cremations
-
ఆమె సేవ అనూహ్యం
లక్నో: ఈ ఫొటోలో మహిళ పేరు వర్ష వర్మ. వయసు 44 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు చెందిన ఆమెలో సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే తపన ఉంది. దీంతో అయిదేళ్లుగా ఎవరూ చేయలేని ఒక అనూహ్యమైన పనికి పూనుకున్నారు. ఏక్ కోషిస్ ఏసీ భీ అనే సంస్థను స్థాపించి మార్చురీల్లో గుర్తు పట్టని మృతదేహాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం జరిపిస్తున్నారు. దీనివల్ల మరణించిన వారిని గౌరవంగా పైలోకాలకు పంపిస్తున్నట్టుగా ఆమె భావిస్తున్నారు. 72 గంటల సేపు మృత దేహం కోసం కుటుంబ సభ్యులెవరూ రాకపోతే స్థానిక అధికారులు ఆమెకే చెబుతారు. ఇలా వారానికి సగటున మూడు మృతదేహాలకు వర్ష అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని వర్ష చెబుతున్నారు. -
TS: అధికారిక లాంఛనాల్లోనూ ఇదేం వివక్ష?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు మనవడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ఈ ప్రభుత్వం.. కంటోన్మెంట్ సాయన్న విషయంలో ఎందుకు వివక్ష ప్రదర్శించిందని? మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, సినీ ప్రముఖులు చనిపోతే.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదా? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారాయన. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దళితుడు సాయన్న విషయంలోనే ఎందుకీ వివక్ష? అని కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించారు బండి సంజయ్. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే విషయంలో.. సర్కార్ అనుసరిస్తున్న తీరును బీజేపీ తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారాయన. శాసనసభ్యుడిగా ఐదు సార్లు గెలిచి ప్రజలకు సేవలందించిన వ్యక్తి సాయన్న. ఆయన మరణిస్తే అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించకపోవడం శోచనీయమని బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు వారసుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన ఒక శాసనసభ్యుడికి.. అదీ పదవిలో ఉండగానే మరణించిన వ్యక్తికి మాత్రం అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలకకపోవడం గర్హనీయమన్నారు. గతంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరణించిన నోముల నర్సింహయ్యతోపాటు మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎం.సత్యనారాయణరావు, సినీ రాజకీయ ప్రముఖుడు హరికృష్ణ లాంటి వాళ్లకు అధికారిక లాంఛనాలతో కేసీఆర్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు. దళితుడైన సాయన్న విషయంలో వివక్ష చూపడం క్షమించరాని విషయమన్నారు. కేసీఆర్ స్పందనేది? సాయన్న అంత్యక్రియల ఉదంతం మరవక ముందే.. ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డునున్న అంబర్ పేట నియోజకవర్గంలో గంగపుత్ర సామాజికవర్గానికి చెందిన 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించగా.. సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమని బండి సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, గిరిజన, బహుజనులంటే కేసీఆర్ కు ఎంత వివక్ష ఉందో రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలని ప్రజానీకానికి ఆయన పిలుపు ఇచ్చారు. ‘‘సమాజంలో అంతరాలుండకూడదని, అంటరానితనం నిర్మూలన జరగాలని కలలుకన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా పాలన కొనసాగిస్తూ.. కేసీఆర్ దళిత, గిరిజన, బలహీనవర్గాలను అణిచివేస్తున్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు సమానత్వం కోరుకునే నాయకులు, మేధావులు, బడుగు, బలహీనవర్గాల నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉండటం బాధాకరం. దళిత జాతికే అవమానం. తక్షణమే స్పందించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావ్రుతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. -
ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనం: ఈటల
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియల విషయంలో దుమారం రేగిన తెలిసిందే. ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరిపించని పరిణామంపై ఆయన అనుచరులు నిన్న(సోమవారం) స్మశానంలో నిరసన వ్యక్తం చేయగా.. మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జోక్యంతో అధికారిక లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు జరిగాయి. తాజాగా ఈ పరిణామంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. సాయన్న అంత్యక్రియలు అధికారికంగా జరపకపోవడం.. కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ఈటల పేర్కొన్నారు. ఫ్యూడల్ మనస్తత్వంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్‌ను దేవుడు కూడా కాపాడలేడని, బీజేపీ గెలుపుఖాయమని ఎమ్మెల్యే ఈటల జోస్యం పలికారు. అన్ని వర్గాలను కేసీఆర్ మోసగించారు. ఏడేళ్లుగా దళితులకు ఒక్క ఎకరం భూమిని కూడ ఇవ్వకుండా దళితులను కేసీఆర్ మోసగించాడు.ధరణీ పేదల కొంపముంచింది.. పేదలను బిక్షగాళ్లుగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కార్ ది. 2018 నుంచి ఇప్పటి వరకు మహిళా సంఘాలకు రావాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వటం లేదు. రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులు బ్యాంకులకు ఎగరవేతదారులుగా మారటం కేసీఆర్ పుణ్యమే!. మద్యం విపరీత అమ్మకాలతో ఎంతో మంది మహిళల పుస్తెలతాడులు తెగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే ఈటల తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
ప్రాణమిత్రుడి పాడె మోసిన ఉస్తాద్ జకీర్ హుస్సేన్
ముంబై: భారత సంగీత విద్వాంసుడు.. సంతూర్ వాయిద్యాకారుడు పండిట్ శివకుమార్ శర్మ మరణం సంగీత ప్రపంచంలో తీరని విషాదం నింపింది. 84 ఏళ్ల సంతూర్ దిగ్గజం మే 10వ తేదీన గుండె పోటుతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఆ మరుసటి రోజే ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అయితే అంత్యక్రియల్లో ఓ ప్రముఖుడి ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయనెవరో కాదు.. తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్(71). శివకుమార్ శర్మ, జకీర్ హుస్సేన్‌లు సంయుక్తంగా ఎన్నో ప్రదర్శనలు నిర్వహించారు. వయసులో తేడాలున్నా.. ఇద్దరూ మంచి మిత్రులు కూడా. ఈ క్రమంలో తన ప్రాణ స్నేహితుడి అంత్యక్రియలు జకీర్ హుస్సేన్ హజరయ్యారు. అంతేకాదు.. శివకుమార్ పాడె మోసిన జకీర్ హుస్సేన్.. అంత్యక్రియల సమయంలోనూ ఒంటరిగా కాసేపు చితి వద్దే ఉండిపోవడం కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఈ అంత్యక్రియలు ప్రముఖులెవరూ హాజరుకాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా తమ నివాళులు అర్పించారు. చదవండి: ‘సంతూర్' శివకుమార్ శర్మ కన్నుమూత.. నేపథ్యం ఏంటంటే.. -
కరోనా కాలం: మృతదేహాల అంత్యక్రియలకు ప్యాకేజీలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విషమించడంతో పరిస్థితి తీవ్ర ఆందోళనకంగా మారుతోంది. పాజిటివ్ కేసులు, కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య నిత్యం పెరిగిపోతుంది. ఒకవైపు కరోనా భయం ప్రజల్లో హడలెత్తిస్తుంటే మరోవైపు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియల నిర్వహణ కరవవుతోంది. తమ సొంత వారైనా బంధువులైనా కరోనాతో మరణిస్తే.. కనీసం చివరి చూపుకు కూడా రావడం లేదు. ఇక కరోనా మృతుల దహన సంస్కారాలు నిర్వహించేందుకు అయితే పూర్తి వెనకడుగు వేస్తున్నారు. చనిపోయిన వారినుంచి కరోనా తమకు ఎక్కడ అంటుకుంటుందోనని భయంతో వెనకడుగు వేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ సిబ్బందే కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌తో మరణించిన వారి అంత్యక్రియలు కూడా ఓ బిజినెస్‌గా మారింది. కోవిడ్ బాధిత మృతుల దహన సంస్కారాల సమస్యను పరిష్కరించేందుకు కొన్ని కార్పొరేట్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొస్తున్నాయి. కోవిడ్ సోకి ఎవరైనా చనిపోతే వారిని వ్యాన్‌లో తీసుకురావడం, దహన సంస్కారాలు.. ఇలా అన్ని పనులు వీరే చూసుకుంటారు. వీటన్నింటికి కలిసి ఓ స్పెషల్ ప్యాకేజీని అందిస్తున్నారు. వీటికి 30 వేల రూపాయల నుంచి 35 వేల వరకు వసూలు చేయనున్నారు. భారత్‌లోని దాదాపు ఏడు ప్రధాన నగరాల్లో వీరి సేవలు అందుబాటులో ఉన్నాయి. చదవండి: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఆంథెస్టి అంత్యక్రియల సేవలు ఆంథెస్టి ఫ్యూనరల్ సర్వీసెస్ ఈ ఏజెన్సీ చెన్నై, బెంగళూరు, జైపూర్,హైదరాబాద్ వంటి నగరాల్లో బ్రాంచ్‌లున్నాయి. అదే హైదరాబాద్‌లో అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించేదుకు 32,000 వేల రూపాయలు వసూలు చేస్తుంది. వీరు సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలన్నీ పూర్తి చేస్తారు. హాస్పిటల్ నుంచి డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్లడం. దహనం చేయడం. చితాభస్మాన్ని కుటుంబీకులకు అందజేయడం ఇలాంటివన్నీ నిర్వహిస్తారు. వీరిలాగే హైదరాబాద్‌లోని ఫ్యునరల్ సేవ సర్వీసెస్ కూడా పనిచేస్తోంది. ఇది గోల్డ్, సిల్వర్ అంటు రెండు రకాల ప్యాకెజీలను అందిస్తోంది. ఇందుకు 30,000 వేల రూపాయలు తీసుకుంటున్నారు. అయితే కరోనా మరణాలు పెరిగిపోతుండటంతో స్మశానంలో స్థలం దొరకడం లేదని, తమ వ్యాపారం కష్టంగా మారుతోందని అంత్యక్రియల సేవల నిర్వహకులు చెబుతున్నారు. రోజుకి 6 నుంచి 10 కాల్స్ వస్తున్నాయని అంటున్నారు. ఏదేమైనా ఆత్మీయులు ‘దూరం’ అవుతున్న వేళ అంత్యక్రియలు నిర్వహించే ఆయా ఏజెన్సీలు అనాథ శవాల ఉదంతాలను తగ్గడానికి దోహద పడుతున్నాయనేది వాస్తవం. చదవండి: ఎట్టిపరిస్థితుల్లో వాళ్లకు రెమిడెసివిర్ వేయకూడదు! -
400 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు
నలభై మూడేళ్ల రామానంద సర్కార్‌కి అలసట తెలుస్తూనే ఉంది. అయితే ఇన్నాళ్లకు మాత్రమే అతడు ‘అలసిపోయాను’ అనే మాట అన్నాడు. ‘‘మొదట్లో రోజుకు ఒకటీ రెండు ఉండేవి. ఇప్పుడు 10–12 వరకు ఉంటున్నాయి’’ అంటున్నాడు. ఏప్రిల్ నుంచి మొన్న మంగళవారం వరకు అతడు 400 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాడు. వైరాగ్యం మనసును ఆవరించి అతడు ‘అలసిపోయాను’ అనడం కాదు. శారీరకంగానే ‘చితి’ కి పోయాడు. గౌహతి లోని ఉలుబరి దహనస్థలి అతడి కార్యక్షేత్రం. రోజూ మధ్యాహ్నం 3 గంటలకు పని మొదలవుతుంది. తెల్లవారు జామున మూడు గంటల వరకు అతడి కష్టం, కాష్టం కాలుతూనే ఉంటాయి. తనే అన్నీ చేర్చుకోవడం, పేర్చుకోవడం. ఇద్దరు సహాయకులు ఉంటారు. రెండేళ్ల క్రితం మోరిగావ్ జిల్లాలోని జాగిరోడ్ గ్రామం నుంచి పని వెతుక్కుంటూ గౌహతి వచ్చాడు రామానంద సర్కార్. భూతనాథ్ శ్మశాన వాటికలో పని దొరికింది. ఆ తర్వాత జిల్లా యంత్రాంగం అతడి కైవల్య సేవల్ని రద్దీ ఎక్కువగా ఉండే ఉలుబరి కోసం అద్దెకు తీసుకుంది. కరోనాతో ఆ రద్దీ మరింత పెరిగింది. అథ్గావ్, ఇస్లాంపుర్ లో ఉన్న ఖనన వనాలకు ఇక్కడి నుంచి ‘కొందరిని’ పంపినా ఉలుబరి ‘వేచియుండు వరుస’ తగ్గేది కాదు, తరిగేదీ కాదు. మొదటిసారి కరోనా కాయాన్ని తాకడానికి రామానంద సర్కార్ భయపడ్డాడు. ఇప్పుడు ఆ భయం లేదు. అనేకసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నా ఒక్కసారీ కరోనా అతడిని తాకలేదు! అలసట మాత్రం ఆవరించింది. కరోనాకు కాలం తీరితేనే అతడి అలసట తీరుతుంది. పని మానేసి వెళ్లిపోవాలని మాత్రం రామానంద సర్కార్ అనుకోవడం లేదు. -
‘కుళ్లిన మృతదేహాలు.. గవర్నర్ ఆగ్రహం’
కోల్కత్తా : శ్మశాన వాటిక నుంచి కరోనా బాధితుల కుళ్లిన మృతదేహాలను వ్యాన్‌లో తరలిస్తున్నట్లు వైరల్ అయిన వీడియో వాస్తవం కాదని పశ్చిమ బెంగాల్ వైద్యారోగ్య శాఖ అధికారులు కొట్టిపారేశారు. అవి కరోనాతో మరణించిన వారి మృతదేహలు కావని మోర్గ్ ఆస్పత్రిలో గుర్తు తెలియని మృతదేహాలని పేర్కొన్నారు. గత 15 రోజులుగా వారికి సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో వాటిని ఖననం చేసేందుకు వ్యాన్‌లో తీసుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనాపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోల్కత్తా పోలీసులు ట్వీట్ చేశారు. (‘వారిని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు’) కాగా పశ్చిమ బెంగాల్లో దహన సంస్కారాల కోసం మున్సిపల్ సిబ్బంది కోవిడ్-19 మృతదేహలను వ్యాన్‌లో ఎక్కిస్తున్న వీడియో బుధవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో గారియ శ్మశాన వాటిక వద్ద మున్సిపల్ సిబ్బంది తరలిస్తున్న14 మృతదేహలు కరోనా బాధితులవన్న కారణంగా గరియా ప్రాంత స్థానికులు నిరసనలు చేపట్టారు. అన్ని మృతదేహాలను ఒకేచోట దహనం చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసాంద్రత ఉన్న ప్రాంతంలోని శ్మశానవాటికలో కరోనా బాధితుల మృతదేహాలు దహనం చేయడం వల్ల స్థానికంగా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన చేపట్టారు. దీంతో ఆ మృతదేహాలను తిరిగి వ్యానులోకి చేర్చి అక్కడ నుంచి మరో శ్మశానవాటికకు తీసుకెళ్లారు. (‘లాక్డౌన్ పొడగించడం లేదు’) ఇదిలావుండగా ఈ వీడియోపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని కోరారు. ‘మృతదేహాల పట్ల మున్సిపల్ సిబ్బంది ప్రవర్తించిన తీరు వర్ణనాతీతం. మన సమాజంలో మృతదేహాలకు అత్యంత గౌరవం ఉంటుంది. అంతిమ సంస్కారాలు సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. ఈ ఘటనపై త్వరగా నివేదిక ఇవ్వండి ’.అంటూ ట్విటర్లో గవర్నర్ పేర్కొన్నారు. (కర్మ: తల్లిదండ్రులతో పోర్న్ చూసినట్లుంది!) -
మంత్రి కేటీఆర్‌కు ఓ మహిళ ట్వీట్
-
నా భర్త జాడ చెప్పండి కేటీఆర్ !
సాక్షి, హైదరాబాద్: కరోనా.. ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కుటుంబసభ్యులు కడచూపునకూ నోచుకోకుండా చేసింది. మాయదారి మహమ్మారి అయిన వాళ్లనూ దూరం పెట్టడంతో ఆ కుటుంబంలోని తండ్రీకొడుకులకు అనాథ శవాల్లా దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. మృతుల్లో ఒకరి భార్య ‘నా భర్త జాడ చెప్పండి సార్’ అంటూ మంత్రి కేటీఆర్‌కు బుధవారం ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేయడంతో.. కరోనా మనుషుల మధ్య అనుబంధాలనూ ఎలా దూరం చేస్తుందో వెలుగుచూసింది. మృతుల్లో ఒకరైన మధుసూదన్ భార్య సైతం కరోనా బారినపడి, ఆస్పత్రి నుంచి డిశ్చారై్జ్జ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే భర్త డిశ్చార్జి అయినట్టు వైద్యులు చెప్పారు. తీరా చూస్తే ఇంట్లో భర్త జాడలేదు. కుటుంబసభ్యులూ పెదవిప్పలేదు. దీంతో ఆవేదన చెందిన ఆమె కేటీఆర్‌కు ట్వీట్ చేయగా.. ఆపై విషయం తెలిసి ఆమె హతాశురాలైంది. కనీసం దహస సంస్కారాల వీడియో అయినా చూపించకపోవడం దారుణమంటూ కన్నీరుమున్నీర వుతోంది. కట్టుకున్న వాడి కడచూపునకూ నోచుకోలేకపోయానని విలపిస్తోంది. పరామర్శించేందుకు వెళ్తే అంటుకుంది నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరుకు చెందిన ఆలంపల్లి ఈశ్వరయ్య కుటుంబం నలభై ఏళ్ల క్రితమే నగరానికి వలస వచ్చింది. ఈయన పెద్దకుమారుడు ఆలంపల్లి శ్రీనివాస్ సరూర్‌నగర్ శారదా నగర్లో ఉంటూ మలక్‌పేట గంజ్‌లో పల్లీనూనె వ్యాపారం చేస్తున్నాడు. ఈశ్వరయ్య దంపతులు వనస్థలిపురం ఎ–క్వార్టర్స్‌లో రెండో కుమారుడు మధుసూదన్ వద్ద ఉంటున్నారు. ఏప్రిల్ మూడో వారంలో శ్రీనివాస్‌కు ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, అతడిని పరామర్శించేందుకు తండ్రి ఈశ్వరయ్య సహా తల్లి, సోదరుడు మధుసూదన్ వెళ్లారు. సాధారణ చికిత్సతో జ్వరం తగ్గకపోవడంతో అనుమానం వచ్చి, ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 26న ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇదే సమయంలో మధుసూదన్ తన కుమార్తె పుట్టినరోజు వేడుకలను ఇంట్లో నిర్వహించారు. హుడా సాయినగర్‌లో ఉండే ఆయన అత్త సహా ఎస్‌కేడీనగర్‌లోని సోదరి కుటుంబసభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు. మరోపక్క శ్రీనివాస్‌కు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయనకు సన్నిహితంగా మెలిగిన తల్లిదండ్రులు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, సోదరుడు మధుసూదన్, ఆయన భార్య మాధవి, ఇతర కుటుంబసభ్యులు మొత్తం 25 మందిని కింగ్‌కోఠి ఆస్పత్రి క్వారంటైన్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎర్రగడ్డలో తండ్రికి..సాహెబ్‌నగర్‌లో కొడుక్కి.. ఆరోగ్యం విషమించి ఏప్రిల్ 29న తండ్రి ఆలంపల్లి ఈశరయ్య (72) మృతిచెందారు. ఆ మర్నాడే రెండో కుమారుడు మధుసూదన్ (42) చనిపోయారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ సహా అప్పటికే ఆ కుటుంబసభ్యులంతా వైరస్ బారినపడటం, ఒక్కొక్కరు ఒక్కో వార్డులో చికిత్స పొందుతుండటం, ఒకరోజు వ్యవధిలోనే కుటుంబంలోని ఇద్దరు చనిపోవడం ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టింది. మొదట తండ్రి మరణవార్తను పెద్దకుమారుడికి చేరవేశారు. కుటుంబసభ్యులంతా ఆస్పత్రిలోనే ఉండటంతో కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించలేని దుస్థితి. దీంతో కుటుంబసభ్యుల అంగీకారంతో ఆస్పత్రి అధికారులు ఈశ్వరయ్య మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. వారు జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో కరోనా నిబంధనల మేరకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో దహనం చేశారు. మర్నాడే మధుసూదన్ కూడా చనిపోయినట్టు సోదరుడు శ్రీనివాస్‌కు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులెవరూ రాకపోవడంతో తండ్రి మృతదేహంలాగే, తన సోదరుడికీ అంత్యక్రియలు నిర్వహించాలని శ్రీనివాస్ కోరడంతో ఆస్పత్రి అధికారులు ఆయన మృతదేహాన్ని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. ఆయనకు సాహెబ్‌నగర్ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. మరోపక్క కరోనా బారినపడి చికిత్సపొందుతున్న మధుసూదన్ భార్య మాధవికి భర్త మృతి వార్తను కుటుంబసభ్యులు చెప్పలేదు. చెబితే ఆరోగ్యం మరింత దెబ్బతినడమే కాక మానసికంగా షాక్‌కు గురవుతుందని భావించారు. భర్త కోలుకున్నాడని చెప్పారు.. చికిత్స తరువాత కోలుకోవడంతో మాధవితో పాటు ఆమె అత్త, పిల్లలు, ఇతర బంధువులను ఈ నెల 17న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, డిశ్చార్జి ప్రక్రియ ఆలస్యం కావడం, రాత్రి పొద్దుపోవడంతో మర్నాడు ఉదయం మాధవి తదితరులు ఇంటికి వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్నప్పడు తన భర్త మధుసూదన్ కోలుకుని ఇంటికి వెళ్లారని వైద్యులు చెప్పడం, తీరా ఇంట్లో ఆయన కనిపించకపోవడంతో మాధవి ఆందోళన చెందారు. ఆరా తీస్తే.. ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో ఆమె మరింత కలత చెందారు. తన భర్త ఆచూకీ చెప్పాలంటూ ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్పత్రి అధికారులు, పోలీసులు ఆమె కుటుంబసభ్యులను అప్రమత్తం చేయగా వారు ఆమె వద్దకు చేరుకుని జరిగిన విషయం చెప్పారు. చివరిచూపు దక్కనివ్వకుండా, కనీసం సమాచారం లేకుండా తన భర్త మృతదేహానికి ఆంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారని ఆమె అధికారులను నిలదీశారు. అందరూ ఉన్నా అనాథ శవంలా అంత్యక్రియలు నిర్వహించారని వాపోయారు. తన బాధను చూడలేకనే పిల్లలు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పెట్టారన్నారు. @KTRTRS Missing case of my husband at Gandhi hospital.... Hello K. Taraka Rama Rao sir, Myself madhavi w/o Madhusudhan(age:42) living with two daughters in vanasthalipuram. As our family members being suffering from corona had admitted in Gandhi hospital & we all had — Alampally Madhavi (@AlampallyMadha3) May 20, 2020 బంధువులే చెప్పొద్దన్నారు.. ఈ ఉదంతంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పందించారు. మధుసూదన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులెవరూ రాకపోవడంతోనే, మృతదేహాన్ని పోలీసులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు. కరోనా నిబంధనల మేరకే ఆయన మృతదేహానికి జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు. అప్పటికే వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరిన ఆయన భార్యకు ఇది తెలిస్తే.. ఆమె మానసికంగా కుంగిపోయి షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందన్న కుటుంబసభ్యుల విజ్ఞప్తితోనే తామీ విషయాన్ని ఆమెకు చెప్పలేదని, ఆ తర్వాత బంధువులు కూడా ఆమెకు ఆయన మరణవార్త చెప్పకపోవడమే సమస్యకు కారణమని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. డాక్టర్లపై ఆరోపణలు తగవు: మంత్రి ఈటల గాంధీ వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారని, వారిపై ఆరోపణలు చేయటం సరికాదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆయ న గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల కోసమే ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. కరోనా కేసుల విషయంలో కానీ, కరోనా మరణాల విషయంలో కానీ ప్రభుత్వం ఏమీ దాయడంలేదన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన మొదట్లో ఎవరన్నా చనిపోతే వారి కుటుంబ సభ్యులు సైతం చూడడానికి భయపడేవారని.. దహన సంస్కారాలు చేయడానికి కూడా ముందుకు రాలేదని తెలిపా రు. అమెరికా, ఇటలీ వంటి దేశాలలో వందలమంది చనిపోతే.. కుటుంబ సభ్యులు లేనివారికి ప్రభుత్వాలే అంత్యక్రియలు చేశాయని వెల్లడించారు. బంధువుల సూచనల మేరకే.. గత నెల 29న వనస్థలిపురం నుండి ఈశ్వరయ్య అనే రోగి కరోనా పాజిటివ్‌తో గాంధీ ఆసుపత్రిలో చేరారని.. 30న చనిపోయారని మంత్రి ఈటల తెలిపారు. ‘‘దీంతో ఆయన కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేశాం. ఈశ్వరయ్య కొడుకు మధుసూదన్ తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందితో గాంధీకి వచ్చారు. ఆయన ఒకటో తేదీన చనిపోయారు. అప్పటికే ఆయన భార్యతో సహా కుటుంబసభ్యులంతా క్వారంటైన్లో ఉన్నారు. భర్త చనిపోయిన విషయాన్ని భార్యకి చెప్తే షాక్‌కి గురవుతారని, ఇలాంటి సమయంలో చెప్పకుండా ఉండటమే మేలని బంధువులు సూచించారు. దీంతో ఆయన మృతదేహాన్ని పోలీసులకు అప్పగించి జీహెచ్ఎంసీ సిబ్బందితో దహన సంస్కారాలు నిర్వహించాం’’అని ఆయన వివరించారు. బంధువులకు చెప్పకుండా మధుసూదన్‌కు అంత్యక్రియలు నిర్వహించారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కరోనా నుంచి కోలుకుని బయటకి వచ్చాక గాంధీ ఆస్పత్రిపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. -
ఎక్కడి కేరళ.. ఎక్కడి అస్సాం
తిరువనంతపురం: కరోనా వైరస్ మనుషుల ప్రాణాలు.. తీయడమే కాదు.. మనలో మాయమవుతున్న మానవత్వాన్ని తట్టి లేపుతుంది. ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికి.. బాధితులను ఆదుకోవడానికి ఎందరో ముందుకు వస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో మరణించిన కన్నబిడ్డను స్వదేశం తీసుకెళ్లి.. సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ లాక్డౌన్ వల్ల వారికి ఆ అవకాశం లభించలేదు. అన్ని ప్రయత్నాలు విఫలమై.. ఆశలు వదులుకున్న వేళ ఓ అపన్న హస్తం వారిని ఆదుకుంది. కనీసం ముఖ పరిచయం కూడా లేని ఓ వ్యక్తి వారికి సాయం చేసి.. ఇండియాకు వెళ్లే ఏర్పాట్లు చేశాడు. ఆ వివరాలు.. కేరళ పాలక్కడ్‌కు చెందిన కృష్ణదాస్ కుటుంబం ఏడేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జా వెళ్లారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం వారి 4 ఏళ్ల కుమారుడు వైష్ణవ్ కృష్ణదాస్‌కు ల్యూకేమియా అని.. అది కూడా ఆఖరి దశ అని తెలిసింది. వ్యాధి బయటపడిన 15 రోజుల్లోనే వైష్ణవ్ మరణించాడు. అల్లారుముద్దుగా పెంచిన కుమారుడు అర్థాంతరంగా మరణించడంతో ఆ తల్లిదండ్రులు కృంగి పోయారు. చనిపోయిన కొడుకును బతికించుకోలేము.. కనీసం అంత్యక్రియలైన స్వదేశంలో.. మతాచారం ప్రకారం నిర్వహించాలనుకున్నారు కృష్ణదాస్ దంపతులు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాచడంతో దేశాలన్ని లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. దాంతో ఏం చేయాలో పాలు పోలేదు. తమ సమస్య గురించి కాన్సులేట్ అధికారులతో చెప్పుకున్నారు. కానీ వారు కూడా ఏం చేయలేకపోయారు.(111 మందిని కలిసిన కరోనా పేషెంట్) అయితే ఇదే సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్’ విమానాలను నడుపుతుంది. దాంతో వాటిల్లో ప్రయాణించేందుకు ప్రయత్నించాడు కృష్ణదాస్ దంపతులు. కానీ అవి చాలా పరిమిత సంఖ్యలో ఉండటం.. జనాలు ఎక్కువ ఉంటడంతో కృష్ణదాస్ కుటుంబానికి అవకాశం లభించలేదు. దాంతో చేసేదేం లేక దేవుడి మీదే భారం వేసి కుమారుడు మృతదేహాన్ని అల్ ఐన్ లోని అల్ తవాం హాస్పిటల్ మార్చురీలో భద్రపర్చారు. అయితే దేవుడు వారి మొర ఆలకించాడో ఏమో.. సాయం లభించింది. అది కూడా తమకు ఏ మాత్రం పరిచయం లేని ఓ వ్యక్తి నుంచి. అవును కేరళకు చెందిన కృష్ణదాస్‌కు సాయం చేసింది అస్సాం దిబ్రుగఢ్ ప్రాంతానికి చెందిన భాస్కర్ పపుకోన్ గోగోయ్ అనే వైద్యుడు.(సాంత్వననిచ్చే కోవిడ్ సాథీ) (వైద్యుడు, సామాజిక కార్యకర్త భాస్కర్ పపుకోన్ గోగోయ్) వైద్యుడు, సామాజిక కార్యకర్త అయిన గోగోయ్ సోషల్ మీడియా ద్వారా కృష్ణదాస్ సమస్య గురించి తెలుసుకున్నాడు. వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా గోగోయ్ మాట్లాడుతూ.. ‘కృష్ణదాస్ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టం నన్ను కలచివేసింది. వారికి నా వంతు సాయం చేయాలనుకున్నాను. కృష్ణదాస్ సమస్య గురించి యూఏఈలోని ఒక ముఖ్యమైన వార్త పత్రికలో కూడా వచ్చింది. యూఏఈలోని మిత్రుల ద్వారా ఆ కథనం రాసిన రిపోర్టరును సంప్రదించి.. కృష్ణదాస్ కుటుంబ పూర్తి వివరాలు తెలుసుకోగలిగాను. ఆ తర్వాత మే 13న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌ను కలిసి, సమస్యను వివరించాను. ఆయన వెంటనే స్పందించారు. మరుసటి రోజే కృష్ణదాస్ కుటుంబాన్ని ఇండియా రప్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు’ అని తెలిపాడు గోగోయ్.(ప్రైవేట్‌లోనూ కరోనా) ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ.. ‘గోగోయ్ స్పందిచకపోయి ఉంటే.. మేము ఇండియాకు తిరిగి వచ్చే వారం కాదు. ఆయన రుణం ఎప్పటికి తీర్చుకోలేము’ అన్నారు. ఎక్కడి కేరళ... ఎక్కడి యూఏఈ.. ఎక్కడి అస్సాం. వీరిని కలిపింది మాత్రం మానవత్వం అంటున్నారు ఇది విన్నవారు. -
పూడ్చేందుకు స్థలం లేక రోజంతా అవస్థలు
వనపర్తి, అమరచింత(కొత్తకోట): గ్రామానికో శ్మశానవాటిక ఉండడం ప్రతి ఒక్కరం చూశాం. కానీ మండలంలోని ఈర్లదిన్నెకి ప్రత్యేకంగా శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామంలో ఏ ఒక్కరు చనిపోయిన అంతిమయాత్రతో పాటు దహన సంస్కారాలు చేయడానికి స్థలం కరువైంది. దీంతో చనిపోయిన వారికి అంతిమయాత్ర నిర్వహిద్దామనుకున్న వారికి అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. గ్రామానికి సమీపంలో జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో నీరు నిల్వ ఉండడంతో నది నీటిని దాటుకుంటూ ఒడ్డు కనిపించే స్థలంలో దహన సంస్కారాలు చేస్తున్నారు. ఆదివారం గ్రామానికి చెందిన బౌరిశెట్టి కుమారస్వామి మృతిచెందడంతో కుటుంబసభ్యులు నీటిలో నడుచుకుంటూ వెళ్లి దహన సంస్కారాలు చేసిన దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈర్లదిన్నె జూరాల ప్రాజెక్టు ముంపునకు గురవడంతో 25 సంవత్సరాల క్రితం గ్రామస్తులకు పునరావాసం కల్పించారు. కానీ శ్మశాన వాటికకోసం స్థలాన్ని కేటాయించకపోవడంతో ఏటిగడ్డ మీదనే దహన సంస్కారాలను చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యేకంగా శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆఖరి మజిలికీ కష్టాలే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జీవితాంతం ఎంత దర్జాగా బతికినా.. చనిపోతే ఖననానికి ఆరు గజాల స్థలం కరువవుతోంది. కనీసం దహన సంస్కారం చేయాలన్నా అందుబాటులో లేని వైకుంఠధామాలతో మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి నెలకొంది. నాడు ఒకప్పుడు భుజాల మీద నిర్వహించే శవయాత్రలు.. నేడు వాహనాల్లో దర్శనమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజల చావు కష్టాలు వర్ణాతీతం. ఎవరైనా చనిపోతే ఖననానికీ.. దహన సంస్కారానికీ మృతుల కుటుంబీకులు, బంధుమిత్రులు నానాయాతన పడుతున్నారు. మనిషి జీవితానికి సంబంధించి ఆఖరి మజిలీ అయిన దహస సంస్కారాలకూ అనువైన స్థలం అందుబాటులో లేకుండాపోయింది. శాస్త్రాలు.. సంప్రదాయాలకనుగుణంగా దహన సంస్కారాలు చేసుకునే వీలుగా ఉండాల్సిన వైకుంఠధామాలు ఉమ్మడి జిల్లాలో పావువంతు గ్రామాల్లోనూ నిర్మాణాలకు నోచుకోలేదు. ఎవరు చనిపోయినా.. మైళ్ల దూరం శవయాత్రలు నిర్వహించాల్సిన దుస్థితి వందలాది గ్రామాల్లో నెలకొంది. వైకుంఠధామాలు లేకపోవడంతో చాలా మంది కుటుంబీకులు తమ పొలాల్లోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇంకొందరు గ్రామ శివార్లలో ఉన్న చెరువులు.. కుంటల వద్ద దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. వైకుంఠధామం నిర్మాణాల కోసం స్థలం అందుబాటులో లేకపోవడం.. మంజూరైన చోట్ల నిధుల కొరత.. స్థలం, నిధులు రెండూ ఉన్నా నిర్మాణ పనులపై సరైన పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో ఉమ్మడి జిల్లాలో శ్మశాన వాటికల నిర్మాణాలు అటకెక్కాయని చెప్పవచ్చు. •మహబూబ్‌నగర్ జిల్లాలో 442 గ్రామ పంచాయతీలు ఉంటే 61 గ్రామాల్లోనే వైకుంఠధామాలున్నాయి. 329 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించారు. పనులు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. 52 గ్రామాల్లో స్థల సేకరణ చేయాల్సి ఉంది. •వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలుండగా.. ప్రస్తుతం 78 వైకుంఠధామాలు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో 178 నిర్మాణా లకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇందులో 25 నిర్మాణాల పనులు ప్రారంభించగా.. ఒక్కటి పూర్తి చేశారు. 24 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన నిర్మాణాలకు సంబంధించి స్థల సేకరణ చేయాల్సి ఉంది. •నారాయణపేట జిల్లాలో 280 గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు రెండు గ్రామాల్లోనే వైకుంఠధామాలున్నాయి. పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా 256 గ్రామాల్లో నిర్మాణాలకు పరిపాలనా ఆమోదం లభించింది. 232 చోట్ల స్థల సేకరణ చేశారు. 24 గ్రామాల్లో స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 80 చోట్ల నిర్మాణ పనులు వివిధ దశలో ఉన్నాయి. •జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకు 160 గ్రామాల్లో వైకుంఠధామాలున్నాయి. 30రోజులప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు 66 చోట్ల స్థలాన్ని గుర్తించారు. వీటి నిర్మాణాలకు సంబంధించి భూమి పూజ చేశారు. పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. మరో 29 చోట్ల స్థలాలను సేకరించాల్సి ఉంది. •నాగర్‌కర్నూల్ జిల్లాలో 453 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం ఐదింటిలోనే వైకుంఠధామాలున్నాయి. వీటి నిర్మాణం కోసం 407 గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. 64 చోట్ల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం ఐదు పంచాయతీల్లోనే పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో 46 గ్రామాల్లో స్థలాలను గుర్తించలేకపోయారు. అటకెక్కిన ‘ఉపాధి’ నిర్మాణాలు ఏళ్ల నుండి వేధిస్తోన్న వైకుంఠధామాల లేమీ సమస్య పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఈ క్రమంలో గతంలోనే వైకుంఠధామాలు లేని గ్రామాలను గుర్తించి వాటిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించాయి. రెండేళ్ల క్రితమే సంబంధిత అధికారుల నుంచి ప్రభుత్వం తీర్మానాలు తెప్పించుకుంది. ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి రూ.10 లక్షల నుంచి రూ.10.40 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని ప్రభుత్వ ఉపాధి హామి అధికారులకు సూచించింది. ఈ నిధులతో శ్మశాన వాటిక, ప్రహరీ , స్నానపు గదులు, దహనపు గద్దె, వేచి ఉండే గడి, కార్యాలయం నిర్మాణాలు చేపట్టాలని పేర్కొంది. అయితే వైకుంఠధామాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములు గుర్తించాల్సిన బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించింది. గుర్తించిన భూములను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని సూచించింది. అయితే చాలా చోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో స్థలాలు గుర్తించడంలో జాప్యం జరుగుతుంది. దీంతో ఎవరైనా చనిపోతే వారి సొంత పొలాల్లో, అడవుల్లో చెరువులు, వాగులు, కుంటలు, రహదారుల సమీపంలో దహన సంస్కారాలు జరుపుతున్నారు. తర్వాత స్నానాలు చేసేందుకు మహిళలు పడుతున్న ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెట్ల పొదల చాటుకు వెళ్లి స్నానాలు చేసి బట్టులు మార్చునే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో వందలాది గ్రామాల్లో ఉంది. ఇదీలావుంటే.. తమ తమ గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలంటూ అనేక మంది ప్రజలు ప్రజాప్రతినిదులు, అధికారులను ఎన్నోసార్లు వేడుకున్నారు. శవాలు ఏటి పాలు..! వనపర్తి జిల్లా అమరచింత మండలం జూరాల ముంపు గ్రామాలకు పునరావాసాన్ని కల్పించిన అధికారులు శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించలేదు. దీంతో ఈర్లదిన్నె గ్రామస్తులు శ్మశాన వాటిక స్థలం కోసం ఏళ్లతరబడి అధికారులు, ప్రజాప్రతినిధులకు తమ గోడును విన్నవిస్తూనే ఉన్నారు. శ్మశాన వాటిక కోసం ప్రత్యేకమైన స్థలం లేకపోవడంతో సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణానది ఒడ్డున మృతదేహాలను ఖననం చేస్తున్నారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా పూడ్చిన శవాల సమాధుల ఆనవాలు కూడా నీటిలోనే కొట్టుకుపోతున్నాయి. దీంతో తమ తాత, ముత్తాతల సమాధులను కూడా గుర్తించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఈర్లదిన్నె, కిష్ణంపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలాలను సేకరిస్తున్నాం.. గ్రామ ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో వైకుంఠధామాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో వందలాది గ్రామాల్లో వైకుంఠధామాలు లేవు. అన్నిట్లో ఏర్పాటు చేసేలా స్థలాలను గుర్తిస్తున్నాం. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు అదే పనిలో ఉన్నారు. అయితే స్థ్థలాల సేకరణ కొంత ఇబ్బందిగా ఉంది. త్వరలోనే ప్రక్రియను పూర్తి చేస్తాం. – డీపీఓ వెంకటేశ్వర్లు స్థల సమస్య తీవ్రంగా ఉంది మా ఊర్లో శ్మశాన వాటికకు స్థల సమస్య తీవ్రంగా ఉంది. భూములు ఉన్న వారు తమ సొంత పొలాల్లో పూడ్చి పెడుతున్నారు. సొంత స్థలాలు లేని వారు కాల్వ వద్ద పూడ్చాల్సి వస్తోంది. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఊరికి సమీపంలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేక సమస్య వచ్చి పడింది. ఇప్పుడు కాల్వ వద్ద పూడ్చే పరిస్థితి లేక గుట్ట వద్దకు వెళ్తున్నారు. – డి.బాలరాజు, సంకలమద్ది, మూసాపేట లెక్కలేనన్ని సార్లు కలిశా.. మా ఊర్లో శ్మశానవాటిక లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఇందుకోసం లెక్కలేనన్ని సార్లు అధికారులను కలిశా. ఇప్పటికి సమస్య తీరలేదు. నాలుగేళ్ల నుంచి శ్మశానవాటిక కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నా.. అయినా స్పందించడం లేదు. ప్రభుత్వ స్థలంలో శ్మశానవాటిక లేనందున ప్రైవేట్ స్థలాల్లో ఎక్కడా పెట్టనివ్వడం లేదు. తక్షణం అధికారులు స్పందించి సమస్యను తీర్చాలి. – మంగలి వెంకటస్వామి, కందూర్, అడ్డాకుల -
కరుణానిధి అంత్యక్రియలు.. ప్రోటోకాల్ కిరికిరి
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే డీఎంకే పిటిషన్ దాఖలు చేసిందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా.. బీచ్‌లోనే అంత్యక్రియలకు అనుమతించాలని డీఎంకే తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఒకానోక తరుణంలో కోర్టు హాల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ న్యాయవాది.. ‘గతంలో జానకీ రామచంద్రన్(ఎంజీఆర్ భార్య, మాజీ సీఎం కూడా) అంత్యక్రియలకు సీఎం కరుణానిధి మెరీనా బీచ్‌లో అనుమతించలేదు. ప్రోట్‌కాల్(సీఎం పదవిలో ఉండి చనిపోయిన వాళ్లకు మాత్రమే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించటం)ను చూపించి అప్పుడు ఆయన అడ్డుకున్నారు. మాజీ సీఎంలకు గాంధీ మండపంలోనే స్మారకాలకు అనుమతి ఉంది. కామరాజ్, భక్తవత్సలం, రాజాజీల అంత్యక్రియలకు గాంధీ మండపంలోనే స్థలం కేటాయించారు. ఇదంతా ప్రోటోకాల్ ప్రకారమే జరిగింది. ఇప్పుడు పొలిటికల్ ఎజెండా తోనే డీఎంకే కేసు వేసింది. ద్రవిడ ఉద్యమనేత పెరియార్ లాంటి వాళ్లకే మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు గౌరవం దక్కలేదన్న విషయం వారు గుర్తించాలి. రాత్రికి రాత్రే మేనేజ్ చేయించి డీఎంకే వాళ్లు ఐదు పిటిషన్లను ఉపసంహరించుకునేలా చేశారు’ అని వాదనలు వినిపించారు. డీఎంకే న్యాయవాది.. ‘ప్రభుత్వ వాదనలు అసంబద్ధంగా ఉన్నాయి. సిట్టింగ్ సీఎంల అంత్యక్రియలకు మాత్రమే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించాలన్న నిబంధన ఎక్కడా లేదు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. లేకుంటే వారి మనోభావాలు దెబ్బతింటాయి. అన్నాదురైని తన ఆత్మ, జీవితంగా కరుణానిధి గతంలో పేర్కొనేవారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా?.. అటువంటి నేతకు గాంధీ మండపంలో అంత్యక్రియలు నిర్వహించటం సముచితం కాదు. పైగా మేనేజ్ చేశారంటూ వాదిస్తారా? అంటూ ప్రభుత్వ న్యాయవాదిపై డీఎంకే న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో కోర్టు హాల్లో గందరగోళం చెలరేగగా.. సైలెంట్‌గా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి అందరికీ సూచించారు. సంతాప దినాలు కావటంతో కోర్టుకు సెలవు అయినప్పటికీ.. ఈ పిటిషన్ కోసమే బెంచ్ ప్రత్యేకంగా విచారణ చేపట్టడం గమనార్హం. -
లైన్ క్లియర్!.. తీర్పు ఆలస్యం?
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, కలైంగర్ కరుణానిధి అంత్యక్రియలపై నెలకొన్న ప్రతిష్టంభన దాదాపు వీడింది. ఈ వ్యవహారంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి(84) ప్రకటించారు. దీంతో రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు గతంలో దాఖలైన అభ్యంతరాల పిటిషన్లను(ఐదింటిని) మద్రాస్ హైకోర్టు బెంచ్ డిస్మిస్ చేసింది. అయితే కరుణానిధి అంత్యక్రియలపై దాఖలైన పిటీషన్‌పై మాత్రం వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై అత్యవసర తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడటంతో.. తీర్పును కాస్త ఆలస్యంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. (కరుణానిధి అరుదైన ఫోటోలు.. క్లిక్ చేయండి) గతంలో మెరీనా బీచ్‌లో పలువురి స్మారకాలపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణ అంత్యక్రియలకు ఆ పిటిషన్ ఆటంకంగా మారింది. కోర్టు కేసుల నేపథ్యంలో అంత్యక్రియలకు స్థలం కేటాయించలేమని పళని ప్రభుత్వం పేర్కొంది. దీంతో డీఎంకే హైకోర్టును ఆశ్రయించగా.. గత రాత్రి నుంచి ఈ వ్యవహారంపై వాదనలు జరిగాయి. చివరకు తదుపరి వాదనలు ఈ ఉదయానికి వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో ఉత్కంఠ నెలకోగా, రామస్వామితో చీఫ్ జస్టిస్ వ్యక్తిగతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతనే మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు జరిపితే ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూ రాతపూర్వకంగా ఆయన బెంచ్‌కు ఓ మెమొరాండం సమర్పించారు. అంతేకాదు పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కోర్టులో ప్రభుత్వం, డీఎంకే తరపు న్యాయవాదుల మధ్య వాడివేడి వాదనలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు అత్యవసరంగా తీర్పు ప్రకటించాల్సిన అవసరం లేదన్న చీఫ్ జస్టిస్.. ఈ రోజే తీర్పు ప్రకటిస్తామని చెప్పారు. (నిండు సభలో దుశ్శాసన పర్వం) ‘తాము వేసి ఉన్న కేసుల్ని సాకుగా చూపించి, స్థలం కేటాయించకుండా ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని’ జయ స్మారకం నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు పేర్కొన్నారు. తాము వేసిన పిటిషన్ల ఆధారంగానే న్యాయపరమైన చిక్కులున్నట్లుగా భావిస్తే.. ఆ కేసులన్నీ వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు కూడా. కానీ, రామస్వామి పిటిషన్ మూలంగానే న్యాయపరమైన చిక్కుల నెలకొన్నాయన్న విషయం తర్వాతే తేలింది. (అమ్మకు ఘన నివాళి) (కరుణ వల్లే ఇదంతా...) -
శ్రీదేవి అంత్యక్రియలపై...
సాక్షి, ముంబై : లెజెండరీ నటి శ్రీదేవి అంత్యక్రియల విషయంలో నెలకొన్న వివాదంపై ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని తెలిపారు. అనిల్ గల్గాలి అనే ఉద్యమవేత్త రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగానికి(సీఏడీ) ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. ఏ ప్రతిపాదికన ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారని అందులో ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ‘శ్రీదేవి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలంటూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి 25న అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అందులో ఉంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ముంబై సబ్ అర్బన్ కలెక్టర్, పోలీసు కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. పైగా పద్మ అవార్డు గ్రహీతలకు(శ్రీదేవికి పద్మశ్రీ దక్కింది) గౌరవ లాంఛనాలతో నిర్వహించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి’ అని లేఖలో ప్రస్తావించింది. ఇక గత ఆరేళ్లలో మొత్తం 41 మందికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొంది. అందులో మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్‌ముఖ్, ఏ ఆర్ అంతులే, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే తదితరుల పేర్లు ఉన్నట్లు తెలిపింది. కాగా, ఆమె గొప్ప నటే కావొచ్చు. అయినా జాతీయ పతాకాన్ని కప్పేంతగా ఆమె దేశానికి ఏం చేశారు? అని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థ్రాకే అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ఒకే గుంతలో 17 మృతదేహాలు ఖననం
యర్రగొండపాలెం:జిల్లాలో 1028 పంచాయతీలను కలుపుకొని మొత్తం 4,686 గ్రామాలున్నాయి. వీటిలో పంచాయతీకి ఒకటి ప్రకారం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో శ్మశానాలు అభివృద్ధి పరిచే చర్యలు చేపట్టారు. అందుకుగాను రూ. 67.84 కోట్లు కేటాయి ంచారు. ఒక్కొక్క శ్మశానం అభివృద్ధికి రూ. 6.60 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుం ది. ఈ నిధులు ముఖద్వారం, స్నానా లగది, దహనం చేయటానికి ఒక ప్లాట్‌ఫాం నిర్మాణాలకే సరిపోతుండటంతో వాటిని చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దాతలు (ఎన్ఆర్ఐలు) ముందుకొచ్చి రూ. 3 లక్షల విరాళం ఇచ్చినట్లయితే కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని చేపడతారు. కారణాలు ఏమైనా శ్మశానాల అభివృద్ధి పనులు మండలానికి ఒకటి రెండు మాత్రమే పూర్తి చేయగలిగారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో శ్మశానాలు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. కబ్జాదారులు శ్మశానాలను సైతం వదలడం లేదు. ఇందుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. పాఠశాల ఆవరణలో దహన సంస్కారాలు:పెద్దారవీడు మండలంలోని మద్దెలకట్టలో శ్మశానం లేకపోవడంతో పాఠశాల ఆవరణలోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. గ్రామానికి ఒక పక్కన ఉన్న పాఠశాలకు కాంపౌండ్‌వాల్ లేదు. అక్కడ చెట్లు నీడ ఉంటుంది. ఈ నీడను ఆసరాగా తీసుకొని మృతదేహాలను దహనం చేయడం, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించడంలాంటివి చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే పిల్లలు ఆ రోజు పాఠశాలకు వెళ్లరు. దహన కార్యక్రమాలు జరిగేవి చూసి అనేకమంది పిల్లలు భయపడిన సంఘటనలు ఉన్నాయని ఆ గ్రామస్తులు తెలిపారు. ఒకే గుంతలో 17 మృతదేహాలు ఖననం:2010లో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు వరికోతల కోసం గుంటూరు జిల్లా మాచర్లకు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి చేరటానికి సిమెంటు లోడు లారీ ఎక్కారు. మార్గమధ్యంలో లారీ బోల్తాపడటంతో ఆ గ్రామానికి చెందిన 17 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు శవాలను గ్రామంలోనే ఉంచి ఆందోళన చేపట్టారు. మూడు రోజులపాటు శవాలు ఖననం చేయకుండా ఉంచడంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వచ్చాయి. సమస్య పరిష్కారం అయిన తరువాత ఆ మృతదేహాలను ఖననం చేయటానికి శ్మశానవాటిక లేకుండా పోయింది. ఈ కారణంగా ఒకే చోట జేసీబీతో పెద్దగుంత తీయించి 17 శవాలను ఆ గుంతలో ఖననం చేశారు. వెంటనే శ్మశాన వాటిక కోసం ఎకర స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయినా ఆ స్థలానికి రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ నాయకులు సిఫార్సు చేస్తేనే పనులు.. అధికార పార్టీకి చెందిన నాయకులు శ్మశానాలు సైతం వదలడం లేదు. వారు సిఫార్సు చేస్తేనే శ్మశాన వాటికల అభివృద్ధి పనులు అప్పచెప్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఈ పనులను అప్పచెప్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకుడు సిఫార్సు చేయాల్సి ఉంది. జన్మభూమి కమిటీలు ఈ శ్మశాన రాజకీయాల్లో ముఖ్యపాత్ర వహిస్తున్నట్లు తెలుస్తుంది. పలు గ్రామాల్లో నేటికీ కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబ సభ్యుల చావుకొస్తుంది. ఆ మృతదేహాన్ని ఎక్కడ ఖననం లేక దహనం చేయాలన్నదే పెద్ద సమస్య. అప్పటికప్పుడు శ్మశాన వాటికలను వెతుక్కోవాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. పట్టణాల్లో అరకొరగా శ్మశాన వాటికలు ఉన్నాయి. అధిక భాగం గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక మృతదేహాలను రోడ్లపక్కన, పాఠశాల స్థలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్న దుస్థితి నేడు ఉంది. శ్మశానాల కోసం నిధులు మంజూరైనా రాజకీయ జోక్యంతో పలు చోట్లు అభివృద్ధి కుంటుపడుతోంది. -
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
తొగుట(దుబ్బాక): అనారోగ్యంతో తండ్రి మరణించగా కూతురు అంత్యక్రియలు నిర్వహించిన విషాద సంఘటన మండలంలోని వేములఘాట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మాపురం కిష్టయ్య(35) భార్య గొడవల కారణంగా కూతురిని విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కిష్టయ్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. పెద్దాస్పత్రుల్లో చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో మెరుగైన వైద్యం లేకుండాపోయింది. దీంతో వ్యాధి ముదిరి సోమవారం రాత్రి మృతిచెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకుండాపోవడంతో కూతురు మమత (8)తో తలకొరివి పెట్టించారు. తల్లి విడిచిపెట్టి వెళ్లడం, తండ్రి చనిపోవడంతో ఒంటరిగా మిగిలిన చిన్నారిని చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. నాన్న చనిపోగా కన్నతల్లి వదిలి వెళ్లిపోవడంతో మమత అనాథగా మారింది. -
జేవీ రమణమూర్తి అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు జేవీ రమణమూర్తి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య శుక్రవారం హైదరాబాద్ పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో జరిగాయి. ఉదయం అమీర్‌పేట్ నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర జరిగింది. ఆయన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జేవీ రమణమూర్తికి అంతిమ వీడ్కోలు పలికారు. శ్మశానవాటికలో ఆయన తనయుడు చితికి నిప్పంటించారు. -
పెద్దతండాకు ఎస్సై రమేష్ మృతదేహం తరలింపు
నల్లగొండ : అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ మృతదేహాన్ని నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెద్దతండాకు తరలించారు. రేపు ఉదయం రమేష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలాఉండగా, ఎస్సై రమేష్ మృతిపై విచారణ జరిపాలంటూ దేవరకొండ బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. గతంలో పొద్దేముల్ ఎస్సైగా విధులు నిర్వహించిన రమేష్ ఇటీవలే యాలాలకు బదిలీ అయ్యారన్న విషయం విదితమే.