వైఎస్సార్, సాక్షి: వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థీవదేహానికి పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వాళ్లలో ఉన్నారు. ఈ సందర్భంగా అభిషేక్ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు.
వైఎస్ అభిషేక్‌రెడ్డి.. వైఎస్సార్‌సీపీ కీలక నేతగా, వైఎస్ జగన్(YS Jagan)కు దగ్గరిబంధువని తెలిసిందే. వైఎస్ జగన్ పెద్దనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి మనవడే ఈ అభిషేక్. అయితే కొద్దిరోజులుగా డెంగీ జ్వరంతో అభిషేక్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.
అంతకు ముందు.. పులివెందులోని స్వగృహంలో అభిషేక్ రెడ్డి(ys abhishek reddy) పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పులివెందుల చేరుకున్నారు. అభిషేక్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. చిన్నవయసులోనే అభిషేక్ మృతి చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
అంత్యక్రియలు పూర్తి
పులివెందులలో వైఎస్ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు దారి పొడవునా అభిషేక్ రెడ్డి చిత్రపటాలు ప్రదర్శిస్తూ వీడ్కోలు పలికారు.
సుశీలమ్మకు పరామర్శ
అభిషేక్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ ఉదయం బెంగళూరు నుంచి జగన్ దంపతులు పులివెందుల చేరుకున్నారు. అంతకు ముందు.. వైఎస్ జగన్ తన మరో బంధువు వైఎస్ ఆనందరెడ్డి ఇంటికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్మను పరామర్శించి.. వాళ్ల యోగకక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment