
తల్లి అంతిమయాత్రలో కూతురు..
దుబ్బాక : తల్లికి కూతురు తలకొరివి పెట్టిన సంఘటన దుబ్బాక మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ కేంద్రానికి చెందిన తాటిపల్లి శకుంతల(62) గుండెపోటుతో గురువారం సాయంత్రం మరణించింది. నిరుపేద కుటుంబానికి చెందిన శకుంతలకు కుమారులు లేకపోవడంతో ముగ్గురు కూతుళ్లలో చిన్న కూతురైన ఉమామహేశ్వరి అన్నీ తానై తలకొరివి పెట్టింది. శకుంతల భర్త బాల్ నర్సయ్య అంధుడు. దీంతో కూతురితో తలకొరివి పెట్టించారు. గ్రామస్తులు చందాలు వేసుకుని దహన సంస్కారాలు నిర్వహించారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment