడపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.అభిషేక్ మృతి తమకు తీరని లోటని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నామని తెలిపారు. ఇలాంటి తీవ్ర విషాద పరిస్థితుల్లో తాముంటే.. చిన్నాన్న వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని, అందులో కుట్ర ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పెడర్థాలు తీయడం, ప్రభుత్వ పెద్దలూ ఇదే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్, అనారోగ్యంతో దీర్ఘ కాలం చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు.మొన్న వాచ్‌మేన్ రంగన్న కూడా అనారోగ్యంతో చనిపోయాడని చెప్పారు. రంగన్నకు ఆయాసం ఉందని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారని, అతని అనారోగ్యం ఇక్కడి అందరికీ తెలుసునని చెప్పారు. వీరందరి సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తోందని అన్నారు. బయటి ప్రపంచానికి పులివెందులలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని తెలియజెప్పేందుకు ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వ పెద్దల చర్యలూ ఇదే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.సిట్ కాదు.. జ్యుడీషియల్ విచారణ జరిపించండిచిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వ సిట్ దర్యాప్తు అంటేనే ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానం వస్తోందని వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మందిపై పెడుతున్న అడ్డగోలు కేసులు, చేపడుతున్న ఏకపక్ష విచారణ అందరమూ కళ్లారా చూస్తున్నామని, అందువల్లే సిట్‌పై నమ్మకం లేదని చెప్పారు. -
పులివెందులలో వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి
-
వైఎస్ అభిషేక్ రెడ్డికి వైఎస్ జగన్ దంపతులు నివాళి
-
పులివెందులలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
అభిషేక్ రెడ్డికి వైఎస్ జగన్ నివాళి
-
వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు
-
అభిషేక్ రెడ్డికి వైఎస్ జగన్ దంపతుల నివాళి
వైఎస్సార్, సాక్షి: వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థీవదేహానికి పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వాళ్లలో ఉన్నారు. ఈ సందర్భంగా అభిషేక్ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. వైఎస్ అభిషేక్‌రెడ్డి.. వైఎస్సార్సీపీ కీలక నేతగా, వైఎస్ జగన్(YS Jagan)కు దగ్గరిబంధువని తెలిసిందే. వైఎస్ జగన్ పెద్దనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి మనవడే ఈ అభిషేక్. అయితే కొద్దిరోజులుగా డెంగీ జ్వరంతో అభిషేక్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. అంతకు ముందు.. పులివెందులోని స్వగృహంలో అభిషేక్ రెడ్డి(ys abhishek reddy) పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పులివెందుల చేరుకున్నారు. అభిషేక్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. చిన్నవయసులోనే అభిషేక్ మృతి చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలు పూర్తిపులివెందులలో వైఎస్ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు దారి పొడవునా అభిషేక్ రెడ్డి చిత్రపటాలు ప్రదర్శిస్తూ వీడ్కోలు పలికారు.సుశీలమ్మకు పరామర్శఅభిషేక్రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ ఉదయం బెంగళూరు నుంచి జగన్ దంపతులు పులివెందుల చేరుకున్నారు. అంతకు ముందు.. వైఎస్ జగన్ తన మరో బంధువు వైఎస్ ఆనందరెడ్డి ఇంటికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్మను పరామర్శించి.. వాళ్ల యోగకక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. -
విషాద ఛాయలు
పులివెందుల రూరల్: పారిశ్రామిక వేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డి మనుమడు, వైఎస్ మధురెడ్డి కుమారుడు వైఎస్ అభిషేక్‌రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన 2017లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రజల్లో ముద్ర వేసుకున్నారు. 2018లో వైఎస్సార్సీపీ రాష్ట్ర వైద్య విభాగపు ప్రధాన కార్యదర్శిగా పదవి రావడంతో.. పార్టీ ఆదేశాల మేరకు బలోపేతం చేసే విధంగా నిరంతరం కృషి చేశారు. చిన్న పిల్లవాడి నుంచి కార్యకర్తలు, నాయకుడి వరకు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే వారు. రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి పులివెందుల నియోజకవర్గంలోనే కాక.. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులలో మంచి పేరు సంపాదించారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఒకపక్క రాజకీయాలు, మరో పక్క వైద్య వృత్తిలో రాణిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రాజకీయాలలో ఉంటూ తన వద్దకు ఎవరూ వచ్చినా చిన్న, పెద్దా తేడా లేకుండా.. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సమస్యలను తెలుసుకోవడంలో చొరవ తీసుకుంటుండే వారు. అలాగే వైద్య వృత్తిలో కూడా నిరుపేదలకు వైద్య సేవలు అందించడంలో తనదైన శైలిలో పేరు సాధించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అనతి కాలంలోనే అధిక గుర్తింపు పొందారు. ఒక్కసారిగా తన అభిమాన నాయకుడు, వైద్యుడు వైఎస్ అభిషేక్‌రెడ్డి మృతి చెందారన్న విషయం తెలుసుకున్న పులివెందుల నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరూ చూసినా, ఎక్కడ చూసినా మంచి మనస్సున్న నాయకుడిని కోల్పోయామని బాధను వెలిబుచ్చుతున్నారు. వైఎస్ అభిషేక్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, చైర్మన్లు, కౌన్సిలర్లతోపాటు మహిళలు చర్చించుకుంటూ ఆయన లేని లోటును మరువలేమన్నారు. శనివారం జరిగే అంత్యక్రియలకు నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పార్థీవ దేహాన్ని చూసేందుకు తరలి రానున్నారు.వైఎస్ అభిషేక్‌రెడ్డి మరణం బాధాకరంవైఎస్సార్సీపీ యువ నాయకుడు వైఎస్ అభిషేక్‌రెడ్డి మరణం అత్యంత బాధాకరమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న నాయకుడు అకాల మరణం చెందడం విచారకరమన్నారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలుపుతూ, ఆయన మరణానికి సంతాపం ప్రకటించారు.ఎంతో భవిష్యత్ ఉన్న నాయకుడువైఎస్ అభిషేక్‌రెడ్డి ఎంతో భవిష్యత్ ఉన్న నాయకుడని, పిన్న వయసులోనే చనిపో వడం మనసును కలచివేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కోసం ఆయన చాలా కష్టపడ్డారని, ఆయన లేనిలోటు తీర్చలేనిదన్నారు. అభిషేక్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.–కడప కార్పొరేషన్ -
వైఎస్ అభిషేక్‌రెడ్డి మృతి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి (36) శుక్రవారం మృతి చెందారు. ఇతను వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు(వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి కుమారుడు). కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.హైదరాబాద్ నుంచి ఆయన పారి్థవదేహం రాత్రి పొద్దుపోయాక పులివెందుల చేరుకుంది. సౌమ్యుడు, వివాద రహితుడు, ఉన్నత విద్యావంతుడిగా అభిషేక్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. సన్నీగా ఈ ప్రాంత వాసులకు సుపరిచితుడు. ఆర్థోపెడిక్స్ వైద్యుడిగా రాణిస్తూనే రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరించారు. శనివారం మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం పులివెందులలోని స్వగృహంలో అభిషేక్‌రెడ్డి పారి్థవదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం పులివెందులలోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. అభిషేక్‌రెడ్డి మృతితో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా, వైఎస్ అభిషేక్‌రెడ్డికి భార్య డాక్టర్ సౌఖ్య, పిల్లలు వైఎస్ అక్షర, వైఎస్ ఆకర్ష ఉన్నారు. -
వైఎస్ అభిషేక్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాసేపటి క్రితం మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.అభిషేక్‌రెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలిస్తున్నారు. రేపు(శనివారం) ఉదయం అభిషేక్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు.