![father funerals by daughter in dubbak - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/21/SAD.jpg.webp?itok=O0Ajw7Ne)
తండ్రి అంతిమయాత్రలో చిన్నారి మమత
తొగుట(దుబ్బాక): అనారోగ్యంతో తండ్రి మరణించగా కూతురు అంత్యక్రియలు నిర్వహించిన విషాద సంఘటన మండలంలోని వేములఘాట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మాపురం కిష్టయ్య(35) భార్య గొడవల కారణంగా కూతురిని విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కిష్టయ్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు.
పెద్దాస్పత్రుల్లో చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో మెరుగైన వైద్యం లేకుండాపోయింది. దీంతో వ్యాధి ముదిరి సోమవారం రాత్రి మృతిచెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకుండాపోవడంతో కూతురు మమత (8)తో తలకొరివి పెట్టించారు. తల్లి విడిచిపెట్టి వెళ్లడం, తండ్రి చనిపోవడంతో ఒంటరిగా మిగిలిన చిన్నారిని చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. నాన్న చనిపోగా కన్నతల్లి వదిలి వెళ్లిపోవడంతో మమత అనాథగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment